Traducción de los significados del Sagrado Corán - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Índice de traducciones


Traducción de significados Capítulo: Sura Taa, Haa   Versículo:

సూరహ్ తహా

Propósitos del Capítulo:
السعادة باتباع هدى القرآن وحمل رسالته، والشقاء بمخالفته.
ఖర్ఆన్ యొక్క మార్గదర్శకత్వాన్ని అనుసరించడం దాని సందేశమును ఆచరించడం వలన ఆనందం కలుగును మరియు దాన్ని విబేధించడం వలన దుఃఖము కలుగును.

طٰهٰ ۟
(طه) తా-హా! సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
Las Exégesis Árabes:
مَاۤ اَنْزَلْنَا عَلَیْكَ الْقُرْاٰنَ لِتَشْقٰۤی ۟ۙ
ఓ ప్రవక్తా మీపై విశ్వాసము కనబరచటం నుండి మీ జాతి వారు విముఖత చూపటంపై మీ మనస్సును చింతనలో పడవేయటములో కారణమవటానికి మేము ఖుర్ఆన్ ను మీపై అవతరింపజేయలేదు.
Las Exégesis Árabes:
اِلَّا تَذْكِرَةً لِّمَنْ یَّخْشٰی ۟ۙ
అల్లాహ్ తన నుండి భయపడటం కొరకు ఎవరిని అనుగ్రహించాడో వారికి హితోపదేశం కావటానికి మాత్రమే మేము దాన్ని అవతరింపజేశాము.
Las Exégesis Árabes:
تَنْزِیْلًا مِّمَّنْ خَلَقَ الْاَرْضَ وَالسَّمٰوٰتِ الْعُلٰی ۟ؕ
భూమిని సృష్టించిన,ఎత్తైన ఆకాశములను సృష్టించినటువంటి అల్లాహ్ దాన్ని అవతరింపజేశాడు. అది గొప్పదైనటువంటి ఖర్ఆన్ ఎందుకంటే అది గొప్పవాడి వద్ద నుండి అవరింపజేయబడినది.
Las Exégesis Árabes:
اَلرَّحْمٰنُ عَلَی الْعَرْشِ اسْتَوٰی ۟
అనంత కరుణామయుడు సింహాసనం పై ఆశీనుడైనాడు. సర్వ శక్తిమంతుడైన,పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన అతనికి ఇది తగినది.
Las Exégesis Árabes:
لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ وَمَا بَیْنَهُمَا وَمَا تَحْتَ الثَّرٰی ۟
ఆకాశములలో ఉన్న,భూమిలో ఉన్న,మట్టి క్రింద ఉన్న సృష్టితాలన్ని సృష్టిపరంగా,అధికారపరంగా,పర్యాలోచన పరంగా పరిశుద్ధుడైన ఆయన ఒక్కడి కొరకే.
Las Exégesis Árabes:
وَاِنْ تَجْهَرْ بِالْقَوْلِ فَاِنَّهٗ یَعْلَمُ السِّرَّ وَاَخْفٰی ۟
ఓ ప్రవక్త ఒక వేళ మీరు బిగ్గరగా మాట్లాడినా లేదా నెమ్మదిగా మాట్లాడినా నిశ్ఛయంగా పరిశుద్ధుడైన ఆయనకు అవన్ని తెలుసు. ఆయనకు రహస్యము,ఇంకా రహస్యము కన్న దాగి ఉన్న మనస్సులో కలిగే ఆలోచనలు సైతం ఆయనకు తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Las Exégesis Árabes:
اَللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— لَهُ الْاَسْمَآءُ الْحُسْنٰی ۟
అల్లాహ్ ఆయన తప్ప వేరే వాస్తవ ఆరాధ్య దైవం లేడు.అందములో పరిపూర్ణతకు చేరిన పేర్లు ఆయన ఒక్కడికే కలవు.
Las Exégesis Árabes:
وَهَلْ اَتٰىكَ حَدِیْثُ مُوْسٰی ۟ۘ
ఓ ప్రవక్తా ఇమ్రాన్ కుమారుడైన మూసా అలైహిస్సలాం సమాచారము మీకు చేరినది.
Las Exégesis Árabes:
اِذْ رَاٰ نَارًا فَقَالَ لِاَهْلِهِ امْكُثُوْۤا اِنِّیْۤ اٰنَسْتُ نَارًا لَّعَلِّیْۤ اٰتِیْكُمْ مِّنْهَا بِقَبَسٍ اَوْ اَجِدُ عَلَی النَّارِ هُدًی ۟
ఆయన తన ప్రయాణములో ఒక మంటను చూసినప్పుడు తన ఇంటివారితో ఇలా పలికారు : మీరు మీ ఈ చోటే ఆగండి.నిశ్ఛయంగా నేను ఒక మంటను చూశాను . బహుశా నేను ఈ మంట నుండి మీ వద్దకు ఒక కొరివిని తీసుకుని వస్తాను లేదా నాకు మార్గమును చూపేవాడిని నేను పొందుతాను.
Las Exégesis Árabes:
فَلَمَّاۤ اَتٰىهَا نُوْدِیَ یٰمُوْسٰی ۟ؕ
ఎప్పుడైతే ఆయన మంట దగ్గరకు వచ్చారో పరిశుద్ధుడైన అల్లాహ్ తన మాట ద్వారా ఆయనను ఇలా పిలిచాడు : ఓ మూసా.
Las Exégesis Árabes:
اِنِّیْۤ اَنَا رَبُّكَ فَاخْلَعْ نَعْلَیْكَ ۚ— اِنَّكَ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًی ۟ؕ
నిశ్ఛయంగా నేనే మీ ప్రభువును. అయితే మీరు నా ప్రార్ధన కోసం మీ చెప్పులను విడవండి. నిశ్ఛయంగా మీరు పవిత్రమైన లోయలో (తువా) ఉన్నారు.
Las Exégesis Árabes:
Beneficios de los versículos de esta página:
• ليس إنزال القرآن العظيم لإتعاب النفس في العبادة، وإذاقتها المشقة الفادحة، وإنما هو كتاب تذكرة ينتفع به الذين يخشون ربهم.
గొప్ప ఖుర్ఆన్ యొక్క అవతరణ ఆరాధనలో మనస్సును అలసటకు గురి చేయటానికి,దానికి అపార కష్టమును కలిగించటానికి కాదు. అది ఒక హితోపదేశ గ్రంధం మాత్రమే దాని ద్వారా తమ ప్రభువుతో భయపడేవారు ప్రయోజనం చెందుతారు.

• قَرَن الله بين الخلق والأمر، فكما أن الخلق لا يخرج عن الحكمة؛ فكذلك لا يأمر ولا ينهى إلا بما هو عدل وحكمة.
అల్లాహ్ సృష్టికి,ఆదేశమునకి మధ్య జత కలపాడు.సృష్టి జ్ఞానము నుండి వైదొలగనట్లే అలాగే ఆయన న్యాయపూరితముగా,జ్ఞాన పూరితముగా ఉంటే తప్ప ఆదేశించడు,వారించడు.

• على الزوج واجب الإنفاق على الأهل (المرأة) من غذاء وكساء ومسكن ووسائل تدفئة وقت البرد.
ఇంటి వారిపై (భార్యపై) ఆహారము,బట్టలు,నివాసము,చలికాలములో వేడిని కలిగించే కారకాల్లో ఖర్చు చేయటం భర్త బాధ్యత.

وَاَنَا اخْتَرْتُكَ فَاسْتَمِعْ لِمَا یُوْحٰی ۟
ఓ మూసా నేను నా సందేశములను చేరవేయటానికి నిన్ను ఎంచుకున్నాను కాబట్టి నీ వైపు నేను దైవ వాణి రూపంలో అవతరింపజేసిన దాన్ని విను.
Las Exégesis Árabes:
اِنَّنِیْۤ اَنَا اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّاۤ اَنَا فَاعْبُدْنِیْ ۙ— وَاَقِمِ الصَّلٰوةَ لِذِكْرِیْ ۟
నిశ్ఛయంగా నేనే అల్లాహ్ ని,నేను తప్ప ఇంకెవరూ వాస్తవ ఆరాధ్య దైవం లేడు. అటువంటప్పుడు నీవు నా ఒక్కడినే ఆరాధించు మరియు నమాజును పరిపూర్ణ పద్దతిలో అందులో నీవు నన్ను స్మరించటానికి పాటించు.
Las Exégesis Árabes:
اِنَّ السَّاعَةَ اٰتِیَةٌ اَكَادُ اُخْفِیْهَا لِتُجْزٰی كُلُّ نَفْسٍ بِمَا تَسْعٰی ۟
నిశ్ఛయంగా ప్రళయం ఖచ్చితంగా వస్తుంది, వాటిల్లుతుంది. దాదాపు నేను దాన్ని దాచి ఉంచుతాను అప్పుడు దాని సమయము గురించి ఏ సృష్టికి తెలియదు. కాని ప్రతీ వ్యక్తి తాను చేసిన కర్మ అది మంచిదైన గాని చెడ్డదైనా గాని దాని ప్రతిఫలం ఇవ్వబడడానికి వారికి దైవ ప్రవక్త తెలియపరచటం ద్వారా వారు దాని సూచనలను తెలుసుకుంటారు.
Las Exégesis Árabes:
فَلَا یَصُدَّنَّكَ عَنْهَا مَنْ لَّا یُؤْمِنُ بِهَا وَاتَّبَعَ هَوٰىهُ فَتَرْدٰی ۟
అయితే అవిశ్వాసపరుల్లోంచి దాన్ని విశ్వసించకుండా తన మనసు కోరిన నిషిధ్ధ వాటి వెనుక పడిపోయిన వాడు నిన్ను దాన్ని విశ్వసించి దాని కొరకు సత్కర్మ ద్వారా సిద్ధం అవటం నుండి మరలించకూడదు. దాని కారణం చేత నీవు వినాశనమునకు గురి అవుతావు.
Las Exégesis Árabes:
وَمَا تِلْكَ بِیَمِیْنِكَ یٰمُوْسٰی ۟
మరియు ఓ మూసా నీ కుడి చేతిలో ఉన్నది అది ఏమిటి ?.
Las Exégesis Árabes:
قَالَ هِیَ عَصَایَ ۚ— اَتَوَكَّؤُا عَلَیْهَا وَاَهُشُّ بِهَا عَلٰی غَنَمِیْ وَلِیَ فِیْهَا مَاٰرِبُ اُخْرٰی ۟
మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : ఇది నా చేతి కర్ర .నేను నడిచే సమయంలో దాని సహకారం తీసుకుంటాను,దానితో చెట్టును దాని ఆకులు నా మేకలపై రాలటానికి వేగంగా గుంజుతాను,నేను ప్రస్తావించని ప్రయోజనాలు అందులో ఇంకా ఉన్నాయి.
Las Exégesis Árabes:
قَالَ اَلْقِهَا یٰمُوْسٰی ۟
ఆల్లాహ్ ఇలా పలికాడు : ఓ మూసా మీరు దానిని పడవేయండి.
Las Exégesis Árabes:
فَاَلْقٰىهَا فَاِذَا هِیَ حَیَّةٌ تَسْعٰی ۟
అప్పుడు మూసా దాన్ని పడవేశారు. అప్పుడు అది పాముగా మారి వేగముగా,తేలికగా చలించసాగింది.
Las Exégesis Árabes:
قَالَ خُذْهَا وَلَا تَخَفْ ۫— سَنُعِیْدُهَا سِیْرَتَهَا الْاُوْلٰی ۟
అల్లాహ్ మూసా అలైహిస్సలాంతో ఇలా పలికాడు : మీరు చేతి కర్రను తీసుకోండి అది పాముగా మారటమును చూసి భయపడకండి. మీరు దాన్ని తీసుకున్నప్పుడు మేము దాని మొదటి స్థితిలోకి మరలింపజేస్తాము.
Las Exégesis Árabes:
وَاضْمُمْ یَدَكَ اِلٰی جَنَاحِكَ تَخْرُجْ بَیْضَآءَ مِنْ غَیْرِ سُوْٓءٍ اٰیَةً اُخْرٰی ۟ۙ
మరియు మీ చేతిని మీ ప్రక్క వైపు (చంకలో) నొక్కిపెట్టు అది బొల్లి లేకుండా తెల్లగా మారి బయటకు వస్తుంది. అది నీ కొరకు రెండవ సూచన.
Las Exégesis Árabes:
لِنُرِیَكَ مِنْ اٰیٰتِنَا الْكُبْرٰی ۟ۚ
ఓ మూసా మేము మీకు మా సామర్ధ్యమును సూచించే ,మీరు అల్లాహ్ వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని సూచించే మా పెద్ద సూచనలను చూపించటానికి ఈ రెండు సూచనలను మీకు చూపించాము.
Las Exégesis Árabes:
اِذْهَبْ اِلٰی فِرْعَوْنَ اِنَّهٗ طَغٰی ۟۠
ఓ మూసా మీరు ఫిర్ఔన్ వద్దకు వెళ్ళండి .ఎందుకంటే అతడు అవిశ్వాసములో,అల్లాహ్ పై తిరుగుబాటులో హద్దు మీరిపోయాడు.
Las Exégesis Árabes:
قَالَ رَبِّ اشْرَحْ لِیْ صَدْرِیْ ۟ۙ
మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : ఓ నా ప్రభువా నేను బాధను భరించటానికి నా హృదయమును నా కొరకు వికసింపచేయి.
Las Exégesis Árabes:
وَیَسِّرْ لِیْۤ اَمْرِیْ ۟ۙ
మరియు నా కొరకు నా వ్యవహారమును సులభతరం చేయి.
Las Exégesis Árabes:
وَاحْلُلْ عُقْدَةً مِّنْ لِّسَانِیْ ۟ۙ
మరియు నాకు స్పష్టమైన మాట మాట్లాడే సామర్ధ్యమును ప్రసాధించు.
Las Exégesis Árabes:
یَفْقَهُوْا قَوْلِیْ ۪۟
వారికి నేను నీ సందేశమును చేరవేసినప్పుడు వారు నా మాటలను అర్ధం చేసుకోవటానికి.
Las Exégesis Árabes:
وَاجْعَلْ لِّیْ وَزِیْرًا مِّنْ اَهْلِیْ ۟ۙ
మరియు నా ఇంటి వారిలోంచి నా వ్యవహారముల్లో నాకు సహాయపడే ఒక సహాయకుడిని నియమించు.
Las Exégesis Árabes:
هٰرُوْنَ اَخِی ۟ۙ
నా సోదరుడైన ఇమ్రాన్ కొడుకైన హారూన్ ను.
Las Exégesis Árabes:
اشْدُدْ بِهٖۤ اَزْرِیْ ۟ۙ
అతని ద్వారా నా వీపును బలోపేతం చేయి.
Las Exégesis Árabes:
وَاَشْرِكْهُ فِیْۤ اَمْرِیْ ۟ۙ
మరియు సందేశమును చేరవేసే విషయంలో నీవు అతడిని నాకు భాగస్వామిగా చేయి.
Las Exégesis Árabes:
كَیْ نُسَبِّحَكَ كَثِیْرًا ۟ۙ
మేము నీ పవిత్రతను ఎక్కువగా కొనియాడటానికి.
Las Exégesis Árabes:
وَّنَذْكُرَكَ كَثِیْرًا ۟ؕ
మరియు మేము నీ స్మరణను అధికంగా చేయటానికి.
Las Exégesis Árabes:
اِنَّكَ كُنْتَ بِنَا بَصِیْرًا ۟
నిశ్ఛయంగా నీవు మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటావు. మా వ్యవహారములోంచి ఏదీ నీపై గోప్యంగా ఉండదు.
Las Exégesis Árabes:
قَالَ قَدْ اُوْتِیْتَ سُؤْلَكَ یٰمُوْسٰی ۟
అల్లాహ్ ఇలా పలికాడు : ఓ మూసా నిశ్ఛయంగా మేము నీవు కోరినదంతా నీకు ప్రసాధించాము.
Las Exégesis Árabes:
وَلَقَدْ مَنَنَّا عَلَیْكَ مَرَّةً اُخْرٰۤی ۟ۙ
మరియు నిశ్ఛయంగా మేము నీపై మరోకసారి అనుగ్రహించాము.
Las Exégesis Árabes:
Beneficios de los versículos de esta página:
• وجوب حسن الاستماع في الأمور المهمة، وأهمها الوحي المنزل من عند الله.
ముఖ్యమైన విషయాలను మంచిగా వినటం తప్పనిసరి, అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన దైవవాణి వాటిలో ముఖ్యమైనది.

