Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: An-Nahl   Ayah:
وَمَاۤ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ اِلَّا رِجَالًا نُّوْحِیْۤ اِلَیْهِمْ فَسْـَٔلُوْۤا اَهْلَ الذِّكْرِ اِنْ كُنْتُمْ لَا تَعْلَمُوْنَ ۟ۙ
ఓ ప్రవక్తా మేము మీ కన్నా మునుపు కేవలం మానవుల్లోంచి మగవారిని మాత్రమే ప్రవక్తలుగా పంపించి వారి వైపునకు దైవ వాణిని అవతరింపజేశాము. మేము దైవదూతల్లోంచి ప్రవక్తలను పంపించలేదు. ఒక వేళ మీరు దీన్ని నిరాకరిస్తే పూర్వ గ్రంధవహులను మీరు అడగండి వారు దైవ ప్రవక్తలు మానువులై ఉంటారని,దైవదూతలు కారని మీకు సమాధానమిస్తారు. ఒక వేళ వారు మానవులని మీకు తెలియకపోతే (అడిగి తెలుసుకోండి)
Arabic explanations of the Qur’an:
بِالْبَیِّنٰتِ وَالزُّبُرِ ؕ— وَاَنْزَلْنَاۤ اِلَیْكَ الذِّكْرَ لِتُبَیِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ اِلَیْهِمْ وَلَعَلَّهُمْ یَتَفَكَّرُوْنَ ۟
మేము మానవుల్లోంచి ఈ ప్రవక్తలందరిని స్పష్టమైన ఆధారాలను,అవతరింపబడిన గ్రంధాలను ఇచ్చి పంపించాము. ఓ ప్రవక్త మేము మీపై ఖుర్ఆన్ ను ప్రజలకు ఏ వివరణ అవసరమో ఆ వివరణ ఇవ్వటానికి మీపై అవతరింపజేశాము. బహుశా వారు తమ ఆలోచనలను అమలులో పెట్టి దానికి సంభందించిన విషయాల ద్వారా హితబోధన గ్రహిస్తారు.
Arabic explanations of the Qur’an:
اَفَاَمِنَ الَّذِیْنَ مَكَرُوا السَّیِّاٰتِ اَنْ یَّخْسِفَ اللّٰهُ بِهِمُ الْاَرْضَ اَوْ یَاْتِیَهُمُ الْعَذَابُ مِنْ حَیْثُ لَا یَشْعُرُوْنَ ۟ۙ
ఏమీ అల్లాహ్ మార్గము నుండి ఆపటానికి దుష్ట పన్నాగాలు పన్నిన వారు అల్లాహ్ వారిని ఖారూనును కూర్చినట్లు భూమిలో కూరుకుపోయేలా చేస్తాడనీ లేదా తాము ఊహించని చోటు నుండి వారిపై శిక్ష వచ్చి పడుతుందని భయపడటంలేదా.
Arabic explanations of the Qur’an:
اَوْ یَاْخُذَهُمْ فِیْ تَقَلُّبِهِمْ فَمَا هُمْ بِمُعْجِزِیْنَ ۟ۙ
లేదా వారు తమ ప్రయాణముల్లో,తమ సంపాదనల కొరకు శ్రమించటంలో ఇటూ అటూ తిరుగుతున్న స్థితిలో ఉన్నప్పుడు వారిని శిక్షకు గురి చేస్తే వారు తప్పించుకోలేరు,కోలుకోలేరు.
Arabic explanations of the Qur’an:
اَوْ یَاْخُذَهُمْ عَلٰی تَخَوُّفٍ ؕ— فَاِنَّ رَبَّكُمْ لَرَءُوْفٌ رَّحِیْمٌ ۟
ఏమీ వారికి అల్లాహ్ శిక్ష వారు దాని నుండి భయపడుతున్న స్థితిలో వచ్చి పడుతుందని భయపడటం లేదా.అల్లాహ్ ప్రతీ స్థితిలో వారిని శిక్షకు గురి చేసే సామర్ధ్యం కలవాడు. నిశ్చయంగా మీ ప్రభువు దయ చూపేవాడు,కరుణించేవాడు. బహుశా అతని దాసులు అతనితో పశ్చాత్తాప్పడతారని శిక్షను తొందరగా అమలుపరచడు.
Arabic explanations of the Qur’an:
اَوَلَمْ یَرَوْا اِلٰی مَا خَلَقَ اللّٰهُ مِنْ شَیْءٍ یَّتَفَیَّؤُا ظِلٰلُهٗ عَنِ الْیَمِیْنِ وَالشَّمَآىِٕلِ سُجَّدًا لِّلّٰهِ وَهُمْ دٰخِرُوْنَ ۟
ఏమి ఈ తిరస్కారులందరు ఆయన సృష్టితాల వైపు యోచనతో చూడరా ?. వాటి నీడలు సూర్యుని చలనమునకు అనుసరిస్తూ ఎడమ వైపునకు,కుడి వైపునకు వాలుతున్నవి. పగటి పూట వాటి సంచారము,రాత్రి పూట చంద్రునికి (అనుసరిస్తూ). తమ ప్రభువునకు వినమ్రత చూపుతూ ఆయనకు వాస్తవంగా సాష్టాంగపడుతున్నవి. మరియు అవి అణకువ కలవి.
Arabic explanations of the Qur’an:
وَلِلّٰهِ یَسْجُدُ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ مِنْ دَآبَّةٍ وَّالْمَلٰٓىِٕكَةُ وَهُمْ لَا یَسْتَكْبِرُوْنَ ۟
మరియు అల్లాహ్ ఒక్కడి కొరకు భూమ్యాకాశముల్లో ఉన్న సమస్త ప్రాణులు సాష్టాంగపడుతున్నవి,ఆయన ఒక్కడికే దైవదూతలు సాష్టాంగపడుతున్నవి. మరియు అవి అల్లాహ్ ఆరాధన నుండి,ఆయన విధేయత నుండి అహంకారమును చూపవు.
Arabic explanations of the Qur’an:
یَخَافُوْنَ رَبَّهُمْ مِّنْ فَوْقِهِمْ وَیَفْعَلُوْنَ مَا یُؤْمَرُوْنَ ۟
వారందరు తాము చేస్తున్న శాస్వత ఆరాధన,విధేయత తోపాటు తమపై ఉన్న తమ ప్రభువు అస్తిత్వము నుండి,ఆయన అణచివేత నుండి, ఆయన అధికారము నుండి భీతిని కలిగి ఉంటారు. వారికి వారి ప్రభువు ఆదేశించిన వాటిని విధేయతతో పాటిస్తారు.
Arabic explanations of the Qur’an:
وَقَالَ اللّٰهُ لَا تَتَّخِذُوْۤا اِلٰهَیْنِ اثْنَیْنِ ۚ— اِنَّمَا هُوَ اِلٰهٌ وَّاحِدٌ ۚ— فَاِیَّایَ فَارْهَبُوْنِ ۟
పరిశుద్ధుడైన అల్లాహ్ తన దాసులందరితో ఇలా పలికాడు : మీరు ఇద్దరు ఆరాధ్యదైవాలుగా చేసుకోకండి. సత్య ఆరాధ్య దైవము ఒక్కడే అతనికి రెండవవాడు లేడు, ఎవరు సాటి లేరు.మీరు నాతోనే భయపడండి. నాతోకాక ఇతరులతో భయపడకండి.
Arabic explanations of the Qur’an:
وَلَهٗ مَا فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ وَلَهُ الدِّیْنُ وَاصِبًا ؕ— اَفَغَیْرَ اللّٰهِ تَتَّقُوْنَ ۟
భూమ్యాకాశముల్లో ఉన్న సమస్తమును సృష్టించటంలో,పాలించటంలో,పర్యాలోచన చేయటంలో ఆయన ఒక్కడికే అధికారం కలదు. విధేయత,అణకువ,చిత్తశుద్ధి ఆయన ఒక్కడి కొరకే స్థిరము. అయితే మీరు అల్లాహ్ ను వదిలి ఇతరులతో భయపడుతారా ?!.అలా జరగకూడదు,మీరు కేవలం ఆయన ఒక్కడితోనే భయపడాలి.
