Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Hūd   Ayah:
قَالَتْ یٰوَیْلَتٰۤی ءَاَلِدُ وَاَنَا عَجُوْزٌ وَّهٰذَا بَعْلِیْ شَیْخًا ؕ— اِنَّ هٰذَا لَشَیْءٌ عَجِیْبٌ ۟
దైవ దూతలు సారహ్ కు ఈ శుభవార్తను ఇచ్చినప్పుడు ఆమె ఆశ్చర్యముతో ఇలా పలికింది : నేను ఎలా జన్మనివ్వగలను ? నేను సంతానము కలగటంపై ఆశ వదులుకున్న వృద్ధురాలిని,మరియు నా ఈ భర్త వృద్ధాప్య వయసునకు చేరిన వాడు.నిశ్చయంగా ఈ స్థితిలో పిల్లవాడిని జన్మనివ్వటం అలవాటుకు విరుద్ధమైనది ఆశ్చర్యకరమైన విషయం.
Arabic explanations of the Qur’an:
قَالُوْۤا اَتَعْجَبِیْنَ مِنْ اَمْرِ اللّٰهِ رَحْمَتُ اللّٰهِ وَبَرَكٰتُهٗ عَلَیْكُمْ اَهْلَ الْبَیْتِ ؕ— اِنَّهٗ حَمِیْدٌ مَّجِیْدٌ ۟
సారహ్ శుభవార్త పై ఆశ్చర్యపడినప్పుడు దైవదూతలు ఆమెతో ఇలా పలికారు : నీవు ఆల్లాహ్ నిర్ణయంపై,ఆయన సామర్ధ్యంపై ఆశ్చర్యపడుతున్నావా ?.నీ లాంటి స్త్రీ పై అల్లాహ్ ఇటువంటి విషయంపై సామర్ధ్యం కలవాడన్న విషయం గోప్యంగా లేదు.ఓ ఇబ్రాహీం ఇంటివారా అల్లాహ్ కారుణ్యము,ఆయన శుభాలు మీపై ఉన్నాయి.నిశ్చయంగా అల్లాహ్ తన గుణాల్లో,తన కార్యాల్లో స్తోత్రాలకు అర్హుడు,మహత్వము,గొప్పతనము కలవాడు.
Arabic explanations of the Qur’an:
فَلَمَّا ذَهَبَ عَنْ اِبْرٰهِیْمَ الرَّوْعُ وَجَآءَتْهُ الْبُشْرٰی یُجَادِلُنَا فِیْ قَوْمِ لُوْطٍ ۟ؕ
ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం నుండి ఆ భయము ఏదైతే అతని ఆ అతిధుల నుండి ఎవరైతే అతని భోజనమును తినలేదో వారు దైవ దూతలని ఆయనకు తెలిసిన తరువాత దూరమైనదో మరియు ఆయన వద్దకు సంతోషమును కలిగించే వార్త ఆయనకు ఇస్హాఖ్ సంతానముగా కలుగుతాడని ఆ తరువాత యాఖూబ్ కలుగుతారని వచ్చినదో ఆయన లూత్ జాతి విషయంలో మా దూతలతో వాదించటం మొదలు పెట్టారు.బహుశా వారు వారి నుండి శిక్షను వెనుకకు నెట్టుతారని,బహుశా వారు లూత్ ను మరియు ఆయన ఇంటివారిని విముక్తి కలిగిస్తారని.
Arabic explanations of the Qur’an:
اِنَّ اِبْرٰهِیْمَ لَحَلِیْمٌ اَوَّاهٌ مُّنِیْبٌ ۟
నిశ్చయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం సహనశీలుడు. శిక్షను ఆలస్యం చేయటమును ఇష్టపడుతాడు.తన ప్రభువు వైపు ఎక్కువగా వినయమును చూపేవాడు,ఎక్కువగా అర్ధించేవాడు,ఆయన వైపు పశ్చాత్తాప్పడే వాడు.
Arabic explanations of the Qur’an:
یٰۤاِبْرٰهِیْمُ اَعْرِضْ عَنْ هٰذَا ۚ— اِنَّهٗ قَدْ جَآءَ اَمْرُ رَبِّكَ ۚ— وَاِنَّهُمْ اٰتِیْهِمْ عَذَابٌ غَیْرُ مَرْدُوْدٍ ۟
దైవదూతలు ఇలా పలికారు : ఓ ఇబ్రాహీం మీరు లూత్ జాతి వారి విషయంలో ఈ వాదించటమును మానుకోండి.నిశ్చయంగా వారిపై ఆయన వ్రాసిన శిక్ష వచ్చి పడటం ద్వారా నీ ప్రభువు ఆదేశం వచ్చినది.మరియు నిశ్చయంగా లూత్ జాతి వారిపై పెద్ద శిక్ష వస్తున్నది. దాన్ని ఎటువంటి వాదన గాని ప్రార్ధన గాని మళ్ళించదు.
Arabic explanations of the Qur’an:
وَلَمَّا جَآءَتْ رُسُلُنَا لُوْطًا سِیْٓءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَّقَالَ هٰذَا یَوْمٌ عَصِیْبٌ ۟
మరియు దైవ దూతలు మగవారి రూపములో లూత్ వద్దకు వచ్చినప్పుడు వారి రాక ఆయనకు బాధ కలిగించింది.మరియు ఆయన జాతిలో కొందరు స్త్రీలను వదిలి మగవారితో కామ కోరికలు తీర్చుకునేవారు. వారిపై ఆయన భయము ఉండటం వలన ఆయన హృదయము కృంగిపోయింది.మరియు లూత్ జాతివారు ఆయన అతిధుల విషయంలో ఆయన్ను ఓడిస్తారని భావించటం వలన ఇది కఠినమైన దినము అని లూత్ అన్నారు.
Arabic explanations of the Qur’an:
وَجَآءَهٗ قَوْمُهٗ یُهْرَعُوْنَ اِلَیْهِ ؕ— وَمِنْ قَبْلُ كَانُوْا یَعْمَلُوْنَ السَّیِّاٰتِ ؕ— قَالَ یٰقَوْمِ هٰۤؤُلَآءِ بَنَاتِیْ هُنَّ اَطْهَرُ لَكُمْ فَاتَّقُوا اللّٰهَ وَلَا تُخْزُوْنِ فِیْ ضَیْفِیْ ؕ— اَلَیْسَ مِنْكُمْ رَجُلٌ رَّشِیْدٌ ۟
మరియు లూత్ జాతి వారు లూత్ వద్దకు ఆయన అతిధుల పట్ల నీచపు పని (ఆశ్లీల చర్య) చేసే ఉద్దేశముతో పరిగెత్తుకొని వచ్చారు.దానికన్నా ముందు నుంచే స్త్రీలను వదిలి కామ కోరికలను మగవారితో పూర్తి చేసుకోవటం వారి అలవాటు ఉండేది.లూత్ తనజాతి వారిని ఎదుర్కొంటూ మరియు తన అతిధుల ముందు క్షమాపణ కోరుతూ ఇలా అన్నారు : వీరందరూ నా కుమార్తెలు మీ స్త్రీలలో నుంచే కాబట్టి మీరు వారితో వివాహం చేసుకోండి.వారందరు మీ కొరకు నీచపు చర్యకు పాల్పడటం కన్న ఎక్కువ పరిశుద్ధులు.అయితే మీరు అల్లాహ్ కు భయపడండి,మరియు మీరు నా అతిధుల విషయంలో నన్ను అవమానపాలు చేయకండి (తలదించుకొనేలా చేయకండి).ఓ నా జాతి వారా మీలో నుండి ఈ దుష్ట చర్య నుండి మిమ్మల్ని ఆపేవాడు సరైన బుద్ది కలవాడు లేడా ?!.
Arabic explanations of the Qur’an:
قَالُوْا لَقَدْ عَلِمْتَ مَا لَنَا فِیْ بَنَاتِكَ مِنْ حَقٍّ ۚ— وَاِنَّكَ لَتَعْلَمُ مَا نُرِیْدُ ۟
ఆయన జాతి వారు ఆయనతో ఇలా పలికారు : ఓ లూత్ నీ కుమార్తెలలో,నీ జాతి స్త్రీలలో మాకు ఎటువంటి అవసరం గాని కోరిక గాని లేదని నీకు తెలుసు.మరియు నిశ్చయంగా మేము ఏమి కోరుకుంటున్నామో నీకు తెలుసు.మేము కేవలం మగవారినే కోరుకుంటున్నాము.
Arabic explanations of the Qur’an:
قَالَ لَوْ اَنَّ لِیْ بِكُمْ قُوَّةً اَوْ اٰوِیْۤ اِلٰی رُكْنٍ شَدِیْدٍ ۟
లూత్ అలైహిస్సలాం ఇలా పలికారు : నాకు మిమ్మల్ని ఎదుర్కొనే బలం ఉంటే లేదా నా నుండి ఆపే ఏదైన వంశం ఉంటే ఎంత బాగుండేది.అప్పుడు నేను మీకు మరియు నా అతిధుల మధ్య అడ్డుగా ఉంటాను.
Arabic explanations of the Qur’an:
قَالُوْا یٰلُوْطُ اِنَّا رُسُلُ رَبِّكَ لَنْ یَّصِلُوْۤا اِلَیْكَ فَاَسْرِ بِاَهْلِكَ بِقِطْعٍ مِّنَ الَّیْلِ وَلَا یَلْتَفِتْ مِنْكُمْ اَحَدٌ اِلَّا امْرَاَتَكَ ؕ— اِنَّهٗ مُصِیْبُهَا مَاۤ اَصَابَهُمْ ؕ— اِنَّ مَوْعِدَهُمُ الصُّبْحُ ؕ— اَلَیْسَ الصُّبْحُ بِقَرِیْبٍ ۟
దైవ దూతలు లూత్ అలైహిస్సలాంతో ఇలా పలికారు : ఓ లూత్ నిశ్చయంగా మేము అల్లాహ్ పంపించిన దూతలము.నీ జాతి వారు నీ వద్దకు చెడును తీసుకొని చేరలేరు.అయితే మీరు మీ ఇంటి వారిని తీసుకొని రాత్రి చీకటి వేళలో ఈ ఊరి నుండి బయలుదేరండి.మీలో నుంచి ఎవ్వరూ నీ భార్య తప్ప వెనుక తిరిగి చూడకూడదు.ఆమె భిన్నంగా మారబోతుంది.ఎందుకంటే ఆయన నీ జాతి వారికి కలిగించే శిక్షను ఆమెకు కూడా కలిగిస్తాడు.నిశ్చయంగా ఉదయం వేళ వారి వినాశన నిర్ణీత వేళ.మరియు అది దగ్గరగా ఉన్న నిర్ణీత సమయం.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• بيان فضل ومنزلة خليل الله إبراهيم عليه السلام، وأهل بيته.
అల్లాహ్ స్నేహితుడైన ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఆయన ఇంటి వారి విశిష్టత,స్థానము ప్రకటన.

• مشروعية الجدال عمن يُرجى له الإيمان قبل الرفع إلى الحاكم.
ఎవరి కొరకైతే విశ్వాసము గురించి ఆశించటం జరుగుతుందో అతనికి న్యాయమూర్తి ముందు హాజరు పరచకముందు అతని గురించి వాదించటం ధర్మబద్ధం చేయబడినది.

• بيان فظاعة وقبح عمل قوم لوط.
లూత్ జాతి వారి యొక్క వికారమైన,చెడ్డదైన చర్య ప్రకటన.

 
Translation of the meanings Surah: Hūd
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close