Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: As-Sāffāt   Ayah:
مَا لَكُمْ لَا تَنَاصَرُوْنَ ۟
వారిని మందలిస్తూ వారితో ఇలా పలకబడుతుంది : మీకేమయింది మీరు ఇహలోకములో ఎలాగైతే ఒకరినొకరు సహాయపడేవారో,మీ విగ్రహాలు మీకు సహాయం చేస్తారని ఆరోపించేవారో అలా ఒకరినొకరు ఎందుకు సహాయం చేసుకోవటం లేదు.
Arabic explanations of the Qur’an:
بَلْ هُمُ الْیَوْمَ مُسْتَسْلِمُوْنَ ۟
కాని వారు ఆ రోజు అల్లాహ్ ఆదేశమునకు కట్టుబడినవారై,లోబడినవారై ఉంటారు. తమ అశక్తి వలన,తమ నిస్సహాయత వలన ఒకరినొకరు సహాయం చేసుకోరు.
Arabic explanations of the Qur’an:
وَاَقْبَلَ بَعْضُهُمْ عَلٰی بَعْضٍ یَّتَسَآءَلُوْنَ ۟
మరియు వారు ఒకరినొకరు దూషించుకుంటూ,వాదులాడుతూ ముందుకు వస్తారు. అప్పుడు దూషణ,వాదులాట వారికి ప్రయోజనం కలిగించదు.
Arabic explanations of the Qur’an:
قَالُوْۤا اِنَّكُمْ كُنْتُمْ تَاْتُوْنَنَا عَنِ الْیَمِیْنِ ۟
అనుసరించేవారు అనుసరించబడేవారితో ఇలా పలుకుతారు : ఓ మా పెద్దలారా నిశ్ఛయంగా మీరు ధర్మం,సత్యం వైపు నుండి మా వద్దకు వచ్చి మా కొరకు అవిశ్వాసమును, అల్లాహ్ తో సాటి కల్పించటంను,పాపకార్యములకు పాల్పడటంను అలంకరించి చూపించారు. మరియు ప్రవక్తలు అల్లాహ్ వద్ద నుండి తీసుకుని వచ్చిన సత్యము నుండి మమ్మల్ని మీరు ధ్వేషమును కలిగించారు.
Arabic explanations of the Qur’an:
قَالُوْا بَلْ لَّمْ تَكُوْنُوْا مُؤْمِنِیْنَ ۟ۚ
అనుసరించబడేవారు అనుసరించేవారితో ఇలా పలుకుతారు : విషయం మీరు వాదించినట్లు కాదు. కానీ మీరు అవిశ్వాసంపై ఉన్నారు. మీరు విశ్వాసపరులు కారు. అంతేకాక మీరు తిరస్కరించేవారు.
Arabic explanations of the Qur’an:
وَمَا كَانَ لَنَا عَلَیْكُمْ مِّنْ سُلْطٰنٍ ۚ— بَلْ كُنْتُمْ قَوْمًا طٰغِیْنَ ۟
ఓ అనుసరించేవారా మేము మిమ్మల్ని అవిశ్వాసంలో,షిర్కులో,పాపములను పాల్పడటంలో పడవేయటానికి అణచివేత లేదా ఆధిపత్యం ద్వారా మాకు మీపై ఎలాంటి అధికారం లేదు. అంతే కాదు మీరు అవిశ్వాసంలో,మార్గభ్రష్టతలో మితిమీరిపోయే జనులు.
Arabic explanations of the Qur’an:
فَحَقَّ عَلَیْنَا قَوْلُ رَبِّنَاۤ ۖۗ— اِنَّا لَذَآىِٕقُوْنَ ۟
కావున మాపై మీపై అల్లాహ్ బెదిరింపు ఈ ఆయతులో అనివార్యమయింది : {لأَمْلأَنَّ جَهَنَّمَ مِنْكَ وَمِمَّنْ تَبِعَكَ مِنْهُمْ أَجْمَعِينَ} "నీతోను,నిన్ను అనుసరించే వారందరితోనూ నేను నరకాన్ని నింపుతాను". ఆపై నిశ్చయంగా మేము మా ప్రభువు బెదిరించిన దాని రుచి ఖచ్చితంగా చూస్తాము.
Arabic explanations of the Qur’an:
فَاَغْوَیْنٰكُمْ اِنَّا كُنَّا غٰوِیْنَ ۟
కావున మేము మిమ్మల్ని మార్గభ్రష్టత వైపునకు,అవిశ్వాసము వైపునకు పిలిచాము. నిశ్ఛయంగా మేము కూడా సన్మార్గము నుండి తప్పిపోయి ఉన్నాము.
Arabic explanations of the Qur’an:
فَاِنَّهُمْ یَوْمَىِٕذٍ فِی الْعَذَابِ مُشْتَرِكُوْنَ ۟
నిశ్ఛయంగా అప్పుడు అనుసరించేవారు,అనుసరించబడినవారు ప్రళయదినమున శిక్షలో భాగస్వాములవుతారు.
Arabic explanations of the Qur’an:
اِنَّا كَذٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِیْنَ ۟
నిశ్ఛయంగా మేము ఏవిధంగానైతే వీరందరికి శిక్ష రుచి చూపించామో అలాగే ఇతర అపరాధులతో వ్యవహరిస్తాము.
Arabic explanations of the Qur’an:
اِنَّهُمْ كَانُوْۤا اِذَا قِیْلَ لَهُمْ لَاۤ اِلٰهَ اِلَّا اللّٰهُ یَسْتَكْبِرُوْنَ ۟ۙ
నిశ్ఛయంగా ఈ ముష్రికులందరితో ఇహలోకములో "లా ఇలాహ ఇల్లల్లాహ్" మీ వాస్తవ ఆరాధ్యదైవం అల్లాహ్ తప్ప ఇంకెవరూ లేరు దానికి తగ్గట్టుగా ఆచరించమని,దానికి వ్యతిరేకమైన వాటిని వదిలివేయమని పలికినప్పుడు వారు దాన్ని స్పందించడానికి,దానికి కట్టుబడి ఉండటానికి సత్యము నుండి గర్వముతో దానిపై అహంకారముతో నిరాకరించారు.
Arabic explanations of the Qur’an:
وَیَقُوْلُوْنَ اَىِٕنَّا لَتَارِكُوْۤا اٰلِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُوْنٍ ۟ؕ
మరియు వారు తమ అవిశ్వాసము కొరకు వాదిస్తూ ఇలా పలికేవారు : ఏమీ మేము ఒక పిచ్చి కవి మాటపై మా ఆరాధ్య దైవాల ఆరాధనను వదిలిపెట్టాలా ?! వారి ఈ మాటకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని అర్ధం.
Arabic explanations of the Qur’an:
بَلْ جَآءَ بِالْحَقِّ وَصَدَّقَ الْمُرْسَلِیْنَ ۟
నిశ్ఛయంగా వారు పెద్ద నిందనే వేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎటువంటి పిచ్చివారు కాదు,ఎటువంటి కవి కాదు. కాని ఆయన అల్లాహ్ తౌహీద్ వైపునకు,అయన ప్రవక్త ను అనుసరించటం వైపునకు పిలిచే ఖుర్ఆన్ ను తీసుకుని వచ్చారు. మరియు ఆయన దైవప్రవక్తలను వారు అల్లాహ్ వద్ద నుండి తీసుకుని వచ్చిన తౌహీదును,వాగ్దాన దినము యొక్క నిరూపణను నిజం చేసి చూపించారు. ఏ విషయంలోను వారిని విబేధించలేదు.
Arabic explanations of the Qur’an:
اِنَّكُمْ لَذَآىِٕقُوا الْعَذَابِ الْاَلِیْمِ ۟ۚ
ఓ ముష్రికులారా నిశ్ఛయంగా మీరు ప్రళయదినమున మీ అవిశ్వాసము,ప్రవక్తల పట్ల మీ తిరస్కారము వలన బాధాకరమైన శిక్ష రుచి చూస్తారు.
Arabic explanations of the Qur’an:
وَمَا تُجْزَوْنَ اِلَّا مَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟ۙ
ఓ ముష్రికులారా మీరు ఇహలోకములో చేసిన అల్లాహ్ పట్ల అవిశ్వాసం,పాపకార్యములకు పాల్పడిన దానికి మాత్రమే ప్రతిఫలం ప్రసాదించబడుతారు.
Arabic explanations of the Qur’an:
اِلَّا عِبَادَ اللّٰهِ الْمُخْلَصِیْنَ ۟
కానీ అల్లాహ్ తన ఆరాధన కొరకు ప్రత్యేకించుకున్న విశ్వాసపరులైన అల్లాహ్ దాసులు. మరియు వారు ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకించుకున్నారు. వారే ఈ శిక్ష నుండి విముక్తి పొందుతారు.
Arabic explanations of the Qur’an:
اُولٰٓىِٕكَ لَهُمْ رِزْقٌ مَّعْلُوْمٌ ۟ۙ
చిత్తశుద్ధి కల ఈ దాసులందరి కొరకు ఆహారోపాధి కలదు. దాన్నే అల్లాహ్ వారికి ప్రసాదిస్తాడు. అది తన శ్రేష్ఠతలో,తన మంచితనములో,తన ఎల్లప్పుడు ఉండటంలో పేరుగాంచినది.
Arabic explanations of the Qur’an:
فَوَاكِهُ ۚ— وَهُمْ مُّكْرَمُوْنَ ۟ۙ
మరియు ఈ జీవనోపాధి నుండే వారు తినే మరియు కోరుకునే ఉత్తమమైన ఫలములను ప్రసాదించబడుతారు. మరియు ఆపైన వారు స్థానములను పెంపొందించబడి,గౌరవోన్నతుడైన అల్లాహ్ ముఖమును దర్శించుకోవటం ద్వారా గౌరవించబడుతారు.
Arabic explanations of the Qur’an:
فِیْ جَنّٰتِ النَّعِیْمِ ۟ۙ
వీటన్నింటిని వారు అంతంకాని,తొలగిపోని శాశ్వతమైన,స్థిరమైన అనుగ్రహాలు కల స్వర్గవనాలలో పొందుతారు.
Arabic explanations of the Qur’an:
عَلٰی سُرُرٍ مُّتَقٰبِلِیْنَ ۟
వారు ఎదురెదురుగా ఆసనములపై ఆనుకుని కూర్చొని ఒకరినొకరు చూస్తుంటారు.
Arabic explanations of the Qur’an:
یُطَافُ عَلَیْهِمْ بِكَاْسٍ مِّنْ مَّعِیْنٍ ۟ۙ
వారి మధ్య తమ స్వచ్చదనంలో ప్రవహించే నీటి వలే ఉండే మధు గ్లాసులు త్రిప్పబడుతాయి.
Arabic explanations of the Qur’an:
بَیْضَآءَ لَذَّةٍ لِّلشّٰرِبِیْنَ ۟ۚ
అవి రంగులో తెల్లవిగా ఉంటాయి వాటిని త్రాగేవాడు పరిపూర్ణ రుచిని ఆస్వాదిస్తాడు.
Arabic explanations of the Qur’an:
لَا فِیْهَا غَوْلٌ وَّلَا هُمْ عَنْهَا یُنْزَفُوْنَ ۟
అది ఇహలోకపు మధ్యం లాంటిది కాదు. అందులో మతిని పోగొట్టే మత్తు ఉండదు. మరియు దాన్ని వినియోగించేవారికి తలనొప్పి ఉండదు. దాన్ని త్రాగేవాడి శరీరము,బుద్ధి భద్రంగా ఉంటాయి.
Arabic explanations of the Qur’an:
وَعِنْدَهُمْ قٰصِرٰتُ الطَّرْفِ عِیْنٌ ۟ۙ
మరియు స్వర్గములో వారి దగ్గర శీలవతులైన స్త్రీలు ఉంటారు. వారి చూపులు తమ భర్తలకు తప్ప ఇతరుల.వైపునకు వాలవు. అందమైన కళ్ళుగల వారై ఉంటారు.
Arabic explanations of the Qur’an:
كَاَنَّهُنَّ بَیْضٌ مَّكْنُوْنٌ ۟
వారు తమ రంగులో పసుపురంగులో కలిసిన తెల్లగా ఉండి ఎవరిచేతులు తాకని భద్రంగా ఉన్న తెల్లని పక్షులవలే ఉంటారు.
Arabic explanations of the Qur’an:
فَاَقْبَلَ بَعْضُهُمْ عَلٰی بَعْضٍ یَّتَسَآءَلُوْنَ ۟
అప్పుడు స్వర్గవాసులు ఒకరినొకరు తమ గతము గురించి ఇహలోకములో వారికి సంభవించిన దాని గురించి ప్రశ్నించుకుంటూ మరలుతారు.
Arabic explanations of the Qur’an:
قَالَ قَآىِٕلٌ مِّنْهُمْ اِنِّیْ كَانَ لِیْ قَرِیْنٌ ۟ۙ
విశ్వాసపరులందరిలో నుండి పలికేవాడు ఒకడు ఇలా పలుకుతాడు : నిశ్చయంగా నాకు ఇహలోకంలో మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఒక స్నేహితుడుండేవాడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• سبب عذاب الكافرين: العمل المنكر؛ وهو الشرك والمعاصي.
అవిశ్వాసపరుల శిక్షకు దుష్టకార్యము ఒక కారణం. మరియు అది షిర్కు,పాపాలు.

• من نعيم أهل الجنة أنهم نعموا باجتماع بعضهم مع بعض، ومقابلة بعضهم مع بعض، وهذا من كمال السرور.
స్వర్గ వాసుల అనుగ్రహాల్లోంచి ఒకటి వారు ఒకరినొకరు కలిసి సంతోషముగా ఉంటారు. మరియు అలాగే వారిరువురు ఎదురుపడినప్పుడు సంతోషముగా ఉంటారు. మరియు ఇది సంపూర్ణ సంతోషములోంచిది.

 
Translation of the meanings Surah: As-Sāffāt
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close