ترجمهٔ معانی قرآن کریم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - لیست ترجمه ها


ترجمهٔ معانی آیه: (258) سوره: سوره بقره
اَلَمْ تَرَ اِلَی الَّذِیْ حَآجَّ اِبْرٰهٖمَ فِیْ رَبِّهٖۤ اَنْ اٰتٰىهُ اللّٰهُ الْمُلْكَ ۘ— اِذْ قَالَ اِبْرٰهٖمُ رَبِّیَ الَّذِیْ یُحْیٖ وَیُمِیْتُ ۙ— قَالَ اَنَا اُحْیٖ وَاُمِیْتُ ؕ— قَالَ اِبْرٰهٖمُ فَاِنَّ اللّٰهَ یَاْتِیْ بِالشَّمْسِ مِنَ الْمَشْرِقِ فَاْتِ بِهَا مِنَ الْمَغْرِبِ فَبُهِتَ الَّذِیْ كَفَرَ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟ۚ
ఓ ప్రవక్తా! అల్లాహ్ యొక్క సార్వభౌమత్వం మరియు ఏకత్వం గురించి ఇబ్రాహీముతో వాదించిన తిరుగుబాటుదారుడి దురహంకారం గురించి మీకు తెలుసా? అల్లాహ్ యే అతనికి పరిపాలించే అధికారాన్ని ప్రసాదించాడు. కానీ, అతడు హద్దుమీరి, తనకు ప్రసాదించబడిన గౌరవ స్థానాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. తన ప్రభువు యొక్క దివ్యలక్షణాలను ఇబ్రాహీము అతడికి వివరిస్తూ, 'నా ప్రభువు సృష్టికి ప్రాణం పోస్తాడు మరియు వారికి మరణాన్ని ఇస్తాడు'. తిరుగుబాటుదారుడు మొండిగా, 'నేను కూడా జీవన్మరణాలు శాసించ గలను. నేను తలుచుకున్న వారిని చంపగలను మరియు నేను తలుచుకున్న వారిని క్షమించి విడిచి పెట్టగలను’. వెంటనే ఇబ్రాహీము అతడి ముందు మరో బలమైన వాదన పెట్టారు, 'నేను ఆరాధించే ప్రభువు సూర్యుడిని తూర్పు దిశలో ఉదయింప జేస్తాడు; కాబట్టి నీవు దానిని పడమటి దిశ నుండి ఉదయింపజేయి!' ఈ బలమైన వాదనతో తిరుగుబాటుదారుడికి దిమ్మతిరిగి పోయి, దిగ్భ్రాంతి చెందాడు. తమ అవిధేయత మరియు తిరుగుబాటు కారణంగా, అల్లాహ్ మార్గభ్రష్టులకు తన మార్గం వైపు మార్గనిర్దేశం చేయడానికి మరియు ఋజుమార్గం చూపడానికి అల్లాహ్ అనుమతించడు.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• من أعظم ما يميز أهل الإيمان أنهم على هدى وبصيرة من الله تعالى في كل شؤونهم الدينية والدنيوية، بخلاف أهل الكفر.
విశ్వాసుల ప్రత్యేక లక్షణం ఏమిటంటే, అవిశ్వాసుల మాదిరిగా కాకుండా, వారి ప్రాపంచిక మరియు ధార్మిక పరమైన అన్నీ వ్యవహారాలలో అల్లాహ్ నుండి వారికి మార్గదర్శకత్వం మరియు అంతర్దృష్టి లభిస్తూ ఉంటుంది.

• من أعظم أسباب الطغيان الغرور بالقوة والسلطان حتى يعمى المرء عن حقيقة حاله.
తన సృష్టికర్తపై తిరుగుబాటు యొక్క ప్రధాన కారణాలలో ఒకటి ఏమిటంటే, అతడి శక్తి మరియు అధికారం ఆ వ్యక్తిని మోసగించి, వాస్తవికతను చూడలేని అంధుడిగా చేసి వేయడం.

• مشروعية مناظرة أهل الباطل لبيان الحق، وكشف ضلالهم عن الهدى.
సత్యాన్ని వివరించడానికి మరియు వారి తప్పిదాలను చూపించడానికి సత్యతిరస్కారులతో చర్చలు జరపడం ఆమోదయోగ్యమే.

• عظم قدرة الله تعالى؛ فلا يُعْجِزُهُ شيء، ومن ذلك إحياء الموتى.
అల్లాహ్ యొక్క శక్తి ఎంతో గొప్పది మరియు అతను జీవన్మరణాలను శాసించడంతో సహా ఏదైనా చేయగలడు.

 
ترجمهٔ معانی آیه: (258) سوره: سوره بقره
فهرست سوره ها شماره صفحه
 
ترجمهٔ معانی قرآن کریم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - لیست ترجمه ها

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بستن