Check out the new design

ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى تلغوی كتاب مختصر در تفسير قرآن كريم * - لیست ترجمه ها


ترجمهٔ معانی سوره: یونس   آیه:
فَلَوْلَا كَانَتْ قَرْیَةٌ اٰمَنَتْ فَنَفَعَهَاۤ اِیْمَانُهَاۤ اِلَّا قَوْمَ یُوْنُسَ ۚؕ— لَمَّاۤ اٰمَنُوْا كَشَفْنَا عَنْهُمْ عَذَابَ الْخِزْیِ فِی الْحَیٰوةِ الدُّنْیَا وَمَتَّعْنٰهُمْ اِلٰی حِیْنٍ ۟
మేము ఏ పల్లె వాసుల వద్దకు ప్రవక్తలను పంపించామో అందులో నుంచి ఏ ఒక పల్లె వాసులు కూడా శిక్షను కళ్ళారా చూడక ముందే షుమారు చేయబడే విశ్వాసమును కనబరచటం జరగలేదు.దాని విశ్వాసం దాన్ని (శిక్షను) కళ్ళారా చూడక ముందు అవటం వలన దానికి ప్రయోజనం చేకూర్చేది.కాని యూనుస్ జాతి వారు సత్య విశ్వాసమును కనబరచి నప్పుడు మేము వారి నుండి అవమానమునకు గురిచేసే శిక్షను ఇహలోకంలో తొలగించాము.వారి సమయం పూర్తయ్యే వరకు (వారి ఆయుష్షు పూర్తయ్యే వరకు) వారికి మేము ప్రయోజనం చేకూర్చాము.
تفسیرهای عربی:
وَلَوْ شَآءَ رَبُّكَ لَاٰمَنَ مَنْ فِی الْاَرْضِ كُلُّهُمْ جَمِیْعًا ؕ— اَفَاَنْتَ تُكْرِهُ النَّاسَ حَتّٰی یَكُوْنُوْا مُؤْمِنِیْنَ ۟
ఓ ప్రవక్తా ఒకవేళ నీ ప్రభువు భూమిలో ఉన్నవారందరి విశ్వాసమును కోరుకుంటే వారందరూ విశ్వసించే వారు.కాని ఆయన తన వివేకము వలన అలా కోరుకోలేదు.అతడు తన న్యాయముతో తాను కోరుకున్న వారిని మార్గభ్రష్టులు చేస్తాడు.మరియు అతడు తన అనుగ్రహము ద్వారా తాను కోరుకున్న వారికి సన్మార్గము చూపుతాడు.అయితే ప్రజలను వారు విశ్వాసపరులు అయిపోవటం పై మీరు బలవంతం చేయలేరు.విశ్వాసము కొరకు వారి అనుగ్రహము ఒక్కడైన అల్లాహ్ చేతిలో మాత్రమే ఉన్నది.
تفسیرهای عربی:
وَمَا كَانَ لِنَفْسٍ اَنْ تُؤْمِنَ اِلَّا بِاِذْنِ اللّٰهِ ؕ— وَیَجْعَلُ الرِّجْسَ عَلَی الَّذِیْنَ لَا یَعْقِلُوْنَ ۟
అల్లాహ్ అనుమతి లేకుండా ఏ వ్యక్తి తన తరపు నుండి విశ్వసించడం అసంభవం.ఆయన ఇచ్ఛతో మాత్రమే విశ్వాసం వాటిల్లుతుంది.వారిపై శోకముతో మీ ప్రాణము పోకూడదు.మరియు అల్లాహ్ వారిపై ఎవరైతే ఆయన నుండి ఆయన వాదనలను,ఆయన ఆదేశాలను,ఆయన వారింపులను అర్ధం చేసుకోరో శిక్షను,పరాభవమును కలిగిస్తాడు.
تفسیرهای عربی:
قُلِ انْظُرُوْا مَاذَا فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَمَا تُغْنِی الْاٰیٰتُ وَالنُّذُرُ عَنْ قَوْمٍ لَّا یُؤْمِنُوْنَ ۟
ఓ ప్రవక్తా మీతో సూచనలను అడిగే ముష్రికులతో ఇలా పలకండి : మీరు భూమ్యాకాశముల్లో అల్లాహ్ ఏకత్వమును,ఆయన సామర్ధ్యమును ఋజువు చేసే సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిలో యోచన చేయండి.మరియు సూచనలు,వాదనలు,ప్రవక్తల అవతరణ విశ్వాసములో తమ మొండితనము వలన విశ్వసించటానికి నైపుణ్యత లేని జాతి వారి విషయంలో ప్రయోజనం కలిగించదు.
تفسیرهای عربی:
فَهَلْ یَنْتَظِرُوْنَ اِلَّا مِثْلَ اَیَّامِ الَّذِیْنَ خَلَوْا مِنْ قَبْلِهِمْ ؕ— قُلْ فَانْتَظِرُوْۤا اِنِّیْ مَعَكُمْ مِّنَ الْمُنْتَظِرِیْنَ ۟
ఈ తిరస్కారులందరూ పూర్వ తిరస్కార జాతుల వారిపై అల్లాహ్ కలిగించిన సంఘటనల్లాంటి సంఘటనల కోసం నిరీక్షిస్తున్నారా ?.ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : మీరు అల్లాహ్ శిక్ష కోసం నిరీక్షించండి.నిశ్ఛయంగా నేను మీతో పాటు నా ప్రభువు వాగ్దానము కొరకు నిరీక్షించేవారిలోంచి ఉన్నాను.
تفسیرهای عربی:
ثُمَّ نُنَجِّیْ رُسُلَنَا وَالَّذِیْنَ اٰمَنُوْا كَذٰلِكَ ۚ— حَقًّا عَلَیْنَا نُنْجِ الْمُؤْمِنِیْنَ ۟۠
ఆ తరువాత మేము వారిపై శిక్షను అవతరింపజేస్తాము.మరియు మా ప్రవక్తలను మేము రక్షిస్తాము.మరియు వారితోపాటు విశ్వసించిన వారిని రక్షిస్తాము.అయితే వారి జాతి వారికి సంభవించినది వారికి సంభవించదు.ఈ ప్రవక్తలందరిని,వారితోపాటు విశ్వాసపరులను రక్షించినట్లు అల్లాహ్ ప్రవక్తను,ఆయనతోపాటు విశ్వాసపరులను ఖచ్చితంగా రక్షించటం మనపై తప్పనిసరి.
تفسیرهای عربی:
قُلْ یٰۤاَیُّهَا النَّاسُ اِنْ كُنْتُمْ فِیْ شَكٍّ مِّنْ دِیْنِیْ فَلَاۤ اَعْبُدُ الَّذِیْنَ تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ وَلٰكِنْ اَعْبُدُ اللّٰهَ الَّذِیْ یَتَوَفّٰىكُمْ ۖۚ— وَاُمِرْتُ اَنْ اَكُوْنَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟ۙ
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ ప్రజలారా ఒక వేళ నేను మిమ్మల్ని పిలుస్తున్న నా ధర్మ విషయంలో మీకు ఏదైనా సందేహం ఉన్నా వాస్తవానికి అది ఏకదైవోపాసన ధర్మం, మీ ధర్మం అవినీతిమయం అని ఖచ్చితంగా నాకు తెలుసు.అయితే నేను దాన్ని అనుసరించను.మీరు అల్లాహ్ ను వదిలి వేటినైతే ఆరాధిస్తున్నారో వాటిని నేను ఆరాధించను.కాని నేను మీకు మరణాన్ని ప్రసాదించే అల్లాహ్ ను ఆరాధిస్తున్నాను.మరియు ఆయన నేను ధర్మమును ఆయన కొరకు ప్రత్యేకించుకునే విశ్వాసపరుల్లోంచి అయిపోవాలని నన్ను ఆదేశించాడు.
تفسیرهای عربی:
وَاَنْ اَقِمْ وَجْهَكَ لِلدِّیْنِ حَنِیْفًا ۚ— وَلَا تَكُوْنَنَّ مِنَ الْمُشْرِكِیْنَ ۟
మరియు అలాగే నన్ను సత్య ధర్మముపై స్థిరముగా ఉండమని,ధర్మములన్నింటిని వదిలి దాని వైపునకు మరలి దానిపై స్థిరంగా ఉండమని ఆయన ఆదేశించాడు.ఆయనతోపాటు సాటి కల్పించే వారిలో అవటం నుండి నన్ను వారించాడు.
تفسیرهای عربی:
وَلَا تَدْعُ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَنْفَعُكَ وَلَا یَضُرُّكَ ۚ— فَاِنْ فَعَلْتَ فَاِنَّكَ اِذًا مِّنَ الظّٰلِمِیْنَ ۟
ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ ను వదిలి మీకు లాభం చేయటానికి ఎటువంటి లాభమునకు,మీకు నష్టం కలిగించటానికి ఎటవంటి నష్టమునకు అధికారములేని విగ్రహాలను,శిల్పాలను,ఇతరులను వేడుకోకండి.ఒక వేళ మీరు వాటిని ఆరాధిస్తే నిశ్చయంగా అప్పుడు మీరు అల్లాహ్ హక్కును,తమ స్వయం హక్కును అతిక్రమించిన దుర్మార్గుల్లోంచి అయిపోతారు.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• الإيمان هو السبب في رفعة صاحبه إلى الدرجات العلى والتمتع في الحياة الدنيا.
విశ్వాసము విశ్వాసపరునకి ఉన్నత స్థానాలు కలగటానికి,ఇహలోకములో లబ్ది పొందటానికి అది కారణమవుతుంది.

• ليس في مقدور أحد حمل أحد على الإيمان؛ لأن هذا عائد لمشيئة الله وحده.
ఏ వ్యక్తిని విశ్వసించటంపై ప్రోత్సహించటం ఎవరి అవశ్యంలో(చేతిలో) లేదు.ఎందుకంటే ఇది ఒక్కడైన అల్లాహ్ ఇచ్ఛ వైపునకు మరలుతుంది.

• لا تنفع الآيات والنذر من أصر على الكفر وداوم عليه.
అవిశ్వాసముపై మొండి వైఖరి కలిగి దానిపైనే ఎల్లప్పుడూ ఉండిపోయే వారికి సూచనలు,హెచ్చరికలు ప్రయోజనం చేకూర్చవు.

• وجوب الاستقامة على الدين الحق، والبعد كل البعد عن الشرك والأديان الباطلة.
సత్య ధర్మముపై స్థిరంగా ఉండటం,షిర్కు నుండి అసత్య ధర్మాల నుండి పూర్తిగా దూరంగా ఉండటం తప్పనిసరి.

 
ترجمهٔ معانی سوره: یونس
فهرست سوره ها شماره صفحه
 
ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى تلغوی كتاب مختصر در تفسير قرآن كريم - لیست ترجمه ها

مرکز تفسیر و پژوهش‌های قرآنى آن را منتشر كرده است.

بستن