Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Al-A‘rāf   Ayah:
وَقَطَّعْنٰهُمُ اثْنَتَیْ عَشْرَةَ اَسْبَاطًا اُمَمًا ؕ— وَاَوْحَیْنَاۤ اِلٰی مُوْسٰۤی اِذِ اسْتَسْقٰىهُ قَوْمُهٗۤ اَنِ اضْرِبْ بِّعَصَاكَ الْحَجَرَ ۚ— فَانْۢبَجَسَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَیْنًا ؕ— قَدْ عَلِمَ كُلُّ اُنَاسٍ مَّشْرَبَهُمْ ؕ— وَظَلَّلْنَا عَلَیْهِمُ الْغَمَامَ وَاَنْزَلْنَا عَلَیْهِمُ الْمَنَّ وَالسَّلْوٰی ؕ— كُلُوْا مِنْ طَیِّبٰتِ مَا رَزَقْنٰكُمْ ؕ— وَمَا ظَلَمُوْنَا وَلٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ یَظْلِمُوْنَ ۟
మరియు మేము ఇస్రాయీలు సంతతి వారిని పన్నెండు తెగలుగా విభజించాము. మూసాను ఆయన జాతి వారు తమ కొరకు నీళ్ళను ఏర్పాటు చేయమని అల్లాహ్ ను వేడుకోమని కోరినప్పుడు మేము ఆయనకు దైవ వాణి ద్వారా ఓ మూసా మీ చేతి కర్రను రాయి పై కొట్టండి అని ఆదేశించాము. మూసా దానిని కొట్టారు. అప్పుడు దానితో వారి పన్నెండు తెగలకు సమానంగా పన్నెండు ఊటలు ప్రవహించ సాగాయి. వారిలోంచి ప్రతి తెగ నీటిని త్రాగే తమ ప్రత్యేక ప్రదేశమును తెలుసుకుంది. అందులో ఒక తెగ తోపాటు వేరొక తెగ భాగసాములు కారు. వారిపై మేఘమును నీడగా చేశాము. అది వారు నడిచే చోటు నడిచేది. వారు ఆగే చోటు ఆగేది. మరియు మేము వారిపై మా అనుగ్రహాల్లోంచి తేనె మాదిరిగా తియ్యగా ఉండే పానియమును,పిట్టల మాదిరిగా స్వచ్చమైన మాంసము కల చిన్న పక్షులను దించాము. మరియు మేము వారితో ఇలా పలికాము : మీకు మేము ప్రసాదించిన ధర్మ సమ్మతమైన వాటిలోంచి మీరు తినండి. వారి నుండి జరిగిన అన్యాయము,అనుగ్రహాల పట్ల కృతఘ్నత వైఖరి,వాటి పట్ల ఏవిధమైన మర్యాద ఉండాలో ఆ విధమైన మర్యాద లేక పోవటం వలన వారు మాకు ఎటువంటి నష్టం చేకూర్చ లేదు. కాని వారు అల్లాహ్ ఆదేశమునకు వ్యతిరేకించటము,ఆయన అనుగ్రహాలను తిరస్కరించటం లాంటి కార్యాలకు పాల్పడటం వలన వినాశమునకు గురి అయినప్పుడు అనుగ్రహాల వాటాను కోల్పోవటం ద్వారా వారు తమ స్వయానికే అన్యాయం చేసుకున్నారు.
Arabic explanations of the Qur’an:
وَاِذْ قِیْلَ لَهُمُ اسْكُنُوْا هٰذِهِ الْقَرْیَةَ وَكُلُوْا مِنْهَا حَیْثُ شِئْتُمْ وَقُوْلُوْا حِطَّةٌ وَّادْخُلُوا الْبَابَ سُجَّدًا نَّغْفِرْ لَكُمْ خَطِیْٓـٰٔتِكُمْ ؕ— سَنَزِیْدُ الْمُحْسِنِیْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఒక సారి అల్లాహ్ ఇస్రాయీలు సంతతి వారితో ఇలా పలికిన ఆ సంధర్భాన్ని గుర్తు చేసుకోండి మీరు బైతుల్ మఖ్దిస్ లో ప్రవేశించండి. దాని బస్తీ నుండి ఫలాలను మీరు ఏ చోటు నుండి,ఏ సమయములో మీరు కోరుకుంటే అప్పుడు తినండి. మరియు మీరు ఓ మా ప్రభువా మా పాపములను మన్నించు అని అనండి. మరియు మీరు మీ ప్రభువు కొరకు సాష్టాంగపడుతూ అణుకువతో ద్వారం గుండా ప్రవేశించండి. ఒక వేళ మీరు ఇలా చేస్తే మేము మీ పాపములను మన్నించి వేస్తాము. మరియు తొందరలోనే మేము సజ్జనులకు ఇహపర లోకాల మేళ్ళను (శుభాలను) ఎక్కువగా ప్రసాదిస్తాము.
Arabic explanations of the Qur’an:
فَبَدَّلَ الَّذِیْنَ ظَلَمُوْا مِنْهُمْ قَوْلًا غَیْرَ الَّذِیْ قِیْلَ لَهُمْ فَاَرْسَلْنَا عَلَیْهِمْ رِجْزًا مِّنَ السَّمَآءِ بِمَا كَانُوْا یَظْلِمُوْنَ ۟۠
వారిలోంచి దుర్మార్గులు తమకు ఆదేశించబడిన మాటను మార్చి వేశారు. మన్నింపును వేడుకోమని వారికి ఆదేశించబడిన ఆదేశమునకు బదులుగా హబ్బతున్ ఫీ షరతిన్ అని పలికారు. మరియు వారు వారికి ఆదేశించబడిన కార్యమును మార్చి వేశారు. వారు అల్లాహ్ కొరకు అణకువతో తమ శిరసాలను వంచుతూ ప్రవేశించటమునకు బదులుగా తమ పిరుదులపై పాకుతూ ప్రవేశించారు. అయితే మేము వారి దుర్మార్గము వలన వారిపై ఆకాశము నుండి శిక్షను కురిపించాము.
Arabic explanations of the Qur’an:
وَسْـَٔلْهُمْ عَنِ الْقَرْیَةِ الَّتِیْ كَانَتْ حَاضِرَةَ الْبَحْرِ ۘ— اِذْ یَعْدُوْنَ فِی السَّبْتِ اِذْ تَاْتِیْهِمْ حِیْتَانُهُمْ یَوْمَ سَبْتِهِمْ شُرَّعًا وَّیَوْمَ لَا یَسْبِتُوْنَ ۙ— لَا تَاْتِیْهِمْ ۛۚ— كَذٰلِكَ ۛۚ— نَبْلُوْهُمْ بِمَا كَانُوْا یَفْسُقُوْنَ ۟
ఓ ప్రవక్త మీరు యూదులను వారి పూర్వికులను అల్లాహ్ శిక్షించిన వైనమును గుర్తు చేస్తూ సముద్రానికి దగ్గరలో ఉండే బస్తీ వారి సంఘటనను గురించి అడగండి. వారు శనివారము రోజున వేటాడటం నుండి వారిని వారించినప్పటికి వేటాడి అల్లాహ్ హద్దులను దాటివేశారు. అల్లాహ్ వారిని పరీక్షించినాడు. చేపలు సముద్ర ఉపరితలంపై ప్రత్యక్షమై వారి వద్దకు శనివారం రోజు వచ్చేవి. ఇతర దినముల్లో అవి వారి వద్దకు వచ్చేవి కావు. వారు విధేయత నుండి తొలగి పోవటం వలన,అవిధేయత కార్యాలకు పాల్పడటం వలన అల్లాహ్ వారిని ఇలా పరీక్షించాడు. వాటిని వేటాడటం కొరకు తమ వలలను ఏర్పాటు చేసి,గుంతలను త్రవ్వి వ్యూహం పన్నారు.పెద్ద పెద్ద చేపలు శనివారం రోజు వచ్చి వాటిలో పడేవి. ఆదివారం రోజున వారు వాటిని పట్టుకుని తినేవారు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• الجحود والكفران سبب في الحرمان من النعم.
తిరస్కారము,కృతఘ్నత అనుగ్రహాలను కోల్పోవటానికి కారణమవుతాయి.

• من أسباب حلول العقاب ونزول العذاب التحايل على الشرع؛ لأنه ظلم وتجاوز لحدود الله.
యాతన కలగటానికి,శిక్ష కురవటానికి కారణాల్లోంచి ధర్మాన్ని అతిక్రమించటం ఒకటి. ఎందుకంటే అది దుర్మార్గము,అల్లాహ్ హద్దులను దాటటం.

 
Translation of the meanings Surah: Al-A‘rāf
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close