Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Sura: Suratu Maryam   Aya:

సూరహ్ మర్యమ్

daga cikin abunda Surar ta kunsa:
إبطال عقيدة نسبة الولد لله من المشركين والنصارى، وبيان سعة رحمة الله بعباده.
అల్లాహ్ కు సంతానము ఉన్నదని అపాదించే బహుదైవారధకుల,క్రైస్తవుల విశ్వాసమును రద్దు చేయడం మరియు తన దాసులపై అల్లాహ్ యొక్క కారుణ్య విశాలతను వివరించడం.

كٓهٰیٰعٓصٓ ۟
(كٓهيعٓصٓ) కాఫ్ - హా - యా - ఐన్ - సాద్.సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
Tafsiran larabci:
ذِكْرُ رَحْمَتِ رَبِّكَ عَبْدَهٗ زَكَرِیَّا ۟ۖۚ
ఇది తన దాసుడు జకరియ్యా అలైహిస్సలాం పై నీ ప్రభువు యొక్క కారుణ్యము యొక్క ప్రస్తావన.దాని ద్వారా గుణపాఠం నేర్చుకోవటానికి మేము దాన్ని మీకు తెలియపరుస్తున్నాము.
Tafsiran larabci:
اِذْ نَادٰی رَبَّهٗ نِدَآءً خَفِیًّا ۟
అతడు పరిశుద్ధుడైన తన ప్రభువును ఏకాంతంలో స్వీకరించబడటానికి అత్యంత దగ్గరవటానికి మొరపెట్టుకున్నప్పుడు.
Tafsiran larabci:
قَالَ رَبِّ اِنِّیْ وَهَنَ الْعَظْمُ مِنِّیْ وَاشْتَعَلَ الرَّاْسُ شَیْبًا وَّلَمْ اَكُنْ بِدُعَآىِٕكَ رَبِّ شَقِیًّا ۟
ఇలా పలికాడు : ఓ నా ప్రభువా నా ఎముకలు బలహీనమైపోయాయి, నా తల వెంట్రుకలు చాలా తెల్లబడిపోయాయి, నీతో నేను మొర పెట్టుకున్నప్పుడు నేను విఫలం కాలేదు. అంతే కాక నేను నిన్ను మొరపెట్టుకున్నప్పుడల్లా నీవు నన్ను స్వీకరించావు.
Tafsiran larabci:
وَاِنِّیْ خِفْتُ الْمَوَالِیَ مِنْ وَّرَآءِیْ وَكَانَتِ امْرَاَتِیْ عَاقِرًا فَهَبْ لِیْ مِنْ لَّدُنْكَ وَلِیًّا ۟ۙ
నిశ్చయంగా నా దగ్గరి బందువులు నా తదనంతరం వారు ఇహలోకపు విషయాల్లో మునిగి ఉండటం వలన ధర్మము యొక్క హక్కును నెరవేర్చరని భయపడుతున్నాను. నా భార్య ఏమో జన్మనివ్వని గొడ్రాలు.కాబట్టి నీవు నీ వద్ద నుండి నాకు ఒక సహాయకుడిగా ఒక కుమారుడిని ప్రసాధించు.
Tafsiran larabci:
یَّرِثُنِیْ وَیَرِثُ مِنْ اٰلِ یَعْقُوْبَ ۗ— وَاجْعَلْهُ رَبِّ رَضِیًّا ۟
అతడు దైవదౌత్యంలో నాకు వారసుడవుతాడు. మరియు అందులో యాఖూబ్ సంతతి వారికి వారసుడవుతాడు. ఓ నా ప్రభువా నీవు అతడిని తన ధర్మములో,తన గుణములలో,తన జ్ఞానములో ప్రీతిపాత్రునిగా చేసుకో.
Tafsiran larabci:
یٰزَكَرِیَّاۤ اِنَّا نُبَشِّرُكَ بِغُلٰمِ ١سْمُهٗ یَحْیٰی ۙ— لَمْ نَجْعَلْ لَّهٗ مِنْ قَبْلُ سَمِیًّا ۟
అప్పుడు అల్లాహ్ అతని దుఆను స్వీకరించి అతడిని పిలిచి ఇలా పలికాడు : ఓ జకరియ్యా నిశ్చయంగా మేము నీకు సంతోషమును కలిగించే మాటను తెలియపరిచాము. నిశ్చయంగా మేము మీ దుఆను స్వీకరించాము. మరియు మేము నీకు ఒక కుమారుడిని ప్రసాధించాము అతని పేరు యహ్యా. అతనికన్న ముందు మేము ఈ నామమును ఇంకెవరికీ పెట్టలేదు.
Tafsiran larabci:
قَالَ رَبِّ اَنّٰی یَكُوْنُ لِیْ غُلٰمٌ وَّكَانَتِ امْرَاَتِیْ عَاقِرًا وَّقَدْ بَلَغْتُ مِنَ الْكِبَرِ عِتِیًّا ۟
జకరియ్యా అల్లాహ్ సామర్ధ్యముపై ఆశ్చర్యపడుతూ ఇలా పలికారు : ఎలా నాకు కుమారుడు కలుగుతాడు. వాస్తవానికి నా భార్య జన్మనివ్వని గొడ్రాలు,నేనేమో వృద్ధాప్యపు ఆఖరి దశకు చేరుకున్నాను,నా ఎముకలు బలహీనమైపోయినవి ?.
Tafsiran larabci:
قَالَ كَذٰلِكَ ۚ— قَالَ رَبُّكَ هُوَ عَلَیَّ هَیِّنٌ وَّقَدْ خَلَقْتُكَ مِنْ قَبْلُ وَلَمْ تَكُ شَیْـًٔا ۟
దైవ దూత ఇలా పలికాడు : విషయం నీవు పలికినట్లుగానే నీ భార్య జన్మనివ్వలేదు. మరియు నీవు వృద్ధాప్యపు చివరి దశకు చేరుకున్నావు. మరియు ఎముకలు బలహీనమైపోయాయి. కానీ నీ ప్రభువు ఇలా పలుకుతున్నాడు : గొడ్రాలైన ఒక తల్లి మరియు వృద్ధాప్యపు చివరి దశకు చేరుకున్న ఒక తండ్రి నుండి నీ ప్రభువు యహ్యాను సృష్టించటం సులభము. ఓ జకరియ్యా వాస్తవానికి నేను నిన్ను ఇంతకు ముందు నీవు ప్రస్తావించబడ్డ వస్తువుగా లేనప్పుడే సృష్టించాను. ఎందుకంటే (అప్ఫుడు) నీవు ఉనికిలో లేవు.
Tafsiran larabci:
قَالَ رَبِّ اجْعَلْ لِّیْۤ اٰیَةً ؕ— قَالَ اٰیَتُكَ اَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلٰثَ لَیَالٍ سَوِیًّا ۟
జకరియ్యా అలైహిస్సలాం ఇలా పలికారు : ఓ నా ప్రభువా నీవు నాకు ఒక సూచనను ఇవ్వు . అది దైవ దూతలు శుభవార్త ఇచ్చినది సంభవించటమును సూచించాలి దాని ద్వారా నేను సంతృప్తి చెందుతాను. ఆయన ఇలా పలికాడు : నీవు శుభవార్తనివ్వబడినది సంభవించటానికి నీ సూచన ఏమిటంటే ఎటువంటి రోగము లేకుండా నీవు మూడు రాత్రులు (రోజులు) ప్రజలతో సంభాషించలేవు. అంతేకాదు నీవు స్వస్థతతో ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉంటావు.
Tafsiran larabci:
فَخَرَجَ عَلٰی قَوْمِهٖ مِنَ الْمِحْرَابِ فَاَوْحٰۤی اِلَیْهِمْ اَنْ سَبِّحُوْا بُكْرَةً وَّعَشِیًّا ۟
అప్పుడు జకరియ్యా తన ప్రార్ధన ప్రదేశము నుండి తన జాతి వారి వద్దకు వచ్చి వారితో మాట్లాడకుండా పరిశుద్ధుడైన అల్లాహ్ ను దినపు మొదటి వేళలో,దాని చివరి వేళలో పరిశుద్ధతను కొనియాడమని సైగతో చెప్పేవారు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الضعف والعجز من أحب وسائل التوسل إلى الله؛ لأنه يدل على التَّبَرُّؤِ من الحول والقوة، وتعلق القلب بحول الله وقوته.
బలహీనత,నిస్సహాయత అల్లాహ్ ని వేడుకోవటానికి అత్యంత ప్రియమైన కారకాల్లోంచివి. ఎందుకంటే అది బలము నుండి,శక్తి నుండి సంబంధమును త్రెంచుకుని మనస్సు యొక్క సంబంధము అల్లాహ్ శక్తి,సామర్ధ్యంతో కలపటముపై సూచిస్తుంది.

• يستحب للمرء أن يذكر في دعائه نعم الله تعالى عليه، وما يليق بالخضوع.
మనిషి తన దుఆలో మహోన్నతుడైన అల్లాహ్ యొక్క అనుగ్రహాలు తనపై ఏవైతే ఉన్నాయో వాటిని, వినమ్రతకు తగినవైన వాటిని ప్రస్తావించటం మంచిది.

• الحرص على مصلحة الدين وتقديمها على بقية المصالح.
ధర్మ ప్రయోజనము పై ఆశను చూపి దాన్ని మిగిలిన ఇతర ప్రయోజనాలకన్న ముందు పెట్టటం.

• تستحب الأسماء ذات المعاني الطيبة.
మంచి అర్ధములు కల పేర్లు పెట్టటం మంచిది.

یٰیَحْیٰی خُذِ الْكِتٰبَ بِقُوَّةٍ ؕ— وَاٰتَیْنٰهُ الْحُكْمَ صَبِیًّا ۟ۙ
అయితే ఆయనకు యహ్యా జన్మించారు. ఆయన సంబోధించే వయస్సుకు చేరుకున్నప్పుడు మేము ఆయనతో ఇలా పలికాము : ఓ యహ్యా మీరు తౌరాతును గంభీరతతో,కృషితో పట్టుకోండి. మరియు మేము ఆయనకు అవగాహనను,జ్ఞానమును,గంభీరతను,దృఢ సంకల్పమును ఆయన బాల్య వయస్సులోనే ప్రసాధించాము.
Tafsiran larabci:
وَّحَنَانًا مِّنْ لَّدُنَّا وَزَكٰوةً ؕ— وَكَانَ تَقِیًّا ۟ۙ
మరియు మేము మా వద్ద నుండి అతనిపై కారుణ్యాన్ని ప్రసాధించి అతన్ని పాపములనుండి పరిశుద్ధపరచాము. మరియు అతడు అల్లాహ్ ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి దైవభీతి గలవాడయ్యాడు.
Tafsiran larabci:
وَّبَرًّا بِوَالِدَیْهِ وَلَمْ یَكُنْ جَبَّارًا عَصِیًّا ۟
మరియు అతడు తన తల్లిదండ్రుల పట్ల కర్తవ్యపాలకుడిగా,వారిద్దరిపై దయ కలవాడిగా,వారి పట్ల మంచిగా మెలిగేవాడిగా అయ్యాడు. అతడు తన ప్రభువుపై విధేయత చూపటం నుండి,వారిద్దరిపై విధేయత చూపటం నుండి అహంకారమును చూపలేదు,తన ప్రభువు పట్ల లేదా తన తల్లిదండ్రులపట్ల అవిధేయుడు కాలేదు.
Tafsiran larabci:
وَسَلٰمٌ عَلَیْهِ یَوْمَ وُلِدَ وَیَوْمَ یَمُوْتُ وَیَوْمَ یُبْعَثُ حَیًّا ۟۠
మరియు అతనిపై అతను జన్మించిన రోజు,అతను మరణించి ఈ జీవితము నుండి వైదొలిగే రోజు,ప్రళయ దినాన జీవింపజేయబడి మరల లేపబడే రోజు అల్లాహ్ తరపు నుండి శాంతి,ఆయన వద్ద నుండి భద్రత కలుగుగాక. ఈ మూడు ప్రదేశాలు మానవునిపై గడిచే అత్యంత భయంకరమైనవి. అతడు వాటిలో భద్రంగా ఉన్నప్పుడు వేరే వాటిలో అతనిపై భయం లేదు.
Tafsiran larabci:
وَاذْكُرْ فِی الْكِتٰبِ مَرْیَمَ ۘ— اِذِ انْتَبَذَتْ مِنْ اَهْلِهَا مَكَانًا شَرْقِیًّا ۟ۙ
ఓ ప్రవక్తా మీపై అవతరింపబడిన ఖుర్ఆన్ లో మర్యమ్ అలైహస్సలాం తన ఇంటివారి నుండి వేరై వారికి తూర్పు దిశలో ఒక ప్రదేశంలో ఏకాంతంలో వెళ్ళిపోయినప్పటి వార్తను గుర్తు చేసుకోండి.
Tafsiran larabci:
فَاتَّخَذَتْ مِنْ دُوْنِهِمْ حِجَابًا ۫— فَاَرْسَلْنَاۤ اِلَیْهَا رُوْحَنَا فَتَمَثَّلَ لَهَا بَشَرًا سَوِیًّا ۟
అప్పుడు ఆమె తన ప్రభువు కొరకు చేసుకునే తన ఆరాధనను తన జాతి వారు చూడకుండా ఉండటానికి ఒక అడ్డు తెరను తన స్వయం కొరకు ఏర్పాటు చేసుకుంది. అప్పుడు మేము ఆమె వద్దకు జిబ్రయీల్ అలైహిస్సలాంను పంపించాము. అప్పుడు ఆయన పుట్టుకలో సంపూర్ణ మానవుని రూపములో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆమె ఆయన ఆమె పట్ల దురుద్దేశమును కలిగి ఉన్నాడేమోనని భయపడింది.
Tafsiran larabci:
قَالَتْ اِنِّیْۤ اَعُوْذُ بِالرَّحْمٰنِ مِنْكَ اِنْ كُنْتَ تَقِیًّا ۟
ఎప్పుడైతే ఆమె అతనిని సంపూర్ణ మానవుని రూపములో తనవైపునకు రావటమును చూసినదో ఇలా పలికింది : నిశ్చయంగా నేను నీ నుండి చెడు పొందటం నుండి అనంత కరుణామయుడి శరణును కోరుకుంటున్నాను. ఓహ్ ఇది ఒక వేళ నీవు దైవభీతి కలవాడివయితే అల్లాహ్ తో భయపడు.
Tafsiran larabci:
قَالَ اِنَّمَاۤ اَنَا رَسُوْلُ رَبِّكِ ۖۗ— لِاَهَبَ لَكِ غُلٰمًا زَكِیًّا ۟
జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు : నేను మనిషిని కాను.నేను మాత్రం నీ ప్రభువు తరపు నుండి పంపించబడ్డ దూతను,ఆయన నేను నీకు పరిశుద్ధుడైన,సుశీలుడైన ఒక కుమారునిని ప్రసాధించటానికి నన్ను నీ వద్దకు పంపించాడు.
Tafsiran larabci:
قَالَتْ اَنّٰی یَكُوْنُ لِیْ غُلٰمٌ وَّلَمْ یَمْسَسْنِیْ بَشَرٌ وَّلَمْ اَكُ بَغِیًّا ۟
మర్యమ్ అలైహస్సలాం ఆశ్చర్యపోయి ఇలా అడిగారు : నాకు ఎలా కుమారుడు కలుగుతాడు. వాస్తవానికి నా వద్దకు ఏ భర్త గానీ వేరే వారు గానీ రాలేదు. అలాగే నాకు కుమారుడు కలగటానికి నేను వ్యభిచారిణిని కాను ?!.
Tafsiran larabci:
قَالَ كَذٰلِكِ ۚ— قَالَ رَبُّكِ هُوَ عَلَیَّ هَیِّنٌ ۚ— وَلِنَجْعَلَهٗۤ اٰیَةً لِّلنَّاسِ وَرَحْمَةً مِّنَّا ۚ— وَكَانَ اَمْرًا مَّقْضِیًّا ۟
జిబ్రయీలు ఆమెతో ఇలా పలికారు : నిన్ను ఏ భర్తా గాని వేరెవరూ గాని తాకలేదని,నీవు వ్యభిచారిణీ కాదని విషయము నీవు ప్రస్తావించినట్లే. కానీ పరిశుద్ధుడైన నీ ప్రభువు ఇలా పలికాడు : ఏ తండ్రి లేకుండా పిల్లవాడిని సృష్టించటం నాకు సులభము. మరియు నీకు ప్రసాధించబడిన పిల్లవాడు అల్లాహ్ సామర్ధ్యము పై ప్రజల కొరకు ఒక సూచన మరియు నీ కొరకు ఆయన పై విశ్వాసమును కనబరచిన వారి కొరకు మా వద్ద నుండి ఒక కారుణ్యం కావటానికి. మరియు ఈ నీ కుమారుని పుట్టుక అల్లాహ్ వద్ద నుండి తీర్పు నిర్ణయించబడి ఉంది,లౌహె మహ్ఫూజ్ లో వ్రాయబడి ఉంది.
Tafsiran larabci:
فَحَمَلَتْهُ فَانْتَبَذَتْ بِهٖ مَكَانًا قَصِیًّا ۟
అప్పుడు దూత ఊదిన తరువాత ఆమె అతనిని (బాలుడి) గర్భంలో భరించింది. ఆ తరువాత అతనితో (గర్భంతో) ప్రజల నుండి దూర ప్రాంతమునకు వేరై వెళ్ళిపోయింది.
Tafsiran larabci:
فَاَجَآءَهَا الْمَخَاضُ اِلٰی جِذْعِ النَّخْلَةِ ۚ— قَالَتْ یٰلَیْتَنِیْ مِتُّ قَبْلَ هٰذَا وَكُنْتُ نَسْیًا مَّنْسِیًّا ۟
అయితే ఆమెకు పురిటినొప్పులు కలిగాయి. అవి ఆమెను ఒక ఖర్జూరపు చెట్టు మొదలు వద్దకు చేర్చాయి. మర్యమ్ అలైహస్సలాం ఇలా పలికారు : అయ్యో నేను ఈ రోజు కన్న ముందే చనిపోతే బాగుండేది. మరియు నా గురించి చెడుగా భావించకుండా ఉండటానికి నేను చర్చించదగని వస్తువైపోవల్సింది.
Tafsiran larabci:
فَنَادٰىهَا مِنْ تَحْتِهَاۤ اَلَّا تَحْزَنِیْ قَدْ جَعَلَ رَبُّكِ تَحْتَكِ سَرِیًّا ۟
అప్పుడు ఆమె పాదముల క్రింది నుండి ఈసా ఆమెను పిలిచి ఇలా పలికారు : మీరు దుఃఖించకండి. నిశ్చయంగా మీ ప్రభువు మీ క్రింద ఒక సెలయేరును తయారు చేశాడు. మీరు దాని నుండి త్రాగుతారు.
Tafsiran larabci:
وَهُزِّیْۤ اِلَیْكِ بِجِذْعِ النَّخْلَةِ تُسٰقِطْ عَلَیْكِ رُطَبًا جَنِیًّا ۟ؗ
మరియు నీవు ఖర్జూరపు చెట్టు మొదలు పట్టుకుని దాన్ని ఊపు నీపై ఆ ఘడియలోనే కోయబడిన తాజా పండిన ఖర్జూరములు రాలుతాయి.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الصبر على القيام بالتكاليف الشرعية مطلوب.
ధర్మబధ్ధమైన బాధ్యతలను నెరవేర్చటంపై సహనం అవసరం.

• علو منزلة بر الوالدين ومكانتها عند الله، فالله قرنه بشكره.
తల్లిదండ్రులపట్ల మంచిగా మెలగటము యొక్క ఉన్నత స్థితి,దాని స్థానము అల్లాహ్ వద్ద ఉన్నది. అప్పుడే ఆయన దాన్ని తనకు కృతజ్ఞత తెలుపుకోవటంతో జత చేశాడు.

• مع كمال قدرة الله في آياته الباهرة التي أظهرها لمريم، إلا أنه جعلها تعمل بالأسباب ليصلها ثمرة النخلة.
మర్యమ్ కొరకు ఆయన బహిరంగపరచిన తన అద్భుత సూచనల్లో అల్లాహ్ యొక్క సామర్ధ్యం పరిపూర్ణమవటంతోపాటు ఆయన ఆమెకు ఖర్జూరపు పండ్లు చేరటం కొరకు ఆమెను కారకాలను ఏర్పాటు చేసుకునే విధంగా చేశాడు.

