የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: ሱረቱ አል ዋቂዓህ   አንቀጽ:

సూరహ్ అల్-వాఖియహ్

ከመዕራፉ ዓላማዎች:
بيان أحوال العباد يوم المعاد.
ప్రళయదినమున దాసుల పరిస్థితుల ప్రకటన

اِذَا وَقَعَتِ الْوَاقِعَةُ ۟ۙ
ప్రళయం ఖచ్చితంగా సంభవించినప్పుడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَیْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ ۟ۘ
ఇహలోకంలో తిరస్కరించినట్లు దాన్ని తిరస్కరించే ఏ ప్రాణము దొరకదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
خَافِضَةٌ رَّافِعَةٌ ۟ۙ
అది అపరాధులైన అవిశ్వాసపరులను వారిని నరకములో ప్రవేశింపజేసి హీనపరిచేది,దైవభీతి కలిగిన విశ్వాసపరులను వారిని స్వర్గములో ప్రవేశింపజేసి ఉన్నతికి చేర్చేది అయి ఉంటుంది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِذَا رُجَّتِ الْاَرْضُ رَجًّا ۟ۙ
భూమి తీవ్రంగా కంపించబడినప్పుడు,
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَّبُسَّتِ الْجِبَالُ بَسًّا ۟ۙ
మరియు పర్వతాలు తుత్తునియలుగా చేయబడినప్పుడు,
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَكَانَتْ هَبَآءً مُّنْۢبَثًّا ۟ۙ
అప్పుడు తుత్తునియలుగా చేయటం వలన అవి స్థిరత్వం లేని చెల్లాచెదురయ్యే ధూళి అయిపోతాయి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَّكُنْتُمْ اَزْوَاجًا ثَلٰثَةً ۟ؕ
ఆ రోజున మీరు మూడు రకాలుగా (వర్గములుగా) అయిపోతారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَاَصْحٰبُ الْمَیْمَنَةِ ۙ۬— مَاۤ اَصْحٰبُ الْمَیْمَنَةِ ۟ؕ
ఇక తమ కుడి చేతులతో తమ కర్మల పుస్తకములను తీసుకునే కుడి పక్షము వారు. వారి స్థానము ఎంత గొప్పదైనది మరియు ఎంత ఉన్నతమైనది!
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاَصْحٰبُ الْمَشْـَٔمَةِ ۙ۬— مَاۤ اَصْحٰبُ الْمَشْـَٔمَةِ ۟ؕ
మరియు తమ ఎడమ చేతులతో తమ కర్మల పుస్తకములను తీసుకునే ఎడమ పక్షం వారు. వారి స్ధానము ఎంత దిగజారినది మరియు ఎంత చెడ్డది
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَالسّٰبِقُوْنَ السّٰبِقُوْنَ ۟ۙ
ఇహలోకములో సత్కర్మలు చేయటంలో ముందుండేవారు పరలోకంలో వారే స్వర్గంలో ప్రవేశము కొరకు ముందుంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اُولٰٓىِٕكَ الْمُقَرَّبُوْنَ ۟ۚ
వారందరే అల్లాహ్ సాన్నిధ్యమును పొందేవారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فِیْ جَنّٰتِ النَّعِیْمِ ۟
వారు అనుగ్రహభరితమైన స్వర్గవనాలలో రకరకాల అనుగ్రహములను అనుభవిస్తూ ఉంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ثُلَّةٌ مِّنَ الْاَوَّلِیْنَ ۟ۙ
ఈ సమాజము నుండి మరియు పూర్వ సమాజముల నుండి ఒక పెద్ద వర్గము,
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَقَلِیْلٌ مِّنَ الْاٰخِرِیْنَ ۟ؕ
మరియు చివరి కాలము నాటి ప్రజల్లోంచి కొంత మంది వారే సాన్నిధ్యమును పొంది ముందు ఉండేవారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
عَلٰی سُرُرٍ مَّوْضُوْنَةٍ ۟ۙ
వారు బంగారముతో నేయబడిన పీఠాలపై ఉంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
مُّتَّكِـِٕیْنَ عَلَیْهَا مُتَقٰبِلِیْنَ ۟
వారు ఈ పీఠాలపై అభిముఖమై ఎదురుబదురుగా అనుకుని కూర్చుని ఉంటారు. వారిలోని ఏ ఒక్కరు ఇతరుల వెనుక వైపు చూడరు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• دوام تذكر نعم الله وآياته سبحانه موجب لتعظيم الله وحسن طاعته.
అల్లాహ్ అనుగ్రహములను మరియు పరిశుద్ధుడైన ఆయన ఆయతులను అనునిత్యము గుర్తు చేసుకోవటం అల్లాహ్ యొక్క ఘనతను తెలపటమునకు మరియు ఆయన విధేయతను మంచిగా చేయటమునకు అవసరము.

