Check out the new design

আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ * - অনুবাদসমূহৰ সূচীপত্ৰ


অৰ্থানুবাদ ছুৰা: ইয়াছীন   আয়াত:
وَاٰیَةٌ لَّهُمْ اَنَّا حَمَلْنَا ذُرِّیَّتَهُمْ فِی الْفُلْكِ الْمَشْحُوْنِ ۟ۙ
మరియు ఇదేవిధంగా మేము నూహ్ కాలములో ఆదమ్ సంతతిలో నుండి తుఫాను నుండి ముక్తి పొందిన వారిని అల్లాహ్ యొక్క సృష్టితాలతో నిండిన నావలో ఎక్కించటం వారి కొరకు అల్లాహ్ ఏకత్వము పై ఒక సూచన మరియు ఆయన దాసులపై ఆయన అనుగ్రహము. అల్లాహ్ అందులో ప్రతీ రకము నుండి రెండింటిని ఎక్కించాడు.
আৰবী তাফছীৰসমূহ:
وَخَلَقْنَا لَهُمْ مِّنْ مِّثْلِهٖ مَا یَرْكَبُوْنَ ۟
మేము నూహ్ నావ లాంటి సవారీలను వారి కొరకు సృష్టించటం అల్లాహ్ తౌహీద్ పై వారి కొరకు ఒక సూచన మరియు ఆయన దాసులపై ఆయన అనుగ్రహము.
আৰবী তাফছীৰসমূহ:
وَاِنْ نَّشَاْ نُغْرِقْهُمْ فَلَا صَرِیْخَ لَهُمْ وَلَا هُمْ یُنْقَذُوْنَ ۟ۙ
మరియు ఒక వేళ మేము వారిని ముంచివేయదలచితే వారిని ముంచివేస్తాము. అప్పుడు వారికి సహాయం చేయటానికి ఏ సహాయకుడు ఉండడు ఒక వేళ మేము వారిని ముంచదలిస్తే. మా ఆదేశముతో,మా తీర్పుతో వారు మునిగినప్పుడు వారిని రక్షించటానికి రక్షకుడెవడూ ఉండడు.
আৰবী তাফছীৰসমূহ:
اِلَّا رَحْمَةً مِّنَّا وَمَتَاعًا اِلٰی حِیْنٍ ۟
వారు అదిగమించని ఒక నిర్ణీత కాలం వరకు వారు ప్రయోజనం చెందటం కొరకు మునగటం నుండి వారిని రక్షించి,వారిని మరలించి వారిపై మేము కరుణిస్తే తప్ప. బహుశా వారు గుణపాఠం నేర్చుకుని విశ్వసిస్తారేమో.
আৰবী তাফছীৰসমূহ:
وَاِذَا قِیْلَ لَهُمُ اتَّقُوْا مَا بَیْنَ اَیْدِیْكُمْ وَمَا خَلْفَكُمْ لَعَلَّكُمْ تُرْحَمُوْنَ ۟
మరియు విశ్వాసము నుండి విముఖత చూపే ముష్రికులందరితో ఇలా పలకబడినప్పుడు : మీరు ఎదుర్కోబోతున్న పరలోక విషయం, దాని ప్రతికూలత విషయంలో జాగ్రత్తపడండి. మరియు వెనుకకు మళ్ళిపోయే ఇహలోకముతో అల్లాహ్ మీపై తన కారుణ్యముతో ఉపకారము చేస్తాడని ఆశిస్తూ జాగ్రత్తపడండి. వారు దానికి కట్టుబడి ఉండలేదు. అంతే కాదు వారు దాన్ని లెక్క చేయకుండా దాని నుండి విముఖత చూపారు.
আৰবী তাফছীৰসমূহ:
وَمَا تَاْتِیْهِمْ مِّنْ اٰیَةٍ مِّنْ اٰیٰتِ رَبِّهِمْ اِلَّا كَانُوْا عَنْهَا مُعْرِضِیْنَ ۟
మరియు ఎప్పుడైన మొండిగా వ్యవహరించే ఈ ముష్రికులందరి వద్దకు అల్లాహ్ ఏకత్వమును,ఆరాధనకు ఆయన ఒక్కడే యోగ్యుడవటమునకు సూచించే అల్లాహ్ ఆయతులు వస్తే వారు వాటితో గుణపాఠమును నేర్చుకోకుండా వాటి నుండి విముఖత చూపేవారు.
আৰবী তাফছীৰসমূহ:
وَاِذَا قِیْلَ لَهُمْ اَنْفِقُوْا مِمَّا رَزَقَكُمُ اللّٰهُ ۙ— قَالَ الَّذِیْنَ كَفَرُوْا لِلَّذِیْنَ اٰمَنُوْۤا اَنُطْعِمُ مَنْ لَّوْ یَشَآءُ اللّٰهُ اَطْعَمَهٗۤ ۖۗ— اِنْ اَنْتُمْ اِلَّا فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟
మరియు మొండిగా వ్యవహరించే వారితో మీరు పేదవారికి,అగత్యపరులకు అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిలో నుండి ఇచ్చి సహాయం చేయండి అని అనబడినప్పుడు వారు విశ్వసించిన వారితో తిరస్కరిస్తూ ఇలా పలుకుతూ వాపసు చేస్తారు : అల్లాహ్ ఎవరికైతే తినిపించదలచుకుంటే అతనికి తినిపిస్తాడో వాడిని మేము తివిపించాలా ?! కావున మేము ఆయన ఇచ్చకు విరుద్ధంగా చేయము. ఓ విశ్వాసపరులారా మీరు మాత్రం స్పష్టమైన తప్పిదములో,సత్యము నుండి దూరంగా ఉన్నారు.
আৰবী তাফছীৰসমূহ:
وَیَقُوْلُوْنَ مَتٰی هٰذَا الْوَعْدُ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
మరియు మరణాంతరం లేపబడటమును తిరస్కరించే అవిశ్వాసపరులు దాన్ని తిరస్కరిస్తూ,దాన్ని దూరంగా భావిస్తూ ఇలా పలికేవారు : ఓ విశ్వాసపరులారా ఈ మరణాంతరం లేపబడటం ఒక వేళ మీరు అది వాటిల్లుతుంది అన్న మీ వాదనలో సత్యవంతులేనైతే ఎప్పుడో చెప్పండి ?!
আৰবী তাফছীৰসমূহ:
مَا یَنْظُرُوْنَ اِلَّا صَیْحَةً وَّاحِدَةً تَاْخُذُهُمْ وَهُمْ یَخِصِّمُوْنَ ۟
మరణాంతరము లేపబడటమును తిరస్కరించే,దాన్ని దూరంగా భావించే వీరందరు మాత్రం బాకాలో ఊదినప్పటి మొదటి ఊదటమునకు నిరీక్షిస్తున్నారు. వారు తమ ప్రాపంచిక కార్యాలైన క్రయ విక్రయలు,(తోటలకు) నీళ్ళను పెట్టటం,(జంతువులను) మేపటం ఇతర ప్రాపంచిక కార్యాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు అది వారిని అకస్మాత్తుగా పట్టుకుంటుంది.
আৰবী তাফছীৰসমূহ:
فَلَا یَسْتَطِیْعُوْنَ تَوْصِیَةً وَّلَاۤ اِلٰۤی اَهْلِهِمْ یَرْجِعُوْنَ ۟۠
ఈ అరుపు వారిపై అకస్మాత్తుగా వచ్చినప్పుడు వారు ఒకరినొకరు వీలునామ వ్రాసుకోలేక పోతారు. మరియు వారు తమ ఇండ్లకు,తమ ఇంటివారి వద్దకు మరలి వెళ్ళలేకపోతారు. అంతేకాదు వారు తమ ఈ కార్యాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు మరణిస్తారు.
আৰবী তাফছীৰসমূহ:
وَنُفِخَ فِی الصُّوْرِ فَاِذَا هُمْ مِّنَ الْاَجْدَاثِ اِلٰی رَبِّهِمْ یَنْسِلُوْنَ ۟
మరియు మరణాంతరం లేపటం కొరకు రెండవసారి బాకా ఊదినప్పుడు వారందరు తమ సమాధుల నుండి లెక్కతీసుకొనబడటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు తమ ప్రభువు వైపునకు వేగముగా వెలికి వస్తారు.
