ترجمة معاني القرآن الكريم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - فهرس التراجم


ترجمة معاني آية: (37) سورة: الأحزاب
وَاِذْ تَقُوْلُ لِلَّذِیْۤ اَنْعَمَ اللّٰهُ عَلَیْهِ وَاَنْعَمْتَ عَلَیْهِ اَمْسِكْ عَلَیْكَ زَوْجَكَ وَاتَّقِ اللّٰهَ وَتُخْفِیْ فِیْ نَفْسِكَ مَا اللّٰهُ مُبْدِیْهِ وَتَخْشَی النَّاسَ ۚ— وَاللّٰهُ اَحَقُّ اَنْ تَخْشٰىهُ ؕ— فَلَمَّا قَضٰی زَیْدٌ مِّنْهَا وَطَرًا زَوَّجْنٰكَهَا لِكَیْ لَا یَكُوْنَ عَلَی الْمُؤْمِنِیْنَ حَرَجٌ فِیْۤ اَزْوَاجِ اَدْعِیَآىِٕهِمْ اِذَا قَضَوْا مِنْهُنَّ وَطَرًا ؕ— وَكَانَ اَمْرُ اللّٰهِ مَفْعُوْلًا ۟
ఓ ప్రవక్తా ఎవరిపైనైతే అల్లాహ్ ఇస్లాం అనుగ్రహం ద్వారా అనుగ్రహించాడో మరియు మీరు బానిసత్వము నుండి విముక్తి కలిగించటం ద్వారా అతనిపై అనుగ్రహించారో అతనితో మీరు అన్నప్పటి వైనమును ఒక సారి గుర్తు చేసుకోండి - దీని ఉద్దేశము జైద్ బిన్ హారిసహ్ రజిఅల్లాహు అన్హుమా ఎందుకంటే ఆయన తన భార్య జైనబ్ బిన్తె జహష్ రజిఅల్లాహు అన్,హా ను విడాకులు ఇచ్చే విషయంలో సలహా కోరుతు మీ వద్దకు వచ్చారు. - మీరు ఆయనతో ఇలా పలికారు నీవు నీ భార్యను నీ వద్దే ఉండనీ మరియు ఆమెకు విడాకులివ్వకు. మరియు నీవు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయపడు. వాస్తవానికి ఓ ప్రవక్తా మీరు ప్రజలకు భయపడి అల్లాహ్ జైనబ్ తో మీ వివాహం గురించి మీకు చేసిన దైవ వాణి ని మీ మనస్సులో దాచి పెట్టారు. మరియు అల్లాహ్ తొందరలోనే జైద్ ఆమెకు విడాకులిచ్చే విషయమును,ఆ తరువాత ఆమెతో మీ వివాహ విషయమును బహిర్గతం చేస్తాడు. మరియు ఈ విషయంలో మీరు భయపడటానికి అల్లాహ్ ఎక్కువ యోగ్యత కలవాడు. జైద్ మనస్సుకు మంచిగా అనిపించి ఆమెను ఆయన ఇష్టపడక ఆమెను విడాకులిచ్చినప్పుడు మేము ఆమెతో మీ వివాహం చేయించాము. ఎందు కంటే దత్త పుత్రులు తమ భార్యలను విడాకులిచ్చినప్పుడు వారి ఇద్దత్ గడువు పూర్తయిన తరువాత దత్తపుత్రుల భార్యలతో వివాహం చేసుకోవటంలో విశ్వాసపరులపై ఎటువంటి పాపం ఉండకుండా ఉండటానికి. మరియు అల్లాహ్ ఆదేశం జరిగి తీరుతుంది దానికి ఎటువంటి ఆటంకము ఉండదు. మరియు ఎటువంటి అభ్యంతరముండదు.
التفاسير العربية:
من فوائد الآيات في هذه الصفحة:
• وجوب استسلام المؤمن لحكم الله والانقياد له.
అల్లాహ్ ఆదేశము కొరకు విశ్వాసపరుడు సమర్పించుకోవటం,ఆయనకు విధేయుడవటం తప్పనిసరి.

• اطلاع الله على ما في النفوس.
మనస్సుల్లో ఉన్న వాటిని అల్లాహ్ తెలుసుకోవటం.

• من مناقب أم المؤمنين زينب بنت جحش: أنْ زوّجها الله من فوق سبع سماوات.
విశ్వాసపరుల తల్లి అయిన జైనబ్ బిన్తె జహష్ రజిఅల్లాహు అన్,హా యొక్క ఘనతల్లోంచి అల్లాహ్ సప్తాకాశముల పై నుంచి ఆమె వివాహము చేశాడు.

• فضل ذكر الله، خاصة وقت الصباح والمساء.
అల్లాహ్ స్మరణ ప్రాముఖ్యత ప్రత్యేకించి ఉదయము,సాయంత్రం వేళ.

 
ترجمة معاني آية: (37) سورة: الأحزاب
فهرس السور رقم الصفحة
 
ترجمة معاني القرآن الكريم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - فهرس التراجم

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

إغلاق