Übersetzung der Bedeutungen von dem heiligen Quran - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Übersetzungen


Übersetzung der Bedeutungen Surah / Kapitel: Sâd   Vers:

సూరహ్ సాద్

Die Ziele der Surah:
ذكر المخاصمة بالباطل وعاقبتها.
అసత్యముతో పోరాటము మరియు దాని పరిణామము ప్రస్తావన.

صٓ وَالْقُرْاٰنِ ذِی الذِّكْرِ ۟ؕ
సూరె బఖరా ఆరంభంలో విడి విడిగా ఉండే అక్షరాల (హురూఫె ముఖత్తఆత్ ల) సారూప్యముపై చర్చ జరిగినది. ప్రజలకు వారి ఇహలోకములో,పరలోకములో వారికి ప్రయోజనం కలిగించే వాటితో హితబోధనతో కూడుకుని ఉన్న ఖుర్ఆన్ పై ప్రమాణం చేశాడు. ముష్రికులు అల్లాహ్ తో పాటు భాగస్వాములు ఉన్నారని భావిస్తున్నట్లు విషయం లేదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
بَلِ الَّذِیْنَ كَفَرُوْا فِیْ عِزَّةٍ وَّشِقَاقٍ ۟
కాని అవిశ్వాసపరులు అల్లాహ్ ఏకత్వము నుండి గర్వములో,అహంకారములో మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో విభేదాల్లో,ఆయనతో విరోధంలో ఉన్నారు.
Arabische Interpretationen von dem heiligen Quran:
كَمْ اَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِّنْ قَرْنٍ فَنَادَوْا وَّلَاتَ حِیْنَ مَنَاصٍ ۟
వారికన్న మునుపు తమ ప్రవక్తలను తిరస్కరించినటువంటి ఎన్నో తరాలను నాశనం చేశాము. అప్పుడు వారు తమపై శిక్ష అవతరించేటప్పుడు సహాయమును కోరుతూ పిలిచారు. మరియు ఆయన వద్ద నుండి సహాయం వారికి ప్రయోజనం కలిగించటానికి వారి కొరకు శిక్ష నుండి తప్పించుకునే సమయం లేకపోయింది.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَعَجِبُوْۤا اَنْ جَآءَهُمْ مُّنْذِرٌ مِّنْهُمْ ؗ— وَقَالَ الْكٰفِرُوْنَ هٰذَا سٰحِرٌ كَذَّابٌ ۟ۖۚ
మరియు వారి వద్దకు ఒక వేళ వారు తమ అవిశ్వాసములోనే కొనసాగితే అల్లాహ్ శిక్ష నుండి వారిని భయపెడుతూ వారిలో నుండే ఒక ప్రవక్త వచ్చినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. మరియు ఎప్పుడైతే అవిశ్వాసపరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చినది సత్యం అవటంపై ఆధారాలను చూశారో ఇలా పలికారు : ఇతడు ప్రజలను మంత్రజాలానికి గురిచేసే ఒక మంత్రజాలకుడు, తాను అల్లాహ్ ప్రవక్త అని తన వైపు దైవవాణి అవతరింపబడుతుందని తాను వాదించిన విషయంలో అసత్యపరుడు.
Arabische Interpretationen von dem heiligen Quran:
اَجَعَلَ الْاٰلِهَةَ اِلٰهًا وَّاحِدًا ۖۚ— اِنَّ هٰذَا لَشَیْءٌ عُجَابٌ ۟
ఏమీ ఈ వ్యక్తి బహుళ దైవాలను ఒకే ఆరాధ్యదైవంగా,ఆయన తప్ప ఇంకో దైవం లేనట్లుగా చేశాడా ?. ఇతని ఈ కార్యము అత్యంత ఆశ్ఛర్యకరము.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَانْطَلَقَ الْمَلَاُ مِنْهُمْ اَنِ امْشُوْا وَاصْبِرُوْا عَلٰۤی اٰلِهَتِكُمْ ۖۚ— اِنَّ هٰذَا لَشَیْءٌ یُّرَادُ ۟ۚ
మరియు వారి నాయకులు,వారి పెద్దలు తమను అనుసరించే వారితో ఇలా పలుకుతూ వెళ్ళారు : మీరు దేనిపైనైతే ఉన్నారో అలాగే నడవండి. మరియు మీరు ముహమ్మద్ ధర్మంలో ప్రవేశించకండి. మీ దైవాల ఆరాధనలో స్థిరంగా ఉండండి. నిశ్చయంగా ముహమ్మద్ మిమ్మల్ని ఒకే ఆరాధ్య దైవ ఆరాధన వైపునకు పిలుస్తున్న విషయం ఎటువంటిదంటే అతడు మనకంటే పైకి ఎదిగి మేము అతన్ని అనుసరించేవారమైపోవాలని కోరుతున్నాడు.
Arabische Interpretationen von dem heiligen Quran:
مَا سَمِعْنَا بِهٰذَا فِی الْمِلَّةِ الْاٰخِرَةِ ۖۚ— اِنْ هٰذَاۤ اِلَّا اخْتِلَاقٌ ۟ۖۚ
ముహమ్మద్ మమ్మల్ని పిలుస్తున్న అల్లాహ్ ఏకేశ్వరోపాసనను మా తాతముత్తాతలను మేము దేనిపైనైతే పొందామో అందులో, ఈసా అలైహిస్సలాం మతంలో మేము వినలేదు. మేము అతని నుండి విన్నది ఇది అబద్దము,బూటకం మాత్రమే.
Arabische Interpretationen von dem heiligen Quran:
ءَاُنْزِلَ عَلَیْهِ الذِّكْرُ مِنْ بَیْنِنَا ؕ— بَلْ هُمْ فِیْ شَكٍّ مِّنْ ذِكْرِیْ ۚ— بَلْ لَّمَّا یَذُوْقُوْا عَذَابِ ۟ؕ
ఏమీ మా అందరి మధ్యలో అతనిపైనే ఖుర్ఆన్ అవతరింపబడటం మరియు అతనినే ప్రత్యేకించటం సరైనదా ?. మరియు మాపై అవతరింపబడలేదు. వాస్తవానికి మేము నాయకులము,పెద్దలము. వాస్తవానికి ఈ ముష్రికులందరు మీపై అవతరింపబడిన దైవవాణి విషయంలో సందేహంలో ఉన్నారు. మరియు వారు అల్లాహ్ శిక్షను రుచిచూసినప్పుడు వారు తమకు గడువు ఇవ్వటం వలన మోసపోయారు. ఒక వేళ వారు దాని రుచి చూసి ఉంటే అవిశ్వాసంపై,అల్లాహ్ తోపాటు సాటి కల్పించటంపై,ఆయన మీవైపునకు అవతరింపజేసిన దైవవాణి విషయంలో సందేహ పడటంపై ధైర్యం చేసేవారు కాదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
اَمْ عِنْدَهُمْ خَزَآىِٕنُ رَحْمَةِ رَبِّكَ الْعَزِیْزِ الْوَهَّابِ ۟ۚ
లేదా ఈ తిరస్కరించే ముష్రికులందరి వద్ద ఎవరూ ఓడించలేని సర్వశక్తివంతుడైన నీ ప్రభువు యొక్క అనుగ్రహపు నిధులు కలవా. ఆయనే తాను కోరినదంతా తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. ఆయన అనుగ్రహము యొక్క నిధుల్లోంచి దైవదౌత్యము. దాన్ని ఆయన తాను తలచిన వారికి ప్రసాదిస్తాడు. దాన్ని వారు తాము తలచిన వారికి అనుగ్రహించటానికి మరియు తాము కోరిన వారికి దాన్ని అనుగ్రహించటానికి అది వారి కొరకు కాదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
اَمْ لَهُمْ مُّلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا ۫— فَلْیَرْتَقُوْا فِی الْاَسْبَابِ ۟
లేదా వారికి ఆకాశములపై,భూమిపై మరియు వాటిలో ఉన్నటువంటి వాటిపై అధికారం ఉన్నదా ? .వారికి ఇచ్చే,ఆపే హక్కు ఉండాటానికి. ఒక వేళ ఇది వారి వాదన అయితే వారు నిర్ణయించుకున్నది ఆపటం లేదా ఇవ్వటం గురించి ఆదేశమునకు సామర్ధ్యం పొందటానికి ఆకాశమునకు చేరవేసే కారకాలను తయారు చేసుకోవాలి. వారికి దాని శక్తి లేదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
جُنْدٌ مَّا هُنَالِكَ مَهْزُوْمٌ مِّنَ الْاَحْزَابِ ۟
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించే వీరందరు తమ కన్న ముందు గతించిన తమ ప్రవక్తలను తిరస్కరించిన సైన్యములవలే పరాభవమునకు లోనయిన సైన్యము.
Arabische Interpretationen von dem heiligen Quran:
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّعَادٌ وَّفِرْعَوْنُ ذُو الْاَوْتَادِ ۟ۙ
వీరందరు మొదట తిరస్కరించిన వారు కాదు. వీరికన్న ముందు నూహ్ జాతివారు తిరస్కరించారు. మరియు ఆద్ తిరస్కరించింది. మరియు ఫిర్ఔన్ ఎవరికైతే మేకులు ఉండి వాటితో ప్రజలను యాతనకు గురిచేసేవాడో తిరస్కరించాడు.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَثَمُوْدُ وَقَوْمُ لُوْطٍ وَّاَصْحٰبُ لْـَٔیْكَةِ ؕ— اُولٰٓىِٕكَ الْاَحْزَابُ ۟
మరియు సమూద్ తిరస్కరించింది. మరియు లూత్ జాతి తిరస్కరించింది.మరియు షుఐబ్ జాతి తిరస్కరించింది. వారందరే ఆ వర్గాలు ఎవరైతే తమ ప్రవక్తలను తిరస్కరించటంపై మరియు వారు తీసుకుని వచ్చిన దాన్ని అవిశ్వసించటంపై వర్గములుగా మారారు.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِنْ كُلٌّ اِلَّا كَذَّبَ الرُّسُلَ فَحَقَّ عِقَابِ ۟۠
ఈ వర్గములన్నింటిలో నుంచి ప్రతీ వర్గము నుండి ప్రవక్తలను తిరస్కరించటం మాత్రమే వాటిల్లింది. అప్పుడు వారిపై అల్లాహ్ శిక్ష అనివార్యమయ్యింది. మరియు వారిపై ఆయన శిక్ష దిగింది. ఒక వేళ అది కొంత సమయం వరకు ఆలస్యం అయినా సరే.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَمَا یَنْظُرُ هٰۤؤُلَآءِ اِلَّا صَیْحَةً وَّاحِدَةً مَّا لَهَا مِنْ فَوَاقٍ ۟
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించే వీరందరు ఎటువంటి మరలింపులేని రెండవ బాకా ఊదబడటమునకు ఎదురుచూస్తున్నారు. ఒక వేళ వారు తమ తిరస్కార స్థితిలోనే మరణిస్తే వారిపై శిక్ష వాటిల్లి తీరుతుంది.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَقَالُوْا رَبَّنَا عَجِّلْ لَّنَا قِطَّنَا قَبْلَ یَوْمِ الْحِسَابِ ۟
మరియు వారు పరిహాసమాడుతూ ఇలా పలికేవారు : ఓ మా ప్రభువా ప్రళయదినం కన్న ముందే ఇహలోకములోనే శిక్ష నుండి మా భాగమును తొందరగా ఇచ్చివేయి.
Arabische Interpretationen von dem heiligen Quran:
Die Nutzen der Versen in dieser Seite:
• أقسم الله عز وجل بالقرآن العظيم، فالواجب تَلقِّيه بالإيمان والتصديق، والإقبال على استخراج معانيه.
అల్లాహ్ అజ్జవజల్ల దివ్య ఖుర్ఆన్ పై ప్రమాణం చేశాడు. కాబట్టి దాన్ని విశ్వాసం,దృవీకరణ మరియు దాని అర్దాలను వెలికితీసే కోరికతో స్వీకరించటం తప్పనిసరి.

• غلبة المقاييس المادية في أذهان المشركين برغبتهم في نزول الوحي على السادة والكبراء.
ముష్రికుల మనస్సుల్లో దైవవాణి అవతరణ నాయకులపై,పెద్దవారిపై కలగాలనే వారి కోరిక వలన భౌతిక ప్రమాణాలు ప్రబలిపోయాయి.

• سبب إعراض الكفار عن الإيمان: التكبر والتجبر والاستعلاء عن اتباع الحق.
సత్యమును అనుసరించటం నుండి గర్వానికి,అహంకారానికి లోనవటం విశ్వాసపరులు విశ్వాసము నుండి విముఖత చూపటానికి కారణం.

اِصْبِرْ عَلٰی مَا یَقُوْلُوْنَ وَاذْكُرْ عَبْدَنَا دَاوٗدَ ذَا الْاَیْدِ ۚ— اِنَّهٗۤ اَوَّابٌ ۟
ఓ ప్రవక్తా ఈ తిరస్కారులందరు మీకు ఇష్టం లేని వాటిని పలుకుతున్న వాటిపై మీరు సహనం చూపండి. మరియు తన శతృవునితో పోరాడటానికి మరియు అల్లాహ్ కు విధేయత చూపటంపై సహనం చూపటానికి శక్తి ఉన్న మన దాసుడగు దావూద్ ను మీరు గుర్తు చేసుకోండి. నిశ్చయంగా ఆయన పశ్ఛాత్తాపము ద్వారా అల్లాహ్ వైపునకు అధికంగా మరలేవాడును,ఆయనకు ఇష్టమగు ఆచరణలను అధికంగా చేసేవాడును.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِنَّا سَخَّرْنَا الْجِبَالَ مَعَهٗ یُسَبِّحْنَ بِالْعَشِیِّ وَالْاِشْرَاقِ ۟ۙ
నిశ్ఛయంగా మేము పర్వతాలను దావూద్ కి ఉపయుక్తంగా చేశాము. పగటి చివరివేళలో మరియు దాని మొదటి వేళలో సూర్యోదయం అయ్యే వేళ ఆయన పరిశుద్ధతను కొనియాడినప్పుడు ఆయన పరిశుద్ధతను కొనియాడటంతోపాటు అవి పరిశుద్ధతను కొనియాడేవి.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَالطَّیْرَ مَحْشُوْرَةً ؕ— كُلٌّ لَّهٗۤ اَوَّابٌ ۟
మరియు మేము పక్షులను గాలిలో ఆగి ఉన్న స్థితిలో ఆదీనంలో చేశాము. ప్రతీ ఒక్కరు ఆయనకు విధేయతగా పరిశుద్దతను కొనియాడుతూ విధేయులై ఉన్నారు.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَشَدَدْنَا مُلْكَهٗ وَاٰتَیْنٰهُ الْحِكْمَةَ وَفَصْلَ الْخِطَابِ ۟
అతని శతృవులపై ప్రతిష్ట,బలం మరియు విజయాన్ని ప్రసాదించటం ద్వారా మేము అతని రాజ్యమునకు బలము చేకూర్చాము. మరియు మేము అతనికి దైవదౌత్యమును, అతని వ్యవహారముల్లో సరైనత్వమును ప్రసాదించాము. మరియు మేము అతనికి ప్రతీ ఉద్దేశంలో ప్రయోజనకర మాటతీరును మరియు మాట్లాడటంలో,ఆదేశించటంలో అనుగ్రహమును ప్రసాదించాము.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَهَلْ اَتٰىكَ نَبَؤُا الْخَصْمِ ۘ— اِذْ تَسَوَّرُوا الْمِحْرَابَ ۟ۙ
ఓ ప్రవక్తా మీ వద్దకు ఇద్దరు తగాదాపడే వారి వార్త వచ్చినదా ?. అప్పుడు వారు దావూద్ అలైహిస్సలాం వద్దకు ఆయన ఆరాధనాలయం పై ఎక్కి వచ్చారు.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِذْ دَخَلُوْا عَلٰی دَاوٗدَ فَفَزِعَ مِنْهُمْ قَالُوْا لَا تَخَفْ ۚ— خَصْمٰنِ بَغٰی بَعْضُنَا عَلٰی بَعْضٍ فَاحْكُمْ بَیْنَنَا بِالْحَقِّ وَلَا تُشْطِطْ وَاهْدِنَاۤ اِلٰی سَوَآءِ الصِّرَاطِ ۟
అప్పుడు వారిద్దరు అకస్మాత్తుగా దావూద్ అలైహిస్సలాం వద్దకు ప్రవేశించారు. అప్పుడు ఆయన వారిద్దరు తన వద్దకు ప్రవేశించటం కొరకు ఈ అసాధారణ మార్గముతో అకస్మాత్తుగా తన వద్దకు ప్రవేశించటం నుండి భయపడ్డారు. ఎప్పుడైతే ఆయన భయము వారికి స్పష్టమయ్యిందో వారు ఇలా పలికారు : నీవు భయపడకు. మేమిద్దరము ప్రత్యర్ధులము. మాలోని ఒకరు మరొకరికి అన్యాయం చేశారు. కావున నీవు మా మధ్య న్యాయంగా తీర్పునివ్వు. నీవు మా మధ్య తీర్పునిచ్చినప్పుడు మా పై దౌర్జన్యం చేయకు. మరియు నీవు మమ్మల్ని సరైన మార్గమైన ఋజుమార్గమును చూపించు.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِنَّ هٰذَاۤ اَخِیْ ۫— لَهٗ تِسْعٌ وَّتِسْعُوْنَ نَعْجَةً وَّلِیَ نَعْجَةٌ وَّاحِدَةٌ ۫— فَقَالَ اَكْفِلْنِیْهَا وَعَزَّنِیْ فِی الْخِطَابِ ۟
ప్రత్యర్ధుల్లోంచి ఒకడు దావూద్ అలైహిస్సలాంతో ఇలా పలికాడు : నిశ్ఛయంగా ఈ వ్యక్తి నా సోదరుడు. అతని వద్ద తొంభై తొమ్మిది ఆడ గొర్రెలు కలవు. మరియు నా వద్ద ఒకే ఒక ఆడ గొర్రె ఉన్నది. అయితే అతను దానిని కూడా తనకే ఇచ్చివేయమని నన్ను కోరుతున్నాడు. మరియు అతడు వాదనలో నాపై ఆధిక్యతను చూపాడు.
Arabische Interpretationen von dem heiligen Quran:
قَالَ لَقَدْ ظَلَمَكَ بِسُؤَالِ نَعْجَتِكَ اِلٰی نِعَاجِهٖ ؕ— وَاِنَّ كَثِیْرًا مِّنَ الْخُلَطَآءِ لَیَبْغِیْ بَعْضُهُمْ عَلٰی بَعْضٍ اِلَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَقَلِیْلٌ مَّا هُمْ ؕ— وَظَنَّ دَاوٗدُ اَنَّمَا فَتَنّٰهُ فَاسْتَغْفَرَ رَبَّهٗ وَخَرَّ رَاكِعًا وَّاَنَابَ ۟
అప్పుడు దావూద్ అలైహిస్సలాం వారి మధ్య తీర్పునిచ్చారు. ఆరోపించే వ్యక్తిని ఉద్దేశించి ఇలా పలికారు : నిశ్చయంగా నీ సోదరుడు నీ గొర్రెను తన గొర్రెలతో కలపమని నిన్ను అడిగినప్పుడు నీకు అన్యాయం చేశాడు. మరియు నిశ్చయంగా భాగస్వాముల్లోంచి చాలా మంది ఒకరిపై ఒకరు అతని హక్కును తీసుకుని,అన్యాయం చేసి అతిక్రమిస్తారు. కాని విశ్వాసపరులు వారే సత్కర్మలు చేస్తారు. ఎందుకంటే వారు తమ భాగస్వాములపట్ల న్యాయం చేస్తారు. అన్యాయం చేయరు. ఇటువంటి గుణాలు కలిగినవారు చాలా తక్కువమంది ఉంటారు. మరియు దావూద్ అలైహిస్సలాం మేము ఈ తగాదా ద్వారా అతన్ని పరీక్షలో పడవేశామని పూర్తిగా నమ్మారు. అప్పుడు ఆయన తన ప్రభువుతో మన్నింపును వేడుకుని అల్లాహ్ సాన్నిద్యం కొరకు సాష్టాంగపడ్డారు. పశ్ఛాత్తాపంతో ఆయన వైపు మరలారు.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَغَفَرْنَا لَهٗ ذٰلِكَ ؕ— وَاِنَّ لَهٗ عِنْدَنَا لَزُلْفٰی وَحُسْنَ مَاٰبٍ ۟
అప్పుడు మేము ఆయన కొరకు స్వీకరించి దాన్ని ఆయన కొరకు మన్నించాము. మరియు నిశ్ఛయంగా ఆయన మా వద్ద సాన్నిద్యం పొందిన వారు. మరియు ఆయన కొరకు పరలోకంలో మంచి పరిణామం కలదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
یٰدَاوٗدُ اِنَّا جَعَلْنٰكَ خَلِیْفَةً فِی الْاَرْضِ فَاحْكُمْ بَیْنَ النَّاسِ بِالْحَقِّ وَلَا تَتَّبِعِ الْهَوٰی فَیُضِلَّكَ عَنْ سَبِیْلِ اللّٰهِ ؕ— اِنَّ الَّذِیْنَ یَضِلُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ لَهُمْ عَذَابٌ شَدِیْدٌۢ بِمَا نَسُوْا یَوْمَ الْحِسَابِ ۟۠
ఓ దావుద్ నిశ్చయంగా మేము నిన్ను భూమిలో ప్రతనిధిగా (ఖలీఫాగా) చేశాము. నీవు ధార్మిక,ప్రాపంచిక ఆదేశాలను,తీర్పులను జారీ చేస్తున్నావు. కాబట్టి నీవు ప్రజల మధ్య న్యాయముతో తీర్పునివ్వు. మరియు నీవు ప్రజల మధ్య నీ ఆదేశమివ్వటంలో ప్రత్యర్ధుల్లోంచి ఒకరు దగ్గరి బందువు కావటం వలన లేదా స్నేహితుడు కావటం వలన మగ్గుచూపటంతో లేదా ఏదైన విరోదం వలన అతని నుండి మరలిపోవటంతో మనోవాంఛలను అనుసరించకు. అప్పుడు మనోనాంఛ నిన్ను అల్లాహ్ సన్మార్గము నుండి తప్పించి వేస్తుంది. నిశ్ఛయంగా ఎవరైతే అల్లాహ్ సన్మార్గము నుండి తప్పిపోతారో లెక్కతీసుకునే దినమును వారి మరలిపోవటం వలన వారికి కఠినమైన శిక్ష కలదు. ఒక వేళ వారు దాన్ని గుర్తుంచుకుని దాని నుండి భయపడి ఉంటే వారు తమ మనోవాంఛలతో పాటు మరలేవారు కాదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
Die Nutzen der Versen in dieser Seite:
• بيان فضائل نبي الله داود وما اختصه الله به من الآيات.
అల్లాహ్ ప్రవక్త దావూద్ అలైహిస్సలాం గారి సద్గుణాల మరియు అల్లాహ్ ఆయనకు ప్రత్యేకించిన సూచనల ప్రకటన.

• الأنبياء - صلوات الله وسلامه عليهم - معصومون من الخطأ فيما يبلغون عن الله تعالى؛ لأن مقصود الرسالة لا يحصل إلا بذلك، ولكن قد يجري منهم بعض مقتضيات الطبيعة بنسيان أو غفلة عن حكم، ولكن الله يتداركهم ويبادرهم بلطفه.
దైవప్రవక్తలు (అల్లాహ్ శుభాలు,ఆయన శాంతి వారిపై కురియు గాక) మహోన్నతుడైన అల్లాహ్ వద్ద నుండి చేరవేసే విషయంలో తప్పిదము నుండి అమాయకులు. ఎందుకంటే దైవదౌత్య ఉద్దేశము దానితోనే పూర్తవుతుంది. కాని కొన్ని స్వాభావిక నిర్ణయాలు మరచిపోవటం వలన లేదా ఆదేశము నుండి నిర్లక్ష్యంగా ఉండటం వలన వారితో జరిగిపోతాయి. కానీ అల్లాహ్ వారిని మన్నించివేస్తాడు. మరియు తన దయతో వారి వైపుకు ముందడుగు వేస్తాడు.

• استدل بعض العلماء بقوله تعالى: ﴿ وَإِنَّ كَثِيرًا مِّنَ اْلْخُلَطَآءِ لَيَبْغِي بَعْضُهُمْ عَلَى بَعْضٍ ﴾ على مشروعية الشركة بين اثنين وأكثر.
కొందరు ధార్మిక పండితులు మహోన్నతుడైన ఆయన ఈ మాటతో : చాలామంది భాగస్వాములు వారిలోని కొందరు కొందరిపై అతిక్రమిస్తారు {وَإِنَّ كَثِيرٗا مِّنَ ٱلۡخُلَطَآءِ لَيَبۡغِي بَعۡضُهُمۡ عَلَىٰ بَعۡضٍ } ఇద్దరి మధ్య,అంతకంటే ఎక్కువ మంది మధ్య భాగస్వామ్యం కలిగి ఉండటం ధర్మబద్దమే అని నిరూపించారు.

• ينبغي التزام الأدب في الدخول على أهل الفضل والمكانة.
పరపతి,హోదా కలిగిన వారి వద్దకు వెళ్ళేటప్పుడు పద్దతికి కట్టుబడి ఉండటం తప్పనిసరి.

وَمَا خَلَقْنَا السَّمَآءَ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَا بَاطِلًا ؕ— ذٰلِكَ ظَنُّ الَّذِیْنَ كَفَرُوْا ۚ— فَوَیْلٌ لِّلَّذِیْنَ كَفَرُوْا مِنَ النَّارِ ۟ؕ
మరియు మేము ఆకాశమును,భూమిని వృధాగా సృష్టించలేదు. ఇది అవిశ్వాసపరుల భ్రమ మాత్రమే. ఈ విధమైన భ్రమను కలిగి ఉండే అవిశ్వాసపరులందరి కొరకు వారు తమ అవిశ్వాస స్థితిలోనే మరణించి,అల్లాహ్ పట్ల చెడుగా భావిస్తే ప్రళయదినాన నరకాగ్ని శిక్ష నుండి వినాశనం కలుగును.
Arabische Interpretationen von dem heiligen Quran:
اَمْ نَجْعَلُ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ كَالْمُفْسِدِیْنَ فِی الْاَرْضِ ؗ— اَمْ نَجْعَلُ الْمُتَّقِیْنَ كَالْفُجَّارِ ۟
మేము అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ప్రవక్తను అనుసరించి,సత్కర్మలను చేసిన వారిని అవిశ్వాసముతో,పాపకార్యములతో భూమిపై చెడును ప్రభలించిన వారికి సమానులుగా చేయము. మరియు మేము తమ ప్రభువుపై ఆయన ఆదేశించిన వాటిని పాటిస్తూ,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి భీతి కలిగిన వారిని పాపకార్యముల్లో మునిగి ఉండే అవిశ్వాసపరులు,కపటవిశ్వాసుల మాదిరిగా చేయము. నిశ్ఛయంగా వారి మధ్య సమానత అన్యాయమవుతుంది. అది పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ కు తగదు. కాని అల్లాహ్ దైవభీతి కలిగిన విశ్వాసపరులని స్వర్గములో ప్రవేశింపజేయటం ద్వారా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. మరియు దుష్టులైన అవిశ్వాసపరులని నరకములో ప్రవేశింపజేసి శిక్షిస్తాడు. ఎందుకంటే వారు అల్లాహ్ వద్ద సమానులు కాజాలరు. అలాగే ఆయన వద్ద వారి ప్రతిఫలము కూడా సమానం కాజాలదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
كِتٰبٌ اَنْزَلْنٰهُ اِلَیْكَ مُبٰرَكٌ لِّیَدَّبَّرُوْۤا اٰیٰتِهٖ وَلِیَتَذَكَّرَ اُولُوا الْاَلْبَابِ ۟
నిశ్ఛయంగా ఈ ఖుర్ఆన్ మేము మీ వైపునకు అవతరింపజేసిన ఒక గ్రంధం చాలా మేళ్ళు,ప్రయోజనాలు కలిగి ఉన్నది. ప్రజలు వాటి ఆయతుల్లో యోచన చేయటానికి, వాటి అర్దములలో యోచన చేయటానికి. మరియు దాని ద్వారా ప్రకాశవంతమైన,సరైన బుద్ధి కలవారు హితబోధన గ్రహించటానికి.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَوَهَبْنَا لِدَاوٗدَ سُلَیْمٰنَ ؕ— نِعْمَ الْعَبْدُ ؕ— اِنَّهٗۤ اَوَّابٌ ۟ؕ
మరియు మేము దావూద్ కు అతని కుమారుడగు సులైమాన్ ను మా వద్ద నుండి ఆయనపై అనుగ్రహముగా,సౌభాగ్యముగా దాని ద్వారా ఆయన కంటిచలువ కొరకు ప్రసాదించాము. సులైమాన్ అలైహిస్సలాం ఎంతో మంచి దాసుడు. నిశ్చయంగా ఆయన ఎక్కువగా పశ్చాత్తాప్పడేవాడు మరియు అల్లాహ్ వైపునకు మరలేవాడు. మరియు ఆయన వైపునకు పశ్చాత్తాపముతో మరలే వాడు.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِذْ عُرِضَ عَلَیْهِ بِالْعَشِیِّ الصّٰفِنٰتُ الْجِیَادُ ۟ۙ
మీరు ఆయనపై వేగవంతమైన మేలురకమైన గుర్రములు సాయంకాలం ప్రవేశపెట్టబడినప్పటి వైనమును గుర్తు చేసుకోండి. అవి మూడు కాళ్ళపై నిలబడి నాలుగవ కాలును ఎత్తి ఉన్నవి. సూర్యుడు అస్తమించేవరకు ఈ మేలు జాతి గుర్రములు అతనిపై ప్రవేశపెట్టబడుతూ ఉన్నవి.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَقَالَ اِنِّیْۤ اَحْبَبْتُ حُبَّ الْخَیْرِ عَنْ ذِكْرِ رَبِّیْ ۚ— حَتّٰی تَوَارَتْ بِالْحِجَابِ ۟۫
అప్పుడు సులైమాన్ అలైహిస్సలాం ఇలా పలికారు : నిశ్ఛయంగా నేను నా ప్రభువు స్మరణపై సంపదను ఇష్టపడటముపై ప్రాధాన్యతనిచ్చాను. అందులో నుంచి ఈ గుర్రములు. చివరికి సూర్యుడు అస్తమించాడు. మరియు నేను అసర్ నమజ్ ను ఆలస్యంగా చేశాను.
Arabische Interpretationen von dem heiligen Quran:
رُدُّوْهَا عَلَیَّ ؕ— فَطَفِقَ مَسْحًا بِالسُّوْقِ وَالْاَعْنَاقِ ۟
ఈ గుర్రాలను మళ్ళీ నా వద్దకు తీసుకుని రండి (అని. సులైమాన్ అలైహిస్సలాం అన్నారు). వాటిని ఆయన వద్దకు మరల తీసుకుని రావటం జరిగింది. అప్పుడు ఆయన ఖడ్గముతో వాటి పిక్కలపై మరియు వాటి మెడలపై కొట్టసాగారు.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَلَقَدْ فَتَنَّا سُلَیْمٰنَ وَاَلْقَیْنَا عَلٰی كُرْسِیِّهٖ جَسَدًا ثُمَّ اَنَابَ ۟
మరియు నిశ్ఛయంగా మేము సులైమాన్ అలైహిస్సలాంను పరీక్షించాము. మరియు ఆయన రాజ్య సింహాసనంపై ఒక షైతానును పడవేశాము. అతడు మనిషి రూపంలో ఉన్నాడు ఆయన రాజ్యంలో కొంత కాలం ఏలాడు. ఆ తరువాత సులైమాన్ అలైహిస్సలాంకు ఆయన రాజ్యము తిరిగి వచ్చినది. షైతానులపై ఆయనకు ఆధిక్యత కలిగినది.
Arabische Interpretationen von dem heiligen Quran:
قَالَ رَبِّ اغْفِرْ لِیْ وَهَبْ لِیْ مُلْكًا لَّا یَنْۢبَغِیْ لِاَحَدٍ مِّنْ بَعْدِیْ ۚ— اِنَّكَ اَنْتَ الْوَهَّابُ ۟
సులైమాన్ అలైహిస్సలాం ఇలా పలికారు : ఓ నా ప్రభువా నీవు నా పాపములను మన్నించు. మరియు నాకు ప్రత్యేకమైన సామ్రాజ్యమును ప్రసాదించు. అది నా తరువాత ప్రజల్లోంచి ఎవరికీ కలగకూడదు. ఓ నా ప్రభువా నీవు ఎక్కువగా అనుగ్రహించే వాడివి, గొప్ప ప్రధాతవి.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَسَخَّرْنَا لَهُ الرِّیْحَ تَجْرِیْ بِاَمْرِهٖ رُخَآءً حَیْثُ اَصَابَ ۟ۙ
అప్పుడు మేము ఆయన కొరకు స్వీకరించాము. మరియు మేము గాలిని ఆయన ఆదేశముకు అనుగుణంగా సుతిమెత్తగా వీచేటట్లుగా ఆయనకు ఆదీనంలో చేశాము. అందులో దాని బలముతో పాటు వేగమైన గాలి లేదు మరియు అది వీచటంలో వేగముగా లేదు. అది ఆయనను ఆయన కోరిన చోటుకు ఎత్తుకుని వెళుతుంది.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَالشَّیٰطِیْنَ كُلَّ بَنَّآءٍ وَّغَوَّاصٍ ۟ۙ
మరియు మేము ఆయన కొరకు ఆయన ఆదేశముకు అనుగుణంగా నడిచే జిన్నాతులను వశపరచాము. వారిలో నుండి కట్టడములను నిర్మించేవారున్నారు. మరియు వారిలో నుండి సముద్రంలో మునిగి దాని నుండి ముత్యాలను వెలికితీసే గజఈతగాళ్ళు ఉన్నారు.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَّاٰخَرِیْنَ مُقَرَّنِیْنَ فِی الْاَصْفَادِ ۟
జిన్నాతుల్లోంచి తలబిరుసు కలిగిన వారు ఆయనకు వశపరచబడినవి. వారు సంకెళ్ళలో బంధింపబడి ఉన్నారు.కదలలేరు.
Arabische Interpretationen von dem heiligen Quran:
هٰذَا عَطَآؤُنَا فَامْنُنْ اَوْ اَمْسِكْ بِغَیْرِ حِسَابٍ ۟
ఓ సులైమాన్ ఇది మా అనుగ్రహము దేనినైతే నీవు మాతో కోరటం వలన మేము దాన్ని నీకు ప్రసాదించాము. అయితే నీవు తలచిన వారికి ఇవ్వు మరియు నీవు తలచిన వారికి ఇవ్వకు. ఇచ్చిన విషయంలో లేదా ఆపిన విషయంలో నీతో లెక్కతీసుకోబడదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَاِنَّ لَهٗ عِنْدَنَا لَزُلْفٰی وَحُسْنَ مَاٰبٍ ۟۠
మరియు నిశ్చయంగా సులైమాన్ అలైహిస్సలాం మా వద్ద సాన్నిద్యం పొందిన వారిలోంచి వారు. మరియు ఆయన కొరకు మంచి మరలే చోటు కలదు. అది స్వర్గము.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَاذْكُرْ عَبْدَنَاۤ اَیُّوْبَ ۘ— اِذْ نَادٰی رَبَّهٗۤ اَنِّیْ مَسَّنِیَ الشَّیْطٰنُ بِنُصْبٍ وَّعَذَابٍ ۟ؕ
ఓ ప్రవక్తా మీరు మా దాసుడగు అయ్యూబ్ తన ప్రభువైన అల్లాహ్ ను ఇలా వేడుకున్నప్పటి వైనమును గుర్తు చేసుకోండి : నిశ్ఛయంగా షైతాను నాకు అలసటను మరియు శిక్షను కలిగించాడు
Arabische Interpretationen von dem heiligen Quran:
اُرْكُضْ بِرِجْلِكَ ۚ— هٰذَا مُغْتَسَلٌۢ بَارِدٌ وَّشَرَابٌ ۟
అప్పుడు మేము అతనితో ఇలా పలికాము : మీరు మీ కాలును నేలపై కొట్టండి. ఆయన తన కాలును నేలపై కొట్టారు. అప్పుడు దాని నుండి నీరు పొంగి వచ్టినది. ఆయన దాని నుండి త్రాగారు మరియు స్నానం చేశారు. అప్పుడు ఆయనకు ఉన్న కీడు మరియు బాధ తొలగిపోయింది.
Arabische Interpretationen von dem heiligen Quran:
Die Nutzen der Versen in dieser Seite:
• الحث على تدبر القرآن.
ఖుర్ఆన్ లో యోచన చేయటం పై ప్రోత్సహించటం జరిగింది.

• في الآيات دليل على أنه بحسب سلامة القلب وفطنة الإنسان يحصل له التذكر والانتفاع بالقرآن الكريم.
హృదయ భద్రత మరియు మనిషి చతురతను బట్టి పవిత్ర ఖుర్ఆన్ ద్వారా అతని కొరకు హితోపదేశం గ్రహించటం మరియు ప్రయోజనం చెందటం లభిస్తుందని ఆయతుల్లో ఆధారం ఉన్నది.

• في الآيات دليل على صحة القاعدة المشهورة: «من ترك شيئًا لله عوَّضه الله خيرًا منه».
ఎవరైతే అల్లాహ్ కొరకు ఏదైన వస్తువును వదిలివేస్తే అల్లాహ్ అతనికి దానికన్న మంచి దాన్ని బదులుగా ప్రసాదిస్తాడు అన్న సుప్రసిద్ధ నియమం యొక్క ప్రామాణికతకు రుజువు ఆయతుల్లో ఉన్నది.

وَوَهَبْنَا لَهٗۤ اَهْلَهٗ وَمِثْلَهُمْ مَّعَهُمْ رَحْمَةً مِّنَّا وَذِكْرٰی لِاُولِی الْاَلْبَابِ ۟
అప్పుడు మేము అతని కొరకు దుఆను స్వీకరించి ఆయనకు కలిగిన కష్టమును తొలగించాము. మరియు మేము అతనికి అతని కుటుంబంవారిని ప్రసాదించాము. మరియు మేము అతనికి వారి వంటివారిని కుమారుల్లోంచి మనవుళ్ళోంచి మా వద్ద నుండి కారుణ్యంగా ఆయనకు మరియు ఆయన సహనంనకు ప్రతిఫలంగా ప్రసాదించాము. సరైన బుద్దుల కలవారు సహనము యొక్క పరిణామం ఆపద తొలిగిపోవటం మరియు పుణ్యం అని హితబోధన గ్రహించాలి.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَخُذْ بِیَدِكَ ضِغْثًا فَاضْرِبْ بِّهٖ وَلَا تَحْنَثْ ؕ— اِنَّا وَجَدْنٰهُ صَابِرًا ؕ— نِّعْمَ الْعَبْدُ ؕ— اِنَّهٗۤ اَوَّابٌ ۟
అప్పుడు అయ్యూబ్ అలైహిస్సలాం తన భార్యపై ఆగ్రహం చెంది ఆమెకు వంద కొరడా దెబ్బలు కొడతారని శపధం చేశారు. మేము ఆయనకు ఇలా ఆదేశించాము : నీవు ఖర్జూర పండ్ల గుత్తి కట్టను నీ చేతిలో తీసుకుని నీ ప్రమాణము యొక్క వియోచనం కొరకు దానితో ఆమెను కొట్టు. నీవు చేసిన ప్రమాణమును భంగపరచకు. అప్పుడు ఆయన ఖర్జూరపు పండ్ల గుత్తి కట్టతో ఆమెను కొట్టారు. నిశ్చయంగా మేము ఆయన్ని పరీక్షించిన దానిలో సహనం చూపేవాడిగా పొందాము. ఆయన ఎంతో మంచి దాసుడు. నిశ్ఛయంగా ఆయన అల్లాహ్ వైపునకు ఎక్కువగా మరలే వాడును,పశ్చాత్తాపముతో మరలేవాడును.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَاذْكُرْ عِبٰدَنَاۤ اِبْرٰهِیْمَ وَاِسْحٰقَ وَیَعْقُوْبَ اُولِی الْاَیْدِیْ وَالْاَبْصَارِ ۟
ఓ ప్రవక్తా మీరు మేము ఎంచుకున్న మా దాసులైన మరియు మేము పంపించిన ప్రవక్తలైన ఇబ్రాహీం,ఇస్హాఖ్,యాఖూబ్ లను గుర్తు చేసుకోండి. వారు అల్లాహ్ పై విధేయత చూపే విషయంలో మరియు ఆయన మన్నతలను కోరకునే విషయంలో బలవంతులుగా ఉండేవారు. మరియు వారు సత్యం విషయంలో అంతర్దృష్టి కలవారు,నీతిమంతులు.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِنَّاۤ اَخْلَصْنٰهُمْ بِخَالِصَةٍ ذِكْرَی الدَّارِ ۟ۚ
నిశ్ఛయంగా మేము వారిపై ఒక ప్రత్యేక గుణమును అనుగ్రహించి దానితో వారిని ప్రత్యేకించాము. మరియు అది వారి హృదయములను పరలోక నివాస చింతనతో నిర్మించటం మరియు దాని కొరకు సత్కర్మతో సిద్ధం కావటం మరియు ప్రజలను దాని కొరకు ఆచరించటం వైపునకు పిలవటం.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَاِنَّهُمْ عِنْدَنَا لَمِنَ الْمُصْطَفَیْنَ الْاَخْیَارِ ۟ؕ
మరియు నిశ్ఛయంగా వారు మా వద్ద మా విధేయత కొరకు,మా ఆరాధన కొరకు ఎన్నుకోబడినవారు. మరియు మేము వారిని మా దైవదౌత్యమును మోయటానికి మరియు ప్రజలకు దాన్ని చేరవేయటానికి ఎన్నుకున్నాము.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَاذْكُرْ اِسْمٰعِیْلَ وَالْیَسَعَ وَذَا الْكِفْلِ ؕ— وَكُلٌّ مِّنَ الْاَخْیَارِ ۟ؕ
ఓ ప్రవక్తా మీరు ఇబ్రాహీం అలైహిస్సలామ్ కుమారుడగు ఇస్మాయీల్ అలైహిస్సలాంను జ్ఞాపకం చేసుకోండి మరియు అల్ యసఅ ను జ్ఞాపకం చేసుకోండి. మరియు జుల్ కిఫ్ల్ ను జ్ఞాపకం చేసుకోండి. మరియు వారిపై మంచిగా కీర్తించండి. వారు దానికి యోగ్యులు. మరియు వారందరు అల్లాహ్ వద్ద ఎంచుకోబడిన మరియు ఎన్నుకోబడిన వారిలో నుంచి వారు.
Arabische Interpretationen von dem heiligen Quran:
هٰذَا ذِكْرٌ ؕ— وَاِنَّ لِلْمُتَّقِیْنَ لَحُسْنَ مَاٰبٍ ۟ۙ
వీరందరి కొరకు ఖర్ఆన్ లో మంచి కీర్తి ద్వారా ఈ గుర్తింపు కలదు. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండే దైవభీతి కలవారి కొరకు పరలోక నివాసములో మంచి మరలే చోటు కలదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
جَنّٰتِ عَدْنٍ مُّفَتَّحَةً لَّهُمُ الْاَبْوَابُ ۟ۚ
ఈ మంచి మరలింపు అది వారు ప్రళయదినాన ప్రవేశించే శాశ్వత స్వర్గ వనాలు. మరియు వారిపై మర్యాదగా వారి కొరకు వాటి తలుపులు తెరవబడి ఉంటాయి.
Arabische Interpretationen von dem heiligen Quran:
مُتَّكِـِٕیْنَ فِیْهَا یَدْعُوْنَ فِیْهَا بِفَاكِهَةٍ كَثِیْرَةٍ وَّشَرَابٍ ۟
వారి కొరకు అలంకరించబడి ఉన్న ఆసనాలపై ఆనుకుని కూర్చుని తమ సేవకులతో తాము కోరుకునే చాలా రకరకాల ఫలాలను మరియు తాము కోరే మధుపానీయముల్లోంచి,ఇతర వాటిలోంచి పానీయములను తమ ముందు ప్రవేశపెట్టమని కోరుతుంటారు.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَعِنْدَهُمْ قٰصِرٰتُ الطَّرْفِ اَتْرَابٌ ۟
మరియు వారి వద్ద తమ భర్తల ముందు తమ చూపులను క్రిందకు వాల్చిన స్త్రీలు ఉంటారు. వారు వారిని దాటి ఇతరుల వద్దకు వెళ్ళరు. మరియు వారు సమవయస్కులై ఉంటారు.
Arabische Interpretationen von dem heiligen Quran:
هٰذَا مَا تُوْعَدُوْنَ لِیَوْمِ الْحِسَابِ ۟
ఓ దైవభీతి కలవారా ఇది మీరు ఇహలోకములో చేసుకున్న మీ సత్కర్మలపై ప్రళయదినమున మంచి ప్రతిఫలము ప్రసాదించబడతుందని మీకు చేయబడిన వాగ్ధానము.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِنَّ هٰذَا لَرِزْقُنَا مَا لَهٗ مِنْ نَّفَادٍ ۟ۚۖ
నిశ్చయంగా మేము ప్రస్తావించిన ఈ ప్రతిఫలము మీమిచ్చే జీవనోపాధి దాన్ని మేము ప్రళయదినమున దైవభీతికలవారికి ప్రసాదిస్తాము. మరియు అది నిరంతరం ఉండే జీవనోపాధి. అది తరగదు మరియు అంతమవదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
هٰذَا ؕ— وَاِنَّ لِلطّٰغِیْنَ لَشَرَّ مَاٰبٍ ۟ۙ
మేము ప్రస్తావించిన ఇది దైవభీతి కలవారి యొక్క ప్రతిఫలము. మరియు నిశ్చయంగా అవిశ్వాసముతో,పాపకార్యములతో అల్లాహ్ హద్దులను అతిక్రమించే వారి కొరకు దైవభీతి కలవారి ప్రతిఫలమునకు భిన్నంగా ప్రతిఫలముంటుంది. వారి కొరకు ప్రళయదినమున వారు మరలివెళ్ళే అతి చెడ్డ మరలే చోటు కలదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
جَهَنَّمَ ۚ— یَصْلَوْنَهَا ۚ— فَبِئْسَ الْمِهَادُ ۟
ఈ ప్రతిఫలం అది నరకము వారిని చుట్టుముట్టి ఉంటుంది. వారు దాని వేడిని మరియు దాని జ్వాలలను అనుభవిస్తారు. వారి కొరకు దాని నుండి ఒక పరుపు ఉంటుంది. వారి పరుపు ఎంతో చెడ్డదైన పరుపు.
Arabische Interpretationen von dem heiligen Quran:
هٰذَا ۙ— فَلْیَذُوْقُوْهُ حَمِیْمٌ وَّغَسَّاقٌ ۟ۙ
ఈ శిక్ష అత్యంత వేడిగల నీరు, అందులో శిక్షింపబడే నరకవాసుల శరీరముల నుండి కారే చీము రూపంలో ఉంటుంది. అయితే వారు దాన్ని త్రాగాలి. అది దాహమును తీర్చని వారి పానీయం.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَّاٰخَرُ مِنْ شَكْلِهٖۤ اَزْوَاجٌ ۟ؕ
మరియు వారి కొరకు ఈ శిక్ష కన్న వేరే రూపంలో ఇంకో శిక్ష కలదు. అయితే వారి కొరకు ఎన్నో రకాల శిక్షలు కలవు. వారు వాటి ద్వారా పరలోకంలో శిక్షింపబడుతారు.
Arabische Interpretationen von dem heiligen Quran:
هٰذَا فَوْجٌ مُّقْتَحِمٌ مَّعَكُمْ ۚ— لَا مَرْحَبًا بِهِمْ ؕ— اِنَّهُمْ صَالُوا النَّارِ ۟
మరియు నరకవాసులు ప్రవేశించినప్పుడు వారి మధ్య ప్రత్యర్దుల మధ్య వాటిల్లే ధూషణలు వాటిల్లుతాయి. మరియు వారు ఒకరి నుండి ఒకరు విసుగును చూపుతారు. వారిలో నుండి కొందరు ఇలా పలుకుతారు : ఇది నరకవాసుల్లోంచి ఒక వర్గము మీతో పాటు నరకంలో ప్రవేశిస్తుంది. అప్పుడు వారు వారికి ఇలా సమాధానమిస్తారు : వారికి ఎలాంటి స్వాగతం లేదు నిశ్ఛయంగా వారు మేము బాధపడుతున్నట్లే నరకాగ్ని శిక్ష వలన బాధపడుతారు.
Arabische Interpretationen von dem heiligen Quran:
قَالُوْا بَلْ اَنْتُمْ ۫— لَا مَرْحَبًا بِكُمْ ؕ— اَنْتُمْ قَدَّمْتُمُوْهُ لَنَا ۚ— فَبِئْسَ الْقَرَارُ ۟
అనుసరించేవారి వర్గము అనుసరించబడిన తమ నాయకులతో ఇలా పలుకుతారు : కాదు మీకే ఓ అనుసరించబడిన నాయకులారా ఎటువంటి స్వాగతం లేదు. మీరే మాకు అపమార్గమునకు లోను చేయటం వలన,పెడదారికి గురి చేయటం వలన ఈ బాధాకరమైన శిక్షకు కారణమయ్యారు. ఈ నివాస స్థలం ఎంత చెడ్డ నివాస స్థలము. అందరి నివాస స్థలము అది నరకాగ్ని.
Arabische Interpretationen von dem heiligen Quran:
قَالُوْا رَبَّنَا مَنْ قَدَّمَ لَنَا هٰذَا فَزِدْهُ عَذَابًا ضِعْفًا فِی النَّارِ ۟
అనుసరించేవారు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా మా వద్దకు వచ్చిన తరువాత సన్మార్గము నుండి ఎవరైతే మమ్మల్ని తప్పించారో వారికి నరకాగ్నిలో రెట్టింపు శిక్షను కలిగించు.
Arabische Interpretationen von dem heiligen Quran:
Die Nutzen der Versen in dieser Seite:
• من صبر على الضر فالله تعالى يثيبه ثوابًا عاجلًا وآجلًا، ويستجيب دعاءه إذا دعاه.
బాధపై ఎవరైతే సహనం చూపుతారో వారిని మహోన్నతుడైన అల్లాహ్ త్వరగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు మరియు ఆలస్యంగ ప్రసాదిస్తాడు. మరియు అతను దుఆ చేసినప్పుడు అతని దుఆను స్వీకరిస్తాడు.

• في الآيات دليل على أن للزوج أن يضرب امرأته تأديبًا ضربًا غير مبرح؛ فأيوب عليه السلام حلف على ضرب امرأته ففعل.
ఆయతుల్లో భర్త తన భార్యను సంస్కరణ ఉద్దేశంతో బాధ కలిగించకుండా కొట్టటం పై ఆధారం ఉన్నది. కాబట్టి అయ్యూబ్ అలైహిస్సలాం తన భార్యను కొడతానని ప్రమాణం చేశారు. పూర్తి చేశారు.

وَقَالُوْا مَا لَنَا لَا نَرٰی رِجَالًا كُنَّا نَعُدُّهُمْ مِّنَ الْاَشْرَارِ ۟ؕ
తలబిరుసులైన అహంకారులు ఇలా అంటారు : మాకేమయ్యింది మేము ఇహలోకంలో శిక్షకు అర్హులైన వారైన దుష్టుల్లోంచి భావించిన వారైన జనులను మాతో పాటు నరకంలో చూడటం లేదే ?.
Arabische Interpretationen von dem heiligen Quran:
اَتَّخَذْنٰهُمْ سِخْرِیًّا اَمْ زَاغَتْ عَنْهُمُ الْاَبْصَارُ ۟
ఏమీ వారి గురించి మా పరిహాసము మరియు ఎగతాళి తప్పైనదా అందుకే వారు శిక్షకు అర్హులు కాలేదా ? లేదా వారి గురించి మా పరిహాసము సరై వారు నరకంలో ప్రవేశించారా. మరియు మా దృష్టి వారిపై పడలేదా ?!.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِنَّ ذٰلِكَ لَحَقٌّ تَخَاصُمُ اَهْلِ النَّارِ ۟۠
నిశ్ఛయంగా మేము మీకు ప్రస్తావించిన నరక వాసుల మధ్య ఈ ఘర్షణ ప్రళయదినాన తప్పకుండా జరిగితీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు మరియు సంశయం లేదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
قُلْ اِنَّمَاۤ اَنَا مُنْذِرٌ ۖۗ— وَّمَا مِنْ اِلٰهٍ اِلَّا اللّٰهُ الْوَاحِدُ الْقَهَّارُ ۟ۚ
ఓ ముహమ్మద్ మీరు మీ జాతిలో నుండి అవిశ్వాసపరులతో ఇలా పలకండి : నేను కేవలం మీకు అల్లాహ్ శిక్ష నుండి అది మీపై ఆయన పట్ల మీ అవిశ్వాసం వలన మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించటం వలన వాటిల్లుతుందని హెచ్చరించేవాడిని మాత్రమే. పరిశుద్ధుడైన అల్లాహ్ తప్ప ఆరాధనకు యోగ్యుడైన దైవం పొందబడడు. కావున ఆయన తన గొప్పతనంలో,తన గుణాల్లో,తన నామములలో అద్వితీయుడు. మరియు ఆయనే ప్రతీ దానిపై ఆధిక్యతను కనబరిచే ఆధిక్యుడు. కాబట్టి ప్రతీది ఆయనకు లోబడి ఉన్నది.
Arabische Interpretationen von dem heiligen Quran:
رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا الْعَزِیْزُ الْغَفَّارُ ۟
మరియు ఆయన ఆకాశములకు ప్రభువు మరియు భూమికి ప్రభువు మరియు వాటి మధ్య ఉన్న వాటికి ప్రభువు. మరియు ఆయన తన రాజ్యాధికారములో సర్వాధిక్యుడు,ఆయనను ఎవరు ఓడించలేరు. మరియు ఆయన తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడే వారి పాపములను మన్నించేవాడు.
Arabische Interpretationen von dem heiligen Quran:
قُلْ هُوَ نَبَؤٌا عَظِیْمٌ ۟ۙ
ఓ ప్రవక్త ఈ తిరస్కారులందరితో ఇలా పలకండి : నిశ్చయంగా ఖుర్ఆన్ గొప్ప విషయంగల సందేశము.
Arabische Interpretationen von dem heiligen Quran:
اَنْتُمْ عَنْهُ مُعْرِضُوْنَ ۟
మీరు ఈ గొప్ప విషయం గల సందేశము నుండి విముఖులవుతున్నారు. దాని వైపు శ్రద్ధ వహించటం లేదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
مَا كَانَ لِیَ مِنْ عِلْمٍ بِالْمَلَاِ الْاَعْلٰۤی اِذْ یَخْتَصِمُوْنَ ۟
ఆదమ్ అలైహిస్సలాం సృష్టి విషయంలో దైవదూతల మధ్య జరిగిన చర్చ గురించి నాకు ఎటువంటి జ్ఞానం ఉండేది కాదు ఒక వేళ అల్లాహ్ నాపై దైవవాణి అవతరింపజేసి నాకు తెలియపరచకుండా ఉంటే.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِنْ یُّوْحٰۤی اِلَیَّ اِلَّاۤ اَنَّمَاۤ اَنَا نَذِیْرٌ مُّبِیْنٌ ۟
అల్లాహ్ నాకు దైవ వాణి చేయవలసినది చేశాడు ఎందుకంటే నేను మీకు ఆయన శిక్ష నుండి హెచ్చరించే వాడిని,హెచ్చరికను స్పష్టంగా చేసేవాడిని.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰٓىِٕكَةِ اِنِّیْ خَالِقٌۢ بَشَرًا مِّنْ طِیْنٍ ۟
మీ ప్రభువు దైవదూతలతో ఇలా పలికినప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి : నిశ్ఛయంగా నేను మట్టితో ఒక మనిషిని సృష్టించబోతున్నాను. మరియు అతడు ఆదమ్ అలైహిస్సలాం.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَاِذَا سَوَّیْتُهٗ وَنَفَخْتُ فِیْهِ مِنْ رُّوْحِیْ فَقَعُوْا لَهٗ سٰجِدِیْنَ ۟
నేను అతని సృష్టిని సరిగా చేసి అతని రూపమును సరిదిద్ది అతనిలో నా ఆత్మను ఊదినప్పుడు మీరు అతనికి సాష్టాంగపడండి.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَسَجَدَ الْمَلٰٓىِٕكَةُ كُلُّهُمْ اَجْمَعُوْنَ ۟ۙ
అప్పుడు దైవదూతలు తమ ప్రభువు ఆదేశమును చేసి చూపించారు. అప్పుడు వారందరు గౌరవప్రదమైన సాష్టాంగమును చేశారు. వారిలో నుండి ఆదం అలైహిస్సలాంకు సాష్టాంగపడకుండా ఎవరూ మిగలలేదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِلَّاۤ اِبْلِیْسَ ؕ— اِسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكٰفِرِیْنَ ۟
కాని ఇబ్లీస్ సాష్టాంగపడటం నుండి అహంకారమును చూపాడు. మరియు అతడు తన ప్రభువు ఆదేశంనకు వ్యతిరేకంగా తన గర్వం వలన అవిశ్వాసపరుల్లోంచి అయిపోయాడు.
Arabische Interpretationen von dem heiligen Quran:
قَالَ یٰۤاِبْلِیْسُ مَا مَنَعَكَ اَنْ تَسْجُدَ لِمَا خَلَقْتُ بِیَدَیَّ ؕ— اَسْتَكْبَرْتَ اَمْ كُنْتَ مِنَ الْعَالِیْنَ ۟
అల్లాహ్ ఇలా పలికాడు : ఓ ఇబ్లీస్ నేను నా చేతితో సృష్టించిన ఆదంకు సాష్టాంగపడటం నుండి నిన్ను ఏది ఆపినది ?!. ఏమీ సాష్టాంగపడటం నుండి గర్వం నిన్ను ఆపినదా లేదా ముందు నుండే నీవు నీ ప్రభువుపై గర్వం,అహంకారం కలవాడివా ?!.
Arabische Interpretationen von dem heiligen Quran:
قَالَ اَنَا خَیْرٌ مِّنْهُ ؕ— خَلَقْتَنِیْ مِنْ نَّارٍ وَّخَلَقْتَهٗ مِنْ طِیْنٍ ۟
ఇబ్లీస్ ఇలా పలికాడు : నేను ఆదం కన్న గొప్పవాడిని. నిశ్చయంగా నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు ఆదంను మట్టితో సృష్టించావు. మరియు అతని ఉద్దేశం ప్రకారం అగ్ని మట్టికన్న ఎంతో గొప్ప మూలకము.
Arabische Interpretationen von dem heiligen Quran:
قَالَ فَاخْرُجْ مِنْهَا فَاِنَّكَ رَجِیْمٌ ۟ۙۖ
అల్లాహ్ ఇబ్లీసుకు ఇలా ఆదేశమిచ్చాడు : నీవు స్వర్గము నుండి వెళ్ళిపో. నిశ్చయంగా నీవు శపించబడ్డావు మరియు ధూషించబడ్డావు.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَّاِنَّ عَلَیْكَ لَعْنَتِیْۤ اِلٰی یَوْمِ الدِّیْنِ ۟
మరియు నిశ్చయంగా నీపై స్వర్గం నుండి ధూత్కారము ప్రతిఫలదినం వరకు ఉంటుంది. మరియు అది ప్రళయదినము.
Arabische Interpretationen von dem heiligen Quran:
قَالَ رَبِّ فَاَنْظِرْنِیْۤ اِلٰی یَوْمِ یُبْعَثُوْنَ ۟
ఇబ్లీస్ ఇలా పలికాడు : నీవు నాకు గడువునిచ్చి నీ దాసులను నీవు మరల లేపే రోజు వరకు నాకు మరణం కలిగించకు.
Arabische Interpretationen von dem heiligen Quran:
قَالَ فَاِنَّكَ مِنَ الْمُنْظَرِیْنَ ۟ۙ
అల్లాహ్ ఇలా పలికాడు : నీవు గడువివ్వబడిన వారిలో వాడివి.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِلٰی یَوْمِ الْوَقْتِ الْمَعْلُوْمِ ۟
వినాశనము కొరకు నియమిత,నిర్ధారిత సమయ రోజు వరకు.
Arabische Interpretationen von dem heiligen Quran:
قَالَ فَبِعِزَّتِكَ لَاُغْوِیَنَّهُمْ اَجْمَعِیْنَ ۟ۙ
ఇబ్లీస్ ఇలా పలికాడు : అయితే నేను నీ సామర్ధ్యము,నీ ఆధిక్యత పై ప్రమాణం చేస్తున్నాను నేను ఆదం సంతతినంతటినీ తప్పకుండా అపమార్గమునకు లోను చేస్తాను.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِیْنَ ۟
నీవు ఎవరినైతే నా మార్గభ్రష్టత నుండి రక్షించి నీ ఒక్కడి ఆరాధన చేయటం కొరకు ప్రత్యేకించుకున్నావో వారు తప్ప.
Arabische Interpretationen von dem heiligen Quran:
Die Nutzen der Versen in dieser Seite:
• القياس والاجتهاد مع وجود النص الواضح مسلك باطل.
స్పష్టమైన ఆధారం (నస్) ఉండి కూడా ఖియాస్ (తలంపు),ఇజ్తిహాద్ చేయటం అసత్య మార్గము.

• كفر إبليس كفر عناد وتكبر.
ఇబ్లీస్ అవిశ్వాసం మొండి మరియు అహంకార అవిశ్వాసం.

• من أخلصهم الله لعبادته من الخلق لا سبيل للشيطان عليهم.
అల్లాహ్ సృష్టిరాసుల్లోంచి తన ఆరాధనకు ప్రత్యేకించుకున్న వారిపై షైతాన్ కొరకు ఎటువంటి మార్గము ఉండదు.

قَالَ فَالْحَقُّ ؗ— وَالْحَقَّ اَقُوْلُ ۟ۚ
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా పలికాడు : అయితే సత్యం నా నుండే. నేను పలికేది సత్యము. అది తప్ప ఇంకొకటి నేను పలకను.
Arabische Interpretationen von dem heiligen Quran:
لَاَمْلَـَٔنَّ جَهَنَّمَ مِنْكَ وَمِمَّنْ تَبِعَكَ مِنْهُمْ اَجْمَعِیْنَ ۟
నేను తప్పకుండా ప్రళయదినమున నరకమును నీతో మరియు నీ అవిశ్వాసంలో నిన్ను అనుసరించిన ఆదం సంతతినంతటితో నింపివేస్తాను.
Arabische Interpretationen von dem heiligen Quran:
قُلْ مَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ وَّمَاۤ اَنَا مِنَ الْمُتَكَلِّفِیْنَ ۟
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : నేను మీకు చేరవేసిన హితోపదేశములపై మీతో ఎటువంటి ప్రతిఫలమును అడగటం లేదు. మరియు నేను నాకు ఆదేశం ఇవ్వబడిన దాని కంటే అధికంగా తీసుకుని వచ్చే బాధ్యుడిని కాను.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِنْ هُوَ اِلَّا ذِكْرٌ لِّلْعٰلَمِیْنَ ۟
ఖుర్ఆన్ కేవలం బాధ్యులైన మానవులకి మరియు జిన్నులకి ఒక హితోపదేశం మాత్రమే.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَلَتَعْلَمُنَّ نَبَاَهٗ بَعْدَ حِیْنٍ ۟۠
మరియు ఈ ఖుర్ఆన్ సందేశమును మరియు అది సత్యం పలికేదని మీరు మరణించే కొద్ది సమయము ముందు తెలుసుకుంటారు.
Arabische Interpretationen von dem heiligen Quran:
Die Nutzen der Versen in dieser Seite:
• الداعي إلى الله يحتسب الأجر من عنده، لا يريد من الناس أجرًا على ما يدعوهم إليه من الحق.
అల్లాహ్ వైపు పిలిచేవాడు ప్రతిఫలమును ఆయన వద్ద నుండే ఆశిస్తాడు. అతడు ప్రజల నుండి వారిని సత్యం వైపునకు పిలవటంపై ఎటువంటి ప్రతిఫలమును ఆశించడు.

• التكلّف ليس من الدِّين.
మొహమాటం ధర్మంలో లేదు.

• التوسل إلى الله يكون بأسمائه وصفاته وبالإيمان وبالعمل الصالح لا غير.
అల్లాహ్ సాన్నిధ్యం అనేది ఆయన పేర్లతో,ఆయన గుణాలతో,విశ్వాసముతో,సత్కర్మలు చేయటంతో కలుగును. వేరే వాటితో కాదు.

 
Übersetzung der Bedeutungen Surah / Kapitel: Sâd
Suren/ Kapiteln Liste Nummer der Seite
 
Übersetzung der Bedeutungen von dem heiligen Quran - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Übersetzungen

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Schließen