Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (137) ምዕራፍ: አል-አዕራፍ
وَاَوْرَثْنَا الْقَوْمَ الَّذِیْنَ كَانُوْا یُسْتَضْعَفُوْنَ مَشَارِقَ الْاَرْضِ وَمَغَارِبَهَا الَّتِیْ بٰرَكْنَا فِیْهَا ؕ— وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ الْحُسْنٰی عَلٰی بَنِیْۤ اِسْرَآءِیْلَ ۙ۬— بِمَا صَبَرُوْا ؕ— وَدَمَّرْنَا مَا كَانَ یَصْنَعُ فِرْعَوْنُ وَقَوْمُهٗ وَمَا كَانُوْا یَعْرِشُوْنَ ۟
ఫిర్ఔన్,అతని జాతివారు హీనంగా భావించే ఇస్రాయీల్ సంతతివారిని మేము భూమండల ప్రాక్పశ్చిమాలకు వారసులుగా చేశాము. దాని ఉద్దేశం సిరియా ప్రాంతపు పట్టణాలు. ఈ పట్టణాల్లో అల్లాహ్ వాటి పంటలను,ఫలాలను పూర్తి స్ధాయిలో వెలికి తీయటం ద్వారా శుభాలను కురిపించాడు. ఓ ప్రవక్త మీ ప్రభువు యొక్క మంచి మాట (వాగ్ధానం) పూర్తయింది. ఏదైతే అల్లాహ్ యొక్క ఈ వాక్యములో ప్రస్తావించబడినదో. وَنُرِيدُ أَنْ نَمُنَّ عَلَى الَّذِينَ اسْتُضْعِفُوا فِي الأَرْضِ وَنَجْعَلَهُمْ أَئِمَّةً وَنَجْعَلَهُمُالْوَارِثِينَ﴾ [القصص: ٥]فَ మరియు భువిలో మరీ బలహీనుల్ని చేసి అణచివేయబడిన ఆ జనులను అనుగ్రహించాలని,వారికి సారధ్య బాధ్యతలు అప్పగించాలని,వారిని వారసులుగా చేయాలని మేముకోరుకున్నాము.(సూరతుల్ ఖసస్ 5).అయితే అల్లాహ్ ఫిర్ఔన్,అతని జాతివారి నుండి వారికి కలిగిన బాధపై వారి సహనము వలన భూమండలంలో వారికి అధికారమును కలిగించాడు. మరియు మేము ఫిర్ఔన్ ఏర్పరచిన పంటలను,నివాసములను,వారు నిర్మించుకున్న భవనములను నేలమట్టం చేశాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الخير والشر والحسنات والسيئات كلها بقضاء الله وقدره، لا يخرج منها شيء عن ذلك.
మేలు,కీడు,పుణ్యాలు,పాపాలు అన్నీ అల్లాహ్ నిర్ణయం వలన,అతని విధివ్రాత వలన జరుగుతాయి. దాని నుండి వాటిలోంచి ఏవి బయటకు తొలగవు.

• شأن الناس في وقت المحنة والمصائب اللجوء إلى الله بدافع نداء الإيمان الفطري.
పరీక్షలు,ఆపదల సమయంలో విశ్వాసము యొక్క స్వాభావిక పిలుపు ద్వారా అల్లాహ్ రక్షణలో చేరటం ప్రజల వైఖరి అవుతుంది.

• يحسن بالمؤمن تأمل آيات الله وسننه في الخلق، والتدبر في أسبابها ونتائجها.
అల్లాహ్ సూచనల్లో,సృష్టితాల విషయంలో ఆయన సంప్రదాయాల్లో యోచించటం,వాటి కారకాల్లో,వాటి ఫలితాల్లో యోచించటం విశ్వాసపరునికి ఉత్తమం.

• تتلاشى قوة الأفراد والدول أمام قوة الله العظمى، والإيمان بالله هو مصدر كل قوة.
అల్లాహ్ గొప్ప శక్తి ముందు వ్యక్తుల,రాజ్యాల శక్తి మసకబారుతుంది. అల్లాహ్ పై విశ్వాసం అన్ని శక్తులకు మూలము.

• يكافئ الله تعالى عباده المؤمنين الصابرين بأن يمكِّنهم في الأرض بعد استضعافهم.
అల్లాహ్ సహనమును పాటించే విశ్వాసపరులైన తన దాసులను భూమండలంలో బలహీనులుగా భావించబడిన తరువాత వారికి అధికారమును ప్రసాదిస్తాడు.

 
የይዘት ትርጉም አንቀጽ: (137) ምዕራፍ: አል-አዕራፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት