የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (102) ምዕራፍ: ሱረቱ አን-ኒሳዕ
وَاِذَا كُنْتَ فِیْهِمْ فَاَقَمْتَ لَهُمُ الصَّلٰوةَ فَلْتَقُمْ طَآىِٕفَةٌ مِّنْهُمْ مَّعَكَ وَلْیَاْخُذُوْۤا اَسْلِحَتَهُمْ ۫— فَاِذَا سَجَدُوْا فَلْیَكُوْنُوْا مِنْ وَّرَآىِٕكُمْ ۪— وَلْتَاْتِ طَآىِٕفَةٌ اُخْرٰی لَمْ یُصَلُّوْا فَلْیُصَلُّوْا مَعَكَ وَلْیَاْخُذُوْا حِذْرَهُمْ وَاَسْلِحَتَهُمْ ۚ— وَدَّ الَّذِیْنَ كَفَرُوْا لَوْ تَغْفُلُوْنَ عَنْ اَسْلِحَتِكُمْ وَاَمْتِعَتِكُمْ فَیَمِیْلُوْنَ عَلَیْكُمْ مَّیْلَةً وَّاحِدَةً ؕ— وَلَا جُنَاحَ عَلَیْكُمْ اِنْ كَانَ بِكُمْ اَذًی مِّنْ مَّطَرٍ اَوْ كُنْتُمْ مَّرْضٰۤی اَنْ تَضَعُوْۤا اَسْلِحَتَكُمْ ۚ— وَخُذُوْا حِذْرَكُمْ ؕ— اِنَّ اللّٰهَ اَعَدَّ لِلْكٰفِرِیْنَ عَذَابًا مُّهِیْنًا ۟
ఓ ప్రవక్త శతృవులతో పోరాడే సమయంలో మీరు సైన్యంలో ఉన్నప్పుడు మీరు వారికి నమాజు చదివించదలిస్తే మీరు సైన్యమును రెండు వర్గములుగా విభజించండి. వారిలో నుండి ఒక వర్గము మీతో పాటు నమాజు చేస్తూ నిలబడుతుంది. వారు తమ నమాజులో తమతో పాటు తమ అస్త్రములను తీసుకుని నిలబడాలి. ఇంకో వర్గము మీకు సంరక్షణగా నిలబడాలి. మొదటి వర్గము ఇమామ్ తో ఒక రకాత్ ను చదివినప్పుడు స్వయంగా నమాజును పూర్తి చేసుకోవాలి. వారు నమాజ్ చదివినప్పుడు వారు మీ వెనుక నుండి శతృవులకు అభిముఖమైపోవాలి. మరియు నమాజ్ చదవకుండా సంరక్షణలో నిలబడిన వర్గము వచ్చి ఇమామ్ తో ఒక రకాత్ ను పూర్తి చేసుకోవాలి. ఇమామ్ సలాం తిరిగినప్పుడు వారు తమ మిగిలిన నమాజును పూర్తి చేసుకోవాలి. మరియు వారు తమ శతృవుల నుండి తమ రక్షణను ఏర్పాటు చేసుకోవాలి. మరియు వారు తమ అస్త్రములను ఎత్తుకుని ఉండాలి. ఎందుకంటే నిశ్చయంగా అవిశ్వాసపరులు మీరు మీ అస్త్రముల నుండి మరియు మీ సామానుల నుండి నిర్లక్ష్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు నమాజు చేస్తున్నప్పుడు వారు మీపై ఒకేసారి దాడి చేస్తారు. వారు మీరు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టుకుంటారు. మరియు వర్షం వలన లేదా అనారోగ్యం,వేరే కారణం వలన మీకు బాధ కలిగితే మీరు మీ అస్త్రములను ఎత్తుకోకుండా దించివేయటంలో మీపై ఎటువంటి పాపం లేదు. మరియు మీరు మీ శక్తిని బట్టి మీ శతృవుల నుండి జాగ్రత్త వహించండి. నిశ్చయంగా అల్లాహ్ అవిశ్వాసపరుల కొరకు వారిని అవమానపరిచే శిక్షను సిద్ధం చేసి ఉంచాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• استحباب صلاة الخوف وبيان أحكامها وصفتها.
భయాందోళనల వేళ నమాజు (సలాతుల్ ఖౌఫ్) యొక్క ధర్మబద్ధత మరియు దాని ఆదేశముల,దాని లక్షణముల ప్రకటన.

• الأمر بالأخذ بالأسباب في كل الأحوال، وأن المؤمن لا يعذر في تركها حتى لو كان في عبادة.
అన్ని సంధర్భముల్లో కారకాలను ఎంచుకునే ఆదేశం. మరియు విశ్వాసపరుడు ఆరాధనలో ఉన్నా కూడా వాటిని వదిలే విషయంలో అనుమతి లేదు.

• مشروعية دوام ذكر الله تعالى على كل حال، فهو حياة القلوب وسبب طمأنينتها.
అన్ని సంధర్భముల్లో అల్లాహ్ స్మరణను శాశ్వతం చేయటం యొక్క ధర్మబద్ధత. ఇది హృదయముల జీవితం మరియు వాటి మనశ్శాంతికి కారణం.

• النهي عن الضعف والكسل في حال قتال العدو، والأمر بالصبر على قتاله.
శతృవులతో పోరాడే సమయంలో బలహీనత నుండి,బద్దకం వహించటం నుండి వారింపు. మరియు వారితో పోరాడే వేళ సహనం చూపే ఆదేశం.

 
የይዘት ትርጉም አንቀጽ: (102) ምዕራፍ: ሱረቱ አን-ኒሳዕ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት