ترجمة معاني القرآن الكريم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - فهرس التراجم


ترجمة معاني آية: (25) سورة: النساء
وَمَنْ لَّمْ یَسْتَطِعْ مِنْكُمْ طَوْلًا اَنْ یَّنْكِحَ الْمُحْصَنٰتِ الْمُؤْمِنٰتِ فَمِنْ مَّا مَلَكَتْ اَیْمَانُكُمْ مِّنْ فَتَیٰتِكُمُ الْمُؤْمِنٰتِ ؕ— وَاللّٰهُ اَعْلَمُ بِاِیْمَانِكُمْ ؕ— بَعْضُكُمْ مِّنْ بَعْضٍ ۚ— فَانْكِحُوْهُنَّ بِاِذْنِ اَهْلِهِنَّ وَاٰتُوْهُنَّ اُجُوْرَهُنَّ بِالْمَعْرُوْفِ مُحْصَنٰتٍ غَیْرَ مُسٰفِحٰتٍ وَّلَا مُتَّخِذٰتِ اَخْدَانٍ ۚ— فَاِذَاۤ اُحْصِنَّ فَاِنْ اَتَیْنَ بِفَاحِشَةٍ فَعَلَیْهِنَّ نِصْفُ مَا عَلَی الْمُحْصَنٰتِ مِنَ الْعَذَابِ ؕ— ذٰلِكَ لِمَنْ خَشِیَ الْعَنَتَ مِنْكُمْ ؕ— وَاَنْ تَصْبِرُوْا خَیْرٌ لَّكُمْ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ ۟۠
ఓ పురుషులారా మీలో నుండి ఎవరికైన సంపద తక్కువగా ఉండటం వలన స్వతంత్ర స్త్రీలతో వివాహమాడే స్థోమత లేకపోతే వారు ఇతరులకు చెందిన బానిస స్త్రీలను వివాహం చేసుకోవటం సమ్మతము. ఒక వేళ వారు మీకు కనిపించే వాటిపై విశ్వాసులైతే. మరియు మీ విశ్వాసము యొక్క వాస్తవికత మరియు మీ పరిస్థితుల అంతరంగాల గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు మీరు,వారు ధర్మంలో మరియు మానవత్వంలో సమానులు. కావున మీరు వారితో వివాహం చేసుకోవటమును మానుకోకండి. మీరు వారి యజమానుల అనుమతితో వారితో వివాహం చేసుకోండి. మరియు మీరు వారి మహర్ ను తగ్గించకుండా,వాయిదా వేయకుండా వారికి ఇవ్వండి.ఈ ఆదేశం ఒక వేళ వారు బహిరంగంగా వ్యభిచారానికి పాల్పడని సౌశీల్యవంతులై ఉండి,తమతో వ్యభిచారము కొరకు రహస్యంగా స్నేహ సంబంధాలు ఏర్పరచుకోని వారై ఉంటేనే. వారు వివాహ బంధంలో కట్టుబడినప్పుడు ఆ తరువాత వారు వ్యభిచార అశ్లీల కార్యమునకు ఒడిగడితే అప్పుడు మీరు స్వతంత్రులగు స్త్రీలకు విధించే సగం శిక్ష యాభై కొరడా దెబ్బలు కొట్టడం విధించండి. వారిని రాళ్ళతో కొట్టకండి. వివాహిత స్వతంత్రులైన స్త్రీలు వ్యభిచారం చేసినప్పుడు విధించే దానికి వ్యతిరేకంగా. ఈ ప్రస్తావించబడిన విశ్వాసులైన సౌశీల్యవంతులైన బానిస స్త్రీలతో వివాహం చేసుకోవటం సమ్మతించబడటం, తాను వ్యభిచారంలో పడతానని భయపడేవారికి మరియు స్వతంత్రులైన స్త్రీలతో వివాహం చేసుకునే స్థోమత లేని వారికి వెసులబాటు. అయితే బానిస స్త్రీలతో వివాహం కంటే ఆత్మ నిగ్రహరణ (సహనం) చాలా ముఖ్యం. సంతానమును బానిసత్వం నుండి రక్షించటానికి. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారిని మన్నించేవాడు. వారిపై కరుణించేవాడు. వ్యభిచార భయమున్నప్పుడు స్వతంత్ర స్త్రీలను వివాహం చేసుకునే స్థోమత లేని స్థితిలో వారి కొరకు బానిస స్త్రీలతో వివాహం చేసుకోవటం ధర్మబద్ధం చేయటం ఆయన కరుణలో నుంచే.
التفاسير العربية:
من فوائد الآيات في هذه الصفحة:
• حُرمة نكاح المتزوجات: حرائر أو إماء حتى تنقضي عدتهن أيًّا كان سبب العدة.
వివాహితురాలైన స్త్రీలతో నికాహ్ నిషిద్ధము వారు స్వతంతృలైన లేదా బానిసలైన ఇద్దత్ కు ఏదైన కారణమైన వారి ఇద్దత్ ముగిసేంతవరకు.

• أن مهر المرأة يتعين بعد الدخول بها، وجواز أن تحط بعض مهرها إذا كان بطيب نفس منها.
స్త్రీ యొక్క మహర్ ఆమెతో సంభోగము చేసిన తరువాత నిర్ధారించబడుతుంది. మరియు ఆమె తన మహర్ లో నుంచి కొంత భాగమును తన మంచి మనస్సుతో తగ్గించటం సమ్మతము.

• جواز نكاح الإماء المؤمنات عند عدم القدرة على نكاح الحرائر؛ إذا خاف على نفسه الوقوع في الزنى.
స్వతంత్ర స్త్రీలతో వివాహం చేసుకునే సామర్ధ్యము లేనప్పుడు తన స్వయం పై వ్యభిచారములో పడే భయం కలిగితే విశ్వాసపరులైన బానిస స్త్రీలను వివాహం చేసుకోవటం సమ్మతము.

• من مقاصد الشريعة بيان الهدى والضلال، وإرشاد الناس إلى سنن الهدى التي تردُّهم إلى الله تعالى.
సన్మార్గము మరియు అపమార్గము విశదపరచటం మరియు ప్రజలను వారికి మహోన్నతుడైన అల్లాహ్ వైపునకు మరలింపజేసే సన్మార్గపు పద్దతుల వైపుకు మార్గదర్శకం చేయటం ధర్మ లక్ష్యముల్లోంచిది.

 
ترجمة معاني آية: (25) سورة: النساء
فهرس السور رقم الصفحة
 
ترجمة معاني القرآن الكريم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - فهرس التراجم

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

إغلاق