ఏమీ? : ప్రజలు "మేము విశ్వసించాము!" అని అన్నంత మాత్రాన్నే తాము విడిచి పెట్ట బడతారని మరియు తాము పరీక్షింపబడరని భావిస్తున్నారా?[1]
[1] చూమొట్టమొదట విశ్వాసం (ఇస్లాం) స్వీకరించిన 'అమ్మార్ అతని తల్లి-దండ్రులైన సుమయ్యా మరియు యాసర్, 'సుహేబ్ మరియు బిలాల్ మొదలైన వారు (ర'ది.'అన్హుమ్) ఎన్నో తీవ్రమైన పరీక్షలకు గురి చేయబడ్డారు.
మరియు వాస్తవానికి, మేము వారికి పూర్వం గతించిన వారిని కూడా పరీక్షించి ఉన్నాము. కావున నిశ్చయంగా సత్యవంతులు ఎవరో మరియు అసత్యవంతులు ఎవరో అల్లాహ్ వ్యక్తపరుస్తాడు.
కావున (అల్లాహ్ మార్గంలో) పాటుపడే వాడు నిశ్చయంగా, తన (మేలు) కొరకే పాటు పడుతున్నాడని (తెలుసుకోవాలి)[1]. నిశ్చయంగా, అల్లాహ్ సర్వలోకాల వారి అక్కర ఏ మాత్రం లేనివాడు.
[1] చూడండి, 15:23. జిహాదున్ : అంటే - 1) తన సత్యధర్మాన్ని, తన స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను కాపాడుకోవటానికి దానిని అడ్డగించే వారితో; 2) సత్యం మీద మరియు సన్మార్గం మీద ఉండడానికి తన ఆత్మలోని అసత్యం, అధర్మంతో మరియు 3) దుష్టప్రేరణలతో - చేసే పోరాటం.
మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, నిశ్చయంగా అలాంటి వారి (పూర్వపు) పాపాలను మేము తప్పక తొలగిస్తాము మరియు వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమమైన ప్రతిఫలం ఇస్తాము.
మరియు మేము మానవునికి తన తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించమని ఆదేశించాము.[1] కాని వారిద్దరూ, నీవు ఎరుగని వానిని నాకు భాగస్వామిగా చేయమని బలవంతపెడితే, నీవు వారి ఆజ్ఞాపాలన చేయకు.[2] మీరందరూ నా వైపుకే మరలి రావలసి ఉన్నది, అప్పుడు నేను మీకు, మీరు ఏమి చేస్తూ ఉండేవారో తెలుపుతాను.
[1] ఖుర్ఆన్ లో కేవలం ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) ఆరాధనే చేయాలనీ మరియు తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించాలని అల్లాహ్ (సు.తా.) ఆదేశిస్తున్నాడు. తమ తల్లిదండ్రులను ఆదరించే వారే అల్లాహ్ (సు.తా.) యొక్క స్థానాన్ని అర్థం చేసుకో గలుగుతారు. చూడండి, 31:14-15. [2] స'అద్ బిన్ అబీ-వఖ్ఖా'స్ (ర'ది.'అ) ఇస్లాం స్వీకరించినప్పుడు అతని తల్లి నీవు ఇస్లాం మరియు ము'హమ్మద్ (సఅస) ను వదలనంత వరకు నేను అన్నపానీయాలను ముట్టను అని మొండిపట్టు పట్టుతుంది. అప్పుడు ఈ ఆయత్ అవతరింపజేయబడుతుంది. ('స.ముస్లిం, తిర్మిజీ')
మరియు ప్రజలలో కొందరు (తమ నాలుకలతో): "మేము అల్లాహ్ ను విశ్వసించాము." అని అనే వ్యక్తులున్నారు. కాని వారు అల్లాహ్ మార్గంలో హింసించపడినప్పుడు, మానవులు పెట్టిన పరీక్షలను అల్లాహ్ యొక్క శిక్షగా భావిస్తారు; మరియు ఒకవేళ నీ ప్రభువు నుండి సహాయం వస్తే వారు (కపట విశ్వాసులు) అంటారు: "నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నాము.[1] సర్వలోకాల వారి హృదయాల స్థితి అల్లాహ్ కు తెలియదా ఏమిటి?"
మరియు నిశ్చయంగా, అల్లాహ్ విశ్వసించిన వారిని స్పష్టపరుస్తాడు మరియు ఆయన కపట విశ్వాసులను కూడా స్పష్టపరుస్తాడు.[1]
[1] అంటే అల్లాహ్ (సు.తా.) సుఖదుఃఖాలనిచ్చి విశ్వాసులెవరో మరియు కపట విశ్వాసులెవరో విశదం చేస్తాడు. ఎవరైతే ప్రతి స్థితిలో అల్లాహ్ (సు.తా.) కు కృతజ్ఞులై ఉంటారో వారే నిజమైన విశ్వాసులు. ఇంకా చూడండి, 15:23 మరియు 15:23, ఇది కపట విశ్వాసు(మునాఫిఖు)లను గురించి వచ్చిన మొదటి ఆయత్.
మరియు సత్యతిరస్కారులు, విశ్వాసులతో: "మీరు మా మార్గాన్ని అనుసరించండి. మేము మీ పాపాలను భరిస్తాము." అని అంటారు. వాస్తవానికి వారి పాపాలలో నుండి దేనిని కూడా వారు భరించరు. నిశ్చయంగా, వారు అసత్యవాదులు.[1]
[1] సత్యతిరస్కారులు: 'మీరు మా మార్గాన్ని అనుసరిస్తే మేము మీ పాపాలను భరిస్తాము.' అని అనే మాటలు అబద్ధాలని ఇక్కడ విశదీకరించబడింది. అల్లాహ్ (సు.తా.) అంటున్నాడు: "భారం మోసేవాడు, ఎవరి భారాన్ని మోయడు!" పునరుత్థాన దినమున స్నేహితుడు తన స్నేహితుని స్థితిని అడగడు, 70:10 మరియు దగ్గరి బంధువులు కూడా ఒకరినొకరు అడుగుకోరు, 35:18.
మరియు నిశ్చయంగా, వారు తమ బరువులను మోస్తారు మరియు తమ బరువులతో పాటు ఇతరుల బరువులను కూడా మోస్తారు.[1] మరియు నిశ్చయంగా, వారు పునరుత్థాన దినమున, తమ బూటక కల్పనలను గురించి ప్రశ్నింపబడతారు.
[1] ఇటువంటి ఆయత్ కు చూడండి, 16:25. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "ఇతరులను సన్మార్గానికి పిలచిన వారికి, వారు సన్మార్గాన్ని అనుసరిస్తే పునరుత్థానదినం వరకు వారంతా చేసే సత్కార్యాల ఫలితాల పుణ్యం దొరుకుతుంది. దుర్మార్గులకు, పాపకార్యాలకు, దుష్టకార్యాలకు ఆహ్వానించే వారు తమను అనుసరించిన వారి పాపభారాన్ని పునరుత్థాన దినం వరకు భరిస్తారు." ('స'హీ'హ్ బు'ఖారీ).
మరియు వాస్తవానికి, మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు పంపాము. అతను వారి మధ్య యాభై తక్కువ వేయి సంవత్సరాల వరకు (వారిని అల్లాహ్ ధర్మం వైపుకు ఆహ్వానిస్తూ) నివసించాడు; చివరకు వారు దుర్మార్గాన్ని విడనాడనందుకు, వారిని తుఫాను పట్టుకున్నది.[1]
[1] నూ'హ్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 11:25-48 ఇక్కడ ఉద్దేశమేమిటంటే: ఒక ప్రవక్త ('అ.స.) కూడా తాను ప్రేమించేవారిని సన్మార్గానికి తేలేడు. ఇంకా చూడండి, 28:56 నూ'హ్ ('అ.స.) వారికి 950 సంవత్సరాలు ఇస్లాం ధర్మప్రచారం చేశారు. మార్గదర్శకత్వమంతా అల్లాహ్ (సు.తా.) మార్గదర్శకత్వమే. చూడండి, 3:73.
మరియు (జ్ఞాపకం చేసుకోండి!) ఇలాగే ఇబ్రాహీమ్ కూడా తన జాతి వారితో: "కేవలం అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు అర్థం చేసుకోగలిగితే, ఇది మీకు ఎంతో మేలైనది."
"నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను వదలి విగ్రహాలను ఆరాధిస్తూ, ఒక అభూత కల్పన చేస్తున్నారు. నిశ్చయంగా, అల్లాహ్ ను వదలి మీరు ఎవరినైతే, ఆరాధిస్తున్నారో, వారికి మీకు జీవనోపాధిని సమకూర్చే యోగ్యత లేదు. కావున మీరు, మీ జీవనోపాధిని అల్లాహ్ నుండియే అపేక్షించండి మరియు ఆయననే ఆరాధించండి. మరియు ఆయనకే కృతజ్ఞులై ఉండండి. మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు."
"ఒకవేళ మీరు (ఈ సందేశాన్ని) అబద్ధమని తిరస్కరిస్తే, (ఆశ్చర్యమేమీ లేదు) వాస్తవానికి మీకు పూర్వం ఎన్నో సమాజాలు (దివ్యసందేశాలను అబద్ధాలని) తిరస్కరించాయి. మరియు సందేశహరుని బాధ్యత, స్పష్టంగా మీకు సందేశాన్ని అందజేయటం మాత్రమే!"
అల్లాహ్ సృష్టిని ఏ విధంగా ప్రారంభిస్తున్నాడో తరువాత దానిని ఏ విధంగా మరల ఉనికిలోకి తెస్తున్నాడో, వారు గమనించడం లేదా? నిశ్చయంగా, ఇది అల్లాహ్ కు ఎంతో సులభం!
వారితో అను: "మీరు భూమిలో సంచారం చేసి చూడండి. ఆయన సృష్టిని ఏ విధంగా ప్రారంభించాడో!"[1] తరువాత అల్లాహ్ యే మరల (రెండవసారి) దానిని ఉనికిలోకి తెస్తున్నాడు! నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు!"
మరియు ఎవరైతే, అల్లాహ్ సూచనలను మరియు ఆయనతో కాబోయే సమావేశాన్ని తిరస్కరిస్తారో, అలాంటి వారు నా కరుణ పట్ల నిరాశ చెందుతారు.[1] మరియు అలాంటి వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది.
ఇక అతని (ఇబ్రాహీమ్) జాతివారి జవాబు ఈ విధంగా అనడం తప్ప మరొకటి లేక పోయింది: "ఇతనిని చంపండి లేదా కాల్చి వేయండి" చివరకు అల్లాహ్ అతనిని అగ్ని నుండి రక్షించాడు.[1] నిశ్చయంగా, ఇందులో విశ్వసించే వారికి సూచన లున్నాయి.
మరియు (ఇబ్రాహీమ్) ఇలా అన్నాడు: "నిశ్చయంగా, మీరు ప్రాపంచిక జీవితంలో అల్లాహ్ ను వదలి, విగ్రహారాధనను మీ మధ్య ప్రేమకు సాధనంగా చేసుకున్నారు. కాని పునరుత్థాన దినమున మీకు పరస్పరం సంబంధమే లేదంటారు మరియు పరస్పరం శపించుకుంటారు మరియు మీ ఆశ్రయం నరకాగ్నియే మరియు మీకు సహాయపడే వారు ఎవ్వరూ ఉండరు."
అప్పుడు లూత్ అతనిని విశ్వసించాడు. (ఇబ్రాహీమ్) ఇలా అన్నాడు: "నేను నా ప్రభువు వైపునకు వలస పోతాను.[1] నిశ్చయంగా, ఆయనే సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు."
[1] ఇబ్రాహీమ్ ('అ.స.) తన భార్య సారహ్ మరియు తన సోదరుని కుమారుడు లూ'త్ ('అ.స.)లతో, తమ దేశం కూసీ అంటే - కూఫా ప్రాంతంలోని ఒక నగరం నుండి షామ్ వైపునకు ప్రస్థానం చేశారు. ఎందుకంటే ఆ దేశపు ప్రజలు - వారు ఇస్లాం అనుసరిస్తున్నందుకు - వారిపై దౌర్జన్యాలు చేశారు.
మరియు మేము అతనికి (ఇబ్రాహీమ్ కు) ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను ప్రసాదించి, అతని సంతతిలో ప్రవక్త పదవినీ మరియు గ్రంథాన్ని ఉంచి, ప్రపంచంలో అతనికి, అతని ప్రతిఫలాన్ని ఇచ్చాము.[1] మరియు పరలోకంలో అతడు నిశ్చయంగా, సద్వర్తనులతో పాటు ఉంటాడు.[2]
[1] చూఈ ప్రతిఫలమేమిటంటే అతను ఇబ్రాహీమ్ ('అ.స.) అబుల్-అంబియా అనబడ్డారు. అంటే ప్రవక్తల మూలపురుషుడు. ఎందుకంటే అతన సంతానం నుండి ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. అతని పెద్ద కుమారుడు, సయ్యిదా హాజర్ పుత్రుడైన ఇస్మాయీ'ల్ ('అ.స.) వంశం నుండి మహాప్రవక్త ము'హమ్మద్ ('స'అస) వచ్చారు. మరియు అతని రెండవ కుమారుడైన ఇ'స్హాఖ్ ('అ.స.) యొక్క కుమారుడైన యా'అఖూబ్ ('అ.స.) నుండి అతని కుమారుడైన యూసుఫ్ ('అ.స.) వచ్చారు. మరియు య'అఖూబ్ ('అ.స.) యొక్క పన్నెండు మంది కుమారుల నుండి ఇంకా ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. దావుద్, సులైమాన్, మూసా మరియు 'ఈసా ('అలైహిమ్. స.) లు అందరూ య'అఖూబ్ ('అ.స.) సంతతి వారే, అంటే ఇబ్రాహీమ్ ('అ.స.) సంతతి వారే. అందుకే యూదులు, క్రైస్తవులు, ముస్లిములే గాక ముష్రికులు కూడా ఇబ్రాహీమ్ ('అ.స.) ను ఆదరిస్తారు. ప్రతి ఒక్కరూ మేము ఇబ్రాహీమ్ ('అ.స.) ధర్మాన్నే ఆచరిస్తున్నాము అంటారు. కాని, వాస్తవానికి అతని ధర్మం, ఏకైక దైవసిద్ధాంతం (ఇస్లాం) మాత్రమే. [2] చూడండి, 16:122.
మరియు (జ్ఞాపకం చేసుకోండి) లూత్ తన జాతి ప్రజలతో ఇలా అన్నప్పుడు: "నిశ్చయంగా, మీరు చాలా హేయమైన పని చేస్తున్నారు. మీకు పూర్వం లోకంలో ఎవ్వడూ ఇలాంటి పని చేయలేదు.[1]
వాస్తవానికి, మీరు (కామంతో) పురుషుల వద్దకు పోతున్నారు! మరియు దారి కొడుతున్నారు (దోపిడి చేస్తున్నారు)! మరియు మీ సభలలో అసభ్యకరమైన పనులు చేస్తున్నారు!" అతని జాతి వారి జవాబు కేవలం ఇలానే ఉండేది: "నీవు సత్యవంతుడవే అయితే అల్లాహ్ శిక్షను మా పైకి తీసుకురా!"
మరియు మా దూతలు ఇబ్రాహీమ్ వద్దకు శుభవార్త తీసికొని వచ్చినపుడు వారన్నారు: "నిశ్చయంగా, మేము ఈ నగరవాసులను నాశనం చేయబోతున్నాము. ఎందుకంటే వాస్తవానికి దాని ప్రజలు దుర్మార్గులై పోయారు!"
(ఇబ్రాహీమ్) అన్నాడు: "వాస్తవానికి, అక్కడ లూత్ కూడా ఉన్నాడు కదా!" వారన్నారు: "అక్కడెవరున్నారో, మాకు బాగా తెలుసు. మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని రక్షిస్తాము - అతని భార్య తప్ప - ఆమె వెనుక ఉండి పోయేవారిలో చేరి పోయింది."[1]
ఆ తరువాత మా దూతలు లూత్ వద్దకు రాగా అతను వారి నిమిత్తం చాలా చింతించాడు.[1] మరియు ఇబ్బందిలో పడి పోయాడు. వారిలా అన్నారు: "నీవు భయపడకు మరియు దుఃఖ పడకు! నిశ్చయంగా, మేము నిన్ను మరియు నీ కుటుంబం వారిని రక్షిస్తాము - నీ భార్య తప్ప - ఆమె వెనుక ఉండి పోయేవారిలో చేరిపోయింది!
మరియు వాస్తవానికి, బుద్ధిమంతుల కొరకు మేము దీని ద్వారా ఒక స్పష్టమైన సూచనను వదలి పెట్టాము.[1]
[1] చూసోడోమ్ మరియు గొమెర్రాహ్ (లూ'త్ జాతి వారి) నగరాలు ఉండే చోట్లలో, ఈ రోజు మృత సముద్రం (Dead Sea) ఉంది. దాని పేరు ఇలా ఎందుకు పడిందంటే అందులో గంధకం మరియు పొటాష్ (Sulphur and Potash), అత్యధికంగా ఉండడం వల్ల అందులో ఏ జీవరాసి గానీ వృక్షరాసి గానీ నివసించజాలదు.
మరియు మేము మద్ యన్ వాసుల వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను పంపాము.[1] అతను ఇలా అన్నాడు: "నా జాతి ప్రజలారా! కేవలం అల్లాహ్ నే ఆరాధించండి. మరియు అంతిమ దినం కొరకు నిరీక్షిస్తూ (భయపడుతూ) ఉండండి. మరియు దౌర్జన్యపరులుగా భూమిలో కల్లోలం రేకెత్తిస్తూ తిరగకండి!"
మరియు వాస్తవంగా, ఆద్ మరియు సమూద్ జాతల వారి (వినాశ) విషయం (మిగిలి పోయిన) వారి నివాస స్థలాల నుండి, మీకు స్పష్టంగా తెలుస్తుంది.[1] వాస్తవానికి, వారు (సత్యాన్ని) గ్రహించే వారు అయినప్పటికీ, షైతాన్ వారి కర్మలను వారికి మంచివిగా కనబడేటట్లు చేశాడు. ఆ తరువాత వారిని (ఋజు) మార్గం నుండి తొలగించాడు.
[1] 'ఆద్ జాతి వారి నివాసం - అ'హ్ ఖాఫ్ - యమన్, లోని హ'దరమౌత్ దగ్గర ఉంది. స'మూద్ జాతి వారి నివాసం మదాయన్ 'సాలి'హ్, అనే ప్రాంతంలో మదీనా మునవ్వరా - తబూక్ ల మధ్య స'ఊది 'అరేబియాలో ఉంది. ఇది 'హిజా'జ్ ఉత్తర ప్రాంతంలో ఉంది. చూడండి, 9:7.
ఇక ఖారూన్[1], ఫిర్ఔన్ మరియు హామానులను[2] (కూడా మేము ఇదే విధంగా నాశనం చేశాము). వాస్తవానికి, మూసా వారి వద్దకు స్పష్టమైన సూచనలను తీసుకొని వచ్చాడు; కాని వారు భూమిలో అహంభావం చూపారు. కావున వారు (మా శిక్ష నుండి) తప్పించుకోలేక పోయారు.
కావున ప్రతి ఒక్కరిని మేము అతని పాపానికి బదులుగా పట్టుకున్నాము. వారిలో కొందరిపైకి మేము తుఫాన్ గాలిని పంపాము.[1] మరికొందరిని ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) చిక్కించుకున్నది.[2] ఇంకా కొందరిని భూమిలోనికి అణగ ద్రొక్కాము.[3] ఇంకా ఇతరులను ముంచి వేశాము.[4] మరియు అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.
[1] 'తుఫాన్ గాలి 'ఆద్ జాతివారిపై వచ్చింది. [2] ఈ శిక్ష వచ్చిన వారు స'మూద్ జాతివారు. [3] ఇది ఖారూన్ కు సంభవించిన శిక్ష. [4] ఇది ఫిర్'ఔన్ మరియు అతన సైనికులకు సంభవించిన శిక్ష.
అల్లాహ్ ను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారి ఉపమానాన్ని సాలె పురుగు నిర్మించే ఇంటితో పోల్చవచ్చు. నిశ్చయంగా, అన్నిటి కంటే బలహీనమైన ఇల్లు సాలె పురుగు ఇల్లే! వారిది తెలుసుకుంటే ఎంత బాగుండేది![1]
[1] ఏ విధంగానైతే సాలె పురుగు అల్లిన ఇల్లు బలహీనమైనదో! అదే విధంగా అల్లాహ్ (సు.తా.) ను వదలి ఇతరులను ఆరాధించే వారి ఆరాధన కూడా వ్యర్థమైనదే. ఎందుకంటే వారు (ఆ దేవతలు) తమను ఆరాధించే వారికి ఎలాంటి సహాయం చేయలేరు.
(ఓ ప్రవక్తా!) నీపై దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేయబడిన గ్రంథాన్ని చదివి వినిపించు మరియు నమాజ్ ను స్థాపించు. నిశ్చయంగా, నమాజ్ అసహ్యకరమైన పనుల నుండి మరియు అధర్మమైన పనుల నుండి నిషేధిస్తుంది. మరియు అల్లాహ్ ధ్యానమే (అన్నిటి కంటే) గొప్పది. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
మరియు నీవు గ్రంథ ప్రజలతో - దుర్మార్గాన్ని అవలంబించిన వారితో తప్ప - కేవలం ఉత్తమమైన రీతి లోనే వాదించు.[1] మరియు వారితో ఇలా అను: "మేము మా కొరకు అవతరింప జేయబడిన దానిని మరియు మీ కొరకు అవతరింప జేయబడిన దానిని విశ్వసించాము. మరియు మా ఆరాధ్య దేవుడు మరియు మీ ఆరాధ్య దేవుడు ఒక్కడే (అల్లాహ్). మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము."
(ఓ ముహమ్మద్!) ఈ విధంగా మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింప జేశాము. కావున మేము (ఇంతకు పూర్వం) గ్రంథాన్ని ఇచ్చిన వారిలో కొందరు దీనిని విశ్వసిస్తారు.[1] మరియు ఇతర ప్రజలలో నుండి కూడా కొందరు దీనిని విశ్వసిస్తారు.[2] మరియు మా సూచనలను సత్యతిరస్కారులు తప్ప మరెవ్వరూ తిరస్కరించరు.[3]
[1] వీరు 'అబ్దుల్లాహ్ బిన్-సలాం మరియు ఇతరులు. [2] వీరు మక్కా ముష్రికులలో నుండి కొందరు. [3] జిహాదున్: దీని అర్థానికి చూడండి, 31:32, 40:63, మరియు 41:28.
మరియు (ఓ ముహమ్మద్!) ఇంతకు పూర్వం నీవు ఏ గ్రంథాన్ని కూడా చదువ గలిగే వాడవు కావు మరియు దేనిని కూడా నీ కుడిచేతితో వ్రాయగలిగే వాడవూ కావు.[1] అలా జరిగి వుంటే ఈ అసత్యవాదులు తప్పక అనుమానానికి గురి అయి ఉండేవారు.
వాస్తవానికి ఇవి, స్పష్టమైన సూచనలు (ఖుర్ఆన్ ఆయాత్), జ్ఞానమివ్వబడిన వారి హృదయాలలో (భద్రంగా) ఉంచ బడ్డాయి. మరియు మా సూచనలను (ఆయాత్ లను) దుర్మార్గులు తప్ప మరెవ్వరూ తిరస్కరించరు.
మరియు వారు ఇలా అంటారు: "ఇతని ప్రభువు తరఫు నుండి ఇతని మీద అద్భుత సంకేతాలు ఎందుకు అవతరింప జేయబడలేదు?" వారితో ఇలా అను: "నిశ్చయంగా, అద్భుత సంకేతాలన్నీ అల్లాహ్ దగ్గరనే ఉన్నాయి.[1] మరియు నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే!"
ఏమీ? వాస్తవానికి మేము నీపై అవతరింప జేసిన ఈ గ్రంథం (ఖుర్ఆన్) వారికి వినిపించబడుతోంది కదా! ఇది వారికి చాలదా?[1] నిశ్చయంగా, ఇందులో విశ్వసించే ప్రజలకు కారుణ్యం మరియు హితబోధలనున్నాయి.
[1] ఖుర్ఆన్, అల్లాహ్ (సు.తా.) అద్భుత సంకేతాలలో ఒకటి. అందుకే ఖుర్ఆన్ లో అల్లాహ్ (సు.తా.) దాని వంటి ఒక్క సూరహ్ నైనా రచించి తెమ్మని సత్యతిరస్కారులతో సవాలు చేశాడు. కాని వారు ఈ నాటికీ దానిని పూర్తి చేయలేక పోయారు. ఇంతకంటే మంచి అద్భుత సంకేతం ఇంకేం కావాలి? విశ్వసించనవారు ఎన్ని అద్భుతసంకేతాలు చూసినా విశ్వసించరు. ఉదాహరణకు: ఫిర్'ఔన్ మరియు అతని జాతివారు.
(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "నాకూ మరియు మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్ యే చాలు! ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న సమస్తమూ ఆయనకు తెలుసు." మరియు ఎవరైతే, అసత్యాన్ని విశ్వసించి, అల్లాహ్ ను తిరస్కరిస్తారో, అలాంటి వారే నష్టపడే వారు.
మరియు వారు (అవిశ్వాసులు) శిక్షను త్వరగా తీసుకు రమ్మని నిన్ను కోరు తున్నారు.[1] మరియు దానికై ఒక గడువు (అల్లాహ్ తరఫు నుండి) నిర్ణయింప బడి ఉండకపోతే! ఆ శిక్ష వారిపై వచ్చి పడి ఉండేది. మరియు నిశ్చయంగా, అది వారికి తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చి వారి మీద పడనున్నది!
ఓ విశ్వసించిన నా దాసులారా! నిశ్చయంగా, నా భూమి ఎంతో విశాలమైనది. కావున మీరు కేవలం నన్నే ఆరాధించండి.[1]
[1] ఏ స్థలంలోనైతే అల్లాహ్ (సు.తా.) ను ఆరాధించడం కష్టమయిపోతుందో మరియు ఇస్లాం ధర్మం మీద నిలువడం దుర్భరమవుతుందో అలాంటి చోటు నుండి ప్రస్థానం (హిజ్రత్) చేయటానికి అనుమతి ఇవ్వబడింది. ఉదాహరణకు మొట్టమొదటి ముస్లింలు 'హబషాకు, ప్రస్థానం చేశారు, దాని తరువాత మదీనాకు.
ఇక ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో! వారికి మేము స్వర్గంలో గొప్ప భవనాలలో స్థిర నివాసం ఇస్తాము. దాని క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసిన వారి ప్రతిఫలం ఎంత శ్రేష్ఠమైనది!
మరియు (ప్రపంచంలో) ఎన్నో ప్రాణులున్నాయి. అవి తమ జీవనోపాధిని తాము సాధించలేవు! అల్లాహ్ యే వాటికీ మరియు మీకు కూడా జీవనోపాధిని సమకూర్చుతున్నాడు. మరియు ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
మరియు ఒకవేళ నీవు వారితో: "ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించి, సూర్యచంద్రులను ఉపయుక్తంగా చేసింది ఎవరు?" అని అడిగితే, వారు తప్పక: "అల్లాహ్!" అని అంటారు. అయినా వారు ఎందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు?)
అల్లాహ్ తన దాసులలో, తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి దానిని మితంగా ఇస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతి దానిని గురించి బాగా తెలుసు.[1]
[1] అల్లాహ్ (సు.తా.) ఇహలోకంలో ప్రసాదించే ధనసంపత్తులకు విశ్వాసంతో, సత్కార్యాలతో సంబంధం లేదు. అల్లాహ్ (సు.తా.) ధనసంపత్తులు, హోదాలు ఇచ్చేది లేక పేదవారిగా ఉంచేది కూడా మానవులను పరీక్షించడానికే. ఇహలోక జీవితం అతి స్వల్పమైనది. కానీ శాశ్వాతమైన పరలోక జీవితంలో కేవలం విశ్వాసులై సత్కార్యాలు చేసి అల్లాహ్ (సు.తా.) అనుమతితో స్వర్గం పొందిన వారికే ఎడతెగని శాశ్వత సుఖసంతోషాలు ఉంటాయి.
మరియు ఒకవేళ నీవు వారితో: "ఆకాశం నుండి నీటిని కురిపించి, దాని నుండి నిర్జీవంగా ఉన్న భూమికి జీవితాన్ని ఇచ్చింది ఎవరు?" అని అడిగితే, వారు తప్పకుండా: "అల్లాహ్!" అని అంటారు. నీవు ఇలా అను: "సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే!" కాని చాలా మంది అర్థం చేసుకోలేరు.[1]
[1] దీనిని అర్థం చేసుకోవటానికి వారు తమ తెలివిని ఉపయోగించరు. కావున వారు విగ్రహాలను, జిన్నాతులను, చచ్చినవారిని, పుణ్యపురుషులను, దేవదూతలను మొదలైన వాటిని తమ ఆరాధ్య దైవాలుగా చేసుకుంటారు.
వారు నావలోకి ఎక్కినప్పుడు తమ భక్తిని కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుకొని ఆయననే ప్రార్థిస్తారు; కాని ఆయన వారిని రక్షించి నేల మీదకు తీసుకు రాగానే ఆయనకు సాటి కల్పించ సాగుతారు.[1]
[1] ఇక్రిమ ('ర.ది.'అ) మక్కా విజయం సమయంలో మక్కా విడిచి పారిపోతాడు. అతడు ఒక నావలోకి ఎక్కి పోతూ ఉండగా అది ప్రమాదంలో చిక్కుకుంటుంది. దానిలో ఉన్నవారు పరస్పరం ఇలా చెప్పుకుంటారు: "అల్లాహ్ (సు.తా.) ను వేడుకోండి. ఆయన తప్ప మమ్మల్ని మరెవ్వరూ కాపాడలేరు." అప్పుడు అతడు ఆలోచిస్తాడు: "సముద్రంలో అల్లాహ్ (సు.తా.) తప్ప మరొకరు కాపాడలేకుంటే నేలపై కూడా ఇతరులెవ్వరూ కాపాడలేరు. ఒకవేళ తాను ఇక్కడ నుండి బ్రతికి బయటపడితే దైవప్రవక్త ('స'అస) సన్నిధిలోకి పోయి ఇస్లాం స్వీకరిస్తాను." అని అనుకుంటాడు. అదేవిధంగా జరుగుతుంది. అతడు (ర'ది.'అ.) ఇస్లాం స్వీకరించి ఇస్లాం ప్రచారంలో చాలా పాటుపడ్తాడు. (ఇబ్నె-కసీ'ర్)
ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా మేము హరమ్ ను (మక్కాను) ఒక శాంతి నిలయంగా నెలకొల్పామని![1] మరియు వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు వారి నుండి లాక్కోబడుతున్నారని? అయినా వారు అసత్యాన్ని నమ్మి, అల్లాహ్ అనుగ్రహాన్ని తిరస్కరిస్తారా?
మరియు అల్లాహ్ మీద అబద్ధాలు కల్పించే వాని కంటే, లేక తన వద్దకు సత్యం వచ్చినపుడు దానిని అబద్ధమని తిరస్కరించే వాని కంటే, ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? ఏమీ? ఇలాంటి సత్యతిరస్కారులకు నరకమే నివాస స్థలం కాదా?
మరియు ఎవరైతే మా కొరకు హృదయపూర్వకంగా పాటుపడతారో, వారికి మేము మా మార్గాల వైపునకు మార్గదర్శకత్వం చేస్తాము. మరియు నిశ్చయంగా, అల్లాహ్ సజ్జనులకు తోడుగా ఉంటాడు.
Contents of the translations can be downloaded and re-published, with the following terms and conditions:
1. No modification, addition, or deletion of the content.
2. Clearly referring to the publisher and the source (QuranEnc.com).
3. Mentioning the version number when re-publishing the translation.
4. Keeping the transcript information inside the document.
5. Notifying the source (QuranEnc.com) of any note on the translation.
6. Updating the translation according to the latest version issued from the source (QuranEnc.com).
7. Inappropriate advertisements must not be included when displaying translations of the meanings of the Noble Quran.
نتایج جستجو:
API specs
Endpoints:
Sura translation
GET / https://quranenc.com/api/v1/translation/sura/{translation_key}/{sura_number} description: get the specified translation (by its translation_key) for the speicified sura (by its number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114)
Returns:
json object containing array of objects, each object contains the "sura", "aya", "translation" and "footnotes".
GET / https://quranenc.com/api/v1/translation/aya/{translation_key}/{sura_number}/{aya_number} description: get the specified translation (by its translation_key) for the speicified aya (by its number sura_number and aya_number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114) aya_number: [1-...] (Aya number in the sura)
Returns:
json object containing the "sura", "aya", "translation" and "footnotes".