Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Ghāfir   Ayah:
وَیٰقَوْمِ مَا لِیْۤ اَدْعُوْكُمْ اِلَی النَّجٰوةِ وَتَدْعُوْنَنِیْۤ اِلَی النَّارِ ۟ؕ
ఓ నా జాతి వారా నేను మిమ్మల్ని ఇహలోకజీవితంలో మరియు పరలోకములో నష్టపోవటం నుండి అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేయటం ద్వారా మోక్షం వైపునకు పిలుస్తుంటే మీరు నన్ను అల్లాహ్ పై అవిశ్వాసము,ఆయనకు అవిధేయత చూపటం వైపునకు పిలవటం ద్వారా మీరు నన్ను నరకంలో ప్రవేశము వైపునకు పిలుస్తున్నారేమిటి ?!.
Arabic explanations of the Qur’an:
تَدْعُوْنَنِیْ لِاَكْفُرَ بِاللّٰهِ وَاُشْرِكَ بِهٖ مَا لَیْسَ لِیْ بِهٖ عِلْمٌ ؗ— وَّاَنَا اَدْعُوْكُمْ اِلَی الْعَزِیْزِ الْغَفَّارِ ۟
నేను అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచాలని,ఆయనతో పాటు ఇతరులను ఎవరి ఆరాధన అల్లాహ్ తో పాటు సరి అన్న జ్ఞానము నాకు లేదో వాటి ఆరాధన నేను చేయాలని ఆశిస్తూ మీరు నన్ను మీ అసత్యం వైపునకు పిలుస్తున్నారు. మరియు ఎవరూ ఓడించలేని సర్వ శక్తిమంతుడైన,తన దాసులపట్ల గొప్ప మన్నించేవాడైన అల్లాహ్ పై విశ్వాసము వైపునకు నేను మిమ్మల్ని పిలుస్తున్నాను.
Arabic explanations of the Qur’an:
لَا جَرَمَ اَنَّمَا تَدْعُوْنَنِیْۤ اِلَیْهِ لَیْسَ لَهٗ دَعْوَةٌ فِی الدُّنْیَا وَلَا فِی الْاٰخِرَةِ وَاَنَّ مَرَدَّنَاۤ اِلَی اللّٰهِ وَاَنَّ الْمُسْرِفِیْنَ هُمْ اَصْحٰبُ النَّارِ ۟
వాస్తవానికి మీరు నన్ను ఎవరి విశ్వాసము వైపునకు,ఎవరి విధేయత వైపునకు పిలుస్తున్నారో అతని కొరకు ఆరాధన చేయబడటానికి సత్యంతో కూడుకున్న ఎటువంటి ఆరాధన ఇహలోకంలో గాని పరలోకంలో గాని లేదు. మరియు అతడు తనను వేడుకునే వాడి అర్ధనలను స్వీకరించడు. మరియు నిశ్చయంగా మా అందరి మరలటం అల్లాహ్ ఒక్కడి వైపే జరుగుతుంది. మరియు నిశ్ఛయంగా అవిశ్వాసంలో,పాప కార్యముల్లో మితిమీరిపోయినవారే నరక వాసులు. ప్రళయదినమున వారు అందులో ప్రవేశించటమును తప్పనిసరి చేసుకుంటారు.
Arabic explanations of the Qur’an:
فَسَتَذْكُرُوْنَ مَاۤ اَقُوْلُ لَكُمْ ؕ— وَاُفَوِّضُ اَمْرِیْۤ اِلَی اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ بَصِیْرٌ بِالْعِبَادِ ۟
అప్పుడు వారు ఆయన హితోపదేశములను వదిలివేశారు. అప్పుడు ఆయన ఇలా పలికారు : మీరు తొందరలోనే నేను మీకు చేసిన హితోపదేశములను గుర్తు చేసుకుంటారు. మరియు మీరు వాటిని స్వీకరించకపోవటం పై బాధపడుతారు. మరియు నేను నా వ్యవహారములన్నీ ఒక్కడైన అల్లాహ్ కి అప్పజెప్పుతున్నాను. నిశ్ఛయంగా అల్లాహ్ ఆయన తన దాసుల కర్మల్లోంచి ఏదీ గోప్యంగా ఉండదు.
Arabic explanations of the Qur’an:
فَوَقٰىهُ اللّٰهُ سَیِّاٰتِ مَا مَكَرُوْا وَحَاقَ بِاٰلِ فِرْعَوْنَ سُوْٓءُ الْعَذَابِ ۟ۚ
అప్పుడు వారు అతన్ని హత్య చేయటమునకు నిర్ణయించుకున్నప్పటి వారి కుట్ర కీడు నుండి అల్లాహ్ అతన్ని రక్షించాడు. మరియు ఫిర్ఔన్ వంశమునకు మునిగిపోయే శిక్ష చుట్టుముట్టింది. నిశ్చయంగా అల్లాహ్ ఇహలోకములో అతడిని మరియు అతని పూర్తి సైన్యమును ముంచివేశాడు.
Arabic explanations of the Qur’an:
اَلنَّارُ یُعْرَضُوْنَ عَلَیْهَا غُدُوًّا وَّعَشِیًّا ۚ— وَیَوْمَ تَقُوْمُ السَّاعَةُ ۫— اَدْخِلُوْۤا اٰلَ فِرْعَوْنَ اَشَدَّ الْعَذَابِ ۟
వారి మరణం తరువాత వారు వారి సమాదులలో దినము మొదటి వేళలో మరియు దాని చివరి వేళలో నరకాగ్నిపై ప్రవేశపెట్టబడుతారు. మరియు ప్రళయదినమున ఇలా అనబడుతుంది : ఫిర్ఔన్ ను అనుసరించేవారిని వారు పాల్పడిన అవిశ్వాసము,తిరస్కారము మరియు అల్లాహ్ మార్గము నుండి ఆపటం వలన తీవ్రమైన మరియు పెద్దదైన శిక్షలో ప్రవేశింపజేయండి.
Arabic explanations of the Qur’an:
وَاِذْ یَتَحَآجُّوْنَ فِی النَّارِ فَیَقُوْلُ الضُّعَفٰٓؤُا لِلَّذِیْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ اَنْتُمْ مُّغْنُوْنَ عَنَّا نَصِیْبًا مِّنَ النَّارِ ۟
ఓ ప్రవక్త నరకవాసుల్లోంచి అనుసరించేవారు మరియు అనుసరించబడేవారు వాదులాడుతున్నప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు బలహీనులుగా పరిగణించబడే అనుసరించేవారు గర్వించే అనుసరించబడేవారితో ఇలా పలుకుతారు : నిశ్ఛయంగా మేము ఇహలోకంలో మిమ్మల్ని అపమార్గము విషయంలో అనుసరించేవారముగా ఉన్నాము. ఏమీ మీరు అల్లాహ్ శిక్ష నుండి కొంత భాగమును తీసుకుని మోసి మా నుండి తొలగించగలరా ?!.
Arabic explanations of the Qur’an:
قَالَ الَّذِیْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا كُلٌّ فِیْهَاۤ اِنَّ اللّٰهَ قَدْ حَكَمَ بَیْنَ الْعِبَادِ ۟
దురహంకారములో మునిగి ఉన్న అనుసరించబడేవారు ఇలా పలుకుతారు : నిశ్చయంగా మేము అనుసరించే వారమైన లేదా అనుసరించబడే వారమైన నరకాగ్నిలో సమానము. మాలో నుండి ఎవరూ ఇంకొకరి శిక్ష నుండి ఎటువంటి భాగమును మోయరు. నిశ్చయంగా అల్లాహ్ దాసుల మధ్య తీర్పునిచ్చాడు. ఆయన ప్రతి ఒక్కరికి వారి హక్కు అయిన శిక్షను ప్రసాదించాడు.
Arabic explanations of the Qur’an:
وَقَالَ الَّذِیْنَ فِی النَّارِ لِخَزَنَةِ جَهَنَّمَ ادْعُوْا رَبَّكُمْ یُخَفِّفْ عَنَّا یَوْمًا مِّنَ الْعَذَابِ ۟
మరియు అనుసరించే మరియు అనుసరించబడేవారిలో నుంచి నరకంలో శిక్షింపబడేవారు తౌబా చేసుకోవటం కొరకు నరకము నుండి బయటకు వచ్చి ఇహలోకమువైపునకు మరలటం నుండి నిరాశ్యులైనప్పుడు నరకాగ్ని యొక్క బాధ్యత వహించే దైవదూతలతో ఇలా పలుకుతారు : మీరు ఈ శాశ్వత శిక్ష నుండి ఒక్క రోజు శిక్షను మా నుండి తేలిక చేయమని మీ ప్రభువుతో వేడుకోండి.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• أهمية التوكل على الله.
అల్లాహ్ పై నమ్మకము యొక్క ప్రాముఖ్యత.

• نجاة الداعي إلى الحق من مكر أعدائه.
సందేశ ప్రచారకునికి తన శతృవుల కుట్ర నుండి సత్యం వైపునకు విముక్తి.

• ثبوت عذاب البرزخ.
బర్జఖ్ శిక్ష యొక్క నిరూపణ.

• تعلّق الكافرين بأي سبب يريحهم من النار ولو لمدة محدودة، وهذا لن يحصل أبدًا.
అవిశ్వాసపరుల సంబంధము ఏదైన కారణం వారికి నరకాగ్ని నుండి విశ్రాంతి కలిగించేది అది కూడ ఒక నిర్ణీత గడువు కొరకు . ఇది ఎన్నటికి జరగనిది.

 
Translation of the meanings Surah: Ghāfir
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close