Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Az-Zumar   Ayah:
وَنُفِخَ فِی الصُّوْرِ فَصَعِقَ مَنْ فِی السَّمٰوٰتِ وَمَنْ فِی الْاَرْضِ اِلَّا مَنْ شَآءَ اللّٰهُ ؕ— ثُمَّ نُفِخَ فِیْهِ اُخْرٰی فَاِذَا هُمْ قِیَامٌ یَّنْظُرُوْنَ ۟
ఆ రోజు బాకా ఊదే బాధ్యత ఇవ్వబడిన దూత కొమ్ములో (బాకాలో) ఊదుతాడు. అప్పుడు ఆకాశములలో మరియు భూమిలో ఉన్నవన్నీ చనిపోతాయి. ఆ పిదప దైవదూత రెండవసారి మరణాంతరం లేపబడటానికి అందులో (బాకాలో) ఊదుతాడు. అప్పుడు జీవించిన వారందరు నిలబడి అల్లాహ్ వారి పట్ల ఏమి వ్యవహరిస్తాడని నిరీక్షిస్తుంటారు.
Arabic explanations of the Qur’an:
وَاَشْرَقَتِ الْاَرْضُ بِنُوْرِ رَبِّهَا وَوُضِعَ الْكِتٰبُ وَجِایْٓءَ بِالنَّبِیّٖنَ وَالشُّهَدَآءِ وَقُضِیَ بَیْنَهُمْ بِالْحَقِّ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟
సర్వాధిక్యుడైన ప్రభువు దాసుల మధ్య తీర్పునివ్వటం కొరకు ప్రత్యక్షమయినప్పుడు భూమి కాంతితో వెలిగిపోతుంది. మరియు ప్రజల కర్మల పత్రాలు తెరవబడుతాయి. మరియు ప్రవక్తలను తీసుకుని రావటం జరుగుతుంది. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జాతి వారిని దైవ ప్రవక్తల కొరకు వారి జాతుల వారిపై సాక్ష్యం పలకటానికి తీసుకురాబడుతుంది. మరియు అల్లాహ్ వారందరి మధ్య న్యాయపరంగా తీర్పునిస్తాడు. ఆ రోజు వారికి అన్యాయం చేయబడదు. అప్పుడు ఏ మనిషి యొక్క పాపము అధికం చేయబడదు మరియు ఏ పుణ్యమూ తగ్గించబడదు.
Arabic explanations of the Qur’an:
وَوُفِّیَتْ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُوَ اَعْلَمُ بِمَا یَفْعَلُوْنَ ۟۠
అల్లాహ్ ప్రతీ ప్రాణము యొక్క పుణ్యమును పూర్తి చేస్తాడు. దాని ఆచరణ మంచి అయినా గాని చెడు అయినా గాని. వారు చేస్తున్నది అల్లాహ్ కు తెలుసు. వారి కార్యల్లోంచి మంచివైనవి , చెడ్డవైనవి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే ఆ రోజు వారికి వారి కర్మలపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Arabic explanations of the Qur’an:
وَسِیْقَ الَّذِیْنَ كَفَرُوْۤا اِلٰی جَهَنَّمَ زُمَرًا ؕ— حَتّٰۤی اِذَا جَآءُوْهَا فُتِحَتْ اَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَاۤ اَلَمْ یَاْتِكُمْ رُسُلٌ مِّنْكُمْ یَتْلُوْنَ عَلَیْكُمْ اٰیٰتِ رَبِّكُمْ وَیُنْذِرُوْنَكُمْ لِقَآءَ یَوْمِكُمْ هٰذَا ؕ— قَالُوْا بَلٰی وَلٰكِنْ حَقَّتْ كَلِمَةُ الْعَذَابِ عَلَی الْكٰفِرِیْنَ ۟
మరియు దైవదూతలు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారిని నరకం వైపునకు గుంపులు గుంపులుగా అవమానపరచి తోలుతారు. చివరికి వారు నరకం వద్దకు వచ్చినప్పుడు వారి కొరకు దానిపై బాధ్యులుగా నియమింపబడిన దైవదూతల్లోంచి దాని పర్యవేక్షకులు దాని తలపులను తెరుస్తారు. మరియు వారు వారితో మందలింపులతో ఇలా పలుకుతూ అభివందనములు చేస్తారు : ఏమీ మీ వద్దకు మీ కోవకు చెందిన ప్రవక్తలు తమపై అవతరింపబడిన మీ ప్రభువు ఆయతులను మీపై చదువుతూ మరియు మిమ్మల్ని ప్రళయదినమున కలవటం గురించి అందులో ఉన్న కఠినమైన శిక్ష నుండి మిమ్మల్ని భయపెడుతూ రాలేదా ?. అవిశ్వాసపరులు స్వయంగా అంగీకరిస్తూ ఇలా పలుకుతారు : ఎందుకు కాదు. వాస్తవానికి ఇదంత జరిగింది. మరియు అవిశ్వాసపరులపై శిక్ష యొక్క వాక్కు అనివార్యమైనది. మరియు మేము అవిశ్వసిస్తూ ఉండేవారము.
Arabic explanations of the Qur’an:
قِیْلَ ادْخُلُوْۤا اَبْوَابَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَا ۚ— فَبِئْسَ مَثْوَی الْمُتَكَبِّرِیْنَ ۟
వారిని అవమానపరుస్తూ మరియు అల్లాహ్ కారుణ్యము నుండి, నరకాగ్ని నుండి బయటపడటం నుండి నిరాశపరుస్తూ వారితో ఇలా పలకబడుతుంది : మీరు నరక ద్వారాలలోనికి అందులో శాశ్వతంగా ఉంటూ ప్రవేశించండి. సత్యం ముందు గర్వపడే మరియు అహంకారమును చూపే వారి నివాసము ఎంతో చెడ్డది మరియు దుర్భరమైనది.
Arabic explanations of the Qur’an:
وَسِیْقَ الَّذِیْنَ اتَّقَوْا رَبَّهُمْ اِلَی الْجَنَّةِ زُمَرًا ؕ— حَتّٰۤی اِذَا جَآءُوْهَا وَفُتِحَتْ اَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَا سَلٰمٌ عَلَیْكُمْ طِبْتُمْ فَادْخُلُوْهَا خٰلِدِیْنَ ۟
మరియు దైవదూతలు తమ ప్రభువు ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి ఆయన భయభీతి కలిగిన విశ్వాసపరులను గౌరవోన్నతులైన(దైవదూదలు) గుంపులుగుంపులుగా స్వర్గం వైపునకు మృధువుగా తీసుకునివస్తారు. చివరికి వారు స్వర్గం వద్దకు వచ్చినప్పుడు వారి కొరకు దాని ద్వారములు తెరవబడి ఉంటాయి. మరియు దాని బాధ్యత ఇవ్వబడిన దైవదూతలు వారితో ఇలా పలుకుతారు : ప్రతీ కీడు నుండి మరియు మీరు ఇష్టపడని ప్రతీ దాని నుండి మీపై శాంతి కురియుగాక. మీ మనస్సులు,మీ కర్మలు శ్రేష్ఠమయ్యాయి. అయితే మీరు స్వర్గములో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశించండి.
Arabic explanations of the Qur’an:
وَقَالُوا الْحَمْدُ لِلّٰهِ الَّذِیْ صَدَقَنَا وَعْدَهٗ وَاَوْرَثَنَا الْاَرْضَ نَتَبَوَّاُ مِنَ الْجَنَّةِ حَیْثُ نَشَآءُ ۚ— فَنِعْمَ اَجْرُ الْعٰمِلِیْنَ ۟
స్వర్గంలో ప్రవేశించినప్పుడు విశ్వాసపరులు ఇలా పలుకుతారు : పొగడ్తలన్నీ ఆ అల్లాహ్ కొరకే ఎవరైతే తన ప్రవక్తల నోటి ద్వారా మాకు చేసిన వాగ్దానమును మాకు నిజం చేసి చూపించాడో. నిశ్ఛయంగా ఆయన మమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపచేస్తాడని,స్వర్గము యొక్కభూమికి మమ్మల్ని వారసులను చేస్తానని మాకు వాగ్దానం చేశాడు. మేము అక్కడ దిగదలచిన చోటులో దిగుతాము. తమ ప్రభువు మన్నతను ఆశిస్తూ సత్కర్మలు చేసే వారి పుణ్యము ఎంతో గొప్పది.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• ثبوت نفختي الصور.
రెండు సూర్ల (బాకా) ఊదటం యొక్క నిరూపణ

• بيان الإهانة التي يتلقاها الكفار، والإكرام الذي يُسْتَقبل به المؤمنون.
అవిశ్వాసపరులు అందుకునే అవమానము మరియు విశ్వాసపరులు పొందే గౌరవ ప్రకటన.

• ثبوت خلود الكفار في الجحيم، وخلود المؤمنين في النعيم.
నరకములో అవిశ్వాసపరులు శాశ్వతంగా ఉండటం మరియు విశ్వాసపరులు అనుగ్రహాల్లో శాశ్వతంగా ఉండటం యొక్క నిరూపణ.

• طيب العمل يورث طيب الجزاء.
శ్రేష్ఠమైన ఆచరణ శ్రేష్ఠమైన ప్రతిఫలమునకు వారసులను చేస్తుంది.

 
Translation of the meanings Surah: Az-Zumar
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close