Check out the new design

আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - তেলেগু অনুবাদ- আব্দুৰ ৰহীম বিন মুহাম্মদ * - অনুবাদসমূহৰ সূচীপত্ৰ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

অৰ্থানুবাদ ছুৰা: আল-বাক্বাৰাহ   আয়াত:
كُتِبَ عَلَیْكُمُ الْقِتَالُ وَهُوَ كُرْهٌ لَّكُمْ ۚ— وَعَسٰۤی اَنْ تَكْرَهُوْا شَیْـًٔا وَّهُوَ خَیْرٌ لَّكُمْ ۚ— وَعَسٰۤی اَنْ تُحِبُّوْا شَیْـًٔا وَّهُوَ شَرٌّ لَّكُمْ ؕ— وَاللّٰهُ یَعْلَمُ وَاَنْتُمْ لَا تَعْلَمُوْنَ ۟۠
మీకు అసహ్యకరమైనా! (ధర్మ) యుద్ధం చేయటం మీకు విధిగా నిర్ణయించబడింది[1]. మరియు మీకు నచ్చని విషయమే మీకు మేలైనది కావచ్చు మరియు మీకు నచ్చే విషయమే మీకు హానికరమైనది కావచ్చు! మరియు అల్లాహ్ కు అంతా తెలుసు, కాని మీకు ఏమీ తెలియదు.
[1] చూడండి, 2:190-193, 22:39.
আৰবী তাফছীৰসমূহ:
یَسْـَٔلُوْنَكَ عَنِ الشَّهْرِ الْحَرَامِ قِتَالٍ فِیْهِ ؕ— قُلْ قِتَالٌ فِیْهِ كَبِیْرٌ ؕ— وَصَدٌّ عَنْ سَبِیْلِ اللّٰهِ وَكُفْرٌ بِهٖ وَالْمَسْجِدِ الْحَرَامِ ۗ— وَاِخْرَاجُ اَهْلِهٖ مِنْهُ اَكْبَرُ عِنْدَ اللّٰهِ ۚ— وَالْفِتْنَةُ اَكْبَرُ مِنَ الْقَتْلِ ؕ— وَلَا یَزَالُوْنَ یُقَاتِلُوْنَكُمْ حَتّٰی یَرُدُّوْكُمْ عَنْ دِیْنِكُمْ اِنِ اسْتَطَاعُوْا ؕ— وَمَنْ یَّرْتَدِدْ مِنْكُمْ عَنْ دِیْنِهٖ فَیَمُتْ وَهُوَ كَافِرٌ فَاُولٰٓىِٕكَ حَبِطَتْ اَعْمَالُهُمْ فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ ۚ— وَاُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
వారు నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయటాన్ని గురించి నిన్ను అడుగుతున్నారు[1]. వారితో ఇలా అను: "వాటిలో యుద్ధం చేయటం మహా అపరాధం. కాని (ప్రజలను) అల్లాహ్ మార్గాన్ని అవలంబించటం నుండి అవరోధాలు కలిగించటం మరియు ఆయన (అల్లాహ్)ను తిరస్కరించటం మరియు (ప్రజలను) మస్జిద్ అల్ హరామ్ ను దర్శించకుండా ఆటంకపరచడం మరియు అక్కడి వారిని దాని నుండి వెడలగొట్టడం అల్లాహ్ దృష్టిలో అంతకంటే మహా అపరాధం. పీడన (ఫిత్నా), రక్తపాతం కంటే ఘోరమైనది[2]. వారికి సాధ్యమే అయితే మిమ్మల్ని మీ ధర్మం నుండి మళ్ళించ గలిగే వరకూ వారు మీతో యుద్ధం చేయడం మానరు. మరియు మీలో ఎవరైనా మతభ్రష్టులై సత్యతిరస్కారులుగా మరణిస్తే, అలాంటి వారి మంచిపనులన్నీ ఇహపర లోకాలలో రెండింటిలోనూ వృథా అవుతాయి. మరియు అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు."
[1] నిషిద్ధ మాసాలు హిజ్రీ శకపు 1, 7, 11 మరియు 12వ నెలలు, వివరాలకు చూడండి, 2:194 మరియు దాని వ్యాఖ్యానం 1. పైన పేర్కొన్న నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయటం ఇస్లాంకు ముందు కూడా అరేబియాలో నిషిద్ధంగా ఉండేది. ఈ ఆయత్ అవతరణను గురించి ఇలా ఉంది : ఒక 'స'హాబీల దళం రజబ్ నెలలో ఒక సత్య తిరస్కారిని చంపి మరికొందరిని ఖైదీలుగా తీసుకుంటారు. అప్పుడు ఆ 'స'హాబీలకు రజబ్ నెల ప్రారంభమైనది తెలియదు. అప్పుడు సత్యతిరస్కారులు : "ఈ ముస్లింలు నిషిద్ధ మాసాలను కూడా లెక్క చేయడం లేదు." ని నిందిస్తారు. ఆ సందర్భంలో ఈ ఆయత్ అవతరింపజేయబడింది. [2] చూడండి, 2:191 వ్యాఖ్యానం 2.
আৰবী তাফছীৰসমূহ:
اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَالَّذِیْنَ هَاجَرُوْا وَجٰهَدُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ ۙ— اُولٰٓىِٕكَ یَرْجُوْنَ رَحْمَتَ اللّٰهِ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
నిశ్చయంగా, విశ్వసించిన వారు మరియు (అల్లాహ్ మార్గంలో తమ జన్మభూమిని విడిచి) వలస పోయేవారు మరియు అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేసేవారు; ఇలాంటి వారే! అల్లాహ్ కారుణ్యం ఆశించటానికి అర్హులు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.
আৰবী তাফছীৰসমূহ:
یَسْـَٔلُوْنَكَ عَنِ الْخَمْرِ وَالْمَیْسِرِ ؕ— قُلْ فِیْهِمَاۤ اِثْمٌ كَبِیْرٌ وَّمَنَافِعُ لِلنَّاسِ ؗ— وَاِثْمُهُمَاۤ اَكْبَرُ مِنْ نَّفْعِهِمَا ؕ— وَیَسْـَٔلُوْنَكَ مَاذَا یُنْفِقُوْنَ ؕ۬— قُلِ الْعَفْوَؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمُ الْاٰیٰتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُوْنَ ۟ۙ
(ఓ ప్రవక్తా!) వారు, మధ్యపానాన్ని మరియు జూదాన్ని గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు[1]. నీవు ఈ విధంగా సమాధానమివ్వు: "ఈ రెంటింటిలోనూ ఎంతో హాని (పాపం) ఉంది. వాటిలో ప్రజలకు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి, కాని వాటి హాని (పాపం) వాటి లాభాల కంటే ఎంతో అధికమైనది." మరియు వారిలా అడుగుతున్నారు: "మేము (అల్లాహ్ మార్గంలో) ఏమి ఖర్చు పెట్టాలి?" నీవు ఇలా సమాధానమివ్వు: "మీ (నిత్యావసరాలకు పోగా) మిగిలేది."[2] మీరు ఆలోచించటానికి, అల్లాహ్ ఈ విధంగా తన సూచన (ఆయత్)లను మీకు విశదీకరిస్తున్నాడు -
[1] చూడండి, 4:43, 5:90-91. 'స. బు'ఖారీ, పుస్తకం - 6, 'హదీస్' నం. 383, 'స. బు'ఖారీ, పుస్తకం - 7, 'హదీస్' నం. 481, 483, 484. [2] అంటే తమ పోషణలో ఉన్న వారి అవసరాలను పూర్తి చేసిన తరువాత. ఉన్నదంతా ఖర్చు పెట్టి, తరువాత అవసరం పడితే ఇతరుల ముందు చేయి చాపవలసిన పరిస్థితి కూడా తెచ్చుకోరాదు.
আৰবী তাফছীৰসমূহ:
 
অৰ্থানুবাদ ছুৰা: আল-বাক্বাৰাহ
ছুৰাৰ তালিকা পৃষ্ঠা নং
 
আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - তেলেগু অনুবাদ- আব্দুৰ ৰহীম বিন মুহাম্মদ - অনুবাদসমূহৰ সূচীপত্ৰ

অনুবাদ কৰিছে আব্দুৰ ৰহীম বিন মুহাম্মদ চাহাবে।

বন্ধ