Arabic explanations of the Qur’an:
وَمَا بِكُمْ مِّنْ نِّعْمَةٍ فَمِنَ اللّٰهِ ثُمَّ اِذَا مَسَّكُمُ الضُّرُّ فَاِلَیْهِ تَجْـَٔرُوْنَ ۟ۚ
ఓ ప్రజలారా మీకు కలిగిన ధార్మిక లేదా ప్రాపంచిక అనుగ్రహాలు పరిశుద్ధుడైన అల్లాహ్ వద్ద నుండి వచ్చినవి,ఇతరుల వద్ద నుంచి కావు. అంతే కాదు మీకు కలిగే ఆపదలు లేదా రోగము లేదా పేదరికం సమయంలో మీకు కలిగినది మీ నుండి తొలగిపోవటానికి మీరు ఆయన ఒక్కడి వైపే కడు వినయంగా వేడుకుంటారు. అనుగ్రహాలను ప్రసాధంచేవాడు, కష్టమును తొలగించేవాడు(ఆయనే). ఆయన ఒక్కడి ఆరాధన చేయబడటం తప్పనిసరి.
Arabic explanations of the Qur’an:
ثُمَّ اِذَا كَشَفَ الضُّرَّ عَنْكُمْ اِذَا فَرِیْقٌ مِّنْكُمْ بِرَبِّهِمْ یُشْرِكُوْنَ ۟ۙ
ఆ తరువాత ఆయన మీ అర్ధనను స్వీకరించి మీకు కలిగిన కష్టమును తొలగించగానే మీలో నుండి ఒక వర్గము తమ ప్రభవుతో సాటి కల్పించ సాగారు.ఎలాగంటే ఆయనతోపాటు ఇతరులను ఆరాధించసాగారు. అయితే ఇది ఏమి దిగజారుడుతనం ?!.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• على المجرم أن يستحي من ربه أن تكون نعم الله عليه نازلة في جميع اللحظات ومعاصيه صاعدة إلى ربه في كل الأوقات.
నేరస్తుడు తన ప్రభవుయందు సిగ్గు పడాలి.అన్నివేళల్లో అతని పాపాలు తన ప్రభువుకు చేరుతున్నా కూడా అన్ని సమయాల్లో అల్లాహ్ అనుగ్రహాలు అతనిపై కురుస్తున్నాయి.

• ينبغي لأهل الكفر والتكذيب وأنواع المعاصي الخوف من الله تعالى أن يأخذهم بالعذاب على غِرَّة وهم لا يشعرون.
అవిశ్వాసపరులు,తిరస్కారులు,రకరకాల పాపాలకు పాల్పడినవారు మహోన్నతుడైన అల్లాహ్ వారు పరధ్యానంలో ఉన్నప్పుడు,వారికి తెలియకుండా ఉన్న స్థితిలో వారిని శిక్ష ద్వారా పట్టుకుంటాడని భయపడాలి.

• جميع النعم من الله تعالى، سواء المادية كالرّزق والسّلامة والصّحة، أو المعنوية كالأمان والجاه والمنصب ونحوها.
అనుగ్రహాలన్ని మహోన్నతుడైన అల్లాహ్ వద్ద నుండే అవి ఆహారోపాధి,శ్రేయస్సు, ఆరోగ్యం లాంటివైన భౌతికమైనవి లేదా రక్షణ,మానమర్యాదలు, హోదాలు ఇంకా అటువంటి వేరే నైతికమైనవి సమానము.

• لا يجد الإنسان ملجأً لكشف الضُّرِّ عنه في وقت الشدائد إلا الله تعالى فيضجّ بالدّعاء إليه؛ لعلمه أنه لا يقدر أحد على إزالة الكرب سواه.
కష్టాల సమయంలో మానవుడు తన నుండి నష్టమును తొలగించటం కొరకు మహోన్నతుడైన అల్లాహ్ తప్ప ఇంకొకరిని ఆశ్రయంగా పొందడు. అందుకనే ఆయన తప్ప ఇంకొకరు బాధను తొలగించే సమర్ధులు కారని తెలిసి ఆయన వైపునకే అతను దుఆతో సందడి చేస్తాడు.

 
Translation of the meanings Surah: An-Nahl
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close