మరియు వారు ఇలా అన్నారు: "నీవు దేనివైపునకైతే మమ్మల్ని పిలుస్తున్నావో, దాని పట్ల మా హృదయాల మీద తెరలు కప్పబడి ఉన్నాయి; మరియు మా చెవులలో చెవుడు ఉంది మరియు నీకూ మాకూ మధ్య ఒక అడ్డు తెర ఉంది; [1] కావున నీవు నీ పని చేయి, మేము మా పని చేస్తాము."
(ఓ ప్రవక్తా!) ఇలా అను: "నిశ్చయంగా నేను కూడా మీలాంటి ఒక మానవుణ్ణి మాత్రమే! [1] నాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుపబడింది: 'నిశ్చయంగా, మీ ఆరాధ్య దేవుడు, ఒకే ఒక్క దేవుడు (అల్లాహ్); కావున మీరు నేరుగా ఆయన వైపునకే మరలండి మరియు ఆయననే క్షమాపణకై వేడుకోండి.' " మరియు ఆయన (అల్లాహ్) కు సాటి కల్పించే వారికి వినాశం ఉంది.
వారికి, ఎవరైతే విధిదానం (జకాత్) ఇవ్వరో మరియు పరలోకాన్ని తిరస్కరిస్తారో! [1]
[1] అ'జ్జకాతు: మదీనాలో 2వ హిజ్రీలో విధిగా నియమించబడింది. కావున ఇక్కడ 'జకాత్ అంటే దానం. మొదట ఉదయం మరియు సాయంత్రం రెండు నమాజులు విధిగా చేయబడి ఉండేవి. హిజ్ రత్ కు ఒకటిన్నర సంవత్సరం ముందు మే'రాజ్ లో ఐదు నమా'జ్ లు విధిగా చేయబడ్డాయి. (ఇబ్నె-కసీ'ర్).
వారితో ఇలా అను: "ఏమీ? మీరు, భూమిని రెండు రోజులలో సృష్టించిన ఆయన (అల్లాహ్) ను తిరస్కరించి, ఇతరులను ఆయనకు సమానులుగా నిలబెడతారా? సర్వలోకాలకు పోషకుడు ఆయనే కదా?" [1]
[1] సృష్టిని ఆరు రోజులలో సృష్టించాడు. చూడండి, 7:54.
మరియు ఆయన దానిలో (భూమిలో) దాని పైనుండి స్థిరమైన పర్వతాలను నెలకొలిపాడు [1] మరియు అందులో శుభాలను అనుగ్రహించాడు మరియు అర్థించేవారి కొరకు, వారి అవసరాలకు సరిపోయేటట్లు జీవనోపాధిని సమకూర్చాడు, ఇదంతా నాలుగు రోజులలో పూర్తి చేశాడు.
[1] భూమిలో నుండి పర్వతాలను పుట్టించి వాటిని దానిపై నాటాడు, భూమి కదలిపోకుండా.
అప్పుడే [1] ఆయన కేవలం పొగగా [2] ఉన్న ఆకాశం వైపునకు తన ధ్యానాన్ని మరల్చి, దానిని మరియు భూమిని ఉద్దేశించి ఇలా అన్నాడు: "మీరిద్దరు (ఉనికిలోకి) రండి మీకు ఇష్టమున్నా, ఇష్టం లేక పోయినా!" అవి రెండూ: "మేమిద్దరమూ విధేయులమై (ఉనికిలోకి) వస్తాము." అని అన్నాయి.
[1] సు'మ్మ: 'అరబ్బీ భాషలో ఒకే విషయాన్ని బోధించే రెండు వాక్యాలను కలుపుటకు గూడా ఈ శబ్దం సు'మ్మ వాడబడుతోంది. ఇక్కడ వాడబడినట్లు. [2] దఖానున్: పొగ, ఇది హైడ్రోజన్ గ్యాస్ కావచ్చు. దీని నుండియే ప్రపంచంలోని మూలపదార్థాలు (Elements) అన్నీ రూపొందించబడ్డాయి. చూడండి, 2:29.
కావున ఆయన వాటిని రెండు రోజులలో ఏడు ఆకాశాలుగా నిర్మించాడు, మరియు ప్రతి ఆకాశానికి దాని వ్యవహారాన్ని దివ్యజ్ఞానం (వహీ) ద్వారా నిర్దేశించాడు. మరియు మేము ఈ ప్రపంచపు ఆకాశాన్ని దీపాలతో (నక్షత్రాలతో) అలంకరించాము మరియు దానిని సురక్షితం చేశాము. [1] ఇదే సర్వశక్తిమంతుని, సర్వజ్ఞుని నియామకం.
ఇప్పుడు ఒకవేళ వారు విముఖులైతే వారితో ఇలా అను: "ఆద్ మరియు సమూద్ జాతుల వారిపై వచ్చి పడినట్టి గొప్ప పిడుగులాంటి శిక్ష గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను." [1]
[1] 'ఆద్ జాతివారి గాథకై చూడండి, 7:65-69 మరియు స'మూద్ వారి గాథకై చూడండి, 26:`123-158.
ఇక దైవప్రవక్తలు వారి వద్దకు వారి ముందు నుండి మరియు వారి వెనుక నుండి వచ్చి: "మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి!" అని అన్నప్పుడు, వారు ఇలా అన్నారు: "మా ప్రభువే గనక కోరితే దేవదూతలను పంపి ఉండేవాడు. [1] కావున మేము మీ ద్వారా పంపబడిన దానిని నిశ్చయంగా, తిరస్కరిస్తున్నాము!"
ఇక ఆద్ వారి విషయం: వారు దురహంకారంతో భూమిలో అన్యాయంగా ప్రవర్తించే వారు. మరియు ఇలా అనేవారు: "బలంలో మమ్మల్ని మించినవాడు ఎవడున్నాడు? ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా, వారిని సృష్టించిన అల్లాహ్ బలంలో వారి కంటే ఎంతో మించినవాడని? అయినా వారు మా సూచనలను (ఆయాత్ లను) తిరస్కరిస్తూ ఉండేవారు!
చివరకు మేము వారికి, ఇహలోక జీవితంలోనే అవమానకరమైన శిక్ష రుచి చూపించాలని, అశుభమైని దినాలలో వారిపై తీవ్రమైన తుఫాను గాలిని పంపాము. [1] మరియు వారి పరలోక శిక్ష దీని కంటే ఎంతో అవమానకరమైనదిగా ఉండబోతుంది. మరియు వారికెలాంటి సహాయం లభించదు.
[1] తూఫాన్ గాలి వీటిన దినాలు ఆ సత్యతిరస్కారుల కొరకే అశుభమైనవి. కాని ఆ పేరు గల దినాలు అందరి కొరకూ అశుభమైనవని దీని అర్థం కాదు. వివరాలకు చూడండి, 69:6-8.
మరియు సమూద్ వారి విషయం: మేము వారికి మార్గదర్శకత్వం చేశాము. కాని వారు మార్గదర్శకత్వానికి బదులు గ్రుడ్డితనాన్నే ఇష్టపడ్డారు. చివరకు వారి (దుష్ట) కర్మలకు ఫలితంగా, వారిపై పిడుగు లాంటి అవమానకరమైన శిక్ష పడింది. [1]
చివరకు వారు దానిని (నరకాగ్నిని) చేరుకున్నప్పుడు; వారి చెవులు, వారి కళ్ళు మరియు వారి చర్మాలు వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి, వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి.
మరియు వారు తమ చర్మాలను (అవయవాలను) అడుగుతారు: "మీరెందుకు మాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు?" అవి ఇలా సమాధానమిస్తాయి: "ప్రతి వస్తువుకు మాట్లాడే శక్తి ప్రసాదించిన అల్లాహ్ యే మమ్మల్ని మాట్లాడింప జేశాడు." మరియు ఆయనే మిమ్మల్ని మొదటిసారి సృష్టించిన వాడు, మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు.[1]
మరియు (మీరు దుష్కార్యాలు చేసేటప్పుడు) మీ చెవుల నుండి మీ కండ్ల నుండి మరియు మీ చర్మాల నుండి - మీకు వ్యతిరేకంగా సాక్ష్యం వస్తుందేమోనని - మిమ్మల్ని మీరు దాచుకునేవారు కాదు. అంతేకాదు మీరు చేస్తున్న ఎన్నో కార్యాలు వాస్తవంగా, అల్లాహ్ కు తెలియటం లేదని మీరు భావించేవారు.
