Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አን-ኒሳዕ   አንቀጽ:
وَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ سَنُدْخِلُهُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ؕ— وَعْدَ اللّٰهِ حَقًّا ؕ— وَمَنْ اَصْدَقُ مِنَ اللّٰهِ قِیْلًا ۟
మరియు ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి ఆయన వైపుకు దగ్గర చేసే సత్కర్మలు చేస్తారో మేము వారిని తొందరలోనే స్వర్గవనాల్లో ప్రవేశింపజేస్తాము వాటి భవనముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. ఇది అల్లాహ్ వాగ్దానము. మహోన్నతుడైన ఆయన వాగ్దానము సత్యము. ఆయన వాగ్దానమును నెరవేర్చకుండా ఉండడు. మరియు ఎవరూ మాటపరంగా అల్లాహ్ కన్న సత్యవంతుడు ఉండడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَیْسَ بِاَمَانِیِّكُمْ وَلَاۤ اَمَانِیِّ اَهْلِ الْكِتٰبِ ؕ— مَنْ یَّعْمَلْ سُوْٓءًا یُّجْزَ بِهٖ ۙ— وَلَا یَجِدْ لَهٗ مِنْ دُوْنِ اللّٰهِ وَلِیًّا وَّلَا نَصِیْرًا ۟
ఓ ముస్లిములారా ముక్తి మరియు సాఫల్య విషయం మీ ఆశలను మరియు గ్రంథవహుల ఆశలను అనుసరించదు. కాని విషయం కర్మను అనుసరిస్తుంది. అయితే ఎవరైతే మీలో నుండి దుష్కర్మకు పాల్పడుతాడో ప్రళయదినమున అతడికి దాని పరంగా ప్రతిఫలం ఇవ్వబడుతుంది. మరియు అతడు తనకు లాభం కలిగించే వాడిగా అల్లాహ్ ను తప్ప ఎవరిని కార్యసాధకుడిగా పొందడు. మరియు తన నుండి కీడుని తొలగించే సహాయకుడిగా పొందడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَمَنْ یَّعْمَلْ مِنَ الصّٰلِحٰتِ مِنْ ذَكَرٍ اَوْ اُ وَهُوَ مُؤْمِنٌ فَاُولٰٓىِٕكَ یَدْخُلُوْنَ الْجَنَّةَ وَلَا یُظْلَمُوْنَ نَقِیْرًا ۟
మరియు సత్కార్యాలు చేసేవాడు పురుషుడైన లేదా స్త్రీ అయిన మరియు అతడు మహోన్నతుడైన అల్లాహ్ పై సత్య విశ్వాసవంతుడైతే వారందరు విశ్వాసము మరియు ఆచరణను సమీకరించి స్వర్గములో ప్రవేశిస్తారు. వారి ఆచరణల పుణ్యములోంచి ఏమీ తగ్గించుకోరు. ఒక వేళ ఖర్జూరపు టెంకపై ఉన్న చీలిక పరిమాణమంత కొద్దిగా ఉన్నా కూడా.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَمَنْ اَحْسَنُ دِیْنًا مِّمَّنْ اَسْلَمَ وَجْهَهٗ لِلّٰهِ وَهُوَ مُحْسِنٌ وَّاتَّبَعَ مِلَّةَ اِبْرٰهِیْمَ حَنِیْفًا ؕ— وَاتَّخَذَ اللّٰهُ اِبْرٰهِیْمَ خَلِیْلًا ۟
బాహ్యపరంగా,అంతః పరంగా అల్లాహ్ కొరకు సమర్పించుకుని తన ఉద్దేశమును ఆయన కొరకు శుద్ధపరచుకున్న వాడి కంటే ధర్మ పరంగా మంచి వాడు ఎవడూ ఉండడు. మరియు ఆయన ధర్మనిర్దేశం చేసిన దాన్ని అనుసరించి తన ఆచరణను మెరుగుపరచుకున్నాడు. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మం యొక్క మూలమైన ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ధర్మమును షిర్కు,అవిశ్వాసం నుండి తౌహీదు,విశ్వాసం వైపునకు మరలుతూ అనుసరించాడు. మరియు అల్లాహ్ తన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంను తన సృష్టిరాసులందరి మధ్యలో నుంచి పరిపూర్ణ ప్రేమతో ఎన్నుకున్నాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَكَانَ اللّٰهُ بِكُلِّ شَیْءٍ مُّحِیْطًا ۟۠
మరియు ఆకాశముల్లో ఉన్న వాటి,భూమిలో ఉన్న వాటి రాజ్యాధికారము అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది. మరియు అల్లాహ్ తన సృష్టిలోంచి ప్రతీ దాన్ని జ్ఞాన పరంగా,సామర్ధ్యం పరంగా,కార్యనిర్వహణ పరంగా చుట్టుముట్టి ఉన్నాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَیَسْتَفْتُوْنَكَ فِی النِّسَآءِ ؕ— قُلِ اللّٰهُ یُفْتِیْكُمْ فِیْهِنَّ ۙ— وَمَا یُتْلٰی عَلَیْكُمْ فِی الْكِتٰبِ فِیْ یَتٰمَی النِّسَآءِ الّٰتِیْ لَا تُؤْتُوْنَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرْغَبُوْنَ اَنْ تَنْكِحُوْهُنَّ وَالْمُسْتَضْعَفِیْنَ مِنَ الْوِلْدَانِ ۙ— وَاَنْ تَقُوْمُوْا لِلْیَتٰمٰی بِالْقِسْطِ ؕ— وَمَا تَفْعَلُوْا مِنْ خَیْرٍ فَاِنَّ اللّٰهَ كَانَ بِهٖ عَلِیْمًا ۟
మరియు ఓ ప్రవక్తా స్త్రీల విషయంలో వారి కొరకు,వారి పై విధి అయిన వాటి గురించి వారు మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు ఇలా తెలపండి : అల్లాహ్ మీరు అడిగిన దాని గురించి మీకు స్పష్టపరుస్తున్నాడు. మరియు మీ పరిరక్షణలో ఉన్న అనాధ స్త్రీల విషయంలో మీపై చదవబడుతున్న ఖుర్ఆన్ లో మీ కొరకు స్పష్టపరుస్తున్నాడు. మరియు మీరు వారి కొరకు అల్లాహ్ విధి చేసిన మహర్ ను,వారసత్వ సొమ్మును వారికి ఇవ్వటం లేదు. మరియు వారి వివాహమును ఆశించటం లేదు. మరియు వారి సంపదను ఆశిస్తూ వారిని వివాహం నుండి ఆపుతున్నారు. మరియు బలహీనులైన చిన్న పిల్లలపై విధిగావించబడిన విషయంలో వారసత్వపు సొమ్ము అయిన వారి హక్కు వారికి ఇచ్చే విషయంలో మీకు స్పష్టపరుస్తున్నాడు. మరియు మీరు వారి సంపదలపై ఆధిక్యతను చూపి వారిపై దుర్మార్గమునకు పాల్పడకండి. మరియు వారి (అనాధల) విషయంలో ఇహపరాల్లో ప్రయోజనకరమైన వాటి ద్వారా వారి పరిరక్షణ న్యాయంతో చేయటం విధి అవటం గురించి మరియు అనాధలకు,ఇతరులకు మీరు మేలు చేయటం గురించి మీకు స్పష్టపరుస్తున్నాడు. ఎందుకంటే దాని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు తొందరలోనే ఆయన దాని పరంగా మీకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• ما عند الله من الثواب لا يُنال بمجرد الأماني والدعاوى، بل لا بد من الإيمان والعمل الصالح.
అల్లాహ్ వద్ద ఉన్న పుణ్యము కేవలం ఆశలతో,దుఆలతో లభించదు. కాని విశ్వాసము మరియు సత్కార్యము తప్పనిసరి.

