Check out the new design

আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ * - অনুবাদসমূহৰ সূচীপত্ৰ


অৰ্থানুবাদ ছুৰা: আচ-চা-ফফা-ত   আয়াত:
فَلَمَّاۤ اَسْلَمَا وَتَلَّهٗ لِلْجَبِیْنِ ۟ۚ
ఎప్పుడైతే వారిద్దరు అల్లాహ్ కి లోబడి ఆయనకు విధేయులయ్యారో ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడిని తన ప్రభువు అతన్ని జుబహ్ చేయమని ఆదేశించిన దాన్ని నెరవేర్చటానికి అతని నుదటి మీద బొర్లా పడుకోబెట్టారు.
আৰবী তাফছীৰসমূহ:
وَنَادَیْنٰهُ اَنْ یّٰۤاِبْرٰهِیْمُ ۟ۙ
మరియు మేము ఇబ్రాహీం ను అతను తన కుమారుడిని జుబహ్ చేయమని అల్లాహ్ ఆదేశించిన దాన్ని నెరవేర్చటానికి పూనుకుని ఉన్నప్పుడు ఇలా పిలిచాము : ఓ ఇబ్రాహీం
আৰবী তাফছীৰসমূহ:
قَدْ صَدَّقْتَ الرُّءْیَا ۚ— اِنَّا كَذٰلِكَ نَجْزِی الْمُحْسِنِیْنَ ۟
నిశ్ఛయంగా నీవు నీ నిదురలో చూసిన కలను నీ కుమారుని జుబహ్ చేసే దృఢ సంకల్పము ద్వారా నిజం చేసి చూపించావు. ఈ పెద్ద పరీక్ష నుండి నిన్ను విముక్తిని కలిగించి మేము నీకు ప్రతిఫలమును ప్రసాదించినట్లే సజ్జనులకు ప్రతిఫలమును ప్రసాదిస్తాము. కావున మేము వారిని పరీక్షల నుండి,కష్టాల నుండి విముక్తిని కలిగిస్తాము.
আৰবী তাফছীৰসমূহ:
اِنَّ هٰذَا لَهُوَ الْبَلٰٓؤُا الْمُبِیْنُ ۟
నిశ్ఛయంగా ఇదే స్పష్టమైన పరీక్ష. మరియు నిశ్ఛయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం అందులో సాఫల్యం చెందారు.
আৰবী তাফছীৰসমূহ:
وَفَدَیْنٰهُ بِذِبْحٍ عَظِیْمٍ ۟
మరియు మేము ఇస్మాయీలు అలైహిస్సలాంకు బదులుగా ఆయన తరపు నుండి జుబహ్ చేయటానికి ఒక పెద్ద గొర్రెను పరిహారంగా ఇచ్చాము.
আৰবী তাফছীৰসমূহ:
وَتَرَكْنَا عَلَیْهِ فِی الْاٰخِرِیْنَ ۟ؗ
మరియు మేము తరువాత వచ్చే తరాలలో ఇబ్రాహీం అలైహిస్సలాం పై మంచి కీర్తిని ఉంచాము.
আৰবী তাফছীৰসমূহ:
سَلٰمٌ عَلٰۤی اِبْرٰهِیْمَ ۟
అల్లాహ్ వద్ద నుండి ఆయన కొరకు అభినందనలు, ప్రతీ నష్టము,ఆపద నుండి భద్రత యొక్క ప్రార్ధన లభించినది.
আৰবী তাফছীৰসমূহ:
كَذٰلِكَ نَجْزِی الْمُحْسِنِیْنَ ۟
మేము ఇబ్రాహీం అలైహిస్సలాంకు ఆయన విధేయత చూపటంపై ఈ ప్రతిఫలమును ప్రసాదించినట్లే సజ్జనులకు ప్రతిఫలమును ప్రసాదిస్తాము.
আৰবী তাফছীৰসমূহ:
اِنَّهٗ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِیْنَ ۟
నిశ్ఛయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ కొరకు ఆరాధనను తగిన విధంగా పూర్తి చేసే విశ్వాసపరులైన మా దాసుల్లోంచివారు.
আৰবী তাফছীৰসমূহ:
وَبَشَّرْنٰهُ بِاِسْحٰقَ نَبِیًّا مِّنَ الصّٰلِحِیْنَ ۟
మరియు మేము ఆయనకు తన ఏకైక కుమారుడిని జుబహ్ చేయటంలో అల్లాహ్ కు తన విధేయత చూపటంపై ప్రతిఫలంగా ప్రవక్త, పుణ్యదాసుడయ్యే ఇంకొక కుమారుడి శుభవార్తనిచ్చాము. అతడే ఇస్హాఖ్ అలైహిస్సలాం.
আৰবী তাফছীৰসমূহ:
وَبٰرَكْنَا عَلَیْهِ وَعَلٰۤی اِسْحٰقَ ؕ— وَمِنْ ذُرِّیَّتِهِمَا مُحْسِنٌ وَّظَالِمٌ لِّنَفْسِهٖ مُبِیْنٌ ۟۠
మరియు మేము అతనిపై,అతని కుమారుడగు ఇస్హాఖ్ పై మా వద్ద నుండి శుభాలను కురిపించాము. అప్పుడు మేము వారి కొరకు అనుగ్రహాలను అధికం చేశాము. మరియు వారిద్దరి సంతానము అధికమవటం వాటిలో నుండే. మరియు వారి సంతానములో నుండి తమ ప్రభువు కొరకు తమ విధేయతను మంచిగా చేసే వారున్నారు. మరియు వారిలో నుండి అవిశ్వాసము,పాపకార్యములకు పాల్పడటం ద్వారా తమ స్వయంపై స్పష్టమైన దుర్మార్గమునకు పాల్పడిన వారున్నారు.
আৰবী তাফছীৰসমূহ:
وَلَقَدْ مَنَنَّا عَلٰی مُوْسٰی وَهٰرُوْنَ ۟ۚ
మరియు నిశ్ఛయంగా మేము మూసా మరియు ఆయన సోదరుడైన హారూన్ పై దైవదౌత్యము ద్వారా ఉపకారము చేశాము.
আৰবী তাফছীৰসমূহ:
وَنَجَّیْنٰهُمَا وَقَوْمَهُمَا مِنَ الْكَرْبِ الْعَظِیْمِ ۟ۚ
మరియు మేము వారిని, వారి జాతి వారైన ఇస్రాయీలు సంతతి వారిని ఫిర్ఔన్ వారిని బానిసలుగా చేసుకోవటం నుండి మరియు మునగటం నుండి విముక్తిని కలిగించాము.
আৰবী তাফছীৰসমূহ:
وَنَصَرْنٰهُمْ فَكَانُوْا هُمُ الْغٰلِبِیْنَ ۟ۚ
మరియు మేము వారికి ఫిర్ఔన్,అతని సైన్యములకు వ్యతిరేకముగా సహాయం చేశాము. అప్పుడు వారికి వారి శతృవులపై విజయం కలిగింది.
আৰবী তাফছীৰসমূহ:
وَاٰتَیْنٰهُمَا الْكِتٰبَ الْمُسْتَبِیْنَ ۟ۚ
మరియు మేము మూసా,ఆయన సోదరుడు హారూన్ కి తౌరాతును అల్లాహ్ వద్ద నుండి ఎటువంటి సందేహము లేని గ్రంధముగా ప్రసాదించాము.
আৰবী তাফছীৰসমূহ:
وَهَدَیْنٰهُمَا الصِّرَاطَ الْمُسْتَقِیْمَ ۟ۚ
మరియు మేము వారిద్దరికి ఎటువంటి వంకరుతనం లేని రుజుమార్గమును చూపించాము. మరియు అది పరిశుద్ధుడైన సృష్టికర్త ఇష్టతకు చేరవేసే ఇస్లాం ధర్మం.
আৰবী তাফছীৰসমূহ:
وَتَرَكْنَا عَلَیْهِمَا فِی الْاٰخِرِیْنَ ۟ۙۖ
మరియు మేము వచ్చే తరాలలో వారికి మంచి కీర్తిని మరియు మంచి ప్రస్తావనను మిగిలి ఉండేలా చేశాము.
আৰবী তাফছীৰসমূহ:
سَلٰمٌ عَلٰی مُوْسٰی وَهٰرُوْنَ ۟
వారి కొరకు అల్లాహ్ వద్ద నుండి మంచి అభినందనలు,వారికి కీర్తి, ప్రతీ ఇష్టం లేని వాటి నుండి భద్రత కొరకు ప్రార్ధన కలవు.
আৰবী তাফছীৰসমূহ:
اِنَّا كَذٰلِكَ نَجْزِی الْمُحْسِنِیْنَ ۟
నిశ్ఛయంగా మేము మూసా,హారూన్ కు ఈ మంచి ప్రతిఫలమును ప్రసాదించినట్లే తమ ప్రభువు కొరకు తమ విధేయత ద్వారా మంచి చేసేవారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాము.
আৰবী তাফছীৰসমূহ:
اِنَّهُمَا مِنْ عِبَادِنَا الْمُؤْمِنِیْنَ ۟
నిశ్ఛయంగా మూసా,హారూన్ అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచే, ఆయన వారి కొరకు ధర్మబద్దం చేసిన వాటిని ఆచరించే మా దాసులలోంచివారు.
আৰবী তাফছীৰসমূহ:
وَاِنَّ اِلْیَاسَ لَمِنَ الْمُرْسَلِیْنَ ۟ؕ
మరియు నిశ్ఛయంగా ఇల్యాస్ తన ప్రభువు వద్ద నుండి పంపించబడిన ప్రవక్తల్లోంచి వారు. అల్లాహ్ ఆయన పై దైవదౌత్యము,సందేశాలను చేరవేయటమును అనుగ్రహించాడు.
আৰবী তাফছীৰসমূহ:
اِذْ قَالَ لِقَوْمِهٖۤ اَلَا تَتَّقُوْنَ ۟
అతను తాను ప్రవక్తగా పంపించబడిన తన జాతి ఇస్రాయీలు సంతతి వారితో ఇలా పలికినప్పుడు : ఓ నా జాతివారా మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి అందులో నుండి తౌహీదు ఉన్నది మరియు తాను వారించిన వాటి నుండి జాగ్రత్త వహించి వాటిలో నుండి షిర్కు ఉన్నది మీరు అల్లాహ్ కి భయపడరా ?.
আৰবী তাফছীৰসমূহ:
اَتَدْعُوْنَ بَعْلًا وَّتَذَرُوْنَ اَحْسَنَ الْخَالِقِیْنَ ۟ۙ
ఏమీ మీరు అల్లాహ్ ను వదిలి మీ విగ్రహమైన బఅల్ ను ఆరాధిస్తున్నారా మరియు సర్వోత్తముడైన అల్లాహ్ ఆరాధనను వదిలివేస్తున్నారా ?!.
আৰবী তাফছীৰসমূহ:
اللّٰهَ رَبَّكُمْ وَرَبَّ اٰبَآىِٕكُمُ الْاَوَّلِیْنَ ۟
మరియు అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించిన,మీ పూర్వికులైన తాతముత్తాతలను సృష్టించిన మీ ప్రభువు. ఆయనే ఆరాధనకు యోగ్యుడు. ఆయన కాకుండా లాభం చేయలేని,నష్టం కలిగించని విగ్రహాలు కావు.
আৰবী তাফছীৰসমূহ:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• قوله: ﴿فَلَمَّآ أَسْلَمَا﴾ دليل على أن إبراهيم وإسماعيل عليهما السلام كانا في غاية التسليم لأمر الله تعالى.
ఆయన వాక్కు : {فَلَمَّآ أَسْلَمَا} "వారిద్దరు దైవాజ్ఞకు శిరసా వహించినప్పుడు" ఇబ్రాహీం,ఇస్మాయీలు అలైహిమస్సలాం ఇద్దరూ మహోన్నతుడైన అల్లాహ్ ఆదేశమునకు అత్యంత శిరసా వహించారన్న దానికి ఆధారము.

• من مقاصد الشرع تحرير العباد من عبودية البشر.
మానవుల ఆరాధన నుండి దాసులను విముక్తి కలిగించటం ధర్మ లక్ష్యములలోంచిది.

• الثناء الحسن والذكر الطيب من النعيم المعجل في الدنيا.
మంచి కీర్తి,మంచి ప్రస్తావన ఇహలోకములో తొందరగా లభించే అనుగ్రహాలలోంచివి.

 
অৰ্থানুবাদ ছুৰা: আচ-চা-ফফা-ত
ছুৰাৰ তালিকা পৃষ্ঠা নং
 
আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ - অনুবাদসমূহৰ সূচীপত্ৰ

তাফছীৰ চেণ্টাৰ ফৰ কোৰানিক ষ্টাডিজৰ ফালৰ পৰা প্ৰচাৰিত।

বন্ধ