అప్పుడు వారు సహనం చూపినా, నరకాగ్నియే వారి నివాస స్థానమవుతుంది. ఒకవేళ వారు (తమను తాము సరిదిద్దుకోవటానికి) అవకాశం కొరకు వేడుకున్నా వారికి అవకాశం ఇవ్వబడదు. [1] 7/8
మరియు మేము వీరికి స్నేహితులుగా (షైతానులను) నియమించాము. వారు వీరి ముందూ వెనుకా ఉన్న వాటిని వీరికి ఆకర్షణీయమైన వాటిగా చేశారు. కావున వీరికి పూర్వం గతించిన జిన్నాతుల మరియు మానవుల తరాల విషయంలో జరిగిన శిక్షా నిర్ణయమే, వీరి విషయంలో కూడా జరిగింది. నిశ్చయంగా, వీరే నష్టానికి గురి అయిన వారయ్యారు.
మరియు సత్యతిరస్కారులు (పరస్పరం) ఇలా చెప్పుకుంటారు: "ఈ ఖుర్ఆన్ ను వినకండి! మరియు ఇది వినిపించబడినప్పుడు వినబడకుండా విఘ్నం కలిగించండి, బహుశా మీరు ప్రాబల్యం పొంద వచ్చు!"
అప్పుడా సత్యతిరస్కారులు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసిన ఆ జిన్నాతులను మరియు మానవులను మాకు చూపించు; వారు మరింత పరాభవం పొందటానికి మేము వారిని మా పాదాల క్రింద పడవేసి త్రొక్కుతాము." [1]
నిశ్చయంగా, ఎవరైతే: "అల్లాహ్ యే మా ప్రభువు!" అని పలుకుతూ తరువాత దాని పైననే స్థిరంగా ఉంటారో! [1] వారిపై దేవదూతలు దిగి వచ్చి (ఇలా అంటారు): "మీరు భయ పడకండి మరియు దుఃఖపడకండి, మీకు వాగ్దానం చేయబడిన స్వర్గపు శుభవార్తను వినండి!
[1] ఒక సహాబీ (ర'ది.'అ.) దైవప్రవక్త (సఅస)తో ఇలా ప్రశ్నించాడు: 'నాకు ఇటువంటి మాట చెప్పండి, దానితో మీ తరువాత ఎవ్వరినీ అడిగే అవసరం ఉండగూడదు!' దానికి దైవప్రవక్త ('స'అస) అన్నారు : 'ఇలా అను నేను అల్లాహ్ (సు.తా.)ను విశ్వసించాను, తరువాత దాని (విశ్వాసం) పైననే స్థిరంగా ఉన్నాను.' ('స'హీ'హ్ ముస్లిం)
మేము ఇహలోక జీవితంలో మరియు పరలోక జీవితంలో కూడా మీకు సన్నిహితులముగా ఉన్నాము. మరియు మీ కొరకు అందులో మీ మనస్సులు కోరిందంతా ఉంటుంది. మరియు మీరు ఆశించేదంతా దొరుకుతుంది.
మరియు మంచీ మరియు చెడులు సరిసమానం కాజాలవు. (చెడును) మంచితో తొలగించు; అప్పుడు నీతో విరోధమున్న వాడూ కూడా తప్పక నీ ప్రాణ స్నేహితుడవుతాడు. [1]
[1] చూడండి, 13:22. ఎవరైనా మీకు కీడు చేస్తే వానికి మేలు చేయండి. ఎవడైనా మీకు అన్యాయం చేస్తే వాడిని క్షమించండి. ఎవడైనా మీ మీద దౌర్జన్యం చేస్తే సహనం వహించండి. ఈ విధమైన వ్యవహారాలలో మీ శత్రువు కూడా మీ స్నేహితుడవుతాడు.
మరియు ఆయన సూచనలలో (ఆయాత్ లలో) రేయింబవళ్ళు మరియు సూర్యచంద్రులున్నాయి. మీరు సూర్యునికి గానీ చంద్రునికి గానీ సాష్టాంగం (సజ్దా) చేయకండి, కాని కేవలం వాటిని సృష్టించిన అల్లాహ్ కు మాత్రమే సాష్టాంగం (సజ్దా) చేయండి - నిజంగానే మీరు ఆయనను ఆరాధించేవారే అయితే.
మరియు ఆయన సూచన (ఆయాత్) లలో ఒకటి: నిశ్చయంగా నీవు భూమిని పాడు నేలగా (ఎండిపోయిన బంజరు నేలగా) చూస్తున్నావు; కాని మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపించగానే, అది పులకించి, ఉబ్బి పోతుంది. నిశ్చయంగా దీనిని (ఈ భూమిని) బ్రతికించి లేపే ఆయన (అల్లాహ్ యే) మృతులను కూడా బ్రతికించి లేపుతాడు. నిశ్చయంగా, ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు.
నిశ్చయంగా, మా సూచనలకు వికృతార్థం అంటగట్టేవారు మాకు కనిపించకుండా ఉండలేరు. అయితే! పునరుత్థాన దినమున నరకాగ్నిలో పడ వేయబడే వాడు ఉత్తముడా? లేక శాంతియుతంగా వచ్చేవాడా? మీరు కోరేది మీరు చేయండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా ఆయన చూస్తున్నాడు.
అసత్యం దాని (ఖుర్ఆన్) ముందు నుండి గానీ లేదా దాని వెనుక నుండి గానీ దాని పైకి రాజాలదు. అది మహా వివేకవంతుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు, అయిన ఆయన (అల్లాహ్) తరఫు నుండి అవతరింప జేయబడింది.[1]
[1] ఈ ఖుర్ఆన్ అన్ని విధాలుగా భద్రపరచబడింది - దాని ముందు నుండి గానీ మరియు వెనుక నుండి గానీ - అంటే అసత్యవాదులు దీని ముందు నుండి వచ్చి ఇందులో దేనినీ తగ్గించలేరు. మరియు దీని వెనుక నుండి వచ్చి దీనిలో దేనినీ అధికం చేయలేరు. అంటే ఇందులో ఏ విధమైన మార్పులు తేలేరు. ఎందుకంటే ఇది మహా వివేకవంతుడు, సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ (సు.తా.) తరఫునుండి అవతరింపజేయబడింది. మరియు ఆయనే పునరుత్థానదినం వరకు దీనిని (ఖుర్ఆన్) ను భద్రంగా ఉంచుతాను, అని అన్నాడు. (ఇబ్నె-కసీ'ర్).
(ఓ ముహమ్మద్!) వాస్తవానికి, నీకు చెప్పబడిన దానిలో పూర్వం గతించిన ప్రవక్తలకు చెప్పబడనిది ఏదీ లేదు. [1] నిశ్చయంగా, నీ ప్రభువు మాత్రమే క్షమాశీలుడు మరియు బాధాకరమైన శిక్ష విధించేవాడు కూడాను!
[1] చూడండి, 51:52-53. వ్యాఖ్యాతలు దీనిని రెండు విధాలుగా అర్థం చేసుకున్నారు. ఒకటి : పూర్వప్రజలు తమ ప్రవక్త ('అ.స.) లతో ఇతను పిచ్చివాడు, మాంత్రికుడు, అసత్యవాదుడు, వగైరా అన్న మాటలనే ఈ మక్కా ముష్రికులు కూడా మీతో అంటున్నారు. ఈ విధమైన మాటలతో దైవప్రవక్త ఓదార్చబడుతున్నారు.
ఒకవేళ మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బేతర భాషలో అవతరింప జేసి ఉండి నట్లైతే వారు ఇలా అని ఉండేవారు: "దీని సూచనలు (ఆయాత్) స్పష్టంగా ఎందుకు వివరించబడలేదు? [1] (గ్రంథమేమో) అరబ్బేతర భాషలో మరియు (సందేశహరుడేమో) అరబ్బు?" వారితో ఇలా అను: "ఇది (ఈ ఖుర్ఆన్) విశ్వసించిన వారికి మార్గదర్శకత్వం మరియు స్వస్థత నొసంగేది. మరియు విశ్వసించనివారి చెవులకు అవరోధం మరియు వారి కళ్ళకు ఒక గంత. అలాంటి వారి స్థితి ఎంతో దూరం నుండి పిలువబడిన వారి అరుపులాంటిది!"
వాస్తవానికి మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము, కాని దాని విషయంలో కూడా భేదాభిప్రాయాలు వచ్చాయి. ఒకవేళ నీ ప్రభువు నుండి, మొదటి నుంచే నిర్ణయం తీసుకోబడి ఉండక పోతే, [1] వారి మధ్య ఎప్పుడో తీర్పు జరిగి వుండేది. మరియు నిశ్చయంగా, వారు దానిని గురించి ఆందోళన కలిగించే సందేహానికి గురి అయ్యారు.
[1] అంటే వారికొక గడువు నిర్ణయించబడి ఉంది మరియు వారికి వ్యవధి ఇవ్వబడుతోంది. చూడండి, 35:45.
ఎవడైతే సత్కార్యం చేస్తాడో అతడు తన (మేలు) కొరకే చేస్తాడు. మరియు దుష్కార్యం చేసేవాడు దాని (ఫలితాన్ని) అనుభవిస్తాడు. మరియు నీ ప్రభువు తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు.
ఆ (అంతిమ) ఘడియ జ్ఞానం కేవలం ఆయనకే చెందినది. [1] మరియు ఆయనకు తెలియకుండా ఫలాలు పుష్పకోశాల [2] నుండి బయటికి రావు మరియు ఆయనకు తెలియకుండా ఏ స్త్రీ కూడా గర్భం దాల్చదు మరియు ప్రసవించదు. మరియు ఏ దినమునైతే వారిని పిలిచి: "మీరు నాకు సాటి కల్పించే ఆ భాగస్వాములు ఎక్కడున్నారు?" అని అడిగితే,వారు ఇలా జవాబిస్తారు: "మాలో ఎవ్వడు కూడా దీనికి సాక్ష్యం ఇచ్చేవాడు లేడని మేము ఇది వరకే మనవి చేసుకున్నాము!"
మరియు ఒకవేళ మేము అతనికి ఆపద కాలం దాటి పోయిన తర్వాత మా కారుణ్యాన్ని రుచి చూపిస్తే అతడు తప్పకుండా ఇలా అంటాడు: "ఇది నా హక్కే! మరియు పునరుత్థాన దినం వస్తుందని నేను భావించను. మరియు ఒకవేళ నేను నా ప్రభువు వద్దకు మరలింపబడినా! నిశ్చయంగా, నాకు ఆయన దగ్గర మేలే ఉంటుంది." కాని మేము సత్యతిరస్కారులకు వారు చేసిన కర్మలను గురించి వారికి తప్పక తెలుపుతాము మరియు వారికి భయంకరమైన శిక్షను రుచి చూపిస్తాము.
ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించారా? ఒకవేళ ఇది (ఈ ఖుర్ఆన్) అల్లాహ్ తరఫు నుండి వచ్చి ఉండి మీరు దానిని తిరస్కరిస్తే, దానిని వ్యతిరేకించటంలో చాలా దూరం పోయిన వాని కంటే ఎక్కువ మార్గభ్రష్టుడెవడు?"
ఇక త్వరలోనే మేము వారికి మా సంకేతాలను (ఆయాత్ లను), వారి చుట్టూ ఉన్న ఖగోళంలో [1] మరియు వారియెందును చూపుతాము; చివరకు ఇదే (ఈ ఖుర్ఆనే) సత్యమని వారికి స్పష్టమవుతుంది. ఏమీ? నీ ప్రభువు! నిశ్చయంగా, ఆయనే ప్రతిదానికి సాక్షి, అనే విషయం చాలదా?
[1] ఉదాహరణకు సూర్యచంద్రులు, రాత్రింబవళ్ళు, గాలివానలు మొదలైనవి.
4. إبقاء معلومات نسخة الترجمة الموجودة داخل المستند.
5. إفادة المصدر (QuranEnc.com) بأي ملاحظة على الترجمة.
6. تطوير الترجمات وفق النسخ الجديدة الصادرة من المصدر (QuranEnc.com).
7. عدم تضمين إعلانات لا تليق بترجمات معاني القرآن الكريم عند العرض.
نتائج البحث:
API specs
Endpoints:
Sura translation
GET / https://quranenc.com/api/v1/translation/sura/{translation_key}/{sura_number} description: get the specified translation (by its translation_key) for the speicified sura (by its number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114)
Returns:
json object containing array of objects, each object contains the "sura", "aya", "translation" and "footnotes".
GET / https://quranenc.com/api/v1/translation/aya/{translation_key}/{sura_number}/{aya_number} description: get the specified translation (by its translation_key) for the speicified aya (by its number sura_number and aya_number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114) aya_number: [1-...] (Aya number in the sura)
Returns:
json object containing the "sura", "aya", "translation" and "footnotes".