నిశ్చయంగా, మీ ఆరాధ్య దైవం కేవలం ఆయన (అల్లాహ్) ఒక్కడే![1]
[1] పై మూడు ఆయతులలో దైవదూత ('అ.స.)ల వివిధ కార్యాలు వివరించబడ్డాయి. ప్రతిదీ అల్లాహ్ (సు.తా.) యొక్క సృష్టి మరియు ఆయనకు చెందినదే. కావున ఆయన తాను కోరిన దాని ప్రమాణం చేస్తాడు. కాని మానవులకు అల్లాహ్ (సు.తా.) తప్ప ఇతరుల ప్రమాణం చేయటం నిషిద్ధం ('హరాం) ఎందుకంటే ప్రమాణం తీసుకునే దానిని సాక్షిగా తీసుకోవలసి ఉంటుంది. మానవునికి అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక ఉత్తమ సాక్షి లేడు. ఎందుకంటే కేవలం అల్లాహ్ (సు.తా.) యే సర్వసాక్షి.
ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్యనున్న వాటి ప్రభువు మరియు సూర్యోదయ (తూర్పు) స్థలాలకు ప్రభువు.[1]
[1] చూడండి, 55:17. అక్కడ రెండు తూర్పులు మరియు రెండు పడమరలు అని ఉంది. అంటే చలికాలం మరియు వేసవి కాలంలో సూర్యోదయం మరియు సూర్యాస్తమయం అయ్యే రెండు చివరలు. వాస్తవానికి సంవత్సరపు ప్రతి రోజున సూర్యుడు ఒక క్రొత్త చోటునుండి ఉదయిస్తాడు మరియు ఒక క్రొత్త చోటులో అస్తమిస్తాడు (ఫ'త్హ్ అల్-ఖదీర్).
మరియు ధిక్కారి అయిన ప్రతి షైతాన్ నుండి కాపాడటానికి; [1]
[1] చూడండి, 15:17 నక్షత్రాల ఉనికికి మూడు కారణాలున్నాయి. 1) ఆకాశపు అలంకరణ. 2) షైతానులు ఆకాశాలలోకి పోయి దైవదూతల మాటలు వినటానికి ప్రయత్నిస్తే వాటిని తరుమటం. 3) రాత్రి చీకటిలో మానవులకు మార్దదర్శకము చేయటం. ఈ మూడు తప్ప ఇతర ఉపయోగాలు పేర్కొనబడలేదు.
అయితే వారిని అడగిండి: "ఏమీ? వారు (మానవులు) దృఢమైన సృష్టా! లేక, మేము సృష్టించింది (ఈ సృష్టి దృఢమైనదా?" నిశ్చయంగా, మేము వారిని జిగట మట్టి (తీనిల్లాజిబ్) తో సృష్టించాము.
[1] అంటే తీర్పు తరువాత స్వర్గవాసులు ఎల్లప్పుడు స్వర్గంలో మరియు నరకవాసులు శాశ్వతంగా నరకంలో ఉంటారు. అప్పుడు మరణాన్ని ఒక గొర్రె ఆకారంలో తెచ్చి స్వర్గనరకాల మధ్య జిబ్ హ చేయడం జరుగుతుంది, ('హదీస్').
ఏమీ? ఇలాంటి ఆతిథ్యం మేలైనదా? లేక జముడు ఫలపు[1] ఆతిథ్యమా?
[1] అజ్-'జఖ్ఖూము: జముడు చెట్టు ఫలం. ఇది అరబ్ తిహామహ్ ప్రాంతాలలో ఉన్నదేనని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. ఇది ఎంతో చేదైన దుర్వాసన గల ఫలం. ఇంకా చూడండి, 17:60, 44:43 మరియు 56:52.
మరియు అతని సంతతి వారిని మాత్రమే మిగిలి ఉండేటట్లు చేశాము.[1]
[1] నూ'హ్ ('అ.స.) భార్య మరియు అతని కుమారుడు విశ్వసించలేదు. కాబట్టి వారు, మునిగిపోయారు. అతని కుమారులలో 'హామ్, సామ్, యాఫస్'లు నావలో ఉన్నారు. 1) సామ్ నుండి 'అరబ్బులు, పర్షియన్లు, యూరోపియన్ లు మరియు యూదులు 2) 'హామ్ సంతతి నుండి సూడాన్, ఇండియా, 'హబషా, భిబ్తీలు మరియు బర్ బర్ లు మరియు 3) యాఫస్' సంతతి నుండి తుర్కీలు, ఖజర్, యఅ 'జూజ్ మఅ'జూజ్ మొదలైనవారు పుట్టారని చెబుతారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).
ఆ బాలుడు అతనికి తోడుగా శ్రమ చేయగల వయస్సుకు చేరుకున్నప్పుడు, అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: "ఓ నా కుమారా! వాస్తవానికి నేను నిన్ను బలి (జిబహ్) చేస్తున్నట్లుగా కలలో చూశాను, ఇక నీ సలహా ఏమిటో చెప్పు!" అతను (ఇస్మాయీల్) అన్నాడు: "ఓ నాన్నా! నీకు ఇవ్వబడిన ఆజ్ఞను నెరవేర్చు, అల్లాహ్ కోరితే నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు!"
మరియు మేము అతనికి (ఇస్మాయీల్ కు) బదులుగా ఒక గొప్ప బలిని పరిహారంగా ఇచ్చాము.[1]
[1] ఈ బలి ఒక గొర్రె. అది ఇస్మా'యీల్ ('అ.స.) కు బదులుగా పంపబడింది. అది బలి చేయబడింది. దీని జ్ఞాపకార్థమే ముస్లింలు ప్రతి సంవత్సరం జు'ల్ 'హజ్ లో బలి (ఖుర్బానీ) ఇస్తారు. వివరాల కోసం చూడండి, 22:27-37 మరియు 2:196-203.
మరియు మేము అతనికి ఇస్ హాఖ్ యొక్క శుభవార్తను ఇచ్చాము, అతను ఒక సద్వర్తనుడైన ప్రవక్త.[1]
[1] ఒక కుమారుణ్ణి జి'బహ్ చేసిన గాథ తరువాత మరొక కుమారుని, ఇ'స్హాఖ్ ('అ.స.) యొక్క శుభవార్త ఇవ్వబుడుతోంది. దీనితో స్పష్టమయ్యేది ఏమిటంటే జి'బహ్ చేయబడిన కుమారుడు ఇస్మాయీల్ ('అ.స.) మాత్రమే. అప్పుడత ('అ.స.) ను ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క ఏకైక పుత్రుడు. (చూడండి, ఇబ్నె-కసీ'ర్ మరియు ఫ'తహ్ అల్-ఖదీర్).
మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) మరియు ఇస్ హాఖ్ ను అనుగ్రహించాము. మరియు వారి సంతతిలో కొందరు సజ్జనులుండే వారు. మరికొందరు తమకు తాము స్పష్టంగా అన్యాయం చేసుకున్నవారు కూడా ఉన్నారు.[1]
[1] అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో, ఇ'స్హాఖ్ ('అ.స.) పుట్టక ముందే, ఇబ్రాహీమ్ ('అ.స.) తన రెండవ భార్య హాజర్ మరియు ఆమె కుమారుడు ఇస్మా'యీల్ ('అలైహిమ్ స.) లను మక్కాలో వదిలారు. ఇస్మా'యీల్ ('అ.స.) అక్కడ జుర్హుమ్ అనే 'అరబ్బు తెగ స్త్రీతో వివాహం చేసుకొని అక్కడే నివసిస్తూ 'అరబ్బులలో కలిసిపోయి 'అరబ్బు అయిపోయారు. అతని వంశంలో నుండి కేవలం ము'హమ్మద్ ('స'అస) మాత్రమే ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు.
ఇర ఇస్హా'ఖ్ ('అ.స.) కుమారుడు య'అఖూబ్ ('అ.స.) అతని మరొకపేరు ఇస్రాయీ'ల్. అదే పేరుతో అతని కుటుంబం వారు బనీ-ఇస్రాయీ'ల్ అనబడ్డారు. అతనికి 12 మంది కుమారులు. ప్రతి కుమారుని సంతతి నుండి ఒక బనీ-ఇస్రాయీ'ల్ తెగ ఏర్పడింది. యూసుఫ్ ('అ.స.) ఆ పన్నెండు కుమారులలో ఒకరు. బనీ-ఇస్రాయీ'ల్ సంతతిలో నుండి చాలా మంది ప్రవక్తలు వచ్చారు. మూసా మరియు 'ఈసా ('అలైహిమ్ స.) లు కూడా వారి సంతతిలోని వారే!
ఈ రెండు ప్రవక్తల సంతతిలో మంచి వారు పుట్టారు. ముష్రికులు కూడా పుట్టారు. కావున కేవలం తండ్రి తాతలు పుణ్యపురుషులు అయినంత మాత్రాన సంతానంలో అందరూ పుణ్యవంతులవటం తప్పనిసరి కాదు!
మరియు నిశ్చయంగా, ఇల్యాస్ కూడా మా సందేశహరులలో ఒకడు.[1]
[1] ఇల్యాస్ (Elijah) ('అ.స.) హారూన్ ('అ.స.) సంతతి చెందిన వారు. అతని నివాసం బఅల్బక్ నగరం. ఇల్యాస్ (ఏలియా) హిబ్రూ (యూదుల) ప్రవక్త. ఇతను ఫలస్తీన్ ఉత్తర భాగంలో అహబ్ మరియు అహాజియా రాజుల కాలంలో ఉన్నారు, (దాదాపు క్రీ.శకానికి 9 సంవత్సరాలకు ముందు) ఇతని తరువాత అల్-యస'అ (Elisha,'అ.స.) ప్రవక్తగా వచ్చారు.
[1] చూఖుర్ఆన్ లో ఇతర ప్రవక్తల ప్రస్తావన వచ్చినపుడు, వారిని: 'విశ్వాసులు' అని పేర్కొనబడింది. దీని ద్వారా తెలిసేది ఏమిటంటే, ప్రవక్తల ధర్మం ఏకదైవ సిద్ధాంతం - ఇస్లాం. వారు అందరూ విశ్వాసం అంటే అల్లాహ్ (సు.తా.) కు విధేయులై ఉండాలనీ, అల్లాహ్ (సు.తా.) తప్ప ఇతరులను ఆరాధించరాదని బోధించారు.
ఆ పిదప అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది; ఎందుకంటే అతను నిందార్హుడు.[1]
[1] యూనుస్ ('అ.స.) ఇరాఖ్ ప్రాంతంలో నైనవా (ఇప్పటి మో'సల్) నగరానికి ప్రవక్తగా పంపబడ్డారు. అక్కడి రాజు ఒక లక్ష బనీ ఇస్రాయీల్ సంతతి వారిని బందీలుగా చేసుకున్నాడు. వారి మార్గదర్శకత్వానికి అల్లాహ్ (సు.తా.) యూనుస్ ('అ.స.) ను పంపాడు. కాని వారు అతనిని విశ్వసించలేదు. అతను వారిని అల్లాహ్ (సు.తా.) శిక్ష రానున్నదనీ భయపెట్టారు. ఆ శిక్ష రాకముందే అల్లాహ్ (సు.తా.) అనుమతి లేకుండానే అతను అక్కడి నుండి పారిపోయి నావ ఎక్కారు. నావ బరువుతో మునిగి పోతుండగా, అక్కడ చీటీలు వేశారు. దానిలో అతని పేరు రాగా అతను సముద్రంలోకి దూకారు. అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది. చేప కడుపులో అతను అల్లాహ్ (సు.తా.) ను వేడుకున్నారు. అప్పుడతను బయట వేయబడ్డారు. ఇంకా చూడండి, 68:48.
[1] యఖ్'తీనున్: Gourd plant, ఆనపజాతి తీగ. అల్లాహ్ (సు.తా.) యూనుస్ ('అ.స.) ను ఏ చెట్టు చేమ లేని మైదానంలో పడవేసిన తరువాత అతని సహాయానికి ఒక ఆనప తీగను పుట్టించాడు. అదే విధంగా అల్లాహ్ (సు.తా.) కోరితే ఒక అవిశ్వాసిని విశ్వాసిగా మార్చవచ్చు! ఎప్పుడైతే అతడు హృదయపూర్వకంగా వేడుకుంటాడో.
మరియు వారు, ఆయన (అల్లాహ్) మరియు జిన్నాతుల మధ్య బంధుత్వం కల్పించారు.[1] కాని వాస్తవానికి జిన్నాతులకు తెలుసు, తాము ఆయన (అల్లాహ్) ముందు (లెక్క కొరకు) హాజరు చేయబడతామని!
[1] ముష్రికుల కల్పన ఏమిటంటే అల్లాహ్ (సు.తా.) జిన్నాతులతో వివాహసంబంధం ఏర్పరచుకున్నాడు, దానితో ఆడపిల్లలు పుట్టారు, వారే దైవదూతలు అని, ఇది అసత్యం. జిన్నున్: అంటే మానవ ఇంద్రియాలకు అగోచర ప్రాణి.
మరియు నిశ్చయంగా, మేము కూడా ఆయన పవిత్రతను కొనియాడే వారమే![1]
[1] అంటే దైవదూతలు కూడా అల్లాహ్ (సు.తా.) సృష్టించిన ఆయన దాసులు. ఎల్లప్పుడూ వారు కూడా అల్లాహ్ (సు.తా.) ను స్తుతిస్తూ ఉంటారు. ఆయన ఆజ్ఞా పాలన చేస్తూ ఉంటారు. ముష్రికులు భావించినట్లు వారు అల్లాహ్ (సు.తా.) కూతుళ్ళు కారు.
Contents of the translations can be downloaded and re-published, with the following terms and conditions:
1. No modification, addition, or deletion of the content.
2. Clearly referring to the publisher and the source (QuranEnc.com).
3. Mentioning the version number when re-publishing the translation.
4. Keeping the transcript information inside the document.
5. Notifying the source (QuranEnc.com) of any note on the translation.
6. Updating the translation according to the latest version issued from the source (QuranEnc.com).
7. Inappropriate advertisements must not be included when displaying translations of the meanings of the Noble Quran.
نتایج جستجو:
API specs
Endpoints:
Sura translation
GET / https://quranenc.com/api/v1/translation/sura/{translation_key}/{sura_number} description: get the specified translation (by its translation_key) for the speicified sura (by its number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114)
Returns:
json object containing array of objects, each object contains the "sura", "aya", "translation" and "footnotes".
GET / https://quranenc.com/api/v1/translation/aya/{translation_key}/{sura_number}/{aya_number} description: get the specified translation (by its translation_key) for the speicified aya (by its number sura_number and aya_number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114) aya_number: [1-...] (Aya number in the sura)
Returns:
json object containing the "sura", "aya", "translation" and "footnotes".