• الجزاء من جنس العمل، فمن يعمل سوءًا يُجْز به، ومن يعمل خيرًا يُجْز بأحسن منه.
ప్రతిఫలం అన్నది ఆచరణకు తగ్గట్టు ఉంటుంది. ఎవరైతే చెడు చేస్తాడో దానికి తగ్గట్టు ప్రతిఫలం పొందుతాడు. మరియు ఎవరైతే మంచి చేస్తాడో అతడు దాని కంటే మంచిగా ప్రతిఫలమును పొందుతాడు.

• الإخلاص والاتباع هما مقياس قبول العمل عند الله تعالى.
చిత్తశుద్ధి మరియు అనుసరించటం రెండూ అల్లాహ్ వద్ద ఆచరణ స్వీకరించబడటానికి కొలమానములు.

• عَظّمَ الإسلام حقوق الفئات الضعيفة من النساء والصغار، فحرم الاعتداء عليهم، وأوجب رعاية مصالحهم في ضوء ما شرع.
ఇస్లాం బలహీన వర్గములైన స్త్రీలు మరియు పిల్లల హక్కులను గౌరవించింది. వారి పై అతిక్రమించటమును నిషేదించింది. మరియు వారి ప్రయోజనాలను ధర్మశాసన వెలుగులో పరిరక్షించటమును అనివార్యం చేసింది.

 
የይዘት ትርጉም ምዕራፍ: አን-ኒሳዕ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት