የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቴሉጉ ቋንቋ ትርጉም - በዓብዱ ረሒም ኢብኑ ሙሐመድ * - የትርጉሞች ማዉጫ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

የይዘት ትርጉም ምዕራፍ: ሱረቱ አስ ሶፍ   አንቀጽ:

సూరహ్ అస్-సఫ్

سَبَّحَ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ۚ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟
ఆకాశాలలోనున్న సమస్తమూ మరియు భూమిలోనున్న సమస్తమూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لِمَ تَقُوْلُوْنَ مَا لَا تَفْعَلُوْنَ ۟
ఓ విశ్వాసులారా! మీరు చేయని దానిని ఎందుకు పలుకుతున్నారు?[1]
[1] ఈ ఆయత్ ఉ'హూద్ యుద్ధరంగంలో దైవప్రవక్త ('స'అస) అనుమతి లేనిదే తమ స్థానాలను వదలి విజయధనాన్ని ప్రోగు చేసుకోవటానికి వెళ్ళిన 'స'హాబా (ర.'ది. 'అన్హుమ్) లను గురించి ఉంది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
كَبُرَ مَقْتًا عِنْدَ اللّٰهِ اَنْ تَقُوْلُوْا مَا لَا تَفْعَلُوْنَ ۟
మీరు చేయని దానిని పలకటం అల్లాహ్ దృష్టిలో చాలా అసహ్యకరమైన విషయం.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِنَّ اللّٰهَ یُحِبُّ الَّذِیْنَ یُقَاتِلُوْنَ فِیْ سَبِیْلِهٖ صَفًّا كَاَنَّهُمْ بُنْیَانٌ مَّرْصُوْصٌ ۟
నిశ్చయంగా, అల్లాహ్! తన మార్గంలో దృఢమైన కట్టడం వలే బారులు తీరి పోరాడే వారిని ప్రేమిస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاِذْ قَالَ مُوْسٰی لِقَوْمِهٖ یٰقَوْمِ لِمَ تُؤْذُوْنَنِیْ وَقَدْ تَّعْلَمُوْنَ اَنِّیْ رَسُوْلُ اللّٰهِ اِلَیْكُمْ ؕ— فَلَمَّا زَاغُوْۤا اَزَاغَ اللّٰهُ قُلُوْبَهُمْ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الْفٰسِقِیْنَ ۟
మరియు మూసా తన జాతివారితో ఇలా అన్న విషయం (జ్ఞాపకం చేసుకోండి): "ఓ నా జాతి ప్రజలారా! వాస్తవానికి, నేను మీ వద్దకు పంపబడిన అల్లాహ్ యొక్క సందేశహరుడనని రూఢిగా తెలిసి కూడా, మీరు నన్ను ఎందుకు బాధిస్తున్నారు?" అయినా వారు వక్రమార్గం అవలంబించినందుకు, అల్లాహ్ వారి హృదయాలను వక్రమార్గంలో పడవేశాడు. మరియు అల్లాహ్ దుర్జనులకు (ఫాసిఖీన్ లకు) సన్మార్గం చూపడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاِذْ قَالَ عِیْسَی ابْنُ مَرْیَمَ یٰبَنِیْۤ اِسْرَآءِیْلَ اِنِّیْ رَسُوْلُ اللّٰهِ اِلَیْكُمْ مُّصَدِّقًا لِّمَا بَیْنَ یَدَیَّ مِنَ التَّوْرٰىةِ وَمُبَشِّرًا بِرَسُوْلٍ یَّاْتِیْ مِنْ بَعْدِی اسْمُهٗۤ اَحْمَدُ ؕ— فَلَمَّا جَآءَهُمْ بِالْبَیِّنٰتِ قَالُوْا هٰذَا سِحْرٌ مُّبِیْنٌ ۟
మరియు మర్యమ్ కుమారుడు ఈసా[1] (తన జాతి వారితో) ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన అల్లాహ్ యొక్క సందేశహరుణ్ణి, నాకు పూర్వం, వచ్చి ఉన్న తౌరాత్ గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. మరియు నా తరువాత అహ్మద్[2] అనే సందేశహరుడు రాబోతున్నాడు, అనే శుభవార్తను ఇస్తున్నాను." తరువాత అతను (అహ్మద్)[3] వారి వద్దకు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినపుడు వారు ఇలా అన్నారు: "ఇది కేవలం స్పష్టమైన మంత్రజాలమే!"
[1] ఇస్రాయీ'ల్ సంతతివారు ఏ విధంగా మూసా ('అ.స.) ఆదేశాలను ఉల్లంఘించారో! అదే విధంగా వారు 'ఈసా ('అ.స.) ను కూడా తిరస్కరించారు. అలాంటప్పుడు దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస)ను యూదులు తిరస్కరించడం క్రొత్త విషయమేమీ కాదు. వారి చరిత్ర చూస్తే వారు ఎందరో దైవప్రవక్త ('అ.స.)లను తిరస్కరించారు మరియు కొందరిని చంపారు. 'ఈసా ('అ.స.) తౌరాతును ధృవపరిచారు.
[2] 'ఈసా ('అ.స.) తన తరువాత అ'హ్మద్ అనే ప్రవక్త ('స'అస) రానున్నాడు, అనే శుభవార్తను వినిపిస్తున్నారు. అతను ('స'అస) ఇలా అన్నారు : 'నేను నా తండ్రి, ఇబ్రాహీమ్ ('అ.స.) ప్రార్థన (దు'ఆ)ను మరియు 'ఈసా ('అ.స.) సూచన (బషారత్) ను' (అయ్ సర్ అత్తఫాసీర్). 'హమ్ద్ అంటే ప్రశంస (praise, laudation). అ'హ్మద్ అనే పదాన్ని దాని ఫా'ఇల్ రూపంలో తీసుకుంటే అల్లాహుతాలాను అందరికంటే అధికంగా స్తుంతేవాడు మరియు మఫ్'ఊల్ రూపంలో తీసుకుంటే అత్యధికంగా కొనియాడబడినవాడు, అనే అర్థాలు వస్తాయి. (ఫ'త్హ్ అల్-ఖదీర్).
[3] హిందూ ధర్మం గ్రంథాలలో కూడా అ'హ్మద్ అనే అంతిమ ఋషి రానున్నాడని ఎన్నో చోట్లలో పేర్కొనబడింది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰی عَلَی اللّٰهِ الْكَذِبَ وَهُوَ یُدْعٰۤی اِلَی الْاِسْلَامِ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟ۚ
తనను ఇస్లామ్ వైపునకు పిలిచినప్పుడు, అల్లాహ్ మీద అపనిందలు మోపే వాని కంటే పరమ దుర్మార్గుడు ఎవడు? మరియు అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు మార్గదర్శకత్వం చేయడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
یُرِیْدُوْنَ لِیُطْفِـُٔوْا نُوْرَ اللّٰهِ بِاَفْوَاهِهِمْ ؕ— وَاللّٰهُ مُتِمُّ نُوْرِهٖ وَلَوْ كَرِهَ الْكٰفِرُوْنَ ۟
వారు అల్లాహ్ జ్యోతిని (ఇస్లాంను) తమ నోటితో ఊది, ఆర్పి వేయాలనుకుంటున్నారు. కాని సత్యతిరస్కారులకు ఎంత అసహ్యకరమైనా! అల్లాహ్ తన జ్యోతిని వ్యాపింపజేయాలని నిర్ణయించుకున్నాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
هُوَ الَّذِیْۤ اَرْسَلَ رَسُوْلَهٗ بِالْهُدٰی وَدِیْنِ الْحَقِّ لِیُظْهِرَهٗ عَلَی الدِّیْنِ كُلِّهٖ ۙ— وَلَوْ كَرِهَ الْمُشْرِكُوْنَ ۟۠
ఆయనే, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్ని ఇచ్చి పంపి, దానిని సకల ధర్మాలపై ఆధిక్యత వహించే ధర్మంగా చేశాడు[1] - అది బహుదైవారాధకులకు ఎంత అసహ్యకరమైనా!
[1] చూడండి, 3:19.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا هَلْ اَدُلُّكُمْ عَلٰی تِجَارَةٍ تُنْجِیْكُمْ مِّنْ عَذَابٍ اَلِیْمٍ ۟
ఓ విశ్వాసులారా! మిమ్మల్ని బాధాకరమైన శిక్ష నుండి కాపాడే వ్యాపారాన్ని మీకు సూచించాలా?[1]
[1] చూఅంటే విశ్వాసం మరయు అల్లాహ్ (సు.తా.) మార్గంలో జిహాద్. ఎందుకంటే వీటిలో కూడా వ్యాపారంలో దొరికినట్లు లాభం దొరుకుతుంది. అది స్వర్గప్రవేశం. దీని కంటే మంచి లాభం ఇంకేముంటుంది. ఇంకా చూడండి, 9:111.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
تُؤْمِنُوْنَ بِاللّٰهِ وَرَسُوْلِهٖ وَتُجَاهِدُوْنَ فِیْ سَبِیْلِ اللّٰهِ بِاَمْوَالِكُمْ وَاَنْفُسِكُمْ ؕ— ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟ۙ
(అది), మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించడం మరియు అల్లాహ్ మార్గంలో మీ సంపదలను మరియు మీ ప్రాణాలను వినియోగించి పోరాడటం. మీరు తెలుసుకుంటే! ఇదే మీకు ఎంతో మేలైనది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
یَغْفِرْ لَكُمْ ذُنُوْبَكُمْ وَیُدْخِلْكُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ وَمَسٰكِنَ طَیِّبَةً فِیْ جَنّٰتِ عَدْنٍ ؕ— ذٰلِكَ الْفَوْزُ الْعَظِیْمُ ۟ۙ
(ఇలా చేస్తే) ఆయన మీ పాపాలను క్షమిస్తాడు మరియు మిమ్మల్ని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో[1] ప్రవేశింపజేస్తాడు. మరియు శాశ్వతమైన స్వర్గవనాలలో మంచి గృహాలను ప్రసాదిస్తాడు. అదే ఆ గొప్ప విజయం.
[1] చూడండి, 38:50.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاُخْرٰی تُحِبُّوْنَهَا ؕ— نَصْرٌ مِّنَ اللّٰهِ وَفَتْحٌ قَرِیْبٌ ؕ— وَبَشِّرِ الْمُؤْمِنِیْنَ ۟
మరియు మీకు ప్రీతికరమైన, మరొక (అనుగ్రహం) కూడా ఉంది! (అది) అల్లాహ్ సహాయం మరియు శీఘ్ర విజయం. మరియు ఈ శుభవార్తను విశ్వాసులకు తెలుపు.[1]
[1] మీరు అల్లాహ్ (సు.తా.) మార్గంలో పోరాడితే మీకు విజయం లభిస్తుంది. చూడండి, 47:7 మరియు 22:40 ఇంకా చూడండి 3:139.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا كُوْنُوْۤا اَنْصَارَ اللّٰهِ كَمَا قَالَ عِیْسَی ابْنُ مَرْیَمَ لِلْحَوَارِیّٖنَ مَنْ اَنْصَارِیْۤ اِلَی اللّٰهِ ؕ— قَالَ الْحَوَارِیُّوْنَ نَحْنُ اَنْصَارُ اللّٰهِ فَاٰمَنَتْ طَّآىِٕفَةٌ مِّنْ بَنِیْۤ اِسْرَآءِیْلَ وَكَفَرَتْ طَّآىِٕفَةٌ ۚ— فَاَیَّدْنَا الَّذِیْنَ اٰمَنُوْا عَلٰی عَدُوِّهِمْ فَاَصْبَحُوْا ظٰهِرِیْنَ ۟۠
ఓ విశ్వాసులారా! మర్యమ్ కుమారుడు ఈసా తన శిష్యులకు (హవారియ్యూన్ లకు) ఉపదేశించిన విధంగా, మీరు కూడా అల్లాహ్ కు సహాయకులుగా ఉండండి. (ఆయన వారితో ఇలా అన్నాడు): "అల్లాహ్ మార్గంలో నాకు తోడ్పడేవారు ఎవరు?" ఆ శిష్యులు ఇలా జవాబిచ్చారు: "మేము అల్లాహ్ (మార్గంలో) తోడ్పడే వారము!" అప్పుడు ఇస్రాయీల్ సంతతి వారిలో ఒక వర్గం వారు విశ్వసించారు, మరొక వర్గం వారు తిరస్కరించారు. తరువాత మేము విశ్వసించిన వారికి, వారి శత్రువులకు వ్యతిరేకంగా సహాయం చేశాము, కావున వారు ఆధిక్యతను పొందారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
 
የይዘት ትርጉም ምዕራፍ: ሱረቱ አስ ሶፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቴሉጉ ቋንቋ ትርጉም - በዓብዱ ረሒም ኢብኑ ሙሐመድ - የትርጉሞች ማዉጫ

የተከበረው ቁርአን ቴሉጉ ቋንቋ መልዕክተ ትርጉም - በዓብዱ ረሒም ኢብን ሙሓመድ

መዝጋት