Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Qāf   Ayah:
وَلَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ وَنَعْلَمُ مَا تُوَسْوِسُ بِهٖ نَفْسُهٗ ۖۚ— وَنَحْنُ اَقْرَبُ اِلَیْهِ مِنْ حَبْلِ الْوَرِیْدِ ۟
మరియు నిశ్చయంగా మేము మానవుణ్ణి సృష్టించాము మరియు అతని మనసులో పుట్టుకొచ్చే ఆలోచనలు,హావభావాలు మాకు తెలుసు. మరియు మేము అతనికి హృదయముతో ఇమిడి ఉండి గొంతులో ఉండే నరము కన్న చాలా దగ్గరగా ఉన్నాము.
Arabic explanations of the Qur’an:
اِذْ یَتَلَقَّی الْمُتَلَقِّیٰنِ عَنِ الْیَمِیْنِ وَعَنِ الشِّمَالِ قَعِیْدٌ ۟
అతని కర్మను తీసుకునే ఇద్దరు దూతలు తీసుకునేటప్పుడు వారిలో ఒకడు అతని కుడి ప్రక్న కూర్చుని ఉంటాడు మరియు రెండవ వాడు అతనికి ఎడమ ప్రక్క కూర్చుని ఉంటాడు.
Arabic explanations of the Qur’an:
مَا یَلْفِظُ مِنْ قَوْلٍ اِلَّا لَدَیْهِ رَقِیْبٌ عَتِیْدٌ ۟
అతని వద్ద అతను పలికే ప్రతి మాటకు పర్యవేక్షకునిగా (వ్రాయటానికి) ప్రత్యక్షంగా ఒక దూత ఉంటాడు.
Arabic explanations of the Qur’an:
وَجَآءَتْ سَكْرَةُ الْمَوْتِ بِالْحَقِّ ؕ— ذٰلِكَ مَا كُنْتَ مِنْهُ تَحِیْدُ ۟
మరియు మృత్యువు తీవ్రత సత్యపరంగా వచ్చి తీరుతుంది దాని నుండి పారిపోవటానికి ఏ స్థలం ఉండదు. నిర్లక్ష్యంలో ఉన్న ఓ మానవుడా దాని నుండి నీవు దూరం కాజాలవు మరియు పారిపోలేవు.
Arabic explanations of the Qur’an:
وَنُفِخَ فِی الصُّوْرِ ؕ— ذٰلِكَ یَوْمُ الْوَعِیْدِ ۟
మరియు బాకాలో ఊదే బాధ్యత ఇవ్వబడిన దూత రెండవ సారి బాకాలో ఊదుతాడు. అది ప్రళయదినము. అవిశ్వాసపరులకు,అవిధేయులకు శిక్ష గురించి హెచ్చరించే రోజు.
Arabic explanations of the Qur’an:
وَجَآءَتْ كُلُّ نَفْسٍ مَّعَهَا سَآىِٕقٌ وَّشَهِیْدٌ ۟
మరియు ప్రతీ వ్యక్తి తనతో పాటు తనను తీసుకుని వచ్చే ఒక దూతతో మరియు తన కర్మల గురించి సాక్ష్యం పలికే దూతతో వస్తాడు.
Arabic explanations of the Qur’an:
لَقَدْ كُنْتَ فِیْ غَفْلَةٍ مِّنْ هٰذَا فَكَشَفْنَا عَنْكَ غِطَآءَكَ فَبَصَرُكَ الْیَوْمَ حَدِیْدٌ ۟
తీసుకుని రాబడిన ఆ మనిషితో ఇలా పలకబడుతుంది : నిశ్చయంగా నువ్వు ఇహలోకంలో ఈ దినము గురించి నీ మనోవాంఛలతో మరియు నీ కోరికలతో నీ మోసపోవటం వలన నిర్లక్ష్యంలోపడి ఉన్నావు. అయితే నీవు శిక్షను,యాతనను కళ్ళారా చూడటం వలన మేము నీ నుండి నీ పరధ్యానమును తొలగించాము. నీ చూపులు నీవు పరధ్యానంలో ఉన్న వాటిని పొందటానికి ఈ రోజు చురుకుగా ఉన్నవి.
Arabic explanations of the Qur’an:
وَقَالَ قَرِیْنُهٗ هٰذَا مَا لَدَیَّ عَتِیْدٌ ۟ؕ
మరియు దైవదూతల్లోంచి అతని బాధ్యత వహించే అతని సహచరుడు ఇలా పలుకుతాడు : ఎటువంటి తరగుదల లేకుండా, అధికం చేయకుండా నా వద్ద ఉన్న అతని కర్మలో నుంచి ఇది.
Arabic explanations of the Qur’an:
اَلْقِیَا فِیْ جَهَنَّمَ كُلَّ كَفَّارٍ عَنِیْدٍ ۟ۙ
మరియు అల్లాహ్ తీసుకుని వచ్చే మరియు సాక్ష్యం పలికే ఇద్దరు దూతలతో ఇలా పలుకుతాడు : మీరిద్దరు సత్యమును తిరస్కరించి దాన్ని విబేధించే ప్రతీ వ్యక్తిని నరకంలో వేయండి.
Arabic explanations of the Qur’an:
مَّنَّاعٍ لِّلْخَیْرِ مُعْتَدٍ مُّرِیْبِ ۟ۙ
తన పై అల్లాహ్ అనివార్యం చేసిన హక్కులను ఎక్కువగా ఆపేవాడిని,అల్లాహ్ హద్దులను అతిక్రమించేవాడిని,తనకు తెలియపరచబడిన వాగ్దానము,హెచ్చరిక విషయంలో సందేహపడేవాడిని.
Arabic explanations of the Qur’an:
١لَّذِیْ جَعَلَ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ فَاَلْقِیٰهُ فِی الْعَذَابِ الشَّدِیْدِ ۟
అతడే అల్లాహ్ తో పాటు వేరే ఆరాధ్య దైవమును ఆరాధనలో ఆయన తో పాటు సాటి కల్పించుకుని చేసుకున్నాడు. కావున అతడిని తీవ్రమైన శిక్షలో పడవేయండి.
Arabic explanations of the Qur’an:
قَالَ قَرِیْنُهٗ رَبَّنَا مَاۤ اَطْغَیْتُهٗ وَلٰكِنْ كَانَ فِیْ ضَلٰلٍۢ بَعِیْدٍ ۟
షైతానుల్లో నుంచి అతని స్నేహితుడు అతని నుండి నిర్దోషత్వమును చూపుతూ ఇలా పలుకుతాడు : ఓ మా ప్రభువా నేను అతన్ని అపమార్గమునకు లోను చేయలేదు. కాని అతడే సత్యము నుండి మార్గభ్రష్టత్వములో చాలా దూరం వెళ్ళిపోయాడు.
Arabic explanations of the Qur’an:
قَالَ لَا تَخْتَصِمُوْا لَدَیَّ وَقَدْ قَدَّمْتُ اِلَیْكُمْ بِالْوَعِیْدِ ۟
అల్లాహ్ ఇలా పలుకుతాడు : మీరు నా దగ్గర గొడవపడకండి. దాని వలన ఎటువంటి ప్రయోజనం లేదు. నిశ్చయంగా నేను ముందుగానే ఇహలోకంలో మీ వద్దకు నన్ను తిరస్కరించిన మరియు నా పట్ల అవిధేయతకు పాల్పడిన వారి కొరకు నా ప్రవక్తలు తీసుకుని వచ్చిన తీవ్ర హచ్చరికను పంపించినాను.
Arabic explanations of the Qur’an:
مَا یُبَدَّلُ الْقَوْلُ لَدَیَّ وَمَاۤ اَنَا بِظَلَّامٍ لِّلْعَبِیْدِ ۟۠
నా వద్ద మాట మార్చబడదు మరియు నా వాగ్దానం నెరవేరకుండా ఉండదు. మరియు నేను దాసులపై వారి పుణ్యాలను తరిగించి గాని వారి పాపములను అధికం చేసి గాని అన్యాయం చేయను. కాని వారు చేసిన కర్మలకు నేను ప్రతిఫలమును ప్రసాదిస్తాను.
Arabic explanations of the Qur’an:
یَوْمَ نَقُوْلُ لِجَهَنَّمَ هَلِ امْتَلَاْتِ وَتَقُوْلُ هَلْ مِنْ مَّزِیْدٍ ۟
ఆ రోజు మేము నరకముతో ఏమీ నీలో వేయబడిన అవిశ్వాసపరులతో,పాపాత్ములతో నీవు నిండిపోయావా ? అని అడుగుతాము. అప్పుడు అది తన ప్రభువుతో ఇంకా ఏదైనా అధికంగా ఉన్నదా ? అని అధికంగా కోరుతూ ఆగ్రహంతో తన ప్రభువుకు సమాధానమిస్తుంది.
Arabic explanations of the Qur’an:
وَاُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِیْنَ غَیْرَ بَعِیْدٍ ۟
మరియు తమ ప్రభువుకు ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడే వారి కొరకు స్వర్గము దగ్గర చేయబడుతుంది. అప్పుడు వారు అందులో ఉన్న వారి నుండి దూరంగా లేని అనుగ్రహాలను చూసుకుంటారు.
Arabic explanations of the Qur’an:
هٰذَا مَا تُوْعَدُوْنَ لِكُلِّ اَوَّابٍ حَفِیْظٍ ۟ۚ
మరియు వారితో ఇలా పలకబడుతుంది : ఇది అల్లాహ్ తన ప్రభువు వైపునకు పశ్చాత్తాపముతో ఎక్కువగా మరలే ప్రతీ వ్యక్తి కొరకు మరియు తన ప్రభువు తనకు తప్పని సరి చేసిన దాన్ని పరిరక్షించే వారి కొరకు కల దాని గురించి మీకు వాగ్దానం చేశాడు.
Arabic explanations of the Qur’an:
مَنْ خَشِیَ الرَّحْمٰنَ بِالْغَیْبِ وَجَآءَ بِقَلْبٍ مُّنِیْبِ ۟ۙ
ఎవరైతే రహస్యంగా అల్లాహ్ కు భయపడుతాడో ఏ విధంగానంటే అతడిని అల్లాహ్ తప్ప ఇంకెవరూ చూడటం లేదు. మరియు అల్లాహ్ వైపునకు మరలే పరిశుద్ధ హృదయముతో అల్లాహ్ తో కలుస్తాడో,ఆయన వైపునకు అధికంగా మరలే వాడు.
Arabic explanations of the Qur’an:
١دْخُلُوْهَا بِسَلٰمٍ ؕ— ذٰلِكَ یَوْمُ الْخُلُوْدِ ۟
మరియు వారితో ఇలా పలకబడుతుంది : మీరు ద్వేషించే వాటి నుండి భద్రతతో స్వర్గంలో ప్రవేశించండి. అది దాని తరువాత అంతం లేని శాశ్వతమైన దినము.
Arabic explanations of the Qur’an:
لَهُمْ مَّا یَشَآءُوْنَ فِیْهَا وَلَدَیْنَا مَزِیْدٌ ۟
వారి కొరకు అందులో వారు కోరుకున్న తరగని అనుగ్రహాలు ఉంటాయి. మరియు మా వద్ద ఏ కళ్ళు చూడని మరియు ఏ చెవులు వినని మరియు ఏ మనిషి హృదయములో తట్టని అనుగ్రహాలు అధికంగా ఉంటాయి. మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ ను దర్శించుకోవటం అందులో నుంచే.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• علم الله بما يخطر في النفوس من خير وشر.
మనస్సుల్లో పుట్టుకొచ్చే మంచి,చెడుల గురించి అల్లాహ్ కు జ్ఞానం ఉంది.

• خطورة الغفلة عن الدار الآخرة.
పరలోక నివాసము నుండి నిర్లక్ష్యం యొక్క ప్రమాదము.

• ثبوت صفة العدل لله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ కొరకు న్యాయాధిపతి (అల్ అద్ల్) గుణము నిరూపణ.

 
Translation of the meanings Surah: Qāf
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close