• انقطاع تكذيب الكفار بمعاينة مشاهد القيامة.
ప్రళయమును కళ్ళ ముందట చూడటం ద్వారా అవిశ్వాసపరుల తిరస్కారము అంతమైపోతుంది.

• تفاوت درجات أهل الجنة بتفاوت أعمالهم.
స్వర్గవాసుల స్థానాల్లో వ్యత్యాసం వారి కర్మల వ్యత్యాసం పరంగా ఉంటుంది.

یَطُوْفُ عَلَیْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُوْنَ ۟ۙ
వారి సేవ కొరకు చిన్న పిల్లలు వారి మధ్య తిరుగుతుంటారు వారికి వృద్ధాప్యము గాని వినాశనం గాని ముట్టుకోదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
بِاَكْوَابٍ وَّاَبَارِیْقَ ۙ۬— وَكَاْسٍ مِّنْ مَّعِیْنٍ ۟ۙ
స్వర్గంలో వారు ప్రవహించే మధ్యముతో నిండిన కడయమలు లేని పాత్రలను మరియు కడియములు కల కూజాలను మరియు గ్లాసులను తీసుకుని వారి మధ్య తిరుగుతుంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَّا یُصَدَّعُوْنَ عَنْهَا وَلَا یُنْزِفُوْنَ ۟ۙ
అది ఇహలోక మధ్యము వలే ఉండదు. దాన్ని సేవించే వారికి ఎటువంటి తలనొప్పి గాని మతి కోల్పోవటం గాని సంభవించదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَفَاكِهَةٍ مِّمَّا یَتَخَیَّرُوْنَ ۟ۙ
ఈ పిల్లలందరు వారి మధ్య వారు కోరుకునే ఫలాలలను తీసుకుని తిరుగుతుంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَحْمِ طَیْرٍ مِّمَّا یَشْتَهُوْنَ ۟ؕ
మరియు వారు వారి మనస్సులు కోరుకునే పక్షుల మాంసమును తీసుకుని తిరుగుతుంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَحُوْرٌ عِیْنٌ ۟ۙ
మరియు వారి కొరకు స్వర్గములో అందములో విశాలమైన కనులు కల స్త్రీలు ఉంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
كَاَمْثَالِ اللُّؤْلُو الْمَكْنُوْنِ ۟ۚ
గవ్వల్లో దాయబడిన ముత్యాల వలే ఉంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
جَزَآءً بِمَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
వారు ఇహలోకములో చేసుకున్న సత్కర్మలకు వారికి ప్రతిఫలముగా.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَا یَسْمَعُوْنَ فِیْهَا لَغْوًا وَّلَا تَاْثِیْمًا ۟ۙ
వారు స్వర్గములో అశ్లీల మాటలను వినరు మరియు దాని వాసుల నుండి ఎటువంటి పాపము జరగదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِلَّا قِیْلًا سَلٰمًا سَلٰمًا ۟
వారికి దైవదూతలు సలాము చేయటమును మరియు వారు ఒకరినొకరు సలాం చేసుకోవటమును మాత్రమే వారు వింటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاَصْحٰبُ الْیَمِیْنِ ۙ۬— مَاۤ اَصْحٰبُ الْیَمِیْنِ ۟ؕ
కుడి పక్షమువారు వారే ఎవరి కర్మల పత్రాలైతే వారి కుడి చేతులలో ఇవ్వబడుతాయో అల్లాహ్ వద్ద వారి స్థానము మరియు వారి విషయము ఎంతో గొప్పది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فِیْ سِدْرٍ مَّخْضُوْدٍ ۟ۙ
(వారు) ముళ్ళు కోయబడిన రేగు చెట్ల మధ్య ఉంటారు. అందులో ఎటువంటి బాధ ఉండదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَّطَلْحٍ مَّنْضُوْدٍ ۟ۙ
మరియు ఒక దానిపై ఒకటి వరుసగా పేర్చబడిన అరటి పండ్ల మధ్యలో ఉంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَّظِلٍّ مَّمْدُوْدٍ ۟ۙ
మరియు వాలని నిరంతరాయంగా విస్తరించిన నీడలో ఉంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَّمَآءٍ مَّسْكُوْبٍ ۟ۙ
మరియు ఆగకుండా ప్రవహించే నీటిలో ఉంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَّفَاكِهَةٍ كَثِیْرَةٍ ۟ۙ
మరియు పరిమితం కాని చాలా పండ్లలో ఉంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَّا مَقْطُوْعَةٍ وَّلَا مَمْنُوْعَةٍ ۟ۙ
అవి వారి నుండి ఎన్నటికి అంతమవవు. ఎందుకంటే వాటికి ఎటువంటి కాలం (సీజన్) లేదు. వాటిని వారు ఏ సమయంలో కోరినా ఎటువంటి అభ్యంతరం వాటిని నిరోధించదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَّفُرُشٍ مَّرْفُوْعَةٍ ۟ؕ