• اشتمل أول الوحي إلى موسى على أصلين في العقيدة وهما: الإقرار بتوحيد الله، والإيمان بالساعة (القيامة)، وعلى أهم فريضة بعد الإيمان وهي الصلاة.
మూసా అలైహిస్సలాం పై అవతరించిన దైవ వాణి విశ్వాసములోని రెండు మూలాలను కలిగి ఉన్నది అవి : అల్లాహ్ ఏకత్వమును (తౌహీద్) అంగీకరించటం,ప్రళయం పై విశ్వాసమును కలిగి ఉండటం.విశ్వాసము తరువాత ముఖ్య విధి ఏమిటంటే అది నమాజు.

• التعاون بين الدعاة ضروري لإنجاح المقصود؛ فقد جعل الله لموسى أخاه هارون نبيَّا ليعاونه في أداء الرسالة.
ఉద్దేశించిన దాన్ని విజయం చేకూర్చటానికి సందేశ ప్రచారకుల మధ్య సహకారము అవసరం. అల్లాహ్ మూసా కొరకు అతని సోదరుడు హారూన్ ను దైవదౌత్యమును నెరవేర్చే విషయంలో ఆయనకు సహాయం చేయటానికి ప్రవక్తగా చేశాడు.

• أهمية امتلاك الداعية لمهارة الإفهام للمدعوِّين.
ఆహ్వానితులను అర్ధం చేసుకునే నైపుణ్యం కల సందేశ ప్రచారకుని ప్రాముఖ్యత.

اِذْ اَوْحَیْنَاۤ اِلٰۤی اُمِّكَ مَا یُوْحٰۤی ۟ۙ
మేము నీ తల్లికి సూచన ఇచ్చినప్పుడు ఇచ్చిన సూచన అల్లాహ్ దాని ద్వారా నిన్ను ఫిర్ఔన్ కుట్ర నుండి రక్షించాడు.
Las Exégesis Árabes:
اَنِ اقْذِفِیْهِ فِی التَّابُوْتِ فَاقْذِفِیْهِ فِی الْیَمِّ فَلْیُلْقِهِ الْیَمُّ بِالسَّاحِلِ یَاْخُذْهُ عَدُوٌّ لِّیْ وَعَدُوٌّ لَّهٗ ؕ— وَاَلْقَیْتُ عَلَیْكَ مَحَبَّةً مِّنِّیْ ۚ۬— وَلِتُصْنَعَ عَلٰی عَیْنِیْ ۟ۘ
నిశ్ఛయంగా మేము ఆమెకు సూచించినప్పుడు ఇలా ఆదేశించాము : నీవు అతడు జన్మించిన తరువాత అతడిని ఒక పెట్టిలో వేసి,పెట్టెను సముద్రంలో పడవేయి. అప్పుడు సముద్రం దాన్ని మా ఆదేశముతో ఒడ్డున పడవేస్తుంది. ఆ తరువాత నాకు,అతనుకు శతృవైన ఫిర్ఔన్ అతడిని ఎత్తుకుంటాడు. మరియు నేను నా తరపు నుండి నీపై ప్రేమను కురిపించాను. అప్పుడు ప్రజలు నిన్ను ఇష్టపడ్డారు మరియు నిన్ను నా కళ్ళ ముందు,నా సంరక్షణలో,నా పర్యవేక్షణలో పోషించటానికి.
Las Exégesis Árabes:
اِذْ تَمْشِیْۤ اُخْتُكَ فَتَقُوْلُ هَلْ اَدُلُّكُمْ عَلٰی مَنْ یَّكْفُلُهٗ ؕ— فَرَجَعْنٰكَ اِلٰۤی اُمِّكَ كَیْ تَقَرَّ عَیْنُهَا وَلَا تَحْزَنَ ؕ۬— وَقَتَلْتَ نَفْسًا فَنَجَّیْنٰكَ مِنَ الْغَمِّ وَفَتَنّٰكَ فُتُوْنًا ۫۬— فَلَبِثْتَ سِنِیْنَ فِیْۤ اَهْلِ مَدْیَنَ ۙ۬— ثُمَّ جِئْتَ عَلٰی قَدَرٍ یّٰمُوْسٰی ۟
నీ సోదరి నడుస్తూ బయలదేరినప్పుడు పెట్టె నడిచినప్పుడల్లా ఆమె దానిని అనుసరించసాగింది. అయితే దాన్ని తీసుకున్న వారితో ఆమె ఇలా పలికింది : అతడిని పరి రక్షించే,పాలు త్రాపించే,పోషించే వారిని నేను మీకు తెలియపరచనా ?. అప్పుడు మేము నిన్ను నీ తల్లి వద్దకు చేర్చి ఆమె వద్దకు నీవు చేరటం వలన ఆమె సంతోషపడటానికి,నీ వలన ఆమె దుఃఖించకుండా ఉండటానికి నీపై ఉపకారము చేశాము. మరియు నీవు పిడికిలి గుద్ది ఖిబ్తీని హతమార్చావు. అయితే మేము శిక్ష నుండి నిన్ను కాపాడటం ద్వారా నీపై ఉపకారం చేశాము. నీవు ఎదుర్కున్న ప్రతీ పరీక్ష నుండి ఒక దాని తరువాత ఒకటి నుండి నిన్ను మేము విముక్తిని కలిగించాము. అప్పుడు నీవు బయలుదేరి వెళ్ళి,మద్యన్ వాసుల్లో కొన్ని సంవత్సరములు నివాసమున్నావు. ఆ తరువాత ఓ మూసా నీతో మాట్లాడటానికి నీవు రావటానికి నీ కొరకు నిర్ణయించబడిన సమయంలో నీవు వచ్చావు.
Las Exégesis Árabes:
وَاصْطَنَعْتُكَ لِنَفْسِیْ ۟ۚ
మరియు నీ వైపు నేను అవతరింపజేసిన దైవవాణిని ప్రజలకు చేరవేసే ప్రవక్తగా నా వద్ద నుండి నేను నిన్ను ఎంచుకున్నాను.
Las Exégesis Árabes:
اِذْهَبْ اَنْتَ وَاَخُوْكَ بِاٰیٰتِیْ وَلَا تَنِیَا فِیْ ذِكْرِیْ ۟ۚ
ఓ మూసా నీవు,నీ సోదరుడు హారూన్ అల్లాహ్ సామర్ధ్యంపై,ఆయన ఏకత్వముపై సూచించే మా సూచనలను తీసుకుని వెళ్ళండి.మరియు మీరిద్దరు నా వైపు పిలవటం నుండి,నన్ను స్మరించటం నుండి బలహీనపడకండి.
Las Exégesis Árabes:
اِذْهَبَاۤ اِلٰی فِرْعَوْنَ اِنَّهٗ طَغٰی ۟ۚۖ
ఓ మూసా మీరు ఫిర్ఔన్ వద్దకు వెళ్ళండి . ఎందుకంటే అతడు అవిశ్వాసములో,అల్లాహ్ పై తిరుగుబాటులో హద్దు మీరిపోయాడు.
Las Exégesis Árabes:
فَقُوْلَا لَهٗ قَوْلًا لَّیِّنًا لَّعَلَّهٗ یَتَذَكَّرُ اَوْ یَخْشٰی ۟
అయితే మీరిద్దరు అతనితో ఎటువంటి కఠినత్వంలేని మృధువైన మాటను అతడు హితోపదేశం గ్రహించి,అల్లాహ్ కి భయపడి పశ్చాత్తాప్పడతాడని ఆశిస్తూ పలకండి.
Las Exégesis Árabes:
قَالَا رَبَّنَاۤ اِنَّنَا نَخَافُ اَنْ یَّفْرُطَ عَلَیْنَاۤ اَوْ اَنْ یَّطْغٰی ۟
మూసా మరియు హారూన్ అలైహిమస్సలాం ఇలా పలికారు : అతనికి దావత్ ఇవ్వటం పూర్తి కాక ముందే శిక్షించటంలో తొందర చేస్తాడని లేదా హతమార్చటం ద్వారా లేదా ఇతర వాటి ద్వారా మాపై హింసకు పాల్పడటంలో అతడు హద్దు మీరుతాడని మేము భయపడుతున్నాము.
Las Exégesis Árabes:
قَالَ لَا تَخَافَاۤ اِنَّنِیْ مَعَكُمَاۤ اَسْمَعُ وَاَرٰی ۟
అల్లాహ్ వారిద్దరితో ఇలా పలికాడు : మీరిద్దరు భయపడకండి. నిశ్ఛయంగా నేను సహాయము ద్వారా,మద్దతు ద్వారా మీకు తోడుగా ఉంటాను. మరియు మీకు,అతడికి మధ్య సంభవించేది వింటాను,చూస్తాను.
Las Exégesis Árabes:
فَاْتِیٰهُ فَقُوْلَاۤ اِنَّا رَسُوْلَا رَبِّكَ فَاَرْسِلْ مَعَنَا بَنِیْۤ اِسْرَآءِیْلَ ۙ۬— وَلَا تُعَذِّبْهُمْ ؕ— قَدْ جِئْنٰكَ بِاٰیَةٍ مِّنْ رَّبِّكَ ؕ— وَالسَّلٰمُ عَلٰی مَنِ اتَّبَعَ الْهُدٰی ۟
అయితే వారిద్దరు అతని వద్దకు వచ్చి అతనితో ఇలా పలికారు : ఓ ఫిర్ఔన్ నిశ్చయంగా మేమిద్దరం నీ ప్రభువు యొక్క ప్రవక్తలము. అయితే నీవు మాతోపాటు ఇస్రాయీలు సంతతివారిని పంపించు. వారి మగ సంతానమును హతమార్చి వారి స్త్రీలను జీవించి ఉండేటట్లు వదిలి వారిని శిక్షించకు. నిశ్ఛయంగా మేము నీ వద్దకు నీ ప్రభువు వద్ద నుండి మా నిజాయితీపై ఆధారమును తీసుకుని వచ్చాము. మరియు విశ్వసించి అల్లాహ్ మార్గమును అనుసరించే వారికి అల్లాహ్ శిక్ష నుండి రక్షణ ఉన్నది.
Las Exégesis Árabes:
اِنَّا قَدْ اُوْحِیَ اِلَیْنَاۤ اَنَّ الْعَذَابَ عَلٰی مَنْ كَذَّبَ وَتَوَلّٰی ۟
నిశ్చయంగా అల్లాహ్ సూచనలను తిరస్కరించి,దైవ ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటి గురించి విముఖత చూపే వారిపై ఇహలోకములో,పరలోకమలో శిక్ష ఉన్నదని అల్లాహ్ దైవ వాణి ద్వారా తెలియపరచాడు.
Las Exégesis Árabes:
قَالَ فَمَنْ رَّبُّكُمَا یٰمُوْسٰی ۟
ఫిర్ఔన్ వారిద్దరు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరిస్తూ ఇలా పలికాడు : ఓ మూసా మిమ్మల్నిద్దరిని నా వద్దకు ప్రవక్తగా పంపించాడని మీరు వాదిస్తున్న మీ ఇద్దరి ప్రభువు ఎవడు ?.
Las Exégesis Árabes:
قَالَ رَبُّنَا الَّذِیْۤ اَعْطٰی كُلَّ شَیْءٍ خَلْقَهٗ ثُمَّ هَدٰی ۟
మూసా ఇలా పలికారు : మా ప్రభువు అతడే ఎవడైతే ప్రతీ వస్తువుకు దానికి సరిఅగు రూపమును,ఆకారమును ప్రసాధించి ఆ తరువాత సృష్టితాలన్నింటిని దేని కొరకైతే సృష్టించాడో దాని మార్గదర్శకం చేశాడు.
Las Exégesis Árabes:
قَالَ فَمَا بَالُ الْقُرُوْنِ الْاُوْلٰی ۟
ఫిర్ఔన్ ఇలా అడిగాడు : అయితే అవిశ్వాసంపై ఉండే పూర్వపు సమాజాల సంగతేమిటి ?.
Las Exégesis Árabes:
Beneficios de los versículos de esta página:
• كمال اعتناء الله بكليمه موسى عليه السلام والأنبياء والرسل، ولورثتهم نصيب من هذا الاعتناء على حسب أحوالهم مع الله.
అల్లాహ్ యొక్క పరిరక్షణ పరిపూర్ణత తనచే మాట్లాడబడిన మూసా అలైహిస్సలాంనకు,సందేశహరులకు,ప్రవక్తలకు ఉంటుంది. ఈ పరిరక్షణలోంచి కొంత భాగము వారి వారసుల కొరకు అల్లాహ్ తో వారి స్థితిగతులను బట్టి ఉంటుంది.

• من الهداية العامة للمخلوقات أن تجد كل مخلوق يسعى لما خلق له من المنافع، وفي دفع المضار عن نفسه.
సృష్టితాల కొరకు సాధారణ మార్గ దర్శకములో నుండి ప్రతీ జీవి ఏ ప్రయోజనాల కొరకు సృష్టించబడినదో దాని కొరకు ప్రయత్నిస్తుండగా ఆ ప్రయోజనాలను పొందటం మరియు తనపై వచ్చే నష్టములను స్వయంగా తొలగించటం.

• بيان فضيلة الأمر بالمعروف والنهي عن المنكر، وأن ذلك يكون باللين من القول لمن معه القوة، وضُمِنَت له العصمة.
మంచి గురించి ఆదేశించటం,చెడు నుండి వారించటం యొక్క ప్రాముఖ్యత మరియు ఇది అధికారము ఉన్న వారికి మృదువుగా మాట్లాడటం ద్వారా జరుగును. మరియు అతని కొరకు రక్షణ హామి ఇవ్వబడుతుంది.

• الله هو المختص بعلم الغيب في الماضي والحاضر والمستقبل.
అల్లాహ్ గతించిన,జరుగుతున్న,జరగబోయే విషయాల్లో అగోచర జ్ఞానమునకు ప్రత్యేకుడు.

قَالَ عِلْمُهَا عِنْدَ رَبِّیْ فِیْ كِتٰبٍ ۚ— لَا یَضِلُّ رَبِّیْ وَلَا یَنْسَی ۟ؗ
మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ కు ఇలా సమాధానమిచ్చారు : ఈ సమాజాల వారు దేనిపైనైతే ఉన్నారో దాని జ్ఞానము నా ప్రభువు వద్ద లౌహె మహ్ఫూజ్ లో వ్రాయబడి ఉన్నది. దాని జ్ఞానం విషయంలో నా ప్రభువు పొరబడడు,దానిలో నుండి ఏదైతే తెలుసుకున్నాడో దాన్ని మరవడు.
Las Exégesis Árabes:
الَّذِیْ جَعَلَ لَكُمُ الْاَرْضَ مَهْدًا وَّسَلَكَ لَكُمْ فِیْهَا سُبُلًا وَّاَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً ؕ— فَاَخْرَجْنَا بِهٖۤ اَزْوَاجًا مِّنْ نَّبَاتٍ شَتّٰی ۟
నా ఆ ప్రభువు వద్ద ఎవరైతే మీ కొరకు భూమిని దానిపై జీవనం కొరకు చదునుగా చేశాడో . మరియు అందులో మీ కొరకు దానిపై నడవటానికి సరైన మార్గములను ఏర్పాటు చేశాడు. మరియు ఆకాశము నుండి వర్షపు నీటిని కురిపించాడు. అప్పుడు మేము ఆ నీటి ద్వారా రకరకాల వేరు వేరు మొక్కలను వెలికితీశాము.
Las Exégesis Árabes:
كُلُوْا وَارْعَوْا اَنْعَامَكُمْ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّاُولِی النُّهٰی ۟۠
ఓ ప్రజలారా మేము మీ కొరకు వెలికితీసిన శుద్ధమైన వాటిలోంచి తినండి మరియు మీ పశువులకు మేపించండి,నిశ్చయంగా ఈ ప్రస్తావించబడిన అనుగ్రహాలలో బుద్ధిమంతుల కొరకు అల్లాహ్ సామర్ధ్యం పై,ఆయన ఏకత్వంపై సూచనలు కలవు.
Las Exégesis Árabes:
مِنْهَا خَلَقْنٰكُمْ وَفِیْهَا نُعِیْدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً اُخْرٰی ۟
భూమి మట్టి నుండి మేము మీ తండ్రి అయిన ఆదమ్ అలైహిస్సలాంను సృష్టించాము. మరియు మీరు మరణించినప్పుడు అందులోనే మేము పూడ్చటం ద్వారా మిమ్మల్ని మరలింపజేస్తాము. మరియు మేము ప్రళయదినాన మరణాంతరం లేపటం కొరకు రెండవసారి మిమ్మల్ని దాని నుండి వెలికితీస్తాము.
Las Exégesis Árabes:
وَلَقَدْ اَرَیْنٰهُ اٰیٰتِنَا كُلَّهَا فَكَذَّبَ وَاَبٰی ۟
మరియు నిశ్చయంగా మేము ఫిర్ఔన్ కొరకు మా తొమ్మిది సూచలన్నింటిని బహిరంగపరచాము. మరియు అతడు వాటిని చూసి తిరస్కరించాడు. మరియు అతడు అల్లాహ్ పై విశ్వాసము కనబరచటమును స్వీకరించటం నుండి ఆగిపోయాడు.
Las Exégesis Árabes:
قَالَ اَجِئْتَنَا لِتُخْرِجَنَا مِنْ اَرْضِنَا بِسِحْرِكَ یٰمُوْسٰی ۟
ఫిర్ఔన్ ఇలా పలికాడు : ఓ మూసా నీవు తీసుకుని వచ్చిన మంత్రజాలము ద్వారా నీవు మమ్మల్ని మిసర్ నుండి వెళ్ళగొట్టటానికి,దాని అధికారము నీ కొరకు ఉండిపోవటానికి మా వద్దకు వచ్చావా ?.
Las Exégesis Árabes:
فَلَنَاْتِیَنَّكَ بِسِحْرٍ مِّثْلِهٖ فَاجْعَلْ بَیْنَنَا وَبَیْنَكَ مَوْعِدًا لَّا نُخْلِفُهٗ نَحْنُ وَلَاۤ اَنْتَ مَكَانًا سُوًی ۟
ఓ మూసా నీ మంత్రజాలము లాంటిదే ఏదైన మంత్రజాలమును మేము తప్పకుండా నీ వద్దకు తీసుకుని వస్తాము. అయితే నీవు మాకు,నీకు మధ్య ఒక నిర్ణీత కాలములో,ఒక నిర్ణీత ప్రదేశములో సమయంను ఏర్పాటు చేయి. దానిని మేమూ వ్యతిరేకించము,మీరూ వ్యతిరేకించకండి. మరియు రెండు వర్గముల మధ్య స్థలం మధ్యస్థంగా,సమాంతరంగా ఉండనివ్వండి.
Las Exégesis Árabes:
قَالَ مَوْعِدُكُمْ یَوْمُ الزِّیْنَةِ وَاَنْ یُّحْشَرَ النَّاسُ ضُحًی ۟
మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ తో ఇలా పలికారు : మీకు,మాకు మధ్య నిర్ణీత సమయం పండుగ రోజు ప్రజలు తమ పండుగను జరుపుకుంటూ మద్యాహ్నం సమావేశమైన వేళప్పుడు.
Las Exégesis Árabes:
فَتَوَلّٰی فِرْعَوْنُ فَجَمَعَ كَیْدَهٗ ثُمَّ اَتٰی ۟
ఫిర్ఔన్ తిరిగి వెళ్ళి తన మోసమును,తన కుట్రలను సేకరించాడు. ఆ తరువాత నిర్ణీత సమయము,ప్రదేశములో ఓడించటానికి వచ్చాడు.
Las Exégesis Árabes:
قَالَ لَهُمْ مُّوْسٰی وَیْلَكُمْ لَا تَفْتَرُوْا عَلَی اللّٰهِ كَذِبًا فَیُسْحِتَكُمْ بِعَذَابٍ ۚ— وَقَدْ خَابَ مَنِ افْتَرٰی ۟
మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ మాంత్రికులను హితోపదేశం చేస్తూ ఇలా పలికారు : మీరు విడనాడండి (దూరంగా ఉండండి),మీరు ప్రజలను మంత్ర జాలముతో మోసం చేయటం ద్వారా అల్లాహ్ పై అబధ్ధమును కల్పించకండి. అటువంటప్పుడు ఆయన వద్ద నుండి మీకు ఏదైన శిక్ష చుట్టుకుంటుంది. నిశ్ఛయంగా అల్లాహ్ పై అబధ్ధమును కల్పించుకునే వాడు నష్టాన్ని చవిచూస్తాడు.
Las Exégesis Árabes:
فَتَنَازَعُوْۤا اَمْرَهُمْ بَیْنَهُمْ وَاَسَرُّوا النَّجْوٰی ۟
మంత్రజాలకులు మూసా అలైహిస్సలాం మాటను విన్నప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మరియు తమ మధ్య రహస్యంగా మంతనాలు చేశారు.
Las Exégesis Árabes:
قَالُوْۤا اِنْ هٰذٰنِ لَسٰحِرٰنِ یُرِیْدٰنِ اَنْ یُّخْرِجٰكُمْ مِّنْ اَرْضِكُمْ بِسِحْرِهِمَا وَیَذْهَبَا بِطَرِیْقَتِكُمُ الْمُثْلٰی ۟
మంత్రజాలకుల్లోంచి కొందరు కొందరితో రహస్యంగా ఇలా పలికారు : నిశ్చయంగా మూసా,హారూను ఇద్దరూ మాంత్రికులే. వారిద్దరు తాము తీసుకుని వచ్చిన మంత్రజాలము ద్వారా మిమ్మల్ని మిసర్ నుండి వెళ్ళగొట్టదలిచారు. మరియు జీవితంలో ఉన్న మీ ఉన్నతమైన సాంప్రదాయమును,మీ గొప్ప పధ్ధతిని తొలగించదలిచారు.
Las Exégesis Árabes:
فَاَجْمِعُوْا كَیْدَكُمْ ثُمَّ ائْتُوْا صَفًّا ۚ— وَقَدْ اَفْلَحَ الْیَوْمَ مَنِ اسْتَعْلٰی ۟
అయితే మీరు మీ వ్యవహారమును దిట్టముగా చేసుకోండి,అందులో మీరు విభేధించుకోకండి. ఆ తరువాత మీరు పంక్తులవారిగా ముందడుగు వేయండి. మరియు మీరు మీ వద్ద ఉన్న వాటన్నింటిని ఒకేసారి విసరండి. తన ప్రత్యర్ధిని ఓడించిన వాడే ఈ రోజు ఆశించిన దాని ద్వారా ఖచ్చితంగా సాఫల్యం చెందుతాడు.
Las Exégesis Árabes:
Beneficios de los versículos de esta página:
• إخراج أصناف من النبات المختلفة الأنواع والألوان من الأرض دليل واضح على قدرة الله تعالى ووجود الصانع.
విభిన్న రకాల,రంగుల వృక్ష జాతులను భూమి నుండి వెలికి తీయటం మహోన్నతుడైన అల్లాహ్ సామర్ధ్యముపై,తయారు చేసేవాడు ఉన్నాడని అనటంపై ఆధారము.

• ذكرت الآيات دليلين عقليين واضحين على الإعادة: إخراج النبات من الأرض بعد موتها، وإخراج المكلفين منها وإيجادهم.
ఆయతులు పునర్సృష్టికి సంబంధించి రెండు స్పష్టమైన మానసిక ఆధారాలను పేర్కొన్నాయి : మొక్కలను అవి చనిపోయిన తరువాత నేల నుండి వెలికి తీయటం మరియు దాని నుండి బాధ్యులను విలికి తీసి వారిని కనుగొనటం

• كفر فرعون كفر عناد؛ لأنه رأى الآيات عيانًا لا خبرًا، واقتنع بها في أعماق نفسه.
ఫిర్ఔన్ అవిశ్వాసములో మొండి తనంగా వ్యవహరించాడు. ఎందుకంటే అతడు సూచనలను కళ్ళారా ప్రత్యక్షంగా చూశాడు,సమాచారంగా చూడ లేదు. దానిని తన మనస్సు లోపల అంగీకరించాడు.

• اختار موسى يوم العيد؛ لتعلو كلمة الله، ويظهر دينه، ويكبت الكفر، أمام الناس قاطبة في المجمع العام ليَشِيع الخبر.
సాధారణ జన సమ్మేళనంలో వార్త ను వ్యాపింపజేసి ప్రజలందరి ముందు అల్లాహ్ వాక్కును లేవనెత్తటం కొరకు,ఆయన ధర్మాన్ని స్పష్టపరచటం కొరకు,అవిశ్వాసమును అణచివేయటం కొరకు మూసా అలైహిస్సలాం పండుగ రోజును ఎంచుకున్నారు.

قَالُوْا یٰمُوْسٰۤی اِمَّاۤ اَنْ تُلْقِیَ وَاِمَّاۤ اَنْ نَّكُوْنَ اَوَّلَ مَنْ اَلْقٰی ۟
మంత్రజాలకులు మూసా అలైహిస్సలాంతో ఇలా పలికారు : ఓ మూసా ఈ రెండు విషయముల్లోంచి ఏదో ఒక దానిని ఎంచుకో : నీ వద్ద ఉన్న మంత్రజాలమును మొదట విసిరేవాడివి నీవైన అవ్వు లేదా మేము దాన్ని మొదట విసిరే వాళ్ళమవుతాము.
Las Exégesis Árabes:
قَالَ بَلْ اَلْقُوْا ۚ— فَاِذَا حِبَالُهُمْ وَعِصِیُّهُمْ یُخَیَّلُ اِلَیْهِ مِنْ سِحْرِهِمْ اَنَّهَا تَسْعٰی ۟
మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : లేదు మీరే మొదట మీ వద్ద ఉన్నవి విసరండి. అప్పుడు వారు తమ వద్ద ఉన్న వాటిని విసిరారు. అప్పుడు వారు విసిరిన వారి త్రాళ్ళు,వారి చేతి కర్రలు వారి మంత్రజాలము వలన మూసా దృష్టిలో వేగముగా చలిస్తున్న పెద్ద సర్పాల మాదిరిగా అనిపించసాగాయి.
Las Exégesis Árabes:
فَاَوْجَسَ فِیْ نَفْسِهٖ خِیْفَةً مُّوْسٰی ۟
అప్పుడు వారు చేసిన దానితో మూసా మనస్సులో భయం కలిగింది.
Las Exégesis Árabes:
قُلْنَا لَا تَخَفْ اِنَّكَ اَنْتَ الْاَعْلٰی ۟
అల్లాహ్ మూసా అలైహిస్సలాంకు ధైర్యం చెబుతూ ఇలా పలికాడు : ఓ మూసా మీ దృష్టిలో అనిపించిన వాటితో భయపడకండి,మీరే వారిపై ఆధిక్యతతో,విజయముతో ప్రాబల్యం పొందుతారు.
Las Exégesis Árabes:
وَاَلْقِ مَا فِیْ یَمِیْنِكَ تَلْقَفْ مَا صَنَعُوْا ؕ— اِنَّمَا صَنَعُوْا كَیْدُ سٰحِرٍ ؕ— وَلَا یُفْلِحُ السَّاحِرُ حَیْثُ اَتٰی ۟
మరియు మీరు మీ కుడి చేతిలో ఉన్న చేతి కర్రను విసరండి,అది పాముగా మారి మంత్రజాలముతో వారు చేసిన వాటన్నింటిని మ్రింగివేస్తుంది. వారు చేసినది కేవలం మంత్ర కుతంత్రం మాత్రమే. మరియు మంత్రజాలకుడు ఎక్కడ ఉన్నా ఆశించిన దాని ద్వారా సఫలీకృతం కాజాలడు.
Las Exégesis Árabes:
فَاُلْقِیَ السَّحَرَةُ سُجَّدًا قَالُوْۤا اٰمَنَّا بِرَبِّ هٰرُوْنَ وَمُوْسٰی ۟
అప్పుడు మూసా తన చేతి కర్రను విసిరితే అది పాముగా మారిపోయింది. మరియు మంత్రజాలకులు చేసిన దాన్ని మ్రింగివేసింది. ఎప్పుడైతే మంత్రజాలకులు మూసా వద్ద ఉన్నది మంత్రజాలము కాదని,అది అల్లాహ్ వద్ద నుండి మాత్రమే అని తెలుసుకున్నారో వారు అల్లాహ్ కొరకు సాష్టాంగపడిపోయారు. వారు ఇలా పలికారు : మేము మూసా,హారూను ప్రభువు,సృష్టితాలన్నింటి ప్రభువు ను విశ్వసించాము.
Las Exégesis Árabes:
قَالَ اٰمَنْتُمْ لَهٗ قَبْلَ اَنْ اٰذَنَ لَكُمْ ؕ— اِنَّهٗ لَكَبِیْرُكُمُ الَّذِیْ عَلَّمَكُمُ السِّحْرَ ۚ— فَلَاُقَطِّعَنَّ اَیْدِیَكُمْ وَاَرْجُلَكُمْ مِّنْ خِلَافٍ وَّلَاُوصَلِّبَنَّكُمْ فِیْ جُذُوْعِ النَّخْلِ ؗ— وَلَتَعْلَمُنَّ اَیُّنَاۤ اَشَدُّ عَذَابًا وَّاَبْقٰی ۟
ఫిర్ఔన్ మంత్రజాలకుల విశ్వాసమును వ్యతిరేకిస్తూ,హెచ్చరిస్తూ ఇలా పలికాడు : ఏమీ మీరు మూసాను నేను దాని గురించి అనుమతి ఇవ్వకముందే విశ్వసిస్తారా ?!. ఓ మంత్రజాలకులారా నిశ్చయంగా మూసా మీకు మంత్రజాలమును నేర్పించిన మీ నాయకుడు. నేను తప్పకుండా మీలోని ప్రతి ఒక్కరి ఒక కాలును,ఒక చేతిని వాటి దిశల మధ్య వ్యతిరేకంగా నరికివేస్తాను. మరియు మీ శరీరాలను ఖర్జూరపు దూలాల పై మీరు చనిపోయేంతవరకు,ఇతరులకు గుణపాఠం అయ్యేంత వరకు శిలువ వేస్తాను. అప్పుడు మాలో నుండి ఎవరు శిక్షపరంగా బలవంతుడో,ఎల్లప్పుడు ఉంటాడో నేనా లేదా మూసా ప్రభువునా మీరు తెలుసుకుంటారు.
Las Exégesis Árabes:
قَالُوْا لَنْ نُّؤْثِرَكَ عَلٰی مَا جَآءَنَا مِنَ الْبَیِّنٰتِ وَالَّذِیْ فَطَرَنَا فَاقْضِ مَاۤ اَنْتَ قَاضٍ ؕ— اِنَّمَا تَقْضِیْ هٰذِهِ الْحَیٰوةَ الدُّنْیَا ۟ؕ
మంత్రజాలకులు ఫిర్ఔన్ తో ఇలా పలికారు : ఓ ఫిర్ఔన్ మేము మా వద్దకు వచ్చిన స్పష్టమైన ఆయతులను అనుసరించటంపై నిన్ను ప్రాధాన్యత ఇవ్వమంటే ఇవ్వము. మరియు మమ్మల్ని సృష్టించిన అల్లాహ్ పై నిన్నూ ప్రాధాన్యతనివ్వము. నీవు మాతో చేయాలనుకున్నది చేయి.ఈ అంతమైపోయే జీవితంలో మాత్రమే నీకు మాపై అధికారము కలదు. మరియు తొందరలోనే నీ అధికారము తొలిగిపోతుంది.
Las Exégesis Árabes:
اِنَّاۤ اٰمَنَّا بِرَبِّنَا لِیَغْفِرَ لَنَا خَطٰیٰنَا وَمَاۤ اَكْرَهْتَنَا عَلَیْهِ مِنَ السِّحْرِ ؕ— وَاللّٰهُ خَیْرٌ وَّاَبْقٰی ۟
నిశ్చయంగా మేము మా ప్రభువుపై ఆయన గతించిన మా పాపములైన అవిశ్వాసము,ఇతరవాటిని మా నుండి తుడిచి వేస్తాడని,మా నుండి మంత్రజాల పాపము దేనినైతే నేర్చుకోవటం,ఉపయోగించటం,దాని ద్వారా మూసాను ఓడించటంపై నీవు మమ్మల్ని బలవంతం చేశావో దానిని తుడిచి వేస్తాడని ఆశిస్తూ విశ్వాసమును కనబరిచాము. మరియు అల్లాహ్ నీవు మాకు వాగ్ధానం చేసిన వాటి కన్న మేలైన వాటిని ప్రసాధించేవాడును,నీవు మాకు ఏ శిక్ష గురించి బెదిరస్తున్నావో దానికన్న నిర్విరామంగా శిక్షించేవాడును.
Las Exégesis Árabes:
اِنَّهٗ مَنْ یَّاْتِ رَبَّهٗ مُجْرِمًا فَاِنَّ لَهٗ جَهَنَّمَ ؕ— لَا یَمُوْتُ فِیْهَا وَلَا یَحْیٰی ۟
నిశ్ఛయంగా విషయము,జరిగేదేమిటంటే ప్రళయదినాన తన ప్రభువు వద్దకు ఆయనపై అవిశ్వాసమును కనబరచిన స్థితిలో వచ్చే వాడి కొరకు నరకాగ్ని ఉంటుంది. అతడు అందులో శాస్వతంగా ఎల్లవేళలా ఉండేటట్లుగా ప్రవేశిస్తాడు. దాని శిక్ష నుండి అతడు విశ్రాంతి పొందటానికి అందులో అతనికి మరణం సంభవించదు. మరియు అతడు మంచి జీవితమును జీవించలేడు.
Las Exégesis Árabes:
وَمَنْ یَّاْتِهٖ مُؤْمِنًا قَدْ عَمِلَ الصّٰلِحٰتِ فَاُولٰٓىِٕكَ لَهُمُ الدَّرَجٰتُ الْعُلٰی ۟ۙ
మరియు ఎవరైతే ప్రళయదినాన తమ ప్రభువు వద్దకు ఆయనపై విశ్వాసమును కనబరచి వస్తాడో,సత్కర్మలు చేసి ఉంటాడో ఈ గొప్ప గుణాలతో వర్ణించబడిన వారందరి కొరకు ఎత్తైన అంతస్తులు,ఉన్నతమైన స్థానములు కలవు.
Las Exégesis Árabes:
جَنّٰتُ عَدْنٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا ؕ— وَذٰلِكَ جَزٰٓؤُا مَنْ تَزَكّٰی ۟۠
ఈ స్థానాలు అవి శాస్వత స్వర్గ వనాలు వాటి భవనముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారు అందులో శాస్వతంగా ఉంటారు. ఈ ప్రస్థావించబడిన ప్రతిఫలం అవిశ్వాసమునుండి,పాప కార్యముల నుండి పరిశుద్ధుడైన ప్రతీ వ్యక్తి ప్రతిఫలము.
Las Exégesis Árabes:
Beneficios de los versículos de esta página:
• لا يفوز ولا ينجو الساحر حيث أتى من الأرض أو حيث احتال، ولا يحصل مقصوده بالسحر خيرًا كان أو شرًّا.
మంత్రజాలకుడు తాను ఎక్కడికి వెళ్ళినా లేదా ఎక్కడ మోసం చేసినా గెలవలేడు,సాఫల్యం చెందడు. మంత్రజాలము ద్వారా తాను ఆశించినది మంచి అయినా గాని చెడు అయినా గాని పొందలేడు.

• الإيمان يصنع المعجزات؛ فقد كان إيمان السحرة أرسخ من الجبال، فهان عليهم عذاب الدنيا، ولم يبالوا بتهديد فرعون.
విశ్వాసము అద్భుతాలను చేస్తుంది. మంత్రజాలకుల విశ్వాసం పర్వతాల కన్నగట్టిది. అందుకనే వారిపై ఇహలోక శిక్ష సులభమయింది. వారు ఫిర్ఔన్ బెదిరింపును లెక్కచేయలేదు.

• دأب الطغاة التهديد بالعذاب الشديد لأهل الحق والإمعان في ذلك للإذلال والإهانة.
మితిమీరే వారి వ్యవహారం సత్యపరులకి కఠినమైన శిక్ష ఇవ్వటం గురించి బెదిరింపులు ఇవ్వటం,అవమానమునకు గురి చేయటం కొరకు,పరాభవమునకు లోను చేయటం కొరకు ఇందులో పట్టుబడటం.

وَلَقَدْ اَوْحَیْنَاۤ اِلٰی مُوْسٰۤی ۙ۬— اَنْ اَسْرِ بِعِبَادِیْ فَاضْرِبْ لَهُمْ طَرِیْقًا فِی الْبَحْرِ یَبَسًا ۙ— لَّا تَخٰفُ دَرَكًا وَّلَا تَخْشٰی ۟
మరియు నిశ్చయంగా మేము మూసాకి దైవ వాణి ద్వారా ఇలా తెలిపాము : నీవు నా దాసులను తీసుకుని రాత్రి మిసర్ నుండి బయలుదేరు చివరికి వారిని ఎవరు గమనించకూడదు. మరియు సముద్రం పై చేతి కర్రతో కొట్టిన తరువాత వారి కొరకు సముద్రంలో ఒక పొడి మార్గమును ఏర్పాటు చేయి. నిశ్చింతగా నిన్ను ఫిర్ఔన్,అతని దర్బారీలు పట్టుకుంటారని భయపడకు. మరియు సముద్రంలో మునగటం నుండి భయపడకు.
Las Exégesis Árabes:
فَاَتْبَعَهُمْ فِرْعَوْنُ بِجُنُوْدِهٖ فَغَشِیَهُمْ مِّنَ الْیَمِّ مَا غَشِیَهُمْ ۟ؕ
అప్పుడు ఫిర్ఔన్ తన సైనికులతో కలిసి వారిని వెంబడించాడు. అప్పుడు అతడిని,అతడి సైన్యములను సముద్రం అలుముకుని క్రమ్మివేసింది. వారికి ఏదైతే అలుముకుందో దాని వాస్తవికత అల్లాహ్ కు తప్ప ఇంకెవరికి తెలియదు. అప్పుడు వారందరు మునిగి వినాశనమునకు గురైపోయారు. మరియు మూసా,ఆయనతోపాటు ఉన్న వారు సాఫల్యం చెందారు.
Las Exégesis Árabes:
وَاَضَلَّ فِرْعَوْنُ قَوْمَهٗ وَمَا هَدٰی ۟
మరియు ఫిర్ఔన్ తన జాతి వారిని తాను వారికి మంచిగా చేసి చూపిన అవిశ్వాసముతో అపమార్గమునకు లోనుచేశాడు. మరియు వారిని అసత్యముతో మోసం చేశాడు. మరియు వారిని సన్మార్గము వైపునకు మార్గదర్శకము చేయలేదు.
Las Exégesis Árabes:
یٰبَنِیْۤ اِسْرَآءِیْلَ قَدْ اَنْجَیْنٰكُمْ مِّنْ عَدُوِّكُمْ وَوٰعَدْنٰكُمْ جَانِبَ الطُّوْرِ الْاَیْمَنَ وَنَزَّلْنَا عَلَیْكُمُ الْمَنَّ وَالسَّلْوٰی ۟
ఇస్రాయీలు సంతతివారితో వారిని ఫిర్ఔన్,అతని సైన్యముల నుండి మేము రక్షించిన తరువాత ఇలా పలికాము : ఓ ఇస్రాయీలు సంతతివారా నిశ్చయంగా మేము మీ శతృవుల బారి నుండి రక్షించాము. మరియు తూర్ కొండ వైపు ఉన్న లోయ కుడి ప్రక్న మూసాతో మేము సంభాషిస్తామని మీతో వాగ్ధానం చేశాము. మరియు తీహ్ మైదనములో మా అనుగ్రహాల్లోంచి తేనెలాంటి తియ్యటి పానియం,మంచి మాంసము కల చిన్న పిట్టలాంటి చిన్న పక్షిని మీపై కురిపించాము.
Las Exégesis Árabes:
كُلُوْا مِنْ طَیِّبٰتِ مَا رَزَقْنٰكُمْ وَلَا تَطْغَوْا فِیْهِ فَیَحِلَّ عَلَیْكُمْ غَضَبِیْ ۚ— وَمَنْ یَّحْلِلْ عَلَیْهِ غَضَبِیْ فَقَدْ هَوٰی ۟
మేము మీకు ప్రసాధించిన ధర్మసమ్మతమైన ఆహారపదార్ధముల్లోంచి రుచికరమైన వాటిని మీరు తినండి. మేము మీకు అనుమతించిన వాటిలో మీపై నిషేధించిన వాటి వైపు మితిమీరకండి. అటువంటప్పుడు మీపై నా క్రోధం దిగుతుంది. ఎవరిపై మా క్రోధం దిగుతుందో అతడు వినాశనమునకు గురి అవుతాడు,ఇహ,పరాల్లో దుష్టుడవుతాడు.
Las Exégesis Árabes:
وَاِنِّیْ لَغَفَّارٌ لِّمَنْ تَابَ وَاٰمَنَ وَعَمِلَ صَالِحًا ثُمَّ اهْتَدٰی ۟
నిశ్చయంగా నేను నాతో పశ్చాత్తాప్పడి,విశ్వసించి, సత్కార్యము చేసి, ఆ పిదప సత్యము పై నిలకడ చూపేవాడికి అధికంగా మన్నించేవాడిని,క్షమించేవాడిని.
Las Exégesis Árabes:
وَمَاۤ اَعْجَلَكَ عَنْ قَوْمِكَ یٰمُوْسٰی ۟
ఓ మూసా ఏ విషయం నీ జాతి వారి నుండి నిన్ను తొందర చేసేటట్టు చేసింది నీవు వారిని వదిలి వారికన్న ముందు వచ్చావు ?.
Las Exégesis Árabes:
قَالَ هُمْ اُولَآءِ عَلٰۤی اَثَرِیْ وَعَجِلْتُ اِلَیْكَ رَبِّ لِتَرْضٰی ۟
మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : ఇదిగో వారు నా వెనుక ఉన్నారు,వారు నాతో వచ్చి కలుసుకుంటారు. మరియు నేను నా జాతి వారి కన్న ముందు నీ వద్దకు నేను నీ వైపు చేసిన తొందరతో నీవు ప్రసన్నుడవుతావని వచ్చాను.
Las Exégesis Árabes:
قَالَ فَاِنَّا قَدْ فَتَنَّا قَوْمَكَ مِنْ بَعْدِكَ وَاَضَلَّهُمُ السَّامِرِیُّ ۟
అల్లాహ్ ఇలా పలికాడు : నిశ్చయంగా మేము నీవు నీ వెనుక వదిలి వచ్చిన నీ జాతి వారిని ఆవు దూడ ఆరాధన ద్వారా పరీక్షించాము. వారిని సామిరి దాని ఆరాధన వైపు పిలిచాడు. దాని ద్వారా అతడు వారిని అపమార్గమునకు లోను చేశాడు.
Las Exégesis Árabes:
فَرَجَعَ مُوْسٰۤی اِلٰی قَوْمِهٖ غَضْبَانَ اَسِفًا ۚ۬— قَالَ یٰقَوْمِ اَلَمْ یَعِدْكُمْ رَبُّكُمْ وَعْدًا حَسَنًا ؕ۬— اَفَطَالَ عَلَیْكُمُ الْعَهْدُ اَمْ اَرَدْتُّمْ اَنْ یَّحِلَّ عَلَیْكُمْ غَضَبٌ مِّنْ رَّبِّكُمْ فَاَخْلَفْتُمْ مَّوْعِدِیْ ۟
అప్పుడు మూసా అలైహిస్సలాం తన జాతివారివైపు వారి ఆవు దూడ పూజవలన కోపముతో వారిపై బాధపడుతూ మరిలారు. అప్పుడు మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : ఓ నా జాతి వారా ఏమీ అల్లాహ్ మీపై తౌరాతును అవతరింపజేస్తానని,మిమ్మల్ని స్వర్గములో ప్రవేసింపజేస్తాడని మీతో మంచి వాగ్ధానం చేయలేదా. ఏమిటీ మీపై కాలం పొడిగిపోయందని మీరు మరచిపోయారా ?. లేదా మీరు పాల్పడిన ఈ చర్య వలన మీపై మీ ప్రభువు వద్ద నుండి ఆగ్రహము దిగాలని,మీపై ఆయన శిక్ష వచ్చి పడాలని కోరుకున్నారా,అందుకనే నేను మీ వద్దకు తిరిగి వచ్చేంతవరకు విధేయతపై స్థిరంగా ఉండమన్న నా ఒప్పొందమును మీరు భంగపరిచారా ?!.
Las Exégesis Árabes:
قَالُوْا مَاۤ اَخْلَفْنَا مَوْعِدَكَ بِمَلْكِنَا وَلٰكِنَّا حُمِّلْنَاۤ اَوْزَارًا مِّنْ زِیْنَةِ الْقَوْمِ فَقَذَفْنٰهَا فَكَذٰلِكَ اَلْقَی السَّامِرِیُّ ۟ۙ
మూసా జాతివారు ఇలా పలికారు : ఓ మూసా మేము మా అంగీకారముతో నీకు ఇచ్చిన మాటను విబేధించ లేదు కాని బలవంతాన జరిగింది. మేము ఫిర్ఔన్ జాతి వారి నగల భారములను,బరువులను మోశాము. అయితే మేము వాటి నుండి విముక్తి కొరకు వాటిని ఒక గుంటలో పడవేశాము. అప్పుడు గుంటలో మేము వాటిని విసిరినట్లే సామరీకూడా తనతోపాటు ఉన్న జిబ్రయీల్ అలైహిస్సలాం గుర్రము యొక్క గిట్ట యొక్క మట్టిని విసిరాడు.
Las Exégesis Árabes:
Beneficios de los versículos de esta página:
• من سُنَّة الله انتقامه من المجرمين بما يشفي صدور المؤمنين، ويقر أعينهم، ويذهب غيظ قلوبهم.
విశ్వాసపరుల హృదయములను నయం చేసే వాటి ద్వారా,వారి కళ్ళకు చలువను కలిగించే వాటి ద్వారా,వారి హృదయముల్లో ఉన్న క్రోదమును దూరం చేసే వాటి ద్వారా అపరాదులతో ప్రతీకారము తీసుకోవటం అల్లాహ్ సంప్రదాయము.

• الطاغية شؤم على نفسه وعلى قومه؛ لأنه يضلهم عن الرشد، وما يهديهم إلى خير ولا إلى نجاة.
మితిమీరేవాడు తన స్వయమునకు, తన జాతి వారి కొరకు కీడు కలిగిస్తాడు. ఎందుకంటే అతడు వారిని సన్మారాగము నుండి భ్రష్టుపట్టిస్తాడు. మరియు అతడు వారిని మేలు వైపున గాని ముక్తి వైపున గాని మార్గం చూపలేడు.

• النعم تقتضي الحفظ والشكر المقرون بالمزيد، وجحودها يوجب حلول غضب الله ونزوله.
అనుగ్రహాలు వాటి రక్షణ,వాటి అధికమవటముతో ఇమిడి ఉన్నకృతజ్ఞతను నిర్ణయిస్తుంది. మరియు వాటిని తిరస్కరించటం అల్లాహ్ క్రోదము కలగటానికి,దాని దిగటానికి అనివార్యం చేస్తుంది.

• الله غفور على الدوام لمن تاب من الشرك والكفر والمعصية، وآمن به وعمل الصالحات، ثم ثبت على ذلك حتى مات عليه.
షిర్కు,అవిశ్వాసము,అవిధేయత నుండి తౌబా చేసి (పశ్చాత్తాప్పడి) ఆయనపై (అల్లాహ్) విశ్వాసమును కనబరచి,సత్కార్యములను చేసి,ఆ పిదప వాటిపై నిలకడ చూపి అదే స్థితిలో మరణించే వాడిని అల్లాహ్ ఎల్లప్పుడు క్షమించేవాడు.

• أن العجلة وإن كانت في الجملة مذمومة فهي ممدوحة في الدين.
నిశ్చయంగా తొందరపాటు అసలు దూషించబడినదైనప్పటికి అది ధర్మ విషయంలో ప్రశంసనీయమైనది.

فَاَخْرَجَ لَهُمْ عِجْلًا جَسَدًا لَّهٗ خُوَارٌ فَقَالُوْا هٰذَاۤ اِلٰهُكُمْ وَاِلٰهُ مُوْسٰی ۚۙ۬— فَنَسِیَ ۟ؕ
అప్పుడు సామిరీ ఇస్రాయీలు సంతతి వారి కొరకు ఆ నగల నుండి ఏ ఆత్మ లేని,ఆవు గాండ్రింపు లాంటి గాండ్రింపు కల ఒక దూడను వెలికి తీశాడు. అప్పుడు వారిలో నుండి సామిరీ పనికి ఆకర్షితులైనవారు ఇదే మీ ఆరాధ్య దైవము,మూసా ఆరాధ్య దైవము ఆయన దీన్ని మరచిపోయి ఇక్కడ వదిలివేశాడు అన్నారు.
Las Exégesis Árabes:
اَفَلَا یَرَوْنَ اَلَّا یَرْجِعُ اِلَیْهِمْ قَوْلًا ۙ۬— وَّلَا یَمْلِكُ لَهُمْ ضَرًّا وَّلَا نَفْعًا ۟۠
ఏమీ దూడకు ఆకర్షితులై దాన్ని పూజించే వీరందరు ఈ దూడ వారితో మట్లాడలేదని,వారికి సమాధానము ఇవ్వలేదని,వారి నుండి,ఇతరుల నుండి ఎటువంటి నష్టమును తొలగించలేదని,వారి కొరకు,ఇతరుల కొరకు ఎటువంటి లాభం తీసుకుని రాలేదని చూడటంలేదా ?!.
Las Exégesis Árabes:
وَلَقَدْ قَالَ لَهُمْ هٰرُوْنُ مِنْ قَبْلُ یٰقَوْمِ اِنَّمَا فُتِنْتُمْ بِهٖ ۚ— وَاِنَّ رَبَّكُمُ الرَّحْمٰنُ فَاتَّبِعُوْنِیْ وَاَطِیْعُوْۤا اَمْرِیْ ۟
మరియు నిశ్ఛయంగా హారూను వారితో మూసా వారి వద్దకు మరలక ముందు ఇలా పలికారు : బంగారముతో దూడ సూత్రీకరణలో,దాని గాండ్రించటంలో అవిశ్వాసపరుని నుండి విశ్వాసపరుడిని స్పష్ట పరచటం కొరకు మీకు పరీక్ష మాత్రమే. ఓ నా జాతి వారా నిశ్చయంగా మీ ప్రభువే దయ చూపే అధికారము కలవాడు,మీ కొరకు ఎటువంటి నష్టమును గాని లాభమును గాని కలిగించే అధికారము లేనటువంటి ప్రత్యేకించి మీపై దయచూపనటువంటి వాడు కాదు. అయితే మీరు ఆయన ఒక్కడి ఆరాధన విషయంలో నన్ను అనుసరించండి. ఇతరుల ఆరాధనను వదిలే విషయంలో నా ఆదేశమును పాటించండి.
Las Exégesis Árabes:
قَالُوْا لَنْ نَّبْرَحَ عَلَیْهِ عٰكِفِیْنَ حَتّٰی یَرْجِعَ اِلَیْنَا مُوْسٰی ۟
దూడ ఆరాధనకి ఆకర్షితులైనవారు ఇలా పలికారు : మా వద్దకు మూసా మరలేంత వరకు మేము దాని ఆరాధనలో స్థిరంగా ఉంటాము
Las Exégesis Árabes:
قَالَ یٰهٰرُوْنُ مَا مَنَعَكَ اِذْ رَاَیْتَهُمْ ضَلُّوْۤا ۟ۙ
మూసా తన సోదరుడు హారునుతో ఇలా పలికారు : అల్లాహ్ ను వదిలి దూడ ఆరాధనతో వారు అపమార్గంలో పడిపోతే మీరు చూసినప్పుడు (వారిని ఆపటం నుండి) మిమ్మల్ని ఏది ఆటంకం కలిగించింది.
Las Exégesis Árabes:
اَلَّا تَتَّبِعَنِ ؕ— اَفَعَصَیْتَ اَمْرِیْ ۟
వారిని మీరు వదిలి వేసి నన్ను వచ్చి కలుస్తారా ?!. ఏమీ నేను మిమ్మల్ని వారిపై ప్రతినిధిగా నియమించినప్పుడు మీరు నా ఆదేశమును ఉల్లంఘించారా ?!.
Las Exégesis Árabes:
قَالَ یَبْنَؤُمَّ لَا تَاْخُذْ بِلِحْیَتِیْ وَلَا بِرَاْسِیْ ۚ— اِنِّیْ خَشِیْتُ اَنْ تَقُوْلَ فَرَّقْتَ بَیْنَ بَنِیْۤ اِسْرَآءِیْلَ وَلَمْ تَرْقُبْ قَوْلِیْ ۟
మరియు ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం తన సోదరుని గడ్డమును,ఆయన తలను తన వైపు గింజుతూ ఆయన చేసిన కార్యమునకు ఆయనను మందలిస్తూ పట్టుకున్నారో అప్పుడు హారూన్ అలైహిస్సలాం తనపై దయ చూపమని కోరుతూ ఆయనతో ఇలా పలికారు : మీరు నా గడ్డమును,నా తల వెంట్రుకలను పట్టుకోకండి. ఎందుకంటే నేను వారితోపాటే ఉండిపోవటంలో నా కొరకు ఒక కారణం ఉన్నది. ఒక వేళ నేను వారిని ఒంటరిగా వదిలి వేస్తే వారు విడిపోతారని నేను భయపడ్డాను. అప్పుడు నేను వారిని విడగొట్టానని,వారి విషయంలో మీ మాటను ఖాతరు చేయలేదని మీరు అనేవారు.
Las Exégesis Árabes:
قَالَ فَمَا خَطْبُكَ یٰسَامِرِیُّ ۟
మూసా అలైహిస్సలాం సామిరీతో ఇలా పలికారు : ఓ సామిరీ నీ సంగతేమిటి ?. నీవు చేసిన కార్యం వైపునకు ఏ కారణం పురిగొల్పింది ?.
Las Exégesis Árabes:
قَالَ بَصُرْتُ بِمَا لَمْ یَبْصُرُوْا بِهٖ فَقَبَضْتُ قَبْضَةً مِّنْ اَثَرِ الرَّسُوْلِ فَنَبَذْتُهَا وَكَذٰلِكَ سَوَّلَتْ لِیْ نَفْسِیْ ۟
సామిరీ మూసా అలైహిస్సలాంతో ఇలా పలికాడు : నీవు చూడనిది నేను చూశాను. నిశ్చయంగా నేను జిబ్రయీలును ఒక గుఱ్రంపై చూశాను,అప్పుడు నేను ఆయన గుఱ్రపు అడుగు క్రింద నుండి ఒక గుప్పిట మట్టిని తీసుకొని దాన్ని నేను కరిగించబడి దూడ రూపములో అచ్చు వేయబడిన నగలుపై విసిరాను. అప్పుడు దాని నుండి గాండ్రింపు శరీరము కల ఒక దూడ పుట్టుకొచ్చింది. ఈ విధంగా నా మనస్సుకు మంచిగా అనిపించింది నేను చేశాను.
Las Exégesis Árabes:
قَالَ فَاذْهَبْ فَاِنَّ لَكَ فِی الْحَیٰوةِ اَنْ تَقُوْلَ لَا مِسَاسَ ۪— وَاِنَّ لَكَ مَوْعِدًا لَّنْ تُخْلَفَهٗ ۚ— وَانْظُرْ اِلٰۤی اِلٰهِكَ الَّذِیْ ظَلْتَ عَلَیْهِ عَاكِفًا ؕ— لَنُحَرِّقَنَّهٗ ثُمَّ لَنَنْسِفَنَّهٗ فِی الْیَمِّ نَسْفًا ۟
మూసా అలైహిస్సలాం సామిరీతో ఇలా పలికారు : సరే నీవు వెళ్ళు కాని నీవు జీవించి ఉన్నంత కాలం నీవు నేను ఎవరిని ముట్టుకోను,నన్ను ఎవరు ముట్టుకోకండి అని పలుకూతూ ఉంటావు. అప్పుడు నీవు చండభ్రష్టుడిగా జీవిస్తావు. మరియు నిశ్చయంగా నీ కొరకు ప్రళయ దినాన ఒక వాగ్ధానం చేయబడిన సమయం ఉన్నది. అందులో నీ లెక్క తీసుకోవటం జరుగుతుంది,శిక్షించబడుతావు. ఈ వాగ్ధాన దినమున అల్లాహ్ నిన్ను వదలడు. మరియు నీవు ఆరాధ్యదైవముగా చేసుకుని అల్లాహ్ ను వదిలి నీవు ఆరాధించిన నీ దూడను చూడు. దానిపై మేము అగ్నిని కాలుస్తాము చివరికి అది కరగిపోతుంది. ఆ తరువాత మేము దాన్నిసముద్రంలో విసిరివేస్తాము. చివరికి దాని నామరూపాలు మిగలవు.
Las Exégesis Árabes:
اِنَّمَاۤ اِلٰهُكُمُ اللّٰهُ الَّذِیْ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— وَسِعَ كُلَّ شَیْءٍ عِلْمًا ۟
ఓ ప్రజలారా మీ వాస్తవ ఆరాధ్యదైవం ఆ అల్లాహ్ ఆయన తప్ప ఎవరు వాస్తవ ఆరాధ్య దైవం కారు. ఆయన ప్రతీ వస్తువును జ్ఞానపరంగా చుట్టుముట్టి ఉన్నాడు. పరిశుద్ధుడైన ఆయన నుండి ఏ వస్తువు యొక్క జ్ఞానము తప్పిపోదు.
Las Exégesis Árabes:
Beneficios de los versículos de esta página:
• خداع الناس بتزوير الحقائق مسلك أهل الضلال.
వాస్తవాలను తారుమారు చేయటం ద్వారా ప్రజలను మోసగించటం అనేది మార్గ భ్రష్టుల పద్దతి.

• الغضب المحمود هو الذي يكون عند انتهاكِ محارم الله.
ప్రశంసించదగిన కోపం అల్లాహ్ యొక్క నిషేధాల్లో పడిపోయినప్పుడు కలుగును.

• في الآيات أصل في نفي أهل البدع والمعاصي وهجرانهم، وألا يُخَالَطوا.
ఆయతుల్లో బిద్అతీలను,పాపాత్ములను తిరస్కరించటంలో,వారిని వదిలివేయటం,వారిని కలవకుండా ఉండటం విషయంలో ఆధారం ఉన్నది.

• في الآيات وجوب التفكر في معرفة الله تعالى من خلال مفعولاته في الكون.
విశ్వంలో మహోన్నతుడైన అల్లాహ్ ప్రభావాల ద్వారా అల్లాహ్ ను గుర్తించటం గురించి ఆలోచించటం తప్పనిసరి అని ఆయతుల్లో ఉన్నది.

كَذٰلِكَ نَقُصُّ عَلَیْكَ مِنْ اَنْۢبَآءِ مَا قَدْ سَبَقَ ۚ— وَقَدْ اٰتَیْنٰكَ مِنْ لَّدُنَّا ذِكْرًا ۟ۖۚ
ఓ ప్రవక్తా మేము మూసా,ఫిర్ఔన్ గాధ,వారిద్దరి జాతులవారి గాధను చదివి వినిపించినట్లుగానే మీ కన్న పూర్వం గతించిన ప్రవక్తల,జాతులవారి గాధలను మీకు ఓదార్పు కలగటానికి మీకు మేము చదివి వినిపిస్తాము. మరియు నిశ్చయంగా మేము మీకు ఖుర్ఆన్ ను ప్రసాధించాము దానితో హితోపదేశం గ్రహించేవారు హితోపదేశం గ్రహిస్తారు.
Las Exégesis Árabes:
مَنْ اَعْرَضَ عَنْهُ فَاِنَّهٗ یَحْمِلُ یَوْمَ الْقِیٰمَةِ وِزْرًا ۟ۙ
మీపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ నుండి ఎవరైతే విముఖత చూపి,దానిని విశ్వసించకుండా ఉండి,అందులో ఉన్న వాటిని ఆచరించడో ప్రళయదినాన వాడు పెద్ద పాపమును మోసుకుని,బాధాకరమైన శిక్షకు అర్హుడై వస్తాడు.
Las Exégesis Árabes:
خٰلِدِیْنَ فِیْهِ ؕ— وَسَآءَ لَهُمْ یَوْمَ الْقِیٰمَةِ حِمْلًا ۟ۙ
ఆ శిక్షలో వారు శాశ్వతంగా నివాసముంటారు. ప్రళయదినాన వారు మోసే బరువు ఎంతో చెడ్డదైన బరువు.
Las Exégesis Árabes:
یَّوْمَ یُنْفَخُ فِی الصُّوْرِ وَنَحْشُرُ الْمُجْرِمِیْنَ یَوْمَىِٕذٍ زُرْقًا ۟
ఆ రోజు మరణాంతరం లేపబడటం కోసం దైవదూత బాకాలో రెండవసారి ఊదుతాడు. మరియు పరలోక భయాందోళనల నుండి వారు పొందిన కాఠిన్యత మూలంగా వారి రంగులు,వారి కళ్ళు మారటం కొరకు నీలంగా ఉన్న స్థితిలో అవిశ్వాసపరులను ఆ రోజు మేము సమీకరిస్తాము.
Las Exégesis Árabes:
یَّتَخَافَتُوْنَ بَیْنَهُمْ اِنْ لَّبِثْتُمْ اِلَّا عَشْرًا ۟
వారు ఒకరితో ఒకరు తమ మాటల్లో ఇలా గుసగుసలాడుతారు : మరణం తరువాత మీరు బర్జఖ్ లో పది రాత్రుల కన్న ఎక్కువ ఉండ లేదు.
Las Exégesis Árabes:
نَحْنُ اَعْلَمُ بِمَا یَقُوْلُوْنَ اِذْ یَقُوْلُ اَمْثَلُهُمْ طَرِیْقَةً اِنْ لَّبِثْتُمْ اِلَّا یَوْمًا ۟۠
వారు రహస్యంగా ఏమి మాట్లాడుకుంటున్నారో మాకు బాగా తెలుసు. వాటిలో నుండి ఏదీ మా నుంచి తప్పి పోదు. అప్పుడు వారిలో నుండి బుద్ధిమంతుడు ఇలా పలుకుతాడు : మీరు బర్జఖ్ లో ఒక రోజు కన్న ఎక్కువ ఉండ లేదు.
Las Exégesis Árabes:
وَیَسْـَٔلُوْنَكَ عَنِ الْجِبَالِ فَقُلْ یَنْسِفُهَا رَبِّیْ نَسْفًا ۟ۙ
ఓ ప్రవక్తా వారు మిమ్మల్ని ప్రళయ దినం నాడు పర్వతాల పరిస్థితి గురించి అడుగుతున్నారు. అయితే మీరు వారితో ఇలా పలకండి : నా ప్రభువు వాటిని కూకటి వ్రేళ్ళతో పెకిలించి తీసి వాటిని గాలిలో ఎగరవేస్తాడు. అప్పుడు అవి దూళిలా అయిపోతాయి.
Las Exégesis Árabes:
فَیَذَرُهَا قَاعًا صَفْصَفًا ۟ۙ
అప్పుడు వాటిని మోసిన భూమిని దానిపై ఎటువంటి కట్టడము గాని,మొక్కలు గాని లేనట్లుగా సమాంతరంగా చేసి వదిలేస్తాడు.
Las Exégesis Árabes:
لَّا تَرٰی فِیْهَا عِوَجًا وَّلَاۤ اَمْتًا ۟ؕ
దాని వైపు చూసే వాడా నీవు భూమిలో అది పూర్తిగా సమాంతరంగా అయిపోవటం మూలంగా ఎటువంటి వంపును గాని,ఎటువంటి ఎత్తును గాని,ఎటువంటి పల్లమును గాని చూడవు.
Las Exégesis Árabes:
یَوْمَىِٕذٍ یَّتَّبِعُوْنَ الدَّاعِیَ لَا عِوَجَ لَهٗ ۚ— وَخَشَعَتِ الْاَصْوَاتُ لِلرَّحْمٰنِ فَلَا تَسْمَعُ اِلَّا هَمْسًا ۟
ఆ రోజు ప్రజలు హషర్ మైదానము వైపునకి పిలిచే వాడి స్వరమును అనుసరిస్తారు. అతనిని అనుసరించటం నుండి వారిని మరల్చేవాడు ఎవడూ ఉండడు. మరియు అనంత కరుణామయుడి ముందు స్వరాలన్నీ భయంతో మౌనంగా ఉండిపోతాయి. ఆ రోజు నీవు అణిగిన స్వరమును తప్ప ఇంకేమి వినవు.
Las Exégesis Árabes:
یَوْمَىِٕذٍ لَّا تَنْفَعُ الشَّفَاعَةُ اِلَّا مَنْ اَذِنَ لَهُ الرَّحْمٰنُ وَرَضِیَ لَهٗ قَوْلًا ۟
ఆ గొప్ప రోజున అల్లాహ్ ఎవరికి సిఫారసు చేయటానికి అనుమతి ఇచ్చి,సిఫారసులో వారి మాట ఆయనకు నచ్చితే వారి సిఫారసు తప్ప ఇంకెవరి సిఫారసు ప్రయోజనం చేకూర్చదు.
Las Exégesis Árabes:
یَعْلَمُ مَا بَیْنَ اَیْدِیْهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا یُحِیْطُوْنَ بِهٖ عِلْمًا ۟
ప్రజలు ప్రళయ విషయంలో ముందస్తు ఏమి పంపించుకున్నారో పరిశుధ్ధుడైన అల్లాహ్ కి తెలుసు. మరియు వారి ఇహలోకములో ఏమి వదిలి వచ్చారో ఆయనకు తెలుసు. మరియు అల్లాహ్ అస్తిత్వములో,ఆయన గుణగణాలలో దాసులందరు జ్ఞానపరంగా చుట్టు ముట్టలేరు.
Las Exégesis Árabes:
وَعَنَتِ الْوُجُوْهُ لِلْحَیِّ الْقَیُّوْمِ ؕ— وَقَدْ خَابَ مَنْ حَمَلَ ظُلْمًا ۟
దాసుల ముఖాలు - మరణించకుండా నిత్యం జీవించి ఉండేవాడు మరియు తన దాసుల వ్యవహారాల విషయంలో వాటి పర్యాలోచన ద్వారా,వాటిని వ్యవహరించటం ద్వారా ఆధారభూతమైనవాడి కొరకు - కడు వినయంగా,అణుకువతో వంగిపోతాయి. మరియు నిశ్చయంగా ఎవరైతే కావాలనే స్వయంగా వినాశన స్థానమునకు చేరి పాపమును మోస్తాడో అతడు విఫలుడవుతాడు.
Las Exégesis Árabes:
وَمَنْ یَّعْمَلْ مِنَ الصّٰلِحٰتِ وَهُوَ مُؤْمِنٌ فَلَا یَخٰفُ ظُلْمًا وَّلَا هَضْمًا ۟
మరియు ఎవరైతే అల్లాహ్ పై,ఆయన ప్రవక్తలపై విశ్వాసమును కనబరచిన స్థితిలో సత్కార్యములను చేసి ఉంటాడో అతడు దాని సంపూర్ణ ప్రతిఫలమును పొందుతాడు. మరియు అతడు తాను చేయని ఏ పాపము వలన శిక్షించబడటం ద్వారా గాని తన సత్కర్మ యొక్క పుణ్యము తరిగించబడటం ద్వారా గాని హింసకు గురవుతాడని భయపడడు.
Las Exégesis Árabes:
وَكَذٰلِكَ اَنْزَلْنٰهُ قُرْاٰنًا عَرَبِیًّا وَّصَرَّفْنَا فِیْهِ مِنَ الْوَعِیْدِ لَعَلَّهُمْ یَتَّقُوْنَ اَوْ یُحْدِثُ لَهُمْ ذِكْرًا ۟
పూర్వికుల గాధలను మేము అవతరింపజేసినట్లే ఈ ఖుర్ఆన్ ను స్పష్టమైన అరబీ భాషలో అవతరింపజేశాము. మరియు ఇందులో బెదిరించటం,భయపెట్టటం లాంటి రకరకాల హెచ్చరికలను వారు అల్లాహ్ తో భయపడుతారని లేదా వారి కొరకు ఖుర్ఆన్ హితోపదేశం,గుణపాఠమును కలిగింపజేస్తుందని ఆశిస్తూ మేము స్పష్టపరచాము.
Las Exégesis Árabes:
Beneficios de los versículos de esta página:
• القرآن العظيم كله تذكير ومواعظ للأمم والشعوب والأفراد، وشرف وفخر للإنسانية.
మహోన్నతమైన ఖుర్ఆన్ పూర్తిగా సమాజాల కొరకు,వర్గాల కొరకు,వ్యక్తుల కొరకు ఒక జ్ఞాపిక, ఒక హితోపదేశము. మరియు మానవత్వానికి ఒక గౌరవము,గర్వించదగ్గ విషయం.

• لا تنفع الشفاعة أحدًا إلا شفاعة من أذن له الرحمن، ورضي قوله في الشفاعة.
కరుణామయుడు ఎవరికైన అనుమతించి,అతని మాటను సిఫారసు చేయటంలో ఇష్టపడితే అతని సిఫారసు తప్ప ఇంకెవరి సిఫారసు ప్రయోజనం చేకూర్చదు.

• القرآن مشتمل على أحسن ما يكون من الأحكام التي تشهد العقول والفطر بحسنها وكمالها.
ఖుర్ఆన్ మంచి ఆదేశములను వేటి మంచితనము గురించి,పరిపూర్ణత గురించి బుద్ధులు,స్వభావములు సాక్షమిస్తాయో వాటిని కలిగి ఉన్నది.

• من آداب التعامل مع القرآن تلقيه بالقبول والتسليم والتعظيم، والاهتداء بنوره إلى الصراط المستقيم، والإقبال عليه بالتعلم والتعليم.
ఖుర్ఆన్ తో వ్యవహరించే పద్దతుల్లోంచి దాన్ని ఆమోదిస్తూ,అంగీకరిస్తూ,గౌరవిస్తూ, దాని కాంతి ద్వారా సన్మార్గము వైపునకు మార్గమును పొందతూ,నేర్చుకోవటానికి,నేర్పించటానికి దానిపై ముందడుగు వేస్తూ పోవాలి.

• ندم المجرمين يوم القيامة حيث ضيعوا الأوقات الكثيرة، وقطعوها ساهين لاهين، معرضين عما ينفعهم، مقبلين على ما يضرهم.
ప్రళయదినాన అపరాధుల అవమానము ఏవిధంగానంటే వారు చాలా సమయములను వృధా చేశారు మరియు వాటిని అశ్రద్ధ వహిస్తూ,అలక్ష్యము చేస్తూ,తమకు ప్రయోజనం చేకూర్చే వాటి నుండి విముఖత చూపుతూ,తమకు నష్టం కలిగించే వాటిపై ముందడుగు వేస్తూ గడిపారు.

فَتَعٰلَی اللّٰهُ الْمَلِكُ الْحَقُّ ۚ— وَلَا تَعْجَلْ بِالْقُرْاٰنِ مِنْ قَبْلِ اَنْ یُّقْضٰۤی اِلَیْكَ وَحْیُهٗ ؗ— وَقُلْ رَّبِّ زِدْنِیْ عِلْمًا ۟
అయితే అల్లాహ్ మహోన్నతుడు,పరిశుద్ధుడు,మహత్యము కలవాడు,ప్రతీ వస్తువు యొక్క అధికారము కల సార్వభౌముడు,అతడు సత్యుడు,అతని మాట సత్యము,ముష్రికులు ఆయనకు వర్ణిస్తున్న గుణాల నుండి ఆయన అతీతుడు. ఓ ప్రవక్తా మీరు జిబ్రయీల్ మీకు ఖుర్ఆన్ చేరవేయటమును ముగించక ముందే జిబ్రయీల్ తో పాటు ఖుర్ఆన్ పారాయణం చేయటంలో తొందర పడకండి. మరియు మీరు ఇలా పలకండి : ఓ నా ప్రభువా నీవు నాకు నేర్పించిన జ్ఞానమును వృద్ధిపరచు.
Las Exégesis Árabes:
وَلَقَدْ عَهِدْنَاۤ اِلٰۤی اٰدَمَ مِنْ قَبْلُ فَنَسِیَ وَلَمْ نَجِدْ لَهٗ عَزْمًا ۟۠
మరియు మేము ముందు నుంచే ఆదమ్ ను ఆ వృక్షము నుండి తినకూడదని సూచించాము. మరియు మేము ఆయనను దాని నుండి వారించాము. ఆయనకు దాని పరిణామం ఏమవుతుందో కూడా స్పష్టపరిచాము. అయితే అతను సూచనను మరచి వృక్షము నుండి తినివేశాడు. మరియు దాని గురించి ఓపిక పట్టలేదు. మేము దేని గురించైతే అతనికి సూచించామో దానిని పరిరక్షించటంపై అతనికి దృడ సంకల్పమున్నట్లు మేము చూడలేదు.
Las Exégesis Árabes:
وَاِذْ قُلْنَا لِلْمَلٰٓىِٕكَةِ اسْجُدُوْا لِاٰدَمَ فَسَجَدُوْۤا اِلَّاۤ اِبْلِیْسَ ؕ— اَبٰی ۟
ఓ ప్రవక్తా మేము దైపదూతలను ఆదమ్ కొరకు గౌరవప్రదమైన సాష్టాంగపడమని పలికినప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు వారితోపాటు ఉన్న ఇబ్లీసు తప్ప వారందరు సాష్టాంగపడ్డారు. అతడు వారిలో నుంచి కాడు. అతడు అహంకారముతో సాష్టాంగపడ లేదు.
Las Exégesis Árabes:
فَقُلْنَا یٰۤاٰدَمُ اِنَّ هٰذَا عَدُوٌّ لَّكَ وَلِزَوْجِكَ فَلَا یُخْرِجَنَّكُمَا مِنَ الْجَنَّةِ فَتَشْقٰی ۟
అప్పుడు మేము ఇలా పలికాము : ఓ ఆదమ్ నిశ్ఛయంగా ఇబ్లీసు నీకూ శతృవు,నీ భార్యకూ శతృవు. అతడు దేని గురించైతే ఆలోచనలను రేకెత్తించాడో వాటిలో అతడిని అనుసరించటం ద్వారా అతడు నిన్ను,నీ భార్యను స్వర్గము నుండి వెళ్ళగొట్టకూడదు. అప్పుడు మీరు కష్టాలను,బాధలను మోయవలసి ఉంటుంది.
Las Exégesis Árabes:
اِنَّ لَكَ اَلَّا تَجُوْعَ فِیْهَا وَلَا تَعْرٰی ۟ۙ
నిశ్ఛయంగా నీకు స్వర్గంలో ఆకలి కలగకుండా ఉండటానికి నీకు తినిపించటం,నీవు నగ్నంగా ఉండకుండా ఉండటానికి నీకు దుస్తులను తొడిగించటం నీ కొరకు అల్లాహ్ పై బాధ్యత కలదు.
Las Exégesis Árabes:
وَاَنَّكَ لَا تَظْمَؤُا فِیْهَا وَلَا تَضْحٰی ۟
నీకు దాహం కలగకుండా ఉండటానికి ఆయన నీకు త్రాపించటం,నీకు సూర్యుని తాపము తగలకుండా ఉండటానికి నీకు నీడనివ్వటం.
Las Exégesis Árabes:
فَوَسْوَسَ اِلَیْهِ الشَّیْطٰنُ قَالَ یٰۤاٰدَمُ هَلْ اَدُلُّكَ عَلٰی شَجَرَةِ الْخُلْدِ وَمُلْكٍ لَّا یَبْلٰی ۟
అప్పుడు షైతాను ఆదమ్ నకు దుష్ప్రేరణలను కలిగించి ఆయనతో ఇలా పలికాడు : నేను నీకు ఒక వృక్షం చూపించనా దాని నుండి తినే వాడు ఎన్నటికి మరణించడు,అంతే కాక అతడు ఎల్లప్పుడు జీవించి ఉండిపోతాడు. మరియు అంతం కాని సమాప్తమవ్వని నిరంతర సామ్రాజ్యమును అదీష్టిస్తాడు ?!.
Las Exégesis Árabes:
فَاَكَلَا مِنْهَا فَبَدَتْ لَهُمَا سَوْاٰتُهُمَا وَطَفِقَا یَخْصِفٰنِ عَلَیْهِمَا مِنْ وَّرَقِ الْجَنَّةِ ؗ— وَعَصٰۤی اٰدَمُ رَبَّهٗ فَغَوٰی ۪۟ۖ
అప్పుడు ఆదమ్ మరియు హవ్వా ఏ వృక్షము నుండి తినటం నుండి వారించబడ్డారో దాని నుండే తిన్నారు. అప్పుడు వారి మర్మావయవాలు కప్పబడి ఉన్న తరువాత కూడా బహిర్గతమైపోయినవి. మరియు వారు స్వర్గ వృక్షాల ఆకులను లాగి వాటితో తమ మర్మావయవాలను కప్పుకోసాగారు. ఎప్పుడైతే అతడు వృక్షము నుండి తినటము నుండి జాగ్రత్త పడే విషయంలో తన ప్రభువు ఆదేశమును పాటంచలేదో ఆదమ్ తన ప్రభువు ఆదేశమును ఉల్లంఘించారు. తన కొరకు సమ్మతం కాని దానిలో అతిక్రమించారు.
Las Exégesis Árabes:
ثُمَّ اجْتَبٰهُ رَبُّهٗ فَتَابَ عَلَیْهِ وَهَدٰی ۟
ఆ తరువాత అల్లాహ్ ఆయనను ఎన్నుకున్నాడు. మరియు ఆయన పశ్ఛాత్తాపమును అంగీకరించి ఆయనకు సన్మార్గముపై నడిచే అనుగ్రహమును కలిగించాడు.
Las Exégesis Árabes:
قَالَ اهْبِطَا مِنْهَا جَمِیْعًا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۚ— فَاِمَّا یَاْتِیَنَّكُمْ مِّنِّیْ هُدًی ۙ۬— فَمَنِ اتَّبَعَ هُدَایَ فَلَا یَضِلُّ وَلَا یَشْقٰی ۟
అల్లాహ్ ఆదమ్,హవ్వాలతో ఇలా పలికాడు : మీరిద్దరూ,ఇబ్లీసు స్వర్గము నుండి దిగిపోండి. అయితే అతడు మీ ఇద్దరికి శతృవు మరియు మీరిద్దరు అతనికి శతృవులు. ఒక వేళ నా వద్ద నుండి మీ వద్దకు నా మార్గము కొరకు స్పష్టత వస్తే అప్పుడు మీలో నుండి ఎవరు నా మార్గము స్పష్టతను అనుసరించి దాని ప్రకారం ఆచరించి దాని నుండి తప్పుకోరో వారు సత్యము నుండి తప్పిపోరు మరియు పరలోకములో శిక్ష ద్వారా బాధపడరు. అంతే కాదు అల్లాహ్ వారిని స్వర్గములో ప్రవేశింపజేస్తాడు.
Las Exégesis Árabes:
وَمَنْ اَعْرَضَ عَنْ ذِكْرِیْ فَاِنَّ لَهٗ مَعِیْشَةً ضَنْكًا وَّنَحْشُرُهٗ یَوْمَ الْقِیٰمَةِ اَعْمٰی ۟
మరియు ఎవరైతే నా ధ్యానము నుండి విముఖత చూపి దాన్ని స్వీకరించడో మరియు దానికి స్పందించడో అటువంటి వాడికి ఇహలోకంలో,బర్జఖ్ లో ఇరుకైన జీవితం ఉంటుంది.మరియు మేము వాడిని ప్రళయదినాన దృష్టిని,ఆధారమును కోల్పోయిన వాడిగా హషర్ మైదానంలో తీసుకుని వస్తాము.
Las Exégesis Árabes:
قَالَ رَبِّ لِمَ حَشَرْتَنِیْۤ اَعْمٰی وَقَدْ كُنْتُ بَصِیْرًا ۟
ధ్యానము నుండి విముఖత చూపిన ఇతడు ఇలా పలుకుతాడు : ఓ నా ప్రభువా ఈ రోజు ఎందుకు నన్ను గ్రుడ్డివానిగా లేపావు,వాస్తవానికి నేను ఇహలోకములో చూడగలిగే వాడిని.
Las Exégesis Árabes:
Beneficios de los versículos de esta página:
• الأدب في تلقي العلم، وأن المستمع للعلم ينبغي له أن يتأنى ويصبر حتى يفرغ المُمْلِي والمعلم من كلامه المتصل بعضه ببعض.
జ్ఞానమును పొందటంలో పద్దతి ఏమిటంటే జ్ఞానమును వినేవాడు వ్రాయించేవాడు,నేర్పించేవాడు ఒక దానితో ఒకటి జత కలిగిన అతని మాటలను పూర్తి చేసేవరకు సహనమును,ఓర్పును పాటించాలి.

• نسي آدم فنسيت ذريته، ولم يثبت على العزم المؤكد، وهم كذلك، وبادر بالتوبة فغفر الله له، ومن يشابه أباه فما ظلم.
ఆదం మరచిపోయారు,ఆయన సంతానమూ మరచిపోయింది. మరియు ఆయన దృడసంకల్పముపై స్థిరంగా ఉండలేకపోయారు. మరియు వారు కూడా అలాగే. మరియు ఆయన శీఘ్రంగా తౌబా చేశారు,అప్పుడు అల్లాహ్ ఆయన తౌబాను స్వీకరించాడు. మరియు ఎవరైతే తన తండ్రి లాగ చేస్తాడో అతనిని హింసించటం జరగదు.

• فضيلة التوبة؛ لأن آدم عليه السلام كان بعد التوبة أحسن منه قبلها.
తౌబా ప్రముఖ్యత ఉన్నది. ఎందుకంటే ఆదం అలైహిస్సలాం తౌబా తరువాత దాని ముందుకన్న మంచిగా ఉన్నారు.

• المعيشة الضنك في دار الدنيا، وفي دار البَرْزَخ، وفي الدار الآخرة لأهل الكفر والضلال.
ఇరుకైన జీవితము ఇహలోక గృహములో,బర్జఖ్ గృహములో ఉండును. పరలోక గృహములో అవిశ్వాసపరులు,మార్గ భ్రష్టుల కొరకు ఉండును.

قَالَ كَذٰلِكَ اَتَتْكَ اٰیٰتُنَا فَنَسِیْتَهَا ۚ— وَكَذٰلِكَ الْیَوْمَ تُنْسٰی ۟
మహోన్నతుడైన అల్లాహ్ అతన్ని ఖండిస్తూ ఇలా పలుకుతాడు : ఇదే విధంగా నీవు ఇహలోకంలో చేశావు, మా సూచనలు నీ వద్దకు వచ్చినవి. అప్పుడు నీవు వాటి నుండి విముఖత చూపి వాటిని వదిలివేశావు. మరియు అలాగే ఈ రోజు నీవు శిక్షలో వదిలివేయబడతావు.
Las Exégesis Árabes:
وَكَذٰلِكَ نَجْزِیْ مَنْ اَسْرَفَ وَلَمْ یُؤْمِنْ بِاٰیٰتِ رَبِّهٖ ؕ— وَلَعَذَابُ الْاٰخِرَةِ اَشَدُّ وَاَبْقٰی ۟
నిషిద్ధ కోరికల్లో మునిగి ఉండి,తన ప్రభువు వద్ద నుండి వచ్చిన స్పష్టమైన ఆధారాలపై విశ్వాసము నుండి విముఖత చూపిన వాడిని మేము ఈ విధమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. పరలోకములో అల్లాహ్ విధించే శిక్ష ఇహలోకములోని,బర్జఖ్ లోని ఇరుకైన జీవితము కన్న ఎక్కువ భయంకరముగా,తీవ్రంగా,శాస్వతంగా ఉంటుంది.
Las Exégesis Árabes:
اَفَلَمْ یَهْدِ لَهُمْ كَمْ اَهْلَكْنَا قَبْلَهُمْ مِّنَ الْقُرُوْنِ یَمْشُوْنَ فِیْ مَسٰكِنِهِمْ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّاُولِی النُّهٰی ۟۠
ఏమీ ముష్రికులకి మేము వారి కన్న ముందు తుదిముట్టించిన ఎన్నో సమాజాల వారు స్పష్టం కాలేదా ?. వారు వినాశనమునకు గురైన ఈ సమాజముల వారి నివాసములలోనే తిరుగుతున్నారు,వారికి సంభవించిన వాటి గుర్తులను కళ్ళారా చూస్తున్నారు. నిశ్ఛయంగా ఈ చాలా సమాజాల వారికి కలిగిన వినాశనము,విధ్వంసములో బుద్ధిమంతుల కొరకు గుణపాఠము కలదు.
Las Exégesis Árabes:
وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَّبِّكَ لَكَانَ لِزَامًا وَّاَجَلٌ مُّسَمًّی ۟ؕ
ఓ ప్రవక్తా ఒక వేళ నీ ప్రభువు వాదన చేయక ముందే ఎవరిని శిక్షించడని నీ ప్రభువు వద్ద నుండి మాట ముందే జరగక ఉండి ఉంటే,అతని వద్ద వారి కొరకు గడువు ముందే నిర్ణయించకుండా ఉంటే వారిని తొందరగా శిక్షించే వాడు వారు దానికి అర్ఙులు కావటం వలన.
Las Exégesis Árabes:
فَاصْبِرْ عَلٰی مَا یَقُوْلُوْنَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوْعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوْبِهَا ۚ— وَمِنْ اٰنَآئِ الَّیْلِ فَسَبِّحْ وَاَطْرَافَ النَّهَارِ لَعَلَّكَ تَرْضٰی ۟
ఓ ప్రవక్తా మీతో తిరస్కారులు పలికే అసత్యపు గుణాల పై సహనం పాటించండి. మరియు మీరు సూర్యుడు ఉదయించక మునుపు ఫజర్ నమాజులో,దాని అస్తమించక మునుపు అసర్ నమాజులో,రాత్రి వేళల్లో నుండి మగ్రిబ్,ఇషా నమాజులో,దినపు మొదటి ఘడియల ముగింపు తరువాత సూర్యుడు వాలేటప్పుడు జుహర్ నమాజులో,దినపు రెండవ ఘడియల ముగింపు తరువాత మగ్రిబ్ నమాజులో మీరు ఇష్టపడే ప్రతిఫలమును అల్లాహ్ వద్ద మీరు పొందుతారని ఆశిస్తూ మీ ప్రభువు స్థుతులను కొనియాడుతూ పరిశుద్ధతను పలకండి.
Las Exégesis Árabes:
وَلَا تَمُدَّنَّ عَیْنَیْكَ اِلٰی مَا مَتَّعْنَا بِهٖۤ اَزْوَاجًا مِّنْهُمْ زَهْرَةَ الْحَیٰوةِ الدُّنْیَا ۙ۬— لِنَفْتِنَهُمْ فِیْهِ ؕ— وَرِزْقُ رَبِّكَ خَیْرٌ وَّاَبْقٰی ۟
ఈ అన్ని రకాల తిరస్కారుల కొరకు వారిని మేము పరీక్షించటానికి మేము ఇచ్చి ఉంచిన ప్రాపంచిక జీవిత వైభవాల్లోంచి వారు ప్రయోజనం చెందుతుతున్న వాటి వైపుకు మీరు చూడకండి. నిశ్ఛయంగా వాటిలో నుండి మేము వారి కొరకు తయారు చేసినది తరిగిపోవును. మరియు నీ ప్రభువు ప్రసాదించే ప్రతిఫలం దేని గురించైతే ఆయన నీకు వాగ్దానం చేశాడో చివరికి నీవు సంతుష్టపడ్డావో అది ఇహలోకంలో తరిగిపోయే, వారు ప్రయోజనం చెందే దాని కంటే ఎంతో మేలైనది,శాస్వతమైనది. ఎందుకంటే అది అంతమవ్వదు.
Las Exégesis Árabes:
وَاْمُرْ اَهْلَكَ بِالصَّلٰوةِ وَاصْطَبِرْ عَلَیْهَا ؕ— لَا نَسْـَٔلُكَ رِزْقًا ؕ— نَحْنُ نَرْزُقُكَ ؕ— وَالْعَاقِبَةُ لِلتَّقْوٰی ۟
ఓ ప్రవక్త మీరు మీ ఇంటివారిని నమాజు పాటించమని ఆదేశించండి. మరియు మీరూ దానిని పాటించటంలో సహనం చూపండి. మేము నీతో నీ స్వయం కొరకు,ఇతరుల కొరకు ఎటువంటి ఆహారమును ఆశించము. మేమే నీకు ఆహారమును ప్రసాదించి పోషిస్తాము. ఇహ,పరలోకాల్లో ప్రశంసనీయమైన పరిణామము అల్లాహ్ తో భయపడి ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండే భీతిపరుల కొరకు ఉన్నది.
Las Exégesis Árabes:
وَقَالُوْا لَوْلَا یَاْتِیْنَا بِاٰیَةٍ مِّنْ رَّبِّهٖ ؕ— اَوَلَمْ تَاْتِهِمْ بَیِّنَةُ مَا فِی الصُّحُفِ الْاُوْلٰی ۟
మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించే ఈ అవిశ్వాసపరులందరు ఇలా పలికారు : ఎందుకని ముహమ్మద్ తన నిజాయితీ పై,తాను ప్రవక్త అన్న దానిపై సూచించే ఏదైన చిహ్నమును తన ప్రభువు వద్ద నుండి మా వద్దకు తీసుకుని రాడు ?. ఏమీ ఈ తిరస్కారులందరి వద్దకు ఆ ఖుర్ఆన్ ఏదైతే తన పూర్వ దివ్య గ్రంధములను దృవీకరించేదో రాలేదా ?!.
Las Exégesis Árabes:
وَلَوْ اَنَّاۤ اَهْلَكْنٰهُمْ بِعَذَابٍ مِّنْ قَبْلِهٖ لَقَالُوْا رَبَّنَا لَوْلَاۤ اَرْسَلْتَ اِلَیْنَا رَسُوْلًا فَنَتَّبِعَ اٰیٰتِكَ مِنْ قَبْلِ اَنْ نَّذِلَّ وَنَخْزٰی ۟
ఒక వేళ మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమును తిరస్కరించిన వీరందరిని వారి వద్దకు మేము ఒక ప్రవక్తను పంపించక ముందు,ఏదైన గ్రంధమును మేము అవతరింపచేయక ముందు వారి అవిశ్వాసం వలన,వారి తిరస్కారము వలన వారిపై శిక్షను అవతరింపజేయటం ద్వారా వినాశనమునకు గురి చేసి ఉంటే ప్రళయదినాన వారు తమ అవిశ్వాసము నుండి క్షమాపణ కోరుతూ ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా నీవు ఎందుకని ఇహలోకంలో మా వద్దకు ఒక ప్రవక్తని పంపించ లేదు ?. నీ శిక్ష వలన మాపై అవమానము,పరాభవము కలగక ముందే ఆయనను విశ్వసించి,ఆయన తీసుకుని వచ్చిన ఆయతులను అనుసరించి ఉండే వాళ్ళము.
Las Exégesis Árabes:
قُلْ كُلٌّ مُّتَرَبِّصٌ فَتَرَبَّصُوْا ۚ— فَسَتَعْلَمُوْنَ مَنْ اَصْحٰبُ الصِّرَاطِ السَّوِیِّ وَمَنِ اهْتَدٰی ۟۠
ఓ ప్రవక్తా ఈ తిరస్కారులందరితో ఇలా పలకండి : మనలో నుండి,మీలో నుండి ప్రతి ఒక్కరు అల్లాహ్ ఏమి చేస్తాడోనని నిరీక్షిస్తున్నారు. అయితే మీరు కూడా నిరీక్షించండి. ఖచ్చితంగా మీరు తొందరలోనే తెలుసుకుంటారు ఎవరు సన్మార్గ వంతులు,ఎవరు సన్మార్గం పొందుతారో మేమా లేదా మీరా ?.
Las Exégesis Árabes:
Beneficios de los versículos de esta página:
• من الأسباب المعينة على تحمل إيذاء المعرضين استثمار الأوقات الفاضلة في التسبيح بحمد الله.
విముఖులు పెట్టే బాధలను భరించటమునకు సహాయక కారణాల్లొంచి ఒకటి మంచి సమయములను అల్లాహ్ స్థుతులను పలుకుతూ పరిశుద్ధతను కొనియాడటంలో ఉపయోగించటం.

• ينبغي على العبد إذا رأى من نفسه طموحًا إلى زينة الدنيا وإقبالًا عليها أن يوازن بين زينتها الزائلة ونعيم الآخرة الدائم.
దాసుడు తన మనస్సును ప్రాపంచిక అలంకరణను ఆశిస్తూ దాని వైపు ముందడుగు వేస్తున్నట్లు చూస్తే అతడు అంతమైపోయే దాని అలంకరణకు శాస్వతంగా ఉండే పరలోక అనుగ్రహాలకు మధ్య తూలమేయాలి.

• على العبد أن يقيم الصلاة حق الإقامة، وإذا حَزَبَهُ أمْر صلى وأَمَر أهله بالصلاة، وصبر عليهم تأسيًا بالرسول صلى الله عليه وسلم.
దాసుడు నమాజును ఏ విధంగా పాటించే హక్కు ఉన్నదో ఆ విధంగా పాటించటం తప్పనిసరి. అతని ముందట ఏదైన విషయం వచ్చినప్పుడు అతడు నమాజు పాటించాలి.మరియు తమ ఇంటి వారికి నమాజు పాటించమని ఆదేశించాలి. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాంను నమూనాగా తీసుకుని వాటిపై సహనం చూపాలి.

• العاقبة الجميلة المحمودة هي الجنة لأهل التقوى.
అందమైన,ప్రశంసనీయమైన పరిణామము అది స్వర్గము దైవ భీతి కలవారి కొరకు ఉన్నది.

 
Traducción de significados Capítulo: Sura Taa, Haa
Índice de Capítulos Número de página
 
Traducción de los significados del Sagrado Corán - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Índice de traducciones

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Cerrar