የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቴሉጉ ቋንቋ ትርጉም - በዓብዱ ረሒም ኢብኑ ሙሐመድ * - የትርጉሞች ማዉጫ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

የይዘት ትርጉም ምዕራፍ: ሱረቱ አስ ሰጅደህ   አንቀጽ:

సూరహ్ అస్-సజ్దహ్

الٓمّٓ ۟ۚ
అలిఫ్-లామ్-మీమ్[1]
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
تَنْزِیْلُ الْكِتٰبِ لَا رَیْبَ فِیْهِ مِنْ رَّبِّ الْعٰلَمِیْنَ ۟ؕ
నిస్సంకోచంగా, ఈ గ్రంథం (ఖుర్ఆన్) అవతరణ సర్వలోకల ప్రభువు తరఫు నుండియే ఉంది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَمْ یَقُوْلُوْنَ افْتَرٰىهُ ۚ— بَلْ هُوَ الْحَقُّ مِنْ رَّبِّكَ لِتُنْذِرَ قَوْمًا مَّاۤ اَتٰىهُمْ مِّنْ نَّذِیْرٍ مِّنْ قَبْلِكَ لَعَلَّهُمْ یَهْتَدُوْنَ ۟
ఏమీ? వారు (అవిశ్వాసులు): "ఇతనే (ముహమ్మదే) దీనిని కల్పించాడు." అని అంటున్నారా?[1] అలా కాదు! వాస్తవానికి ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. నీకు పూర్వం హెచ్చరించే వారెవ్వరూ రాని జాతి వారికి నీవు హెచ్చరిక చేయటానికి, బహుశా వారు మార్గదర్శకత్వం పొందుతారేమోనని!
[1] అలాంటప్పుడు వారిని ఇలాంటి గ్రంథాన్ని రచించి తెమ్మను? అనే ప్రశ్నకు చూడండి, 17:88, 52:34. ఇలాంటి 10 సూరాహ్ లనైనా రచించి తెమ్మను? అనే ప్రశ్నకు, 11:13. ఇలాంటి ఒక్క సూరహ్ నైనా రచించి తెమ్మను? అనే ప్రశ్నకు, 2:23, 10:38.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَللّٰهُ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَا فِیْ سِتَّةِ اَیَّامٍ ثُمَّ اسْتَوٰی عَلَی الْعَرْشِ ؕ— مَا لَكُمْ مِّنْ دُوْنِهٖ مِنْ وَّلِیٍّ وَّلَا شَفِیْعٍ ؕ— اَفَلَا تَتَذَكَّرُوْنَ ۟
అల్లాహ్, ఆయనే ఆకాశాలను, భూమిని మరియు వాటి మధ్య ఉన్నదంతా ఆరు దినములలో (అయ్యామ్ లలో)[1] సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించాడు. ఆయన తప్ప మీకు మరొక సంరక్షకుడు గానీ, సిఫారసు చేసేవాడు గానీ ఎవ్వడూ లేడు, అయినా మీరు హితబోధ గ్రహించరా?
[1] చూడండి, 7:54 వ్యాఖ్యానం 1.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
یُدَبِّرُ الْاَمْرَ مِنَ السَّمَآءِ اِلَی الْاَرْضِ ثُمَّ یَعْرُجُ اِلَیْهِ فِیْ یَوْمٍ كَانَ مِقْدَارُهٗۤ اَلْفَ سَنَةٍ مِّمَّا تَعُدُّوْنَ ۟
ఆయనే ఆకాశం నుండి భూమి వరకు ప్రతి వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు; తరువాత అంతా ఒకే దినమున,[1] ఆయన వద్దకు పోయి చేరుతుంది; దాని (ఆ దినపు) పరిమాణం మీ లెక్క ప్రకారం వేయి సంవత్సరాలు.
