ఏమీ? వారు తమలో తాము (ఎన్నడూ) ఆలోచించలేదా? ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్య ఉన్నదంతా, అల్లాహ్ సత్యంతో ఒక నిర్ణీత గడువు కొరకు మాత్రమే సృష్టించాడని? అయినా నిశ్చయంగా ప్రజలలో చాలా మంది తమ ప్రభువును దర్శించవలసి వున్న వాస్తవాన్ని తిరస్కరిస్తున్నారు.
ఏమీ? వీరు భూమిపై ప్రయాణం చేయలేదా? వీరి పూర్వీకుల గతి ఏమయిందో చూడటానికి? వారు, వీరి కంటే ఎక్కువ బలవంతులుగా ఉండేవారు మరియు వారు భూమిని బాగా దున్నేవారు, సేద్యం చేసేవారు మరియు దానిపై, వీరి కట్టడాల కంటే ఎక్కువ కట్టడాలు కట్టారు[1] మరియు వారి వద్దకు వారి సందేశహరులు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.
[1] వంకర అక్షరాలలో ఉన్న వాక్యం నోబుల్ ఖుర్ఆన్ లో ఈ విధంగా వ్యాఖ్యానించబడింది: "వారు దానిని వీరి కంటే ఎక్కువ సంఖ్యంలో వసింపజేశారు."
మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ సర్వస్తోత్రాలు ఆయన (అల్లాహ్) కే మరియు సంధ్యాకాలంలోనూ మరియు మధ్యాహ్న కాలంలోనూ (స్తోత్రాలు ఆయనకే)![1]
[1] ఈ రెండు ఆయతులలో ప్రతి దినపు ఐదు నమా'జుల ప్రస్తావన ఉంది. తుమ్సూన అంటే మగ్రిబ్ మరియు ఇషా నమా'జులు. తు'స్ బి'హూన అంటే ఫజ్ర్ నమా'జు అని అర్థం (ఫ'త్హ్ అల్-ఖదీర్). ఇంకా చూడండి, 11:114, 17:78 20:130.
ఆయన సజీవిని నిర్జీవి నుండి తీస్తాడు. మరియు నిర్జీవిని సజీవి నుండి తీస్తాడు. మరియు ఆయన భూమి మృతి చెందిన తరువాత దానికి ప్రాణం పోస్తాడు. ఇదే విధంగా మీరు కూడా (గోరీల నుండి) వెలికి తీయబడతారు.
మరియు ఆయన సూచనలలో; ఆయన మీ కొరకు మీ జాతి నుండియే - మీరు వారి వద్ద సౌఖ్యం పొందటానికి - మీ సహవాసులను (అజ్వాజ్ లను) పుట్టించి, మీ మధ్య ప్రేమను మరియు కారుణ్యాన్ని కలిగించడం. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలున్నాయి.
మరియు ఆయన సూచనలలో ఆయన ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించడం; మరియు మీ భాషలలో మరియు మీ రంగులలో ఉన్న విభేదాలు కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో జ్ఞానులకు ఎన్నో సూచనలున్నాయి.
మరియు ఆయన సూచనలలో, మీరు రాత్రిపూట మరియు పగటి పూట, నిద్ర పోవటం మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో శ్రద్ధతో వినేవారికి ఎన్నో సూచనలున్నాయి.
మరియు ఆయన సూచనలలో, ఆయన మీకు మెరుపును చూపించి, భయాన్ని మరియు ఆశను కలుగజేయడం;[1] మరియు ఆకాశం నుండి నీటిని కురిపించి దానితో నిర్జీవి అయిన భూమికి ప్రాణం పోయడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో బుద్ధిమంతులకు ఎన్నో సూచనలున్నాయి.
మరియు ఆయన సూచనలలో, ఆయన ఆజ్ఞతో భూమ్యాకాశాలు నిలకడ కలిగి ఉండటం.[1] ఆ తరువాత ఆయన మిమ్మల్ని ఒక్క పిలుపు పిలువగానే మీరంతా భూమి నుండి లేచి ఒకేసారి బయటికి రావటం కూడా ఉన్నాయి.
మరియు ఆయనే సృష్టి ఆరంభించిన వాడు, ఆ తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు.[1] ఇది ఆయనకు ఎంతో సులభమైనది. భూమ్యాకాశాలలో ఆయన సామ్యమే సర్వోన్నతమైనది.[2] ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేచనా పరుడు.
ఆయన, స్వయంగా మీకే చెందిన ఒక ఉపమానాన్ని మీకు తెలుపుతున్నాడు. ఏమీ? మేము మీకు జీవనోపాధిగా సమకూర్చిన దానిలో మీ బానిసలు మీతో పాటు సరిసమానులుగా, భాగస్వాములు కాగలరా? మీరు పరస్పరం ఒకరి పట్ల నొకరు భీతి కలిగి ఉన్నట్లు, వారి పట్ల కూడా భీతి కలిగి ఉంటారా? ఈ విధంగా మేము బుద్ధిమంతులకు మా సూచనలను వివరిస్తూ ఉంటాము[1].
[1] చూడండి, 16:75-76. ఇటువంటి సామెతలకు. మానవులు, తమతోటి మానవులైన బానిసలను తమతో పాటు సమానులుగా స్వీకరించలేరు. అయితే అల్లాహ్ (సు.తా.) సర్వసృష్టికర్త తాను సృష్టించిన దానిని తనకు సమానంగా ఏ విధంగా స్వీకరించగలడు. ఆయన (సు.తా.) ను వదలి, ఆయన పుట్టించిన వాటిని ఆరాధించటం ఎలా క్షమించగలడు. అందుకే ఆయన ఖుర్ఆన్ లో వ్యక్తం చేశాడు. షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించడం) అల్లాహ్ (సు.తా.) ఎన్నటికీ క్షమించడు.
కాని దుర్మార్గులైనటువంటి వారు, తెలివి లేనిదే, తమ కోరికలను అనుసరిస్తారు. అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదిలిన వ్యక్తికి మార్గదర్శకత్వం ఎవడు చేయగలడు? [1] మరియు వారికి సహాయపడేవారు ఎవ్వరూ ఉండరు.
[1] ఎందుకంటే అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి వారికే మార్గదర్శకత్వం లభిస్తుంది, ఎవరైతే మార్గదర్శకత్వాన్ని ఆపేక్షిస్తారో! ఇక ఎవరైతే హృదయపూర్వకంగా అల్లాహ్ (సు.తా.) మార్గదర్శకత్వాన్ని అపేక్షించరో ఆయన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. ఇదే సున్నతుల్లాహ్ - అల్లాహ్ (సు.తా.) సంప్రదాయం. ఈ విషయం ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు విశదీకరించబడింది. అల్లాహ్ (సు.తా.) మానవులకు మరియు జిన్నాతులకు మంచి చెడుల మధ్య విచక్షణా జ్ఞాననాన్నొసంగి; విశ్వసించి, మంచి పనులు చేసేవారికి స్వర్గం మరియు చెడుదారి పట్టేవారికి నరకం, అని వ్యక్తం చేశాడు. మరియు ప్రతి యుగం వారికి, అల్లాహ్ (సు.తా.) ను మాత్రమే ఆరాధించమని మరియు మంచిని చేయమని ఆదేశించటానికి, చెడునుండి నివారించటానికి మార్గదర్శకులుగా ప్రవక్తలను పంపి, వారి వద్దకు దివ్యజ్ఞానం (వ'హీ) పంపుతూ వచ్చాడు. చూడండి, 14:4 మరియు 2:7.
కావున నీవు నీ ముఖాన్ని, ఏకాగ్రచిత్తంతో, సత్యధర్మం (ఇస్లాం) దిశలో స్థిరంగా నిలుపు. అల్లాహ్ మానవులను ఏ స్వభావంతో పుట్టించాడో, ఆ స్వభావం పైననే వారు ఉంటారు.[1] అల్లాహ్ సృష్టి స్వభావాన్ని (ఎవ్వరూ) మార్చలేరు. ఇదే సరైన ధర్మం, కాని చాలా మంది ఇది ఎరుగరు.
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'ప్రతి వ్యక్తి పుట్టుకతో స్వాభావికంగా అల్లాహ్ (సు.తా.) కు విధేయుడు (ముస్లిం) అయి ఉంటాడు. కానీ ముస్లిమేతరులైన అతని తల్లిదండ్రులు అతనిని యూదుడు, క్రైస్తవుడు, మజూసీ (లేక ఇతర మతస్తుడి) గా చేస్తారు.' ('స'హీ'హ్ బు'ఖారీ మరియు 'స'హీ'హ్ ముస్లిం)
(ఎల్లప్పుడు) మీరు ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలుతూ ఉండండి. మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు నమాజ్ స్థాపించండి. మరియు ఆయన (అల్లాహ్) కు సాటి (భాగస్వాములు) కల్పించే వారిలో చేరిపోకండి;
వారిలో ఎవరైతే, తమ ధర్మాన్ని విభజించి వేర్వేరు తెగలుగా చేసుకున్నారో! ప్రతివర్గం వారు తమ వద్దనున్న దాని (సిద్ధాంతం) తోనే సంతోషపడుతున్నారు.[1]
[1] అంటే ప్రతి ధర్మం, తెగ లేక వర్గం వారు తాము అనుసరించే దానితోనే సంతుష్టులై ఉంటారు. మరియు వారి వద్ద దానిని సమర్ధించే వాదాలు కూడా ఉంటాయి. వాస్తవానికి సత్యం మీద ఒకే ఒక్క ధర్మం, తెగ ఉండగలదు. ఆ ధర్మే - అల్లాహ్ (సు.తా.) మార్గదర్శకత్వం చేసిన, ప్రవక్తలందరూ మరియు చివరి ప్రవక్త ము'హమ్మద్ ('స'అస') కూడా అనుసరించి, బోధించిన ధర్మం - ఇస్లాం; మహాప్రవక్త ('స'అస) మరియు అతని అనుచరు(ర'ది.'అన్హుమ్)లు అనుసరించిన ధర్మం. ఇంకా చూడండి, 6:159, 21:92-93 మరియు 23:52-53.
మరియు మానవులకు ఆపద వచ్చినపుడు, వారు తమ ప్రభువు వైపునకు పశ్చాత్తాపంతో మరలి ఆయనను వేడుకుంటారు. ఆ తరువాత ఆయన కారుణ్యం నుండి కొంత వారికి రుచి చూపించినప్పుడు, వారిలో కొందరు తమ ప్రభువుకు సాటి (భాగస్వాములను) కల్పించసాగుతారు.[1]
మేము వారికి ప్రసాదించిన దానికి (అనుగ్రహాలకు) కృతఘ్నత చూపటానికి (వారు అలా చేస్తారు). సరే! మీరు కొంత కాలం సుఖసంతోషాలు అనుభవించండి, త్వరలోనే మీరు (మీ ముగింపును) తెలుసుకుంటారు.
మరియు మేము మానవులకు కారణ్యపు రుచి చూపించినప్పుడు వారు దానితో చాలా సంతోషపడతారు. కాని వారు తమ చేతులారా చేసుకున్న కర్మల ఫలితంగా[1] వారికేదైనా కీడు కలిగితే నిరాశ చెందుతారు.
ఏమీ? వారికి తెలియదా? అల్లాహ్ తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ఇస్తాడని మరియు (తాను కోరిన వారికి) మితంగా ఇస్తాడని? నిశ్చయంగా, ఇందులో విశ్వసించేవారికి ఎన్నో సూచనలున్నాయి.
కావున నీవు నీ బంధువుకు అతని హక్కు ఇవ్వు మరియు యాచించని పేదవానికి మరియు బాటసారికి (కూడా)[1]. ఇది అల్లాహ్ ప్రసన్నతను కోరేవారికి ఎంతో ఉత్తమమైనది. మరియు ఇలాంటి వారే సాఫల్యము పొందేవారు.
[1] చూడండి, 17:26. బంధువులకు, పేదవారికి మరియు బాటసారులకు మీరు ఇచ్చేది వారిపై చేసిన అనుగ్రహం కాదు. మీరు వారి హక్కు చెల్లిస్తున్నారు. పేదవాడైన దగ్గరి బంధువుకు ఇవ్వటం వల్ల రెండింతలు పుణ్యం దొరుకుతుంది. ఒకటి నీవు నీ దగ్గరివానికి ఇచ్చినందుకు, రెండవది పేదవానికి ఇచ్చినందుకు. ('స'హీ'హ్ 'హదీసు').
మరియు మీరు ప్రజలకు - రిబా[1] (వడ్డీ మీద డబ్బు /కానుకలు) ఇచ్చి దాని ద్వారా వారి సంపద నుండి వృద్ధి పొందాలని - ఇచ్చే ధనం, అల్లాహ్ దృష్టిలో ఏ మాత్రం వృద్ధి పొందదు. మరియు మీరు అల్లాహ్ ప్రసన్నతను పొందే ఉద్దేశంతో ఏదైనా దానం (జకాత్) చేస్తే అలాంటి వారి (సంపద) ఎన్నో రెట్లు అధికమవుతుంది.
[1] రిబా': వడ్డీ అనే పదం ఖుర్ఆన్ అవతరణా క్రమంలో ఈ ఆయత్ లో మొదటిసారి వచ్చింది. దాని అర్థం : ఏదైనా ఇచ్చి - ఇచ్చిన దానికంటే - ఎక్కువ తీసుకోవటం. ఇబ్నె 'అబ్బాస్ మరియు చాలామంది ఇతర 'స'హాబీలు ('రది.'అన్హుమ్) ఈ ఆయత్ లో వచ్చిన పదం రిబా' అంటే ఈ విధమైన వ్యాఖ్యానం కూడా ఇచ్చారు: ఒక పేదవాడు ఒక ధనవంతునికి లేక ఒక వ్యక్తి తన రాజుకు, లేక ఒక సేవకుడు తనను పెట్టుకున్న వానికి, తాను ఇచ్చిన దాని కంటే ఎక్కువ తిరిగి వచ్చుననే ఆశతో, ఇచ్చే బహుమానం, అని. ఇచ్చేటప్పుడు, ఎక్కువ తిరిగి వస్తుంది అనే భావన ఉండటం వల్లనే, ఇది నిషిద్ధం చేయబడింది (ఇబ్నె-కసీ'ర్, అయ్ సర్ అత్తఫాసీర్). చూడండి, 3:130 మరియు 2:275-281..
అల్లాహ్ యే మిమ్మల్ని పుట్టించాడు, తరువాత జీవనోపాధినిచ్చాడు. తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత మళ్ళీ బ్రతికిస్తాడు. అయితే? మీరు (అల్లాహ్ కు) సాటిగా (భాగస్వాములుగా) కల్పించిన వారిలో, ఎవడైనా వీటిలో నుండి ఏదైనా ఒక్క పనిని చేయగలవాడు ఉన్నాడా! [1] ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటి కల్పించే భాగస్వాముల కంటే ఆయన మహోన్నతుడు.
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'ఒక దుష్టుడు మరణిస్తే, కేవలం మానవులే గాక పశుపక్షులు, చెట్లు చేమలు కూడా వాని నుండి శాంతి పొందుతాయి.' 'స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం)
మానవులు తమ చేజేతులా సంపాదించుకున్న దాని ఫలితంగా భూమిలో మరియు సముద్రంలో కల్లోలం వ్యాపించింది. ఇది వారిలో కొందరు చేసిన దుష్కర్మల ఫలితాన్ని రుచి చూపటానికి, బహుశా ఇలాగైనా వారు (అల్లాహ్ వైపునకు) మరలుతారేమోనని!
కావున నీవు నీ ముఖాన్ని సరైన ధర్మం (ఇస్లాం) వైపునకే స్థిరంగా నిలుపు[1] - అల్లాహ్ తరఫు నుండి - ఆ రోజు రాకముందే దేనినైతే ఎవ్వడూ తొలగించలేడో! ఆ రోజు వారు పరస్పరం చెదిరిపోయి వేరవుతారు.[2]
[1] అల్లాహ్ (సు.తా.) దృష్టిలో సత్యధర్మం: అంటే అల్లాహ్ (సు.తా.) కు దాస్యం - తనను తాను అల్లాహ్ (సు.తా.) అభీష్టానికి అప్పగించడం (ఇస్లాం) - మాత్రమే. చూడండి, 3:19. [2] ఒకటి విశ్వాసులది, రెండవది సత్యతిరస్కారులది.
ఇది ఆయన (అల్లాహ్), తన అనుగ్రహంతో విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి ప్రతిఫల మివ్వటానికి.[1] నిశ్చయంగా, ఆయన సత్యతిరస్కారులను ప్రేమించడు.
[1] స్వర్గం పొందటానికి కేవలం విశ్వసించి సత్కార్యాలు చేయటమే సరిపోదు. దానికి అల్లాహ్ (సు.తా.) అనుగ్రహం కూడా ఉండాలి. ఆయనయే సత్కార్యాల ప్రతిఫలాన్ని ఎన్నోరెట్లు అధికం చేసి ఇస్తాడు.
ఇక ఆయన సూచనలలో ఆయన గాలులను శుభవార్తలిచ్చేవిగా పంపి మీకు తన కారుణ్యాన్ని రుచి చూపటం మరియు ఆయన ఆజ్ఞతో ఓడలను నడిపి, మిమ్మల్ని ఆయన అనుగ్రహాన్ని అన్వేషించనివ్వటం కూడా ఉన్నాయి. ఇవన్నీ, బహుశా మీరు కృతజ్ఞతలు చూపుతారేమోనని!
మరియు వాస్తవానికి మేము నీకు పూర్వం కూడా, సందేశహరులను తమ తమ జాతి వారి వద్దకు పంపాము.[1] వారు, వారి వద్దకు స్పష్టమైన సూచనలను తీసుకొని వచ్చారు. ఆ తరువాత కూడా నేరం చేసిన వారికి తగిన ప్రతీకారం[2] చేశాము. మరియు విశ్వాసులకు సహాయం చేయటం మా కర్తవ్యం.
అల్లాహ్ యే గాలులను పంపేవాడు, కావున అవి మేఘాలను పైకి ఎత్తుతాయి, ఆ తరువాత ఆయన వాటిని తాను కోరినట్లు ఆకాశంలో వ్యాపింపజేస్తాడు. మరియు వాటిని ముక్కలు ముక్కలుగా చేసి, తరువాత వాటి మధ్య నుండి వర్షాన్ని కురిపిస్తాడు. ఆయన దానిని తన దాసులలో తాను కోరిన వారిపై కురిపించగా వారు సంతోషపడతారు!
కావున (ఓ మానవుడా!) అల్లాహ్ కారుణ్య చిహ్నాలను చూడు: ఆయన నిర్జీవంగా ఉన్న భూమిలో ఏ విధంగా ప్రాణం పోస్తాడో! నిశ్చయంగా, ఇదే విధంగా ఆయన (మరణానంతరం) మృతులకు కూడా ప్రాణం పోస్తాడు! మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు.
మరియు నీవు అంధులను, వారి మార్గభ్రష్టత్వం నుండి తప్పించి, వారికి మార్గదర్శకత్వం చేయలేవు. నీవు కేవలం విశ్వసించి, అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మాత్రమే మా సూచనలు వినిపించగలవు.[1]
అల్లాహ్ యే మిమ్మల్ని బలహీన స్థితిలో పుట్టించిన వాడు. మళ్ళీ ఆ బలహీన స్థితి తరువాత మీకు బలాన్ని ఇచ్చాడు. ఆ బలం తరువాత మళ్ళీ మిమ్మల్ని బలహీనులుగా, ముసలివారిగా చేశాడు. ఆయన తాను కోరింది సృష్టిస్తాడు. మరియు కేవలం ఆయనే సర్వజ్ఞుడు, సర్వసమర్ధుడు.
మరియు ఆ ఘడియ[1] సంభవించిన రోజు, అపరాధులు, ప్రమాణం చేస్తూ: "మేము ఒక ఘడియ సేపు కంటే ఎక్కువ కాలం (ప్రపంచంలో) ఉండలేదు" అని అంటారు. ఇదే విధంగా వారు (ప్రాపంచిక జీవితంలో) భ్రమలో ఉండేవారు.[2]
[1] ఆ ఘడియ అంటే పునరుత్థాన ఘడియ. అదే ఈ లోకపు అంతిమ ఘడియ. [2] చూచూడండి, 17:52.
మరియు జ్ఞానం మరియు విశ్వాసం అనుగ్రహింప బడినవారు ఇలా అంటారు: "వాస్తవానికి అల్లాహ్ మూలగ్రంథం[1] ప్రకారం మీరు పునరుత్థాన దినం వరకు (ఇహలోకంలో) ఉంటిరి. ఇక ఇదే ఆ పునరుత్థాన దినం, కాని నిశ్చయంగా! మీరిది తెలుసు కోలేక పోయారు."
[1] కితాబిల్లాహి: అంటే అల్లాహ్ వ్రాసి ఉంచిన లౌ'హె మ'హ్ ఫూ''జ్, మూలగ్రంథం.
మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజలకు, ప్రతి ఒక్క విషయపు ఉపమానాన్ని బోధించాము.[1] అయినా నీవు వారి వద్దకు ఏ అద్భుత సూచన (ఆయత్) తెచ్చినా, వారిలో సత్యతిరస్కారులైన వారు ఇలా అంటారు: "మీరు కేవలం బూటకాలే పలుకుతున్నారు."
4. إبقاء معلومات نسخة الترجمة الموجودة داخل المستند.
5. إفادة المصدر (QuranEnc.com) بأي ملاحظة على الترجمة.
6. تطوير الترجمات وفق النسخ الجديدة الصادرة من المصدر (QuranEnc.com).
7. عدم تضمين إعلانات لا تليق بترجمات معاني القرآن الكريم عند العرض.
نتائج البحث:
API specs
Endpoints:
Sura translation
GET / https://quranenc.com/api/v1/translation/sura/{translation_key}/{sura_number} description: get the specified translation (by its translation_key) for the speicified sura (by its number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114)
Returns:
json object containing array of objects, each object contains the "sura", "aya", "translation" and "footnotes".
GET / https://quranenc.com/api/v1/translation/aya/{translation_key}/{sura_number}/{aya_number} description: get the specified translation (by its translation_key) for the speicified aya (by its number sura_number and aya_number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114) aya_number: [1-...] (Aya number in the sura)
Returns:
json object containing the "sura", "aya", "translation" and "footnotes".