Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation - Abdurrahim ibn Muhammad * - Translations’ Index

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Translation of the meanings Surah: Al-An‘ām   Ayah:
اِنَّمَا یَسْتَجِیْبُ الَّذِیْنَ یَسْمَعُوْنَ ؔؕ— وَالْمَوْتٰی یَبْعَثُهُمُ اللّٰهُ ثُمَّ اِلَیْهِ یُرْجَعُوْنَ ۟
నిశ్చయంగా, ఎవరైతే (శ్రద్ధతో) వింటారో, వారే (సత్యసందేశాన్ని) స్వీకరిస్తారు. ఇక మృతులు (సత్యతిరస్కారులు) - అల్లాహ్ వారిని పునరుత్థరింప జేసినప్పుడు - (ప్రతిఫలం కొరకు) ఆయన వద్దకే రప్పింపబడతారు.
Arabic explanations of the Qur’an:
وَقَالُوْا لَوْلَا نُزِّلَ عَلَیْهِ اٰیَةٌ مِّنْ رَّبِّهٖ ؕ— قُلْ اِنَّ اللّٰهَ قَادِرٌ عَلٰۤی اَنْ یُّنَزِّلَ اٰیَةً وَّلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟
మరియు వారు: "ఇతనిపై (ప్రవక్తపై) ఇతని ప్రభువు తరఫు నుండి ఏదైనా అద్భుత సూచన ఎందుకు అవతరింప జేయబడలేదు?" అని అంటారు. ఇలా అను: "నిశ్చయంగా, అల్లాహ్! ఎలాంటి అద్భుత సూచననైనా అవతరింప జేయగల శక్తి కలిగి ఉన్నాడు, కాని వారిలో అనేకులకు ఇది తెలియదు."
Arabic explanations of the Qur’an:
وَمَا مِنْ دَآبَّةٍ فِی الْاَرْضِ وَلَا طٰٓىِٕرٍ یَّطِیْرُ بِجَنَاحَیْهِ اِلَّاۤ اُمَمٌ اَمْثَالُكُمْ ؕ— مَا فَرَّطْنَا فِی الْكِتٰبِ مِنْ شَیْءٍ ثُمَّ اِلٰی رَبِّهِمْ یُحْشَرُوْنَ ۟
మరియు భూమిపై సంచరించే ఏ జంతువు గానీ, లేక తన రెండు రెక్కలతో ఎగిరే ఏ పక్షి గానీ, మీలాంటి సంఘజీవులుగా లేకుండా లేవు! మేము గ్రంథంలో ఏ కొరతా చేయలేదు[1]. తరువాత వారందరూ తమ ప్రభువు వద్దకు మరలింపబడతారు.
[1] చూడండి, 16:89.
Arabic explanations of the Qur’an:
وَالَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا صُمٌّ وَّبُكْمٌ فِی الظُّلُمٰتِ ؕ— مَنْ یَّشَاِ اللّٰهُ یُضْلِلْهُ ؕ— وَمَنْ یَّشَاْ یَجْعَلْهُ عَلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟
మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారు, చెవిటివారు మరియు మూగవారు, అంధకారంలో పడిపోయిన వారు! అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు మరియు తాను కోరిన వారిని ఋజుమార్గంలో ఉంచుతాడు.[1]
[1] చూడండి, 2:26, 4:88, 143. అల్లాహుతా'ఆలా వారినే మార్గభ్రష్టులు చేస్తాడు, ఎవరైతే - విచక్షణా శక్తి మరియు తెలివి ఉండి కూడా - సత్యాన్ని తెలుసుకొని దానిపై అమలు పరచటానికి ప్రయత్నం చేయరో! సత్యం తెలిసినా దానిని నమ్మరో! అల్లాహ్ (సు.తా.) ఎవ్వరినీ కూడా బలవంతంగా మార్గభ్రష్టత్వంలో పడవేయడు. కాని షైతాన్ ఎల్లప్పుడూ మానవుణ్ణి మార్గభ్రష్టత్వం వైపుకు ఆహ్వానిస్తుంటాడు.
Arabic explanations of the Qur’an:
قُلْ اَرَءَیْتَكُمْ اِنْ اَتٰىكُمْ عَذَابُ اللّٰهِ اَوْ اَتَتْكُمُ السَّاعَةُ اَغَیْرَ اللّٰهِ تَدْعُوْنَ ۚ— اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
వారితో అను: "ఏమీ? మీరు సత్యవంతులే అయితే ఆలోచించి (చెప్పండి!) ఒకవేళ మీపై అల్లాహ్ శిక్ష వచ్చి పడినా, లేదా అంతిమ ఘడియ వచ్చినా! మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఎవరినైనా పిలుస్తారా?
Arabic explanations of the Qur’an:
بَلْ اِیَّاهُ تَدْعُوْنَ فَیَكْشِفُ مَا تَدْعُوْنَ اِلَیْهِ اِنْ شَآءَ وَتَنْسَوْنَ مَا تُشْرِكُوْنَ ۟۠
"అలా కానేరదు! మీరు ఆయన (అల్లాహ్) నే పిలుస్తారు. ఆయన కోరితే ఆ ఆపదను మీ పై నుండి తొలగిస్తాడు. అప్పుడు మీరు ఆయనకు సాటి కల్పించే వారిని మరచిపోతారు!"
Arabic explanations of the Qur’an:
وَلَقَدْ اَرْسَلْنَاۤ اِلٰۤی اُمَمٍ مِّنْ قَبْلِكَ فَاَخَذْنٰهُمْ بِالْبَاْسَآءِ وَالضَّرَّآءِ لَعَلَّهُمْ یَتَضَرَّعُوْنَ ۟
మరియు వాస్తవానికి మేము, నీకు పూర్వం (ఓ ముహమ్మద్!) అనేక జాతుల వారి వద్దకు ప్రవక్తలను పంపాము. ఆ పిదప వారు వినమ్రులవటానికి మేము వారిపై ఇబ్బందులను మరియు కష్టాలను కలుగ జేశాము.
Arabic explanations of the Qur’an:
فَلَوْلَاۤ اِذْ جَآءَهُمْ بَاْسُنَا تَضَرَّعُوْا وَلٰكِنْ قَسَتْ قُلُوْبُهُمْ وَزَیَّنَ لَهُمُ الشَّیْطٰنُ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
పిదప మా తరఫు నుండి వారిపై ఆపద వచ్చినపుడు కూడా వారెందుకు వినమ్రులు కాలేదు? కాని వారి హృదయాలు మరింత కఠినమయ్యాయి మరియు షైతాన్ వారు చేసే కర్మలన్నింటినీ వారికి మంచివిగా కనబడేటట్లు చేశాడు.
Arabic explanations of the Qur’an:
فَلَمَّا نَسُوْا مَا ذُكِّرُوْا بِهٖ فَتَحْنَا عَلَیْهِمْ اَبْوَابَ كُلِّ شَیْءٍ ؕ— حَتّٰۤی اِذَا فَرِحُوْا بِمَاۤ اُوْتُوْۤا اَخَذْنٰهُمْ بَغْتَةً فَاِذَا هُمْ مُّبْلِسُوْنَ ۟
ఆ పిదప వారికి చేయబడిన బోధనను వారు మరచిపోగా, మేము వారి కొరకు సకల (భోగభాగ్యాల) ద్వారాలను తెరిచాము, చివరకు వారు తమకు ప్రసాదించబడిన ఆనందాలలో నిమగ్నులై ఉండగా, మేము వారిని ఆకస్మాత్తుగా (శిక్షించటానికి) పట్టు కున్నాము, అప్పుడు వారు నిరాశులయ్యారు.
Arabic explanations of the Qur’an:
 
Translation of the meanings Surah: Al-An‘ām
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation - Abdurrahim ibn Muhammad - Translations’ Index

Translated by Abdurrahim ibn Muhammad

close