Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Al-An‘ām   Ayah:
اِنَّمَا یَسْتَجِیْبُ الَّذِیْنَ یَسْمَعُوْنَ ؔؕ— وَالْمَوْتٰی یَبْعَثُهُمُ اللّٰهُ ثُمَّ اِلَیْهِ یُرْجَعُوْنَ ۟
ఎవరైతే మాటను శ్రద్ధతో వింటాడో,దానిని అర్ధం చేసుకుంటాడో వాడు మీరు తీసుకుని వచ్చిన దానిని అంగీకరిస్తూ మీ నుండి స్వీకరిస్తాడు.మరియు అవిశ్వాసపరులు మృతులు వారికి ఎటువంటి స్థానం ఉండదు.వారి హృదయాలు మరణించినవి.మృతులను అల్లాహ్ ప్రళయదినాన మరల లేపుతాడు.ఆ తరువాత వారు ముందు పంపించుకున్న కర్మలకు ఆయన వారికి ప్రతిఫలం ప్రసాదించటం కొరకు వారు ఆయన ఒక్కడివైపే మరలించబడుతారు.
Arabic explanations of the Qur’an:
وَقَالُوْا لَوْلَا نُزِّلَ عَلَیْهِ اٰیَةٌ مِّنْ رَّبِّهٖ ؕ— قُلْ اِنَّ اللّٰهَ قَادِرٌ عَلٰۤی اَنْ یُّنَزِّلَ اٰیَةً وَّلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟
ముష్రికులు మొరట వైఖరితో,విశ్వాస విషయంలో కాలయాపన చేస్తూ ఇలా అంటారు-: ముహమ్మద్ పై ఒక అద్భుత మహిమ ఆయన తీసుకుని వచ్చిన దాని విషయంలో ఆయన నిజాయితీపై ఆయన ప్రభువు తరపు నుండి ఆధారం అవటానికి ఎందుకు అవతరింపబడలేదు.ఓ ప్రవక్త మీరు ఇలా అనండి -: అల్లాహ్ వారు కోరిన విధంగా మహిమను అవతరింపజేసే శక్తి కలవాడు.కాని మహిమ అవతరించాలని కోరిక కలిగిన చాలామంది ఈ ముష్రికులకు మహిమ అవతరణ అల్లాహ్ వ్యూహాలకు అనుగుణంగా ఉంటుందని తెలియదు. వారు కోరుతున్న దానికి అనుగుణంగా ఉండదు.ఒకవేళ ఆయన (అల్లాహ్ )దానిని అవతరింపజేస్తే ఆ తరువాత వారు విశ్వసించకపోతే అల్లాహ్ వారిని వినాశనమునకు గురి చేస్తాడు.
Arabic explanations of the Qur’an:
وَمَا مِنْ دَآبَّةٍ فِی الْاَرْضِ وَلَا طٰٓىِٕرٍ یَّطِیْرُ بِجَنَاحَیْهِ اِلَّاۤ اُمَمٌ اَمْثَالُكُمْ ؕ— مَا فَرَّطْنَا فِی الْكِتٰبِ مِنْ شَیْءٍ ثُمَّ اِلٰی رَبِّهِمْ یُحْشَرُوْنَ ۟
భూమిపై సంచరించే అన్ని రకాల జంతువులు,ఆకాశంలో ఎగిరే అన్ని రకాల పక్షులు అన్నీ మీలాంటి సముదాయాలే.ఓ ఆదం సంతతివారా సృష్టితాల విషయంలో,ఆహారోపాది విషయంలో ప్రతీది ఏది వదలకుండా మేము లౌహె మహ్ఫూజ్ లో (సప్తాకాశాలపై ఉన్న గ్రధం.ఇందులో ణానవుల విధివ్రాతలు పొందుపరచబడి ఉన్నాయి.) పొందుపరచాము.వాటన్నింటి యొక్క జ్ఞానం అల్లాహ్ వద్ద ఉన్నది.ఆ తరువాత ఫ్రళయదినాన వారందరు ఏకైక తమ ప్రభువు వైపున తీర్పు కొరకు సమీకరించబడుతారు.ప్రతి ఒక్కరికి వారి హక్కును ప్రసాధించటం జరుగుతుంది.
Arabic explanations of the Qur’an:
وَالَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا صُمٌّ وَّبُكْمٌ فِی الظُّلُمٰتِ ؕ— مَنْ یَّشَاِ اللّٰهُ یُضْلِلْهُ ؕ— وَمَنْ یَّشَاْ یَجْعَلْهُ عَلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟
మా సూచనలను తిరస్కరించేవారు వినలేని చెవిటోళ్లాంటివారు,మాట్లాడలేని మూగవాళ్లాంటివారు.మరియు దానితోపాటు వారందరు చీకట్లలో ఉంటారు,వారు చూడలేరు.అయితే ఇటువంటి స్థితి కలిగిన వాడు సన్మార్గం పొందటం ఎలా సాధ్యం?.అల్లాహ్ ప్రజల్లోంచి ఎవరిని మార్గభ్రష్టతకు లోను చేయదలచుకుంటే అతడిని మార్గభ్రష్టతకు గురి చేస్తాడు.ఎవరిని సన్మార్గం చూపదలచుకుంటే అతడిని సన్మార్గం చూపుతాడు.ఎందుకంటే ఆయన అతడిని ఎటువంటి వంకరతనం లేని ఋజుమార్గంపై నడిపిస్తాడు.
Arabic explanations of the Qur’an:
قُلْ اَرَءَیْتَكُمْ اِنْ اَتٰىكُمْ عَذَابُ اللّٰهِ اَوْ اَتَتْكُمُ السَّاعَةُ اَغَیْرَ اللّٰهِ تَدْعُوْنَ ۚ— اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి: ఒక వేళ మీపై అల్లాహ్ శిక్ష వచ్చినా లేదా ఆ ప్రళయం దేని గురించైతే రాబోతుందని మీతో వాగ్దానం చేయబడినదో అది మీ వద్దకు వస్తే అప్పుడు మీరు అల్లాహ్ ను వదిలి ఇతరులను మీపై వచ్చిన ఆపదను,కష్టమును తొలగించమని మొరపెట్టుకుంటారా ? మీరు నాకు తెలియజేయండి.ఒకవేళ మీ ఆరాధ్య దైవాలను లాభం చేస్తారని లేదా నష్టమును చేస్తారని మీరు మొరపెట్టుకోవటంలో సత్యవంతులే అయితే నాకు తెలియపరచండి.
Arabic explanations of the Qur’an:
بَلْ اِیَّاهُ تَدْعُوْنَ فَیَكْشِفُ مَا تَدْعُوْنَ اِلَیْهِ اِنْ شَآءَ وَتَنْسَوْنَ مَا تُشْرِكُوْنَ ۟۠
వాస్తవమేమిటంటే ఆ సమయంలో మీరు మిమ్మల్ని సృష్టించిన అల్లాహ్ ను వదిలి ఇతరులను మీ నుండి ఆపదను తొలగించటం కొరకు ,మీ నుండి నష్టమును దూరం చేయటం కొరకు వేడుకోరు. ఆయనే దానిని చేసేవాడు,దానిని చేయుటకు శక్తిసామర్ధ్యాలు కలవాడు. మీరు అల్లాహ్ తోపాటు సాటి కల్పించే మీ ఆరాధ్య దైవాలు లాభం చేకూర్చలేరని,నష్టం చేకూర్చలేరని మీకు తెలిసిన తరువాత వారిని వదిలివేస్తారు.
Arabic explanations of the Qur’an:
وَلَقَدْ اَرْسَلْنَاۤ اِلٰۤی اُمَمٍ مِّنْ قَبْلِكَ فَاَخَذْنٰهُمْ بِالْبَاْسَآءِ وَالضَّرَّآءِ لَعَلَّهُمْ یَتَضَرَّعُوْنَ ۟
ఓ ప్రవక్తా మీకన్న పూర్వ జాతుల వారి వైపునకు ప్రవక్తలను పంపించినాము.వారు వారిని తిరస్కరించారు.వారు వారి వద్దకు తీసుకుని వచ్చిన వాటి పట్ల విముఖత చూపారు.వారు తమ ప్రభువు యందు అణుకువభావం కలిగి ఉండటం కొరకు,ఆయనకు విధేయులై ఉండటం కొరకు మేము వారిని పేదరికం లాంటి కష్టాల ద్వారా,వారి శరీరాలను హాని కలిగించే రోగాల్లాంటి వాటి ద్వారా శిక్షించాము.
Arabic explanations of the Qur’an:
فَلَوْلَاۤ اِذْ جَآءَهُمْ بَاْسُنَا تَضَرَّعُوْا وَلٰكِنْ قَسَتْ قُلُوْبُهُمْ وَزَیَّنَ لَهُمُ الشَّیْطٰنُ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
ఒక వేళ మా ఆపద వారి వద్దకు వచ్చినప్పుడు వారి నుండి అల్లాహ్ ఆపదను తొలగించటం కొరకు వారు అల్లాహ్ కు విధేయత చూపితే,ఆయన యందు అణుకువతో మెలిగితే మేము వారిపై కనికరించే వాళ్ళము.కాని వారు అలా చేయలేదు.వాస్తవానికి వారి హృదయాలు కఠినంగా మారిపోయినవి.వారు గుణపాఠం నేర్చుకోలేదు.హితోపదేశంను గ్రహించలేదు.వారు పాల్పడే అవిశ్వాస కార్యాలను,అవిధేయత కార్యాలను షైతాను వారికొరకు అందంగా చేసి చూపించాడు.అయితే వారు తాము ఉన్నదానిపై కొనసాగిపోయారు.
Arabic explanations of the Qur’an:
فَلَمَّا نَسُوْا مَا ذُكِّرُوْا بِهٖ فَتَحْنَا عَلَیْهِمْ اَبْوَابَ كُلِّ شَیْءٍ ؕ— حَتّٰۤی اِذَا فَرِحُوْا بِمَاۤ اُوْتُوْۤا اَخَذْنٰهُمْ بَغْتَةً فَاِذَا هُمْ مُّبْلِسُوْنَ ۟
పేదరికం,అనారోగ్యంల తీవ్రత వలన వారు ఎప్పుడైతే వారికి హితోపదేశం ఇవ్వబడిన వాటిని వదిలివేశారో,అల్లాహ్ ఆదేశాలను పాటించలేదో వారిపై మేము ఆహారపు ద్వారములను తెరచి పేదరికం తరువాత వారిని ధనికులను చేసి అనారోగ్యము తరువాత వారి శరీరములను సరిదిద్ది (ఆరోగ్యం ప్రసాధించి) వారిని ప్రలోభపెట్టాము.చివరికి వారికి ప్రసాధించబడిన అనుగ్రహాల పట్ల వారు కృతఘ్నతా వైఖరి కలిగినప్పుడు,వారికి అహంభావం కలిగినప్పుడు వారిపై మా శిక్ష వచ్చిపడినది.అప్పుడు వారు కలవరపడ్డారు,తాము ఆశించిన వాటి నుండి నిరాశ్యులయ్యారు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• تشبيه الكفار بالموتى؛ لأن الحياة الحقيقية هي حياة القلب بقَبوله الحق واتباعه طريق الهداية.
అవిశ్వాసపరులను మృతులతో పోల్చటం జరిగింది.ఎందుకంటే వాస్తవమైన జీవితం అంటే అది సత్యాన్ని అంగీకరించటం ద్వారా మరియు సన్మార్గమును అనుసరించటం ద్వారా హృదయములకు లభించే జీవితం.

• من حكمة الله تعالى في الابتلاء: إنزال البلاء على المخالفين من أجل تليين قلوبهم وردِّهم إلى ربهم.
వ్యతిరేకుల హృదయములను మెత్తపరచటానికి,వారిని వారి ప్రభువు వైపునకు మరల్చటానికి వారిపై ఆపదను తీసుకుని వచ్చి పరీక్షించటంలో అల్లాహ్ యొక్క వ్యూహమున్నది.

• وجود النعم والأموال بأيدي أهل الضلال لا يدل على محبة الله لهم، وإنما هو استدراج وابتلاء لهم ولغيرهم.
మార్గభ్రష్టుల చేతిలో అనుగ్రహాలు,సంపదలుండటం అల్లాహ్ యొక్క ఇష్టత వారికొరకు ఉన్నదని నిరూపణకాదు.అవి వారిని,ఇతరులను ప్రలోభపెట్టటానికి,పరీక్షించటానికి మాత్రమే.

 
Translation of the meanings Surah: Al-An‘ām
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close