Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Al-Kahf   Ayah:
وَاصْبِرْ نَفْسَكَ مَعَ الَّذِیْنَ یَدْعُوْنَ رَبَّهُمْ بِالْغَدٰوةِ وَالْعَشِیِّ یُرِیْدُوْنَ وَجْهَهٗ وَلَا تَعْدُ عَیْنٰكَ عَنْهُمْ ۚ— تُرِیْدُ زِیْنَةَ الْحَیٰوةِ الدُّنْیَا ۚ— وَلَا تُطِعْ مَنْ اَغْفَلْنَا قَلْبَهٗ عَنْ ذِكْرِنَا وَاتَّبَعَ هَوٰىهُ وَكَانَ اَمْرُهٗ فُرُطًا ۟
నీవు పగటి మొదటి వేళలో,దాని చివరి వేళలో ఆరాధన ఉద్ధేశంతో,వేడుకునే ఉద్దేశంతో ఆయన కొరకు చిత్తశుద్ధితో అర్ధించే వారి సహచర్యంలో నీ మనసును ఇమిడ్చి ఉంచు. నీవు ధనవంతుల,గౌరవంతుల సమావేశాలను ఆశిస్తూ నీ దృష్టిని వారి నుండి దాటనివ్వకు. ఎవడి హృదయము పై మేము సీలు వేసి మా స్మరణ నుండి పరధ్యానమునకు లోను చేస్తే అతడు నీ మండలి నుండి నిరుపేదలను తొలగించటం గురించి నీకు ఆదేశించి,తన ప్రభువు విధేయతకు వ్యతిరేకంగా తన మనోవాంఛనలను అనుసరించాడో అతడిని నీవు అనుసరించకు. అతని ఆచరణలు వృధా అయిపోయినవి.
Arabic explanations of the Qur’an:
وَقُلِ الْحَقُّ مِنْ رَّبِّكُمْ ۫— فَمَنْ شَآءَ فَلْیُؤْمِنْ وَّمَنْ شَآءَ فَلْیَكْفُرْ ۚ— اِنَّاۤ اَعْتَدْنَا لِلظّٰلِمِیْنَ نَارًا اَحَاطَ بِهِمْ سُرَادِقُهَا ؕ— وَاِنْ یَّسْتَغِیْثُوْا یُغَاثُوْا بِمَآءٍ كَالْمُهْلِ یَشْوِی الْوُجُوْهَ ؕ— بِئْسَ الشَّرَابُ ؕ— وَسَآءَتْ مُرْتَفَقًا ۟
ఓ ప్రవక్తా తమ హృదయముల నిర్లక్ష్యం వలన అల్లాహ్ స్మరణ నుండి పరధ్యానంలో ఉన్న వీరందరితో ఇలా పలకండి : నేను మీ వద్దకు తీసుకుని వచ్చినది అది సత్యము. అది నా వద్ద నుండి కాదు అల్లాహ్ వద్ద నుండి వచ్చినది. విశ్వాసపరులని నేను గెంటి వేయాలని మీరు నాతో కోరిన దానిని నేను స్వీకరించను. అయితే మీలో నుండి ఎవరు ఈ సత్యమును విశ్వసించదలచుకుంటే దాన్ని విశ్వసించండి. అతను దాని ప్రతిఫలం ద్వారా సంతోషం కలిగించబడుతాడు. మరియు మీలో నుండి ఎవరు దాన్ని తిరస్కరించదలచుకుంటే తిరస్కరించండి. అతని కోసం నిరీక్షిస్తున్న శిక్ష ద్వారా అతను తొందరలోనే శిక్షించబడుతాడు. నిశ్చయంగా మేము అవిశ్వాసమును ఎంచుకుని తమ మనస్సులపై హింసకు పాల్పడిన వారి కొరకు పెద్ద అగ్ని జ్వాలను సిద్ధపరచాము. దాని ప్రహరీ వారిని చుట్టుముట్టి ఉంటుంది. అయితే వారు దాని నుండి పారిపోలేరు. ఒక వేళ వారు తమకు కలిగిన తీవ్ర దాహం నుండి నీటి ద్వారా ఉపశమనం పొందాలని కోరితే తీవ్ర వేడి గల మురుగు నూనె లాంటి నీటితో వారికి ఉపశమనం కలిగించటం జరుగుతుంది. దాని వేడి తీవ్రత వలన వారి ముఖములు మాడిపోతాయి. వారు ఉపశమనం కలిగించబడిన ఈ పానియం ఎంతో చెడ్డదైనది. అయితే అది వారి దాహంను తీర్చదు కాని దానిని ఇంకా అధికం చేస్తుంది. వారి చర్మములను కాలుస్తున్న అగ్ని జ్వాలను అది ఆర్పదు. వారు నివాసమున్న స్థానమైన,వారు బస చేస్తున్న స్థలమైన అగ్ని ఎంతో చెడ్డది.
Arabic explanations of the Qur’an:
اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ اِنَّا لَا نُضِیْعُ اَجْرَ مَنْ اَحْسَنَ عَمَلًا ۟ۚ
నిశ్చయంగా అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కార్యములను చేసిన వారు తమ కర్మలను మంచిగా చేశారు. అయితే వారి కొరకు గొప్ప ప్రతిఫలం కలదు. నిశ్చయంగా మేము మంచి కర్మను చేసిన వారి పుణ్యమును వృధా చేయము. కాని ఎటువంటి తరుగుదల లేకుండా మేము వారి ప్రతిఫలములను సంపూర్ణంగా ప్రసాధిస్తాము.
Arabic explanations of the Qur’an:
اُولٰٓىِٕكَ لَهُمْ جَنّٰتُ عَدْنٍ تَجْرِیْ مِنْ تَحْتِهِمُ الْاَنْهٰرُ یُحَلَّوْنَ فِیْهَا مِنْ اَسَاوِرَ مِنْ ذَهَبٍ وَّیَلْبَسُوْنَ ثِیَابًا خُضْرًا مِّنْ سُنْدُسٍ وَّاِسْتَبْرَقٍ مُّتَّكِـِٕیْنَ فِیْهَا عَلَی الْاَرَآىِٕكِ ؕ— نِعْمَ الثَّوَابُ ؕ— وَحَسُنَتْ مُرْتَفَقًا ۟۠
విశ్వాసముతో, సత్కర్మలు చేయటముతో వర్ణించబడిన వీరందరి కొరకు స్థిరమైన(శాస్వతమైన) స్వర్గవనాలు కలవు. వాటిలో వారు శాస్వతంగా ఉంటారు. వారి నివాస స్థలముల క్రింది నుండి స్వర్గము యొక్క తీయని కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అందులో వారు బంగారపు కంకణలతో అలంకరించబడుతారు. మరియు వారు పచ్చని పలుచని మరియు మందమైన పట్టు వస్త్రాలను తొడుగుతారు. అందమైన పరదాలతో అలంకరించబడిన ఆసనాలతో ఆనుకుని కూర్చుని ఉంటారు. మంచి ప్రతిఫలం వారి ప్రతిఫలం.నివాసమైన,వారు బస చేస్తున్న స్థలమైన స్వర్గము ఎంతో మంచిది.
Arabic explanations of the Qur’an:
وَاضْرِبْ لَهُمْ مَّثَلًا رَّجُلَیْنِ جَعَلْنَا لِاَحَدِهِمَا جَنَّتَیْنِ مِنْ اَعْنَابٍ وَّحَفَفْنٰهُمَا بِنَخْلٍ وَّجَعَلْنَا بَیْنَهُمَا زَرْعًا ۟ؕ
ఓ ప్రవక్తా మీరు ఇద్దరు వ్యక్తులైన అవిశ్వాసపరుడుని,విశ్వాసపరుడుని ఒక ఉపమానమును తెలపండి. వారిద్దరిలో నుంచి మేము అవిశ్వాసపరునికి రెండు తోటలను (ద్రాక్ష తోటలను) ప్రసాదించాము,ఆ రెండు తోటలకు చుట్టూ ఖర్జూరపు చెట్లతో చుట్టు ముట్టాము. మరియు వాటి ఖాళీ ప్రాంతంలో పంటపొలాలను పండించాము.
Arabic explanations of the Qur’an:
كِلْتَا الْجَنَّتَیْنِ اٰتَتْ اُكُلَهَا وَلَمْ تَظْلِمْ مِّنْهُ شَیْـًٔا ۙ— وَّفَجَّرْنَا خِلٰلَهُمَا نَهَرًا ۟ۙ
అయితే ప్రతీ తోట తన ఫలాలైన ఖర్జురములను,ద్రాక్షా పండ్లను, పంటలను పండించింది. మరియు అందులో ఏది కూడా ఏమాత్రం తగ్గించలేదు. అంతే కాక అది దాన్ని సంపూర్ణంగా,పుష్కలంగా ఇచ్చింది.మరియు మేము ఆ రెండిటి మధ్య వాటికి సులభంగా నీరు పెట్టటానికి ఒక కాలువను ప్రవహింపజేశాము.
Arabic explanations of the Qur’an:
وَّكَانَ لَهٗ ثَمَرٌ ۚ— فَقَالَ لِصَاحِبِهٖ وَهُوَ یُحَاوِرُهٗۤ اَنَا اَكْثَرُ مِنْكَ مَالًا وَّاَعَزُّ نَفَرًا ۟
ఈ రెండు తోటల యజమానికి వేరే సంపదలు,ఫలాలు ఉండేవి. అయితే అతడు విశ్వాసపరుడైన తన స్నేహితునితో అతనిని ఉద్దేశించి అతన్ని బీరాలుపోతు ప్రభావితం చేయటానికి ఇలా పలికాడు : నేను సంపద పరంగా నీ కన్న అధికుడిని. స్థానపరంగా నీకన్న ఎక్కువ గౌరవం కలవాడిని, బలగం పరంగా నీ కన్నబలీష్టిని.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• فضيلة صحبة الأخيار، ومجاهدة النفس على صحبتهم ومخالطتهم وإن كانوا فقراء؛ فإن في صحبتهم من الفوائد ما لا يُحْصَى.
మంచి వ్యక్తుల సహచర్యం,వారి సహచర్యంలో,వారితో కలిసి ఉండటంలో ప్రయత్నించటం యొక్క ఘనత ఉన్నది. ఒక వేళ వారు పేదవారైనా సరే.ఎందుకంటే వారి సహచర్యంలో లెక్కలేనన్ని లాభలు కలవు.

• كثرة الذكر مع حضور القلب سبب للبركة في الأعمار والأوقات.
మనస్సును ప్రత్యక్షం పెట్టి అధికంగా స్మరణ చేయటం వయస్సులలో,సమయములో సమృద్ధతకు (బర్కత్ కు) కారణమవుతుంది.

• قاعدتا الثواب وأساس النجاة: الإيمان مع العمل الصالح؛ لأن الله رتب عليهما الثواب في الدنيا والآخرة.
ప్రతిఫలమునకు నియమాలు,విముక్తికి సామగ్రి : సత్కార్యముతోపాటు విశ్వాసముండటం. ఎందుకంటే ఆ రెండిటి పైనే అల్లాహ్ ఇహ,పర లోకాల్లో ప్రతిఫలమును జత చేశాడు.

 
Translation of the meanings Surah: Al-Kahf
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close