[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్నోట్ చూడండి. [2] అల్ మజీదు: ఖుర్ఆన్ ను సంబోధించిన సందర్భానికి చూడండి, 85:21. Glorious, Noble, దివ్యమైన, ఉత్కృష్టమైన. అల్లాహు'తాలాను సంబోధించిన సందర్భానికి చూడండి, 11:73, 85:15. మహత్వపూర్ణుడు
అలా కాదు! హెచ్చరిక చేసేవాడు, వారి వద్దకు వారిలో నుంచే వచ్చాడనే విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది, కావున సత్యతిరస్కారులు ఇలా అన్నారు[1]: "ఇది ఆశ్చర్యకరమైన విషయం!
వాస్తవానికి వారి (శరీరాల)లో నుండి భూమి దేనిని తగ్గిస్తుందో మాకు బాగా తెలుసు.[1] మరియు మా దగ్గర అంతా ఒక సురక్షితమైన గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.
[1] పునరుత్థానం అంటే పూర్తిగా దుమ్ము ధూళిగా మారిపోయిన మానవులను తిరిగి మొదటి రూపంలో బ్రతికించి తీసుకురావటం. చూడండి, 10:4, 21:104, 30:11, 85:13 మొదలైనవి. ఇంకా చూడండి, 10:34, 27:64, 30:27.
వారికి పూర్వం నూహ్ జాతి వారు, అర్ రస్[1] వాసులు మరియు సమూద్ జాతి వారు కూడా, సత్యాన్ని తిరస్కరించారు.
[1] చూడండి, 25:38 మరియు సూరహ్ అల్-బురూజ్ (85). అర్-రస్ వారు ఎవరనే విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇబ్నె-జరీర్ 'తబరీ (ర'హ్మా) అభిప్రాయంలో వీరే అస్'హాబ్ అల్-ఉఖ్దూద్.
మరియు అయ్ కహ్ (వన) వాసులు మరియు తుబ్బఅ[1] జాతి వారు కూడాను. ప్రతి ఒక్కరూ తమ ప్రవక్తలను అసత్యులని తిరస్కరించారు, కావున నా బెదరింపు వారి విషయంలో సత్యమయింది.
[1] తుబ్బ'అ జాతివారి కొరకు చూడండి, 44:37. అయ్ కహ్ వాసులు (వనవాసులు) అంటే మద్ యన్ వాసులు. చూడండి, 26:176 ఇంకా వివరాలకు చూడండి, 11:84-95.
మరియు వాస్తవంగా, మేమే మానవుణ్ణి సృష్టించాము మరియు అతని మనస్సులో మెదిలే ఊహలను కూడా మేము ఎరుగుతాము.[1] మరియు మేము అతనికి అతని కంఠ రక్తనాళం కంటే కూడా అతి దగ్గరగా ఉన్నాము.
[1] హృదయాలలో దాగి ఉన్న విషయాలన్నీ అల్లాహ్ (సు.తా.)కు తెలుసు. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'అల్లాహ్ (సు.తా.) నా అనుచరుల మనస్సులలో మెదిలే విషయాలను క్షమించాడు. అంటే వాటి నిమిత్తం శిక్షించడు. ఎంతవరకైతే వారు వాటిని తమ నోటితో ఉచ్ఛరించరో! లేదా వాటిని ఆచరణలోకి తీసుకురారో!' ('స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం)
(ఇలా అనబడుతుంది): "వాస్తవానికి నీవు (ఈ దినాన్ని గురించి) నిర్లక్ష్యంగా ఉండే వాడివి. కావున ఇపుడు మేము నీ ముందున్న తెరను తొలగించాము. కావున, ఈ రోజు నీ దృష్టి చాలా చురుకుగా ఉంది."
అతని స్నేహితుడు (ఖరీనున్) ఇలా అంటాడు:[1] "ఓ మా ప్రభూ! నేను ఇతని తలబిరుసుతనాన్ని ప్రోత్సహించలేదు, కాని ఇతడే స్వయంగా, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళి పోయాడు."
మరియు మేము, వీరికి పూర్వం ఎన్నో తరాల వారిని నాశనం చేశాము. వారు వీరి కంటే ఎక్కువ శక్తిమంతులు. కాని, (మా శిక్ష పడినప్పుడు) వారు దేశదిమ్మరులై పోయారు. ఏమీ? వారికి తప్పించుకునే మార్గం ఏదైనా దొరికిందా?
కావున (ఓ ముహమ్మద్!) వారు పలికే మాటలకు సహనం వహించు మరియు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన స్తోత్రాలు చెయ్యి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు కూడా;[1]
మరియు రాత్రి వేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు[1] మరియు సాష్టాంగం (సజ్దా) చేసిన తరువాత కూడా స్తుతించు.[2]
[1] చూడండి, 17:79 అంటే రాత్రిపూట లేచి తహజ్జుద్ నమా'జ్ చేయండి. మే'రాజ్ కు ముందు ముస్లింలందరికీ ఫజ్ర్ మరియు 'అ'స్ర్ నమాజ్ లు విధించబడి ఉండేవి మరియు దైవప్రవక్త ('స'అస) తహజ్జుద్ చేసేవారు. కానీ మే'రాజ్ తరువాత 5 నమా'జ్ లు అందరి కొరకు విధిగా చేయబడ్డాయి. (ఇబ్నె-కసీ'ర్). [2] ఫ'ర్ద్ నమాజుల తరువాత త'స్బీహ్ చేయాలి. అంటే సుబ్'హానల్లాహ్ 33 సార్లు, అల్'హమ్దులిల్లాహ్ 33 సార్లు మరియు అల్లాహు అక్బర్ 34 సార్లు చదవాలి. ('స.బు'ఖారీ, 'స.ముస్లిం)
4. إبقاء معلومات نسخة الترجمة الموجودة داخل المستند.
5. إفادة المصدر (QuranEnc.com) بأي ملاحظة على الترجمة.
6. تطوير الترجمات وفق النسخ الجديدة الصادرة من المصدر (QuranEnc.com).
7. عدم تضمين إعلانات لا تليق بترجمات معاني القرآن الكريم عند العرض.
نتائج البحث:
API specs
Endpoints:
Sura translation
GET / https://quranenc.com/api/v1/translation/sura/{translation_key}/{sura_number} description: get the specified translation (by its translation_key) for the speicified sura (by its number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114)
Returns:
json object containing array of objects, each object contains the "sura", "aya", "translation" and "footnotes".
GET / https://quranenc.com/api/v1/translation/aya/{translation_key}/{sura_number}/{aya_number} description: get the specified translation (by its translation_key) for the speicified aya (by its number sura_number and aya_number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114) aya_number: [1-...] (Aya number in the sura)
Returns:
json object containing the "sura", "aya", "translation" and "footnotes".