మరియు ఆసనాలపై ఉంచబడిన ఎత్తైన పరుపుల మధ్య ఉంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِنَّاۤ اَنْشَاْنٰهُنَّ اِنْشَآءً ۟ۙ
నిశ్ఛయంగా మేమే ప్రస్తావించబడిన హూరెయీన్ లను అసాధరణ రీతిలో సృష్టించాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَجَعَلْنٰهُنَّ اَبْكَارًا ۟ۙ
మేము వారిని ముందెన్నడు తాకబడని కన్యలుగా చేశాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
عُرُبًا اَتْرَابًا ۟ۙ
తమ భర్తలను ప్రేమించే వానిగా,సమ వయస్సు గల వారిగా (చేశాము).
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لِّاَصْحٰبِ الْیَمِیْنِ ۟ؕ۠
తమ ఆనందానికి సంకేతంగా కూడిచేత తీసుకొనబడిన కుడి పక్షం వారి కొరకు మేము వారిని సృష్టించాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ثُلَّةٌ مِّنَ الْاَوَّلِیْنَ ۟ۙ
]వారు మొదటి తరాల ప్రవక్తల సమాజాల వర్గము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَثُلَّةٌ مِّنَ الْاٰخِرِیْنَ ۟ؕ
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాజము నుండి ఒక వర్గము ఉంటుంది. అది సమాజములందరిలో చివరిది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاَصْحٰبُ الشِّمَالِ ۙ۬— مَاۤ اَصْحٰبُ الشِّمَالِ ۟ؕ
ఎడమ పక్షమువారు వారే ఎవరి కర్మల పత్రాలు వారి ఎడమ చేతులలో ఇవ్వబడుతాయో,వారి పరిశ్థితి,వారి పర్యవాసనము ఎంతో చెడ్డది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فِیْ سَمُوْمٍ وَّحَمِیْمٍ ۟ۙ
వారు తీవ్ర వేడి గాలులలో మరియు తీవ్ర వేడి నీటిలో ఉంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَّظِلٍّ مِّنْ یَّحْمُوْمٍ ۟ۙ
నల్లటి పొగ నీడలో ఉంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَّا بَارِدٍ وَّلَا كَرِیْمٍ ۟
వీచటంలో మంచిగా ఉండదు మరియు చూడ్డానికి అందంగా ఉండదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِنَّهُمْ كَانُوْا قَبْلَ ذٰلِكَ مُتْرَفِیْنَ ۟ۚۖ
నిశ్చయంగా వారు శిక్షను అనుభవించక ముందు ఇహలోకంలో సుఖభోగాలను అనుభవించేవారు. వారికి వారి మనో వాంఛలు తప్ప ఏ ఉద్ధేశము ఉండేది కాదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَكَانُوْا یُصِرُّوْنَ عَلَی الْحِنْثِ الْعَظِیْمِ ۟ۚ
వారు అల్లాహ్ పట్ల అవిశ్వాసం కనబరచటంపై మరియు ఆయనను వదిలి విగ్రహాలను ఆరాధించటంపై హఠులై ఉండేవారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَكَانُوْا یَقُوْلُوْنَ ۙ۬— اَىِٕذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَّعِظَامًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَ ۟ۙ
మరియు వారు మరణాంతరం లేపబడటమును నిరాకరించి దాని పట్ల పరిహాసముగా,దాన్ని దూరంగా భావిస్తూ ఇలా పలికేవారు : ఏమీ మేము మరణించి,మట్టిగా,క్రుసించి పోయిన ఎముకలుగా అయిపోయినప్పుడు దాని తరువాత మేము మరణాంతరం లేపబడుతామా ?!
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَوَاٰبَآؤُنَا الْاَوَّلُوْنَ ۟
ఏమిటీ మా కన్న మునుపు చనిపోయిన పూర్వ మా తాతముత్తాతలు మరల లేపబడుతారా ?.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قُلْ اِنَّ الْاَوَّلِیْنَ وَالْاٰخِرِیْنَ ۟ۙ
ఓ ప్రవక్తా మరణాంతరం లేపబడటమును తిరస్కరించే వీరందరితో ఇలా పలకండి : నిశ్చయంగా పూర్వ ప్రజలు మరియు తురువాత వచ్చే వారు కూడా.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَمَجْمُوْعُوْنَ ۙ۬— اِلٰی مِیْقَاتِ یَوْمٍ مَّعْلُوْمٍ ۟
ప్రళయదినమున వారు లెక్క తీసుకోబడటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు ఖచ్చితంగా సమీకరించబడుతారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• العمل الصالح سبب لنيل النعيم في الآخرة.
సత్కర్మ పరలోకములో అనుగ్రహములు పొందటానికి కారణమగును.

• الترف والتنعم من أسباب الوقوع في المعاصي.
విలాసము,సుఖభోగాలు పాపకార్యముల్లో పడటానికి కారణవుతాయి.

• خطر الإصرار على الذنب.
అపరాధం చేయటంపై హఠం చేయటం యొక్క ప్రమాదం.

ثُمَّ اِنَّكُمْ اَیُّهَا الضَّآلُّوْنَ الْمُكَذِّبُوْنَ ۟ۙ
ఆ తరువాత నిశ్ఛయంగా మీరు ఓ మరణాంతరము లేపబడటమును తిరస్కరించేవారా,సన్మార్గము నుండి తప్పిపోయేవారా ప్రళయదినమున మీరు జక్కూమ్ వృక్ష ఫలాలలను తింటారు. మరియు అది అత్యంత చెడ్డదైన,నీచమైన ఫలము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَاٰكِلُوْنَ مِنْ شَجَرٍ مِّنْ زَقُّوْمٍ ۟ۙ
ఆ తరువాత నిశ్ఛయంగా మీరు ఓ మరణాంతరము లేపబడటమును తిరస్కరించేవారా,సన్మార్గము నుండి తప్పిపోయేవారా ప్రళయదినమున మీరు జక్కూమ్ వృక్ష ఫలాలలను తింటారు. మరియు అది అత్యంత చెడ్డదైన,నీచమైన ఫలము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَمَالِـُٔوْنَ مِنْهَا الْبُطُوْنَ ۟ۚ
అప్పుడు మీ ఖాళీ కడుపులను ఆ చేదు వృక్షముతో నింపుకుంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَشٰرِبُوْنَ عَلَیْهِ مِنَ الْحَمِیْمِ ۟ۚ
అప్పుడు దానిపై తీవ్రమైన వేడి నీళ్ళను త్రాగుతారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَشٰرِبُوْنَ شُرْبَ الْهِیْمِ ۟ؕ
హుయామ్ రోగము కారణం వలన ఎక్కువ నీటిని త్రాగే ఒంటెల వలె వారు దాని త్రాగటమును అధికం చేస్తారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
هٰذَا نُزُلُهُمْ یَوْمَ الدِّیْنِ ۟ؕ
ఈ ప్రస్తావించబడిన చేదు ఆహారము మరియు వేడి నీళ్ళు ప్రతిఫలం దినం నాడు వారికి ఇవ్వబడే ఆతిధ్యము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
نَحْنُ خَلَقْنٰكُمْ فَلَوْلَا تُصَدِّقُوْنَ ۟
ఓ తిరస్కారులారా మీరు ఉనికిలో లేనప్పటికీ మేము మిమ్మల్ని సృష్టించాము. మేము మిమ్మల్ని మరణాంతరం జీవింపజేసి లేపుతామని మీరెందుకు నమ్మరు ?!
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَفَرَءَیْتُمْ مَّا تُمْنُوْنَ ۟ؕ
ఓ ప్రజలారా మీరు మీ భార్యల గర్భాల్లో విసిరే వీర్యమును గమనించారా ?!
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ءَاَنْتُمْ تَخْلُقُوْنَهٗۤ اَمْ نَحْنُ الْخٰلِقُوْنَ ۟
ఏమీ ఆ వీర్యమును మీరు సృష్టించేవారా లేదా మేము దాన్ని సృష్టించేవారమా ?!
የአረብኛ ቁርኣን ማብራሪያ:
نَحْنُ قَدَّرْنَا بَیْنَكُمُ الْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوْقِیْنَ ۟ۙ
మేమే మీ మధ్య మరణమును నిర్ణయించాము. మీలో నుండి ప్రతి ఒక్కరికి ఒక సమయమున్నది దాన్ని అదిగమించటం జరగదు మరియు వెనుకకు జరగటం జరగదు. మరియు మేము అలసిపోయేవారము కాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
عَلٰۤی اَنْ نُّبَدِّلَ اَمْثَالَكُمْ وَنُنْشِئَكُمْ فِیْ مَا لَا تَعْلَمُوْنَ ۟
మీరు ఉన్న మీకు తెలిసిన సృష్టి,రూపమును మేము మార్చి మీకు తెలియని సృష్టి,రూపములో మిమ్మల్ని సృష్టించే సామర్ధ్యమును కలిగిన వారము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَقَدْ عَلِمْتُمُ النَّشْاَةَ الْاُوْلٰی فَلَوْلَا تَذَكَّرُوْنَ ۟
వాస్తవానికి మేము మిమ్మల్ని మొదటిసారి ఎలా సృష్టించామో మీకు తెలుసు. ఏమీ మిమ్మల్ని మొదటిసారి సృష్టించిన వాడు మీరు మరణించిన తరువాత మిమ్మల్ని మరల లేపటంపై సామర్ధ్యము కలవాడని మీరు గుణపాఠం నేర్చుకుని తెలుసుకోరా ?!
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَفَرَءَیْتُمْ مَّا تَحْرُثُوْنَ ۟ؕ
ఏమీ మీరు భూమిలో నాటే బీజమును గమనించారా ?!
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ءَاَنْتُمْ تَزْرَعُوْنَهٗۤ اَمْ نَحْنُ الزّٰرِعُوْنَ ۟
ఆ విత్తనమును మీరు మొలకెత్తిస్తున్నారా లేదా మేము దాన్ని మొలకెత్తిస్తున్నామా ?!
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَوْ نَشَآءُ لَجَعَلْنٰهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُوْنَ ۟
ఒక వేళ మేము ఆ పంటను నాశనం చేయదలచుకుంటే అది పక్వమునకు వచ్చి చేతికి వచ్చే సమయాన దాన్ని మేము నాశనం చేస్తాము. అప్పుడు దాని తరువాత మీరు దానికి సంభవించిన దానిపై ఆశ్ఛర్యపోతారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِنَّا لَمُغْرَمُوْنَ ۟ۙ
మీరంటారు నిశ్చయంగా మేము ఖర్చు చేసిన దాన్ని నష్టపోయి శిక్షింపబడ్డాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
بَلْ نَحْنُ مَحْرُوْمُوْنَ ۟
కాదు కాదు మేము ఆహారోపాధిని కోల్పోయాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَفَرَءَیْتُمُ الْمَآءَ الَّذِیْ تَشْرَبُوْنَ ۟ؕ
ఏమీ మీరు దప్పికకు గురైనప్పుడు మీరు త్రాగే నీటిని గమనించారా ?!
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ءَاَنْتُمْ اَنْزَلْتُمُوْهُ مِنَ الْمُزْنِ اَمْ نَحْنُ الْمُنْزِلُوْنَ ۟
ఏమీ ఆకాశములో ఉన్న మేఘము నుండి మీరు దాన్ని కురిపించారా లేదా మేము దాన్ని కురిపించామా ?!
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَوْ نَشَآءُ جَعَلْنٰهُ اُجَاجًا فَلَوْلَا تَشْكُرُوْنَ ۟
ఒక వేళ మేము ఆ నీటిని త్రాగటానికి,దాహం తీర్చుకోవటానికి ఉపయోగించకుండా ఉప్పగా చేయదలచుకుంటే దాన్ని చాలా ఉప్పగా చేసేవారము. మీపై కారుణ్యముగా తియ్యగా దాన్ని మీపై కురిపించినందుకు మీరు అల్లాహ్ కు ఎందుకు కృతజ్ఞతలు తెలుపుకోరు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَفَرَءَیْتُمُ النَّارَ الَّتِیْ تُوْرُوْنَ ۟ؕ
మీ ప్రయోజనముల కొరకు మీరు వెలిగించే అగ్ని ని మీరు గమనించారా ?!
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ءَاَنْتُمْ اَنْشَاْتُمْ شَجَرَتَهَاۤ اَمْ نَحْنُ الْمُنْشِـُٔوْنَ ۟
ఏ వృక్షముతో దాన్ని వెలిగించబడుతున్నదో దాన్ని మీరు సృష్టించారా లేదా మీపై దయగా మేము దాన్ని సృష్టించామా ?!
የአረብኛ ቁርኣን ማብራሪያ:
نَحْنُ جَعَلْنٰهَا تَذْكِرَةً وَّمَتَاعًا لِّلْمُقْوِیْنَ ۟ۚ
మేము ఈ అగ్నిని మీకు పరలోక అగ్నిని గుర్తు చేసే మీ కొరకు ఒక జ్ఞాపికగా చేశాము. మరియు దాన్ని మీలో నుండి ప్రయాణికుల కొరకు ప్రయోజనదాయకంగా చేశాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِیْمِ ۟
ఓ ప్రవక్తా మహోన్నతుడైన నీ ప్రభువు యొక్క ఆయనకు తగని వాటి నుండి పరిశుద్ధతను కొనియాడండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَلَاۤ اُقْسِمُ بِمَوٰقِعِ النُّجُوْمِ ۟ۙ
అల్లాహ్ నక్షత్రముల స్థానాల మరియు వాటి ప్రదేశాలపై ప్రమాణం చేశాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاِنَّهٗ لَقَسَمٌ لَّوْ تَعْلَمُوْنَ عَظِیْمٌ ۟ۙ
మరియు నిశ్చయంగా ఈ ప్రదేశముల యొక్క ప్రమాణము ఒక వేళ మీరు దానిలో ఉన్న సూచనలు మరియు లెక్క లేనన్ని గుణపాఠములు ఉండటం వలన దాని గొప్పతనమును తెలుసుకుని ఉంటే ఎంతో గొప్పది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• دلالة الخلق الأول على سهولة البعث ظاهرة.
మొడటి సారి సృష్టించటం మరణాంతరం లేపటం సాధ్యము అనటానికి సూచన బహిర్గతమైనది.

