የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (64) ምዕራፍ: ሱረቱ አል-ማኢዳህ
وَقَالَتِ الْیَهُوْدُ یَدُ اللّٰهِ مَغْلُوْلَةٌ ؕ— غُلَّتْ اَیْدِیْهِمْ وَلُعِنُوْا بِمَا قَالُوْا ۘ— بَلْ یَدٰهُ مَبْسُوْطَتٰنِ ۙ— یُنْفِقُ كَیْفَ یَشَآءُ ؕ— وَلَیَزِیْدَنَّ كَثِیْرًا مِّنْهُمْ مَّاۤ اُنْزِلَ اِلَیْكَ مِنْ رَّبِّكَ طُغْیَانًا وَّكُفْرًا ؕ— وَاَلْقَیْنَا بَیْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَآءَ اِلٰی یَوْمِ الْقِیٰمَةِ ؕ— كُلَّمَاۤ اَوْقَدُوْا نَارًا لِّلْحَرْبِ اَطْفَاَهَا اللّٰهُ ۙ— وَیَسْعَوْنَ فِی الْاَرْضِ فَسَادًا ؕ— وَاللّٰهُ لَا یُحِبُّ الْمُفْسِدِیْنَ ۟
యూదులు వారికి కష్టము,లేమి కలిగినప్పుడు ఇలా పలికేవారు : మేలును ఖర్చు చేయటం,ప్రసాదించటం నుండి అల్లాహ్ చేయి కట్టబడి ఉంది. ఆయన వద్ద ఉన్న దాన్ని మాకు ఇవ్వటం నుండి ఆయన ఆపి ఉంచాడు. వినండి వారి ఈ మాట పలకటం వలన వారి చేతులు మేలుని చేయటం నుండి,ఇవ్వటం నుండి ఆగిపోవుగాక మరియు వారు అల్లాహ్ కారుణ్యం నుండి గెంటివేయబడుగాక. కాని పరిశుద్దుడైన,మహోన్నతుడైన అల్లాహ్ రెండు చేతులు మేలు చేయటంలో,ప్రసాదించటంలో విస్తరించి ఉన్నాయి. ఆయన ఎలా తలచుకుంటే అలా ఖర్చు చేస్తాడు. ఆయన విస్తరింపజేస్తాడు మరియు పిడికిలి బిగించివేస్తాడు. ఆయనపై అభ్యంతరం చేసేవాడెవడూ లేడు మరియు ఆయనకు బలవంతం చేసేవాడెవడూ లేడు. ఓ ప్రవక్తా మీపై అవతరింపబడినది యూదులకు హద్దును అతిక్రమించటం మరియు నిరాకరించటమును తప్ప దేనిని అధికం చేయలేదు. ఇది వారి అసూయ వలన. మరియు మేము యూదుల వర్గముల మధ్య శతృత్వమును,ద్వేషమును వేశాము. వారు ఎప్పుడైన యుద్ధం కొరకు సమావేశమై దాని కొరకు సిద్ధం అవుతారో లేదా దాన్ని మండించటానికి కుట్రలు పన్నుతారో అల్లాహ్ వారి సమూహమును వేరు చేశాడు. మరియు వారి బలమును తొలగించాడు. వారు ఇస్లామును తప్పు పట్టటానికి మరియు దాని కొరకు కుట్రలు పన్నటానికి క్రమం తప్పకుండా భూమిలో ఉపద్రవాలను తలపెట్టే విషయంలో ప్రయత్నాలు చేశారు. మరియు అల్లాహ్ ఉపద్రవాలను తలపెట్టేవారిని ఇష్టపడడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• ذمُّ العالم على سكوته عن معاصي قومه وعدم بيانه لمنكراتهم وتحذيرهم منها.
ఆలిమ్ ను అతను తన జాతి ప్రజల పాపకార్యముల నుండి మౌనంగా ఉండటం పై మరియు వారి చెడులను వివరించకుండా,వారిని వాటి నుండి హెచ్చరించకుండా ఉండటంపై నిందించటం.

• سوء أدب اليهود مع الله تعالى، وذلك لأنهم وصفوه سبحانه بأنه مغلول اليد، حابس للخير.
మహోన్నతుడైన అల్లాహ్ తో యూదుల దుష్ప్రవర్తన అది ఎందుకంటే వారు పరిశుద్ధుడైన ఆయనను మంచి నుండి చేయి ముడి వేయబడిందని వర్ణించారు.

• إثبات صفة اليدين، على وجه يليق بذاته وجلاله وعظيم سلطانه.
ఆయన ఉనికికి మరియు ఆయన ఔన్నత్యానికి మరియు ఆయన గొప్ప అధికారమునకు తగిన విధంగా రెండు చేతుల గుణము నిరూపణ.

• الإشارة لما وقع فيه بعض طوائف اليهود من الشقاق والاختلاف والعداوة بينهم نتيجة لكفرهم وميلهم عن الحق.
యూదుల్లోని కొన్ని వర్గములు తమ అవిశ్వాసం వలన మరియు తాము సత్యము నుండి మరలిపోవటం వలన ఫలితముగా తమ మధ్య వ్యతిరేకతల్లో,విబేధాల్లో,ద్వేషముల్లో పడిపోవటం వైపు సూచన కలదు.

 
የይዘት ትርጉም አንቀጽ: (64) ምዕራፍ: ሱረቱ አል-ማኢዳህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት