Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: At-Tawbah   Ayah:
ثُمَّ یَتُوْبُ اللّٰهُ مِنْ بَعْدِ ذٰلِكَ عَلٰی مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
ఆ శిక్ష విధించబడిన తరువాత ఎవరైతే తన అవిశ్వాసము నుండి,తన అప మార్గము నుండి పశ్చాత్తాప్పడుతాడో నిశ్చయంగా అల్లాహ్ అతనిపై దయ చూపి అతని పశ్చాత్తాపమును స్వీకరిస్తాడు. అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తప్పడేవారిని మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును. ఎందుకంటే ఆయన అవిశ్వాసము తరువాత,పాపకార్యములను పాల్పడిన తరువాత వారి పశ్ఛాత్తాపమును స్వీకరిస్తాడు.
Arabic explanations of the Qur’an:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِنَّمَا الْمُشْرِكُوْنَ نَجَسٌ فَلَا یَقْرَبُوا الْمَسْجِدَ الْحَرَامَ بَعْدَ عَامِهِمْ هٰذَا ۚ— وَاِنْ خِفْتُمْ عَیْلَةً فَسَوْفَ یُغْنِیْكُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖۤ اِنْ شَآءَ ؕ— اِنَّ اللّٰهَ عَلِیْمٌ حَكِیْمٌ ۟
అల్లాహ్,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచి తమ కొరకు ఆయన ధర్మబద్దం చేసిన వాటిని అనుసరించిన వారా నిశ్చయంగా ముష్రికులు వారిలో ఉన్న అవిశ్వాసము,దుర్మార్గము,చెడు గుణాలు,దుర అలవాట్ల వలన అపరిశుద్ధులు.అయితే వారు మక్కా హరమ్ లో (నిషిద్ధ ప్రదేశాల్లో),మరియు మస్జిదుల్ హరాంతో సహా ఒక వేళ వారు హాజీలుగా లేదా ఉమ్రా చేసే వారిగా వారి ఈ సంవత్సరము అది హిజ్రత్ యొక్క తొమ్మిదో సంవత్సరం తరువాత ప్రవేశించరాదు.ఓ విశ్వాసపరులారా తినుబండారాలు,రకరకాల వ్యాపార సామగ్రి వారు తీసుకుని వచ్చేవారో అవి అంతం అయిపోవటం వలన పేదరికం యొక్క మీకు భయం ఉంటే నిశ్చయంగా అల్లాహ్ తన అనుగ్రహం ద్వారా ఒక వేళ తాను తలచుకుంటే మీకు ఆయన చాలును.నిశ్చయంగా అల్లాహ్ మీరు ఉన్న స్థితిని తెలిసిన వాడు,మీ కొరకు ఆయన పర్యాలోచన చేసే విషయాల్లో వివేకవంతుడు.
Arabic explanations of the Qur’an:
قَاتِلُوا الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَلَا بِالْیَوْمِ الْاٰخِرِ وَلَا یُحَرِّمُوْنَ مَا حَرَّمَ اللّٰهُ وَرَسُوْلُهٗ وَلَا یَدِیْنُوْنَ دِیْنَ الْحَقِّ مِنَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ حَتّٰی یُعْطُوا الْجِزْیَةَ عَنْ یَّدٍ وَّهُمْ صٰغِرُوْنَ ۟۠
ఓ విశ్వాసపరులారా మీరు ఆ అవిశ్వాసపరులతో యుద్ధం చేయండి ఎవరైతే ఎవరూ సాటి లేని అల్లాహ్ ను ఆరాధ్య దైవంగా విశ్వసించలేదో,ప్రళయ దినం పై విశ్వాసమును కనబరచలేదో,వారిపై అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించిన మృత జంతువులు,పంది మాంసము,మధ్యము,వడ్డీ నుండి దూరంగా ఉండలేదో,యూదులు,క్రైస్తవులు అణచివేయబడి అవమానానికి గురై తమ చేతులతో జిజియా ఇచ్చేంత వరకు అల్లాహ్ ధర్మబద్దం చేసిన వాటిని శిరసావహించలేదు.
Arabic explanations of the Qur’an:
وَقَالَتِ الْیَهُوْدُ عُزَیْرُ ١بْنُ اللّٰهِ وَقَالَتِ النَّصٰرَی الْمَسِیْحُ ابْنُ اللّٰهِ ؕ— ذٰلِكَ قَوْلُهُمْ بِاَفْوَاهِهِمْ ۚ— یُضَاهِـُٔوْنَ قَوْلَ الَّذِیْنَ كَفَرُوْا مِنْ قَبْلُ ؕ— قَاتَلَهُمُ اللّٰهُ ۚ— اَنّٰی یُؤْفَكُوْنَ ۟
నిశ్చయంగా యూదులు,క్రైస్తవుల్లోంచి ప్రతి ఒక్కరు ముష్రికులు.యూదులు ఉజైరును అల్లాహ్ కుమారుడని దావా చేసినప్పుడు (వాదించి) అల్లాహ్ తోపాటు సాటి కల్పించారు.మరియు క్రైస్తవులు మసీహ్ ఈసాను అల్లాహ్ కుమారుడని దావా చేసినప్పుడు ఆయనతోపాటు సాటి కల్పించారు.ఈ మాటలు వేటినైతే వారు అల్లుకున్నారో ఎటువంటి ఆధారం లేకుండా తమ నోళ్ళతో వాటిని పలుకుతున్నారు.మరియు వారు ఈ మాటల్లో తమ కన్న ముందు గతించిన ఆ ముష్రికులను తలపిస్తున్నారు ఎవరైతే నిశ్చయంగా దైవదూతలు అల్లాహ్ కుమార్తెలు అని పలికారో.వీటన్నింటి నుంచి అల్లాహ్ మహోన్నతుడు గొప్పవాడు.అల్లాహ్ వారిని నాశనం చేయుగాక ఎలా వారు స్పష్టమైన సత్యము నుండి అసత్యము వైపునకు మరలించబడుతున్నారు ?.
Arabic explanations of the Qur’an:
اِتَّخَذُوْۤا اَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ اَرْبَابًا مِّنْ دُوْنِ اللّٰهِ وَالْمَسِیْحَ ابْنَ مَرْیَمَ ۚ— وَمَاۤ اُمِرُوْۤا اِلَّا لِیَعْبُدُوْۤا اِلٰهًا وَّاحِدًا ۚ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— سُبْحٰنَهٗ عَمَّا یُشْرِكُوْنَ ۟
యూదులు తమ మతాచారులను,క్రైస్తవులు తమ సన్యాసులను అల్లాహ్ ను వదిలి ప్రభువులుగా చేసుకున్నారు. వారు (మతాచారులు,సన్యాసులు) వారిపై అల్లాహ్ నిషేధించిన వాటిని వారి కొరకు ధర్మ సమ్మతం చేసేవారు,వారి కొరకు అల్లాహ్ ధర్మ సమ్మతం చేసిన వాటిని వారిపై నిషేధించేవారు.మరియు క్రైస్తవులు మర్యం కుమారుడైన మసీహ్ ఈసాను అల్లాహ్ తోపాటు ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. మరియు అల్లాహ్ యూదుల మతాచారులను,క్రైస్తవుల సన్యాసులను,ఉజైరును,మర్యం కుమారుడైన ఈసాను కేవలం తన ఒక్కడినే ఆరాధించమని,తనతో పాటు ఎవరిని సాటి కల్పించవద్దని ఆదేశించాడు. పరిశుద్ధుడైన ఆయన ఒకే ఆరాధ్య దైవము,ఆయన తప్ప సత్య ఆరాధ్య దైవము ఇంకొకరు లేరు. ఆయన సుబహానహు వ తఆలా అతీతుడు. ఈ ముష్రికులందరు,ఇతరులు పలికినట్లు ఆయనకు సాటి ఉండటం నుండి ఆయన పరిశుద్ధుడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• في الآيات دليل على أن تعلق القلب بأسباب الرزق جائز، ولا ينافي التوكل.
మనస్సు యొక్క సంబంధము ఆహారోపాది కారకాలతో ఉండటం ధర్మ సమ్మతం అని,నమ్మకమునకు విరుధ్ధము కాదని ఆయతుల్లో ఆధారమున్నది.

• في الآيات دليل على أن الرزق ليس بالاجتهاد، وإنما هو فضل من الله تعالى تولى قسمته.
ఆహారము శ్రమ ద్వారా కాదు.అది కేవలం మహోన్నతుడైన అల్లాహ్ అనుగ్రహము.దాన్నిపంచి పెట్టటము ఆయన ఆదీనంలో ఉన్నది.

• الجزية واحد من خيارات ثلاثة يعرضها الإسلام على الأعداء، يقصد منها أن يكون الأمر كله للمسلمين بنزع شوكة الكافرين.
ఇస్లాం శతృవులపై ప్రవేశపెట్టే మూడు ఐచ్చికాల్లోంచి జిజియా ఒకటి.అవిశ్వాసపరుల బలాన్ని అణచివేసి పూర్తి వ్యవహారము ముస్లిములకు ఉండటం దాని ఉద్దేశము.

• في اليهود من الخبث والشر ما أوصلهم إلى أن تجرؤوا على الله، وتنقَّصوا من عظمته سبحانه.
యూదుల్లో దుర్మార్గము,చెడు వారు అల్లాహ్ పై ధైర్యం చేయడానికి మరియు పరిశుద్ధుడైన ఆయన గొప్పతనాన్ని తగ్గించటానికి దారితీసింది.

 
Translation of the meanings Surah: At-Tawbah
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close