Check out the new design

કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - તેલુગુ ભાષામાં અલ્ મુખ્તસર ફી તફસીરિલ્ કુરઆનીલ્ કરીમ કિતાબનું અનુવાદ * - ભાષાંતરોની અનુક્રમણિકા


શબ્દોનું ભાષાંતર સૂરહ: અલ્ ઇસ્રા   આયત:
وَاِمَّا تُعْرِضَنَّ عَنْهُمُ ابْتِغَآءَ رَحْمَةٍ مِّنْ رَّبِّكَ تَرْجُوْهَا فَقُلْ لَّهُمْ قَوْلًا مَّیْسُوْرًا ۟
ఒక వేళ అల్లాహ్ నీపై ఆహారోపాధిని తెరచి వేయటమును నిరీక్షిస్తూ, వీరందరికి ఇవ్వవలసినది లేకపోవటం వలన నీవు ఇవ్వలేకపోతే,అప్పుడు నీవు వారితో మృధువుగా,సుతిమెత్తగా మాట్లాడు. ఎలాగంటే నీవు వారి కొరకు ఆహారోపాధి పెరగటం గురించి ప్రార్ధించటం లేదా నీకు అల్లాహ్ ప్రసాధిస్తే వారికి ఇస్తానని వాగ్ధానం చేయటం.
અરબી તફસીરો:
وَلَا تَجْعَلْ یَدَكَ مَغْلُوْلَةً اِلٰی عُنُقِكَ وَلَا تَبْسُطْهَا كُلَّ الْبَسْطِ فَتَقْعُدَ مَلُوْمًا مَّحْسُوْرًا ۟
మరియు నీవు ఖర్చు చేయటం నుండి నీ చేతిని నియంత్రించుకోకు మరియు ఖర్చు చేయటంలో దుబారా చేయకు. ఒక వేళ నీవు ఖర్చు చేయటం నుండి నీ చేతిని నియంత్రిస్తే అప్పుడు నీ పిసినారి తనంపై ప్రజలు నిన్ను అపనిందపాలు చేయటం వలన నీవు అపనిందపాలు అవుతావు,నీ దుబారా ఖర్చు వలన ఖర్చు చేయలేకపోతావు. నీవు ఖర్చు చేయవలసినది నీవు పొందలేవు.
અરબી તફસીરો:
اِنَّ رَبَّكَ یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآءُ وَیَقْدِرُ ؕ— اِنَّهٗ كَانَ بِعِبَادِهٖ خَبِیْرًا بَصِیْرًا ۟۠
నిశ్చయంగా నీ ప్రభువు సంపూర్ణ వివేకము వలన తాను కోరుకున్న వారికి ఆహారమును పుష్కలంగా ప్రసాధిస్తాడు,తాను కోరుకున్న వారికి దాన్ని కుదించివేస్తాడు. నిశ్చయంగా ఆయన తన దాసుల గురించి తెలుసుకునేవాడు,చూసేవాడును. వారిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. వారి మధ్య తాను కోరిన విధంగా తన ఆదేశమును జారీ చేస్తాడు.
અરબી તફસીરો:
وَلَا تَقْتُلُوْۤا اَوْلَادَكُمْ خَشْیَةَ اِمْلَاقٍ ؕ— نَحْنُ نَرْزُقُهُمْ وَاِیَّاكُمْ ؕ— اِنَّ قَتْلَهُمْ كَانَ خِطْاً كَبِیْرًا ۟
మరియు మీరు మీ సంతానమును వారిపై ఖర్ఛు చేస్తే భవిష్యత్తులో పేదరికం కలుగుతుందన్నభయంతో హతమార్చకండి. మేము వారిని ఆహారోపాధిని ప్రసాధించి పోషిస్తాము,మిమ్మల్ని ఆహారోపాధిని ప్రసాధించి పోషిస్తాము. ఒక వేళ వారిది ఏ పాపం లేకపోతే, వారిని హతమార్చటాన్ని అనివార్యం చేసే ఏ కారణం లేకపోతే నిశ్చయంగా వారిని హతమార్చటం మహా పాపం అవుతుంది.
અરબી તફસીરો:
وَلَا تَقْرَبُوا الزِّنٰۤی اِنَّهٗ كَانَ فَاحِشَةً ؕ— وَسَآءَ سَبِیْلًا ۟
మరియు మీరు వ్యభిచారము నుండి దూరంగా ఉండండి,దానిని పురిగొల్పే వాటి నుండి జాగ్రత్త పడండి. ఎందుకంటే అది అత్యంత చెడ్డ కార్యము. వంశములను కలతీ అవటమునకు,అల్లాహ్ శిక్షకు తీసుకుని వెళ్ళే చెడ్డ మార్గము.
અરબી તફસીરો:
وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِیْ حَرَّمَ اللّٰهُ اِلَّا بِالْحَقِّ ؕ— وَمَنْ قُتِلَ مَظْلُوْمًا فَقَدْ جَعَلْنَا لِوَلِیِّهٖ سُلْطٰنًا فَلَا یُسْرِفْ فِّی الْقَتْلِ ؕ— اِنَّهٗ كَانَ مَنْصُوْرًا ۟
మరియు మీరు అల్లాహ్ ఏ ప్రాణము యొక్క రక్తమును విశ్వాసము ద్వారా లేదా రక్షణ ద్వారా పరిరక్షించాడో ఆ ప్రాణమును చంపకండి. ఒక వేళ అతను విశ్వాసము నుండి తిరిగిపోవటం ద్వారా లేదా శీలము తరువాత వ్యభిచారము చేయటం ద్వారా లేదా ప్రతీకార న్యాయము ద్వారా ప్రాణము తీయటం అనివార్యం అయితే తప్ప. ఎవరిదైన ప్రాణం తీయటమునకు సమ్మతం అవటానికి ఎటువంటి కారణం లేకుండా దుర్మార్గంగా ప్రాణం తీయబడితే నిశ్చయంగా మేము అతని వ్యవహారమునకు దగ్గరగా ఉన్న అతని వారసులకు అతని ప్రాణం తీసిన వారిపై ఆధిక్యతను ప్రసాధించాము. అప్పుడు అతని కొరకు అతని ప్రాణం తీయటము పై ప్రతీకార న్యాయమును అడగాలి. మరియు అతని కొరకు ఎటువంటి బదులు లేకుండా మన్నించే హక్కు ఉన్నది, పరిహారము తీసుకోవటంతోపాటు మన్నించే హక్కు ఉన్నది. అయితే అతను హంతకుని విషయంలోఉన్నది ఉన్నట్లుగా వ్యవహరించటం ద్వారా లేదా అతను హత్య చేసిన దానితో కాకుండా వేరేదానితో హత్య చేయటం ద్వారా లేదా హంతకుని వదిలి వేరే వారిని హత్య చేయటం ద్వారా అల్లాహ్ అతని కొరకు సమ్మతం చేసిన హద్దును అతిక్రమించకూడదు. నిశ్చయంగా అతడు మద్దతు ఇవ్వబడినవాడును,సహాయం చేయబడిన వాడును.
અરબી તફસીરો:
وَلَا تَقْرَبُوْا مَالَ الْیَتِیْمِ اِلَّا بِالَّتِیْ هِیَ اَحْسَنُ حَتّٰی یَبْلُغَ اَشُدَّهٗ ۪— وَاَوْفُوْا بِالْعَهْدِ ۚ— اِنَّ الْعَهْدَ كَانَ مَسْـُٔوْلًا ۟
మరియు పిల్లల్లోంచి ఎవరి తండ్రి చనిపోయాడో అతని సంపదను అతను పరిపూర్ణ బుద్ధికి,యుక్త వయస్సుకు చేరే వరకు దానిని పెంచటంలో,దానిని పరి రక్షించటంలో అతని కొరకు ప్రయోజన కరమైతేనే తప్ప మీరు దాన్ని వినియోగించకండి. మరియు మీరు మీకూ,అల్లాహ్ కు మధ్య ఉన్న మరియు మీకూ అతని దాసులకు మధ్య ఉన్న ప్రమాణమును ఏ విధంగా భంగపరచకుండా లేదా తగ్గించకుండా పూర్తి చేయండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రమాణమును ఇచ్చే వాడిని ప్రళయదినాన ప్రశ్నిస్తాడు : ఏమి అతనికి ప్రతిఫలం ఇవ్వటానికి అతను దాన్ని పూర్తి చేశాడా లేదా అతను శిక్షించబడటానికి దాన్ని పూర్తి చేయలేదా.
અરબી તફસીરો:
وَاَوْفُوا الْكَیْلَ اِذَا كِلْتُمْ وَزِنُوْا بِالْقِسْطَاسِ الْمُسْتَقِیْمِ ؕ— ذٰلِكَ خَیْرٌ وَّاَحْسَنُ تَاْوِیْلًا ۟
మరియు మీరు ఇతరుల కొరకు కొలచినప్పుడు కొలిచే పాత్రను పూర్తిగా కొలచి ఇవ్వండి. మరియు మీరు దాన్ని తరిగించకండి. త్రాసుతో ఎటువంటి తగ్గుదల లేకుండా ,ఎటువంటి తరగుదల లేకుండా న్యాయపూరితంగా (సమానంగా) తూకమేయండి. కొలమానములో,తూకములో ఈ సమాంతరము ఇహలోకములో,పరలోకములో మీ కొరకు మేలైనది. కొలమానాలను,తూకములను తరిగించటం ద్వారా తగ్గంచి ఇవ్వటం కన్నా మంచి పరిణామం కలది.
અરબી તફસીરો:
وَلَا تَقْفُ مَا لَیْسَ لَكَ بِهٖ عِلْمٌ ؕ— اِنَّ السَّمْعَ وَالْبَصَرَ وَالْفُؤَادَ كُلُّ اُولٰٓىِٕكَ كَانَ عَنْهُ مَسْـُٔوْلًا ۟
ఓ ఆదం కుమారుడా నీవు నీకు జ్ఞానం లేని విషయాలను అనుసరించకు. అటువంటప్పుడు నీవు అనుమానాలను,అపోహలను అనుసరిస్తావు.నిశ్చయంగా మానవుడు తన వినికిడి,తన చూపు,తన మనస్సు ముందడుగు వేసిన మంచి గురించి,చెడు గురించి ప్రశ్నించబడుతాడు. అప్పుడు అతను మంచి చేసిన దానిపై ప్రతిఫలమును ప్రసాధించబడుతాడు,చెడు చేసిన దానిపై శిక్షించబడుతాడు.
અરબી તફસીરો:
وَلَا تَمْشِ فِی الْاَرْضِ مَرَحًا ۚ— اِنَّكَ لَنْ تَخْرِقَ الْاَرْضَ وَلَنْ تَبْلُغَ الْجِبَالَ طُوْلًا ۟
మరియు నీవు భుూమిపై గర్వంతో,అహంకారముతో నడవకు. నిశ్చయంగా నీవు ఒక వేళ అందులో అహంకారముతో నడిస్తే నీ నడవటం ద్వారా నీవు భూమిని చీల్చ లేవు,మరియు నీ ఎత్తు పర్వతాల ఎత్తునకు చేరనూ లేదు అటువంటప్పుడు గర్వము ఏ విషయంపైన ?!.
અરબી તફસીરો:
كُلُّ ذٰلِكَ كَانَ سَیِّئُهٗ عِنْدَ رَبِّكَ مَكْرُوْهًا ۟
ఓ మానవుడా ముందు ప్రస్తావన జరిగిన ప్రతీ చెడు నీ ప్రభువు వద్ద వారించబడినది. అల్లాహ్ వాటిని పాల్పడిన వాడిని ఇష్టపడడు కాని అతన్ని అసహ్యించుకుంటాడు.
અરબી તફસીરો:
આયતોના ફાયદાઓ માંથી:
• الأدب الرفيع هو رد ذوي القربى بلطف، ووعدهم وعدًا جميلًا بالصلة عند اليسر، والاعتذار إليهم بما هو مقبول.
ఉన్నతమైన గుణం ఏమిటంటే దగ్గరి బంధువులను సున్నితంగా ప్రతిస్పందించటం. మరియు వారికి బంధుత్వముతో సులభతరమున్నప్పుడు మంచి వాగ్ధానం చేయటం, వారితో ఆమోదయోగ్యమైన క్షమాపణ కోరటం.

• الله أرحم بالأولاد من والديهم؛ فنهى الوالدين أن يقتلوا أولادهم خوفًا من الفقر والإملاق وتكفل برزق الجميع.
అల్లాహ్ సంతానముపై వారి తల్లిదండ్రులకన్న ఎక్కువ దయ గలిగినవాడు. అందుకనే తల్లిదండ్రులకి తమ సంతానమును పేదరికం,దరిద్రం భయం వలన హతమార్చటం నుండి వారించాడు. అందరికి ఆహారోపాధి ద్వారా పోషించాడు.

• في الآيات دليل على أن الحق في القتل للولي، فلا يُقْتَص إلا بإذنه، وإن عفا سقط القصاص.
హత్య విషయంలో దగ్గరి వారికి హక్కు ఉన్నదని ఆయతుల్లో ఆధారం ఉన్నది. అతని అనుమతితోనే హత్య ప్రతీకారము తీసుకొనబడును. ఒక వేళ అతను మన్నిస్తే హత్య యొక్క ప్రతీకార ఆదేశము తొలగిపోవును.

• من لطف الله ورحمته باليتيم أن أمر أولياءه بحفظه وحفظ ماله وإصلاحه وتنميته حتى يبلغ أشده.
అనాధ విషయంలో అతడు యవ్వన దశకు చేరుకునేంత వరకు అతని పోషకులకు అతని సంరక్షణ గురించి,అతని సంపద సంరక్షణ గురించి,దాన్ని సంస్కరించటం గురించి,దాన్ని వృద్ధి పరచటం గురించి ఆదేశించటం అల్లాహ్ దయ,ఆయన కారుణ్యము లోనిది.

 
શબ્દોનું ભાષાંતર સૂરહ: અલ્ ઇસ્રા
સૂરહ માટે અનુક્રમણિકા પેજ નંબર
 
કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - તેલુગુ ભાષામાં અલ્ મુખ્તસર ફી તફસીરિલ્ કુરઆનીલ્ કરીમ કિતાબનું અનુવાદ - ભાષાંતરોની અનુક્રમણિકા

તફસીર લિદ્ દિરાસતીલ્ કુરઆનિયહ કેન્દ્ર દ્વારા પ્રકાશિત.

બંધ કરો