আৰবী তাফছীৰসমূহ:
قَالُوْا یٰوَیْلَنَا مَنْ بَعَثَنَا مِنْ مَّرْقَدِنَا ۣٚۘ— هٰذَا مَا وَعَدَ الرَّحْمٰنُ وَصَدَقَ الْمُرْسَلُوْنَ ۟
మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఈ అవిశ్వాసపరులందరు అవమానపడుతూ ఇలా అంటారు: అయ్యో మా దౌర్భాగ్యము మా సమాధుల నుండి మమ్మల్ని ఎవరు మరల లేపాడు ?!. వారి ప్రశ్న గురించి వారు ఇలా సమాధానమివ్వబడుతారు : అల్లాహ్ వాగ్దానం చేసినది ఇదే నిశ్చయంగా అది ఖచ్చితంగా జరిగినది. మరియు దైవ ప్రవక్తలు తమ ప్రభువు వద్ద నుండి చేరవేసిన దీని విషయంలో నిజం పలికారు.
আৰবী তাফছীৰসমূহ:
اِنْ كَانَتْ اِلَّا صَیْحَةً وَّاحِدَةً فَاِذَا هُمْ جَمِیْعٌ لَّدَیْنَا مُحْضَرُوْنَ ۟
సమాధుల నుండి మరణాంతరం లేపబడే విషయం కేవలం బాకాలో రెండవసారి ఊదటం యొక్క ప్రభావము మాత్రమే. అంతే సృష్టితాలన్ని ప్రళయదినాన లెక్కతీసుకొనబడటం కొరకు మా వద్ద హాజరు చేయబడుతారు.
আৰবী তাফছীৰসমূহ:
فَالْیَوْمَ لَا تُظْلَمُ نَفْسٌ شَیْـًٔا وَّلَا تُجْزَوْنَ اِلَّا مَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟
ఆ రోజు తీర్పు న్యాయముతో జరుగును. ఓ దాసులారా మీ పాపములను అధికం చేసి లేదా మీ పుణ్యాలను తగ్గించి మీకు కొంచెము కూడా అన్యాయం చేయబడదు. ఇహలోకములో మీరు చేసుకున్న కర్మలకు మీరు పూర్తిగా ప్రతిఫలము మాత్రమే ప్రసాదించబడుతారు.
আৰবী তাফছীৰসমূহ:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• من أساليب تربية الله لعباده أنه جعل بين أيديهم الآيات التي يستدلون بها على ما ينفعهم في دينهم ودنياهم.
అల్లాహ్ తన దాసులకు శిక్షణ ఇచ్చే పద్దతుల్లోంచి ఆయన వారి ముందట వారు తమ ధర్మ విషయంలో,తమ ప్రాపంచిక విషయంలో తమకు ప్రయోజనం కలిగించే వాటిపై ఆధారాలను ఇవ్వటానికి సూచనలనివ్వటం.

• الله تعالى مكَّن العباد، وأعطاهم من القوة ما يقدرون به على فعل الأمر واجتناب النهي، فإذا تركوا ما أمروا به، كان ذلك اختيارًا منهم.
మహోన్నతుడైన అల్లాహ్ దాసులకు స్థానమును కలిగించి వారికి ఆదేశమును పాటించటంపై,వారింపులకు దూరంగా ఉండటంపై సామర్ధ్యమును కలిగి ఉండే బలాన్ని ప్రసాదించాడు. వారు తమకు ఆదేశించబడిన వాటిని వదిలి వేస్తే అది వారు తమ తరపు నుండి చేసుకున్న ఎంపిక అవుతుంది.

 
অৰ্থানুবাদ ছুৰা: ইয়াছীন
ছুৰাৰ তালিকা পৃষ্ঠা নং
 
আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ - অনুবাদসমূহৰ সূচীপত্ৰ

তাফছীৰ চেণ্টাৰ ফৰ কোৰানিক ষ্টাডিজৰ ফালৰ পৰা প্ৰচাৰিত।

বন্ধ