[1] అంటే ఇది పునరుత్థానదినం అని, కొందరు వ్యాఖ్యాతలు బోధించారు. అది చాలా కష్టతరమైన దినం కావటం వల్ల వేయి సంవత్సరాల వలే కనిపిస్తుంది. చూడండి, 22:47లో కూడా: "…మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్ద ఒక్క వద్ద ఒక్క దినం, మీ లెక్కల ప్రకారం వేయి సంపత్సరాలకు సమానమైనది." అని ఉంది. కాని 70:4లో: "యాభై వేల సంవత్సరాలకు సమానమైన (ప్రమాణం గల) ఒక రోజులో, దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్ 'అ.స.) ఆయన (సు.తా.) వద్దకు అధిరోహిస్తారు." అని, ఉంది. అంటే వారు అంత తీవ్రంగా ప్రయాణం చేస్తారన్నమాట.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ذٰلِكَ عٰلِمُ الْغَیْبِ وَالشَّهَادَةِ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟ۙ
ఆయన (అల్లాహ్) యే అగోచర మరియు గోచర విషయాల జ్ఞానం గలవాడు, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
الَّذِیْۤ اَحْسَنَ كُلَّ شَیْءٍ خَلَقَهٗ وَبَدَاَ خَلْقَ الْاِنْسَانِ مِنْ طِیْنٍ ۟ۚ
ఆయన తాను సృష్టించిన ప్రతి దానిని ఉత్తమరీతిలో చేశాడు. మరియు మానవ సృష్టిని మట్టితో ప్రారంభించాడు.[1]
[1] చూడండి, 23:12.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ثُمَّ جَعَلَ نَسْلَهٗ مِنْ سُلٰلَةٍ مِّنْ مَّآءٍ مَّهِیْنٍ ۟ۚ
తరువాత అతని సంతతిని ఒక అధమమైన ద్రవపదార్థపు సారంతో (వీర్యంతో) చేశాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ثُمَّ سَوّٰىهُ وَنَفَخَ فِیْهِ مِنْ رُّوْحِهٖ وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْاَبْصَارَ وَالْاَفْـِٕدَةَ ؕ— قَلِیْلًا مَّا تَشْكُرُوْنَ ۟
ఆ తరువాత. అతనిని యుక్తమైన రూపంలో తీర్చిదిద్ది, అతనిలో తన (నుండి) ప్రాణం (ఆత్మ) ఊదాడు.[1] మరియు మీకు వినేశక్తిని, చూసేశక్తిని మరియు హృదయాలను (అర్థం చేసుకునే శక్తిని) ఇచ్చాడు. (అయినా) మీరు కృతజ్ఞతలు తెలుపు కునేది చాలా తక్కువ!
[1] చూడండి, 15:29, 38:72.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَقَالُوْۤا ءَاِذَا ضَلَلْنَا فِی الْاَرْضِ ءَاِنَّا لَفِیْ خَلْقٍ جَدِیْدٍ ؕ۬— بَلْ هُمْ بِلِقَآءِ رَبِّهِمْ كٰفِرُوْنَ ۟
మరియు వారు (అవిశాసులు) అంటున్నారు: "ఏమీ? మేము నశించి, మట్టిలో కలిసి పోయినా, మేము మళ్ళీ క్రొత్తగా సృష్టించబడతామా?" అది కాదు! వారు తమ ప్రభువుతో కాబోయే సమావేశాన్ని తిరస్కరిస్తున్నారు.[1]
[1] చూడండి, 13:5.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قُلْ یَتَوَفّٰىكُمْ مَّلَكُ الْمَوْتِ الَّذِیْ وُكِّلَ بِكُمْ ثُمَّ اِلٰی رَبِّكُمْ تُرْجَعُوْنَ ۟۠
వారితో ఇలా అను: "మీపై నియమించబడిన మృత్యుదూత మీ ప్రాణం తీస్తాడు. ఆ తరువాత మీరు మీ ప్రభువు వద్దకు మరలింపబడతారు."
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَوْ تَرٰۤی اِذِ الْمُجْرِمُوْنَ نَاكِسُوْا رُءُوْسِهِمْ عِنْدَ رَبِّهِمْ ؕ— رَبَّنَاۤ اَبْصَرْنَا وَسَمِعْنَا فَارْجِعْنَا نَعْمَلْ صَالِحًا اِنَّا مُوْقِنُوْنَ ۟
మరియు (పునరుత్థాన దినమున) ఈ అపరాధులు, తమ ప్రభువు సమక్షంలో, ఏ విధంగా తమ తలలు వంచుకొని నిలబడి ఉంటారో, నీవు చూడగలిగితే! వారు: "ఓ మా ప్రభూ! మేమిప్పుడు చూశాము మరియు విన్నాము, కావున మమ్మల్ని తిరిగి (భూలోకానికి) పంపించు. మేము సత్కార్యాలు చేస్తాము, నిశ్చయంగా, మాకు ఇప్పుడు నమ్మకం కలిగింది." అని అంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَوْ شِئْنَا لَاٰتَیْنَا كُلَّ نَفْسٍ هُدٰىهَا وَلٰكِنْ حَقَّ الْقَوْلُ مِنِّیْ لَاَمْلَـَٔنَّ جَهَنَّمَ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ اَجْمَعِیْنَ ۟
మరియు మేము కోరినట్లయితే, ప్రతి వ్యక్తికి (ఆత్మకు) దాని మార్గదర్శకత్వం చేసి ఉండేవారము.[1] కాని, నేను: "నిశ్చయంగా జిన్నాతులు మరియు మానవులందరితో నరకాన్ని నింపివేస్తాను." అని పలికిన, నా మాట సత్యమయ్యింది.[2]
[1] చూడండి, 26:4. అల్లాహ్ (సు.తా.) ఎవ్వరినీ సన్మార్గం మీద ఉండటానికి బలవంతం చేయడు కాని మార్గదర్శకత్వం చేస్తాడు. దానిని అనుసరించనివాడు శిక్షకు గురి అవుతాడు.
[2] ఇటువంటి వాక్యాలకు చూడండి, 7:18 మరియు 11:119.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَذُوْقُوْا بِمَا نَسِیْتُمْ لِقَآءَ یَوْمِكُمْ هٰذَا ۚ— اِنَّا نَسِیْنٰكُمْ وَذُوْقُوْا عَذَابَ الْخُلْدِ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟
కావున మీరు మీ యొక్క ఈనాటి సమావేశాన్ని మరచిపోయిన దాని ఫలితాన్ని రుచి చూడండి. నిశ్చయంగా, మేము కూడా మిమ్మల్ని మరచి పోయాము. మరియు మీరు మీ కర్మల ఫలితమైన ఈ శాశ్వత శిక్షను రుచి చూడండి!
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِنَّمَا یُؤْمِنُ بِاٰیٰتِنَا الَّذِیْنَ اِذَا ذُكِّرُوْا بِهَا خَرُّوْا سُجَّدًا وَّسَبَّحُوْا بِحَمْدِ رَبِّهِمْ وَهُمْ لَا یَسْتَكْبِرُوْنَ ۟
నిశ్చయంగా వారే, మా సూచనలు (ఆయాత్) వారికి బోధించినప్పుడు, వాటిని విశ్వసించి సాష్టాంగంలో (సజ్దాలో) పడిపోతారు మరియు తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతారు. మరియు ఆయనను స్తుతిస్తారు మరియు వారెన్నడూ గర్వపడరు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
تَتَجَافٰی جُنُوْبُهُمْ عَنِ الْمَضَاجِعِ یَدْعُوْنَ رَبَّهُمْ خَوْفًا وَّطَمَعًا ؗ— وَّمِمَّا رَزَقْنٰهُمْ یُنْفِقُوْنَ ۟
వారు (రాత్రులలో) తమ ప్రక్కలను తమ పరుపుల నుండి దూరం చేసి, తమ ప్రభువును భయంతో మరియు ఆశతో వేడుకుంటారు[1] మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చు చేస్తారు.
[1] రాత్రులలో లేచి తహజ్జుద్ (నఫిల్) నమాజులు చేస్తారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَلَا تَعْلَمُ نَفْسٌ مَّاۤ اُخْفِیَ لَهُمْ مِّنْ قُرَّةِ اَعْیُنٍ ۚ— جَزَآءً بِمَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచి పెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు.[1]
[1] 'హదీస్' ఖుద్సీ: నేను నా పుణ్యాత్ములైన దాసుల కొరకు స్వర్గంలో సిద్ధపరచి ఉంచిన వాటిని ఇంతవరకు ఏ కన్నూ చూడలేదు, ఏ చెవీ వినలేదు మరియు ఏ మానవుడు కూడా వాటిని గురించి ఆలోచించడు, ('స'హీ'హ్ బు'ఖారీ మరియు 'స.ముస్లిం).
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَفَمَنْ كَانَ مُؤْمِنًا كَمَنْ كَانَ فَاسِقًا ؔؕ— لَا یَسْتَوٗنَ ۟
ఏమీ? విశ్వాసి అయినవాడు (దైవభీతి లేని) అవిధేయునితో సమానుడా? (కాదు!) వారు సరిసమానులు కాలేరు.[1]
[1] ఇటువంటి ఆయతులకు చూడండి, 45:21, 38:28, 59:20 మొదలైనవి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَمَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَلَهُمْ جَنّٰتُ الْمَاْوٰی ؗ— نُزُلًا بِمَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో వారికి వారి కర్మల ఫలితంగా, వారి ఆతిథ్యం కొరకు స్వర్గవనాలలో నివాసాలుంటాయి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاَمَّا الَّذِیْنَ فَسَقُوْا فَمَاْوٰىهُمُ النَّارُ ؕ— كُلَّمَاۤ اَرَادُوْۤا اَنْ یَّخْرُجُوْا مِنْهَاۤ اُعِیْدُوْا فِیْهَا وَقِیْلَ لَهُمْ ذُوْقُوْا عَذَابَ النَّارِ الَّذِیْ كُنْتُمْ بِهٖ تُكَذِّبُوْنَ ۟
ఇక ఎవరైతే, విద్రోహ వైఖరి అవలంబిస్తారో, వారి నివాసం నరకాగ్నియే. ప్రతిసారి వారు దాని నుండి బయట పడటానికి ప్రయత్నించినప్పుడల్లా, వారందులోకి తిరిగి నెట్టబడతారు. మరియు వారితో ఇలా అనబడుతుంది: "మీరు తిరస్కరిస్తూ ఉండిన నరకాగ్ని శిక్షను చవి చూడండి."
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَنُذِیْقَنَّهُمْ مِّنَ الْعَذَابِ الْاَدْنٰی دُوْنَ الْعَذَابِ الْاَكْبَرِ لَعَلَّهُمْ یَرْجِعُوْنَ ۟
మరియు ఆ పెద్ద శిక్షకు ముందు మేము (ఇహలోకంలో) వారికి సమీప శిక్షను రుచి చూపుతాము.[1] బహుశా, వారు (పశ్చాత్తాప పడి సత్కార్యాల వైపునకు) మరలి వస్తారేమోనని!
[1] చూడండి, 52:47.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَمَنْ اَظْلَمُ مِمَّنْ ذُكِّرَ بِاٰیٰتِ رَبِّهٖ ثُمَّ اَعْرَضَ عَنْهَا ؕ— اِنَّا مِنَ الْمُجْرِمِیْنَ مُنْتَقِمُوْنَ ۟۠
మరియు తన ప్రభువు సూచన (ఆయాత్) ల ద్వారా హితబోధ చేయబడిన తరువాత కూడా, వాటి నుండి విముఖుడయ్యే వాని కంటే ఎక్కువ దుర్మార్గుడెవడు? నిశ్చయంగా, మేము అలాంటి అపరాధులకు ప్రతీకారం[1] చేసి తీరుతాము.
[1] అల్-ముంతఖిమ్ (సేకరించబడిన పదం):ప్రతీకారం తీర్చుకునే, ప్రతీకారం చేసే, దుష్టులను శిక్షించే వాడు. చూడండి, 30:47.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَقَدْ اٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ فَلَا تَكُنْ فِیْ مِرْیَةٍ مِّنْ لِّقَآىِٕهٖ وَجَعَلْنٰهُ هُدًی لِّبَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ۚ
మరియు వాస్తవంగా, మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. కావున, (ఓ ప్రవక్తా!) నీవు అతనిని (ఇస్రా రాత్రిలో) కలుసుకోబోయే విషయాన్ని గురించి సందేహంలో పడకు.[1] మరియు మేము దానిని (తౌరాత్ ను) ఇస్రాయీల్ సంతతి వారికి మార్గదర్శినిగా చేశాము.[2]
[1] మహాప్రవక్త ('స'అస) మె'అరాజ్ రాత్రిలో మూసా ('అ.స.) ను కలుసుకున్నప్పుడు అతను, దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస)కు, అల్లాహ్ (సు.తా.) ను వేడుకొని, నమా'జ్ ల సంఖ్యను, తగ్గించుకోమని సలహా ఇచ్చిన విషయాన్ని ఈ ఆయత్ సూచిస్తుందని వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు.
[2] ఇక్కడ సంబోధన మూసా ('అ.స.) కు కూడా కావచ్చు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَجَعَلْنَا مِنْهُمْ اَىِٕمَّةً یَّهْدُوْنَ بِاَمْرِنَا لَمَّا صَبَرُوْا ؕ۫— وَكَانُوْا بِاٰیٰتِنَا یُوْقِنُوْنَ ۟
మరియు మేము (ఇస్రాయీల్ సంతతి) వారిలో నుండి కొందరిని నాయకులుగా చేశాము. వారు, వారికి మా ఆజ్ఞానుసారంగా మార్గదర్శకత్వం చేస్తూ ఉన్నారు - ఎంత వరకైతే వారు సహనం వహించి ఉన్నారో మరియు వారు మా ఆయాత్ (సూచనలను) నమ్ముతూ ఉన్నారో!
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِنَّ رَبَّكَ هُوَ یَفْصِلُ بَیْنَهُمْ یَوْمَ الْقِیٰمَةِ فِیْمَا كَانُوْا فِیْهِ یَخْتَلِفُوْنَ ۟
నిశ్చయంగా, నీ ప్రభువు, పునరుత్థాన దినమున, వారికున్న భేదాభిప్రాయాలను గురించి వారి మధ్య తీర్పు చేస్తాడు.[1]
[1] చూడండి, 22:67-69.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَوَلَمْ یَهْدِ لَهُمْ كَمْ اَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِّنَ الْقُرُوْنِ یَمْشُوْنَ فِیْ مَسٰكِنِهِمْ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ ؕ— اَفَلَا یَسْمَعُوْنَ ۟
ఏమీ? వీరికి పూర్వం అనేక తరాలను నాశనం చేసిన విషయం వీరికి మార్గదర్శకత్వం కాదా? వీరు, వారి నివాసస్థలాలలో తిరుగుతున్నారు కదా! నిశ్చయంగా ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఏమీ? వీరు వినటం లేదా?
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَوَلَمْ یَرَوْا اَنَّا نَسُوْقُ الْمَآءَ اِلَی الْاَرْضِ الْجُرُزِ فَنُخْرِجُ بِهٖ زَرْعًا تَاْكُلُ مِنْهُ اَنْعَامُهُمْ وَاَنْفُسُهُمْ ؕ— اَفَلَا یُبْصِرُوْنَ ۟
ఏమీ? వారు చూడటం లేదా? నిశ్చయంగా, మేము ఒక బంజరు భూమి వైపునకు నీళ్ళను (వర్షాన్ని) పంపి దాని నుండి పైరును ఉత్పత్తి చేస్తే, దానిని వారి పశువులు మరియు వారూ తింటున్నారని. ఏమీ? వారిది గమనించటం (చూడటం) లేదా?
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَیَقُوْلُوْنَ مَتٰی هٰذَا الْفَتْحُ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
ఇంకా ఇలా అంటున్నారు: "మీరు సత్యవంతులే అయితే, ఆ తీర్పు ఎప్పుడు వస్తుందో చెప్పండి!"[1]
[1] ఇక్కడ తీర్పు అంటే, ఆ తీర్పు దేనినైతే ముష్రిక్ ఖురైషులు తమ మీదికి తెమ్మని దైవప్రవక్త('స'అస) ను హేళనతో అడిగేవారో. అంటే అల్లాహ్ (సు.తా.) శిక్ష.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قُلْ یَوْمَ الْفَتْحِ لَا یَنْفَعُ الَّذِیْنَ كَفَرُوْۤا اِیْمَانُهُمْ وَلَا هُمْ یُنْظَرُوْنَ ۟
ఇలా అను: "ఆ తీర్పుదినం నాడు[1] సత్యతిరస్కారులు విశ్వసించ గోరినా, అది వారికి ఏ విధంగానూ పనికిరాదు! మరియు వారికెలాంటి గడువు కూడా ఇవ్వబడదు."
[1] ఇక్కడ తీర్పుదినం అంటే పునరుత్థాన దినం.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَاَعْرِضْ عَنْهُمْ وَانْتَظِرْ اِنَّهُمْ مُّنْتَظِرُوْنَ ۟۠
కావున నీవు వారితో విముఖుడవగు![1] మరియు వేచి ఉండు నిశ్చయంగా, వారు కూడా (ఆ దినం కొరకు) వేచి ఉంటారు.
[1] చూడండి, 6:106.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
 
የይዘት ትርጉም ምዕራፍ: ሱረቱ አስ ሰጅደህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቴሉጉ ቋንቋ ትርጉም - በዓብዱ ረሒም ኢብኑ ሙሐመድ - የትርጉሞች ማዉጫ

የተከበረው ቁርአን ቴሉጉ ቋንቋ መልዕክተ ትርጉም - በዓብዱ ረሒም ኢብን ሙሓመድ

መዝጋት