Check out the new design

કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - તેલુગુ ભાષામાં અલ્ મુખ્તસર ફી તફસીરિલ્ કુરઆનીલ્ કરીમ કિતાબનું અનુવાદ * - ભાષાંતરોની અનુક્રમણિકા


શબ્દોનું ભાષાંતર સૂરહ: કૉફ   આયત:

ఖాఫ్

સૂરતના હેતુઓ માંથી:
وعظ القلوب بالموت والبعث.
మరణం మరియు మరణాంతరం లేపబడటం ద్వారా హృదయములకు హితోపదేశం.

قٓ ۫— وَالْقُرْاٰنِ الْمَجِیْدِ ۟ۚ
{قٓ} ఖాఫ్ సూరె బఖరా ఆరంభములో వీటి సారుప్యాలపై చర్చ జరిగినది. అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ పై దానిలో ఉన్న అర్ధాలు మరియు అధికమైన మేలు మరియు శుభాల వలన ప్రళయదినము నాడు మీరు లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు తప్పకుండా లేపబడుతారని ప్రమాణం చేశాడు.
અરબી તફસીરો:
بَلْ عَجِبُوْۤا اَنْ جَآءَهُمْ مُّنْذِرٌ مِّنْهُمْ فَقَالَ الْكٰفِرُوْنَ هٰذَا شَیْءٌ عَجِیْبٌ ۟ۚ
వారు మీ నిజాయితీని తెలిసి కూడా తిరస్కరించటం వారి నుండి ఆశించటం వారి తిరస్కారమునకు కారణం కాలేదు. కానీ హెచ్చరించే ఒక ప్రవక్త దైవ దూతల్లోంచి కాకుండా వారిలో నుంచే వారి వద్దకు రావటం ఆశ్ఛర్యమునకు గురి చేయటం (కారణమయింది). మరియు వారు తమ ఆశ్చర్యముతో ఇలా పలికారు : మనుషుల్లోంచి ఒక ప్రవక్త మా వద్దకు రావటం ఒక ఆశ్ఛర్యకరమైన విషయం.
અરબી તફસીરો:
ءَاِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا ۚ— ذٰلِكَ رَجْعٌ بَعِیْدٌ ۟
ఏమీ మేము మరణించి మట్టిగా మారిపోయినప్పుడు మేము మరల లేపబడుతామా ?! ఈ మరలింపబడటం మరియు మా శరీరములకు జీవితం మరలించటం అది కూడా ప్రతీ వస్తువు క్రుశించిపోయిన తరువాత చాలా దూరమైన విషయం. అది జరగటం సాధ్యంకాని విషయం.
અરબી તફસીરો:
قَدْ عَلِمْنَا مَا تَنْقُصُ الْاَرْضُ مِنْهُمْ ۚ— وَعِنْدَنَا كِتٰبٌ حَفِیْظٌ ۟
వారి మరణం తరువాత వారి శరీరముల నుండి భూమి ఏమి తింటుందో మరియు ఏది నాశనం చేస్తుందో మాకు తెలుసు. మరియు వారి జీవితంలో మరియు మా వద్ద వారి మరణం తరువాత అల్లాహ్ వారికోసం ఏమేమి అంచనా వేసి ఉంచాడో ప్రతీది గుర్తుంచుకునే ఒక గ్రంధం ఉన్నది.
અરબી તફસીરો:
بَلْ كَذَّبُوْا بِالْحَقِّ لَمَّا جَآءَهُمْ فَهُمْ فِیْۤ اَمْرٍ مَّرِیْجٍ ۟
కాని ఈ ముష్రికులందరు ఖుర్ఆన్ ను వారి వద్దకు ప్రవక్త దాన్ని తీసుకుని వచ్చినప్పుడు తిరస్కరించారు. అప్పుడు వారు ఒక సమస్యాత్మక పరిస్థితిలో ఉన్నారు. వారు దాని విషయంలో (ఖుర్ఆన్ విషయంలో) దేనిపై స్థిరంగా ఉండలేరు.
અરબી તફસીરો:
اَفَلَمْ یَنْظُرُوْۤا اِلَی السَّمَآءِ فَوْقَهُمْ كَیْفَ بَنَیْنٰهَا وَزَیَّنّٰهَا وَمَا لَهَا مِنْ فُرُوْجٍ ۟
ఏమీ మరణాంతరము లేపబడటమును తిరస్కరించే వీరందరు తమ పైన ఉన్న ఆకాశము విషయంలో మేము దాన్ని ఎలా సృష్టించామో మరియు మేము దాన్ని ఎలా తయారు చేశామో మరియు మేము దానిలో ఉంచిన నక్షత్రములతో దాన్ని ఎలా ముస్తాబు చేశామో మరియు దానిలో లోపమును కలిగించే ఎటువంటి పగుళ్ళు లేకపోవటంలో యోచన చేయటం లేదా ?! కావున ఈ ఆకాశమును సృష్టించిన వాడు మృతులను జీవింపజేసి మరణాంతరం లేపటం నుండి అశక్తుడు కాడు.
અરબી તફસીરો:
وَالْاَرْضَ مَدَدْنٰهَا وَاَلْقَیْنَا فِیْهَا رَوَاسِیَ وَاَنْۢبَتْنَا فِیْهَا مِنْ كُلِّ زَوْجٍ بَهِیْجٍ ۟ۙ
మరియు భూమిని మేము దానిపై నివాసము కొరకు యోగ్యముగా ఉండేటట్లు దాన్ని విస్తరింపజేశాము. మరియు అది కదలకుండా ఉండేటందుకు అందులో మేము స్థిరమైన పర్వతములను ఉంచాము. మరియు మంచి దృశ్యమును కలిగించే అన్నీరకముల మొక్కలను మరియు చెట్లను అందులో మేము మొలకెత్తింపజేశాము.
અરબી તફસીરો:
تَبْصِرَةً وَّذِكْرٰی لِكُلِّ عَبْدٍ مُّنِیْبٍ ۟
మరియు మేము వీటన్నింటిని తన ప్రభువు వైపునకు విధేయత ద్వరా మరలే ప్రతీ దాసుని కొరకు దూరదృష్టి అవటానికి మరియు హితబోధన అవటానికి సృష్టించాము.
અરબી તફસીરો:
وَنَزَّلْنَا مِنَ السَّمَآءِ مَآءً مُّبٰرَكًا فَاَنْۢبَتْنَا بِهٖ جَنّٰتٍ وَّحَبَّ الْحَصِیْدِ ۟ۙ
మరియు మేము ఆకాశము నుండి చాలా ప్రయోజనకరమైన,మేలైన నీటిని కురిపించాము. ఆ నీటి ద్వారా మేము చాలా తోటలను పండించాము. మరియు మీరు కోత కోసే జొన్నలు మొదలగు ధాన్యములను పండించాము.
અરબી તફસીરો:
وَالنَّخْلَ بٰسِقٰتٍ لَّهَا طَلْعٌ نَّضِیْدٌ ۟ۙ
మరియు దాని ద్వారా మేము పొడవైన, ఎత్తైన ఖర్జూరపు చెట్లను పండించాము, ఒక దానిపై ఒకటి పేరుకుపోయిన పండ్ల గుత్తులు వాటికి కలవు.
અરબી તફસીરો:
رِّزْقًا لِّلْعِبَادِ ۙ— وَاَحْیَیْنَا بِهٖ بَلْدَةً مَّیْتًا ؕ— كَذٰلِكَ الْخُرُوْجُ ۟
వాటి నుండి మేము పండించిన దాన్ని దాసుల కొరకు ఆహారంగా వారు దాని నుండి తినటానికి పండించినాము. మరియు మేము దాని ద్వారా ఎటువంటి మొక్కలు లేని ప్రదేశమును జీవింపజేశాము. ఏ విధంగా నైతే ఈ వర్షము ద్వారా మేము ఎటువంటి మొక్కలు లేని ప్రదేశమును జీవింపజేశామో అలాగే మేము మృతులను జీవింపజేస్తాము అప్పుడు వారు జీవించి బయటకు వస్తారు.
અરબી તફસીરો:
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّاَصْحٰبُ الرَّسِّ وَثَمُوْدُ ۟ۙ
ఓ ప్రవక్తా మిమ్మల్ని తిరస్కరించిన వీరందరికన్న ముందు చాలా సమాజాలు తమ ప్రవక్తలను తిరస్కరించారు. నూహ్ జాతి వారు మరియు బావి వారు తిరస్కరించారు మరియు సమూద్ జాతివారు తిరస్కరించారు.
અરબી તફસીરો:
وَعَادٌ وَّفِرْعَوْنُ وَاِخْوَانُ لُوْطٍ ۟ۙ
మరియు ఆద్ జాతివారు,ఫిర్ఔన్ మరియు లూత్ జాతివారు తిరస్కరించారు.
અરબી તફસીરો:
وَّاَصْحٰبُ الْاَیْكَةِ وَقَوْمُ تُبَّعٍ ؕ— كُلٌّ كَذَّبَ الرُّسُلَ فَحَقَّ وَعِیْدِ ۟
అయికా వారైన షుఐబ్ జాతివారు మరియు తుబ్బా జాతివారు యమన్ రాజును తిరస్కరించారు. ఈ జాతులవారందరు అల్లాహ్ వారి వద్దకు పంపించిన ప్రవక్తలను తిరస్కరించారు. కావున అల్లాహ్ వారితో వాగ్దానం చేసిన శిక్షను వారిపై నిరూపించాడు.
અરબી તફસીરો:
اَفَعَیِیْنَا بِالْخَلْقِ الْاَوَّلِ ؕ— بَلْ هُمْ فِیْ لَبْسٍ مِّنْ خَلْقٍ جَدِیْدٍ ۟۠
అయితే ఏమిటీ మేమి మిమ్మల్ని మొదటి సారి సృష్టించటం నుండి అలసిపోయామా మిమ్మల్ని మరల లేపటం నుండి అలసిపోవటానికి ?! కాని వారిని సృష్టించిన తరువాత సరికొత్తగా సృష్టించటం గురించి వారు ఆశ్ఛర్యములో పడి ఉన్నారు.
અરબી તફસીરો:
આયતોના ફાયદાઓ માંથી:
• المشركون يستعظمون النبوة على البشر، ويمنحون صفة الألوهية للحجر!
ముష్రికులు దైవదౌత్యమును మానవులపై పెద్ద విషయంగా(అసంభవమైనదిగా) భావించేవారు మరియు దైవిక గుణమును రాళ్ళకు ఇచ్చేవారు.

• خلق السماوات، وخلق الأرض، وإنزال المطر، وإنبات الأرض القاحلة، والخلق الأول: كلها أدلة على البعث.
ఆకాశములను సృష్టించటం మరియు భూమిని సృష్టించటం మరియు వర్షమును కురిపించటం మరియు శుష్క భూమిని పండించటం మరియు మొదటి సారి సృష్టించటం అన్నీ మరణాంతరం లేపబడటంపై సూచనలు.

• التكذيب بالرسل عادة الأمم السابقة، وعقاب المكذبين سُنَّة إلهية.
ప్రవక్తలను తిరస్కరించటం పూర్వ సమాజాల ఆనవాయితీ మరియు తిరస్కారులను శిక్షించటం దైవిక సంప్రదాయము.

 
શબ્દોનું ભાષાંતર સૂરહ: કૉફ
સૂરહ માટે અનુક્રમણિકા પેજ નંબર
 
કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - તેલુગુ ભાષામાં અલ્ મુખ્તસર ફી તફસીરિલ્ કુરઆનીલ્ કરીમ કિતાબનું અનુવાદ - ભાષાંતરોની અનુક્રમણિકા

તફસીર લિદ્ દિરાસતીલ્ કુરઆનિયહ કેન્દ્ર દ્વારા પ્રકાશિત.

બંધ કરો