Check out the new design

ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى تلغوی كتاب مختصر در تفسير قرآن كريم * - لیست ترجمه ها


ترجمهٔ معانی سوره: احقاف   آیه:
وَوَصَّیْنَا الْاِنْسَانَ بِوَالِدَیْهِ اِحْسٰنًا ؕ— حَمَلَتْهُ اُمُّهٗ كُرْهًا وَّوَضَعَتْهُ كُرْهًا ؕ— وَحَمْلُهٗ وَفِصٰلُهٗ ثَلٰثُوْنَ شَهْرًا ؕ— حَتّٰۤی اِذَا بَلَغَ اَشُدَّهٗ وَبَلَغَ اَرْبَعِیْنَ سَنَةً ۙ— قَالَ رَبِّ اَوْزِعْنِیْۤ اَنْ اَشْكُرَ نِعْمَتَكَ الَّتِیْۤ اَنْعَمْتَ عَلَیَّ وَعَلٰی وَالِدَیَّ وَاَنْ اَعْمَلَ صَالِحًا تَرْضٰىهُ وَاَصْلِحْ لِیْ فِیْ ذُرِّیَّتِیْ ؕۚ— اِنِّیْ تُبْتُ اِلَیْكَ وَاِنِّیْ مِنَ الْمُسْلِمِیْنَ ۟
మరియు మేము మానవునికి తన తల్లిదండ్రుల పట్ల వారికి వారి జీవితంలో మరియు వారి మరణం తరువాత ధర్మమునకు వ్యతిరేకం కాని మంచి చేసి ఉత్తమంగా మెలగమని గట్టి ఆదేశమును ఇచ్చాము. ముఖ్యంగా తన తల్లిని ఎవరైతే తనను గర్భంలో కష్టంగా భరించిందో మరియు తనను కష్టంగా జన్మనిచ్చిందో. మరియు తను గర్భంలో నిలదొక్కుకుని తన పాలు విడిపించే సమయం మొదలయ్యే వరకు కాలము ముప్పై నెలలు అవుతుంది. చివరికి అతను బౌద్ధిక మరయు శారీరక తన రెండు బలములను పరిపూర్ణం చేసుకునటమునకు చేరుకున్నప్పుడు మరియు నలభై సంవత్సరములను పూర్తి చేసుకున్నప్పుడు ఇలా పలుకుతాడు : ఓ నా ప్రభువా నీవు నాపై, నా తల్లిదండ్రులపై అనుగ్రహించిన నీ అనుగ్రహాలపై నేను కృతజ్ఞతను తెలుపుకోవటానికి నాకు స్పూర్తినివ్వు మరియు నేను నీవు సంతుష్టపడి నా నుండి స్వీకరించే సత్కర్మను చేసే నాకు స్పూర్తినివ్వు. మరియు నీవు నా సంతానమును నా కొరకు తీర్చి దిద్దు. నిశ్చయంగా నేను నా పాపముల నుండి పశ్ఛాత్తాప్పడుతూ నీ వైపునకు మరలాను. మరియు నిశ్చయంగా నేను నీ విధేయతకు కట్టుబడి ఉన్నాను,నీ ఆదేశములకు విధేయుడను.
تفسیرهای عربی:
اُولٰٓىِٕكَ الَّذِیْنَ نَتَقَبَّلُ عَنْهُمْ اَحْسَنَ مَا عَمِلُوْا وَنَتَجَاوَزُ عَنْ سَیِّاٰتِهِمْ فِیْۤ اَصْحٰبِ الْجَنَّةِ ؕ— وَعْدَ الصِّدْقِ الَّذِیْ كَانُوْا یُوْعَدُوْنَ ۟
ఇలాంటి వారి నుండి వారు చేసుకున్న సత్కర్మలను మేము స్వీకరిస్తాము. మరియు మేము వారి పాపములను మన్నించి వేస్తాము. వారిని వాటి వలన పట్టుకోము. వారందరు స్వర్గ వాసుల్లో ఉంటారు. వారితో చేయబడిన ఈ వాగ్దానము సత్య వాగ్దానము. అది తొందరలోనే ఖచ్చితంగా నెరవేరుతుంది.
تفسیرهای عربی:
وَالَّذِیْ قَالَ لِوَالِدَیْهِ اُفٍّ لَّكُمَاۤ اَتَعِدٰنِنِیْۤ اَنْ اُخْرَجَ وَقَدْ خَلَتِ الْقُرُوْنُ مِنْ قَبْلِیْ ۚ— وَهُمَا یَسْتَغِیْثٰنِ اللّٰهَ وَیْلَكَ اٰمِنْ ۖۗ— اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ ۚ— فَیَقُوْلُ مَا هٰذَاۤ اِلَّاۤ اَسَاطِیْرُ الْاَوَّلِیْنَ ۟
మరియు ఎవడైతే తన తల్లిదండ్రులతో ఇలా పలికాడో : మీకు వినాశనం కలుగు గాక. ఏమీ నేను మరణించిన తరువాత జీవింపజేయబడి నా సమాధి నుండి నేను వెలికి తీయబడుతానని మీరు నన్ను బెదిరిస్తున్నారా ?! వాస్తవానికి చాలా తరాలు గతించిపోయాయి. మరియు వాటిలో జనం చనిపోయారు కాని వారిలో నుండి ఎవరూ జీవింపజేయబడి మరల లేపబడలేదు. మరియు అతని తల్లిదండ్రులు అల్లాహ్ తో తమ కుమారునకు విశ్వాసము కొరకు మార్గదర్శకత్వం చేయమని సహాయమును కోరేవారు. మరియు వారిద్దరు తమ కుమారునితో ఇలా పలికేవారు : ఒక వేళ నీవు మరణాంతరం లేపబడటమును విశ్వసించకపోతే నీకు వినాశనం కలుగును కాబట్టి నీవు దాన్ని విశ్వసించు. నిశ్చయంగా మరణాంతరం లేపబడటం గురించి అల్లాహ్ వాగ్దానము ఎటువంటి సందేహం లేని సత్యము. మరణాంతరం లేపబడటము పట్ల తన తిరస్కారమును నవీనపరుస్తూ అతడు ఇలా పలుకుతాడు : మరణాంతరం లేపబడటం గురించి పలుకబడుతున్న ఈ మాటలు మాత్రం పూర్వికుల పుస్తకముల నుండి మరియు వారు వ్రాసిన వాటి నుండి అనుకరించబడినవి. అవి అల్లాహ్ నుండి నిరూపించబడలేదు.
تفسیرهای عربی:
اُولٰٓىِٕكَ الَّذِیْنَ حَقَّ عَلَیْهِمُ الْقَوْلُ فِیْۤ اُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِمْ مِّنَ الْجِنِّ وَالْاِنْسِ ؕ— اِنَّهُمْ كَانُوْا خٰسِرِیْنَ ۟
వీరందరు వారే ఎవరిపైనైతే శిక్ష అనివార్యమైనదో వీరికన్న మునుపటి జిన్నుల,మానవుల తరాల వారు. నిశ్చయంగా వారు తమను నరకంలో ప్రవేశింపజేసుకుని తమ స్వయమునకు మరియు తమ ఇంటివారికి నష్టమును కలిగించుకోవటం వలన నష్టపోయేవారు.
تفسیرهای عربی:
وَلِكُلٍّ دَرَجٰتٌ مِّمَّا عَمِلُوْا ۚ— وَلِیُوَفِّیَهُمْ اَعْمَالَهُمْ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟
ఆ రెండు వర్గముల కొరకు - స్వర్గపు వర్గము మరియు నరకపు వర్గము - వారి కర్మలను బట్టి స్థానాలు ఉంటాయి. అయితే స్వర్గ వాసుల స్థానాలు ఉన్నత స్థానాలు. మరియు నరక వాసుల స్థానాలు అదమమైన శ్రేణులు. వారికి అల్లాహ్ వారి కర్మల ప్రతిఫలమును సంపూర్ణంగా ఇవ్వటానికి. మరియు వారికి ప్రళయదినమున వారి పుణ్యములు తగ్గించి, వారి పాపములు అధికం చేసి అన్యాయం చేయబడదు.
تفسیرهای عربی:
وَیَوْمَ یُعْرَضُ الَّذِیْنَ كَفَرُوْا عَلَی النَّارِ ؕ— اَذْهَبْتُمْ طَیِّبٰتِكُمْ فِیْ حَیَاتِكُمُ الدُّنْیَا وَاسْتَمْتَعْتُمْ بِهَا ۚ— فَالْیَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُوْنِ بِمَا كُنْتُمْ تَسْتَكْبِرُوْنَ فِی الْاَرْضِ بِغَیْرِ الْحَقِّ وَبِمَا كُنْتُمْ تَفْسُقُوْنَ ۟۠
మరియు ఆ రోజు అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచి మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించిన వారిని నరకాగ్ని వద్దకు అందులో వారిని శిక్షంచటం కొరకు ప్రవేశపెట్టటం జరుగుతుంది. మరియు వారిని మందలిస్తూ మరియు దూషిస్తూ ఇలా పలకబడుతుంది : మీరు మీ ఇహలోక జీవితంలోనే మీ మంచి వస్తువులను పోగొట్టుకున్నారు. మరియు మీరు అందులో ఉన్న సుఖభోగాలను అనుభవించేశారు. ఇక పోతే ఈ రోజున, మీరు భూమిలో అన్యాయంగా చూపించిన మీ అహంకారము వలన మరియు అవిశ్వాసం,పాపకార్యములతో మీరు అల్లాహ్ విధేయత నుండి వైదొలగిపోవటం వలన మిమ్మల్ని అవమానమమునకు గురి చేసే,మిమ్మల్ని పరాభవమునకు గురి చేసే శిక్ష మీకు ఇవ్వబడుతుంది.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• بيان مكانة بِرِّ الوالدين في الإسلام، بخاصة في حق الأم، والتحذير من العقوق.
ఇస్లాంలో తల్లదండ్రుల పట్ల మంచిగా మెలగటము యొక్క స్థానము ప్రకటన. ప్రత్యేకించి తల్లి హక్కు విషయంలో. మరియు వారి అవిధేయతకు పాల్పడటం నుండి హెచ్చరిక.

• بيان خطر التوسع في ملاذّ الدنيا؛ لأنها تشغل عن الآخرة.
ప్రాపంచిక సుఖభోగాల్లో పుష్కలత్వము యొక్క ప్రమాద ప్రకటన. ఎందుకంటే అది పరలోకం నుండి అశ్రద్ధ వహించేటట్లు చేస్తుంది.

• بيان الوعيد الشديد لأصحاب الكبر والفسوق.
అహంకారులకు మరియు అవిధేయులకు తీవ్ర హెచ్చరిక ప్రకటన.

 
ترجمهٔ معانی سوره: احقاف
فهرست سوره ها شماره صفحه
 
ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى تلغوی كتاب مختصر در تفسير قرآن كريم - لیست ترجمه ها

مرکز تفسیر و پژوهش‌های قرآنى آن را منتشر كرده است.

بستن