Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አዝ ዛሪያት   አንቀጽ:
قَالَ فَمَا خَطْبُكُمْ اَیُّهَا الْمُرْسَلُوْنَ ۟
ఇబ్రాహీం అలైహిస్సలాం దైవదూతలతో ఇలా పలికారు : మీ విషయమేమిటి ? మీరు ఏమి నిర్ణయించుకున్నారు ?.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَالُوْۤا اِنَّاۤ اُرْسِلْنَاۤ اِلٰی قَوْمٍ مُّجْرِمِیْنَ ۟ۙ
దైవదూతలు ఆయనకు సమాధానమిస్తూ ఇలా పలికారు : నిశ్చయంగా అల్లాహ్ మమ్మల్ని అతి చెడ్డ పాపములకు పాల్పడే అపరాధ జనుల వైపునకు పంపించాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لِنُرْسِلَ عَلَیْهِمْ حِجَارَةً مِّنْ طِیْنٍ ۟ۙ
మేము వారిపై గట్టి మట్టితో చేయబడిన రాళ్ళను కురిపిస్తాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
مُّسَوَّمَةً عِنْدَ رَبِّكَ لِلْمُسْرِفِیْنَ ۟
ఓ ఇబ్రాహీం నీ ప్రభువు వద్ద నుండి గుర్తు వేయబడినవి అవి అల్లాహ్ హద్దులను అతిక్రమించి,అవిశ్వాసములో మరియు పాప కార్యముల్లో హద్దు మీరే వారిపై కురిపించబడుతాయి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَاَخْرَجْنَا مَنْ كَانَ فِیْهَا مِنَ الْمُؤْمِنِیْنَ ۟ۚ
అప్పుడు మేము లూత్ జాతి వారి ఊరిలో ఉన్న విశ్వాసపరులను వారికి అపరాధులకు సంభవించే శిక్ష సంభవించకుండా ఉండటానికి బయటకు తీసాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَمَا وَجَدْنَا فِیْهَا غَیْرَ بَیْتٍ مِّنَ الْمُسْلِمِیْنَ ۟ۚ
వారి ఆ ఊరిలో ముస్లిముల ఒక ఇల్లును మాత్రమే మేము పొందాము. వారే లూత్ అలైహిస్సలాం ఇంటివారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَتَرَكْنَا فِیْهَاۤ اٰیَةً لِّلَّذِیْنَ یَخَافُوْنَ الْعَذَابَ الْاَلِیْمَ ۟ؕ
మరియు మేము లూత్ జాతి వారి ఊరిలో వారిపై కురిసిన శిక్షను సూచించే శిక్ష ఆనుమాళ్ళను వారికి కలిగిన బాధాకరమైన శిక్ష నుండి భయపడి గుణపాఠం నేర్చుకోవటానికి వదిలాము. దాని నుండి ముక్తి పొందటానికి వారి కర్మలకు పాల్పడరు వారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَفِیْ مُوْسٰۤی اِذْ اَرْسَلْنٰهُ اِلٰی فِرْعَوْنَ بِسُلْطٰنٍ مُّبِیْنٍ ۟
మరియు మూసా అలైహిస్సలాంలో ఆయనను మేము ఫిర్ఔన్ వద్దకు స్పష్టమైన వాదనలను ఇచ్చిపంపినప్పుడు బాధాకరమైన శిక్ష నుండి భయపడే వారి కొరకు ఒక సూచన కలదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَتَوَلّٰی بِرُكْنِهٖ وَقَالَ سٰحِرٌ اَوْ مَجْنُوْنٌ ۟
అప్పుడు ఫిర్ఔన్ తన బలమును మరియు తన సైన్యమును సిద్ధం చేసుకుంటూ సత్యము నుండి విముఖత చూపాడు. మరియు మూసా అలైహిస్సలాం గురించి ఇలా పలికాడు : అతడు ప్రజలను మంత్రజాలమునకు గురి చేసే మంత్రజాలకుడు లేదా తనకు అర్ధం కాని మాటలను పలికే పిచ్చివాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَاَخَذْنٰهُ وَجُنُوْدَهٗ فَنَبَذْنٰهُمْ فِی الْیَمِّ وَهُوَ مُلِیْمٌ ۟ؕ
అప్పుడు మేము అతన్ని మరియు అతని పూర్తి సైన్యములను పట్టుకుని వారిని మేము సముద్రంలో విసిరివేశాము. అప్పుడు వారు మునిగి నాశనమైపోయారు. మరియు ఫిర్ఔన్ తిరస్కారము మరియు తాను దైవమని వాదించటం వలన నిందను తీసుకుని వచ్చాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَفِیْ عَادٍ اِذْ اَرْسَلْنَا عَلَیْهِمُ الرِّیْحَ الْعَقِیْمَ ۟ۚ
మరియు హూద్ జాతి అయిన ఆద్ లో బాధాకరమైన శిక్ష నుండి భయపడే వారి కొరకు మేము వారిపై వర్షమును మోయని మరియు చెట్లను పరాగసంపర్కము చేయని గాలిని పంపినప్పుడు ఒక సూచన కలదు. మరియు అందులో ఎటువంటి చెరువు లేదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
مَا تَذَرُ مِنْ شَیْءٍ اَتَتْ عَلَیْهِ اِلَّا جَعَلَتْهُ كَالرَّمِیْمِ ۟ؕ
అది దేనిపైనైతే వచ్చినదో ఏ ప్రాణమును గాని ఏ సంపదన గాని ఇతరవాటిని గాని నాశనం చేయకుండా వదలలేదు. మరియు దాన్ని అది క్రుసించిపోయిన,నలిగిపోయిన దాని వలె చేసినది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَفِیْ ثَمُوْدَ اِذْ قِیْلَ لَهُمْ تَمَتَّعُوْا حَتّٰی حِیْنٍ ۟
మరియు సాలిహ్ అలైహిస్సలాం జాతి అయిన సమూద్ లో బాధాకరమైన శిక్ష నుండి భయపడే వారి కొరకు వారితో మీరు మీ ఆయుషు పూర్తి కాక ముందే మీ జీవితంతో ప్రయోజనం చెందండి అని అన్నప్పుడు ఒక సూచన కలదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَعَتَوْا عَنْ اَمْرِ رَبِّهِمْ فَاَخَذَتْهُمُ الصّٰعِقَةُ وَهُمْ یَنْظُرُوْنَ ۟
అప్పుడు వారు తమ ప్రభువు ఆదేశము నుండి గర్వమును చూపి,విశ్వసించటం మరియు విధేయత చూపటం పై అహంకారమును చూపారు. అప్పుడు శిక్ష పిడుగు దాని గురించి వారు నిరీక్షిస్తుండగానే వారిని పట్టుకుంది. అప్పటికే వారు శిక్ష గురించి దాని అవతరణ కన్న మూడు దినముల ముందే హెచ్చరింపబడ్డారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَمَا اسْتَطَاعُوْا مِنْ قِیَامٍ وَّمَا كَانُوْا مُنْتَصِرِیْنَ ۟ۙ
అయితే వారు తమపై కురిసిన శిక్షను తమ నుండి తొలగించుకోలేకపోయారు. మరియు వారికి దాన్ని ఎదుర్కునే శక్తి కూడా లేదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَقَوْمَ نُوْحٍ مِّنْ قَبْلُ ؕ— اِنَّهُمْ كَانُوْا قَوْمًا فٰسِقِیْنَ ۟۠
మరియు ఈ ప్రస్తావించబడిన వారి కన్నా ముందు మేము నూహ్ జాతిని ముంచి నాశనం చేశాము. నిశ్చయంగా వారు అల్లాహ్ విధేయత నుండి వైదొలగిన జనులు. కావున వారు ఆయన శిక్షకు యోగ్యులయ్యారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَالسَّمَآءَ بَنَیْنٰهَا بِاَیْىدٍ وَّاِنَّا لَمُوْسِعُوْنَ ۟
మరియు మేము ఆకాశమును నిర్మించాము. మరియు మేము దాన్ని శక్తితో నిర్మించటంలో ప్రావీణ్యము కలవారము. మరియు నిశ్చయంగా మేము దాని అంచులను విస్తరింపజేసేవారము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَالْاَرْضَ فَرَشْنٰهَا فَنِعْمَ الْمٰهِدُوْنَ ۟
మరియు భూమి దాన్ని మేము దానిపై నివసించేవారి కొరకు పరపులా పరచివేశాము. అయితే మేము దాన్ని వారి కొరకు పరచినప్పుడు మేము ఎంతో చక్కగా పరిచేవారము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَمِنْ كُلِّ شَیْءٍ خَلَقْنَا زَوْجَیْنِ لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ ۟
మరియు మేము ప్రతీ వస్తువు నుండి మగ,ఆడ మరియు ఆకాశము,భూమి మరియు నేల,సముద్రం లా రెండు జతలను సృష్టించాము. బహుశా మీరు ప్రతి వస్తువు నుండి రెండు జతలను సృష్టించిన అల్లాహ్ ఏకత్వమును గుర్తు చేసుకుంటారని మరియు మీరు ఆయన సామర్ధ్యమును గుర్తు చేసుకుంటారని.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَفِرُّوْۤا اِلَی اللّٰهِ ؕ— اِنِّیْ لَكُمْ مِّنْهُ نَذِیْرٌ مُّبِیْنٌ ۟ۚ
కావున మీరు అల్లాహ్ శిక్ష నుండి ఆయన ప్రతిఫలం వైపునకు ఆయనపై విధేయత ద్వారా మరియు ఆయన పట్ల అవిధేయతను విడనాడటం ద్వారా పరుగెత్తండి. నిశ్చయంగా నేను మీకు ఓ ప్రజలారా ఆయన శిక్ష నుండి స్పష్టంగా హెచ్చరించే వాడిని.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَا تَجْعَلُوْا مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ ؕ— اِنِّیْ لَكُمْ مِّنْهُ نَذِیْرٌ مُّبِیْنٌ ۟
మరియు మీరు అల్లాహ్ తో పాటు వేరే ఆరాధ్యదైవమును ఆయనను వదిలి అతన్ని ఆరాధించటానికి చేయకండి. నిశ్చయంగా నేను మీకు ఆయన వద్ద నుండి స్పష్టంగా హెచ్చరించే వాడిని.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الإيمان أعلى درجة من الإسلام.
ఈమాన్ నకు ఇస్లాం కంటే ఉన్నత స్థానం కలదు.

• إهلاك الله للأمم المكذبة درس للناس جميعًا.
తిరస్కార సమాజములను అల్లాహ్ నాశనం చేయటంలో ప్రజలందరి కొరకు గుణపాఠం ఉన్నది.

• الخوف من الله يقتضي الفرار إليه سبحانه بالعمل الصالح، وليس الفرار منه.
అల్లాహ్ నుండి భయము పరిశుద్ధుడైన ఆయన వైపునకు సత్కర్మ ద్వారా మరలటమును కోరుతుంది. ఆయన నుండి పారిపోవటమును కాదు.

 
የይዘት ትርጉም ምዕራፍ: አዝ ዛሪያት
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት