Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Sura: Suratu Fussilat   Aya:

సూరహ్ ఫుశ్శిలత్

daga cikin abunda Surar ta kunsa:
بيان حال المعرضين عن الله، وذكر عاقبتهم.
అల్లాహ్ పట్ల విముఖత చూపేవారి స్థితి ప్రకటన మరియు వారి పర్యవాసనము ప్రస్తావన

حٰمٓ ۟ۚ
హా-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
Tafsiran larabci:
تَنْزِیْلٌ مِّنَ الرَّحْمٰنِ الرَّحِیْمِ ۟ۚ
ఈ ఖుర్ఆన్ అనంత కరుణామయుడు,అపార కృపాసాగరుడైన అల్లాహ్ వద్ద నుండి అవతరించినది.
Tafsiran larabci:
كِتٰبٌ فُصِّلَتْ اٰیٰتُهٗ قُرْاٰنًا عَرَبِیًّا لِّقَوْمٍ یَّعْلَمُوْنَ ۟ۙ
ఇది ఎటువంటి గ్రంధమంటే దాని ఆయతులు పరిపూర్ణంగా మరియు సంపూర్ణంగా స్పష్టపరచబడినవి. మరియు అది జ్ఞానం కలవారి కొరకు అరబీ ఖుర్ఆన్ గా చేయబడినది. ఎందుకంటే వారే దాన్ని కళ్ళారా చూడటం ద్వారా మరియు అందులో ఉన్న సత్యము వైపునకు మార్గనిర్దేశకం ద్వారా ప్రయోజనం చెందుతారు.
Tafsiran larabci:
بَشِیْرًا وَّنَذِیْرًا ۚ— فَاَعْرَضَ اَكْثَرُهُمْ فَهُمْ لَا یَسْمَعُوْنَ ۟
విశ్వాసపరులకు అల్లాహ్ వారి కొరకు సిద్ధం చేసి ఉంచిన గొప్ప ప్రతిఫలము గురించి శుభవార్త నిచ్చేదానిగా మరియు అవిశ్వాసపరులకు అల్లాహ్ యొక్క బాధాకరమైన శిక్ష నుండి భయపెట్టేదానిగా. అయితే వారిలో నుండి చాలా మంది దాని నుండి విముఖత చూపారు. వారు అందులో ఉన్న ఉపదేశమును స్వీకరించే విధంగా వినటంలేదు.
Tafsiran larabci:
وَقَالُوْا قُلُوْبُنَا فِیْۤ اَكِنَّةٍ مِّمَّا تَدْعُوْنَاۤ اِلَیْهِ وَفِیْۤ اٰذَانِنَا وَقْرٌ وَّمِنْ بَیْنِنَا وَبَیْنِكَ حِجَابٌ فَاعْمَلْ اِنَّنَا عٰمِلُوْنَ ۟
మరియు వారు ఇలా పలికారు : మా హృదయములు తెరలతో కప్పబడి ఉన్నాయి. కాబట్టి అవి మీరు దేని వైపునకు పిలుస్తున్నారో అర్ధం చేసుకోవు. మరియు మా చెవులలో చెవుడు ఉన్నది దాన్ని అవి వినవు. మరియు నీకూ మాకు మధ్య ఒక తెర ఉన్నది కాబట్టి మీరు పలుకుతున్న వాటిలో నుండి ఏదీ మాకు చేరదు. కావున నీవు నీ పద్దతిలో ఆచరించు మేము మా పద్దతిలో ఆచరిస్తాము. మరియు మేము నిన్ను అనుసరించమంటే అనుసరించము.
Tafsiran larabci:
قُلْ اِنَّمَاۤ اَنَا بَشَرٌ مِّثْلُكُمْ یُوْحٰۤی اِلَیَّ اَنَّمَاۤ اِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ فَاسْتَقِیْمُوْۤا اِلَیْهِ وَاسْتَغْفِرُوْهُ ؕ— وَوَیْلٌ لِّلْمُشْرِكِیْنَ ۟ۙ
ఓ ప్రవక్తా ఈ విబేధించే వారందరితో ఇలా పలకండి : నేను మీలాంటి ఒక మనిషిని మాత్రమే మీ సత్య ఆరాధ్యదైవం ఒకే ఆరాధ్యదైవమని ఆయనే అల్లాహ్ అని అల్లాహ్ నా వైపునకు దైవవాణిని అవతరింపజేశాడు. కావున మీరు ఆయనకు చేర్చే మార్గములో నడవండి. మరియు మీ పాపముల కొరకు మన్నింపును ఆయన నుండి కోరుకోండి. మరియు అల్లాహ్ ను వదిలి ఆరాధించే లేదా ఆయనతో పాటు ఎవరినైన సాటి కల్పించే ముష్రికుల కొరకు వినాశనము మరియు శిక్ష కలదు.
Tafsiran larabci:
الَّذِیْنَ لَا یُؤْتُوْنَ الزَّكٰوةَ وَهُمْ بِالْاٰخِرَةِ هُمْ كٰفِرُوْنَ ۟
తమ సంపదల నుండి జకాత్ చెల్లించని వారు పరలోకము మరియు అందులో ఉన్న శాశ్వత అనుగ్రహాలను మరియు బాధాకరమైన శిక్షను తిరస్కరించేవారు.
Tafsiran larabci:
اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَهُمْ اَجْرٌ غَیْرُ مَمْنُوْنٍ ۟۠
నిశ్ఛయంగా ఎవరైతే అల్లాహ్ ను, ఆయన ప్రవక్తలను విశ్వసించి సత్కర్మలు చేస్తారో వారికి అంతం కాకుండా నిత్యం ఉండే పుణ్యం కలదు. మరియు అది స్వర్గము.
Tafsiran larabci:
قُلْ اَىِٕنَّكُمْ لَتَكْفُرُوْنَ بِالَّذِیْ خَلَقَ الْاَرْضَ فِیْ یَوْمَیْنِ وَتَجْعَلُوْنَ لَهٗۤ اَنْدَادًا ؕ— ذٰلِكَ رَبُّ الْعٰلَمِیْنَ ۟ۚ
ఓ ప్రవక్తా ముష్రికులతో దూషిస్తూ ఇలా పలకండి : ఆది,సోమ అయిన రెండు దినములలో భూమిని సృష్టించిన అల్లాహ్ ను ఎందుకని మీరు తిరస్కరిస్తున్నారు. మరియు మీరు ఆయనకు సమానులుగా చేసి వారిని ఆయనను వదిలి ఆరాధిస్తున్నారు ?!.ఆయన సృష్టిరాసులన్నింటికి ప్రభువు.
Tafsiran larabci:
وَجَعَلَ فِیْهَا رَوَاسِیَ مِنْ فَوْقِهَا وَبٰرَكَ فِیْهَا وَقَدَّرَ فِیْهَاۤ اَقْوَاتَهَا فِیْۤ اَرْبَعَةِ اَیَّامٍ ؕ— سَوَآءً لِّلسَّآىِٕلِیْنَ ۟
మరియు ఆయన అందులో స్థిరమైన పర్వతములను చేసి దాని పై వాటిని అది కదలకుండా ఉండుటకు స్థిరంగా చేశాడు. మరియు ఆయన అందులో ప్రజల మరియు జంతువుల ఆహారమును మునుపటి రెండు రోజలతో కలుపుకుని నాలుగు రోజులలో నిర్ధారించాడు. అవి మంగళ,బుధ వారములు వాటి గురించి అడగదలిచే వారికి సమానము.
Tafsiran larabci:
ثُمَّ اسْتَوٰۤی اِلَی السَّمَآءِ وَهِیَ دُخَانٌ فَقَالَ لَهَا وَلِلْاَرْضِ ائْتِیَا طَوْعًا اَوْ كَرْهًا ؕ— قَالَتَاۤ اَتَیْنَا طَآىِٕعِیْنَ ۟
ఆ పిదప పరిశుద్ధుడైన ఆయన ఆకాశమును సృష్టించటం వైపునకు ధ్యానమును మరల్చాడు. మరియు అది ఆ రోజున పొగవలె ఉంది. అప్పుడు ఆయన దాన్ని మరియు భూమిని ఇలా ఆదేశించాడు : మీరిద్దరు ఇష్టపూరితంగా లేదా ఇష్టం లేకుండా నా ఆదేశమునకు కట్టుబడి ఉండండి. దాని నుండి మీకు వేరే వైపు మరలే ప్రదేశం లేదు. అవి రెండు ఇలా సమాధానమిచ్చినవి : మేమిద్దరం విధేయత చూపుతూ వచ్చాము. ఓ మా ప్రభువా నీ నిర్ణయం తప్ప మాకు ఎటువంటి నిర్ణయం లేదు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• تعطيل الكافرين لوسائل الهداية عندهم يعني بقاءهم على الكفر.
అవిశ్వాసపరులు తమ వద్ద సన్మార్గమును పొందే కారకాలు ఉండి కూడా వదిలేయటం అంటే వారు అవిశ్వాసములోనే ఉండిపోవటం.

• بيان منزلة الزكاة، وأنها ركن من أركان الإسلام.
జకాత్ యొక్క స్థానము మరియు అది ఇస్లాం మూల స్థంభముల్లోంచి ఒక మూల స్థంభము.అని ప్రకటన.

• استسلام الكون لله وانقياده لأمره سبحانه بكل ما فيه.
విశ్వము అల్లాహ్ కు లొంగిపోవటము మరియు అందులో ఉన్నవన్ని పరిశుద్ధుడైన ఆయన ఆదేశమునకు కట్టుబడి ఉండటం.

فَقَضٰىهُنَّ سَبْعَ سَمٰوَاتٍ فِیْ یَوْمَیْنِ وَاَوْحٰی فِیْ كُلِّ سَمَآءٍ اَمْرَهَا وَزَیَّنَّا السَّمَآءَ الدُّنْیَا بِمَصَابِیْحَ ۖۗ— وَحِفْظًا ؕ— ذٰلِكَ تَقْدِیْرُ الْعَزِیْزِ الْعَلِیْمِ ۟
కావున అల్లాహ్ ఆకాశములను రెండు రోజులలో అంటే గురు,శుక్రు వారములలో సృష్టించాడు. ఆ రెండిటితో ఆయన భూమ్యాకాశములను సృష్టించటమును ఆరు దినములలో పూర్తి చేశాడు. మరియు అల్లాహ్ ప్రతీ ఆకాశములో తాను అందులో నిర్దారించిన దానిని మరియు దానికి ఆయన ఆదేశించిన విధేయత,ఆరాధన గురించి దైవ వాణిని అవతరింపజేశాడు. మరియు మేము ప్రపంచపు ఆకాశమును నక్షత్రముల ద్వారా అలంకరించాము. మరియు వాటి ద్వారా మేము ఆకాశమును విన్నవాటిని షైతానులు ఎత్తుకుపోవటం నుండి రక్షించాము. ఈ ప్రస్తావించబడినవన్ని ఎవరు ఓడించలేని సర్వాధిక్యుడు మరియు తన సృష్టి గురించి బాగా తెలిసిన వాడి సామర్ధ్యము.
Tafsiran larabci:
فَاِنْ اَعْرَضُوْا فَقُلْ اَنْذَرْتُكُمْ صٰعِقَةً مِّثْلَ صٰعِقَةِ عَادٍ وَّثَمُوْدَ ۟ؕ
అయితే ఒక వేళ వీరందరు మీరు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించటం నుండి విముఖత చూపితే ఓ ప్రవక్తా వారితో మీరు ఇలా పలకండి : హూద్ జాతివారైన ఆద్ మరియు సాలిహ్ జాతివారైన సమూద్ వారిద్దరిని తిరస్కరించినప్పుడు వారిపై వాటిల్లిన శిక్ష లాంటి శిక్ష మీపై వాటిల్లుతుందని నేను మిమ్మల్ని భయపెట్టాను.
Tafsiran larabci:
اِذْ جَآءَتْهُمُ الرُّسُلُ مِنْ بَیْنِ اَیْدِیْهِمْ وَمِنْ خَلْفِهِمْ اَلَّا تَعْبُدُوْۤا اِلَّا اللّٰهَ ؕ— قَالُوْا لَوْ شَآءَ رَبُّنَا لَاَنْزَلَ مَلٰٓىِٕكَةً فَاِنَّا بِمَاۤ اُرْسِلْتُمْ بِهٖ كٰفِرُوْنَ ۟
వారి ప్రవక్తలు వారి వద్దకు ఒకరినొకరు అనుసరిస్తూ ఒకే సందేశమును తీసుకుని వచ్చి వారిని అల్లాహ్ ఒక్కడిని తప్ప ఇంకొకరిని ఆరాధించకండి అని ఆదేశిస్తూ వచ్చినప్పుడు వారిలో నుండి అవిశ్వాసపరులు ఇలా పలికారు : ఒక వేళ అల్లాహ్ మాపై దైవదూతలను ప్రవక్తలుగా అవతరింపదలచి ఉంటే వారినే అవతరింపజేసి ఉండేవాడు. నిశ్చయంగా మేము మీరు ఇచ్చి పంపింపించబడిన దాన్ని అవిశ్వసించేవారము. ఎందుకంటే మీరు మా లాంటి మనుషులే.
Tafsiran larabci:
فَاَمَّا عَادٌ فَاسْتَكْبَرُوْا فِی الْاَرْضِ بِغَیْرِ الْحَقِّ وَقَالُوْا مَنْ اَشَدُّ مِنَّا قُوَّةً ؕ— اَوَلَمْ یَرَوْا اَنَّ اللّٰهَ الَّذِیْ خَلَقَهُمْ هُوَ اَشَدُّ مِنْهُمْ قُوَّةً ؕ— وَكَانُوْا بِاٰیٰتِنَا یَجْحَدُوْنَ ۟
ఇక హూద్ జాతివారైన ఆద్ అల్లాహ్ పై తమ అవిశ్వాసముతో పాటు భూమిలో అన్యాయంగా దురహంకారమును చూపారు మరియు తమ చుట్టూ ఉన్న వారిపై హింసకు పాల్పడ్డారు. వారు తమ శక్తి వలన మోసపోయి ఇలా పలికారు : బలములో మాకన్న మించినవాడు ఎవడున్నాడు ?. వారి ఆలోచనను బట్టి బలములో వారి కన్న మించినవాడు ఎవడూ లేడు. అప్పుడు అల్లాహ్ వారిని ఖండిస్తూ ఇలా పలికాడు : ఏమీ వీరందరికి మరియు చూసేవారికి తెలియదా వారిని సృష్టించి మరియు వారిలో వారిని మితిమీరిపోయినట్లు చేసిన బలమును సమకూర్చిన అల్లాహ్ యే బలములో వారి కన్న మించిన వాడని ?. మరియు వారు హూద్ అలైహిస్సలాం తీసుకుని వచ్చిన అల్లాహ్ ఆయతులను తిరస్కరించేవారు.
Tafsiran larabci:
فَاَرْسَلْنَا عَلَیْهِمْ رِیْحًا صَرْصَرًا فِیْۤ اَیَّامٍ نَّحِسَاتٍ لِّنُذِیْقَهُمْ عَذَابَ الْخِزْیِ فِی الْحَیٰوةِ الدُّنْیَا ؕ— وَلَعَذَابُ الْاٰخِرَةِ اَخْزٰی وَهُمْ لَا یُنْصَرُوْنَ ۟
అందుకే మేము వారిపై కలవరపెట్టే శబ్దం కల గాలి అందులో ఉన్న శిక్ష మూలాన వారిపై దుశకునమై ఉన్న రోజులలో పంపాము. వారికి ఇహలోక జీవితంలోనే అవమానపరిచే,దిగజార్చే శిక్ష రుచిని చూపించటానికి. వారి కోసం నిరీక్షించే పరలోక శిక్ష వారిని ఎక్కువగా అవమానపరుస్తుంది. మరియు శిక్ష నుండి వారిని రక్షించడం ద్వారా వారికి సహాయం చేసే వాడిని వారు పొందరు.
Tafsiran larabci:
وَاَمَّا ثَمُوْدُ فَهَدَیْنٰهُمْ فَاسْتَحَبُّوا الْعَمٰی عَلَی الْهُدٰی فَاَخَذَتْهُمْ صٰعِقَةُ الْعَذَابِ الْهُوْنِ بِمَا كَانُوْا یَكْسِبُوْنَ ۟ۚ
ఇక సాలిహ్ అలైహిస్సలాం జాతివారైన సమూద్ నిశ్ఛయంగా వారికి మేము సత్య మార్గమును స్పష్టపరచి సన్మార్గమును చూపాము. అప్పుడు వారు సత్యము వైపునకు మార్గదర్శకం చేసే దానికి బదులుగా అపమార్గమునకు ప్రాధాన్యతనిచ్చారు. అప్పుడు వారికి వారు సంపాదించుకున్న అవిశ్వాసము మరియు పాపకార్యముల వలన అవమానపరిచే శిక్ష పట్టుకుంది.
Tafsiran larabci:
وَنَجَّیْنَا الَّذِیْنَ اٰمَنُوْا وَكَانُوْا یَتَّقُوْنَ ۟۠
మరియు మేము అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచిన వారిని రక్షించాము. మరియు వారు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడుతుంటారు. మరియు మేము వారిని వారి జాతి వారిపై దిగిన శిక్ష నుండి రక్షించాము.
Tafsiran larabci:
وَیَوْمَ یُحْشَرُ اَعْدَآءُ اللّٰهِ اِلَی النَّارِ فَهُمْ یُوْزَعُوْنَ ۟
మరియు ఆరోజు అల్లాహ్ తన శతృవులను నరకాగ్ని వద్దకు సమీకరిస్తాడు. నరక భటులు వారిలోని మొదటి వాడి నుండి చివరి వారి వరకు మరలుస్తారు. వారు నరకాగ్ని నుండి పారిపోలేరు.
Tafsiran larabci:
حَتّٰۤی اِذَا مَا جَآءُوْهَا شَهِدَ عَلَیْهِمْ سَمْعُهُمْ وَاَبْصَارُهُمْ وَجُلُوْدُهُمْ بِمَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
చివరికి వారు ఆ నరకాగ్ని వద్దకు చేరుకున్నప్పుడు దేని వైపునకైతే వారు ఈడ్చుకుని వెళ్లబడుతారో అప్పుడు వారు తాము ఇహలోకములో చేసిన కర్మలను నిరాకరిస్తారు. వారి చెవులు,వారి కళ్ళు,వారి తోళ్ళు వారు ఇహలోకములో చేసిన అవిశ్వాసము మరియు పాపకార్యముల గురించి వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయి.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الإعراض عن الحق سبب المهالك في الدنيا والآخرة.
సత్యము నుండి విముఖత చూపటం ఇహ,పరలోకాల్లో వినాశనాలకు కారణమవుతుంది.

• التكبر والاغترار بالقوة مانعان من الإذعان للحق.
బలము వలన అహంకారము,గర్వము రెండూ సత్యమును అంగీకరించటం నుండి ఆటంకమును కలిగిస్తాయి.

• الكفار يُجْمَع لهم بين عذاب الدنيا وعذاب الآخرة.
అవిశ్వాసపరులు వారి కొరకు ఇహలోక శిక్ష మరియు పరలోక శిక్ష మధ్య సమీకరించబడుతుంది.

• شهادة الجوارح يوم القيامة على أصحابها.
ప్రళయదినమున అవయవములు తమ యజమానులకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకటం జరుగును.

وَقَالُوْا لِجُلُوْدِهِمْ لِمَ شَهِدْتُّمْ عَلَیْنَا ؕ— قَالُوْۤا اَنْطَقَنَا اللّٰهُ الَّذِیْۤ اَنْطَقَ كُلَّ شَیْءٍ وَّهُوَ خَلَقَكُمْ اَوَّلَ مَرَّةٍ وَّاِلَیْهِ تُرْجَعُوْنَ ۟
మరియు అవిశ్వాసపరులు తమ చర్మములతో ఇలా పలుకుతారు : మేము ఇహలోకములో చేసుకున్న కర్మల గురించి మీరు మాకు వ్యతిరేకముగా సాక్ష్యము ఎందుకు పలికారు ?!. చర్మములు తమ యజమానులకు సమాధానమిస్తూ ఇలా పలుకుతాయి : ప్రతీ వస్తువును మాట్లాడించగలిగే వాడైన అల్లాహ్ మమ్మల్ని మాట్లాడిపించాడు. మరియు ఆయనే మిమ్మల్ని ఇహలోకంలో ఉన్నప్పుడు మొదటి సారి సృష్టించాడు. మరియు లెక్కతీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు మీరు పరలోకంలో ఆయన ఒక్కడి వైపునకే మరలించబడుతారు.
Tafsiran larabci:
وَمَا كُنْتُمْ تَسْتَتِرُوْنَ اَنْ یَّشْهَدَ عَلَیْكُمْ سَمْعُكُمْ وَلَاۤ اَبْصَارُكُمْ وَلَا جُلُوْدُكُمْ وَلٰكِنْ ظَنَنْتُمْ اَنَّ اللّٰهَ لَا یَعْلَمُ كَثِیْرًا مِّمَّا تَعْمَلُوْنَ ۟
మీ చెవులు,మీ కళ్ళు,మీ చర్మములు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకరని మీరు పాపములకు పాల్పడేటప్పుడు మీరు దాచిపెట్టేవారు కాదు. ఎందుకంటే మీరు మరణాంతరం లెక్కతీసుకోబడటం పై,శిక్షింపబడటంపై,ప్రతిఫలం ప్రసాదించబడటంపై విశ్వాసమును చూపేవారు కాదు. కాని మీరు చేస్తున్నది పరిశుద్ధుడైన అల్లాహ్ కు ఎక్కువగా తెలియదని భావించేవారు. అంతే కాదు అవి ఆయనపై గోప్యంగా ఉన్నవనుకునేవారు. అప్పుడు మీరు మోసపోయారు.
Tafsiran larabci:
وَذٰلِكُمْ ظَنُّكُمُ الَّذِیْ ظَنَنْتُمْ بِرَبِّكُمْ اَرْدٰىكُمْ فَاَصْبَحْتُمْ مِّنَ الْخٰسِرِیْنَ ۟
మీరు మీ ప్రభువు పట్ల భావించిన మీ ఈ చెడు భావనే మిమ్మల్ని నాశనం చేసింది. దాని కారణం వలనే మీరు ఇహపరాల్లో నష్టపోయిన వారిలో నుంచి అయిపోయారు.
Tafsiran larabci:
فَاِنْ یَّصْبِرُوْا فَالنَّارُ مَثْوًی لَّهُمْ ؕ— وَاِنْ یَّسْتَعْتِبُوْا فَمَا هُمْ مِّنَ الْمُعْتَبِیْنَ ۟
ఒక వేళ తమ చెవులు,తమ కళ్ళు,తమ చర్మములు వ్యతిరేకంగా సాక్ష్యం పలికిన వీరందరు సహనం చూపినా నరకాగ్నియే వారికి నివాస స్థలమవుతుంది. మరియు వారు ఆశ్రయం పొందే ఆశ్రయం అవుతుంది. మరియు ఒక వేళ వారు శిక్షను తొలగించటమును మరియు తమ నుండి అల్లాహ్ సంతుష్టపడటమును కోరుకున్నా వారు ఆయన మన్నతను పొందరు. మరియు వారు స్వర్గంలో ఎన్నటికి ప్రవేశించరు.
Tafsiran larabci:
وَقَیَّضْنَا لَهُمْ قُرَنَآءَ فَزَیَّنُوْا لَهُمْ مَّا بَیْنَ اَیْدِیْهِمْ وَمَا خَلْفَهُمْ وَحَقَّ عَلَیْهِمُ الْقَوْلُ فِیْۤ اُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِمْ مِّنَ الْجِنِّ وَالْاِنْسِ ۚ— اِنَّهُمْ كَانُوْا خٰسِرِیْنَ ۟۠
మరియు మేము ఈ అవిశ్వాసపరులందరి కొరకు షైతానులలో నుండి వారిని అంటిపెట్టుకుని ఉండే స్నేహితులను సిద్ధం చేశాము. అప్పుడు వారు ఇహలోకంలో వారి దుష్కర్మలను మంచిగా చేసి చూపించారు. మరియు వారు వారి కొరకు వారి వెనుక ఉన్న పరలోక విషయమును మంచిగా చేసి చూపించారు. అప్పుడు వారు దాన్ని గుర్తు చేసుకోవటమును మరియు దాని కొరకు అమలు చేయటమును మరిపింపజేశారు. మరియు వారికన్న ముందు గతించిన జిన్నుల,మానవుల సమాజములందరిపై శిక్ష అనివార్యమైనది. నిశ్ఛయంగా వారు ప్రళయదినమున తమను,తమ ఇంటివారిని నరకములో ప్రవేశింపజేసి నష్టమును కలిగించినప్పుడు నష్టమును చవిచూసినవారిలోంచి అయిపోయారు.
Tafsiran larabci:
وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا لَا تَسْمَعُوْا لِهٰذَا الْقُرْاٰنِ وَالْغَوْا فِیْهِ لَعَلَّكُمْ تَغْلِبُوْنَ ۟
మరియు అవిశ్వాసపరులు ఎప్పుడైతే వారు వాదనను వాదనతో ఎదుర్కోలేకపోయారో తమ మధ్య ఉన్న వారితో ఆదేశిస్తూ ఇలా పలికారు : ముహమ్మద్ మీకు చదివి వినిపిస్తున్న ఈ ఖుర్ఆన్ ను మీరు వినకండి. మరియు అందులో ఉన్న వాటికి విధేయత చూపకండి. దాన్ని చదివేటప్పుడు మీరు అరవండి మరియు మీ స్వరములను బిగ్గరగా చేయండి. బహుశా దీని ద్వారా మీరు అతనిపై విజయం పొందితే అతడు దాన్ని పఠించటమును మరియు దాని వైపు పిలవటమును వదిలివేస్తాడేమో. అప్పుడు మేము అతని నుండి మనశ్శాంతిని పొందుతాము.
Tafsiran larabci:
فَلَنُذِیْقَنَّ الَّذِیْنَ كَفَرُوْا عَذَابًا شَدِیْدًا وَّلَنَجْزِیَنَّهُمْ اَسْوَاَ الَّذِیْ كَانُوْا یَعْمَلُوْنَ ۟
కావున మేము అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచి ఆయన ప్రవక్తలను తిరస్కరించిన వారికి ప్రళయదినమున తప్పకుండా కఠినమైన శిక్షను రుచి చూపిస్తాము. మరియు మేము తప్పకుండా వాారికి వారు చేసుకున్న షిర్కు మరియు పాపకార్యముల కన్న చెడ్డదైన ప్రతిఫలమును వారికి దానిపై పరిణామంగా ప్రసదిస్తాము.
Tafsiran larabci:
ذٰلِكَ جَزَآءُ اَعْدَآءِ اللّٰهِ النَّارُ ۚ— لَهُمْ فِیْهَا دَارُ الْخُلْدِ ؕ— جَزَآءً بِمَا كَانُوْا بِاٰیٰتِنَا یَجْحَدُوْنَ ۟
ఈ ప్రస్తావించబడిన ప్రతిఫలము అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచి ఆయన ప్రవక్తలను తిరస్కరించిన అల్లాహ్ శతృవుల ప్రతిఫలము : నరకాగ్ని అందులో వారికి శాశ్వత నివాసముంటుంది. ఎన్నటికి అంతం కాదు. అల్లాహ్ ఆయతులను వారి తిరస్కరించటంపై, అవి స్పష్టమై వాటి వాదనలో బలం ఉండి కుడా వాటిపై విశ్వాసం లేకపోవటం పై ప్రతిఫలంగా.
Tafsiran larabci:
وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا رَبَّنَاۤ اَرِنَا الَّذَیْنِ اَضَلّٰنَا مِنَ الْجِنِّ وَالْاِنْسِ نَجْعَلْهُمَا تَحْتَ اَقْدَامِنَا لِیَكُوْنَا مِنَ الْاَسْفَلِیْنَ ۟
మరియు అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచి ఆయన ప్రవక్తను తిరస్కరించిన వారు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా జిన్నుల్లోంచి మరియు మానవుల్లోంచి మాకు అపమార్గమునకు లోను చేసిన ఆ ఇద్దరిని మాకు చూపించు : (ఒకడు) అవిశ్వసమును ప్రవేశపెట్టి దాని వైపునకు పిలుపునిచ్చినటువంటి ఇబ్లీస్ మరియు (రెండవవాడు) రక్తపాతమును ప్రవేశపెట్టినటువంటి ఆదమ్ కుమారుడు. మేము వారిద్దరిని తీవ్ర నరక శిక్షకు గురైన దిగజారిన వారిలోంచి అయిపోవటానికి నరకములో మా కాళ్ళ క్రింద వేసేస్తాము.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• سوء الظن بالله صفة من صفات الكفار.
అల్లాహ్ విషయంలో చెడు ఆలోచన అవిశ్వాస లక్షణాల్లోంచి ఒక లక్షణం.

• الكفر والمعاصي سبب تسليط الشياطين على الإنسان.
అవిశ్వాసము మరియు పాపకార్యములు షైతానులు మానవునిపై దాడి చేయటానికి ఒక కారణం.

• تمنّي الأتباع أن ينال متبوعوهم أشدّ العذاب يوم القيامة.
తమచే అనుసరించబడే వారు ప్రళయదినమున తీవ్రమైన శిక్షను పొందాలన్నదే అనుసరించేవారి ఆకాంక్ష.

اِنَّ الَّذِیْنَ قَالُوْا رَبُّنَا اللّٰهُ ثُمَّ اسْتَقَامُوْا تَتَنَزَّلُ عَلَیْهِمُ الْمَلٰٓىِٕكَةُ اَلَّا تَخَافُوْا وَلَا تَحْزَنُوْا وَاَبْشِرُوْا بِالْجَنَّةِ الَّتِیْ كُنْتُمْ تُوْعَدُوْنَ ۟
నిశ్చయంగా ఎవరైతే మా ప్రభువు అల్లాహ్ అని,ఆయన తప్ప మాకు ఇంకెవరూ ప్రభువు కారు అని పలికుతారో మరియు ఆయన ఆదేశములను పాటించటం పై,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటంపై స్థిరంగా ఉంటారో దైవదూతులు వారి వద్దకు హాజరు అయ్యే సమయములో వారితో ఈ విధంగా పలుకుతూ వారిపై దిగుతారు : మీరు మరణము నుండి మరియు దాని తరువాత ఉన్న దాని నుండి భయపడకండి. మరియు మీరు ఇహలోకములో వెనుక వదిలి వచ్చిన దాని గురించి బాధ పడకండి. మరియు మీరు అల్లాహ్ పట్ల విశ్వాసమును కనబరచటంపై మరియు మీరు సత్కర్మలు చేయటం పై ఇహలోకములో మీతో వాగ్దానం చేయబడిన స్వర్గము గురించి శుభవార్తను వినండి.
Tafsiran larabci:
نَحْنُ اَوْلِیٰٓؤُكُمْ فِی الْحَیٰوةِ الدُّنْیَا وَفِی الْاٰخِرَةِ ۚ— وَلَكُمْ فِیْهَا مَا تَشْتَهِیْۤ اَنْفُسُكُمْ وَلَكُمْ فِیْهَا مَا تَدَّعُوْنَ ۟ؕ
మేము ఇహలోకంలో మీ స్నహితులుగా ఉండేవారము. నిశ్చయంగా మేము మిమ్మల్ని సరిదిద్దే వారము మరియు మిమ్మల్ని పరిరక్షించేవారము. మరియు మేము పరలోకంలో కూడా మీకు స్నేహితులుగా ఉంటాము. మా స్నేహము మీ కొరకు నిరంతరం ఉంటుంది. మరియు మీ కొరకు స్వర్గములో మీ మనస్సులు కోరుకునే సుఖభోగాలు,కోరికలు ఉంటాయి. మరియు అందులో మీ కొరకు మీరు కోరుకునే వాటిలో నుండి మీరు ఆశించినవి ఉంటాయి.
Tafsiran larabci:
نُزُلًا مِّنْ غَفُوْرٍ رَّحِیْمٍ ۟۠
తన దాసుల్లోంచి తన వైపునకు పశ్చాత్తాపముతో మరలే వాడి పాపములను మన్నించి,వారిపై కరుణించేవాడైన ప్రభువు వద్ద నుండి మీ ఆతిధ్యం కొరకు సిద్ధం చేయబడిన ఆహారోపాధిగా.
Tafsiran larabci:
وَمَنْ اَحْسَنُ قَوْلًا مِّمَّنْ دَعَاۤ اِلَی اللّٰهِ وَعَمِلَ صَالِحًا وَّقَالَ اِنَّنِیْ مِنَ الْمُسْلِمِیْنَ ۟
ఎవరైతే అల్లాహ్ ఏకత్వము వైపునకు పిలిచి,ఆయన ధర్మపరంగా ఆచరించి,ఆయన సంతుష్టపడే సత్కర్మలను చేసి, నిశ్ఛయంగా నేను అల్లాహ్ కి సమర్పించుకుని విధేయత చూపే వారిలోంచి వాడిని అని పలికే వాడికన్న మాట పరంగా మంచివాడు ఇంకెవడూ ఉండడు. ఎవరైతే ఇదంతా చేస్తాడో వాడు ప్రజల్లో మాట పరంగా ఎంతో ఉన్నతుడు.
Tafsiran larabci:
وَلَا تَسْتَوِی الْحَسَنَةُ وَلَا السَّیِّئَةُ ؕ— اِدْفَعْ بِالَّتِیْ هِیَ اَحْسَنُ فَاِذَا الَّذِیْ بَیْنَكَ وَبَیْنَهٗ عَدَاوَةٌ كَاَنَّهٗ وَلِیٌّ حَمِیْمٌ ۟
మరియు అల్లాహ్ ఇష్టపడే పుణ్య కార్యములను,విధేయత కార్యములను చేయటం మరియు ఆయనకు ఆగ్రహమును కలిగించే దుష్కర్మలను,పాపకార్యములను చేయటం సమానము కాదు. ప్రజల్లోంచి నీకు చెడు చేసేవారి చెడును మంచిదైన గుణముతో తొలగించు. అప్పుడు నీకు,అతనికి మధ్య ఉన్న మునుపటి శతృత్వము - అతని చెడును నీవు అతనికి మంచి చేసి తొలగించినప్పుడు - (తొలగిపోయి) అతను దగ్గర స్నేహితుడైపోతాడు.
Tafsiran larabci:
وَمَا یُلَقّٰىهَاۤ اِلَّا الَّذِیْنَ صَبَرُوْا ۚ— وَمَا یُلَقّٰىهَاۤ اِلَّا ذُوْ حَظٍّ عَظِیْمٍ ۟
ఈ స్థుతింపబడిన గుణము బాధించబడటంపై మరియు ప్రజల నుండి వారు పొందిన చెడుపై సహనం చూపిన వారికి మాత్రమే అనుగ్రహించబడుతుంది. మరియు అది అందులో ఉన్న అధికమైన మేలు,చాలా లాభము వలన గొప్ప అదృష్టవంతుడికి మాత్రమే అనుగ్రహించబడుతుంది.
Tafsiran larabci:
وَاِمَّا یَنْزَغَنَّكَ مِنَ الشَّیْطٰنِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللّٰهِ ؕ— اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟
మరియు షైతాను నీకు ఏదైన సమయంలో దుష్ప్రేరణకు గురి చేస్తే అల్లాహ్ ను ఆశ్రయించి ఆయనతో శరణు వేడుకో. నిశ్ఛయంగా ఆయన నీవు పలికే మాటలను బాగా వినేవాడును మరియు నీ పరిస్థితిని బాగా తెలిసిన వాడును.
Tafsiran larabci:
وَمِنْ اٰیٰتِهِ الَّیْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ؕ— لَا تَسْجُدُوْا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوْا لِلّٰهِ الَّذِیْ خَلَقَهُنَّ اِنْ كُنْتُمْ اِیَّاهُ تَعْبُدُوْنَ ۟
మరియు అల్లాహ్ సూచనల్లోంచి ఆయన గొప్పతనము,ఆయన ఏకత్వముపై సూచించేది రేయింబవళ్ళు వాటి ఒకదాని వెనుక ఒకటి రావటం మరియు సూర్య,చంద్రులు. ఓ ప్రజలారా మీరు సూర్యునికి సాష్టాంగపడకండి మరియు మీరు చంద్రునికి సాష్టాంగపడకండి. మరియు మీరు వాటిని సృష్టించిన అల్లాహ్ ఒక్కడికే సాష్టాంగపడండి ఒక వేళ మీరు వాస్తవంగా ఆయన ఒక్కడినే ఆరాధిస్తూ ఉంటే.
Tafsiran larabci:
فَاِنِ اسْتَكْبَرُوْا فَالَّذِیْنَ عِنْدَ رَبِّكَ یُسَبِّحُوْنَ لَهٗ بِالَّیْلِ وَالنَّهَارِ وَهُمْ لَا یَسْـَٔمُوْنَ ۟
ఒక వేళ వారు అహంకారమును చూపి,విముఖతను చూపి సృష్టికర్త అయిన అల్లాహ్ కి సాష్టాంగపడకపోతే అల్లాహ్ వద్ద ఉన్న దైవదూతలు రేయింబవళ్ళు కలిపి పరిశుద్ధుడైన ఆయన పరిశుద్ధతను కొనియాడుతారు మరియు ఆయన స్థుతులను పలుకుతారు. మరియు వారు ఆయన ఆరాధన నుండి విసిగిపోరు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• منزلة الاستقامة عند الله عظيمة.
అల్లాహ్ వద్ద నిలకడ చూపటం యొక్క స్థానము ఎంతో గొప్పది.

• كرامة الله لعباده المؤمنين وتولِّيه شؤونهم وشؤون مَن خلفهم.
తన దసులైన విశ్వాసపరులకు అల్లాహ్ గౌరవం మరియు వారి వ్యవహారములను,వారి తరువాత వచ్చే వారి వ్యవహారములను ఆయన నిర్వహించడం.

• مكانة الدعوة إلى الله، وأنها أفضل الأعمال.
అల్లాహ్ వైపునకు పిలవటమునకు స్థానము ఉన్నది. మరియు అది ఆచరణల్లో కెల్ల గొప్పది.

• الصبر على الإيذاء والدفع بالتي هي أحسن خُلُقان لا غنى للداعي إلى الله عنهما.
బాధింపబడటంపై సహనం చూపటం మరియు మంచి పద్దతితో ఎదుర్కొనటం రెండు గుణాలు అల్లాహ్ వైపునకు పిలిచే వారి కొరకు అవి పనికిరాకుండాపోవు.

وَمِنْ اٰیٰتِهٖۤ اَنَّكَ تَرَی الْاَرْضَ خَاشِعَةً فَاِذَاۤ اَنْزَلْنَا عَلَیْهَا الْمَآءَ اهْتَزَّتْ وَرَبَتْ ؕ— اِنَّ الَّذِیْۤ اَحْیَاهَا لَمُحْیِ الْمَوْتٰی ؕ— اِنَّهٗ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
మరియు ఆయన గొప్పతనంపై,ఆయన ఏకత్వముపై, మరణాంతరం మరల లేపటం విషయంలో ఆయన సామర్ధ్యంపై సూచించే ఆయన సూచనల్లోంచి నీవు భూమిని అందులో ఎటువంటి మొక్కలు లేకుండా చూడటం. ఎప్పుడైతే మేము దానిపై వర్షపు నీరును కురిపిస్తామో అప్పుడు అది అందులో దాగి ఉన్న విత్తనములు మొలకెత్తి మరియు పెరగటంతో చలనంలోకి వస్తుంది. మరియు ఎదుగుతుంది. నిశ్ఛయంగా మొక్కల ద్వారా ఈ మృతభూమిని జీవింపజేసినవాడే లెక్కతీసుకొని ప్రతిఫలం ప్రసాదించటం కోసం మృతులను జీవింపజేసి మరల వారిని లేపుతాడు. నిశ్చయంగా ఆయన ప్రతీ దానిపై సామర్ధ్యం కలవాడు. భూమిని దాని మరణం తరువాత జీవింపజేయటం గాని,మృతులను జీవింపజేసి వారి సమాదుల నుండి వారిని మరల లేపటం గాని ఆయనను అశక్తుడిని చేయదు.
Tafsiran larabci:
اِنَّ الَّذِیْنَ یُلْحِدُوْنَ فِیْۤ اٰیٰتِنَا لَا یَخْفَوْنَ عَلَیْنَا ؕ— اَفَمَنْ یُّلْقٰی فِی النَّارِ خَیْرٌ اَمْ مَّنْ یَّاْتِیْۤ اٰمِنًا یَّوْمَ الْقِیٰمَةِ ؕ— اِعْمَلُوْا مَا شِئْتُمْ ۙ— اِنَّهٗ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
నిశ్ఛయంగా మా ఆయతుల విషయంలో వాటిని నిరాకరించటంతో మరియు వాటిని తిరస్కరించటంతో,వాటిలో మార్పుచేర్పులతో సరైన దాని నుండి వాలిపోతారో వారి పరిస్థితి మాపై గోప్యంగా లేదు. వారి గురించి మాకు తెలుసు. ఏమీ ఎవరైతే నరకాగ్నిలో వేయబడుతాడో అతను ఉత్తముడా లేదా ఎవరైతే ప్రళయదినమున శిక్ష నుండి నిర్భయంగా వస్తాడో అతడా ?. ఓ ప్రజలారా మీరు తలచినది మంచైన.చెడైన చేయండి. నిశ్ఛయంగా మేము మీకు మంచిని,చెడును స్పష్టపరచాము. నిశ్ఛయంగా అల్లాహ్ వాటిలో నుంచి మీరు ఏది చేస్తున్నారో వీక్షిస్తున్నాడు. మీ కర్మల్లోంచి ఆయనపై ఏదీ గోప్యంగా లేదు.
Tafsiran larabci:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا بِالذِّكْرِ لَمَّا جَآءَهُمْ ۚ— وَاِنَّهٗ لَكِتٰبٌ عَزِیْزٌ ۟ۙ
నిశ్చయంగా ఖుర్ఆన్ ను అల్లాహ్ వద్ద నుంచి వచ్చినప్పుడు తిరస్కరించేవారు ప్రళయదినమున శిక్షంపబడుతారు. మరియు నిశ్ఛయంగా అది సర్వాధిక్యమైన,ఆపేదైన గ్రంధము. మార్పు చేర్పులు చేసేవాడు ఎవడూ దాన్ని మార్చాలన్నా మార్చలేడు. బదులుగా తెచ్చేవాడు దానికి బదులుగా తేవాలన్నా తీసుకునిరాలేడు.
Tafsiran larabci:
لَّا یَاْتِیْهِ الْبَاطِلُ مِنْ بَیْنِ یَدَیْهِ وَلَا مِنْ خَلْفِهٖ ؕ— تَنْزِیْلٌ مِّنْ حَكِیْمٍ حَمِیْدٍ ۟
దాని ముందు నుండి గాని దాని వెనుక నుండి గాని అసత్యము దాని వద్దకు ఏ తగ్గుదలను లేదా ఏ పెరుగుదలను లేదా ఏ బదులును లేదా ఏ మార్పును తీసుకుని రాదు. అది తన సృష్టించటంలో,తన విధివ్రాతలో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడు, అన్ని పరిస్థితులలో స్థుతింపబడేవాడి వద్ద నుండి అవతరింపబడినది.
Tafsiran larabci:
مَا یُقَالُ لَكَ اِلَّا مَا قَدْ قِیْلَ لِلرُّسُلِ مِنْ قَبْلِكَ ؕ— اِنَّ رَبَّكَ لَذُوْ مَغْفِرَةٍ وَّذُوْ عِقَابٍ اَلِیْمٍ ۟
ఓ ప్రవక్త మీతో పలకబడిన తిరస్కారము మాత్రం మీకు పూర్వ ప్రవక్తలతో పలకబడినది కావున మీరు సహనం చూపండి. నిశ్చయంగా నీ ప్రభువు తన దాసుల్లోంచి తనతో పశ్చాత్తప్పడిన వారికి మన్నించేవాడును మరియు ఎవరైతే తన పాపములపై మొండి వైఖరిని చూపించి పశ్చాత్తాప్పడడో వాడిని బాధకరమైన శిక్షను కలిగించేవాడును.
Tafsiran larabci:
وَلَوْ جَعَلْنٰهُ قُرْاٰنًا اَعْجَمِیًّا لَّقَالُوْا لَوْلَا فُصِّلَتْ اٰیٰتُهٗ ؕ— ءَاَؔعْجَمِیٌّ وَّعَرَبِیٌّ ؕ— قُلْ هُوَ لِلَّذِیْنَ اٰمَنُوْا هُدًی وَّشِفَآءٌ ؕ— وَالَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ فِیْۤ اٰذَانِهِمْ وَقْرٌ وَّهُوَ عَلَیْهِمْ عَمًی ؕ— اُولٰٓىِٕكَ یُنَادَوْنَ مِنْ مَّكَانٍ بَعِیْدٍ ۟۠
మరియు ఒక వేళ మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బేతర భాషలో అవతరింపజేసి ఉంటే వారిలో నుండి అవిశ్వాసపరులు ఇలా పలుకుతారు : దాని ఆయతులు మేము వాటిని అర్ధం చేసుకొనటానికి ఎందుకని స్పష్టపరచబడలేదు. ఏమీ ఖుర్ఆన్ అరబ్బేతర (పరాయి) భాషలో ఉండి,దాన్ని తీసుకుని వచ్చిన వాడు అరబీ వాడవుతాడా ?. ఓ ప్రవక్తా వారందరితో ఇలా పలకండి : ఈ ఖుర్ఆన్ అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ప్రవక్తలను నిజమని విశ్వసించిన వారికి అపమార్గము నుండి సన్మార్గమును చూపించేది మరియు హృదయముల్లోకల అజ్ఞానత,దాని వెనుక వచ్చే వాటి నుండి నయం చేసేది. మరియు అల్లాహ్ ను విశ్వసించని వారి చెవుల్లో చెవుడు కలదు. మరియు అది వారిపై అంధత్వంగా పరిణమించింది వారు దాన్ని అర్ధం చేసుకోలేరు. ఈ గుణాలతో వర్ణించబడిన వారందరు దూర ప్రదేశము నుండి పిలవబడే లాంటివారు. అటువంటప్పుడు పిలిచే వ్యక్తి స్వరము వారికి వినటం ఎలా సాధ్యమగును.
Tafsiran larabci:
وَلَقَدْ اٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ فَاخْتُلِفَ فِیْهِ ؕ— وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَّبِّكَ لَقُضِیَ بَیْنَهُمْ وَاِنَّهُمْ لَفِیْ شَكٍّ مِّنْهُ مُرِیْبٍ ۟
మరియు నిశ్చయంగా మేము మూసా అలైహిస్సలాంనకు తౌరాత్ ను ప్రసాదించాము. అప్పుడు అందులో విబేధించటం జరిగినది. వారిలో నుండి దాన్ని విశ్వసించిన వారు ఉన్నారు మరియు వారిలో నుండి దాన్ని అవిశ్వసించినవారు ఉన్నారు. ఒక వేళ ప్రళయదినమున దాసుల మధ్య వారు విబేధించుకున్న దాని విషయంలో తీర్పు జరగుతుందని అల్లాహ్ వద్ద నుండి వాగ్దానము లేకుండా ఉంటే తౌరాత్ విషయంలో విబేధించుకున్న వారి విషయంలో తీర్పునిచ్చేవాడు. అప్పుడు సత్యపరుడిని మరియు అసత్యపరుడిని ఆయన స్పష్టపరిచేవాడు. అప్పుడు ఆయన సత్యపరుడిని గౌరవించేవాడు మరియు అసత్యపరుడిని అవమానపరిచేవాడు. మరియు నిశ్ఛయంగా అవిశ్వాసపరులు ఖుర్ఆన్ ఆదేశ విషయంలో అవిశ్వాసపరులు సందేహములో,సంశయంలో పడి ఉన్నారు.
Tafsiran larabci:
مَنْ عَمِلَ صَالِحًا فَلِنَفْسِهٖ ۚ— وَمَنْ اَسَآءَ فَعَلَیْهَا ؕ— وَمَا رَبُّكَ بِظَلَّامٍ لِّلْعَبِیْدِ ۟
ఎవరైతే సత్కార్యము చేస్తాడో అతని సత్కార్యము యొక్క లాభము అతని వైపునకే మరలుతుంది. కాని ఎవరి యొక్క సత్కార్యము అల్లాహ్ కు ప్రయోజనం కలిగించదు. మరియు ఎవరైతే దుష్కర్మకు పాల్పడుతాడో అతని దుష్కర్మ యొక్క నష్టము అతని వైపునకే మరలుతుంది. అయితే అల్లాహ్ అతని సృష్టిలోంచి ఎవరి పాపము ఆయనకు నష్టమును కలిగించదు. త్వరలోనే ఆయన ప్రతి ఒక్కరికి వారి హక్కును ప్రసాదిస్తాడు. ఓ ప్రవక్తా మీ ప్రభువు తన దాసులకు ఏమాత్రం అన్యాయం చేయడు. వారి పుణ్యాన్ని తగ్గించడు మరియు వారి పాపమును అధికం చేయడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• حَفِظ الله القرآن من التبديل والتحريف، وتَكَفَّل سبحانه بهذا الحفظ، بخلاف الكتب السابقة له.
అల్లాహ్ ఖుర్ఆన్ ను మార్పు,చేర్పుల నుండి పరిరక్షించాడు. పరిశుద్ధుడైన ఆయన ఈ పరిరక్షణ బాధ్యతను తీసుకున్నాడు. దాని పూర్వ గ్రంధములకు వ్యతిరేకముగా.

• قطع الحجة على مشركي العرب بنزول القرآن بلغتهم.
అరబ్ ముష్రికుల పై వాదనను ఖుర్ఆన్ ను వారి భాషలో అవతరింపజేయటం ద్వారా అంతం చేయటం.

• نفي الظلم عن الله، وإثبات العدل له.
అల్లాహ్ నుండి హింసను తిరస్కరించి ఆయన కొరకు న్యాయమును నిరూపించటం.

اِلَیْهِ یُرَدُّ عِلْمُ السَّاعَةِ ؕ— وَمَا تَخْرُجُ مِنْ ثَمَرٰتٍ مِّنْ اَكْمَامِهَا وَمَا تَحْمِلُ مِنْ اُ وَلَا تَضَعُ اِلَّا بِعِلْمِهٖ ؕ— وَیَوْمَ یُنَادِیْهِمْ اَیْنَ شُرَكَآءِیْ ۙ— قَالُوْۤا اٰذَنّٰكَ ۙ— مَا مِنَّا مِنْ شَهِیْدٍ ۟ۚ
అల్లాహ్ ఒక్కడి వైపునకే ప్రళయం యొక్క జ్ఞానము మరలించబడుతుంది. అది ఎప్పుడు వాటిల్లుతుందో ఆయన ఒక్కడికే తెలుసు. ఆయన తప్ప ఇంకెవరికి దాని గురించి తెలియదు. మరియు ఫలాలు వాటిని పరిరక్షించే వాటి గుబురు గలీబు నుంచి బయటకు రావటంగాని,ఏ ఆడదీ గర్భం దాల్చటంగానీ,ప్రసవించటంగాని ఆయన జ్ఞానముతోనే జరుగును. వాటిలో నుంచి ఏదీ ఆయన నుండి తప్పి పోదు. మరియు ఆ రోజు అల్లాహ్ తనతో పాటు విగ్రహాలను ఆరాధించే ముష్రికులను వారి ఆరాధన చేయటముపై మందలిస్తూ ఇలా ప్రకటిస్తాడు : భాగస్వాములు ఉన్నారని మీరు ఆరోపించిన నా భాగస్వాములు ఎక్కడ ?. ముష్రికులు ఇలా సమాధానమిస్తారు : మేము నీ ముందు అంగీకరిస్తాము. నీకు ఎటువంటి భాగస్వామి ఉన్నాడని మాలో నుండి ఎవరూ ఇప్పుడు సాక్ష్యం పలకరు.
Tafsiran larabci:
وَضَلَّ عَنْهُمْ مَّا كَانُوْا یَدْعُوْنَ مِنْ قَبْلُ وَظَنُّوْا مَا لَهُمْ مِّنْ مَّحِیْصٍ ۟
మరియు వారి నుండి వారు వేడుకునే విగ్రహాలు అధృశ్యమైపోతాయి. మరియు అల్లాహ్ శిక్ష నుండి వారికి ఎటువంటి పారిపోయే స్థలముగాని,తప్పించుకునే ప్రదేశముగాని లేదని పూర్తిగా నమ్ముతారు.
Tafsiran larabci:
لَا یَسْـَٔمُ الْاِنْسَانُ مِنْ دُعَآءِ الْخَیْرِ ؗ— وَاِنْ مَّسَّهُ الشَّرُّ فَیَـُٔوْسٌ قَنُوْطٌ ۟
మానవుడు ఆరోగ్యము,సంపద,సంతానము లాంటి అనుగ్రహాలను అర్ధించటం నుండి విసిగిపోడు. మరియు ఒక వేళ అతనికి పేదరికము లేదా అనారోగ్యము అటువంటిదేదైనా సంభవిస్తే అప్పుడు అతడు అల్లాహ్ కారుణ్యము నుండి అధికముగా నిరాశ,నిస్పృహలకు లోనవుతాడు.
Tafsiran larabci:
وَلَىِٕنْ اَذَقْنٰهُ رَحْمَةً مِّنَّا مِنْ بَعْدِ ضَرَّآءَ مَسَّتْهُ لَیَقُوْلَنَّ هٰذَا لِیْ ۙ— وَمَاۤ اَظُنُّ السَّاعَةَ قَآىِٕمَةً ۙ— وَّلَىِٕنْ رُّجِعْتُ اِلٰی رَبِّیْۤ اِنَّ لِیْ عِنْدَهٗ لَلْحُسْنٰی ۚ— فَلَنُنَبِّئَنَّ الَّذِیْنَ كَفَرُوْا بِمَا عَمِلُوْا ؗ— وَلَنُذِیْقَنَّهُمْ مِّنْ عَذَابٍ غَلِیْظٍ ۟
మరియు ఒక వేళ మేము అతనికి మా వద్ద నుండి ఆరోగ్యమును,ఐశ్వర్యమును,అతనికి కలిగిన ఆపద,అనారోగ్యము తరువాత ఉపశమనము యొక్క రుచి చూపిస్తే అతడు తప్పకుండా ఇలా పలుకుతాడు : ఇది నాది. ఎందుకంటే నేను దానికి యోగ్యుడిని. ప్రళయం స్థాపితమవుతుందని నేను భావించటం లేదు. మరియు ఒక వేళ అది సంభవించినదే అనుకోండి నిశ్చయంగా అల్లాహ్ వద్ద ఉన్న ఐశ్వర్యం,సంపద నాదే అవుతుంది. ఏ విధంగానైతే ఇహలోకంలో వాటికి నేను హక్కుదారుడిని కావటం వలన ఆయన నాపై అనుగ్రహించాడో పరలోకములో కూడా నాపై అనుగ్రహిస్తాడు. అప్పుడు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారికి వారు చేసుకున్న అవిశ్వాసము,పాపకార్యముల గురించి తప్పకుండా మేము సమాచారమిస్తాము. మరియు వారికి మేము తప్పకుండా అత్యంత తీవ్రమైన శిక్ష రుచి చూపిస్తాము.
Tafsiran larabci:
وَاِذَاۤ اَنْعَمْنَا عَلَی الْاِنْسَانِ اَعْرَضَ وَنَاٰ بِجَانِبِهٖ ۚ— وَاِذَا مَسَّهُ الشَّرُّ فَذُوْ دُعَآءٍ عَرِیْضٍ ۟
మరియు మేము మానవునికి ఆరోగ్యము,ఉపశమనము,వాటిలాంటి ఇతర వాటిని అనుగ్రహించినప్పుడు అతడు అల్లాహ్ స్మరణ నుండి,ఆయనపై విధేయత చూపటం నుండి అశ్రద్ధ చూపుతాడు. మరియు తన తరపు నుండి అహంకారమును ప్రదర్శిస్తాడు. మరియు అతనికి అనారోగ్యము,పేదరికము,వాటిలాంటి వేరేవి ముట్టుకున్నప్పుడు అతడు అల్లాహ్ ను అధికంగా దుఆ చేసేవాడు అయిపోతాడు. తనకు ముట్టకున్న దాన్ని తన నుండి తొలగించమని ఫిర్యాదు చేస్తాడు. అతడు తన ప్రభువును తనపై అనుగ్రహించినప్పుడు కృతజ్ఞత తెలుపుకోడు మరియు ఆయన అతడిని ఆపదకు గురిచేసినప్పుడు తన ఆపదపై సహనం చూపడు.
Tafsiran larabci:
قُلْ اَرَءَیْتُمْ اِنْ كَانَ مِنْ عِنْدِ اللّٰهِ ثُمَّ كَفَرْتُمْ بِهٖ مَنْ اَضَلُّ مِمَّنْ هُوَ فِیْ شِقَاقٍ بَعِیْدٍ ۟
ఓ ప్రవక్తా మీరు ఈ తిరస్కారులైన ముష్రికులందరితో ఇలా పలకండి : మీరు నాకు తెలియపరచండి ఒక వేళ ఈ ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి అయి ఉండి, ఆ తరువాత మీరు దాన్ని విశ్వసించకుండా తిరస్కరించి ఉంటే తొందరలోనే మీ పరిస్థితి ఏమవుతుంది ?. సత్యము బహిర్గతమై,దాని వాదన మరియు వాదన యొక్క బలము స్పష్టమైనా కూడా దాని విషయంలో వ్యతిరేకించే వాడికన్న పెద్ద మార్గభ్రష్టుడెవడుంటాడు ?.
Tafsiran larabci:
سَنُرِیْهِمْ اٰیٰتِنَا فِی الْاٰفَاقِ وَفِیْۤ اَنْفُسِهِمْ حَتّٰی یَتَبَیَّنَ لَهُمْ اَنَّهُ الْحَقُّ ؕ— اَوَلَمْ یَكْفِ بِرَبِّكَ اَنَّهٗ عَلٰی كُلِّ شَیْءٍ شَهِیْدٌ ۟
మేము తొందరలోనే భూమండలంలో ముస్లిముల కొరకు అల్లాహ్ విజయం కలిగించిన వాటిలో నుండి మా సూచనలను ఖురేష్ అవిశ్వాసపరులకు చూపిస్తాము. మరియు వారిలోనే మక్కా విజయము ద్వారా మా సూచనలను చూపిస్తాము. చివరికి వారికి సందేహమును తొలగించే వాటి ద్వారా ఈ ఖుర్ఆన్ యే సత్యమని,అందులో ఎటువంటి సందేహము లేదని స్పష్టమవుతుంది. ఏమీ ఈ ముష్రికులందరికి ఖుర్ఆన్ అది అల్లాహ్ వద్ద నుండి అన్న అల్లాహ్ సాక్ష్యము ద్వారా సత్యమవటం చాలదా ?. సాక్ష్యం పరంగా అల్లాహ్ కన్న గొప్పవాడెవడుంటాడు ?. ఒక వేళ వారు సత్యమును కోరుకుంటే తమ ప్రభువు సాక్ష్యముతో సరిపెట్టుకునేవారు.
Tafsiran larabci:
اَلَاۤ اِنَّهُمْ فِیْ مِرْیَةٍ مِّنْ لِّقَآءِ رَبِّهِمْ ؕ— اَلَاۤ اِنَّهٗ بِكُلِّ شَیْءٍ مُّحِیْطٌ ۟۠
వినండి నిశ్చయంగా ముష్రికులు మరణాంతరం లేపబడటము విషయంలో తమ తిరస్కారము వలన ప్రళయదినమున తమ ప్రభువును కలవటం నుండి సందేహములోపడి ఉన్నారు. కావున వారు పరలోకమును విశ్వసించటం లేదు.అందుకనే వారు దాని కొరకు సత్కర్మ ద్వారా సిద్ధం కావటం లేదు. వినండి నిశ్చయంగా అల్లాహ్ ప్రతీ వస్తువును జ్ఞానపరంగా సామర్ధ్యం పరంగా చుట్టుముట్టి ఉన్నాడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• علم الساعة عند الله وحده.
ప్రళయం యొక్క జ్ఞానము అల్లాహ్ ఒక్కడి వద్ద ఉన్నది.

• تعامل الكافر مع نعم الله ونقمه فيه تخبط واضطراب.
అల్లాహ్ అనుగ్రహాల పట్ల మరియు ఆయన శిక్షల పట్ల అవిశ్వాసపరుని వ్యవహారము మరియు అందులో మూర్ఖత్వము,మనశ్శాంతి లేకపోవటము జరుగును.

• إحاطة الله بكل شيء علمًا وقدرة.
అల్లాహ్ ప్రతీ వస్తువును జ్ఞానపరంగా మరియు సామర్ధ్యం పరంగా చుట్టుముట్టి యుండటం.

 
Fassarar Ma'anoni Sura: Suratu Fussilat
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa