የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: ሱረቱ አል ጋሺያህ   አንቀጽ:

సూరహ్ అల్-గాషియహ్

ከመዕራፉ ዓላማዎች:
التذكير بالآخرة وما فيها من الثواب والعقاب، والنظر في براهين قدرة الله.
పరలోకం గురించి మరియు అందులో ఉన్న ప్రతిఫలము మరియు శిక్ష గురించి గుర్తు చేయటం మరియు అల్లాహ్ సామర్ద్యం యొక్క రజువులను పరిశీలించడం

هَلْ اَتٰىكَ حَدِیْثُ الْغَاشِیَةِ ۟ؕ
ఓ ప్రవక్తా తన భయాందోళనల ద్వారా ప్రజలను క్రమ్ముకునే ప్రళయ సంగతి నీకు చేరినదా ?!
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وُجُوْهٌ یَّوْمَىِٕذٍ خَاشِعَةٌ ۟ۙ
ప్రజలు ప్రళయదినమున దౌర్భాగ్యులై ఉంటారు లేదా పుణ్యాత్ములై ఉంటారు . కావున దౌర్భాగ్యుల ముఖములు క్రుంగిపోయి క్రిందకు వాలి ఉంటాయి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
عَامِلَةٌ نَّاصِبَةٌ ۟ۙ
అవి సంకెళ్ళు వేసి ఈడ్చబడటం వలన మరియు వాటికి వేయబడిన బేడీల వలన అలసి సలసి ఉంటాయి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
تَصْلٰی نَارًا حَامِیَةً ۟ۙ
ఈ ముఖములు వేడైన అగ్నిలో ప్రవేశించి దాని వేడిని అనుభవిస్తాయి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
تُسْقٰی مِنْ عَیْنٍ اٰنِیَةٍ ۟ؕ
వారికి తీవ్ర వేడిదైన సెలయేరు నుండి త్రాపించబడును.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَیْسَ لَهُمْ طَعَامٌ اِلَّا مِنْ ضَرِیْعٍ ۟ۙ
వారి కొరకు అత్యంత చెడ్డదైన మరియు దురవాసన గల మొక్కల్లోంచి షిబ్రిక్ పేరు గల మొక్క తప్ప వారు ఆహారంగా తీసుకోవటానికి ఎటువంటి ఆహారముండదు. అది ఎండిపోయినప్పుడు విషపూరితంగా అయిపోతుంది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَّا یُسْمِنُ وَلَا یُغْنِیْ مِنْ جُوْعٍ ۟ؕ
అది దాన్ని తినే వాడిని లావు చేయదు మరియు అతని ఆకలిని ఆపదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وُجُوْهٌ یَّوْمَىِٕذٍ نَّاعِمَةٌ ۟ۙ
ఆ రోజున పుణ్యాత్ముల ముఖములు తాము పొందిన అనుగ్రముల వలన అనుగ్రహము కలవిగా,వికసించి,సంతోషముగా ఉంటాయి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لِّسَعْیِهَا رَاضِیَةٌ ۟ۙ
తాము ఇహలోకంలో చేసుకున్న తమ సత్కర్మ పట్ల సంతుష్టంగా ఉంటారు. నిశ్చయంగా వారు తమ కర్మల పుణ్యమును ఆదా చేసి ఉండగా రెట్టింపు చేసి ఉండగా పొందారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فِیْ جَنَّةٍ عَالِیَةٍ ۟ۙ
ఉన్నతమైన స్థానము కల స్వర్గములో.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَّا تَسْمَعُ فِیْهَا لَاغِیَةً ۟ؕ
స్వర్గములో వారు ఎటువంటి అసత్య మాటను మరియు వ్యర్ధ మాటను వినరు. ఇవే కాక నిషిద్ధ మాటలు వినరు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فِیْهَا عَیْنٌ جَارِیَةٌ ۟ۘ
ఈ స్వర్గములో ప్రవహించే సెలయేరులు ఉంటాయి వారు వాటిని తాము కోరిన విధంగా త్రవ్వి తీసుకుని పోతారు మరియు వాటిని మరల్చుకుంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فِیْهَا سُرُرٌ مَّرْفُوْعَةٌ ۟ۙ
అందులో ఎత్తైన ఆసనాలుంటాయి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَّاَكْوَابٌ مَّوْضُوْعَةٌ ۟ۙ
మరియు పాత్రలు త్రాగటానికి సిద్ధం చేసి ఉంచబడి ఉంటాయి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَّنَمَارِقُ مَصْفُوْفَةٌ ۟ۙ
మరియు అందులో వరుసగా ఒక దానితో ఒకటి ఆనించి పెట్టబడిన దిండ్లు ఉంటాయి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَّزَرَابِیُّ مَبْثُوْثَةٌ ۟ؕ
మరియు అందులో అక్కడక్కడ అనేక తివాచీలు పరచబడి ఉంటాయి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَفَلَا یَنْظُرُوْنَ اِلَی الْاِبِلِ كَیْفَ خُلِقَتْ ۟ۥ
ఏమిటీ వారు ఒంటెల వైపునకు యోచన చేసే దృష్టితో చూడరా ఎలా అల్లాహ్ వాటిని సృష్టించాడు మరియు వాటిని ఆదం సంతతి కొరకు ఆదీనంలో చేశాడు ?.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاِلَی السَّمَآءِ كَیْفَ رُفِعَتْ ۟ۥ
మరియు ఆకాశం వైపునకు చూడరా ఏ విధంగా దాన్ని పైకి ఎత్తాడో చివరికి అది వారిపై భద్రమైన కప్పుగా అయిపోయింది. అది వారిపై పడదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاِلَی الْجِبَالِ كَیْفَ نُصِبَتْ ۟ۥ
మరియు పర్వతముల వైపుకు చూడరా ఏ విధంగా వాటిని పాతి పెట్టాడో మరియు భూమి వాటి వలన ప్రజలను తీసుకుని ప్రకంపించకుండా స్థిరంగా ఉంది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاِلَی الْاَرْضِ كَیْفَ سُطِحَتْ ۟
మరియు భూమి వైపు చూడరా ఎలా ఆయన దాన్ని పరచాడో మరియు దాన్ని ప్రజలు దానిపై నివాసం ఉండటానికి సిద్ధం చేశాడో ?!
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَذَكِّرْ ۫— اِنَّمَاۤ اَنْتَ مُذَكِّرٌ ۟ؕ
ఓ ప్రవక్తా వారందరిని మీరు హితబోధన చేయండి మరియు వారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టండి. మీరు హితబోధన చేసే వారు మాత్రమే. మీతో వారి హితబోధనను మాత్రమే కోరబడింది. ఇక వారి విశ్వాసము భాగ్యము ఒక్కడైన అల్లాహ్ చేతిలో ఉంది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَسْتَ عَلَیْهِمْ بِمُصَۜیْطِرٍ ۟ۙ
మీరు వారిని విశ్వాసముపై బలవంతం పెట్టటానికి మీరు వారిపై నియమింపబడలేదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• أهمية تطهير النفس من الخبائث الظاهرة والباطنة.
మనస్సును బాహ్యపరమైన మరియు అంతర పరమైన చెడుల నుండి పరిశుద్ధపరచటం యొక్క ప్రాముఖ్యత.

• الاستدلال بالمخلوقات على وجود الخالق وعظمته.
సృష్టి కర్త ఉనికిపై ఆయన గొప్పతనం పై సృష్టి రాసుల ద్వారా ఆధారం చూపటం.

• مهمة الداعية الدعوة، لا حمل الناس على الهداية؛ لأن الهداية بيد الله.
సందేశ ప్రచారకుని లక్ష్యం సందేశప్రచారం,ప్రజలను సన్మార్గంపై తీసుకుని రాదు. ఎందుకంటే సన్మార్గం పై నడిచే భాగ్యం అల్లాహ్ చేతిలో ఉంది.

اِلَّا مَنْ تَوَلّٰی وَكَفَرَ ۟ۙ
కాని ఎవరైతే వారిలో నుండి విశ్వాసం నుండి ముఖము చాటేశాడో మరియు అల్లాహ్ పట్ల,ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసం కనబరచాడో.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَیُعَذِّبُهُ اللّٰهُ الْعَذَابَ الْاَكْبَرَ ۟ؕ
అతన్ని అల్లాహ్ ప్రళయదినమున నరకములో ప్రవేశింపజేసి పెద్ద శిక్ష విధిస్తాడు. అందులో శాశ్వతంగా ఉంటాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِنَّ اِلَیْنَاۤ اِیَابَهُمْ ۟ۙ
నిశ్చయంగా వారి మరణం తరువాత వారి మరలటం మా ఒక్కరి వైపే.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ثُمَّ اِنَّ عَلَیْنَا حِسَابَهُمْ ۟۠
ఆ పిదప వారి కర్మలపై వారి లెక్క తీసుకోవటం మా ఒక్కరిపై బాధ్యత కలదు. మరియు మీకూ లేదు మరియు ఇతరులకూ దాని బాధ్యత లేదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• فضل عشر ذي الحجة على أيام السنة.
సంవత్సర ఇతర రోజులకంటే జిల్హిజ్జా మొదటి పదిరోజులకు ఎంతో ఘనత,ప్రాముఖ్యత ఉంది.

• ثبوت المجيء لله تعالى يوم القيامة وفق ما يليق به؛ من غير تشبيه ولا تمثيل ولا تعطيل.
ప్రళయ దినమున అల్లాహ్ రావటం ఆయనకు సముచితమైన దాని ప్రకారంగా ఎటువంటి పోలిక.సాదృశ్యం,అంతరాయం లేకుండా నిరూపణ.

• المؤمن إذا ابتلي صبر وإن أعطي شكر.
విశ్వాసపరుడు పరీక్షించబడినప్పుడు సహనం చూపుతాడు మరియు ఒక వేళ అతనికి ప్రసాదించబడితే కృతజ్ఞత తెలుపుకుంటాడు.

 
የይዘት ትርጉም ምዕራፍ: ሱረቱ አል ጋሺያህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት