Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Tā-ha   Ayah:
وَلَقَدْ اَوْحَیْنَاۤ اِلٰی مُوْسٰۤی ۙ۬— اَنْ اَسْرِ بِعِبَادِیْ فَاضْرِبْ لَهُمْ طَرِیْقًا فِی الْبَحْرِ یَبَسًا ۙ— لَّا تَخٰفُ دَرَكًا وَّلَا تَخْشٰی ۟
మరియు నిశ్చయంగా మేము మూసాకి దైవ వాణి ద్వారా ఇలా తెలిపాము : నీవు నా దాసులను తీసుకుని రాత్రి మిసర్ నుండి బయలుదేరు చివరికి వారిని ఎవరు గమనించకూడదు. మరియు సముద్రం పై చేతి కర్రతో కొట్టిన తరువాత వారి కొరకు సముద్రంలో ఒక పొడి మార్గమును ఏర్పాటు చేయి. నిశ్చింతగా నిన్ను ఫిర్ఔన్,అతని దర్బారీలు పట్టుకుంటారని భయపడకు. మరియు సముద్రంలో మునగటం నుండి భయపడకు.
Arabic explanations of the Qur’an:
فَاَتْبَعَهُمْ فِرْعَوْنُ بِجُنُوْدِهٖ فَغَشِیَهُمْ مِّنَ الْیَمِّ مَا غَشِیَهُمْ ۟ؕ
అప్పుడు ఫిర్ఔన్ తన సైనికులతో కలిసి వారిని వెంబడించాడు. అప్పుడు అతడిని,అతడి సైన్యములను సముద్రం అలుముకుని క్రమ్మివేసింది. వారికి ఏదైతే అలుముకుందో దాని వాస్తవికత అల్లాహ్ కు తప్ప ఇంకెవరికి తెలియదు. అప్పుడు వారందరు మునిగి వినాశనమునకు గురైపోయారు. మరియు మూసా,ఆయనతోపాటు ఉన్న వారు సాఫల్యం చెందారు.
Arabic explanations of the Qur’an:
وَاَضَلَّ فِرْعَوْنُ قَوْمَهٗ وَمَا هَدٰی ۟
మరియు ఫిర్ఔన్ తన జాతి వారిని తాను వారికి మంచిగా చేసి చూపిన అవిశ్వాసముతో అపమార్గమునకు లోనుచేశాడు. మరియు వారిని అసత్యముతో మోసం చేశాడు. మరియు వారిని సన్మార్గము వైపునకు మార్గదర్శకము చేయలేదు.
Arabic explanations of the Qur’an:
یٰبَنِیْۤ اِسْرَآءِیْلَ قَدْ اَنْجَیْنٰكُمْ مِّنْ عَدُوِّكُمْ وَوٰعَدْنٰكُمْ جَانِبَ الطُّوْرِ الْاَیْمَنَ وَنَزَّلْنَا عَلَیْكُمُ الْمَنَّ وَالسَّلْوٰی ۟
ఇస్రాయీలు సంతతివారితో వారిని ఫిర్ఔన్,అతని సైన్యముల నుండి మేము రక్షించిన తరువాత ఇలా పలికాము : ఓ ఇస్రాయీలు సంతతివారా నిశ్చయంగా మేము మీ శతృవుల బారి నుండి రక్షించాము. మరియు తూర్ కొండ వైపు ఉన్న లోయ కుడి ప్రక్న మూసాతో మేము సంభాషిస్తామని మీతో వాగ్ధానం చేశాము. మరియు తీహ్ మైదనములో మా అనుగ్రహాల్లోంచి తేనెలాంటి తియ్యటి పానియం,మంచి మాంసము కల చిన్న పిట్టలాంటి చిన్న పక్షిని మీపై కురిపించాము.
Arabic explanations of the Qur’an:
كُلُوْا مِنْ طَیِّبٰتِ مَا رَزَقْنٰكُمْ وَلَا تَطْغَوْا فِیْهِ فَیَحِلَّ عَلَیْكُمْ غَضَبِیْ ۚ— وَمَنْ یَّحْلِلْ عَلَیْهِ غَضَبِیْ فَقَدْ هَوٰی ۟
మేము మీకు ప్రసాధించిన ధర్మసమ్మతమైన ఆహారపదార్ధముల్లోంచి రుచికరమైన వాటిని మీరు తినండి. మేము మీకు అనుమతించిన వాటిలో మీపై నిషేధించిన వాటి వైపు మితిమీరకండి. అటువంటప్పుడు మీపై నా క్రోధం దిగుతుంది. ఎవరిపై మా క్రోధం దిగుతుందో అతడు వినాశనమునకు గురి అవుతాడు,ఇహ,పరాల్లో దుష్టుడవుతాడు.
Arabic explanations of the Qur’an:
وَاِنِّیْ لَغَفَّارٌ لِّمَنْ تَابَ وَاٰمَنَ وَعَمِلَ صَالِحًا ثُمَّ اهْتَدٰی ۟
నిశ్చయంగా నేను నాతో పశ్చాత్తాప్పడి,విశ్వసించి, సత్కార్యము చేసి, ఆ పిదప సత్యము పై నిలకడ చూపేవాడికి అధికంగా మన్నించేవాడిని,క్షమించేవాడిని.
Arabic explanations of the Qur’an:
وَمَاۤ اَعْجَلَكَ عَنْ قَوْمِكَ یٰمُوْسٰی ۟
ఓ మూసా ఏ విషయం నీ జాతి వారి నుండి నిన్ను తొందర చేసేటట్టు చేసింది నీవు వారిని వదిలి వారికన్న ముందు వచ్చావు ?.
Arabic explanations of the Qur’an:
قَالَ هُمْ اُولَآءِ عَلٰۤی اَثَرِیْ وَعَجِلْتُ اِلَیْكَ رَبِّ لِتَرْضٰی ۟
మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : ఇదిగో వారు నా వెనుక ఉన్నారు,వారు నాతో వచ్చి కలుసుకుంటారు. మరియు నేను నా జాతి వారి కన్న ముందు నీ వద్దకు నేను నీ వైపు చేసిన తొందరతో నీవు ప్రసన్నుడవుతావని వచ్చాను.
Arabic explanations of the Qur’an:
قَالَ فَاِنَّا قَدْ فَتَنَّا قَوْمَكَ مِنْ بَعْدِكَ وَاَضَلَّهُمُ السَّامِرِیُّ ۟
అల్లాహ్ ఇలా పలికాడు : నిశ్చయంగా మేము నీవు నీ వెనుక వదిలి వచ్చిన నీ జాతి వారిని ఆవు దూడ ఆరాధన ద్వారా పరీక్షించాము. వారిని సామిరి దాని ఆరాధన వైపు పిలిచాడు. దాని ద్వారా అతడు వారిని అపమార్గమునకు లోను చేశాడు.
Arabic explanations of the Qur’an:
فَرَجَعَ مُوْسٰۤی اِلٰی قَوْمِهٖ غَضْبَانَ اَسِفًا ۚ۬— قَالَ یٰقَوْمِ اَلَمْ یَعِدْكُمْ رَبُّكُمْ وَعْدًا حَسَنًا ؕ۬— اَفَطَالَ عَلَیْكُمُ الْعَهْدُ اَمْ اَرَدْتُّمْ اَنْ یَّحِلَّ عَلَیْكُمْ غَضَبٌ مِّنْ رَّبِّكُمْ فَاَخْلَفْتُمْ مَّوْعِدِیْ ۟
అప్పుడు మూసా అలైహిస్సలాం తన జాతివారివైపు వారి ఆవు దూడ పూజవలన కోపముతో వారిపై బాధపడుతూ మరిలారు. అప్పుడు మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : ఓ నా జాతి వారా ఏమీ అల్లాహ్ మీపై తౌరాతును అవతరింపజేస్తానని,మిమ్మల్ని స్వర్గములో ప్రవేసింపజేస్తాడని మీతో మంచి వాగ్ధానం చేయలేదా. ఏమిటీ మీపై కాలం పొడిగిపోయందని మీరు మరచిపోయారా ?. లేదా మీరు పాల్పడిన ఈ చర్య వలన మీపై మీ ప్రభువు వద్ద నుండి ఆగ్రహము దిగాలని,మీపై ఆయన శిక్ష వచ్చి పడాలని కోరుకున్నారా,అందుకనే నేను మీ వద్దకు తిరిగి వచ్చేంతవరకు విధేయతపై స్థిరంగా ఉండమన్న నా ఒప్పొందమును మీరు భంగపరిచారా ?!.
Arabic explanations of the Qur’an:
قَالُوْا مَاۤ اَخْلَفْنَا مَوْعِدَكَ بِمَلْكِنَا وَلٰكِنَّا حُمِّلْنَاۤ اَوْزَارًا مِّنْ زِیْنَةِ الْقَوْمِ فَقَذَفْنٰهَا فَكَذٰلِكَ اَلْقَی السَّامِرِیُّ ۟ۙ
మూసా జాతివారు ఇలా పలికారు : ఓ మూసా మేము మా అంగీకారముతో నీకు ఇచ్చిన మాటను విబేధించ లేదు కాని బలవంతాన జరిగింది. మేము ఫిర్ఔన్ జాతి వారి నగల భారములను,బరువులను మోశాము. అయితే మేము వాటి నుండి విముక్తి కొరకు వాటిని ఒక గుంటలో పడవేశాము. అప్పుడు గుంటలో మేము వాటిని విసిరినట్లే సామరీకూడా తనతోపాటు ఉన్న జిబ్రయీల్ అలైహిస్సలాం గుర్రము యొక్క గిట్ట యొక్క మట్టిని విసిరాడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• من سُنَّة الله انتقامه من المجرمين بما يشفي صدور المؤمنين، ويقر أعينهم، ويذهب غيظ قلوبهم.
విశ్వాసపరుల హృదయములను నయం చేసే వాటి ద్వారా,వారి కళ్ళకు చలువను కలిగించే వాటి ద్వారా,వారి హృదయముల్లో ఉన్న క్రోదమును దూరం చేసే వాటి ద్వారా అపరాదులతో ప్రతీకారము తీసుకోవటం అల్లాహ్ సంప్రదాయము.

• الطاغية شؤم على نفسه وعلى قومه؛ لأنه يضلهم عن الرشد، وما يهديهم إلى خير ولا إلى نجاة.
మితిమీరేవాడు తన స్వయమునకు, తన జాతి వారి కొరకు కీడు కలిగిస్తాడు. ఎందుకంటే అతడు వారిని సన్మారాగము నుండి భ్రష్టుపట్టిస్తాడు. మరియు అతడు వారిని మేలు వైపున గాని ముక్తి వైపున గాని మార్గం చూపలేడు.

• النعم تقتضي الحفظ والشكر المقرون بالمزيد، وجحودها يوجب حلول غضب الله ونزوله.
అనుగ్రహాలు వాటి రక్షణ,వాటి అధికమవటముతో ఇమిడి ఉన్నకృతజ్ఞతను నిర్ణయిస్తుంది. మరియు వాటిని తిరస్కరించటం అల్లాహ్ క్రోదము కలగటానికి,దాని దిగటానికి అనివార్యం చేస్తుంది.

• الله غفور على الدوام لمن تاب من الشرك والكفر والمعصية، وآمن به وعمل الصالحات، ثم ثبت على ذلك حتى مات عليه.
షిర్కు,అవిశ్వాసము,అవిధేయత నుండి తౌబా చేసి (పశ్చాత్తాప్పడి) ఆయనపై (అల్లాహ్) విశ్వాసమును కనబరచి,సత్కార్యములను చేసి,ఆ పిదప వాటిపై నిలకడ చూపి అదే స్థితిలో మరణించే వాడిని అల్లాహ్ ఎల్లప్పుడు క్షమించేవాడు.

• أن العجلة وإن كانت في الجملة مذمومة فهي ممدوحة في الدين.
నిశ్చయంగా తొందరపాటు అసలు దూషించబడినదైనప్పటికి అది ధర్మ విషయంలో ప్రశంసనీయమైనది.

 
Translation of the meanings Surah: Tā-ha
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close