Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Ayah: (259) Surah: Al-Baqarah
اَوْ كَالَّذِیْ مَرَّ عَلٰی قَرْیَةٍ وَّهِیَ خَاوِیَةٌ عَلٰی عُرُوْشِهَا ۚ— قَالَ اَنّٰی یُحْیٖ هٰذِهِ اللّٰهُ بَعْدَ مَوْتِهَا ۚ— فَاَمَاتَهُ اللّٰهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهٗ ؕ— قَالَ كَمْ لَبِثْتَ ؕ— قَالَ لَبِثْتُ یَوْمًا اَوْ بَعْضَ یَوْمٍ ؕ— قَالَ بَلْ لَّبِثْتَ مِائَةَ عَامٍ فَانْظُرْ اِلٰی طَعَامِكَ وَشَرَابِكَ لَمْ یَتَسَنَّهْ ۚ— وَانْظُرْ اِلٰی حِمَارِكَ۫— وَلِنَجْعَلَكَ اٰیَةً لِّلنَّاسِ وَانْظُرْ اِلَی الْعِظَامِ كَیْفَ نُنْشِزُهَا ثُمَّ نَكْسُوْهَا لَحْمًا ؕ— فَلَمَّا تَبَیَّنَ لَهٗ ۙ— قَالَ اَعْلَمُ اَنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
లేదా పైకప్పులు పడిపోయి, గోడలు కూలిపోయి, ప్రజలు చనిపోయి, నిర్మానుష్యంగా మారి, శిధిలమై పోయిన ఒక పట్టణం గుండా వెళ్ళిన వ్యక్తి యొక్క ఉపమానం మీకు తెలుసా? అతడు ఆశ్చర్యంగా, 'అల్లాహ్ ఈ ప్రజలను తిరిగి ఎలా బ్రతికిస్తాడో?' అన్నాడు. అప్పుడు అల్లాహ్ అతడిని వంద సంవత్సరాల గడువు వరకు మరణింప జేసి, తర్వాత అతడిని తిరిగి బ్రతికించి, 'నీవు ఎంతకాలం వరకు చనిపోయి ఉన్నావు?' అని ప్రశ్నించాడు. దానికి అతడు ఇలా జవాబిచ్చాడు, 'నేను ఒక రోజు లేదా ఒక రోజు కన్నా తక్కువ ఆ స్థితిలో ఉన్నాను'. అప్పుడు అల్లాహ్ అతనితో ఇలా అన్నాడు, 'వాస్తవానికి, నీవు వంద సంవత్సరాలు అలా ఉన్నావు. నీ వద్ద నున్న ఆహారం వైపు చూడు, ఇంత సుదీర్ఘ కాలం గడిచి నప్పటికీ, అది కొంచెం కూడా చెడి పోకుండా ఎలా భద్రంగా ఉన్నదో! చెల్లాచెదురుగా పడి ఉన్న గాడిద ఎముకలను చూడు. నేను వాటిని ఎత్తి, ఒక చోట పోగు చేసి, వాటికి మాంసాన్ని తొడిగించి, మళ్ళీ ప్రాణం పోస్తాను’. దీనిని ప్రత్యక్షంగా చూడగానే, వాస్తవికత అతనికి స్పష్టమై పోయింది. తద్వారా అతడు అల్లాహ్ యొక్క అద్వితీయమైన శక్తిని గ్రహించి, సగౌరవంగా, 'అల్లాహ్కు అన్నింటిపై అధికారం ఉందని నాకు తెలుసు' అని అన్నాడు'.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• من أعظم ما يميز أهل الإيمان أنهم على هدى وبصيرة من الله تعالى في كل شؤونهم الدينية والدنيوية، بخلاف أهل الكفر.
విశ్వాసుల ప్రత్యేక లక్షణం ఏమిటంటే, అవిశ్వాసుల మాదిరిగా కాకుండా, వారి ప్రాపంచిక మరియు ధార్మిక పరమైన అన్నీ వ్యవహారాలలో అల్లాహ్ నుండి వారికి మార్గదర్శకత్వం మరియు అంతర్దృష్టి లభిస్తూ ఉంటుంది.

• من أعظم أسباب الطغيان الغرور بالقوة والسلطان حتى يعمى المرء عن حقيقة حاله.
తన సృష్టికర్తపై తిరుగుబాటు యొక్క ప్రధాన కారణాలలో ఒకటి ఏమిటంటే, అతడి శక్తి మరియు అధికారం ఆ వ్యక్తిని మోసగించి, వాస్తవికతను చూడలేని అంధుడిగా చేసి వేయడం.

• مشروعية مناظرة أهل الباطل لبيان الحق، وكشف ضلالهم عن الهدى.
సత్యాన్ని వివరించడానికి మరియు వారి తప్పిదాలను చూపించడానికి సత్యతిరస్కారులతో చర్చలు జరపడం ఆమోదయోగ్యమే.

• عظم قدرة الله تعالى؛ فلا يُعْجِزُهُ شيء، ومن ذلك إحياء الموتى.
అల్లాహ్ యొక్క శక్తి ఎంతో గొప్పది మరియు అతను జీవన్మరణాలను శాసించడంతో సహా ఏదైనా చేయగలడు.

 
Translation of the meanings Ayah: (259) Surah: Al-Baqarah
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close