Translation of the Meanings of the Noble Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Translations’ Index


Translation of the meanings Ayah: (25) Surah: Al-Anfāl
وَاتَّقُوْا فِتْنَةً لَّا تُصِیْبَنَّ الَّذِیْنَ ظَلَمُوْا مِنْكُمْ خَآصَّةً ۚ— وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ ۟
ఓ విశ్వాసపరులారా మీరు ఆ శిక్ష నుండి జాగ్రత్తపడండి అది కేవలం అవిధేయుడికి ఒక్కడికే సంభవించదు,కాని అది అతడికి,ఇతరులకి సంభవిస్తుంది. మరియు ఇది దుర్మార్గము బహిర్గతమైనప్పుడు జరుగుతుంది. అయితే అది మార్చబడదు. మరియు అల్లాహ్ తనపై అవిధేయత చూపే వాడిని కఠినంగా శిక్షించే వాడని మీరు నమ్మకమును కలిగి ఉండండి. ఆయనపై అవిధేయతకు పాల్పడటం నుండి జాగ్రత్తపడండి.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• من كان الله معه فهو المنصور وإن كان ضعيفًا قليلًا عدده، وهذه المعية تكون بحسب ما قام به المؤمنون من أعمال الإيمان.
అల్లాహ్ ఎవరికి తోడుగా ఉంటాడో ఒకవేళ అతడు సంఖ్యా బలంగా తక్కువగా ఉండి బలహీనుడైనా కూడా అతడు సహాయమును పొందే వాడవుతాడు. ఈ తోడు విశ్వాసపరులు విశ్వాస ఆచరణల్లో నుంచి ఆచరించే వాటికి తగ్గట్టుగా ఉంటుంది.

• المؤمن مطالب بالأخذ بالأسباب المادية، والقيام بالتكليف الذي كلفه الله، ثم يتوكل على الله، ويفوض الأمر إليه، أما تحقيق النتائج والأهداف فهو متروك لله عز وجل.
విశ్వాసపరుడు భౌతిక కారకాలను ఎంచుకుని,అల్లాహ్ అతనికి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించి ఆ తరువాత అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండాలి. మరియు ఆ విషయాన్ని ఆయనకే అప్పగించాలి. ఫలితాలను ,లక్ష్యాలను సాధించటం అన్నది అల్లాహ్ కే వశం.

• في الآيات دليل على أن الله تعالى لا يمنع الإيمان والخير إلا عمَّن لا خير فيه، وهو الذي لا يزكو لديه هذا الإيمان ولا يثمر عنده.
మహోన్నతుడైన అల్లాహ్ విశ్వాసమును,మేలును ఎవరిలోనైతే మంచి ఉండదో వారి నుండి ఆపివేస్తాడని.అతని వద్ద విశ్వాసము పెరగదు.మరియు అతని వద్ద విశ్వాసము ఫలించదని ఆయతుల్లో ఆధారమున్నది.

• على العبد أن يكثر من الدعاء: يا مقلب القلوب ثبِّت قلبي على دينك، يا مُصرِّف القلوب اصرف قلبي إلى طاعتك.
దాసుడు దుఆలలో ఈ దుఆను ఎక్కువగా చేయాలి : "యా ముఖల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ ఖల్బీ అలా దీనిక,యా ముసర్రిఫల్ ఖులూబ్ ఇస్రిఫ్ ఖల్బీ ఇలా తాఅతిక".(ఓ హృదయాలను త్రిప్పేవాడా నా హృదయమును నీ ధర్మముపై స్థిరముగా ఉండేటట్లు చేయి,ఓ హృదయాలను మరల్చేవాడా నా హృదయమును నీ విధేయత వైపునకు మరల్చు).

• أَمَرَ الله المؤمنين ألا يُقِرُّوا المنكر بين أظهرهم فيعُمَّهم العذاب.
విశ్వాసపరులు తమ ముందట చెడును అంగీకరించవద్దని ఆదేశించాడు. అలా అయితే శిక్ష వారిపై సాధారణమైపోతుంది.

 
Translation of the meanings Ayah: (25) Surah: Al-Anfāl
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Translations’ Index

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

close