Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (78) Sura: Suratu Ghafir
وَلَقَدْ اَرْسَلْنَا رُسُلًا مِّنْ قَبْلِكَ مِنْهُمْ مَّنْ قَصَصْنَا عَلَیْكَ وَمِنْهُمْ مَّنْ لَّمْ نَقْصُصْ عَلَیْكَ ؕ— وَمَا كَانَ لِرَسُوْلٍ اَنْ یَّاْتِیَ بِاٰیَةٍ اِلَّا بِاِذْنِ اللّٰهِ ۚ— فَاِذَا جَآءَ اَمْرُ اللّٰهِ قُضِیَ بِالْحَقِّ وَخَسِرَ هُنَالِكَ الْمُبْطِلُوْنَ ۟۠
మరియు నిశ్ఛయంగా మేము ఓ ప్రవక్తా మీ కన్న ముందు చాలా ప్రవక్తలను వారి జాతుల వద్దకు పంపించాము. అప్పుడు వారు వారిని తిరస్కరించారు మరియు వారికి బాధలు పెట్టారు. అప్పుడు వారు వారి తిస్కారముపై మరియు వారి బాధించటంపై సహనం చూపారు. ఈ ప్రవక్తలందరిలో నుంచి కొందరి సమాచారమును మేము మీకు వివరించి తెలియపరచాము. మరియు వారిలో నుంచి కొందరి సమాచారమును మేము మీకు తెలియపరచలేదు. మరియు ఏ ప్రవక్తకి తన జాతి వారి వద్దకు తన ప్రభువు వద్ద నుండి ఎటువంటి సూచనను పరిశుద్ధుడైన ఆయన ఇచ్ఛతో తప్ప తీసుకుని రావటం సరికాదు. కావున అవిశ్వాసపరులు తమ సమాజాలపై సూచనలను తీసుకుని రమ్మని సూచించటం అన్యాయము. అయితే విజయం లేదా ప్రవక్తలకు వారి జాతుల వారి మధ్య తీర్పు ద్వారా అల్లాహ్ ఆదేశము వచ్చినప్పుడు వారి మధ్య న్యాయపూరితంగా తీర్పు జరుగును. అప్పుడు అవిశ్వాసపరులు నాశనం చేయబడుతారు. మరియు ప్రవక్తలకు విముక్తి కలిగించబడును. మరియు దాసుల మధ్య తిర్పుఇవ్వబడే ఆ పరిస్థితులలో అసత్యపరులు తమ అవిశ్వాసం వలన వినాశన స్థానమునకు చేరుకోవటం వలన తమ స్వయానికి నష్టం కలిగించుకుంటారు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• لله رسل غير الذين ذكرهم الله في القرآن الكريم نؤمن بهم إجمالًا.
పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రస్తావించిన వారే కాకుండా అల్లాహ్ ప్రవక్తలు ఉన్నారు మేము వారందరిని విశ్వసిస్తున్నాము.

• من نعم الله تبيينه الآيات الدالة على توحيده.
అల్లాహ్ అనుగ్రహాల్లోంచి ఆయన ఏకత్వముపై సూచించే ఆయతులను ఆయన స్పష్టపరచటం.

• خطر الفرح بالباطل وسوء عاقبته على صاحبه.
అసత్యము పట్ల సంతోషపడటము యొక్క ప్రమాదము మరియు అది కలిగిన వాడిపై దాని చెడు పర్యవసానము.

• بطلان الإيمان عند معاينة العذاب المهلك.
నశనం చేసే శిక్షను కళ్లారా చూసినప్పటి విశ్వాస నిర్వీర్యత.

 
Fassarar Ma'anoni Aya: (78) Sura: Suratu Ghafir
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa