Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Al-Qamar   Ayah:

అల్ ఖమర్

Purposes of the Surah:
التذكير بنعمة تيسير القرآن، وما فيه من الآيات والنذر.
ఖుర్ఆన్ ను శులభతరం చేసే అనుగ్రహమును మరియు అందులో ఉన్న ఆయతులను,హెచ్చరికలను గుర్తుచేసుకోవడం

اِقْتَرَبَتِ السَّاعَةُ وَانْشَقَّ الْقَمَرُ ۟
ప్రళయం రావటం ఆసన్నమైనది మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో చంద్రుడు చీలిపోయాడు. దాని చీలటం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇంద్రియ సూచనల్లోంచిది.
Arabic explanations of the Qur’an:
وَاِنْ یَّرَوْا اٰیَةً یُّعْرِضُوْا وَیَقُوْلُوْا سِحْرٌ مُّسْتَمِرٌّ ۟
మరియు ఒక వేళ ముష్రికులు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నిజాయితీని సూచించే ఏదైన ఆధారమును,ఋజువును చూస్తే దాన్ని స్వీకరించటం నుండి ముఖం త్రిప్పుకునేవారు. మరియు మేము చూసిన వాదనలు,ఆధారాలు అసత్య మంత్రజాలము అనేవారు.
Arabic explanations of the Qur’an:
وَكَذَّبُوْا وَاتَّبَعُوْۤا اَهْوَآءَهُمْ وَكُلُّ اَمْرٍ مُّسْتَقِرٌّ ۟
మరియు ఆయన వారి వద్దకు తీసుకుని వచ్చిన సత్యమును వారు తిరస్కరించారు మరియు తిరస్కరించటంలో వారు తమ మనోవాంఛలను అనుసరించారు. మరియు ప్రతీ విషయం మంచి అయినా లేదా చెడు అయిన ప్రళయదినమున జరిగి తీరుతుంది.
Arabic explanations of the Qur’an:
وَلَقَدْ جَآءَهُمْ مِّنَ الْاَنْۢبَآءِ مَا فِیْهِ مُزْدَجَرٌ ۟ۙ
మరియు నిశ్చయంగా వారి వద్దకు అల్లాహ్ తమ అవిశ్వాసం వలన,తమ దుర్మార్గం వలన వినాశనమునకు గురి చేసిన సమాజముల వార్తలు వచ్చినవి. ఏవైతే వారిని వారి అవిశ్వాసము నుండి,వారి దుర్మార్గము నుండి నిరోధించటానికి తగినవో.
Arabic explanations of the Qur’an:
حِكْمَةٌ بَالِغَةٌ فَمَا تُغْنِ النُّذُرُ ۟ۙ
వారి వద్దకు వచ్చినది వారికి వ్యతిరేకంగా వాదనను స్థాపించటానికి సంపూర్ణ వివేకము కలిగి ఉన్నది. అయితే అల్లాహ్ పై,పరలోక దినముపై విశ్వాసమును కనబరచని జాతి వారికి హెచ్చరికలు ప్రయోజనం కలిగించలేదు.
Arabic explanations of the Qur’an:
فَتَوَلَّ عَنْهُمْ ۘ— یَوْمَ یَدْعُ الدَّاعِ اِلٰی شَیْءٍ نُّكُرٍ ۟ۙ
ఓ ప్రవక్తా వారు సన్మార్గంపై రాకపోతే వారిని వదిలివేయండి మరియు సృష్టితాలు ఇంతకు ముందు గుర్తించనటువంటి భయంకరమైన విషయం వైపునకు బాకాలో ఊదే బాధ్యత ఇవ్వబడిన దూత పిలిచే దినమును నిరీక్షిస్తూ మీరు వారితో విముఖత చూపండి.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• عدم التأثر بالقرآن نذير شؤم.
ఖుర్ఆన్ ద్వారా ప్రభావితం కాకపోవటం చెడు శకునము.

• خطر اتباع الهوى على النفس في الدنيا والآخرة.
మనో వాంఛలను అనుసరించటం యొక్క ప్రమాదం మనిషికి ఇహపరాల్లో.

• عدم الاتعاظ بهلاك الأمم صفة من صفات الكفار.
సమాజాల వినాశనము ద్వారా హితబోధన గ్రహించక పోవటం అవిశ్వాసపరుల గుణముల్లోంచిది.

 
Translation of the meanings Surah: Al-Qamar
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close