Check out the new design

ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى تلوگوى - عبدالرحيم بن محمد * - لیست ترجمه ها

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

ترجمهٔ معانی سوره: قصص   آیه:
وَلَقَدْ وَصَّلْنَا لَهُمُ الْقَوْلَ لَعَلَّهُمْ یَتَذَكَّرُوْنَ ۟ؕ
మరియు వారు హితబోధ పొందాలని, వాస్తవంగా మేము ఈ వచనాన్ని (ఖుర్ఆన్ ను) క్రమక్రమంగా అందజేశాము.
تفسیرهای عربی:
اَلَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ مِنْ قَبْلِهٖ هُمْ بِهٖ یُؤْمِنُوْنَ ۟
ఎవరికైతే పూర్వం మేము గ్రంథాన్ని ఇచ్చామో వారు దీనిని (ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు.[1]
[1] అంటే యూదులలో 'అబ్దుల్లాహ్ బిన్-సల్లామ్ మరియు 'హబష నుండి వచ్చిన క్రైస్తవులు (ర'.ది.'అన్హుమ్). చూడండి, 26:196-197.
تفسیرهای عربی:
وَاِذَا یُتْلٰی عَلَیْهِمْ قَالُوْۤا اٰمَنَّا بِهٖۤ اِنَّهُ الْحَقُّ مِنْ رَّبِّنَاۤ اِنَّا كُنَّا مِنْ قَبْلِهٖ مُسْلِمِیْنَ ۟
మరియు వారికి ఇది వినిపించబడి నప్పుడు, వారు ఇలా అంటారు: "మేము దీనిని విశ్వసించాము, నిశ్చయంగా ఇది మా ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. నిశ్చయంగా, మేము మొదటి నుండియో అల్లాహ్ కు విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము."[1]
[1] ఈ విషయం ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చింది. దైవప్రవక్తలందరూ ప్రచారం చేసిన ధర్మం ఇస్లాం మాత్రమే. అంటే ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) కు తప్ప ఇతరులకు దాస్యం, ఆరాధన చేయరాదని. ప్రతికాలపు వారు తమతమ భాషలలో దానికి వివిధ పేర్లు ఇచ్చారు. అంటే క్రైస్తవధర్మం, యూదధర్మం, మొదలైనవి. కాని వాస్తవానికి ప్రవక్తలందరి ధర్మం ఇస్లాం మాత్రమే. అంటే అల్లాహ్ (సు.తా.) కు విధేయులై కేవలం ఆయనకే దాస్యం, ఆరాధన చేయటం. కాని ఆ ప్రాచీన దివ్యగ్రంథాలు ఆయా ప్రవక్తల ప్రచారానికి ఎన్నో వందల సంవత్సరాల తరువాత లిఖిత రూపంలోకి వచ్చాయి. దాని వల్ల వాటిని లిఖించిన వారు, తమ ప్రవక్తుల వినిపించిన దివ్యసందేశాలను వాటి అసలు అవతరించిన రూపంలో వ్రాయలేక పోయారు. తరువాత తరాల ధర్మవేత్తలు మొదటి వారు వ్రాసిన వాటితో ఏకీభవించక వాటిలో మార్పులు చేస్తూ పోయారు. ఉదాహరణకు: ఈ రోజు ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ ప్రామాణికమైనదిగా పరిగణించబడే బైబిల్ - ఏదైతే తౌరాత్, 'జబూర్ మరియు ఇంజీల్ గ్రంథా(Old and New Testaments)ల సముదాయమో - అందులో కూడా ఎన్నోసార్లు మార్పులు చేయబడ్డాయి. చివరి మార్పులు గలది, ఈనాటి (Revised) Authorized K.J.V. అందుకే అసలు ఆ ప్రవక్తలు ప్రచారం చేసింది, ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ (సు.తా.) ఆరాధన. అయినా ఈనాడు వాటిలో మానవులు మార్పులు చేయడం వల్ల, ఆ గ్రంథాలను అనుసరిస్తున్నారు ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ (సు.తా.) ఆరాధనను వదలి, బహుదైవారాధన, ప్రవక్తల విగ్రహాల ఆరాధన చేస్తున్నారు. కాని ఇస్లాం స్వీకరించిన యూదులు మరియు క్రైస్తవులు సత్యాన్ని తెలుసుకొని: 'మేము మొదటి నుండియే ముస్లింలముగా ఉన్నాము' అని అన్నారు. ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ (సు.తా.) ఆరాధనయే సత్యధర్మమని, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు.
تفسیرهای عربی:
اُولٰٓىِٕكَ یُؤْتَوْنَ اَجْرَهُمْ مَّرَّتَیْنِ بِمَا صَبَرُوْا وَیَدْرَءُوْنَ بِالْحَسَنَةِ السَّیِّئَةَ وَمِمَّا رَزَقْنٰهُمْ یُنْفِقُوْنَ ۟
వీరే, తమ సహనానికి ఫలితంగా రెండింతలు ప్రతిఫలమొసంగపడే వారు.[1] వీరే మంచితో చెడును నివారించే వారు. మరియు మేము వారికిచ్చిన జీవనోపాధి నుండి ఖర్చు చేసేవారు.
[1] చూసహనం వహించటం అంటే, ఇక్కడ దైవప్రవక్తలను మరియు దివ్యగ్రంథాలను విశ్వసించి ఆ విశ్వాసంపై స్థిరంగా ఉండటం. మొదటి దివ్యగ్రంథం మీద స్థిరంగా ఉండి, రెండవ దివ్యగ్రంథం వస్తే దానిని అనుసరించటం. ఇలాంటి వారికి రెండింతలు ప్రతిఫలముంది. రెండింతలు ప్రతిఫలం పొందే ముగ్గురిలో వీరొకరు. ('స.బు'ఖారీ) చూ. 13:22.
تفسیرهای عربی:
وَاِذَا سَمِعُوا اللَّغْوَ اَعْرَضُوْا عَنْهُ وَقَالُوْا لَنَاۤ اَعْمَالُنَا وَلَكُمْ اَعْمَالُكُمْ ؗ— سَلٰمٌ عَلَیْكُمْ ؗ— لَا نَبْتَغِی الْجٰهِلِیْنَ ۟
మరియు వారు వ్యర్థమైన మాటలు విన్నప్పుడు, ఇలా అంటూ దూరంగా తొలగి పోతారు: "మాకు మా కర్మలు మరియు మీకు మీ కర్మలు, మీకు సలాం![1] మాకు మూర్ఖులతో పనిలేదు."
[1] ఈ సలాం అభివందనం కాదు. మేము మీవంటి మూర్ఖులతో వాదులాడమని తప్పించుకోవటానికి పలికేది. చూడండి, 25:63, 43:89.
تفسیرهای عربی:
اِنَّكَ لَا تَهْدِیْ مَنْ اَحْبَبْتَ وَلٰكِنَّ اللّٰهَ یَهْدِیْ مَنْ یَّشَآءُ ۚ— وَهُوَ اَعْلَمُ بِالْمُهْتَدِیْنَ ۟
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీవు, నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేయలేవు, కాని అల్లాహ్ తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఆయనకు మార్గదర్శకత్వం పొందే వారెవరో బాగా తెలుసు.[1]
[1] చూఈ ఆయత్ దైవప్రవక్త ('స'అస) పినతండ్రి అబూ 'తాలిబ్ మరణిచినప్పుడు అవతరింపజేయబడింది. అతని ఆఖరు ఘడియలలో దైవప్రవక్త ('స'అస) అతనితో అన్నారు: "ఇప్పుడైనా: 'లా ఇలాహ ఇల్లల్లాహ్' అను. దానితో నేను పునరుత్థానదినమున నీ క్షమాపణ కొరకు అల్లాహ్ (సు.తా.)ను పేడుకోగలను." అక్కడున్న ఖురైష్ సర్దారులను చూసి అతను అలా అనలేదు. ('స'హీ'హ్ బు'ఖారీ) ఇంకా చూ. 14:4.
تفسیرهای عربی:
وَقَالُوْۤا اِنْ نَّتَّبِعِ الْهُدٰی مَعَكَ نُتَخَطَّفْ مِنْ اَرْضِنَا ؕ— اَوَلَمْ نُمَكِّنْ لَّهُمْ حَرَمًا اٰمِنًا یُّجْبٰۤی اِلَیْهِ ثَمَرٰتُ كُلِّ شَیْءٍ رِّزْقًا مِّنْ لَّدُنَّا وَلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟
వారు ఇలా అంటారు: "ఒకవేళ నీతో పాటు మేము కూడా ఈ మార్గదర్శకత్వాన్ని అవలంబిస్తే! మేము మా భూమి నుండియే పారద్రోలబడతాము."[1] ఏమీ? మేము వారిని శాంతికి నిలయమైన ఒక పవిత్ర స్థలం (మక్కా) లో స్థిరనివాసము నొసంగి వారికి మా తరఫు నుండి జీవనోపాధిగా అన్ని రకాల ఫలాలను సమకూర్చలేదా? కాని వాస్తవానికి వారిలో చాలా మందికి ఇది తెలియదు.[2]
[1] దీనిని ఈ విధంగా బోధించారు: 1) ఆ కాలపు ఖురైషులు ఇస్లాం స్వీకరిస్తే, వారి తోటి వారు, వారిని మతద్రోహులుగా పరిగణించి వారిని, వారి నగరం మక్కా నుండి పారద్రోలుతారని భయపడ్డారు. 2) అదే విధంగా ఈ కాలంలో కూడా చాలామంది ఇది సత్యధర్మమని తెలిసి కూడా తమ బంధువుల నుండి మరియు తమ సమాజం నుండి విడదీయబడతామని భయపడి సత్యాన్ని అవలంబించరు. కాని రాబోయే పరలోక జీవితపు శాశ్వత సుఖాల ముందు ఈ జీవిత సుఖం అతి స్వల్పమైనదనే సత్యాన్ని వారు అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది!
[2] చూడండి, 14:35-41, 21:26, 29:67. 22. ఇబ్రాహీం ('అ.స.) మక్కా కొరకు చేసిన ప్రార్థన.
تفسیرهای عربی:
وَكَمْ اَهْلَكْنَا مِنْ قَرْیَةٍ بَطِرَتْ مَعِیْشَتَهَا ۚ— فَتِلْكَ مَسٰكِنُهُمْ لَمْ تُسْكَنْ مِّنْ بَعْدِهِمْ اِلَّا قَلِیْلًا ؕ— وَكُنَّا نَحْنُ الْوٰرِثِیْنَ ۟
మరియు మేము ఎన్నో నగరాలను, జీవన సుఖసంపదలతో ఉప్పొంగిపోతూ ఉండగా, వాటిని నాశనం చేయలేదా! అవిగో వారి నివాసాలు, వారి తరువాత వాటిలో నివసించిన వారు చాలా తక్కువ! మరియు నిశ్చయంగా, మేమే వాటికి వారసులయ్యాము. [1]
[1] చూడండి, 15:23.
تفسیرهای عربی:
وَمَا كَانَ رَبُّكَ مُهْلِكَ الْقُرٰی حَتّٰی یَبْعَثَ فِیْۤ اُمِّهَا رَسُوْلًا یَّتْلُوْا عَلَیْهِمْ اٰیٰتِنَا ۚ— وَمَا كُنَّا مُهْلِكِی الْقُرٰۤی اِلَّا وَاَهْلُهَا ظٰلِمُوْنَ ۟
మరియు నీ ప్రభువు నగరాలను ఏ మాత్రమూ నాశనం చేసేవాడు కాదు, ఎంత వరకైతే వాటి ముఖ్య నగరానికి మా సూచన (ఆయాత్) లను వినిపించే సందేశహరులను పంపమో! మేము నగరాలను వాటి ప్రజలు దుర్మార్గులై పోతే తప్ప, నాశనం చేసే వారం కాము.[1]
[1] సందేశహరులు ఎల్లప్పుడూ పెద్ద నగరాలలోనే పంపబడ్డారు. వారే దాని చుట్టూ ఉన్న చిన్న గ్రామాల వారికి కూడా ప్రచారం చేశారు. కేవలం సత్యతిరస్కారులుగా ఉన్నంత మాత్రాన, ఏ నగరవాసులు కూడా నాశనం చేయబడలేదు. సత్యతిరస్కారంతో బాటు వాటిలోని ప్రజలు దుర్మార్గానికి, విశ్వాసుల పట్ల దౌర్జన్యానికి పాల్పడినప్పుడే అవి నాశనం చేయబడ్డాయి. చూడండి, 11:117, 6:130-132, 28:59.
تفسیرهای عربی:
 
ترجمهٔ معانی سوره: قصص
فهرست سوره ها شماره صفحه
 
ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى تلوگوى - عبدالرحيم بن محمد - لیست ترجمه ها

ترجمه‌ى عبدالرحیم بن محمد.

بستن