فَكُلِیْ وَاشْرَبِیْ وَقَرِّیْ عَیْنًا ۚ— فَاِمَّا تَرَیِنَّ مِنَ الْبَشَرِ اَحَدًا ۙ— فَقُوْلِیْۤ اِنِّیْ نَذَرْتُ لِلرَّحْمٰنِ صَوْمًا فَلَنْ اُكَلِّمَ الْیَوْمَ اِنْسِیًّا ۟ۚ
అయితే నీవు పండిన ఖర్జూర పండ్లు తిని,నీటిని త్రాగు. నీకు కలిగిన సంతానము పట్ల మనస్సు కుదుటపరుచుకో,దుఃఖించకు. ప్రజల్లోంచి ఎవరినైన పుట్టిన పిల్లవాడి సమాచారము గురించి ప్రశ్నిస్తుండగా నీవు గమనిస్తే అతనితో ఇలా పలుకు : నిశ్చయంగా నేను ఈ రోజు నా ప్రభువు కొరకు నాపై మౌనాన్ని అనివార్యము చేసుకున్నాను. కావున నేను ఈ రోజు ప్రజల్లోంచి ఎవరితో మాట్లాడను.
Tafsiran larabci:
فَاَتَتْ بِهٖ قَوْمَهَا تَحْمِلُهٗ ؕ— قَالُوْا یٰمَرْیَمُ لَقَدْ جِئْتِ شَیْـًٔا فَرِیًّا ۟
అప్పుడు మర్యమ్ తన కుమారుడిని ఎత్తుకుని తన జాతి వారి వద్దకు తీసుకుని వచ్చింది. అప్పుడు ఆమె జాతి వారు ఆమెతో అసహ్యించుకుంటూ ఇలా పలికారు : ఓ మర్యమ్ నీవు తండ్రి లేకుండా ఒక పిల్లవాడిని తీసుకుని వచ్చి ఒక పెద్ద నింద్యమైన కార్యమును చేశావు.
Tafsiran larabci:
یٰۤاُخْتَ هٰرُوْنَ مَا كَانَ اَبُوْكِ امْرَاَ سَوْءٍ وَّمَا كَانَتْ اُمُّكِ بَغِیًّا ۟ۖۚ
ఓ ఆరాధనలో హారూన్ ను పోలిన దానా (ఆయన పుణ్యాత్ముడు) నీ తండ్రీ వ్యభిచారి కాదు. నీ తల్లీ వ్యభిచారిణి కాదు. నీవు పుణ్యములో ప్రసిద్ధి చెందిన పరిశుధ్ధ ఇంటి నుంచి వచ్చావు. అటువంటప్పుడు నీవు ఎలా ఏ తండ్రి లేకుండా ఒక పిల్లవాడిని తీసుకుని వచ్చావు ?!.
Tafsiran larabci:
فَاَشَارَتْ اِلَیْهِ ۫ؕ— قَالُوْا كَیْفَ نُكَلِّمُ مَنْ كَانَ فِی الْمَهْدِ صَبِیًّا ۟
అప్పుడు ఆమె ఒడిలో ఉన్న తన కుమారుడగు ఈసా అలైహిస్సలాం వైపునకు సైగ చేసింది. అప్పుడు ఆమె జాతి వారు ఆమెతో ఆశ్చర్యపోతూ ఇలా పలికారు : మేము ఒడిలో ఉన్న ఒక పిల్లవాడితో ఎలా మాట్లాడగలం ?!.
Tafsiran larabci:
قَالَ اِنِّیْ عَبْدُ اللّٰهِ ۫ؕ— اٰتٰىنِیَ الْكِتٰبَ وَجَعَلَنِیْ نَبِیًّا ۟ۙ
అప్పుడు ఈసా అలైహిస్సలాం ఇలా పలికారు : నేను అల్లాహ్ దాసుడను,ఆయన నాకు ఇంజీలును ఇచ్చి నన్ను తన ప్రవక్తల్లోంచి ఒక ప్రవక్తగా చేశాడు.
Tafsiran larabci:
وَّجَعَلَنِیْ مُبٰرَكًا اَیْنَ مَا كُنْتُ ۪— وَاَوْصٰنِیْ بِالصَّلٰوةِ وَالزَّكٰوةِ مَا دُمْتُ حَیًّا ۟ۙ
మరియు ఆయన నన్ను నేను ఎక్కడ ఉన్నా దాసుల కొరకు అధిక ప్రయోజకునిగా చేశాడు. మరియు నన్ను నా జీవితాంతం నమాజు పాటించటం గురించి, జకాత్ చెల్లించటం గురించి ఆదేశించాడు.
Tafsiran larabci:
وَّبَرًّا بِوَالِدَتِیْ ؗ— وَلَمْ یَجْعَلْنِیْ جَبَّارًا شَقِیًّا ۟
మరియు నన్ను నా తల్లి పట్ల కర్తవ్యపాలకుడిగా చేశాడు,మరియు ఆయన నన్ను నా ప్రభువు పై విధేయత చూపటం నుండి గర్విష్టిగా చేయలేదు,ఆయనకు అవిధేయుడిని చేయలేదు.
Tafsiran larabci:
وَالسَّلٰمُ عَلَیَّ یَوْمَ وُلِدْتُّ وَیَوْمَ اَمُوْتُ وَیَوْمَ اُبْعَثُ حَیًّا ۟
షైతాను నుండి,అతని సహాయకుల నుండి నాపై నేను పుట్టిన రోజు,నేను మరణించిన రోజు,ప్రళయదినాన నేను జీవింపజేసి మరల లేపబడే రోజు రక్షణ కలుగుగాక. ఈ మూడు నిర్జన (భయానక) పరిస్థితుల్లో షైతాను అతన్ని కలవరపెట్టలేదు.
Tafsiran larabci:
ذٰلِكَ عِیْسَی ابْنُ مَرْیَمَ ۚ— قَوْلَ الْحَقِّ الَّذِیْ فِیْهِ یَمْتَرُوْنَ ۟
ఈ లక్షణాలతో వర్ణించబడిన వారే మర్యమ్ కుమారుడగు ఈసా. మరియు ఈ మాటే అతని విషయంలో సత్యమైన మాట. సందేహమును చూపే,విబేధించుకునే మార్గ భ్రష్టులు అతని విషయంలో పలికిన మాటలు కాదు.
Tafsiran larabci:
مَا كَانَ لِلّٰهِ اَنْ یَّتَّخِذَ مِنْ وَّلَدٍ ۙ— سُبْحٰنَهٗ ؕ— اِذَا قَضٰۤی اَمْرًا فَاِنَّمَا یَقُوْلُ لَهٗ كُنْ فَیَكُوْنُ ۟ؕ
ఎవరినైన కుమారునిగా చేసుకోవటం అల్లాహ్ కి తగదు. వీటి నుండి అతడు పరిశుద్ధుడు,అతీతుడు. ఏదైన కార్యం చేయదలచుకున్నప్పుడు పరిశుద్ధుడైన ఆయన ఆ పనికి కున్ (నీవు అయిపో) అని పలకితే చాలు అది ఖచ్చితంగా అయి తీరుతుంది. ఎవరైతే ఇలాంటివాడై ఉంటాడో అతడు సంతానమును కలిగి ఉండటం నుండి అతీతుడు.
Tafsiran larabci:
وَاِنَّ اللّٰهَ رَبِّیْ وَرَبُّكُمْ فَاعْبُدُوْهُ ؕ— هٰذَا صِرَاطٌ مُّسْتَقِیْمٌ ۟
మరియు నిశ్చయంగా పరిశుద్ధుడైన అల్లాహ్ అతడు నాకూ ప్రభువు,మీ అందరికీ ప్రభువు. అయితే మీరు ఆయన ఒక్కడి కొరకే ఆరాధనను ప్రత్యేకించుకోండి. ఇది ఏదైతే నేను మీ కొరకు ప్రస్తావించానో అది అల్లాహ్ మన్నతలకు చేర్చే సన్మార్గము.
Tafsiran larabci:
فَاخْتَلَفَ الْاَحْزَابُ مِنْ بَیْنِهِمْ ۚ— فَوَیْلٌ لِّلَّذِیْنَ كَفَرُوْا مِنْ مَّشْهَدِ یَوْمٍ عَظِیْمٍ ۟
అప్పుడు ఈసా అలైహిస్సలాం విషయంలో విభేధించుకునేవారు విభేధించుకున్నారు. అప్పుడు వారు అతని జాతి వారి మధ్య నుండి వేరు వేరు వర్గాలుగా అయిపోయారు. వారిలో నుండి కొందరు ఆయనపై విశ్వాసమును కనబరిచి ఆయన ప్రవక్త అని పలికారు. మరి కొందరు యూదులులాంటివారు,ఆయన విషయంలో అతిక్రమించినటువంటి వర్గాల వారు ఆయనను తిరస్కరించారు. వారిలోని కొందరు అతడు అల్లాహ్ అన్నారు,మరికొందరు ఆయన అల్లాహ్ కుమారుడు అన్నారు. వీటి నుండి అల్లాహ్ మహోన్నతుడు. ఆయన విషయంలో విభేధించుకునే వారి కొరకు గొప్ప ప్రళయ దినము హాజరు అవటం నుండి అందులో ఉన్న దృశ్యాలు,లెక్క తీసుకోవటం,శిక్ష ద్వారా వినాశనము కలదు.
Tafsiran larabci:
اَسْمِعْ بِهِمْ وَاَبْصِرْ ۙ— یَوْمَ یَاْتُوْنَنَا لٰكِنِ الظّٰلِمُوْنَ الْیَوْمَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟
ఆ రోజు వారు ఎంత బాగా వినేవారై ఉంటారు,ఎంత బాగా చూసేవారై ఉంటారు. వారు విన్నారు అప్పుడు వినికిడి వారికి ప్రయోజనం కలిగించలేదు. మరియు వారు చూశారు అప్పుడు వారి చూపు వారికి ప్రయోజనం చేకూర్చలేదు. కానీ దుర్మార్గులు ఇహలోక జీవితములో సన్మార్గము నుండి స్పష్టమైన మార్గభ్రష్టతలో ఉన్నారు. వారు తమ దుర్మార్గంలో ఉన్న స్థితిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా పరలోకము వారి వద్దకు వచ్చెంతవరకు పరలోకము కొరకు సిద్ధం కాలేదు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• في أمر مريم بالسكوت عن الكلام دليل على فضيلة الصمت في بعض المواطن .
మాట్లాడకుండా మౌనంగా ఉండటం గురించి మర్యముకి ఇవ్వబడిన ఆదేశములో కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం యొక్క ప్రాముఖ్యత పై ఆధారం ఉన్నది.

• نذر الصمت كان جائزًا في شرع من قبلنا، أما في شرعنا فقد دلت السنة على منعه.
మనకు పూర్వ షరీఅత్ లో మౌనవ్రతం అనుమతించబడింది. ఇక మన షరీఅత్ లో అది నిషేధించబడినదని సున్నత్ సూచిస్తుంది.

• أن ما أخبر به القرآن عن كيفية خلق عيسى هو الحق القاطع الذي لا شك فيه، وكل ما عداه من تقولات باطل لا يليق بالرسل.
ఈసా పుట్టుక ఎలా జరిగిందో దాని గురించి ఖుర్ఆన్ తెలియపరచినది ఎటవంటి సందేహం లేని ఖచ్చితమైన సత్యము అది. అవి కాకుండా వేరే మాటలు అసత్యాలు,అవి ప్రవక్తలకు సరి కాదు.

• في الدنيا يكون الكافر أصم وأعمى عن الحق، ولكنه سيبصر ويسمع في الآخرة إذا رأى العذاب، ولن ينفعه ذلك.
ఇహలోకములో అవిశ్వాసపరుడు సత్యము నుండి చెవిటి వాడిగా,అందుడిగా ఉంటాడు. కాని అతడు పరలోకములో శిక్షను చూసునప్పుడు చూస్తాడు,వింటాడు .అది అతనికి ప్రయోజనం చేకూర్చదు.

وَاَنْذِرْهُمْ یَوْمَ الْحَسْرَةِ اِذْ قُضِیَ الْاَمْرُ ۘ— وَهُمْ فِیْ غَفْلَةٍ وَّهُمْ لَا یُؤْمِنُوْنَ ۟
ఓ ప్రవక్తా పాపాత్ముడు తాను చేసిన పాపముపై ,పుణ్యాత్ముడు విధేయ కార్యము అధికంగా చేయకపోవటంపై పశ్చాత్తాప్పడే వేళ అయిన పశ్చాత్తాప్పడే దినము నుండి ప్రజలను హెచ్చరించండి. అప్పుడు దాసుల కర్మపుస్తకాలు చుట్టి వేయబడి వారి లెక్క తీసుకోవటం పూర్తవుతుంది. ప్రతి ఒక్కడు తాను ముందుకు పంపించినది అయిపోయింది. మరియు వారు తమ ప్రాపంచిక జీవితంలో ఉండి దాని ద్వారా ఆకర్షితులయ్యారు.పరలోక జీవితం నుండి పరధ్యానంలో ఉన్నారు. మరియు వారు ప్రళయదినమును విశ్వసించలేదు.
Tafsiran larabci:
اِنَّا نَحْنُ نَرِثُ الْاَرْضَ وَمَنْ عَلَیْهَا وَاِلَیْنَا یُرْجَعُوْنَ ۟۠
నిశ్చయంగా సృష్టితాలన్ని అంతమైపోయిన తరువాత మేమే భూమికి వారసులుగా ఉండిపోయేవారము,వారి అంతమైపోవటం వలన,వారి తరువాత మేము ఉండిపోవటం వలన దానిపై ఉన్న వాటన్నింటికి మేము వారసులమవుతాము. మరియు మేము వారిపై అధికారము కలవారమవుతాము,మేము కోరుకున్న విధంగా వారి మధ్య వ్యవహరిస్తాము. ప్రళయదినాన మా ఒక్కరి వైపే లెక్కతీసుకొనబడటానికి,ప్రతిఫలం ఇవ్వబడటానికి వారు మరలించబడుతారు.
Tafsiran larabci:
وَاذْكُرْ فِی الْكِتٰبِ اِبْرٰهِیْمَ ؕ۬— اِنَّهٗ كَانَ صِدِّیْقًا نَّبِیًّا ۟
ఓ ప్రవక్తా మీపై అవతరింపబడిన ఖుర్ఆన్ లో ఇబ్రాహీమ్ అలైహిస్సలాం వృత్తాంతమును మీరు గుర్తు చేసుకోండి.నిశ్చయంగా ఆయన అత్యంత నిజాయితీ పరుడు,అల్లాహ్ ఆయతులను దృవీకరించేవాడు,అల్లాహ్ వద్ద నుండి పంపించబడ్డ ఒక ప్రవక్త.
Tafsiran larabci:
اِذْ قَالَ لِاَبِیْهِ یٰۤاَبَتِ لِمَ تَعْبُدُ مَا لَا یَسْمَعُ وَلَا یُبْصِرُ وَلَا یُغْنِیْ عَنْكَ شَیْـًٔا ۟
ఆయన తన తండ్రి ఆజర్ తో ఇలా పలికినప్పుడు : ఓ నా తండ్రి మీరు అల్లాహ్ ను వదిలి విగ్రహమును ఒక వేళ మీరు దాన్ని మొరపెట్టుకుంటే అది మీ దుఆను వినలేదు,ఒక వేళ మీరు దాన్ని ఆరాధిస్తే అది మీ ఆరాధనను చూడలేదు,మీ నుండి ఎటువండి కీడును తొలగించలేదు,మీ కొరకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు అటువంటి దాన్ని మీరు ఎలా ఆరాధిస్తున్నారు ?!.
Tafsiran larabci:
یٰۤاَبَتِ اِنِّیْ قَدْ جَآءَنِیْ مِنَ الْعِلْمِ مَا لَمْ یَاْتِكَ فَاتَّبِعْنِیْۤ اَهْدِكَ صِرَاطًا سَوِیًّا ۟
ఓ నా తండ్రి నీ వద్దకు రాని జ్ఞానము నా వద్దకు దైవ వాణి ద్వారా వచ్చినది. కావున నీవు నన్ను అనుసరించు. నేను నీకు సన్మార్గమును చూపుతాను.
Tafsiran larabci:
یٰۤاَبَتِ لَا تَعْبُدِ الشَّیْطٰنَ ؕ— اِنَّ الشَّیْطٰنَ كَانَ لِلرَّحْمٰنِ عَصِیًّا ۟
ఓ నా తండ్రి మీరు షైతానును నీ విధేయత ద్వారా అతన్ని ఆరాధించకు.నిశ్చయంగా షైతాను రహ్మాను కొరకు అవిధేయపరుడు ఎప్పుడైతే ఆయన ఆదంనకు సాష్టాంగపడమని ఆదేశించాడో అప్పుడు సాష్టాంగపడలేదు.
Tafsiran larabci:
یٰۤاَبَتِ اِنِّیْۤ اَخَافُ اَنْ یَّمَسَّكَ عَذَابٌ مِّنَ الرَّحْمٰنِ فَتَكُوْنَ لِلشَّیْطٰنِ وَلِیًّا ۟
ఓ నా తండ్రి ఒక వేళ మీరు మీ అవిశ్వాస స్థితిలోనే మరణిస్తే మీకు కరుణామయుడి వద్ద నుండి శిక్ష చుట్టుకుంటుందని నేను భయపడుతున్నాను. అప్పుడు మీరు షైతానుకు విధేయత చూపటం వలన శిక్షలో అతనికి మీరు తోడుగా ఉంటారు.
Tafsiran larabci:
قَالَ اَرَاغِبٌ اَنْتَ عَنْ اٰلِهَتِیْ یٰۤاِبْرٰهِیْمُ ۚ— لَىِٕنْ لَّمْ تَنْتَهِ لَاَرْجُمَنَّكَ وَاهْجُرْنِیْ مَلِیًّا ۟
ఆజరు తన కుమారుడగు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తో ఓ ఇబ్రాహీమ్ నీవు నేను ఆరాధించే విగ్రహాలపట్ల విముఖత చూపుతున్నావా ?!. ఒక వేళ నీవు నా విగ్రహాలను దూషించటమును మానకపోతే నేను నిన్ను తప్పకుండా రాళ్ళతో కొడతాను. నీవు చాలా కాలం వరకు నా నుండి వేరైపో. నీవు నాతో మాట్లాడకు,నాతో పాటు సమావేశమవకు అని పలికాడు.
Tafsiran larabci:
قَالَ سَلٰمٌ عَلَیْكَ ۚ— سَاَسْتَغْفِرُ لَكَ رَبِّیْ ؕ— اِنَّهٗ كَانَ بِیْ حَفِیًّا ۟
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తన తండ్రితో ఇలా పలికారు : నా తరపు నుండి మీపై సలాం. మీరు నా నుండి ధ్వేషించేది మీకు కలగదు. తొందరలోనే నేను మీ కొరకు నా ప్రభువుతో మన్నింపును,సన్మార్గమును కోరుతాను. నిశ్చయంగా ఆయన నాపై అధికంగా దయకలవాడు.
Tafsiran larabci:
وَاَعْتَزِلُكُمْ وَمَا تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ وَاَدْعُوْا رَبِّیْ ۖؗ— عَسٰۤی اَلَّاۤ اَكُوْنَ بِدُعَآءِ رَبِّیْ شَقِیًّا ۟
మరియు నేను మీ నుండి వేరైపోతాను. మరియు మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న మీ ఆరాధ్య దైవాల నుండి వేరైపోతాను. మరియు నేను ఒక్కడైన నా ప్రభువుని వేడుకుంటాను,ఆయనతోపాటు దేనినీ సాటి కల్పించను. బహుశా నేను అతడిని వేడుకున్నప్పుడు అతడు నన్ను ఆపడు. ఒక వేళ ఆపితే నేను అతడిని వేడుకోవటం ద్వారా దౌర్భాగ్యుడినైపోతాను.
Tafsiran larabci:
فَلَمَّا اعْتَزَلَهُمْ وَمَا یَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ ۙ— وَهَبْنَا لَهٗۤ اِسْحٰقَ وَیَعْقُوْبَ ؕ— وَكُلًّا جَعَلْنَا نَبِیًّا ۟
ఎప్పుడైతే ఆయన వారిని విడిచిపెట్టారో,అల్లాహ్ ను వదిలి వారు పూజించే విగ్రహాలను వదిలేశారో తన ఇంటి వారిని కోల్పోవటం మూలంగా ఆయనకు మేము పరిహారమిచ్చాము. అప్పుడు మేము ఆయనకు ఆయన కుమారుడగు ఇస్ హాఖ్ ను ప్రసాధించాము. మరియు మేము ఆయనకు ఆయన మనవడగు యాఖూబ్ ను ప్రసాధించాము. వారిద్దరిలో నుండి ప్రతి ఒక్కరిని మేము ప్రవక్తలుగా చేశాము.
Tafsiran larabci:
وَوَهَبْنَا لَهُمْ مِّنْ رَّحْمَتِنَا وَجَعَلْنَا لَهُمْ لِسَانَ صِدْقٍ عَلِیًّا ۟۠
మరియు మేము వారికి దైవ దౌత్యంతోపాటు మా కారుణ్యము నుండి చాలా మేలును ప్రసాధించాము. మరియు మేము వారి కొరకు దాసుల నాలుకలపై నిరంతరం మంచి కీర్తిని కలుగచేశాము.
Tafsiran larabci:
وَاذْكُرْ فِی الْكِتٰبِ مُوْسٰۤی ؗ— اِنَّهٗ كَانَ مُخْلَصًا وَّكَانَ رَسُوْلًا نَّبِیًّا ۟
మరియు ఓ ప్రవక్తా మీరు మీపై అవతరింపబడిన ఖుర్ఆన్ లో మూసా అలైహిస్సలాం వృత్తాంతమును గుర్తు చేసుకోండి. నిశ్చయంగా ఆయన ఎంచుకోబడినవాడు,ఎన్నుకోబడినవాడు. మరియు అతడు ఒక ప్రవక్త,సందేశహరుడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• لما كان اعتزال إبراهيم لقومه مشتركًا فيه مع سارة، ناسب أن يذكر هبتهما المشتركة وحفيدهما، ثم جاء ذكر إسماعيل مستقلًّا مع أن الله وهبه إياه قبل إسحاق.
ఇబ్రాహీం అలైహిస్సలాం తన జాతి వారి నుండి విడి పోయినప్పుడు సారా కూడా ఆ విషయంలో భాగస్వామి అయ్యారు,అటువంటప్పుడు వారిద్దరికి కలిపి అనుగ్రహించబడినది మరియు వారిద్దరి మనవడు గురించి ప్రస్తావించడం సముచితం అవుతుంది, తరువాత ఇస్మాయిల్ అలైహిస్సలాం ప్రస్తావన ప్రత్యేకంగా వచ్చినది దానికి తోడు అల్లాహ్ అతనికి ఇస్మాయిల్ అలైహిస్సలాంను ఇస్హాఖ్ కంటే ముందు అనుగ్రహించాడు.

• التأدب واللطف والرفق في محاورة الوالدين واختيار أفضل الأسماء في مناداتهما.
తల్లిదండ్రులతో సంభాషించటంలో మర్యాద,దయ,మృదుత్వముండటం మరియు వారిని పిలిచేటప్పుడు ఉత్తమమైన పేర్లను ఎంచుకోవటం.

• المعاصي تمنع العبد من رحمة الله، وتغلق عليه أبوابها، كما أن الطاعة أكبر الأسباب لنيل رحمته.
పాప కార్యాలు దాసుడిని అల్లాహ్ కారుణ్యం నుండి ఆపివేస్తాయి. అతనిపై దాని ద్వారములను మూసివేస్తాయి. ఎలాగైతే విధేయత ఆయన కారుణ్యమును పొందటానికి పెద్ద కారకమో అలా.

• وعد الله كل محسن أن ينشر له ثناءً صادقًا بحسب إحسانه، وإبراهيم عليه السلام وذريته من أئمة المحسنين.
అల్లాహ్ ప్రతి పుణ్యాత్మునికి అతని పుణ్యమును బట్టి అతని కొరకు సత్యపూరితమైన ప్రశంసను విస్తరింపజేస్తానని వాగ్ధానం చేశాడు. మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు అతని సంతానము పుణ్యాత్ములైన నాయకుల్లోంచి వారు.

وَنَادَیْنٰهُ مِنْ جَانِبِ الطُّوْرِ الْاَیْمَنِ وَقَرَّبْنٰهُ نَجِیًّا ۟
మరియు మూసా అలైహిస్సలాం ఉన్న స్థానమును బట్టి కొండయొక్క కుడి వైపు నుండి మేము ఆయనను పిలిచాము. మరియు మేము ఆయనను మట్లాడటానికి దగ్గర చేశాము. అక్కడే అల్లాహ్ ఆయనకు తన మాటను వినిపించాడు.
Tafsiran larabci:
وَوَهَبْنَا لَهٗ مِنْ رَّحْمَتِنَاۤ اَخَاهُ هٰرُوْنَ نَبِیًّا ۟
మరియు మేము ఆయనకు మా కారుణ్యము నుండి,ఆయనపై మా అనుగ్రహమును ఆయన సోదరుడు హారూన్ అలైహిస్సలాంను ప్రవక్తగా ఆయన తన ప్రభువును అడిగినప్పుడు ఆయన అర్ధనను స్వీకరిస్తూ ప్రసాధించాము.
Tafsiran larabci:
وَاذْكُرْ فِی الْكِتٰبِ اِسْمٰعِیْلَ ؗ— اِنَّهٗ كَانَ صَادِقَ الْوَعْدِ وَكَانَ رَسُوْلًا نَّبِیًّا ۟ۚ
మరియు ఓ ప్రవక్తా మీపై అవతరింపబడిన ఖుర్ఆన్ లో ఇస్మాయీల్ అలైహిస్సలాం వృత్తాంతమును గుర్తు చేసుకోండి. నిశ్చయంగా ఆయన వాగ్ధానపాలనలో సత్యవంతుడు. ఆయన ఏదైన వాగ్ధానం చేస్తే దాన్ని నెరవేరుస్తాడు. మరియు ఆయన సందేశహరుడు,ఒక ప్రవక్త.
Tafsiran larabci:
وَكَانَ یَاْمُرُ اَهْلَهٗ بِالصَّلٰوةِ وَالزَّكٰوةِ ۪— وَكَانَ عِنْدَ رَبِّهٖ مَرْضِیًّا ۟
మరియు ఆయన తన ఇంటివారిని నమాజును నెలకొల్పమని,జకాత్ ను చెల్లించమని ఆదేశించేవాడు. మరియు ఆయన తన ప్రభువు వద్ద ప్రీతి పాత్రుడుగా ఉండేవాడు.
Tafsiran larabci:
وَاذْكُرْ فِی الْكِتٰبِ اِدْرِیْسَ ؗ— اِنَّهٗ كَانَ صِدِّیْقًا نَّبِیًّا ۟ۗۙ
ఓ ప్రవక్తా మీపై అవతరింపబడిన ఖుర్ఆన్ లో ఇద్రీస్ అలైహిస్సలాం వృత్తాంతమును మీరు గుర్తు చేయండి. నిశ్చయంగా ఆయన అత్యంత నిజాయితీ పరుడు,అల్లాహ్ ఆయతులను దృవీకరించేవాడు,అల్లాహ్ ప్రవక్తల్లోంచి ఒక ప్రవక్త.
Tafsiran larabci:
وَّرَفَعْنٰهُ مَكَانًا عَلِیًّا ۟
మరియు మేము ఆయనకు ప్రసాధించిన దైవదౌత్యం ద్వారా ఆయన కీర్తిని ఉన్నతం చేశాము. అప్పుడు ఆయన ఉన్నత స్థానం కలవాడైపోయాడు.
Tafsiran larabci:
اُولٰٓىِٕكَ الَّذِیْنَ اَنْعَمَ اللّٰهُ عَلَیْهِمْ مِّنَ النَّبِیّٖنَ مِنْ ذُرِّیَّةِ اٰدَمَ ۗ— وَمِمَّنْ حَمَلْنَا مَعَ نُوْحٍ ؗ— وَّمِنْ ذُرِّیَّةِ اِبْرٰهِیْمَ وَاِسْرَآءِیْلَ ؗ— وَمِمَّنْ هَدَیْنَا وَاجْتَبَیْنَا ؕ— اِذَا تُتْلٰی عَلَیْهِمْ اٰیٰتُ الرَّحْمٰنِ خَرُّوْا سُجَّدًا وَّبُكِیًّا ۟
ఈ సూరాలో మొదట జకరియ్యా అలైహిస్సలాం నుండి అంతిమంగా ఇద్రీసు అలైహిమస్సలాం వరకు ప్రస్తావించబడిన వీరందరు వారే ఎవరికైతే అల్లాహ్ దైవదౌత్యమును ప్రసాధించాడో ఆదం అలైహిస్సలాం సంతానము నుండి,నూహ్ అలైహిస్సలాం తోపాటు నావలో మేము ఎత్తిన వారి సంతానము నుండి, ఇబ్రాహీం అలైహిస్సలాం సంతానము నుండి,యాఖూబ్ అలైహిస్సలాం సంతాము నుండి మరియు మేము ఇస్లాం వైపు మార్గమును అనుగ్రహించిన వారిలో నుండి వారు. మేము వారిని ఎన్నుకుని సందేశహరులను చేశాము. వారు అల్లాహ్ ఆయతులను పటించబడుతుండగా విన్నప్పుడు అల్లాహ్ కొరకు ఆయనతో భయము వలన ఏడుస్తూ సాష్టాంగపడుతారు.
Tafsiran larabci:
فَخَلَفَ مِنْ بَعْدِهِمْ خَلْفٌ اَضَاعُوا الصَّلٰوةَ وَاتَّبَعُوا الشَّهَوٰتِ فَسَوْفَ یَلْقَوْنَ غَیًّا ۟ۙ
అయితే ఎన్నుకోబడిన ఈ ప్రవక్తలందరి తరువాత చెడును,అపమార్గమును అనుసరించేవారు వచ్చారు. వారు నమాజులను వృధా చేశారు. వారు వాటిని కోరిన విధంగా పాటించలేదు. వారు తమ మనస్సులకు తోచిన విధంగా వ్యభిచారము లాంటి పాప కార్యములకు పాల్పడ్డారు. అయితే వారు తొందరలోనే నరకములో చెడును,పరాభవమును పొందుతారు.
Tafsiran larabci:
اِلَّا مَنْ تَابَ وَاٰمَنَ وَعَمِلَ صَالِحًا فَاُولٰٓىِٕكَ یَدْخُلُوْنَ الْجَنَّةَ وَلَا یُظْلَمُوْنَ شَیْـًٔا ۟ۙ
కానీ ఎవరైతే తమ లోపములనుండి,అతిక్రమించిన దాని నుండి పశ్చాత్తాప్పడి,అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి,సత్కార్యమును చేసిన వారు ఈ గుణాలతో వర్ణించబడిన వారందరు స్వర్గములో ప్రవేశిస్తారు. వారి కర్మల ప్రతిఫలము నుండి కొంచము కూడా తగ్గించబడదు ఒక వేళ అది తక్కువ అయిన సరే.
Tafsiran larabci:
جَنّٰتِ عَدْنِ ١لَّتِیْ وَعَدَ الرَّحْمٰنُ عِبَادَهٗ بِالْغَیْبِ ؕ— اِنَّهٗ كَانَ وَعْدُهٗ مَاْتِیًّا ۟
అగోచర జగత్తులోని శాస్వతమైన,స్థిరమైన ఆ స్వర్గవనాలు వేటి గురించైతే అనంత కరుణామయుడు తన పుణ్య దాసులకు వారు అందులో ప్రవేశిస్తారని వాగ్దానం చేశాడో. వాస్తవానికి వారు వాటిని చూడకుండానే వాటి పట్ల విశ్వాసమును కనబరిచారు. స్వర్గము గురించి అల్లాహ్ వాగ్ధానము ఒక వేళ అది అగోచరమైనదైన ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.
Tafsiran larabci:
لَا یَسْمَعُوْنَ فِیْهَا لَغْوًا اِلَّا سَلٰمًا ؕ— وَلَهُمْ رِزْقُهُمْ فِیْهَا بُكْرَةً وَّعَشِیًّا ۟
వారు వాటిలో (స్వర్గవనాలలో) ఎటువంటి వ్యర్ధపు మాటలుగాని,అశ్లీల మాట గాని వినరు. అంతేకాదు వారిలో కొందరు కొందరికి సలాం చేయటమును,దైవ దూతలు వారికి సలాం చేయటమును వింటారు. మరియు ప్రొద్దున,సాయంత్రం వాటిలో వారు కోరుకున్న ఆహారం వారి వద్దకు వస్తుంది.
Tafsiran larabci:
تِلْكَ الْجَنَّةُ الَّتِیْ نُوْرِثُ مِنْ عِبَادِنَا مَنْ كَانَ تَقِیًّا ۟
ఈ లక్షణాల ద్వారా వర్ణించబడిన ఈ స్వర్గముకు ఆదేశములను పాటించి,వారింపబడిన వాటికి దూరంగా ఉన్న మా దాసులని వారసులుగా చేస్తాము.
Tafsiran larabci:
وَمَا نَتَنَزَّلُ اِلَّا بِاَمْرِ رَبِّكَ ۚ— لَهٗ مَا بَیْنَ اَیْدِیْنَا وَمَا خَلْفَنَا وَمَا بَیْنَ ذٰلِكَ ۚ— وَمَا كَانَ رَبُّكَ نَسِیًّا ۟ۚ
ఓ జిబ్రయీల్ మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా పలకండి : నిశ్చయంగా దైవదూతలు స్వయంగా దిగిరారు. వారు అల్లాహ్ ఆదేశముతో మాత్రమే దిగివస్తారు. పరలోక విషయం నుండి మేము ఏదైతే పొందుతామో,ఇహలోక విషయం నుండి మేము ఏదైతే వెనుక వదిలి వేశామో మరియు ఇహపరాలకు మధ్య ఉన్నది అంతా అల్లాహ్ కే చెందుతుంది. ఓ ప్రవక్తా మీ ప్రభువు ఏదీ మరవడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• حاجة الداعية دومًا إلى أنصار يساعدونه في دعوته.
దాయీకు (ధర్మం వైపు పిలిచేవాడికి) ఎల్లప్పుడు తన దావత్ కార్యంలో తనకు సహాయంచేసే సహాయకుల అవసరం ఉన్నది.

• إثبات صفة الكلام لله تعالى.
‘అల్ కలాము (సంబాషణ)’అను గుణము మహోన్నతుడైన అల్లాహ్ కు శోభదాయకంగా నిరూపించబడుతుంది

• صدق الوعد محمود، وهو من خلق النبيين والمرسلين، وضده وهو الخُلْف مذموم.
వాగ్ధాన పాలనలో సత్యమును కలిగిఉండుట (సిద్ఖుల్ వఅది) ప్రశంశనీయం. అది సందేశహరుల,ప్రవక్తల గుణము. మరియు దాని వ్యతిరేకము (అల్ ఖుల్ఫ్) వాగ్ధానమును ఉల్లంఘించటం నిందార్హం.

• إن الملائكة رسل الله بالوحي لا تنزل على أحد من الأنبياء والرسل من البشر إلا بأمر الله.
నిశ్చయంగా దైవదూతలు దైవ వాణితో పంపించబడ్డ అల్లాహ్ దూతలు,వారు మానవులలో నుండి సందేశహరుల మరియు దైవ ప్రవక్తల వద్దకు దైవ ఆదేశంతో మాత్రమే వస్తారు.

رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا فَاعْبُدْهُ وَاصْطَبِرْ لِعِبَادَتِهٖ ؕ— هَلْ تَعْلَمُ لَهٗ سَمِیًّا ۟۠
ఆకాశములను సృష్టించినవాడు,భూమిని సృష్టించినవాడు,వాటి యజమాని,వాటి వ్యవహారాల పర్యాలోచన చేసేవాడు,వాటి మధ్య ఉన్న దానిని సృష్టించినవాడు, దాని యజమాని,దాని పర్యాలోచన చేసేవాడు ఆయనే. అయితే నీవు ఆయన ఒక్కడినే ఆరాధించు. ఆయనే ఆరాధనకు అర్హుడు. మరియు నీవు ఆయన్ని ఆరాధించటంలో నిలకడను చూపు. ఆయనకు పోలిన వాడు కాని సమానులు కాని అతనికి ఆరాధనలో భాగస్వామి అయ్యేవాడు లేడు.
Tafsiran larabci:
وَیَقُوْلُ الْاِنْسَانُ ءَاِذَا مَا مِتُّ لَسَوْفَ اُخْرَجُ حَیًّا ۟
మరియు మరణాంతరము లేపబడటమును తిరస్కరించే అవిశ్వాసపరుడు పరిహాసమాడుతూ ఇలా పలికే వాడు : ఏమీ నేను మరణించినప్పుడు నా సమాది నుండి రెండవసారి జీవింపజేసి వెలికి తీయబడుతానా ?!. నిశ్చయంగా ఇది చాలా దూరమైన విషయం.
Tafsiran larabci:
اَوَلَا یَذْكُرُ الْاِنْسَانُ اَنَّا خَلَقْنٰهُ مِنْ قَبْلُ وَلَمْ یَكُ شَیْـًٔا ۟
మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఇతనికి ఇంతకు ముందు అతడు ఏమీ లేనప్పుడు మేము అతన్ని సృష్టించిన విషయం గుర్తులేదా ?!అయితే మొదటి సారి సృష్టించటం రెండవసారి సృష్టించటమునకు ఆధారపూరితమవుతుంది. దానికి తోడు రెండవసారి సృష్టించటం ఎంతో సులభము,ఎంతో సులువు.
Tafsiran larabci:
فَوَرَبِّكَ لَنَحْشُرَنَّهُمْ وَالشَّیٰطِیْنَ ثُمَّ لَنُحْضِرَنَّهُمْ حَوْلَ جَهَنَّمَ جِثِیًّا ۟ۚ
ఓ ప్రవక్తా నీ ప్రభువు సాక్షిగా మేము తప్పకుండా వారిని వారి సమాదుల నుండి వెలికితీసి వారిని మార్గ భ్రష్టులు చేసిన వారి షైతానులను తోడుగా హషర్ లోకి తీసుకుని వస్తాము. ఆ తరువాత వారిని వారి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అవమానపరచి నరక ద్వారముల వద్దకు తీసుకువస్తాము.
Tafsiran larabci:
ثُمَّ لَنَنْزِعَنَّ مِنْ كُلِّ شِیْعَةٍ اَیُّهُمْ اَشَدُّ عَلَی الرَّحْمٰنِ عِتِیًّا ۟ۚ
ఆ తరువాత మేము అవిధేయతలో తీవ్రమైన మార్గభ్రష్టుల వర్గముల్లోంచి ప్రతీ వర్గమును కఠినంగా,తీవ్రంగా వేరుచేస్తాము. వారు వారి నాయకులై ఉండేవారు.
Tafsiran larabci:
ثُمَّ لَنَحْنُ اَعْلَمُ بِالَّذِیْنَ هُمْ اَوْلٰی بِهَا صِلِیًّا ۟
ఆ పిదప నరకాగ్నిలో ప్రవేశించడానికి మరియు దాని వేడిని,దాని బాధలను అనుభవించడానికి ఎవరు ఎక్కువ అర్హులో మాకు బాగా తెలుసు.
Tafsiran larabci:
وَاِنْ مِّنْكُمْ اِلَّا وَارِدُهَا ۚ— كَانَ عَلٰی رَبِّكَ حَتْمًا مَّقْضِیًّا ۟ۚ
ఓ ప్రవక్తా మీలో నుండి ఎవరూ కూడా నరకము నడిబొడ్డుపై వేయబడిన మార్గ వంతెన పైనుండి దాటకుండా ఉండడు.ఈ దాటటం అన్నది అల్లాహ్ నిర్ణయించిన దృఢమైన నిర్ణయం. అల్లాహ్ నిర్ణయాన్ని మార్చేవాడు ఎవడూ లేడు.
Tafsiran larabci:
ثُمَّ نُنَجِّی الَّذِیْنَ اتَّقَوْا وَّنَذَرُ الظّٰلِمِیْنَ فِیْهَا جِثِیًّا ۟
మార్గముపై ఈ దాటిన తరువాత మేము తమ ప్రభువుతో ఆయన ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడిన వారిని రక్షిస్తాము. మరియు దుర్మార్గులను వారి మోకాళ్ళ మీద కూర్చున్నట్లు వదిలివేస్తాము. దాని నుండి వారు పారిపోలేరు.
Tafsiran larabci:
وَاِذَا تُتْلٰی عَلَیْهِمْ اٰیٰتُنَا بَیِّنٰتٍ قَالَ الَّذِیْنَ كَفَرُوْا لِلَّذِیْنَ اٰمَنُوْۤا ۙ— اَیُّ الْفَرِیْقَیْنِ خَیْرٌ مَّقَامًا وَّاَحْسَنُ نَدِیًّا ۟
మా ప్రవక్తపై అవతరింపబడిన స్పష్టమైన మా ఆయతులను ప్రజలపై చదవబడినప్పుడు అవిశ్వాసపరులు విశ్వాసపరులతో ఇలా పలికారు : మా రెండు వర్గముల్లోంచి స్థితిని బట్టి,నివాసమును బట్టి ఎవరు ఉత్తములు మరియు సభను బట్టి,సమావేశమును బట్టి ఎవరు మంచి వారు, మా వర్గము వారా లేదా మీ వర్గము వారా ?!.
Tafsiran larabci:
وَكَمْ اَهْلَكْنَا قَبْلَهُمْ مِّنْ قَرْنٍ هُمْ اَحْسَنُ اَثَاثًا وَّرِﺋْﻴًﺎ ۟
తాము ఉన్న ఈ భౌతిక ఆధిక్యత వలన గర్వపడే ఈ అవిశ్వాసపరులందరికన్న మందు చాలా సమాజములను మేము నాశనం చేశాము. వారు సంపదలో వీరికన్న ఉన్నతమైనవారు,వారి దుస్తుల అమూల్యత వలన,వారి శరీరములకు ప్రసాధించబడ్డ అనుగ్రహముల వలన చూడటానికి వారి కన్న ఉన్నతమైన వారు.
Tafsiran larabci:
قُلْ مَنْ كَانَ فِی الضَّلٰلَةِ فَلْیَمْدُدْ لَهُ الرَّحْمٰنُ مَدًّا ۚ۬— حَتّٰۤی اِذَا رَاَوْا مَا یُوْعَدُوْنَ اِمَّا الْعَذَابَ وَاِمَّا السَّاعَةَ ؕ۬— فَسَیَعْلَمُوْنَ مَنْ هُوَ شَرٌّ مَّكَانًا وَّاَضْعَفُ جُنْدًا ۟
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఎవరైతే తన మార్గభ్రష్టతలో మునిగి ఉంటాడో అనంత కరుణామయుడు అతడిని మార్గభ్రష్టతలో అతడు అధికమయ్యే వరకు గడువును ఇస్తాడు.చివరికి వారు తమకు వాగ్ధానం చేయబడిన శీఘ్రంగా లభించే శిక్షను ఇహలోకంలో లేదా ఆలస్యంగా లభించే శిక్షను పరలోకంలో కళ్ళార చూసినప్పుడు వారు ఆ సమయంలో ఎవరు చెడు స్థానం గల వాడు, ఎవడు తక్కువ సహాయకులు గలవాడో తెలుసుకుంటాడు. అతని వర్గమా లేదా విశ్వాసపరుల వర్గమా ?.
Tafsiran larabci:
وَیَزِیْدُ اللّٰهُ الَّذِیْنَ اهْتَدَوْا هُدًی ؕ— وَالْبٰقِیٰتُ الصّٰلِحٰتُ خَیْرٌ عِنْدَ رَبِّكَ ثَوَابًا وَّخَیْرٌ مَّرَدًّا ۟
మార్గ భ్రష్టతలో అధికమవటానికి గడువివ్వబడిన వీరందరికి భిన్నంగా అల్లాహ్ సన్మార్గం పొందిన వారందరిని విశ్వాసంలో,విధేయతలో అధికం చేస్తాడు. ఓ ప్రవక్తా శాస్వత ఆనందాలకు దారి తీసే సత్కార్యాలు మీ ప్రభువు వద్ద ప్రతిఫలం పరంగా,మంచి పరిణామం పరంగా ఎక్కువ ప్రయోజనకరమైనవి.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• على المؤمنين الاشتغال بما أمروا به والاستمرار عليه في حدود المستطاع.
విశ్వాసపరులు తమకు ఆదేశించబడిన వాటిలో నిమగ్నమై ఉండటం తప్పనిసరి. సాధ్యమైనంతవరకు దానిపైనే కొనసాగాలి.

• وُرُود جميع الخلائق على النار - أي: المرور على الصراط، لا الدخول في النار - أمر واقع لا محالة.
జీవులన్ని నరకంపై రావటం అంటే మార్గమును దాటటం. అంతేగాని నరకంలో ప్రవేశించటం కాదు ఖచ్చితంగా జరిగే పని.

• أن معايير الدين ومفاهيمه الصحيحة تختلف عن تصورات الجهلة والعوام.
ధర్మ ప్రమాణాలు,దాని సరైన భావనలు అజ్ఞానుల,సామాన్యుల అవగాహనలకు భిన్నంగా ఉంటాయి.

• من كان غارقًا في الضلالة متأصلًا في الكفر يتركه الله في طغيان جهله وكفره، حتى يطول اغتراره، فيكون ذلك أشد لعقابه.
ఎవరైతే అపమార్గంలో మునిగి తేలుతూ,అపనమ్మకంలో పాతుకుపోయాడో అతన్ని అల్లాహ్ అతని అజ్ఞానములో,అతని అవిశ్వాసములో మితిమీరే విధంగా వదిలివేస్తాడు. చివరికి అతని శోధన దీర్ఘ కాలం సాగుతుంది అప్పుడు అది అతని శిక్షను తీవ్రం చేసే విధంగా ఉంటుంది.

• يثبّت الله المؤمنين على الهدى، ويزيدهم توفيقًا ونصرة، وينزل من الآيات ما يكون سببًا لزيادة اليقين مجازاةً لهم.
అల్లాహ్ విశ్వాసపరులను మార్గదర్శకత్వంపై నిరూపిస్తాడు. మరియు వారిని సయోధ్య,విజయంతో అధికం చేస్తాడు. మరియు వారికి ప్రతిఫలంగా నమ్మకమును అధికం చేయటం కొరకు కారణమయ్యే ఆయతులను అవతరింపజేస్తాడు.

اَفَرَءَیْتَ الَّذِیْ كَفَرَ بِاٰیٰتِنَا وَقَالَ لَاُوْتَیَنَّ مَالًا وَّوَلَدًا ۟ؕ
ఓ ప్రవక్తా మా వాదనలను తిరస్కరించి,నేను ఒక వేళ మరణించి మరల లేపబడితే తప్పకుండా చాలా సంపదను,సంతానమును ఇవ్వ బడుతాను అని పలికే వాడిని మీరు చూశారా ?.
Tafsiran larabci:
اَطَّلَعَ الْغَیْبَ اَمِ اتَّخَذَ عِنْدَ الرَّحْمٰنِ عَهْدًا ۟ۙ
ఏమీ అతడు అగోచర జ్ఞానము తెలుసుకున్నాడా ఆధారం గురించి అతను ఏదైతే మాట్లాడుతున్నాడో ?!.లేదా తన ప్రభువు వద్ద అతడిని ఆయన తప్పకుండా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడని,తప్పకుండా అతనికి సంపదను,సంతానమును ప్రసాధిస్తాడని ఏదైన వాగ్ధానం తయారు చేసుకున్నాడా ?!.
Tafsiran larabci:
كَلَّا ؕ— سَنَكْتُبُ مَا یَقُوْلُ وَنَمُدُّ لَهٗ مِنَ الْعَذَابِ مَدًّا ۟ۙ
విషయం అతడు అనుకున్నట్లుగా జరగదు.అతడు మాట్లాడే వాటిని,అతడు చేసే వాటిని మేము వ్రాస్తాము. అతడు అసత్యము యొక్క ఏదైతే వాదన చేస్తున్నాడో దాని కారణం చేత అతడికి మేము శిక్షపై శిక్షను అధికం చేస్తాము.
Tafsiran larabci:
وَّنَرِثُهٗ مَا یَقُوْلُ وَیَاْتِیْنَا فَرْدًا ۟
మరియు మేము అతడిని వినాశనమునకు గురి చేసిన తరువాత అతడు వదిలి వెళ్ళిన సంపదకు,సంతానమునకు మేము వారసులమవుతాము. మరియు అతడు ప్రయోజనం చెందిన సంపదను,మర్యాదను గుంజుకోబడిన స్థితిలో ఒంటరిగా ప్రళయదినాన మా వద్దకు వస్తాడు.
Tafsiran larabci:
وَاتَّخَذُوْا مِنْ دُوْنِ اللّٰهِ اٰلِهَةً لِّیَكُوْنُوْا لَهُمْ عِزًّا ۟ۙ
ముష్రికులు అల్లాహ్ ను వదిలి తమ కొరకు ఆరాధ్య దైవాలను వారు వారి కొరకు సహాయకులుగా,మద్దతు దారులాగా అయి వారు వారితో సహాయం పొందటానికి చేసుకున్నారు.
Tafsiran larabci:
كَلَّا ؕ— سَیَكْفُرُوْنَ بِعِبَادَتِهِمْ وَیَكُوْنُوْنَ عَلَیْهِمْ ضِدًّا ۟۠
విషయం వారు అనుకున్నట్లు జరగదు. వారు అల్లాహ్ ను వదిలి ఆరాధించే ఈ ఆరాధ్యదైవాలు తమ కొరకు ముష్రికులు చేసిన ఆరాధనను ప్రళయదినాన తిరస్కరించి వారిని ఉపేక్షిస్తారు.మరియు వారికి శతృవులైపోతారు.
Tafsiran larabci:
اَلَمْ تَرَ اَنَّاۤ اَرْسَلْنَا الشَّیٰطِیْنَ عَلَی الْكٰفِرِیْنَ تَؤُزُّهُمْ اَزًّا ۟ۙ
ఓ ప్రవక్తా మేము షైతానులను పంపించి అవిశ్వాసపరులను పాపకార్యములను చేయటానికి,అల్లాహ్ మార్గము నుండి ఆటంకము కలగించటానికి వారిని ప్రేరేపించేలా వారికి అధికారమును కలిగించినది మీరు చూడలేదా ?.
Tafsiran larabci:
فَلَا تَعْجَلْ عَلَیْهِمْ ؕ— اِنَّمَا نَعُدُّ لَهُمْ عَدًّا ۟ۚ
ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ ను వారికి త్వరగా శిక్షించమని కోరి తొందర చేయకండి. మేము వారి వయస్సులను షుమారు చేస్తున్నాము. చివరికి వారి గడువు సమయం ముగిసినప్పుడు వారు దేనికి హక్కుదారులో ఆ శిక్షను వారికి కలుగ జేస్తాము.
Tafsiran larabci:
یَوْمَ نَحْشُرُ الْمُتَّقِیْنَ اِلَی الرَّحْمٰنِ وَفْدًا ۟ۙ
ఓ ప్రవక్తా మీరు మేము తమ ప్రభువు పై ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వార భీతి కలిగిన వారిని వారి ప్రభువు ముందట మాన,మర్యాదలతో అతిధులుగా సమీకరించే రోజైన ప్రళయదినమును గుర్తు చేసుకోండి.
Tafsiran larabci:
وَّنَسُوْقُ الْمُجْرِمِیْنَ اِلٰی جَهَنَّمَ وِرْدًا ۟ۘ
మరియు మేము అవిశ్వాసపరులను దప్పిక స్థితిలో తోలుకు పోతాము.
Tafsiran larabci:
لَا یَمْلِكُوْنَ الشَّفَاعَةَ اِلَّا مَنِ اتَّخَذَ عِنْدَ الرَّحْمٰنِ عَهْدًا ۟ۘ
ఇహలోకములో అల్లాహ్ యందు ఆయన పై,ఆయన ప్రవక్తల పై విశ్వాసము ద్వారా ప్రమాణమును ఏర్పరచున్న వాడికి తప్ప ఈ అవిశ్వాసపరులందరిలోంచి వారిలో కొందరి కొరకు సిఫారసు చేసే అధికారముండదు.
Tafsiran larabci:
وَقَالُوا اتَّخَذَ الرَّحْمٰنُ وَلَدًا ۟ؕ
మరియు యూదులు,క్రైస్తవులు,కొందరు ముష్రికులు కరుణామయుడు కుమారుడిని ఏర్పాటు చేసుకున్నాడని పలికారు.
Tafsiran larabci:
لَقَدْ جِئْتُمْ شَیْـًٔا اِدًّا ۟ۙ
ఓ ఇలా పలికిన వారా నిశ్ఛయంగా మీరు చాలా పెద్ద విషయాన్ని తీసుకుని వచ్చారు.
Tafsiran larabci:
تَكَادُ السَّمٰوٰتُ یَتَفَطَّرْنَ مِنْهُ وَتَنْشَقُّ الْاَرْضُ وَتَخِرُّ الْجِبَالُ هَدًّا ۟ۙ
ఈ దుర మాట వలన ఆకాశములు బ్రద్ధలైపోవచ్చు,భూమి చీలిపోవచ్చు,పర్వతాలు ధ్వంసమై పడిపోవచ్చు.
Tafsiran larabci:
اَنْ دَعَوْا لِلرَّحْمٰنِ وَلَدًا ۟ۚ
ఇవన్నీ వారు కరుణామయుడికి కుమారుడిని అంటగట్టినందుకు. వీటి నుండి అల్లాహ్ చాలా మహోన్నతుడు.
Tafsiran larabci:
وَمَا یَنْۢبَغِیْ لِلرَّحْمٰنِ اَنْ یَّتَّخِذَ وَلَدًا ۟ؕ
మరియు కరుణామయుడు కుమారుడిని ఏర్పరచుకోవటం ఆయన దాని నుండి పరిశిద్ధుడు కాబట్టి సరికాదు.
Tafsiran larabci:
اِنْ كُلُّ مَنْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ اِلَّاۤ اٰتِی الرَّحْمٰنِ عَبْدًا ۟ؕ
ఆకాశముల్లో ఉన్న దైవదూతల్లోంచి,మానవులు,జిన్నుల్లోంచి ప్రతి ఒక్కరు ప్రళయ దినాన తమ ప్రభువు ముందట కడు వినయంతో మాత్రమే వస్తారు.
Tafsiran larabci:
لَقَدْ اَحْصٰىهُمْ وَعَدَّهُمْ عَدًّا ۟ؕ
నిశ్ఛయంగా ఆయన వారిని జ్ఞానపరంగా చుట్టు ముట్టి ఉన్నాడు,వారిని లెక్కవేసి ఉన్నాడు.వారి నుండి ఏదీ ఆయన పై గోప్యంగా ఉండదు.
Tafsiran larabci:
وَكُلُّهُمْ اٰتِیْهِ یَوْمَ الْقِیٰمَةِ فَرْدًا ۟
వారిలో నుండి ప్రతి ఒక్కడు ఆయన ముందు ప్రళయదినాన తన కొరకు ఎటువంటి సహాయకుడు లేకుండా,ఎటువంటి సంపద లేకుండా ఒంటరిగా వస్తాడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• تدل الآيات على سخف الكافر وسَذَاجة تفكيره، وتَمَنِّيه الأماني المعسولة، وهو سيجد نقيضها تمامًا في عالم الآخرة.
ఆయతులు అవిశ్వాసపరుని బుద్దిలేమి తనమును,అతని తిరస్కారము యొక్క సామాన్యతను,తీపి కోరికల అతని కోరికను సూచిస్తున్నాయి. మరియు అతడు వాటి విరుద్ధతను పరలోకములో పరిపూర్ణంగా పొందుతాడు.

• سلَّط الله الشياطين على الكافرين بالإغواء والإغراء بالشر، والإخراج من الطاعة إلى المعصية.
అల్లాహ్ షైతానులకు అవిశ్వాసపరులపై మార్గభ్రష్టకు లోను చేయటం ద్వారా,చెడు గురించి ప్రేరేపించటం ద్వారా మరియు విధేయతనుండి అవిధేయత కార్యలవైపు తీయటం ద్వారా అధికారమును ఇచ్చాడు.

• أهل الفضل والعلم والصلاح يشفعون بإذن الله يوم القيامة.
కటాక్షము,జ్ఞానము,పుణ్యము కలవారు ప్రళయదినాన అల్లాహ్ ఆదేశంతో సిఫారసు చేస్తారు.

اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ سَیَجْعَلُ لَهُمُ الرَّحْمٰنُ وُدًّا ۟
నిశ్ఛయంగా అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి అల్లాహ్ కి సంతృప్తికరమైన సత్కార్యములను చేసేవారికి అల్లాహ్ తొందరలోనే తన ప్రేమతో వారికి తన దాసుల వద్ద ప్రేమను కలుగజేస్తాడు.
Tafsiran larabci:
فَاِنَّمَا یَسَّرْنٰهُ بِلِسَانِكَ لِتُبَشِّرَ بِهِ الْمُتَّقِیْنَ وَتُنْذِرَ بِهٖ قَوْمًا لُّدًّا ۟
ఓ ప్రవక్తా మేము ఈ ఖుర్ఆన్ ను మీ భాషలో అవతరింపజేసి సులభతరం చేశాము. దాని ద్వార మీరు నా ఆదేశాలను పాటించి,నేను వారించిన వాటికి దూరంగా ఉండే భీతిపరులకు శుభవార్తను ఇవ్వటానికి మరియు తగువులాడటంలో,సత్యమును అంగీకరించే విషయంలోఅహంభావంలో తీవ్రమైన జాతివారిని దాని ద్వారా మీరు భయపెట్టటానికి.
Tafsiran larabci:
وَكَمْ اَهْلَكْنَا قَبْلَهُمْ مِّنْ قَرْنٍ ؕ— هَلْ تُحِسُّ مِنْهُمْ مِّنْ اَحَدٍ اَوْ تَسْمَعُ لَهُمْ رِكْزًا ۟۠
మీ జాతి వారి కన్న ముందు ఎన్నో సమాజములను వినాశనమునకు గురి చేశాము.అయితే ఆ సమాజముల్లోంచి ఈ రోజు ఏ ఒక్క దాన్నైన మీరు గమనించగలరా ?!.వారికి ఏదైన తేలికైన నిట్టూర్పును మీరు వినగలరా ?!.అల్లాహ్ ప్రకటించినప్పుడు వారికి సంభవించినదే ఇతరులకు సంభవించినది.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• ليس إنزال القرآن العظيم لإتعاب النفس في العبادة، وإذاقتها المشقة الفادحة، وإنما هو كتاب تذكرة ينتفع به الذين يخشون ربهم.
గొప్ప ఖుర్ఆన్ యొక్క అవతరణ ఆరాధనలో మనస్సును అలసటకు గురి చేయటానికి,దానికి అపార కష్టమును కలిగించటానికి కాదు. అది ఒక హితోపదేశ గ్రంధం మాత్రమే దాని ద్వారా తమ ప్రభువుతో భయపడేవారు ప్రయోజనం చెందుతారు.

• قَرَن الله بين الخلق والأمر، فكما أن الخلق لا يخرج عن الحكمة؛ فكذلك لا يأمر ولا ينهى إلا بما هو عدل وحكمة.
అల్లాహ్ సృష్టికి,ఆదేశమునకి మధ్య జత కలపాడు.సృష్టి జ్ఞానము నుండి వైదొలగనట్లే అలాగే ఆయన న్యాయపూరితముగా,జ్ఞాన పూరితముగా ఉంటే తప్ప ఆదేశించడు,వారించడు.

• على الزوج واجب الإنفاق على الأهل (المرأة) من غذاء وكساء ومسكن ووسائل تدفئة وقت البرد.
ఇంటి వారిపై (భార్యపై) ఆహారము,బట్టలు,నివాసము,చలికాలములో వేడిని కలిగించే కారకాల్లో ఖర్చు చేయటం భర్త బాధ్యత.

 
Fassarar Ma'anoni Sura: Suratu Maryam
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa