Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Sura: Suratu Ghafir   Aya:

సూరహ్ గాఫిర్

daga cikin abunda Surar ta kunsa:
بيان حال المجادلين في آيات الله، والرد عليهم.
అల్లాహ్ ఆయతుల విషయంలో వాదించే వారి పరిస్థితి ప్రకటన మరియు వారిని ప్రతిస్పందించటం

حٰمٓ ۟ۚ
హా-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
Tafsiran larabci:
تَنْزِیْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِیْزِ الْعَلِیْمِ ۟ۙ
ఎవరు ఆధిక్యత చూపని సర్వాధిక్యుడైన,తన దాసుల ప్రయోజనముల గురించి జ్ఞానము కలిగిన అల్లాహ్ తరపు నుండి తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఖుర్ఆన్ అవతరణ
Tafsiran larabci:
غَافِرِ الذَّنْۢبِ وَقَابِلِ التَّوْبِ شَدِیْدِ الْعِقَابِ ذِی الطَّوْلِ ؕ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— اِلَیْهِ الْمَصِیْرُ ۟
పాపాలకు పాల్పడే వారి పాపములను మన్నించేవాడు, తన దాసుల్లోంచి తన వైపునకు తౌబా చేసేవారి తౌబాను స్వీకరించేవాడు, ఎవరైతే తన పాపముల నుండి తౌబా చేయడో వారిని కఠినంగా శిక్షించేవాడు, దాతృత్వం కలవాడు,అనుగ్రహించేవాడు. ఆయన తప్ప సత్య ఆరాధ్యదైవం వేరేది లేదు. ప్రళయదినమున దాసుల మరలింపు ఆయన ఒక్కడి వైపే జరుగును. అప్పుడు ఆయన వారు దేనికి హక్కుదారులో అది వారికి ప్రసాదిస్తాడు.
Tafsiran larabci:
مَا یُجَادِلُ فِیْۤ اٰیٰتِ اللّٰهِ اِلَّا الَّذِیْنَ كَفَرُوْا فَلَا یَغْرُرْكَ تَقَلُّبُهُمْ فِی الْبِلَادِ ۟
అల్లాహ్ తౌహీద్ పై మరియు ఆయన ప్రవక్త నిజాయితీపై సూచించే అల్లాహ్ ఆయతుల విషయంలో తమ బుద్ధులు చెడిపోవటం వలన అల్లాహ్ పట్ల అవిశ్వాసమునకు పాల్పడిన వారు మాత్రమే తగువులాడుతారు. వారి మూలంగా మీరు దుఃఖించకండి. మరియు ఆహారోపాధిలో,అనుగ్రహాల్లో వారికి ఉన్న పుష్కలము మిమ్మల్ని మోసగించకూడదు. కావున వారికి గడువివ్వటం వారికి నెమ్మదినెమ్మదిగా (శిక్షకు) దగ్గర చేయటం మరియు వారి పట్ల వ్యూహ రచన చేయటం.
Tafsiran larabci:
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّالْاَحْزَابُ مِنْ بَعْدِهِمْ ۪— وَهَمَّتْ كُلُّ اُمَّةٍ بِرَسُوْلِهِمْ لِیَاْخُذُوْهُ وَجٰدَلُوْا بِالْبَاطِلِ لِیُدْحِضُوْا بِهِ الْحَقَّ فَاَخَذْتُهُمْ ۫— فَكَیْفَ كَانَ عِقَابِ ۟
వీరందరికన్న ముందు నూహ్ అలైహిస్సలాం జాతివారు తిరస్కరించారు. మరియు వారి కన్న ముందు నూహ్ అలైహిస్సలాం జాతి వారి తరువాత వర్గాల వారు తిరస్కరించారు. ఆద్ జాతి తిరస్కరించింది మరియు సమూద్,లూత్ జాతి,మద్యన్ వారు తిరస్కరించారు. మరియు ఫిర్ఔన్ తిరస్కరించాడు. మరియు సమాజముల్లోంచి ప్రతీ సమాజము తమ ప్రవక్తను పట్టుకుని అతన్ని హతమార్చటానికి దృఢ సంకల్పం చేసుకున్నారు. మరియు వారు తమ వద్దనున్న అసత్యముతో సత్యమును తొలగించటానికి వాదులాడారు. ఆ సమాజములన్ని పట్టుబడ్డాయి. వారిపై నా శిక్ష ఎలా ఉన్నది యోచన చేయండి. అది కఠినమైన శిక్ష.
Tafsiran larabci:
وَكَذٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَی الَّذِیْنَ كَفَرُوْۤا اَنَّهُمْ اَصْحٰبُ النَّارِ ۟
మరియు ఏ విధంగానైతే ఈ తిరస్కార సమాజముల వినాశనము యొక్క అల్లాహ్ తీర్పునిచ్చాడో ఓ ప్రవక్తా అవిశ్వాసపరులు నరకవాసులన్న దానిపై నీ ప్రభువు యొక్క మాట అనివార్యమైనది.
Tafsiran larabci:
اَلَّذِیْنَ یَحْمِلُوْنَ الْعَرْشَ وَمَنْ حَوْلَهٗ یُسَبِّحُوْنَ بِحَمْدِ رَبِّهِمْ وَیُؤْمِنُوْنَ بِهٖ وَیَسْتَغْفِرُوْنَ لِلَّذِیْنَ اٰمَنُوْا ۚ— رَبَّنَا وَسِعْتَ كُلَّ شَیْءٍ رَّحْمَةً وَّعِلْمًا فَاغْفِرْ لِلَّذِیْنَ تَابُوْا وَاتَّبَعُوْا سَبِیْلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِیْمِ ۟
ఓ ప్రవక్తా నీ ప్రభువు యొక్క సింహాసమును మోస్తున్న దైవదూతలు మరియు దాని చుట్టు ఉన్న వారు తమ ప్రభువుకు తగని వాటి నుండి పరిశుద్ధతను కొనియాడుతారు. మరియు ఆయనను విశ్వసిస్తారు. మరియు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచిన వారి కొరకు మన్నింపును వేడుకుంటారు. తమ దుఆల్లో ఇలా పలుకుతూ : ఓ మా ప్రభువా నీ జ్ఞానం మరియు నీ కారుణ్యం ప్రతీ వస్తువుని చుట్టుముట్టి ఉన్నది. అయితే నీవు తమ పాపముల నుండి మన్నింపును వేడుకుని నీ ధర్మమును అనుసరించిన వారిని మన్నించు. మరియు వారికి నరకాగ్ని ముట్టుకోవటం నుంచి వారిని రక్షించు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الجمع بين الترغيب في رحمة الله، والترهيب من شدة عقابه: مسلك حسن.
అల్లాహ్ కారుణ్యము విషయంలో ఆశ చూపటమునకు మరియు ఆయన శిక్ష తీవ్రత నుండి భయపెట్టటం మధ్య సమీకరణ మంచి పద్దతి.

• الثناء على الله بتوحيده والتسبيح بحمده أدب من آداب الدعاء.
అల్లాహ్ తౌహీద్ తో ఆయనను పొగడటం మరియు ఆయన పొగడ్తలతో పరిశుద్ధతను కొనియాడటం దుఆ చేసే పద్దతుల్లోంచి ఒక పద్దతి.

• كرامة المؤمن عند الله؛ حيث سخر له الملائكة يستغفرون له.
అల్లాహ్ వద్ద విశ్వాసపరునికి గౌరవం కలదు. ఎందుకంటే ఆయన అతని కొరకు మన్నింపుని వేడుకోవటానికి దైవదూతలను అతనికి ఉపయుక్తంగా చేశాడు.

رَبَّنَا وَاَدْخِلْهُمْ جَنّٰتِ عَدْنِ ١لَّتِیْ وَعَدْتَّهُمْ وَمَنْ صَلَحَ مِنْ اٰبَآىِٕهِمْ وَاَزْوَاجِهِمْ وَذُرِّیّٰتِهِمْ ؕ— اِنَّكَ اَنْتَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟ۙ
మరియు దైవదూతలు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా నీవు విశ్వాసపరులని ఆ శాశ్వత స్వర్గవనాల్లోకి ప్రవేశింపజేయి వేటిలోనైతే నీవు వారిని ప్రవేశింపజేస్తానని వాగ్దానం చేశావో. మరియు నీవు వారితో పాటు వారి తాతముత్తాతల్లోంచి, వారి భార్యల్లోంచి,వారి సంతానములో నుంచి ఎవరి ఆచరణ మంచిగా ఉన్నదో వారినీ ప్రవేశింపజేయి. నిశ్చయంగా నీవే సర్వాధిక్యుడివి నీపై ఎవరూ ఆధిక్యత చూపలేరు. నీ విధివ్రాతలో మరియు నీ పర్యాలోచనలో విజ్ఞత కలవాడివి.
Tafsiran larabci:
وَقِهِمُ السَّیِّاٰتِ ؕ— وَمَنْ تَقِ السَّیِّاٰتِ یَوْمَىِٕذٍ فَقَدْ رَحِمْتَهٗ ؕ— وَذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِیْمُ ۟۠
మరియు నీవు వారిని వారి దుష్కర్మల నుండి పరిరక్షించు. వారిని వాటి పరంగా శిక్షించకు. ప్రళయదినమున నీవు ఎవడినైతే అతని దుష్కర్మల పై శిక్ష నుండి పరిరక్షిస్తావో అతడిపై నీవు కనికరించావు. శిక్ష నుండి ఈ రక్షణ మరియు స్వర్గ ప్రవేశముతో కారుణ్యము ఇదే ఏదీ సరి తూగని గొప్ప సాఫల్యము.
Tafsiran larabci:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا یُنَادَوْنَ لَمَقْتُ اللّٰهِ اَكْبَرُ مِنْ مَّقْتِكُمْ اَنْفُسَكُمْ اِذْ تُدْعَوْنَ اِلَی الْاِیْمَانِ فَتَكْفُرُوْنَ ۟
నిశ్చయంగా అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్త పై అవిశ్వాసమును కనబరచినవారు నరకములో ప్రవేశించేటప్పుడు మరియు తమ స్వయంపై కోపాన్ని ప్రదర్శించుకుని తమను దూషించుకునే టప్పుడు ఇలా పిలవబడుతారు : మీ స్వయం కొరకు ఉన్న మీ ధ్వేషము తీవ్రత కన్నా మీరు ఇహలోకంలో అల్లాహ్ పై విశ్వాసమును కనబరచటం వైపునకు పిలవబడితే మీరు ఆయన్ని తిరస్కరించి,ఆయనతో పాటు ఇతర ఆరాధ్య దైవమును ఏర్పరచుకున్నప్పుడు అల్లాహ్ యొక్క ధ్వేషము తీవ్రత మీ కొరకు అధికంగా ఉండేది.
Tafsiran larabci:
قَالُوْا رَبَّنَاۤ اَمَتَّنَا اثْنَتَیْنِ وَاَحْیَیْتَنَا اثْنَتَیْنِ فَاعْتَرَفْنَا بِذُنُوْبِنَا فَهَلْ اِلٰی خُرُوْجٍ مِّنْ سَبِیْلٍ ۟
మరియు అవిశ్వాసపరులు తమ పాపములను అంగీకరిస్తూ ఇలా పలుకుతారు అప్పుడు వారి అంగీకారము గాని వారి పశ్చాత్తాపము గాని ప్రయోజనం కలిగించదు : ఓ మా ప్రభువా నీవు మాకు రెండు సార్లు మరణమును కలిగించావు మేము ఉనికిలో లేనప్పుడు అప్పుడు నీవు మమ్మల్ని ఉనికిలోకి తెచ్చావు, ఆ తరువాత ఉనికిలోకి తెచ్చిన తరువాత నీవు మమ్మల్ని మరణింపజేశావు. మరియు నీవు మమ్మల్ని రెండు సార్లు జీవింపజేశావు ఉనికిలో లేని స్థితి నుండి ఉనికిలోకి తెచ్చి మరియు మరణాంతరం లేపటం కొరకు మమ్మల్ని జీవింపజేసావు. మేము చేసుకున్న పాపములను మేము అంగీకరించాము. ఏమి ఏదైన మార్గము ఉన్నదా దానిపై మేము నడిచి మేము నరకాగ్ని నుండి బయటపడటానికి. అప్పుడు మేము మా కర్మలను సరిచేసుకోవటానికి జీవితం వైపునకు మరలుతాము . అప్పుడు నీవు మా నుండి సంతుష్టి చెందుతావు ?!.
Tafsiran larabci:
ذٰلِكُمْ بِاَنَّهٗۤ اِذَا دُعِیَ اللّٰهُ وَحْدَهٗ كَفَرْتُمْ ۚ— وَاِنْ یُّشْرَكْ بِهٖ تُؤْمِنُوْا ؕ— فَالْحُكْمُ لِلّٰهِ الْعَلِیِّ الْكَبِیْرِ ۟
మీరు శిక్షించబడిన ఈ శిక్షకు కారణం ఏమిటంటే ఒక్కడైన అల్లాహ్ ఆరాధన చేయబడి,ఆయనతో పాటు ఎవరినీ సాటి కల్పించబడనప్పుడు మీరు ఆయన పట్ల అవిశ్వాసమును కనబరచి,ఆయన కొరకు భాగస్వాములను తయారు చేసుకున్నారు. మరియు అల్లాహ్ తో పాటు ఎవరైన భాగస్వామి ఆరాధన చేయబడితే మీరు విశ్వసించారు. ఆదేశము ఒక్కడైన అల్లాహ్ కొరకే. తన అస్తిత్వంలో,తన సామర్ధ్యంలో,తన ఆధిక్యతలో మహోన్నతుడు. అన్నింటి కన్న గొప్పవాడు.
Tafsiran larabci:
هُوَ الَّذِیْ یُرِیْكُمْ اٰیٰتِهٖ وَیُنَزِّلُ لَكُمْ مِّنَ السَّمَآءِ رِزْقًا ؕ— وَمَا یَتَذَكَّرُ اِلَّا مَنْ یُّنِیْبُ ۟
ఆల్లాహ్ ఆయనే మీకు తన సూచనలను విశ్వంలో,ప్రాణముల్లో తన సామర్ధ్యముపై,తన ఏకత్వముపై అవి మిమ్మల్ని సూచించటానికి చూపిస్తాడు. మరియు ఆయన మీ కొరకు ఆకాశము నుండి వర్షపు నీటిని మీరు ఆహారముగా ప్రసాదించబడే మొక్కలు,పంటలు వివిధ వాటికి కారణం అవటానికి కురిపిస్తాడు. మరియు అల్లాహ్ ఆయతులతో ఆయన వైపునకు పశ్ఛాత్తాపముతో,చిత్తశుద్ధితో మరలేవాడు మాత్రమే హితబోధనను గ్రహిస్తాడు.
Tafsiran larabci:
فَادْعُوا اللّٰهَ مُخْلِصِیْنَ لَهُ الدِّیْنَ وَلَوْ كَرِهَ الْكٰفِرُوْنَ ۟
ఓ విశ్వాసపరులారా మీరు అల్లాహ్ కు విధేయత చూపటంలో మరియు వేడుకోవటంలో ఆయన కొరకు చిత్తశుద్ధిని చూపుతూ,ఆయనతో పాటు సాటి కల్పించకుండా ప్రార్ధించండి. ఒక వేళ దాన్ని అవిశ్వాసపరులు ఇష్టపడకపోయినా మరియు వారికి కోపం కలిగించిన.
Tafsiran larabci:
رَفِیْعُ الدَّرَجٰتِ ذُو الْعَرْشِ ۚ— یُلْقِی الرُّوْحَ مِنْ اَمْرِهٖ عَلٰی مَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ لِیُنْذِرَ یَوْمَ التَّلَاقِ ۟ۙ
ఆయన కొరకు ఆరాధన మరియు విధేయత ప్రత్యేకించబడటానికి ఆయనే యోగ్యుడు. ఆయన తన సృష్టిరాసులన్నింటి కన్న వ్యత్యాసమైన ఉన్నత స్థానములు కలవాడు. మరియు ఆయన మహోన్నత సింహాసనమునకు ప్రభువు. ఆయన తన దాసుల్లోంచి తాను తలచిన వారిపై వారు జీవించి ఉండటానికి మరియు ఇతరులను జీవింపజేయటానికి మరియు మొదటి వారు,చివరి వారు కలుసుకునే రోజైన ప్రళయదినము నుండి ప్రజలను వారు భయపెట్టటానికి దైవవాణిని అవతరింపజేస్తాడు.
Tafsiran larabci:
یَوْمَ هُمْ بَارِزُوْنَ ۚ۬— لَا یَخْفٰی عَلَی اللّٰهِ مِنْهُمْ شَیْءٌ ؕ— لِمَنِ الْمُلْكُ الْیَوْمَ ؕ— لِلّٰهِ الْوَاحِدِ الْقَهَّارِ ۟
ఆ రోజు వారు బహిర్గతమై ఒకే ప్రాంతంలో సమావేశమవుతారు. వారి నుండి అల్లాహ్ పై వారి అస్తిత్వాల్లోంచిగాని వారి కర్మల్లోంచి గాని వారి ప్రతిఫలముల్లోంచి గాని ఏదీ గోప్యంగా ఉండదు. ఈ రోజు విశ్వ సామ్రాజ్యాధికారం ఎవరి కొరకు ? అని అడుగుతాడు. అప్పుడు సమాధానం ఒక్కటే అవుతుంది . సామ్రాజ్యాధికారము తన అస్తిత్వంలో,తన గుణగణాల్లో,తన కార్యాల్లో ఒక్కడే అయిన అల్లాహ్ కే చెందుతుంది. అన్నింటిపై ఆధిక్యత కలవాడు మరియు ప్రతీది ఆయనకు లోబడి ఉంటుంది.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• مَحَلُّ قبول التوبة الحياة الدنيا.
ఇహలోకజీవితము తౌబా స్వీకరించబడే ప్రదేశము.

• نفع الموعظة خاص بالمنيبين إلى ربهم.
హితబోధన ప్రయోజనము తమ ప్రభువు వైపునకు మరలే వారికి ప్రత్యేకము.

• استقامة المؤمن لا تؤثر فيها مواقف الكفار الرافضة لدينه.
తమ ధర్మమును తిరస్కరించే అవిశ్వాసపరుల స్థానములు విశ్వాసపరుని స్థిరత్వముపై ప్రభావం చూపదు.

• خضوع الجبابرة والظلمة من الملوك لله يوم القيامة.
ప్రళయదినమున దుర్మార్గులైన,హింసాత్ములైన రాజులు అల్లాహ్ కొరకు అణకువను ప్రదర్శించటం జరుగుతుంది.

اَلْیَوْمَ تُجْزٰی كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ ؕ— لَا ظُلْمَ الْیَوْمَ ؕ— اِنَّ اللّٰهَ سَرِیْعُ الْحِسَابِ ۟
ఆ రోజు ప్రతీ మనిషి తాను చేసుకున్న కర్మలకు ప్రతిఫలం ప్రసాదించబడుతాడు. ఒక వేళ అది మంచిగా ఉంటే (ప్రతిఫలం) మంచిగా ఉంటుంది. ఒక వేళ అది చెడుగా ఉంటే (ప్రతిఫలం) చెడుగా ఉంటుంది. ఆ రోజు అన్యాయం చేయబడదు. ఎందుకంటే తీర్పునిచ్చేవాడు అల్లాహ్ యే న్యాయాధిపతి. నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల కొరకు వారిని తన జ్ఞానం పరంగా చుట్టుముట్టి ఉండటం వలన త్వరగా లెక్క తీసుకునేవాడు.
Tafsiran larabci:
وَاَنْذِرْهُمْ یَوْمَ الْاٰزِفَةِ اِذِ الْقُلُوْبُ لَدَی الْحَنَاجِرِ كٰظِمِیْنَ ؕ۬— مَا لِلظّٰلِمِیْنَ مِنْ حَمِیْمٍ وَّلَا شَفِیْعٍ یُّطَاعُ ۟ؕ
ఓ ప్రవక్తా మీరు వారిని ప్రళయదినము నుండి భయపెట్టండి. దగ్గరకు వచ్చిన ఈ ప్రళయము వస్తున్నది. మరియు ప్రతీ వచ్చేది దగ్గరవుతుంది. ఆ రోజున హృదయములు దాని భయాందోళనల వలన పైకి వచ్చేస్తాయి చివరికి అవి తమ యజమానుల గొంతుల వరకు వచ్చేస్తాయి. ఎవరైతే మౌనంగా ఉంటారో వారిలో నుండి ఎవరూ మాట్లాడరు కాని కరుణామయుడు ఎవరికి అనుమతిస్తే తప్ప. మరియు షిర్కు,పాపకార్యముల ద్వారా తమ స్వయంపై హింసకు పాల్పడే వారి కొరకు ఏ స్నేహితుడు గాని దగ్గరి బంధువు గాని ఉండడు. మరియు అతని కొరకు సిఫారసు చేయటానికి నియమించబడినప్పుడు అతని మాట చెలామణి చేసుకొనబడే సిఫారసు చేసేవాడు ఎవడూ ఉండడు.
Tafsiran larabci:
یَعْلَمُ خَآىِٕنَةَ الْاَعْیُنِ وَمَا تُخْفِی الصُّدُوْرُ ۟
చూసేవారి కళ్ళు గోప్యంగా మోసం చేసి తీసుకునే వాటి గురించి అల్లాహ్ కు తెలుసు. మరియు హృదయములు దాచే వాటి గురించి ఆయనకు తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Tafsiran larabci:
وَاللّٰهُ یَقْضِیْ بِالْحَقِّ ؕ— وَالَّذِیْنَ یَدْعُوْنَ مِنْ دُوْنِهٖ لَا یَقْضُوْنَ بِشَیْءٍ ؕ— اِنَّ اللّٰهَ هُوَ السَّمِیْعُ الْبَصِیْرُ ۟۠
మరియు అల్లాహ్ న్యాయముగా తీర్పునిస్తాడు. ఆయన ఏ ఒక్కరిని అతని పుణ్యాలను తగ్గించి మరియు అతని పాపములను అధికం చేసి హింసించడు. మరియు ఎవరినైతే ముష్రికులు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్నారో వారు దేని గురించి తీర్పునివ్వరు. ఎందుకంటే వాటికి దేని అధికారము లేదు. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల మాటలను బాగా వినేవాడును, వారి సంకల్పాలను,వారి కర్మలను చూసేవాడును. మరియు ఆయన వారికి వాటిపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Tafsiran larabci:
اَوَلَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَیَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ كَانُوْا مِنْ قَبْلِهِمْ ؕ— كَانُوْا هُمْ اَشَدَّ مِنْهُمْ قُوَّةً وَّاٰثَارًا فِی الْاَرْضِ فَاَخَذَهُمُ اللّٰهُ بِذُنُوْبِهِمْ ؕ— وَمَا كَانَ لَهُمْ مِّنَ اللّٰهِ مِنْ وَّاقٍ ۟
ఏమిటీ ఈ ముష్రికులందరు భూమిలో సంచరించలేదా వారికన్న ముందు తిరస్కరించిన జాతుల వారి ముగింపు ఏమయిందో వారు యోచన చేయటానికి. నిశ్ఛయంగా ముగింపు దుర్బరంగా అయినది. ఆ జాతుల వారు వీరందరి కన్న అధిక బలము కలవారు. మరియు వారు భూమిలో నిర్మాణములు ఏర్పరచి వారందరు వదలనన్ని గుర్తులను వదిలి వెళ్ళారు. అప్పుడు అల్లాహ్ వారి పాపముల వలన వారిని నాశనం చేశాడు. మరియు వారి కొరకు అల్లాహ్ శిక్ష నుండి వారిని ఆపేవాడు ఎవడూ లేకపోయాడు.
Tafsiran larabci:
ذٰلِكَ بِاَنَّهُمْ كَانَتْ تَّاْتِیْهِمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ فَكَفَرُوْا فَاَخَذَهُمُ اللّٰهُ ؕ— اِنَّهٗ قَوِیٌّ شَدِیْدُ الْعِقَابِ ۟
వారికి కలిగిన ఈ శిక్ష వారికి మాత్రమే కలిగినది. ఎందుకంటే వారి వద్దకు వారి ప్రవక్తలు అల్లాహ్ వద్ద నుండి స్పష్టమైన సూచనలను మరియు అద్భుతమైన వాదనలను తీసుకుని వచ్చారు. అప్పుడు వారు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,ఆయన ప్రవక్తలను తిరస్కరించారు. మరియు వారు దానికి తోడుగా అధిక బలమును కలిగి ఉన్నారు. అప్పుడు అల్లాహ్ వారిని పట్టుకుని తుదిముట్టించాడు. నిశ్ఛయంగా పరిశుద్ధుడైన ఆయన మహా బలశాలి,తనపట్ల అవిశ్వాసమునకు పాల్పడి తన ప్రవక్తను తిరస్కరించే వాడిని కఠినంగా శిక్షించేవాడు.
Tafsiran larabci:
وَلَقَدْ اَرْسَلْنَا مُوْسٰی بِاٰیٰتِنَا وَسُلْطٰنٍ مُّبِیْنٍ ۟ۙ
మరియు నిశ్ఛయంగా మేము మూసా అలైహిస్సలాం ను మా స్పష్టమైన సూచనలతో మరియు ఖచ్చితమైన ఆధారములతో పంపించాము.
Tafsiran larabci:
اِلٰی فِرْعَوْنَ وَهَامٰنَ وَقَارُوْنَ فَقَالُوْا سٰحِرٌ كَذَّابٌ ۟
ఫిర్ఔన్,అతని మంత్రి హామాన్ మరియు ఖారూన్ వద్దకు. అప్పుడు వారు ఇలా పలికారు : మూసా తాను ప్రవక్త అని వాదిస్తున్న విషయంలో మంత్రజాలకుడు,అసత్యవాది.
Tafsiran larabci:
فَلَمَّا جَآءَهُمْ بِالْحَقِّ مِنْ عِنْدِنَا قَالُوا اقْتُلُوْۤا اَبْنَآءَ الَّذِیْنَ اٰمَنُوْا مَعَهٗ وَاسْتَحْیُوْا نِسَآءَهُمْ ؕ— وَمَا كَیْدُ الْكٰفِرِیْنَ اِلَّا فِیْ ضَلٰلٍ ۟
మూసా అలైహిస్సలాం వారి వద్దకు తన నజాయితీపై సూచించే ఆధారాలను తీసుకొచ్చినప్పుడు ఫిర్ఔన్ ఇలా పలికాడు : అతని తో పాటు విశ్వసించిన వారి మగ సంతానమును హతమార్చి వారి ఆడవారిని వారికి అవవమానము కొరకు వదిలివేయండి. విశ్వాసపరుల సంఖ్యా బలమును తగ్గించే ఆదేశముతో అవిశ్వాసపరుల కుట్ర మాత్రం నాశనమయింది,వెళ్ళిపోయింది. దాని ఎటువంటి ప్రభావం లేకపోయింది.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• التذكير بيوم القيامة من أعظم الروادع عن المعاصي.
ప్రళయదినము ద్వారా హితబోధన పాపకార్యముల నుండి గొప్ప మరలింపులో నుండి.

• إحاطة علم الله بأعمال عباده؛ خَفِيَّة كانت أم ظاهرة.
అల్లాహ్ యొక్క జ్ఞానము తన దాసుల కర్మలకు చుట్టుముట్టి యుండటం అవి గోప్యమైనవైన లేదా బహిర్గతమైనవైన.

• الأمر بالسير في الأرض للاتعاظ بحال المشركين الذين أهلكوا.
భూమిలో సంచరించే ఆదేశము నాశనమైన ముష్రికుల స్థితి నుండి హితోపదేశం గ్రహించటానికి.

وَقَالَ فِرْعَوْنُ ذَرُوْنِیْۤ اَقْتُلْ مُوْسٰی وَلْیَدْعُ رَبَّهٗ ۚؕ— اِنِّیْۤ اَخَافُ اَنْ یُّبَدِّلَ دِیْنَكُمْ اَوْ اَنْ یُّظْهِرَ فِی الْاَرْضِ الْفَسَادَ ۟
మరియు ఫిర్ఔన్ ఇలా పలికాడు : మీరు నన్ను వదలండి నేను మూసాను అతనికి శిక్షగా చంపివేస్తాను. మరియు అతడు నా నుండి అతడిని ఆపటానికి తన ప్రభువును పిలుచుకోవాలి. అతను తన ప్రభువును పిలుచుకోవటమును నేను లెక్కచేయను. మీరు ఉన్న ధర్మమును అతడు మార్చి వేస్తాడని లేదా హతమార్చటం మరియు విధ్వంసం చేయటం ద్వారా భూమిలో చెడును వ్యాపింపజేస్తాడని నేను భయపడుతున్నాను.
Tafsiran larabci:
وَقَالَ مُوْسٰۤی اِنِّیْ عُذْتُ بِرَبِّیْ وَرَبِّكُمْ مِّنْ كُلِّ مُتَكَبِّرٍ لَّا یُؤْمِنُ بِیَوْمِ الْحِسَابِ ۟۠
మరియు మూసా అలైహిస్సలాం తన కొరకు ఫిర్ఔన్ బెదిరింపులను తెలుసుకున్నప్పుడు ఇలా పలికారు : సత్యము నుండి మరియు దానిపై విశ్వాసము నుండి అహంకారమును చూపే,ప్రళయదినము పై మరియు అందులో ఉన్న లెక్క తీసుకోవటం మరియు శిక్షంచటం పై విశ్వాసమును కనబరచని ప్రతీ వ్యక్తి నుండి నిశ్ఛయంగా నేను నా ప్రభువు, మీ ప్రభువుని(అల్లాహ్ని) ఆశ్రయించి రక్షణను కోరుతాను.
Tafsiran larabci:
وَقَالَ رَجُلٌ مُّؤْمِنٌ ۖۗ— مِّنْ اٰلِ فِرْعَوْنَ یَكْتُمُ اِیْمَانَهٗۤ اَتَقْتُلُوْنَ رَجُلًا اَنْ یَّقُوْلَ رَبِّیَ اللّٰهُ وَقَدْ جَآءَكُمْ بِالْبَیِّنٰتِ مِنْ رَّبِّكُمْ ؕ— وَاِنْ یَّكُ كَاذِبًا فَعَلَیْهِ كَذِبُهٗ ۚ— وَاِنْ یَّكُ صَادِقًا یُّصِبْكُمْ بَعْضُ الَّذِیْ یَعِدُكُمْ ؕ— اِنَّ اللّٰهَ لَا یَهْدِیْ مَنْ هُوَ مُسْرِفٌ كَذَّابٌ ۟
మరియు ఫిర్ఔన్ వంశము నుండి అల్లాహ్ పై విశ్వాసముంచిన ఒక వ్యక్తి తన విశ్వాసమును తన జాతి వారి నుండి దాచి ఉంచినవాడు మూసా హత్య గురించి వారు చేసుకున్న దృఢ సంకల్పమును విభేదిస్తూ ఇలా పలికాడు : ఏమీ మీరు ఏ పాపము చేయని ఒక వ్యక్తిని నా ప్రభువు అల్లాహ్ అని చెప్పినంత మాత్రాన చంపేస్తారా ?. వాస్తవానికి అతను తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని అతని వాదనలో అతని నిజాయితీ పై సూచించే వాదనలను మరియు ఆధారాలను మీ వద్దకు తీసుకుని వచ్చాడు. ఒక వేళ అతడు అసత్యపరుడని అనుకుంటే అతని అసత్యము యొక్క కీడు అతనిపైనే మరలుతుంది. ఒక వేళ అతడు నిజాయితీపరుడైతే మీకు అతను వాగ్దానం చేసిన శిక్ష నుండి కొంత భాగము తొందరగా మీకు చేరుతుంది. నిశ్ఛయంగా అల్లాహ్ తన హద్దులను అతిక్రమించే వాడిని,తనపై మరియు తన ప్రవక్త పై అబద్దములను అపాదించేవాడికి సత్యము వైపునకు భాగ్యమును కలిగించడు.
Tafsiran larabci:
یٰقَوْمِ لَكُمُ الْمُلْكُ الْیَوْمَ ظٰهِرِیْنَ فِی الْاَرْضِ ؗ— فَمَنْ یَّنْصُرُنَا مِنْ بَاْسِ اللّٰهِ اِنْ جَآءَنَا ؕ— قَالَ فِرْعَوْنُ مَاۤ اُرِیْكُمْ اِلَّا مَاۤ اَرٰی وَمَاۤ اَهْدِیْكُمْ اِلَّا سَبِیْلَ الرَّشَادِ ۟
ఓ నా జాతి వారా ఈ రోజు రాజ్యాధికారం మీదే ,మిసర్ భూ బాగములో విజయమును పొందేవారు మీరే. మూసాను హతమార్చటం వలన మాపై అల్లాహ్ శిక్ష వచ్చిపడితే మాకు సహాయం చేసేవాడు ఎవడు ?!. ఫిర్ఔన్ ఇలా పలికాడు : నాదే నిర్ణయం మరియు నాదే ఆదేశం. మరియు నేను కీడును,చెడును తొలగించటానికి మూసాను హతమార్చదలిచాను. మరియు నేను మిమ్మల్ని మాత్రం సరైన,సముచితమైన మార్గమును మాత్రమే మీకు చూపుతాను.
Tafsiran larabci:
وَقَالَ الَّذِیْۤ اٰمَنَ یٰقَوْمِ اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ مِّثْلَ یَوْمِ الْاَحْزَابِ ۟ۙ
విశ్వసించిన వాడు తన జాతివారిని హితోపదేశం చేస్తూ ఇలా పలికాడు : ఒక వేళ మీరు దుర్మార్గముతో ,శతృత్వముతో మూసా ను హతమారిస్తే మీ పై నేను పూర్వ ప్రవక్తలపై వర్గాలుగా వచ్చిన వర్గముల శిక్ష లాంటి శిక్ష మీ పై వచ్చిపడతుందని నేను భయపడుతున్నాను. అప్పుడు అల్లాహ్ వారిని నాశనం చేశాడు.
Tafsiran larabci:
مِثْلَ دَاْبِ قَوْمِ نُوْحٍ وَّعَادٍ وَّثَمُوْدَ وَالَّذِیْنَ مِنْ بَعْدِهِمْ ؕ— وَمَا اللّٰهُ یُرِیْدُ ظُلْمًا لِّلْعِبَادِ ۟
నూహ్ జాతి ,ఆద్, సమూద్ మరియు వారి తరువాత వచ్చినటువంటివారు ఎవరైతే అవిశ్వశించి ప్రవక్తలను తిరస్కరించిన వారి అలవాటు లాంటిది. నిశ్ఛయంగా అల్లాహ్ వారిని వారి అవిశ్వాసము,తన ప్రవక్తను వారు తిరస్కరించటం వలన తుదిముట్టించాడు. మరియు అల్లాహ్ దాసుల కొరకు హింసను కోరుకోడు. ఆయన మాత్రం వారిని వారి పాపముల వలన శిక్షిస్తాడు. పూర్తి ప్రతిఫలంగా.
Tafsiran larabci:
وَیٰقَوْمِ اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ یَوْمَ التَّنَادِ ۟ۙ
ఓ నా జాతి ప్రజలారా నిశ్చయంగా నేను మీపై ప్రళయదినము గురించి భయపడుతున్నాను. ఆ రోజు ప్రజలు ఒకరినొకరు బంధుత్వం వలన లేదా ఉన్నత స్థానం వలన ఈ వర్గము ఈ భయానక స్థితిలో ప్రయోజనం కలిగిస్తుందని భావించి పిలుస్తారు.
Tafsiran larabci:
یَوْمَ تُوَلُّوْنَ مُدْبِرِیْنَ ۚ— مَا لَكُمْ مِّنَ اللّٰهِ مِنْ عَاصِمٍ ۚ— وَمَنْ یُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ ۟
ఆ రోజు మీరు నరకాగ్ని నుండి భయపడి వెనుతిప్పి పారిపోతారు. అల్లాహ్ శిక్ష నుండి మిమ్మల్ని ఆపేవాడు మీ కొరకు ఎవడూ ఉండడు. మరియు అల్లాహ్ ఎవరినైతే నిస్సహాయ స్థితిలో వదిలివేసి అతనికి విశ్వాసము కొరకు భాగ్యమును కలిగించడో అతడికి సన్మార్గం చూపేవాడు ఎవడూ ఉండడు. ఎందుకంటే సన్మార్గము యొక్క భాగ్యమును కలిగించటం అల్లాహ్ ఒక్కడి చేతిలోనే ఉన్నది.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• لجوء المؤمن إلى ربه ليحميه من كيد أعدائه.
విశ్వాసపరుడు తన శతృవుల కుట్రల నుండి రక్షణ కొరకు తన ప్రభువును ఆశ్రయించడం.

• جواز كتم الإيمان للمصلحة الراجحة أو لدرء المفسدة.
ఉత్తమ ప్రయోజనం కొరకు లేదా చెడును అరికట్టటానికి విశ్వాసమును దాచి ఉంచటం సమ్మతము.

• تقديم النصح للناس من صفات أهل الإيمان.
ప్రజల కొరకు ఉపదేశాలు ఇవ్వటం విశ్వాసపరుల లక్షణం.

وَلَقَدْ جَآءَكُمْ یُوْسُفُ مِنْ قَبْلُ بِالْبَیِّنٰتِ فَمَا زِلْتُمْ فِیْ شَكٍّ مِّمَّا جَآءَكُمْ بِهٖ ؕ— حَتّٰۤی اِذَا هَلَكَ قُلْتُمْ لَنْ یَّبْعَثَ اللّٰهُ مِنْ بَعْدِهٖ رَسُوْلًا ؕ— كَذٰلِكَ یُضِلُّ اللّٰهُ مَنْ هُوَ مُسْرِفٌ مُّرْتَابُ ۟ۚۖ
మరియు నిశ్చయంగా మూసా అలైహిస్సలాం కన్న ముందు యూసుఫ్ అలైహిస్సలాం అల్లాహ్ ఏకత్వముపై స్పష్టమైన ఆధారములను తీసుకుని వచ్చారు. అప్పుడు మీరు ఆయన మీ వద్దకు తీసుకుని వచ్చిన దాని విషయంలో సందేహంలో మరియు తిరస్కరించటంలో పడి ఉన్నారు. చివరికి ఆయన చనిపోయినప్పుడు మీరు సందేహంలో,సంశయంలో అధికమైపోయారు. మరియు మీరు ఇలా పలికారు : అల్లాహ్ అతని తరువాత ఏ ప్రవక్తనూ ఖచ్చితంగా పంపించడు. సత్యము నుండి మీ ఈ పెడద్రోవపడటం లాగే అల్లాహ్ ఎవరైతే అల్లాహ్ హద్దులను అతిక్రమిస్తాడో,ఆయన ఏకత్వం విషయంలో సందేహములో పడుతాడో అతడిని పెడద్రోవపెడతాడు.
Tafsiran larabci:
١لَّذِیْنَ یُجَادِلُوْنَ فِیْۤ اٰیٰتِ اللّٰهِ بِغَیْرِ سُلْطٰنٍ اَتٰىهُمْ ؕ— كَبُرَ مَقْتًا عِنْدَ اللّٰهِ وَعِنْدَ الَّذِیْنَ اٰمَنُوْا ؕ— كَذٰلِكَ یَطْبَعُ اللّٰهُ عَلٰی كُلِّ قَلْبِ مُتَكَبِّرٍ جَبَّارٍ ۟
ఎవరైతే అల్లాహ్ ఆయతుల విషయంలో వాటిని నిర్వీర్యం చేయటానికి తమ వద్దకు వచ్చిన ఎటువంటి వాదన గాని ఆధారంగాని లేకుండా తగువులాడుతారో వారి వాదులాట అల్లాహ్ వద్ద మరియు ఆయనను విశ్వసించిన వారి వద్ద మరియు ఆయన ప్రవక్తల వద్ద ఎంతో అయిష్టమైనది. ఏ విధంగానైతే అల్లాహ్ మా ఆయతుల విషయంలో వాటిని నిర్వీర్యం చేయటానికి వాదులాడిన వారి హృదయములపై సీలు వేశాడో అలాగే ప్రతి సత్యము నుండి అహంకారమును చూపే,దుర్మార్గుని హృదయముపై సీలు వేస్తాడు. అప్పుడు అతను సరైన మార్గమును పొందడు. మరియు మేలు వైపునకు మార్గం పొందడు.
Tafsiran larabci:
وَقَالَ فِرْعَوْنُ یٰهَامٰنُ ابْنِ لِیْ صَرْحًا لَّعَلِّیْۤ اَبْلُغُ الْاَسْبَابَ ۟ۙ
మరియు ఫిర్ఔన్ తన మంత్రి హామాన్ తో ఇలాపలికాడు : ఓ హామాన్ నీవు నా కొరకు ఒక ఎత్తైన నిర్మాణమును నేను మార్గములను పొందుతానని ఆశిస్తూ నిర్మించు.
Tafsiran larabci:
اَسْبَابَ السَّمٰوٰتِ فَاَطَّلِعَ اِلٰۤی اِلٰهِ مُوْسٰی وَاِنِّیْ لَاَظُنُّهٗ كَاذِبًا ؕ— وَكَذٰلِكَ زُیِّنَ لِفِرْعَوْنَ سُوْٓءُ عَمَلِهٖ وَصُدَّ عَنِ السَّبِیْلِ ؕ— وَمَا كَیْدُ فِرْعَوْنَ اِلَّا فِیْ تَبَابٍ ۟۠
నేను వాటికి చేర్చే ఆకాశముల మార్గములను నేను చేరుకుని మూసా యొక్క ఆరాధ్య దైవము ఎవరి గురించైతే సత్య ఆరాధ్య దైవమని అతడు వాదిస్తున్నాడో ఆయనను నేను చూస్తానని ఆశిస్తూ. మరియు నిశ్ఛయంగా మూసా తాను వాదిస్తున్న విషయంలో అసత్యపరుడు. మరియు ఈ విధంగా ఎప్పుడైతే ఫిర్ఔన్ హామాన్ నుండి ఏదైతే కోరాడో అప్పుడు ఫిర్ఔన్ కొరకు అతని దుష్కార్యము మంచిగా అనిపించింది. మరియు అతడు సత్య మార్గము నుండి అపమార్గము వైపునకు మరలించబడ్డాడు. మరియు ఫిర్ఔన్ తాను ఉన్న తన అసత్యమును ఆధిక్యతపరచటానికి మరియు మూసా తీసుకుని వచ్చిన సత్యాన్ని నిర్వీర్యం చేయటానికి చేసిన కుట్ర మాత్రం నష్టంలో పడిపోయింది. ఎందుకంటే అతని వ్యవహారము అతని ప్రయత్నంలో నిరాశకు గురవటం మరియు విఫలమవటం. మరియు ఎన్నటికి అంతం కాని దురదృష్టం.
Tafsiran larabci:
وَقَالَ الَّذِیْۤ اٰمَنَ یٰقَوْمِ اتَّبِعُوْنِ اَهْدِكُمْ سَبِیْلَ الرَّشَادِ ۟ۚ
మరియు ఫిర్ఔన్ వంశములో నుండి విశ్వసించిన వ్యక్తి తన జాతి వారిని ఉపదేశం చేస్తూ మరియు వారిని సత్య మార్గము వైపు మార్గదర్శకం చేస్తూ ఇలా పలికాడు : ఓ నా జాతివారా మీరు నన్ను అనుసరించండి నేను మీకు సరైన మార్గం వైపునకు,సత్యం వైపున కల రుజుమార్గం వైపునకు మార్గనిర్దేశకం చేస్తాను.
Tafsiran larabci:
یٰقَوْمِ اِنَّمَا هٰذِهِ الْحَیٰوةُ الدُّنْیَا مَتَاعٌ ؗ— وَّاِنَّ الْاٰخِرَةَ هِیَ دَارُ الْقَرَارِ ۟
ఓ నా జాతివారా ఈ ఇహలోక జీవితం మాత్రం అంతమైపోయే సుఖభోగాల ద్వారా ప్రయోజనం చెందటమే. అయితే అందులోని తరిగిపోయే సామగ్రి మిమ్మల్ని మోసగించకూడదు. మరియు నిశ్చయంగా అంతముకాని శాశ్వత అనుగ్రహాలు కల పరలోక నివాసము అదే స్థిర నివాసము మరియు నివాసస్థలము. కాబట్టి మీరు దాని కొరకు అల్లాహ్ విధేయత ద్వారా ఆచరించండి. మరియు ఇహలోక జీవితం ద్వారా పరలోక ఆచరణ నుండి నిర్లక్ష్యం వహించటం నుండి జాగ్రత్తపడండి.
Tafsiran larabci:
مَنْ عَمِلَ سَیِّئَةً فَلَا یُجْزٰۤی اِلَّا مِثْلَهَا ۚ— وَمَنْ عَمِلَ صَالِحًا مِّنْ ذَكَرٍ اَوْ اُ وَهُوَ مُؤْمِنٌ فَاُولٰٓىِٕكَ یَدْخُلُوْنَ الْجَنَّةَ یُرْزَقُوْنَ فِیْهَا بِغَیْرِ حِسَابٍ ۟
దుష్కర్మకు పాల్పడిన వాడు అతను చేసిన కర్మ మాదిరిగానే మాత్రమే శిక్షింపబడుతాడు. అతనిపై శిక్షను అధికం చేయటం జరగదు. మరియు అల్లాహ్ ప్రసన్నతను ఆశిస్తూ సత్కర్మ చేసిన వాడికి ఆచరించిన వాడు పురుషుడైన లేదా స్త్రీ అయిన అతడు అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసం కనబరచిన వాడై ఉండాలి. ఈ ప్రశంసదగిన గుణాలను కలిగిన వారందరు ప్రళయదినమున స్వర్గములో ప్రవేశిస్తారు. అల్లాహ్ వారికి అందులో వాగ్దానం చేసిన ఫలాలను,ఎన్నటికి అంతము కాని స్థిరమైన అనుగ్రహాలను లెక్క లేనంతగా ఆహారముగా ప్రసాదిస్తాడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الجدال لإبطال الحق وإحقاق الباطل خصلة ذميمة، وهي من صفات أهل الضلال.
సత్యమును నిర్వీర్యం చేయటానికి మరియు అసత్యమును నిరూపించటానికి చేసే వాదన దూషించదగిన లక్షణం. మరియు అది అపమార్గమునకు లోనైన వారి లక్షణం.

• التكبر مانع من الهداية إلى الحق.
అహంకారము సత్యం వైపునకు మార్గం పొందటం నుండి ఆటంకమును కలిగిస్తుంది.

• إخفاق حيل الكفار ومكرهم لإبطال الحق.
సత్యమును నిర్వీర్యం చేయటం కొరకు చేసిన అవిశ్వాసపరుల కుట్రలను,కుతంత్రాలను విఫలం చేయటం.

• وجوب الاستعداد للآخرة، وعدم الانشغال عنها بالدنيا.
పరలోకము కొరకు ఇహలోకము ద్వారా దాని నుండి నిర్లక్ష్యం వహించకుండా సిద్ధమవటం అనివార్యము.

وَیٰقَوْمِ مَا لِیْۤ اَدْعُوْكُمْ اِلَی النَّجٰوةِ وَتَدْعُوْنَنِیْۤ اِلَی النَّارِ ۟ؕ
ఓ నా జాతి వారా నేను మిమ్మల్ని ఇహలోకజీవితంలో మరియు పరలోకములో నష్టపోవటం నుండి అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేయటం ద్వారా మోక్షం వైపునకు పిలుస్తుంటే మీరు నన్ను అల్లాహ్ పై అవిశ్వాసము,ఆయనకు అవిధేయత చూపటం వైపునకు పిలవటం ద్వారా మీరు నన్ను నరకంలో ప్రవేశము వైపునకు పిలుస్తున్నారేమిటి ?!.
Tafsiran larabci:
تَدْعُوْنَنِیْ لِاَكْفُرَ بِاللّٰهِ وَاُشْرِكَ بِهٖ مَا لَیْسَ لِیْ بِهٖ عِلْمٌ ؗ— وَّاَنَا اَدْعُوْكُمْ اِلَی الْعَزِیْزِ الْغَفَّارِ ۟
నేను అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచాలని,ఆయనతో పాటు ఇతరులను ఎవరి ఆరాధన అల్లాహ్ తో పాటు సరి అన్న జ్ఞానము నాకు లేదో వాటి ఆరాధన నేను చేయాలని ఆశిస్తూ మీరు నన్ను మీ అసత్యం వైపునకు పిలుస్తున్నారు. మరియు ఎవరూ ఓడించలేని సర్వ శక్తిమంతుడైన,తన దాసులపట్ల గొప్ప మన్నించేవాడైన అల్లాహ్ పై విశ్వాసము వైపునకు నేను మిమ్మల్ని పిలుస్తున్నాను.
Tafsiran larabci:
لَا جَرَمَ اَنَّمَا تَدْعُوْنَنِیْۤ اِلَیْهِ لَیْسَ لَهٗ دَعْوَةٌ فِی الدُّنْیَا وَلَا فِی الْاٰخِرَةِ وَاَنَّ مَرَدَّنَاۤ اِلَی اللّٰهِ وَاَنَّ الْمُسْرِفِیْنَ هُمْ اَصْحٰبُ النَّارِ ۟
వాస్తవానికి మీరు నన్ను ఎవరి విశ్వాసము వైపునకు,ఎవరి విధేయత వైపునకు పిలుస్తున్నారో అతని కొరకు ఆరాధన చేయబడటానికి సత్యంతో కూడుకున్న ఎటువంటి ఆరాధన ఇహలోకంలో గాని పరలోకంలో గాని లేదు. మరియు అతడు తనను వేడుకునే వాడి అర్ధనలను స్వీకరించడు. మరియు నిశ్చయంగా మా అందరి మరలటం అల్లాహ్ ఒక్కడి వైపే జరుగుతుంది. మరియు నిశ్ఛయంగా అవిశ్వాసంలో,పాప కార్యముల్లో మితిమీరిపోయినవారే నరక వాసులు. ప్రళయదినమున వారు అందులో ప్రవేశించటమును తప్పనిసరి చేసుకుంటారు.
Tafsiran larabci:
فَسَتَذْكُرُوْنَ مَاۤ اَقُوْلُ لَكُمْ ؕ— وَاُفَوِّضُ اَمْرِیْۤ اِلَی اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ بَصِیْرٌ بِالْعِبَادِ ۟
అప్పుడు వారు ఆయన హితోపదేశములను వదిలివేశారు. అప్పుడు ఆయన ఇలా పలికారు : మీరు తొందరలోనే నేను మీకు చేసిన హితోపదేశములను గుర్తు చేసుకుంటారు. మరియు మీరు వాటిని స్వీకరించకపోవటం పై బాధపడుతారు. మరియు నేను నా వ్యవహారములన్నీ ఒక్కడైన అల్లాహ్ కి అప్పజెప్పుతున్నాను. నిశ్ఛయంగా అల్లాహ్ ఆయన తన దాసుల కర్మల్లోంచి ఏదీ గోప్యంగా ఉండదు.
Tafsiran larabci:
فَوَقٰىهُ اللّٰهُ سَیِّاٰتِ مَا مَكَرُوْا وَحَاقَ بِاٰلِ فِرْعَوْنَ سُوْٓءُ الْعَذَابِ ۟ۚ
అప్పుడు వారు అతన్ని హత్య చేయటమునకు నిర్ణయించుకున్నప్పటి వారి కుట్ర కీడు నుండి అల్లాహ్ అతన్ని రక్షించాడు. మరియు ఫిర్ఔన్ వంశమునకు మునిగిపోయే శిక్ష చుట్టుముట్టింది. నిశ్చయంగా అల్లాహ్ ఇహలోకములో అతడిని మరియు అతని పూర్తి సైన్యమును ముంచివేశాడు.
Tafsiran larabci:
اَلنَّارُ یُعْرَضُوْنَ عَلَیْهَا غُدُوًّا وَّعَشِیًّا ۚ— وَیَوْمَ تَقُوْمُ السَّاعَةُ ۫— اَدْخِلُوْۤا اٰلَ فِرْعَوْنَ اَشَدَّ الْعَذَابِ ۟
వారి మరణం తరువాత వారు వారి సమాదులలో దినము మొదటి వేళలో మరియు దాని చివరి వేళలో నరకాగ్నిపై ప్రవేశపెట్టబడుతారు. మరియు ప్రళయదినమున ఇలా అనబడుతుంది : ఫిర్ఔన్ ను అనుసరించేవారిని వారు పాల్పడిన అవిశ్వాసము,తిరస్కారము మరియు అల్లాహ్ మార్గము నుండి ఆపటం వలన తీవ్రమైన మరియు పెద్దదైన శిక్షలో ప్రవేశింపజేయండి.
Tafsiran larabci:
وَاِذْ یَتَحَآجُّوْنَ فِی النَّارِ فَیَقُوْلُ الضُّعَفٰٓؤُا لِلَّذِیْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ اَنْتُمْ مُّغْنُوْنَ عَنَّا نَصِیْبًا مِّنَ النَّارِ ۟
ఓ ప్రవక్త నరకవాసుల్లోంచి అనుసరించేవారు మరియు అనుసరించబడేవారు వాదులాడుతున్నప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు బలహీనులుగా పరిగణించబడే అనుసరించేవారు గర్వించే అనుసరించబడేవారితో ఇలా పలుకుతారు : నిశ్ఛయంగా మేము ఇహలోకంలో మిమ్మల్ని అపమార్గము విషయంలో అనుసరించేవారముగా ఉన్నాము. ఏమీ మీరు అల్లాహ్ శిక్ష నుండి కొంత భాగమును తీసుకుని మోసి మా నుండి తొలగించగలరా ?!.
Tafsiran larabci:
قَالَ الَّذِیْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا كُلٌّ فِیْهَاۤ اِنَّ اللّٰهَ قَدْ حَكَمَ بَیْنَ الْعِبَادِ ۟
దురహంకారములో మునిగి ఉన్న అనుసరించబడేవారు ఇలా పలుకుతారు : నిశ్చయంగా మేము అనుసరించే వారమైన లేదా అనుసరించబడే వారమైన నరకాగ్నిలో సమానము. మాలో నుండి ఎవరూ ఇంకొకరి శిక్ష నుండి ఎటువంటి భాగమును మోయరు. నిశ్చయంగా అల్లాహ్ దాసుల మధ్య తీర్పునిచ్చాడు. ఆయన ప్రతి ఒక్కరికి వారి హక్కు అయిన శిక్షను ప్రసాదించాడు.
Tafsiran larabci:
وَقَالَ الَّذِیْنَ فِی النَّارِ لِخَزَنَةِ جَهَنَّمَ ادْعُوْا رَبَّكُمْ یُخَفِّفْ عَنَّا یَوْمًا مِّنَ الْعَذَابِ ۟
మరియు అనుసరించే మరియు అనుసరించబడేవారిలో నుంచి నరకంలో శిక్షింపబడేవారు తౌబా చేసుకోవటం కొరకు నరకము నుండి బయటకు వచ్చి ఇహలోకమువైపునకు మరలటం నుండి నిరాశ్యులైనప్పుడు నరకాగ్ని యొక్క బాధ్యత వహించే దైవదూతలతో ఇలా పలుకుతారు : మీరు ఈ శాశ్వత శిక్ష నుండి ఒక్క రోజు శిక్షను మా నుండి తేలిక చేయమని మీ ప్రభువుతో వేడుకోండి.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• أهمية التوكل على الله.
అల్లాహ్ పై నమ్మకము యొక్క ప్రాముఖ్యత.

• نجاة الداعي إلى الحق من مكر أعدائه.
సందేశ ప్రచారకునికి తన శతృవుల కుట్ర నుండి సత్యం వైపునకు విముక్తి.

• ثبوت عذاب البرزخ.
బర్జఖ్ శిక్ష యొక్క నిరూపణ.

• تعلّق الكافرين بأي سبب يريحهم من النار ولو لمدة محدودة، وهذا لن يحصل أبدًا.
అవిశ్వాసపరుల సంబంధము ఏదైన కారణం వారికి నరకాగ్ని నుండి విశ్రాంతి కలిగించేది అది కూడ ఒక నిర్ణీత గడువు కొరకు . ఇది ఎన్నటికి జరగనిది.

قَالُوْۤا اَوَلَمْ تَكُ تَاْتِیْكُمْ رُسُلُكُمْ بِالْبَیِّنٰتِ ؕ— قَالُوْا بَلٰی ؕ— قَالُوْا فَادْعُوْا ۚ— وَمَا دُعٰٓؤُا الْكٰفِرِیْنَ اِلَّا فِیْ ضَلٰلٍ ۟۠
నరకము యొక్క సంరక్షకులు అవిశ్వాసపరులను ఖండిస్తూ ఇలా పలుకుతారు : ఏమీ మీ వద్దకు మీ ప్రవక్తలు స్పష్టమైన ఆధారములను మరియు సూచనలను తీసుకుని రాలేదా ?!. అప్పుడు అవిశ్వాసపరులు ఎందుకు కాదు వారు మా వద్దకు స్పష్టమైన ఆధారములను మరియు వాదనలను తీసుకుని వచ్చారు. పరిరక్షకులు వారిపై వ్యంగ్యంగా ఇలా పలికారు : అయితే మీరే వేడుకోండి. మేము మాత్రం అవిశ్వాసపరుల కొరకు సిఫారసు చేయము. మరియు అవిశ్వాసపరుల దుఆ మాత్రం వారి అవిశ్వాసం కారణం చేత స్వీకరించకపోవటం వలన నిర్వీర్యం మరియు వృధా అయింది.
Tafsiran larabci:
اِنَّا لَنَنْصُرُ رُسُلَنَا وَالَّذِیْنَ اٰمَنُوْا فِی الْحَیٰوةِ الدُّنْیَا وَیَوْمَ یَقُوْمُ الْاَشْهَادُ ۟ۙ
నిశ్చయంగా మేము మా ప్రవక్తలను మరియు అల్లాహ్ ను ఆయన ప్రవక్తలను విశ్వసించినవారిని ఇహలోకంలో వారి వాదనలకు ఆధిక్యతను కలిగించి మరియు వారి శతృవులకు వ్యతిరేకంగా వారికి తోడ్పాటును కలిగించి సహాయపడుతాము. మరియు మేము వారికి ప్రళయదినమున వారిని స్వర్గంలో ప్రవేశింపజేసి ఇహలోకములో వారి ప్రత్యర్దులైన వారిని ఇహలోకంలో శిక్షించి మరియు దైవప్రవక్తలు, దైవదూతలు మరియు విశ్వాసపరులు సందేశప్రచారము,జాతులవారి తిరస్కారముపై సాక్ష్యం పలికిన తరువాత నరకములో ప్రవేశింపజేసి సహాయపడుతాము.
Tafsiran larabci:
یَوْمَ لَا یَنْفَعُ الظّٰلِمِیْنَ مَعْذِرَتُهُمْ وَلَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوْٓءُ الدَّارِ ۟
ఆ రోజు అవిశ్వాసము మరియు పాపకార్యముల ద్వారా తమ స్వయం పై హింసకు పాల్పడిన వారికి వారి హింస నుండి వారి క్షమాపణ ప్రయోజనం కలిగించదు. ఆ రోజున వారికి అల్లాహ్ కారుణ్యము నుండి గెంటివేయటం జరుగుతుంది. మరియు వారి కొరకు వారు పొందే బాధాకరమైన శిక్ష ద్వారా పరలోకములో చెడ్డ నివాసము కలదు.
Tafsiran larabci:
وَلَقَدْ اٰتَیْنَا مُوْسَی الْهُدٰی وَاَوْرَثْنَا بَنِیْۤ اِسْرَآءِیْلَ الْكِتٰبَ ۟ۙ
మరియు నిశ్చయంగా మేము మూసా అలైహిస్సలాంకు జ్ఞానమును ప్రసాదించాము దాని ద్వారా ఇస్రాయీల్ సంతతి వారు సత్యము వైపునకు మార్గమును పొందుతారు. మరియు మేము తౌరాత్ ను ఇస్రాయీల్ సంతతి వారిలో వాస్తవ పుస్తకంగా చేశాము ఒక తరం తరువాత ఒక తరం వారు దానికి వారసులవుతారు.
Tafsiran larabci:
هُدًی وَّذِكْرٰی لِاُولِی الْاَلْبَابِ ۟
సరైన బుద్ధులు కల వారి కొరకు సత్య మార్గము వైపునకు మార్గదర్శకత్వంగా మరియు హితోపదేశంగా.
Tafsiran larabci:
فَاصْبِرْ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّاسْتَغْفِرْ لِذَنْۢبِكَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ بِالْعَشِیِّ وَالْاِبْكَارِ ۟
ఓ ప్రవక్త మీరు మీ జాతి వారి తిరస్కారము మరియు వారి బాధ పెట్టటం నుండి మీరు పొందిన దానిపై సహనం చూపండి. నిశ్చయంగా మీ కొరకు సహాయము మరియు తోడ్పాటు ద్వారా అల్లాహ్ వాగ్దానము సత్యము,అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మీరు మీ పాపముల కొరకు మన్నింపును వేడుకోండి. మరియు మీరు దినము మొదటి వేళలో,దాని చివరి వేళలో మీ ప్రభువు యొక్క స్థుతులతో పరిశుద్ధతను కొనియాడండి.
Tafsiran larabci:
اِنَّ الَّذِیْنَ یُجَادِلُوْنَ فِیْۤ اٰیٰتِ اللّٰهِ بِغَیْرِ سُلْطٰنٍ اَتٰىهُمْ ۙ— اِنْ فِیْ صُدُوْرِهِمْ اِلَّا كِبْرٌ مَّا هُمْ بِبَالِغِیْهِ ۚ— فَاسْتَعِذْ بِاللّٰهِ ؕ— اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْبَصِیْرُ ۟
నిశ్ఛయంగా ఎవరైతే అల్లాహ్ ఆయతుల విషయంలో వాటిని నిర్వీర్యం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఎటువంటి వాదన మరియు ఆధారం లేకుండా వాదులాడుతున్నారో వారికి దానిపై ప్రేరేపిస్తున్నది మాత్రం సత్యంపై గర్వము అహంకారము. వారు కోరుకుంటున్న దాని పై గర్వమునకు వారు చేరుకోరంటే చేరుకోరు. ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ ను (మార్గంను) గట్టిగా పట్టుకోండి. నిశ్చయంగా ఆయన తన దాసుల మాటలను వినేవాడు మరియు వారి కర్మలను వీక్షించేవాడు. వాటిలో నుండి ఏదీ ఆయన నుండి తప్పిపోదు. మరియు ఆయన వారికి వాటిపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Tafsiran larabci:
لَخَلْقُ السَّمٰوٰتِ وَالْاَرْضِ اَكْبَرُ مِنْ خَلْقِ النَّاسِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟
ఆకాశములను మరియు భూమిని వాటి పరిమాణం వలన మరియు వాటి వెడల్పు వలన సృష్టించటం ప్రజలను సృష్టించటం కన్న ఎంతో గొప్ప విషయం. మరియు ఎవరైతే అవి పెద్దవిగా ఉండినా కూడా సృష్టించాడో మృతులను వారి సమాదుల నుండి వారి లెక్క తీసుకుని వారికి ప్రతిఫలమును ప్రసాదించటానికి జీవింపజేసి మరల లేపటంపై సామర్ధ్యమును కలవాడు. కానీ చాలా మంది ప్రజలకి తెలియదు. దాని నుండి వారు గుణపాఠం నేర్చుకోవటం లేదు. మరియు అది స్పష్టమైనా కూడా దాన్ని వారు మరణాంతరం లేపబడటంపై ఆధారంగా చేసుకోవటంలేదు.
Tafsiran larabci:
وَمَا یَسْتَوِی الْاَعْمٰی وَالْبَصِیْرُ ۙ۬— وَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَلَا الْمُسِیْٓءُ ؕ— قَلِیْلًا مَّا تَتَذَكَّرُوْنَ ۟
మరియు ఎవరైతే చూడలేడో, ఎవరైతే చూడగలడో ఇద్దరు సమానులు కారు. మరియు ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కలిగి ఉండి, ఆయన ప్రవక్తను నిజమని నమ్మి, తమ కర్మలను మంచిగా చేస్తారో వారు మరియు వారితో పాటు ఎవరి ఆచరణ అయితే దురవిశ్వాసము,పాపకార్యముల వలన చెడుగా ఉంటుందో సమానులు కారు. మీరు మాత్రం చాలా తక్కువ హితోపదేశం గ్రహిస్తారు. ఒక వేళ మీరు హితోపదేశం గ్రహిస్తే మీరు రెండు వర్గముల మధ్య వ్యత్త్యాసమును తెలుసుకుని మీరు ఎవరైతే విశ్వసించి అల్లాహ్ మన్నతను ఆశిస్తూ సత్కర్మలు చేస్తారో వారిలో నుండి అయిపోవటానికి ప్రయత్నిస్తారు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• نصر الله لرسله وللمؤمنين سُنَّة إلهية ثابتة.
అల్లాహ్ యొక్క సహాయము తన ప్రవక్త కొరకు మరియు విశ్వాసపరుల కొరకు దైవ సంప్రదాయము నిరూపితమైనది.

• اعتذار الظالم يوم القيامة لا ينفعه.
ప్రళయదినమున దుర్మార్గుడు క్షమాపణ కోరటం అతనికి ప్రయోజనం కలిగంచదు.

• أهمية الصبر في مواجهة الباطل.
అసత్యమును ఎదుర్కోవటంలో సహనం చూపటం యొక్క ప్రాముఖ్యత.

• دلالة خلق السماوات والأرض على البعث؛ لأن من خلق ما هو عظيم قادر على إعادة الحياة إلى ما دونه.
ఆకాశములను మరియు భూమిని సృష్టించటం మరణాంతరం లేపబడటం పై ఒక సూచన. ఎందుకంటే ఎవరైతే గొప్పదైన దాన్ని సృష్టిస్తాడో వేరే వాటికి జీవనమును మరలించటం పై సామర్ధ్యం కలవాడు.

اِنَّ السَّاعَةَ لَاٰتِیَةٌ لَّا رَیْبَ فِیْهَا ؗ— وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یُؤْمِنُوْنَ ۟
నిశ్చయంగా ప్రళయము దేనిలోనైతే అల్లాహ్ మృతులను లెక్కతీసుకుని ప్రతిఫలం ప్రసాదించటానికి మరల లేపుతాడో ఖచ్ఛితంగా వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాని చాలా మంది ప్రజలు దాని రావటంపై విశ్వసించటంలేదు. అందుకనే వారు దాని కొరకు సిద్ధం చేసుకోవటంలేదు.
Tafsiran larabci:
وَقَالَ رَبُّكُمُ ادْعُوْنِیْۤ اَسْتَجِبْ لَكُمْ ؕ— اِنَّ الَّذِیْنَ یَسْتَكْبِرُوْنَ عَنْ عِبَادَتِیْ سَیَدْخُلُوْنَ جَهَنَّمَ دٰخِرِیْنَ ۟۠
మరియు మీ ప్రభువు ఇలా పలికాడు : ఓ ప్రజలారా మీరు ఆరాధనలో మరియు అర్ధించటంలో నా ఒక్కడినే ప్రత్యేకించుకోండి. నేను మీ అర్ధనను స్వీకరించి, మీ నుండి మన్నించివేస్తాను మరియు మీపై కరుణిస్తాను. నిశ్చయంగా ఎవరైతే ఆరాధనను నా ఒక్కడికే ప్రత్యేకించటం నుండి అహంకారమును చూపుతారో వారు తొందరలోనే ప్రళయదినమున దిగజారి,అవమానమునకు గురై నరకములో ప్రవేశిస్తారు.
Tafsiran larabci:
اَللّٰهُ الَّذِیْ جَعَلَ لَكُمُ الَّیْلَ لِتَسْكُنُوْا فِیْهِ وَالنَّهَارَ مُبْصِرًا ؕ— اِنَّ اللّٰهَ لَذُوْ فَضْلٍ عَلَی النَّاسِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَشْكُرُوْنَ ۟
అల్లాహ్ యే మీ కొరకు రాత్రిని మీరు అందులో నివాసముండి విశ్రాంతి తీసుకోవటానికి చీకటిగా చేశాడు. మరియు పగలును అందులో మీరు పనులు చేసుకోవటానికి కాంతివంతంగా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రజలపట్ల ఎంతో పెద్ద అనుగ్రహుడు అప్పుడే ఆయన వారిపై తన బాహ్యపరమైన మరియు అంతరపరమైన అనుగ్రహములను కురిపించాడు. కానీ చాలా మంది ప్రజలు పరిశుద్ధుడైన ఆయనకు ఆయన అనుగ్రహించిన వాటిపై కృతజ్ఞతలు తెలుపుకోరు.
Tafsiran larabci:
ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ خَالِقُ كُلِّ شَیْءٍ ۘ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؗ— فَاَنّٰی تُؤْفَكُوْنَ ۟
మీ పై తన అనుగ్రహములను కలిగించిన వాడు ఆయనే అల్లాహ్ . ఆయన ప్రతీది సృష్టించినవాడు. ఆయన తప్ప వేరే సృష్టికర్త లేడు. ఆయన తప్ప వాస్తవ ఆరాధ్య దైవం లేడు. అటువంటప్పుడు మీరు ఆయన ఆరాధన నుండి ఏ విధమైన లాభమునకు మరియు నష్టమునకు అధికారము లేని ఇతరుల ఆరాధన వైపునకు ఎలా మరలిపోతున్నారు.
Tafsiran larabci:
كَذٰلِكَ یُؤْفَكُ الَّذِیْنَ كَانُوْا بِاٰیٰتِ اللّٰهِ یَجْحَدُوْنَ ۟
వీరందరు అల్లాహ్ పై విశ్వాసము నుండి మరియు ఆయన ఒక్కడి ఆరాధన నుండి మరలిపోయినట్లే ప్రతీ కాలములో ప్రతీ చోట అల్లాహ్ తౌహీద్ పై సూచించే ఆయతులను నిరాకరించేవారు దాని నుండి మరలిపోతారు. వారు సత్యం వైపునకు మార్గం పొందరు. వారికి సన్మార్గము కొరకు సౌభాగ్యం కలిగించబడదు.
Tafsiran larabci:
اَللّٰهُ الَّذِیْ جَعَلَ لَكُمُ الْاَرْضَ قَرَارًا وَّالسَّمَآءَ بِنَآءً وَّصَوَّرَكُمْ فَاَحْسَنَ صُوَرَكُمْ وَرَزَقَكُمْ مِّنَ الطَّیِّبٰتِ ؕ— ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ ۖۚ— فَتَبٰرَكَ اللّٰهُ رَبُّ الْعٰلَمِیْنَ ۟
ఓ ప్రజలారా అల్లాహ్ యే మీ కొరకు భూమిని మీరు దానిపై నివాసముండటానికి నివాసస్థలంగా సిద్ధం చేసి ఉంచాడు. మరియు ఆయన ఆకాశమును మీ పై పడిపోవటం నుండి ఆగిపోయినట్లుగా పటిష్టమైవ కట్టడంగా చేశాడు. మరియు మీ తల్లుల గర్భములలో మీకు రూపమునిచ్చి మీ రూపములను ఎంతో చక్కగా తీర్చిదిద్దాడు. మరియు ఆయన మీకు ధర్మ సమ్మతమైన ఆహారోపాధిని, వాటిలో శ్రేష్ఠమైనవి ప్రసాదించాడు. మీపై ఈ అనుగ్రహములను అనుగ్రహించిన వాడే అల్లాహ్ మీ ప్రభువు. కావున సృష్టితాలన్నింటి ప్రభువైన అల్లాహ్ శుభధాయకుడు. పరిశుద్ధుడైన ఆయన తప్ప ఇంకొకరు వారి కొరకు ప్రభువు లేడు.
Tafsiran larabci:
هُوَ الْحَیُّ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ فَادْعُوْهُ مُخْلِصِیْنَ لَهُ الدِّیْنَ ؕ— اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِیْنَ ۟
ఆయన మరణించని సజీవుడు. ఆయన తప్ప ఇంకొకరు వాస్తవ ఆరాధ్యుడు లేడు. కావున మీరు ఆయనను ఆరాధన మరియు అర్ధన యొక్క వేడుకోవటమును ఆయన ఒక్కడి మన్నతను ఉద్ధేశించుకుని వేడుకోండి. మరియు మీరు ఆయనతో పాటు ఆయన సృష్టితాల్లోంచి ఇతరులను సాటి కల్పించకండి. పొగడ్తలన్నీ సృష్టితాల ప్రభువైన అల్లాహ్ కొరకే చెందుతాయి.
Tafsiran larabci:
قُلْ اِنِّیْ نُهِیْتُ اَنْ اَعْبُدَ الَّذِیْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ لَمَّا جَآءَنِیَ الْبَیِّنٰتُ مِنْ رَّبِّیْ ؗ— وَاُمِرْتُ اَنْ اُسْلِمَ لِرَبِّ الْعٰلَمِیْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేని మరియు ఎటువంటి నష్టం కలిగించని మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న ఈ విగ్రహాలను నేను ఆరాధించటం నుండి ఎప్పుడైతే వాటి ఆరాధన చేయటం అసత్యమని సూచించే స్పష్టమైన ఆధారాలు నా వద్దకు వచ్చాయో నిశ్చయంగా అల్లాహ్ నన్ను వారించాడు. మరియు అల్లాహ్ ఆయన ఒక్కడికే విధేయత చూపుతూ ఆరాధన చేయమని నన్ను ఆదేశించాడు. ఆయనే సృష్టిరాసులన్నింటికి ప్రభువు. ఆయన తప్ప ఇంకెవరూ వారికి ప్రభువు లేడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• دخول الدعاء في مفهوم العبادة التي لا تصرف إلا إلى الله؛ لأن الدعاء هو عين العبادة.
దుఆ యొక్క ప్రవేశము ఆ ఆరాధన అర్ధములో ఉన్నది దేనినైతే కేవలం అల్లాహ్ కు మాత్రమే చేయబడుతుంది. ఎందుకంటే దుఆ యే ఆరాధన యొక్క అసలు.

• نعم الله تقتضي من العباد الشكر.
అల్లాహ్ అనుగ్రహములు దాసుల నుండి కృతజ్ఞతలను అనివార్యం చేస్తుంది.

• ثبوت صفة الحياة لله.
అల్లాహ్ కొరకు జీవము యొక్క గుణము నిరూపణ.

• أهمية الإخلاص في العمل.
ఆచరణలో చిత్తశుద్ధి యొక్క ప్రాముఖ్యత.

هُوَ الَّذِیْ خَلَقَكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ یُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوْۤا اَشُدَّكُمْ ثُمَّ لِتَكُوْنُوْا شُیُوْخًا ۚ— وَمِنْكُمْ مَّنْ یُّتَوَفّٰی مِنْ قَبْلُ وَلِتَبْلُغُوْۤا اَجَلًا مُّسَمًّی وَّلَعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟
ఆయనే మీ తండ్రి అయిన ఆదమ్ ను మట్టితో సృష్టించాడు. మరల ఆయన మిమ్మల్ని దాని తరువాత వీర్యబిందువుతో ఆ పిదప వీర్య బిందువు తరువాత రక్తపు గడ్డతో మిమ్మల్ని సృష్టించాడు. దాని తరువాత ఆయన మిమ్మల్ని మీ తల్లుల గర్భముల నుండి చిన్న పిల్లలుగా వెలికి తీస్తాడు. ఆ తరువాత మీరు దృఢమైన శరీరములు కల వయసుకు చేరుకుని ఆ తరువాత మీరు పెద్దవారై వృద్ధులయ్యే వరకు (మిమ్మల్ని పెంచుతాడు). మరియు మీలో నుండి కొందరు దాని కన్న ముందే చనిపోయేవారున్నారు. మరియు (ఆయన మిమ్మల్ని వదిలేస్తాడు) మీరు అల్లాహ్ జ్ఞానంలో నిర్ణీత కాలమునకు చేరుకోవటానికి. మీరు దాని నుండి తగ్గించలేరు. మరియు మీరు దానికన్న పెంచలేరు. మరియు బహుశ మీరు ఆయన సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై సూచించే ఈ వాదనలు,ఆధారల ద్వారా ప్రయోజనం చెందుతారని.
Tafsiran larabci:
هُوَ الَّذِیْ یُحْیٖ وَیُمِیْتُ ۚ— فَاِذَا قَضٰۤی اَمْرًا فَاِنَّمَا یَقُوْلُ لَهٗ كُنْ فَیَكُوْنُ ۟۠
పరిశుద్ధుడైన ఆయన ఒక్కడి చేతిలోనే జీవితాన్ని ప్రసాదించటం కలదు. మరియు ఆయన ఒక్కడి చేతిలోనే మరణాన్ని కలిగించటం కలదు. ఆయన ఏదైన చేయదలచుకున్నప్పుడు దాన్ని ఇలా అంటాడు (కున్) నీవు అయిపో. అప్పుడు అది అయిపోతుంది.
Tafsiran larabci:
اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ یُجَادِلُوْنَ فِیْۤ اٰیٰتِ اللّٰهِ ؕ— اَنّٰی یُصْرَفُوْنَ ۟ۙۛ
ఓ ప్రవక్తా అల్లాహ్ ఆయతుల విషయంలో అవి స్పష్టమైన తరువాత కూడా వాటిని తిరస్కరిస్తూ వాదులాడే వారిని మీరు చూడలేదా ?. (ఒక వేళ మీరు చూస్తే) వారి స్థితి నుండి మీరు ఆశ్ఛర్యపోతారు. వాస్తవానికి వారు సత్యము నుండి అది స్పష్టమైనా కూడా వారు విముఖత చూపుతున్నారు.
Tafsiran larabci:
الَّذِیْنَ كَذَّبُوْا بِالْكِتٰبِ وَبِمَاۤ اَرْسَلْنَا بِهٖ رُسُلَنَا ۛ۫— فَسَوْفَ یَعْلَمُوْنَ ۟ۙ
వారే ఖుర్ఆన్ ను మరియు మేము మా ప్రవక్తలకు ఇచ్చి పంపించిన సత్యమును తిరస్కరించారు. ఈ తిరస్కరించే వారందరు తమ తిరస్కార పరిణామును తొందరలోనే తెలుసుకుంటారు. మరియు వారు చెడ్డ ముగింపును చూస్తారు.
Tafsiran larabci:
اِذِ الْاَغْلٰلُ فِیْۤ اَعْنَاقِهِمْ وَالسَّلٰسِلُ ؕ— یُسْحَبُوْنَ ۟ۙ
వారు దాని పరిణామమును తెలుసుకుంటారు అప్పుడు వారి మెడలలో బేడీలు మరియు వారి కాళ్ళలో సంకెళ్ళు ఉంటాయి. వారిని శిక్ష భటులు ఈడ్చుతుంటారు.
Tafsiran larabci:
فِی الْحَمِیْمِ ۙ۬— ثُمَّ فِی النَّارِ یُسْجَرُوْنَ ۟ۚ
వారు వారిని తీవ్రమైన వేడి గల నీళ్ళలోకి ఈడ్చుతారు. ఆ తరువాత వారు నరకాగ్నిలో కాల్చబడుతారు.
Tafsiran larabci:
ثُمَّ قِیْلَ لَهُمْ اَیْنَ مَا كُنْتُمْ تُشْرِكُوْنَ ۟ۙ
ఆ తరువాత వారికి చివాట్లు పెడుతూ మరియు మందలిస్తూ ఇలా పలకబడింది : మీరు ఆరోపించిన దైైవుములు ఏరి వేటి ఆరాధన చేయటం ద్వారా మీరు సాటి కల్పించినారో?.
Tafsiran larabci:
مِنْ دُوْنِ اللّٰهِ ؕ— قَالُوْا ضَلُّوْا عَنَّا بَلْ لَّمْ نَكُنْ نَّدْعُوْا مِنْ قَبْلُ شَیْـًٔا ؕ— كَذٰلِكَ یُضِلُّ اللّٰهُ الْكٰفِرِیْنَ ۟
అల్లాహ్ ను వదిలి ఏ విధమైన ప్రయోజనం కలిగించని మరియు నష్టం కలిగించనివైన మీ విగ్రహాలు ఏవి ?!. అవిశ్వాసపరులు ఇలా పలికారు : వారు మా నుండి అదృశ్యమైపోయారు మేము వారిని చూడలేక పోతున్నాము. అంతే కాదు మేము ఆరాధనకు యోగ్యత కలది దేనిని మేము ఆరాధించేవారము కాము. వీరందరిని అపమార్గమునకు లోను చేసినట్లే అల్లాహ్ అవిశ్వాసపరులను సత్యం నుండి ప్రతీ కాలములో,ప్రతీ చోటా అపమార్గమునకు లోను చేస్తాడు.
Tafsiran larabci:
ذٰلِكُمْ بِمَا كُنْتُمْ تَفْرَحُوْنَ فِی الْاَرْضِ بِغَیْرِ الْحَقِّ وَبِمَا كُنْتُمْ تَمْرَحُوْنَ ۟ۚ
మరియు వారితో ఇలా పలకబడుతుంది : మీరు అనుభవిస్తున్న ఈ శిక్ష మీరు దేనిపైనైతే ఉన్నారో షిర్కుతో మీ సంతోషము వలన మరియు మీ సంతోషమును విస్తరింపజేయటం వలన.
Tafsiran larabci:
اُدْخُلُوْۤا اَبْوَابَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَا ۚ— فَبِئْسَ مَثْوَی الْمُتَكَبِّرِیْنَ ۟
మీరు నరక ద్వారముల్లో దానిలో శాశ్వతంగా ఉండుటకు ప్రవేశించండి. సత్యము నుండి అహంకారము చూపేవారి నివాసము ఎంతో చెడ్డది.
Tafsiran larabci:
فَاصْبِرْ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ ۚ— فَاِمَّا نُرِیَنَّكَ بَعْضَ الَّذِیْ نَعِدُهُمْ اَوْ نَتَوَفَّیَنَّكَ فَاِلَیْنَا یُرْجَعُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు మీ జాతివారు బాధించిన దానిపై మరియు వారి తిరస్కారముపై సహనం చూపండి. నిశ్చయంగా మీకు సహాయం చేసే అల్లాహ్ వాగ్దానం సత్యము అందులో ఎటువంటి సందేహం లేదు. ఏ విధంగానైతే బదర్ దినమున సంభవించినదో అలా మీరు జీవించి ఉన్నప్పుడే వారికి మేము వాగ్దానం చేసిన శిక్ష లో నుండి కొంత భాగమును మీకు చూపించినా లేదా దాని కన్న ముందు మేము మీకు మరణమును కలిగించినా వారు ప్రళయదినమున మా ఒక్కరి వైపునకే మరలుతారు. అప్పుడు మేము వారికి వారి కర్మలపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాము. అప్పుడు మేము వారందరిని నరకములో శాశ్వతంగా ఉండేవిధంగా ప్రవేశింపజేస్తాము.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• التدرج في الخلق سُنَّة إلهية يتعلم منها الناس التدرج في حياتهم.
సృష్టిలో సోపానక్రమము దైవిక సంప్రదాయము దాని నుండి ప్రజలు తమ జీవితములో సోపానక్రమమును నేర్చుకుంటారు.

• قبح الفرح بالباطل.
అసత్యము పట్ల ఆనందము యొక్క చెడ్డతనం.

• أهمية الصبر في حياة الناس، وبخاصة الدعاة منهم.
ప్రజల జీవితాలలో సహనం యొక్క ప్రాముఖ్యత,ముఖ్యంగా వారిలో నుండి సందేశ ప్రచారకుల.

وَلَقَدْ اَرْسَلْنَا رُسُلًا مِّنْ قَبْلِكَ مِنْهُمْ مَّنْ قَصَصْنَا عَلَیْكَ وَمِنْهُمْ مَّنْ لَّمْ نَقْصُصْ عَلَیْكَ ؕ— وَمَا كَانَ لِرَسُوْلٍ اَنْ یَّاْتِیَ بِاٰیَةٍ اِلَّا بِاِذْنِ اللّٰهِ ۚ— فَاِذَا جَآءَ اَمْرُ اللّٰهِ قُضِیَ بِالْحَقِّ وَخَسِرَ هُنَالِكَ الْمُبْطِلُوْنَ ۟۠
మరియు నిశ్ఛయంగా మేము ఓ ప్రవక్తా మీ కన్న ముందు చాలా ప్రవక్తలను వారి జాతుల వద్దకు పంపించాము. అప్పుడు వారు వారిని తిరస్కరించారు మరియు వారికి బాధలు పెట్టారు. అప్పుడు వారు వారి తిస్కారముపై మరియు వారి బాధించటంపై సహనం చూపారు. ఈ ప్రవక్తలందరిలో నుంచి కొందరి సమాచారమును మేము మీకు వివరించి తెలియపరచాము. మరియు వారిలో నుంచి కొందరి సమాచారమును మేము మీకు తెలియపరచలేదు. మరియు ఏ ప్రవక్తకి తన జాతి వారి వద్దకు తన ప్రభువు వద్ద నుండి ఎటువంటి సూచనను పరిశుద్ధుడైన ఆయన ఇచ్ఛతో తప్ప తీసుకుని రావటం సరికాదు. కావున అవిశ్వాసపరులు తమ సమాజాలపై సూచనలను తీసుకుని రమ్మని సూచించటం అన్యాయము. అయితే విజయం లేదా ప్రవక్తలకు వారి జాతుల వారి మధ్య తీర్పు ద్వారా అల్లాహ్ ఆదేశము వచ్చినప్పుడు వారి మధ్య న్యాయపూరితంగా తీర్పు జరుగును. అప్పుడు అవిశ్వాసపరులు నాశనం చేయబడుతారు. మరియు ప్రవక్తలకు విముక్తి కలిగించబడును. మరియు దాసుల మధ్య తిర్పుఇవ్వబడే ఆ పరిస్థితులలో అసత్యపరులు తమ అవిశ్వాసం వలన వినాశన స్థానమునకు చేరుకోవటం వలన తమ స్వయానికి నష్టం కలిగించుకుంటారు.
Tafsiran larabci:
اَللّٰهُ الَّذِیْ جَعَلَ لَكُمُ الْاَنْعَامَ لِتَرْكَبُوْا مِنْهَا وَمِنْهَا تَاْكُلُوْنَ ۟ؗ
అల్లాహ్ యే మీ కొరకు ఒంటెలను,ఆవులను,మేకలను వాటిలో నుండి కొన్నింటిపై మీరు స్వారి చేయటానికి మరియు కొన్నింటి మాంసమును మీరు తినటానికి సృష్టించాడు.
Tafsiran larabci:
وَلَكُمْ فِیْهَا مَنَافِعُ وَلِتَبْلُغُوْا عَلَیْهَا حَاجَةً فِیْ صُدُوْرِكُمْ وَعَلَیْهَا وَعَلَی الْفُلْكِ تُحْمَلُوْنَ ۟ؕ
ఈ సృష్టితాల్లో మీ కొరకు అనేక ప్రయోజనాలు కలవు. అవి ప్రతి యుగములో పునరుద్ధరించబడతాయి. మరియు వాటి ద్వారా మీరు మీ మనస్సులు కోరుకునే అవసరాలు మీకు దొరుకుతాయి. మరియు భూమి, సముద్రంలో రాకపోకలు వాటిలో ముఖ్యమైనవి.
Tafsiran larabci:
وَیُرِیْكُمْ اٰیٰتِهٖ ۖۗ— فَاَیَّ اٰیٰتِ اللّٰهِ تُنْكِرُوْنَ ۟
మరియు పరిశుద్ధుడైన ఆయన తన సామర్ధ్యంపై మరియు తన ఏకత్వముపై సూచించే తన సూచనలను మీకు చూపిస్తాడు. అయితే అల్లాహ్ యొక్క ఏ ఆయతులను మీ వద్ద అవి ఆయన ఆయతులని నిరూపితమైన తరువాత కూడా మీరు వాటిని అంగీకరించరు.
Tafsiran larabci:
اَفَلَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَیَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ؕ— كَانُوْۤا اَكْثَرَ مِنْهُمْ وَاَشَدَّ قُوَّةً وَّاٰثَارًا فِی الْاَرْضِ فَمَاۤ اَغْنٰی عَنْهُمْ مَّا كَانُوْا یَكْسِبُوْنَ ۟
అయితే ఈ తిరస్కారులందరు భూమిలో సంచరించి వారికన్న మునుపటి సమాజాలవారి ముగింపు ఎలా జరిగినదో చూసి వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోలేదా ?. నిశ్ఛయంగా ఈ సమాజాలు వారి కన్నఅధికంగా సంపద కలవారై, ఎక్కువ బలవంతులై, భూమిలో ఎక్కువ చిహ్నాలను వదిలినవారై ఉండేవారు. ఎప్పుడైతే వారి వద్దకు నాశనం చేసే అల్లాహ్ శిక్ష వచ్చిపడినదో వారు సంపాదించుకున్న బలము వారికి దేనికి పనికిరాకపోయినది.
Tafsiran larabci:
فَلَمَّا جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ فَرِحُوْا بِمَا عِنْدَهُمْ مِّنَ الْعِلْمِ وَحَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟
మరియు వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన ఆధారాలను తీసుకుని వచ్చినప్పుడు వారు వాటిని తిరస్కరించారు. మరియు వారు తమ వద్ద ఉన్న తమ ప్రవక్తలు తమ వద్దకు తీసుకుని వచ్చిన దానికి వ్యతిరేకంగా ఉన్న జ్ఞానముతో సంతుష్టపడ్డారు. మరియు వారిపై వారు పరిహాసమాడే శిక్ష దేనితోనైతే వారి ప్రవక్తలు వారిని భయపెట్టేవారో వచ్చిపడినది.
Tafsiran larabci:
فَلَمَّا رَاَوْا بَاْسَنَا قَالُوْۤا اٰمَنَّا بِاللّٰهِ وَحْدَهٗ وَكَفَرْنَا بِمَا كُنَّا بِهٖ مُشْرِكِیْنَ ۟
ఎప్పుడైతే వారు మా శిక్షను చూశారో అంగీకరిస్తూ ఇలా పలికారు ఆ సమయంలో అంగీకారం వారికి ప్రయోజనం కలిగించదు : మేము ఒక్కడైన అల్లాహ్ ను విశ్వసించాము.మరియు మేము ఆయనను వదిలి వేటినైతే ఆరాధించేవారమో భాగస్వాములను మరియు విగ్రహాలను తిరస్కరించాము.
Tafsiran larabci:
فَلَمْ یَكُ یَنْفَعُهُمْ اِیْمَانُهُمْ لَمَّا رَاَوْا بَاْسَنَا ؕ— سُنَّتَ اللّٰهِ الَّتِیْ قَدْ خَلَتْ فِیْ عِبَادِهٖ ۚ— وَخَسِرَ هُنَالِكَ الْكٰفِرُوْنَ ۟۠
వారిపై కురిసే మా శిక్షను వారు కళ్ళారా చూసినప్పుడు వారి విశ్వాసము వారికి ఎటువంటి ప్రయోజనం కలిగించదు. అల్లాహ్ యొక్క సంప్రదాయము శిక్షను కళ్ళారా చూసినప్పుడు వారి విశ్వాసము వారికి ప్రయోజనం కలిగించదని తన దాసులలో జరిగినది. మరియు అవిశ్వాసపరులు శిక్ష అవతరించినప్పుడు అల్లాహ్ పై తమ అవిశ్వాసం వలన మరియు శిక్షను కళ్ళారా చూడక ముందే తౌబా చేయకపోవటం వలన వినాశన స్థానములకు చేరుకుని తమ స్వయమునకు నష్టమును కలిగించుకున్నారు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• لله رسل غير الذين ذكرهم الله في القرآن الكريم نؤمن بهم إجمالًا.
పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రస్తావించిన వారే కాకుండా అల్లాహ్ ప్రవక్తలు ఉన్నారు మేము వారందరిని విశ్వసిస్తున్నాము.

• من نعم الله تبيينه الآيات الدالة على توحيده.
అల్లాహ్ అనుగ్రహాల్లోంచి ఆయన ఏకత్వముపై సూచించే ఆయతులను ఆయన స్పష్టపరచటం.

• خطر الفرح بالباطل وسوء عاقبته على صاحبه.
అసత్యము పట్ల సంతోషపడటము యొక్క ప్రమాదము మరియు అది కలిగిన వాడిపై దాని చెడు పర్యవసానము.

• بطلان الإيمان عند معاينة العذاب المهلك.
నశనం చేసే శిక్షను కళ్లారా చూసినప్పటి విశ్వాస నిర్వీర్యత.

 
Fassarar Ma'anoni Sura: Suratu Ghafir
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa