ترجمهٔ معانی قرآن کریم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - لیست ترجمه ها


ترجمهٔ معانی آیه: (35) سوره: سوره نور
اَللّٰهُ نُوْرُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— مَثَلُ نُوْرِهٖ كَمِشْكٰوةٍ فِیْهَا مِصْبَاحٌ ؕ— اَلْمِصْبَاحُ فِیْ زُجَاجَةٍ ؕ— اَلزُّجَاجَةُ كَاَنَّهَا كَوْكَبٌ دُرِّیٌّ یُّوْقَدُ مِنْ شَجَرَةٍ مُّبٰرَكَةٍ زَیْتُوْنَةٍ لَّا شَرْقِیَّةٍ وَّلَا غَرْبِیَّةٍ ۙ— یَّكَادُ زَیْتُهَا یُضِیْٓءُ وَلَوْ لَمْ تَمْسَسْهُ نَارٌ ؕ— نُوْرٌ عَلٰی نُوْرٍ ؕ— یَهْدِی اللّٰهُ لِنُوْرِهٖ مَنْ یَّشَآءُ ؕ— وَیَضْرِبُ اللّٰهُ الْاَمْثَالَ لِلنَّاسِ ؕ— وَاللّٰهُ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟ۙ
అల్లాహ్ ఆకాశములకు,భూమికి జ్యోతీ,వాటిలో ఉన్నవారికి మార్గదర్శకుడు. పరిశుద్ధుడైన ఆయన జ్యోతి విశ్వాసపరుని హృదయంలో కిటికీ లేని గోడలో ఒక గూటితో పోల్చవచ్చు. అందులో ఒక దీపం ఉన్నది. ఆ దీపము ఒక కాంతి వంతమైన గాజు సీసాలో ఉన్నది. అది ముత్యములా మెరిసిపోతున్న ఒక నక్షత్రమువలె ఉన్నది. ఆ దీపము ఒక శుభ ప్రదమైన వృక్షపు నూనెతో వెలిగించబడుతుంది. అది జైతూన్ వృక్షము (ఆలివ్ చెట్టు). ఆ వృక్షమును సూర్యుడి నుండి ప్రొద్దునా గాని సాయంత్రము గాని ఏదీ కప్పి ఉంచలేదు. దాని నూనె స్వచ్ఛదనం వలన దానికి అగ్ని తగలకపోయినా వెలిగిపోయినట్లుంది. అటువంటప్పుడు దానికి అది (అగ్ని) తగిలితే ఎలా ఉంటుంది ?!. దీపం వెలుగు గాజు సీసా వెలుగుపై ఉన్నది. ఇదే విధంగా విశ్వాసపరుని హృదయం అందులో సన్మార్గము యొక్క వెలుగు వెలిగినప్పుడు ఉంటుంది. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి తాను కోరుకున్న వారికి ఖుర్ఆన్ ను అనుసరించే సౌభాగ్యమును కలిగిస్తాడు. మరియు అల్లాహ్ వస్తువులను వాటిని పోలిన వాటితో ఉపమానములను తెలపటం ద్వారా స్పష్టపరుస్తాడు. మరియు అల్లాహ్ ప్రతీ వస్తువు గురించి తెలిసిన వాడు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• الله عز وجل ضيق أسباب الرق (بالحرب) ووسع أسباب العتق وحض عليه .
సర్వ శక్తి వంతుడు,మహోన్నతుడైన అల్లాహ్ బానిసత్వము యొక్క కారకాలను కుదించాడు. మరియు విమోచనము యొక్క కారకాలను విస్తరింపజేశాడు,దానిపై ప్రోత్సహించాడు.

• التخلص من الرِّق عن طريق المكاتبة وإعانة الرقيق بالمال ليعتق حتى لا يشكل الرقيق طبقة مُسْتَرْذَلة تمتهن الفاحشة.
వ్రాత పత్రము పధ్ధతి ద్వారా బానిసత్వము నుండి విముక్తి కలిగించటం, బానిసను విముక్తి కలిగించటానికి ధనం ద్వారా బానిసకు సహాయం చేయటం చివరికి అతను ఆ వర్గమును రూపము ఇవ్వకుండా ఉండటానికి ఏదైతే అశ్లీలతను తన వృత్తిగా చేసుకుంటుంది.

• قلب المؤمن نَيِّر بنور الفطرة، ونور الهداية الربانية.
విశ్వాసపరుని హృదయం స్వాభావిక కాంతితో, దైవిక మార్గదర్శక కాంతితో ప్రకాశిస్తుంది.

• المساجد بيوت الله في الأرض أنشأها ليعبد فيها، فيجب إبعادها عن الأقذار الحسية والمعنوية.
మస్జిదులు భూమిపై అల్లాహ్ గృహాలు వాటిని ఆయన తన ఆరాధన వాటిలో చేయటానికి సృష్టించాడు. కాబట్టి వాటిని ఇంద్రియ,నైతిక మలినాల నుండి దూరంగా ఉంచటం తప్పనిసరి.

• من أسماء الله الحسنى (النور) وهو يتضمن صفة النور له سبحانه.
అల్లాహ్ యొక్క అందమైన పేర్లలోంచి (అన్నూర్) .మరియు పరిశుద్ధుడైన ఆయన కొరకు కాంతి యొక్క గుణము కలదు.

 
ترجمهٔ معانی آیه: (35) سوره: سوره نور
فهرست سوره ها شماره صفحه
 
ترجمهٔ معانی قرآن کریم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - لیست ترجمه ها

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بستن