Check out the new design

Traducción de los significados del Sagrado Corán - La traducción telugu del abreviado de la exégesis del Noble Corán * - Índice de traducciones


Traducción de significados Capítulo: Al-Tawba   Versículo:
كَالَّذِیْنَ مِنْ قَبْلِكُمْ كَانُوْۤا اَشَدَّ مِنْكُمْ قُوَّةً وَّاَكْثَرَ اَمْوَالًا وَّاَوْلَادًا ؕ— فَاسْتَمْتَعُوْا بِخَلَاقِهِمْ فَاسْتَمْتَعْتُمْ بِخَلَاقِكُمْ كَمَا اسْتَمْتَعَ الَّذِیْنَ مِنْ قَبْلِكُمْ بِخَلَاقِهِمْ وَخُضْتُمْ كَالَّذِیْ خَاضُوْا ؕ— اُولٰٓىِٕكَ حَبِطَتْ اَعْمَالُهُمْ فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ ۚ— وَاُولٰٓىِٕكَ هُمُ الْخٰسِرُوْنَ ۟
ఓ కపట విశ్వాసము కల సమాజము వారా మీరు అవిశ్వాసములో,పరిహాసములో మీకన్న పూర్వం గతించిన తిరస్కార జాతుల్లాంటి వారు.వారు బలములో మీకన్న గొప్పవారు,సంపదలు,సంతానము ఎక్కువ కలవారు.వారు తమ కొరకు వ్రాయబడిన ఇహలోక సుఖాలు,వాటి కోరికల నుండి తమ భాగమును అనుభవించారు. ఓ కపట విశ్వాసము కలవారా మీరు కూడా మీ కొరకు వ్రాయబడిన మీ భాగమును మీకన్న పూర్వం గతించిన తిరస్కార జాతుల వారు తమ భాగమును అనుభవించినట్లు అనుభవించారు.మరియు మీరు సత్యాన్ని తిరస్కరించటంలో,దైవ ప్రవక్త విషయంలో అవహేళన చేయటంలో ఏవిధంగానైతే వారు దాన్ని తిరస్కరించటంలో,తమ ప్రవక్తల విషయంలో అవహేళన చేయటంలో పడి ఉన్నారో ఆ విధంగా పడి ఉన్నారు.ఈ దిగజారిన లక్షణాలు కలవారందరి ఆచరణలు అవిశ్వాసము వలన చెడిపోవటం వలన అల్లాహ్ వద్ద దేనికి పనికి రాకుండాపోయినవి.వారందరు నష్టపోయినారు ఎవరైతే తమని వినాశనమును కలిగించే చోట తీసుకుని వచ్చి తమ స్వయాన్ని నష్టం చేసుకున్నారో .
Las Exégesis Árabes:
اَلَمْ یَاْتِهِمْ نَبَاُ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ قَوْمِ نُوْحٍ وَّعَادٍ وَّثَمُوْدَ ۙ۬— وَقَوْمِ اِبْرٰهِیْمَ وَاَصْحٰبِ مَدْیَنَ وَالْمُؤْتَفِكٰتِ ؕ— اَتَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ ۚ— فَمَا كَانَ اللّٰهُ لِیَظْلِمَهُمْ وَلٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ یَظْلِمُوْنَ ۟
ఏమి ఈ కపటులందరికి తిరస్కార జాతులవారు పాల్పడిన కార్యాల సమాచారము,వారికి విధించబడిన శిక్ష సమాచారము చేరలేదా?.నూహ్ జాతి,హూద్ జాతి,సాలిహ్ జాతి,ఇబ్రాహీమ్ జాతి,మద్యన్ వారు,లూత్ జాతి బస్తీల సమాచారము .వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన ఋజువులను,స్పష్టమైన వాదనలను తీసుకుని వచ్చారు. అల్లాహ్ వారిపై హింసకు పాల్పడడు. వారి ప్రవక్తలు వారిని హెచ్చరించారు. కాని వారు అల్లాహ్ పై అవిశ్వాసము,ఆయన ప్రవక్తను తిరస్కరిచటం లాంటి చర్యలకు పాల్పడటం వలన తమ స్వయంపై హింసకు పాల్పడ్డారు.
Las Exégesis Árabes:
وَالْمُؤْمِنُوْنَ وَالْمُؤْمِنٰتُ بَعْضُهُمْ اَوْلِیَآءُ بَعْضٍ ۘ— یَاْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَیَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ وَیُقِیْمُوْنَ الصَّلٰوةَ وَیُؤْتُوْنَ الزَّكٰوةَ وَیُطِیْعُوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ ؕ— اُولٰٓىِٕكَ سَیَرْحَمُهُمُ اللّٰهُ ؕ— اِنَّ اللّٰهَ عَزِیْزٌ حَكِیْمٌ ۟
విశ్వాసపరులైన పురుషులు,విశ్వాసపరులైన స్త్రీలు వారిలో విశ్వాసము సమీకరింపబడి ఉండటం వలన ఒకరికొకరు సహాయకులు,తోడ్పడేవారు. వారు మంచిని గురించి ఆదేశిస్తారు. మరియు అది ఆ ప్రతి కార్యము ఏదైతే అల్లాహ్ కు ఇష్టమైనదో ఆయన విధేయతకు సంబంధించినది తౌహీదు,నమాజుల్లాంటివి. మరియు వారు చెడు నుంచి వారిస్తారు.అది అల్లాహ్ కు ఇష్టం లేని అవిధేయతకు సంబంధించిన ఆ ప్రతి కార్యము అవిశ్వాసము,వడ్డీ లాంటివి. మరియు వారు నమాజులను పరిపూర్ణంగా నిర్వహిస్తారు. మరియు వారు అల్లాహ్ పై విధేయత చూపుతారు,ఆయన ప్రవక్తపై విధేయత చూపుతారు. ఈ ఉన్నతమైన లక్షణాలు కలిగిన వారందరిని తొందరలోనే అల్లాహ్ తన కారుణ్యములో ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ఆధిక్యతను చూపేవాడును ఆయనను ఎవరు ఓడించలేరు. ఆయన తన సృష్టించటంలో,తన పర్యాలోచనలో,తన ధర్మశాసనాల్లో వివేకవంతుడు.
Las Exégesis Árabes:
وَعَدَ اللّٰهُ الْمُؤْمِنِیْنَ وَالْمُؤْمِنٰتِ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا وَمَسٰكِنَ طَیِّبَةً فِیْ جَنّٰتِ عَدْنٍ ؕ— وَرِضْوَانٌ مِّنَ اللّٰهِ اَكْبَرُ ؕ— ذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِیْمُ ۟۠
అల్లాహ్ పై విశ్వాసమును కనబరచిన పురుషులకు మరియు ఆయనపై విశ్వాసమును కనబరచిన స్త్రీలకు ప్రళయదినాన స్వర్గవనాల్లో ప్రవేశింపజేస్తాడని అల్లాహ్ వాగ్దానం చేశాడు. వాటి భవనాల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి,వారు వాటిలో శాస్వతంగా నివాసముంటారు. వారు వాటిలో మరణించరు. మరియు వారి అనుగ్రహాలు అంతము కావు. మరియు ఆయన వారిని శాస్వతమైన స్వర్గవనాల్లో ఉన్న మంచి నివాస స్థలాల్లో ప్రవేశింపజేస్తాడని వాగ్దానం చేశాడు. మరియు అల్లాహ్ వారిపై కలిగించే ప్రసన్నత వీటన్నింటి కంటే చాలా పెద్దది. ఈ ప్రస్తావించబడిన ప్రతిఫలము ఎంత గొప్పదంటే దానికి సమానమగు ఎటువంటి ప్రతిఫలం లేదు.
Las Exégesis Árabes:
Beneficios de los versículos de esta página:
• سبب العذاب للكفار والمنافقين واحد في كل العصور، وهو إيثار الدّنيا على الآخرة والاستمتاع بها، وتكذيب الأنبياء والمكر والخديعة والغدر بهم.
అన్నీ కాలాల్లో అవిశ్వాసపరులకు,కపటులకు శిక్షకు కారణం ఒక్కటే. అది పరలోకమునకు బదులుగా ఇహలోకమునకు ప్రాధాన్యతనివ్వటం,దాని ద్వారా ప్రయోజనమును కోరటం,దైవప్రవక్తలను తిరస్కరించటం,కుట్రలు కుతంత్రాలు చేయటం,మోసంచేయటం,వారిపై తిరుగుబాటు చేయటం.

• إهلاك الأمم والأقوام الغابرة بسبب كفرهم وتكذيبهم الأنبياء فيه عظة وعبرة للمعتبر من العقلاء.
గతించిన జాతులు,సమాజాలు వారి అవిశ్వాసము,దైవ ప్రవక్తల పట్ల వారి తిరస్కారము వలన వారి వినాశనము అవటంలో గుణపాఠము నేర్చుకునే బుద్దిమంతులకు హితోపదేశము,గుణపాఠము ఉన్నది.

• أهل الإيمان رجالًا ونساء أمة واحدة مترابطة متعاونة متناصرة، قلوبهم متحدة في التوادّ والتحابّ والتعاطف.
విశ్వాసము కలవారు పురుషులు,స్త్రీలు పరస్పర సంబంధాలు కలిగిన,సహాయసహకారాలు అందించుకునే పరస్పరం తోడ్పడే ఒకే జాతికి చెందినవారు. వారి మనస్సులు ప్రేమఅనురాగాల్లో,ఇష్టతలో,దయాదాక్షిణ్యాల్లో కలిసిఉంటాయి.

• رضا رب الأرض والسماوات أكبر من نعيم الجنات؛ لأن السعادة الروحانية أفضل من الجسمانية.
భూమ్యాకాశముల ప్రభువు యొక్క మన్నత స్వర్గ వనాల అనుగ్రహముల కంటే గొప్పది.ఎందుకంటే ఆధ్యాత్మిక సంతోషము శారీరక సంతోషము కంటే ఉత్తమము.

 
Traducción de significados Capítulo: Al-Tawba
Índice de Capítulos Número de página
 
Traducción de los significados del Sagrado Corán - La traducción telugu del abreviado de la exégesis del Noble Corán - Índice de traducciones

Emitido por el Centro Tafsir de Estudios Coránicos.

Cerrar