Check out the new design

Traducción de los significados del Sagrado Corán - La traducción telugu del abreviado de la exégesis del Noble Corán * - Índice de traducciones


Traducción de significados Capítulo: Ash-Shura   Versículo:
وَمِنْ اٰیٰتِهِ الْجَوَارِ فِی الْبَحْرِ كَالْاَعْلَامِ ۟ؕ
మరియు సముద్రంలో పర్వతములవలె తమ ఎత్తులో మరియు తమ పొడుగవటంలో పయనించే ఓడలు అల్లాహ్ సామర్ధ్యముపై,ఆయన ఏకత్వముపై సూచించే సూచనలు.
Las Exégesis Árabes:
اِنْ یَّشَاْ یُسْكِنِ الرِّیْحَ فَیَظْلَلْنَ رَوَاكِدَ عَلٰی ظَهْرِهٖ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُوْرٍ ۟ۙ
ఒక వేళ అల్లాహ్ వాటిని నడిపించే గాలులను ఆపదలచితే వాటిని ఆపివేస్తాడు. అప్పుడు అవి సముద్రంలోనే చలనం లేకుండి స్థిరంగా ఉండిపోతాయి. నిశ్చయంగా ఈ ప్రస్తావించబడిన ఓడలను సృష్టించటం మరియు గాలులను ఆదీనం చేయటంలో ఆపదపై,కష్టంపై బాగా సహనం చూపే,తన పై ఉన్న అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞత తెలుపుకునే ప్రతీ ఒక్కరి కొరకు అల్లాహ్ సామర్ధ్యంపై స్పష్టమైన సూచనలు కలవు.
Las Exégesis Árabes:
اَوْ یُوْبِقْهُنَّ بِمَا كَسَبُوْا وَیَعْفُ عَنْ كَثِیْرٍ ۟ۙ
లేదా పరిశుద్ధుడైన ఆయన ప్రజలు చేసుకున్న పాపముల వలన ఈ ఓడలను వాటిపై తీవ్రమైన పెను గాలులను పంపించి నాశనం చేయదలచుకుంటే వాటిని నాశనం చేసేవాడు. మరియు ఆయన తన దాసుల చాలా పాపములను మన్నించివేస్తాడు. వాటిపై ఆయన వారిని శిక్షించడు.
Las Exégesis Árabes:
وَّیَعْلَمَ الَّذِیْنَ یُجَادِلُوْنَ فِیْۤ اٰیٰتِنَا ؕ— مَا لَهُمْ مِّنْ مَّحِیْصٍ ۟
మరియు తీవ్ర పెనుగాలులు పంపించటం వలన ఈ ఓడల వినాశనము చేసేటప్పుడు అల్లాహ్ సూచనలను అసత్యపరిచే విషయంలో వాదులాడే వారు తమకు వినాశనం నుండి పారిపోయే ఎటువంటి ప్రదేశము లేదని తెలుసుకుంటారు. అప్పుడు వారు అల్లాహ్ ను మాత్రమే వేడుకుంటారు. ఇతరులను వదిలివేస్తారు.
Las Exégesis Árabes:
فَمَاۤ اُوْتِیْتُمْ مِّنْ شَیْءٍ فَمَتَاعُ الْحَیٰوةِ الدُّنْیَا ۚ— وَمَا عِنْدَ اللّٰهِ خَیْرٌ وَّاَبْقٰی لِلَّذِیْنَ اٰمَنُوْا وَعَلٰی رَبِّهِمْ یَتَوَكَّلُوْنَ ۟ۚ
ప్రజలారా మీరు ప్రసాదించబడిన సంపద,స్థానము,సంతానము ఇహలోక జీవిత సంపద మాత్రమే. మరియు అది తరిగిపోయేది,అంతమైపోయేది. మరియు అల్లాహ్ పై,ఆయన ప్రవక్తలపై విశ్వాసమును కనబరచి,తమ వ్యవహారములన్నింటిలో ఒక్కడైన తమ ప్రభువు పై నమ్మకమును కలిగిన వారి కౌరకు అల్లాహ్ సిద్ధం చేసి ఉంచిన స్వర్గ అనుగ్రహాలు శాశ్వతమైన అనుగ్రహాలు కలవు.
Las Exégesis Árabes:
وَالَّذِیْنَ یَجْتَنِبُوْنَ كَبٰٓىِٕرَ الْاِثْمِ وَالْفَوَاحِشَ وَاِذَا مَا غَضِبُوْا هُمْ یَغْفِرُوْنَ ۟ۚ
మరియు పెద్ద పాపముల నుండి,వాటి చెడుల నుండి దూరంగా ఉండేవారు తమకు మాటల ద్వారా,చేతల ద్వారా చెడు చేసిన వాడిపై ఆగ్రహానికి లోనయినప్పుడు అతనికి అతని అవమానపరచటమును మన్నించివేసి,వాటిపై అతన్ని శిక్షించరు. మరియు ఈ మన్నింపు అందులో ఏదైన మేలు,ప్రయోజనం ఉండినప్పుడు వారి తరపు నుండి అనుగ్రహము.
Las Exégesis Árabes:
وَالَّذِیْنَ اسْتَجَابُوْا لِرَبِّهِمْ وَاَقَامُوا الصَّلٰوةَ ۪— وَاَمْرُهُمْ شُوْرٰی بَیْنَهُمْ ۪— وَمِمَّا رَزَقْنٰهُمْ یُنْفِقُوْنَ ۟ۚ
మరియు వారే తమ ప్రభువునకు ఆయన ఆదేశమును పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆజ్ఞాపాలన చేసేవారు మరియు నమాజులను పరిపూర్ణ రీతిలో సంపూర్ణం చేసేవారు. మరియు వారు తమ అత్యవసర వ్యవహారములలో పరస్పర సంప్రదింపులు చేసుకుంటారు మరియు మేము వారికి ప్రసాదించిన వాటిలో నుండి అల్లాహ్ మన్నతను ఆశిస్తూ ఖర్చు చేస్తారు.
Las Exégesis Árabes:
وَالَّذِیْنَ اِذَاۤ اَصَابَهُمُ الْبَغْیُ هُمْ یَنْتَصِرُوْنَ ۟
మరియు వారు తమకు అన్యాయం జరిగినప్పుడు తమ స్వయం యొక్క గౌరవానికి,ఆధిక్యతకి ప్రతీకారం తీర్చుకుంటారు. అన్యాయానికి ఒడిగట్టినవాడు క్షమాపణకు అర్హుడు కానప్పుడు. మరియు ఈ ప్రతీకారము సరైనదే. ప్రత్యేకంగా మన్నింపులో ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు.
Las Exégesis Árabes:
وَجَزٰٓؤُا سَیِّئَةٍ سَیِّئَةٌ مِّثْلُهَا ۚ— فَمَنْ عَفَا وَاَصْلَحَ فَاَجْرُهٗ عَلَی اللّٰهِ ؕ— اِنَّهٗ لَا یُحِبُّ الظّٰلِمِیْنَ ۟
మరియు ఎవరైతే తన హక్కును తీసుకోదలచుకుంటాడో అది అతనికే చెందుతుంది. కానీ అది ఏ విధమైన అధికం చేయకుండా మితిమీరకుండా ఎలా ఉన్నదో అలా. మరియు ఎవరైతే తనకు కీడు చేసిన వాడికి మన్నించి,తనకు కీడు కలిగించిన దానిపై అతనికి శిక్షించకుండా తనకు మరియు తన సోదరునికి మధ్య ఉన్న దాన్ని సరిదిద్దుకుంటాడో అతని పుణ్యము అల్లాహ్ వద్ద ఉన్నది. నిశ్చయంగా ప్రజలపై వారి ప్రాణముల విషయంలో,వారి సంపదల విషయంలో,వారి మానముల విషయంలో అన్యాయం చేసేవారిని అల్లాహ్ ఇష్టపడడు. అంతేకాక వారిని ధ్వేషిస్తాడు.
Las Exégesis Árabes:
وَلَمَنِ انْتَصَرَ بَعْدَ ظُلْمِهٖ فَاُولٰٓىِٕكَ مَا عَلَیْهِمْ مِّنْ سَبِیْلٍ ۟ؕ
మరియు ఎవరైతే తన స్వయం కొరకు ప్రతీకారం తీర్చుకుంటారో వారందరిపై తమ హక్కును తీసుకోవటం వలన ఎటువంటి నింద లేదు.
Las Exégesis Árabes:
اِنَّمَا السَّبِیْلُ عَلَی الَّذِیْنَ یَظْلِمُوْنَ النَّاسَ وَیَبْغُوْنَ فِی الْاَرْضِ بِغَیْرِ الْحَقِّ ؕ— اُولٰٓىِٕكَ لَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟
నింద మరియు శిక్ష మాత్రం ప్రజలకు అన్యాయం చేసి,భువిలో పాపకార్యాలకు పాల్పడే వారికి మాత్రమే ఉంటుంది. వారందరి కొరకు పరలోకంలో బాధాకరమైన శిక్ష కలదు.
Las Exégesis Árabes:
وَلَمَنْ صَبَرَ وَغَفَرَ اِنَّ ذٰلِكَ لَمِنْ عَزْمِ الْاُمُوْرِ ۟۠
ఇక ఎవరైతే ఇతరులు తనకు బాధ కలిగించటం పై సహించి వారిని మన్నించి వేస్తాడో నిశ్ఛయంగా ఆ సహనం అతనికి మరియు సమాజమునకు మేలును కలిగించును. మరియు అది పొగడబడిన విషయము. మరియు అతనికి గొప్ప భాగమే ప్రసాదించబడును.
Las Exégesis Árabes:
وَمَنْ یُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ وَّلِیٍّ مِّنْ بَعْدِهٖ ؕ— وَتَرَی الظّٰلِمِیْنَ لَمَّا رَاَوُا الْعَذَابَ یَقُوْلُوْنَ هَلْ اِلٰی مَرَدٍّ مِّنْ سَبِیْلٍ ۟ۚ
మరియు అల్లాహ్ ఎవరినైతే సన్మార్గము పొందటం నుండి విఫలం చేసి అతన్ని సత్యము నుండి తప్పించివేస్తాడో అతని కొరకు దాని తరువాత అతని వ్యవహారమును పరిరక్షించే పరిరక్షకుడు ఎవడూ ఉండడు. మరియు అవిశ్వాసముతో,పాపకార్యములతో తమ స్వయంపై దుర్మార్గమునకు పాలపడిన వారు ప్రళయదినమున శిక్షను కళ్ళారా చూసినప్పుడు ఈ విధంగా ఆశిస్తూ ఇలా పలుకుతుండగా మీరు చూస్తారు : మేము అల్లాహ్ తో తౌబా చేసుకోవటానికి ఇహలోకము వైపు మరలటం కొరకు ఏదైన మార్గం ఉన్నదా ?.
Las Exégesis Árabes:
Beneficios de los versículos de esta página:
• الصبر والشكر سببان للتوفيق للاعتبار بآيات الله.
సహనం చూపటం,కృతజ్ఞతలు తెలుపుకోవటం అల్లాహ్ ఆయతులపట్ల గుణపాఠం నేర్చుకోవటానికి రెండు కారకాలు.

• مكانة الشورى في الإسلام عظيمة.
ఇస్లాంలో సంప్రదింపులు చేసుకోవటం యొక్క స్థానము గొప్పది.

• جواز مؤاخذة الظالم بمثل ظلمه، والعفو خير من ذلك.
హింసాత్ముడికి అతని హింసకు తగిన విధంగా ప్రతీకారం తీసుకోవటం సమ్మతము. మరియు మన్నించి వేయటం దానికన్న ఉత్తమమైనది.

 
Traducción de significados Capítulo: Ash-Shura
Índice de Capítulos Número de página
 
Traducción de los significados del Sagrado Corán - La traducción telugu del abreviado de la exégesis del Noble Corán - Índice de traducciones

Emitido por el Centro Tafsir de Estudios Coránicos.

Cerrar