• إنزال الماء وإنبات الأرض والنار التي ينتفع بها الناس نعم تقتضي من الناس شكرها لله، فالله قادر على سلبها متى شاء.
నీటిని కురిపించటం మరియు భూమిని మొలకెత్తించటం మరియు ప్రజలు ప్రయోజనం చెందే అగ్నిని సృష్టించటం అనుగ్రహాలు వాటిపై అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపటమును కోరుతున్నవి. అయితే అల్లాహ్ తాను తలచినప్పుడు వాటిని తీసుకోవటంపై సామర్ధ్యము కలవాడు.

• الاعتقاد بأن للكواكب أثرًا في نزول المطر كُفْرٌ، وهو من عادات الجاهلية.
వర్షమును కురిపించటంలో నక్షత్రములకు ప్రభావితం చేసే శక్తి ఉన్నదని విశ్వసించటం అవిశ్వాసము మరియు అది అజ్ఞాన కాలము నాటి అలవాట్లలోంచిది.

اِنَّهٗ لَقُرْاٰنٌ كَرِیْمٌ ۟ۙ
ఓ ప్రజలారా నిశ్చయంగా మీకు చదివి వినిపించబడే ఖుర్ఆన్ అందులో ఉన్న గొప్ప ప్రయోజనముల వలన దివ్యమైన ఖుర్ఆన్.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فِیْ كِتٰبٍ مَّكْنُوْنٍ ۟ۙ
ప్రజల కళ్ళ నుండి సురక్షితమైన ఒక గ్రంధమైన లౌహె మహ్ఫూజ్ లో ఉన్నది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَّا یَمَسُّهٗۤ اِلَّا الْمُطَهَّرُوْنَ ۟ؕ
పాపముల నుండి మరియు లోపముల నుండి పరిశుద్ధులైన దైవదూతలు మాత్రమే దాన్ని ముట్టుకుంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
تَنْزِیْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِیْنَ ۟
సృష్టితాల ప్రభువు వద్ద నుండి తన ప్రవక్త అగు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడినది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَفَبِهٰذَا الْحَدِیْثِ اَنْتُمْ مُّدْهِنُوْنَ ۟ۙ
ఓ ముష్రికులారా మీరు ఈ విషయమును విశ్వసించకుండా తిరస్కరిస్తున్నారా ?!
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَتَجْعَلُوْنَ رِزْقَكُمْ اَنَّكُمْ تُكَذِّبُوْنَ ۟
మరియు మీరు అల్లాహ్ కు ఆయన మీకు ప్రసాదించిన అనుగ్రహాలపై మీ కృతజ్ఞతలను వాటిని మీ తిరస్కారముగా చేసి వర్షము కురవటమును నక్షత్రముల వైపు చేసి ఫలానా నక్షత్రము వలన మాపై వర్షము కురిసింది అని అంటున్నారా ?!
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَلَوْلَاۤ اِذَا بَلَغَتِ الْحُلْقُوْمَ ۟ۙ
ప్రాణము గొంతుకు చేరిపోయినప్పుడు
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاَنْتُمْ حِیْنَىِٕذٍ تَنْظُرُوْنَ ۟ۙ
మరియు మీరు ఆ సమయమున మీ ముందట ప్రత్యక్షమయ్యే దాన్ని చూస్తుండిపోతారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَنَحْنُ اَقْرَبُ اِلَیْهِ مِنْكُمْ وَلٰكِنْ لَّا تُبْصِرُوْنَ ۟
మరియు మేము మా జ్ఞానముతో,మా సామర్ధ్యముతో మరియు మా దూతలు మీ మృత్యువునకు మీకన్న దగ్గరగా ఉంటారు. కాని మీరు ఆ దూతలందరిని చూడలేరు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَلَوْلَاۤ اِنْ كُنْتُمْ غَیْرَ مَدِیْنِیْنَ ۟ۙ
మీరు అనుకుంటున్నట్లు మీ కర్మలకు మీరు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు మరల లేపబడకుండా ఉంటే
የአረብኛ ቁርኣን ማብራሪያ:
تَرْجِعُوْنَهَاۤ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
మీరు సత్యవంతులే అయితే మీ మృతుని నుండి వెలికి వచ్చిన ఈ ప్రాణమును తిరిగి రప్పించుకోండి ?! మీరు అలా చేయలేరు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَاَمَّاۤ اِنْ كَانَ مِنَ الْمُقَرَّبِیْنَ ۟ۙ
ఇక ఒక వేళ మరణించే వాడు సత్కర్మల వైపు ముందడుగు వేసేవారిలో నుంచి అయితే
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَرَوْحٌ وَّرَیْحَانٌ ۙ۬— وَّجَنَّتُ نَعِیْمٍ ۟
అతనికి మనశ్శాంతి,కారుణ్యము ఉంటుంది దాని తరువాత ఎటువంటి అలసట ఉండదు.మరియు మంచి ఆహారము,కారుణ్యముంటుంది. మరియు అతని కొరకు స్వర్గముంటుంది అందులో అతడు తన మనస్సుకు నచ్చిన వాటితో సుఖభోగాలను అనుభవిస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاَمَّاۤ اِنْ كَانَ مِنْ اَصْحٰبِ الْیَمِیْنِ ۟ۙ
మరియు ఒక వేళ మరణించే వాడు కుడిపక్షం వారిలో నుంచి అయితే మీరు వారి విషయం గురించి పట్టించుకోకండి. వారికి శాంతి శ్రేయస్సులు ఉంటాయి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَسَلٰمٌ لَّكَ مِنْ اَصْحٰبِ الْیَمِیْنِ ۟
మరియు ఒక వేళ మరణించే వాడు కుడిపక్షం వారిలో నుంచి అయితే మీరు వారి విషయం గురించి పట్టించుకోకండి. వారికి శాంతి శ్రేయస్సులు ఉంటాయి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاَمَّاۤ اِنْ كَانَ مِنَ الْمُكَذِّبِیْنَ الضَّآلِّیْنَ ۟ۙ
మరియు ఇక ఒక వేళ మరణించే వాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించే వారిలో నుండి మరియు సన్మార్గము నుండి తప్పిపోయే వారిలో నుండి అయితే.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَنُزُلٌ مِّنْ حَمِیْمٍ ۟ۙ
అప్పుడు అతనికి తీవ్రమైన వేడి గల నీటితో ఆతిధ్యమివ్వబడును.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَّتَصْلِیَةُ جَحِیْمٍ ۟
మరియు అతను నరకాగ్నికి ఆహుతి అవటం జరుగును.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِنَّ هٰذَا لَهُوَ حَقُّ الْیَقِیْنِ ۟ۚ
ఓ ప్రవక్త నిశ్చయంగా మేము మీకు తెలియపరచిన ఈ గాధ ఎటువంటి సందేహం లేని రూఢీ అయిన సత్యం.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِیْمِ ۟۠
కావున మీరు మీ మహోన్నత ప్రభువు యొక్క నామము పరిశుద్ధతను కొనియాడండి. మరియు లోపముల నుండి ఆయన పరిశుద్ధతను తెలపండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• شدة سكرات الموت وعجز الإنسان عن دفعها.
మరణ ఘడియల తీవ్రత మరియు దాన్ని తొలగించటం నుండి మనిషి అశక్తి.

• الأصل أن البشر لا يرون الملائكة إلا إن أراد الله لحكمة.
ఏదైన విజ్ఞత కొరకు అల్లాహ్ తలచుకుంటే తప్ప మానవుడు దైవ దూతలను చూడకపోవటం వాస్తవం.

• أسماء الله (الأول، الآخر، الظاهر، الباطن) تقتضي تعظيم الله ومراقبته في الأعمال الظاهرة والباطنة.
అల్లాహ్ నామములు (అల్ అవ్వలు,అల్ ఆఖిరు,అజ్జాహిరు,అల్ బాతిను) అల్లాహ్ గొప్పతనమును మరియు గోచరమైన మరియు అంతర్గత క్రియలలో ఆయన యొక్క పర్యవేక్షణను నిర్ణయిస్తాయి.

 
የይዘት ትርጉም ምዕራፍ: ሱረቱ አል ዋቂዓህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት