કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - ભાષાંતરોની અનુક્રમણિકા


શબ્દોનું ભાષાંતર આયત: (22) સૂરહ: અલ્ મુજાદિલહ
لَا تَجِدُ قَوْمًا یُّؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ یُوَآدُّوْنَ مَنْ حَآدَّ اللّٰهَ وَرَسُوْلَهٗ وَلَوْ كَانُوْۤا اٰبَآءَهُمْ اَوْ اَبْنَآءَهُمْ اَوْ اِخْوَانَهُمْ اَوْ عَشِیْرَتَهُمْ ؕ— اُولٰٓىِٕكَ كَتَبَ فِیْ قُلُوْبِهِمُ الْاِیْمَانَ وَاَیَّدَهُمْ بِرُوْحٍ مِّنْهُ ؕ— وَیُدْخِلُهُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا ؕ— رَضِیَ اللّٰهُ عَنْهُمْ وَرَضُوْا عَنْهُ ؕ— اُولٰٓىِٕكَ حِزْبُ اللّٰهِ ؕ— اَلَاۤ اِنَّ حِزْبَ اللّٰهِ هُمُ الْمُفْلِحُوْنَ ۟۠
ఓ ప్రవక్తా అల్లాహ్ తో మరియు ఆయన ప్రవక్తతో శతృత్వముతో వ్యవహరించే వారితో అల్లాహ్ ను విశ్వసించి,ప్రళయదినమును విశ్వసించే ఏ జాతి వారు ఇష్టపడటమును మరియు స్నేహం చేయటమును మీరు పొందరు. ఒక వేళ అల్లాహ్,ఆయన ప్రవక్త శతృవులైన వీరందరు వారి తండ్రులైన లేదా వారి కుమారులైన లేదా వారి సోదరులైన లేదా వారు సంబంధము కలిగిన వారి కుటుంబము వారైన సరే. ఎందుకంటే విశ్వాసము అల్లాహ్,ఆయన ప్రవక్త శతృవులతో స్నేహం చేయటం నుండి ఆపుతుంది. మరియు ఎందుకంటే విశ్వాసముతో సంబంధము అన్నింటితో సంబంధాల కన్నా ఎంతో గొప్పది. కాబట్టి అవి ఎదురైనప్పుడు అది ముందుంటుంది. వారందరు ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త శతృవులతో స్నేహం చేయరో - ఒక వేళ వారు దగ్గరి బందువులైనా - వారే అల్లాహ్ వారి హృదయముల్లో విశ్వాసమును స్థిరపరచాడు. కావున అది మారదు. మరియు ఆయన వారిని తన వద్ద నుండి ఋజువుతో మరియు వెలుగుతో బలబరచాడు. మరియు ఆయన వారిని ప్రళయదినమున శాశ్వతమైన స్వర్గ వనముల్లో ప్రవేశింపజేస్తాడు. వాటి భవనముల క్రింది నుండి మరియు వాటి వృక్షముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారు వాటిలో శాశ్వతంగా నివాసముంటారు. వాటి అనుగ్రహాలు వారి నుండి అంతము కావు మరియు వారు దాని నుండి నశించిపోరు. అల్లాహ్ వారి నుండి ఎంత సంతుష్ట పడతాడంటే దాని తరువాత ఆయన ఎన్నడూ ఆగ్రహానికి లోను కాడు. మరియు ఆయన వారికి ప్రసాదించిన అంతము కాని అనుగ్రహాల వలన వారు ఆయనతో సంతుష్టపడుతారు. పరిశుద్ధుడైన ఆయనను దర్శించుకోవటం వాటిలో నుంచే. ప్రస్తావించబడిన వాటితో వర్ణించబడిన వారందరు అల్లాహ్ ఆదేశించిన వాటిని పాటించే మరియు ఆయన వారించిన వాటి నుండి ఆగిపోయే అల్లాహ్ సైన్యము. వినండి నిశ్చయంగా అల్లాహ్ సైన్యమే వారే తాము ఆశించిన వాటిని పొంది తాము భయపడే వాటి నుండి తొలగిపోయి ఇహపరాల్లో సాఫల్యం చెందుతారు.
અરબી તફસીરો:
આયતોના ફાયદાઓ માંથી:
• المحبة التي لا تجعل المسلم يتبرأ من دين الكافر ويكرهه، فإنها محرمة، أما المحبة الفطرية؛ كمحبة المسلم لقريبه الكافر، فإنها جائزة.
ముస్లిమును అవిశ్వాసపరుని ధర్మము పట్ల విసుగును చూపనట్లు మరియు దాని పట్ల అయిష్టత చూపనట్లు చేయని ఇష్టత (ప్రేమ) నిషిద్ధము. ఇకపోతే అవిశ్వాసపరుని బంధుత్వము వలన ముస్లిం ప్రేమ లాంటి స్వాభావిక ప్రేమ సమ్మతము.

• رابطة الإيمان أوثق الروابط بين أهل الإيمان.
విశ్వాసము యొక్క సంబంధము విశ్వాసపరుల మధ్య అత్యంత దృఢమైన సంబంధము.

• قد يعلو أهل الباطل حتى يُظن أنهم لن ينهزموا، فتأتي هزيمتهم من حيث لا يتوقعون.
ఒక్కొక్క సారి అసత్య పరులు వారు ఓడిపోరని అనుకునేవరకు పైకి లేస్తారు. వారు ఊహించని చోటు నుండి వారి ఓటమి వస్తుంది.

• من قدر الله في الناس دفع المصائب بوقوع ما دونها من المصائب.
ఆపదలను వాటి కన్న తక్కువ ఆపదలను కలిగించి తొలగించటం ప్రజల విషయంలో అల్లాహ్ విధి వ్రాతలోంచిది.

 
શબ્દોનું ભાષાંતર આયત: (22) સૂરહ: અલ્ મુજાદિલહ
સૂરહ માટે અનુક્રમણિકા પેજ નંબર
 
કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - ભાષાંતરોની અનુક્રમણિકા

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

બંધ કરો